శబరిమల: వర్చువల్‌ బుకింగ్స్‌ ఫుల్‌.. ఇక స్పాట్‌ బుకింగ్సే! | Sabarimala Virtual Queue Bookings Full Spot Booking Hope for Devotees | Sakshi
Sakshi News home page

శబరిమల: వర్చువల్‌ బుకింగ్స్‌ ఫుల్‌.. ఇక స్పాట్‌ బుకింగ్సే!

Nov 19 2026 10:33 AM | Updated on Nov 19 2026 10:33 AM

Sabarimala Virtual Queue Bookings Full Spot Booking Hope for Devotees

శబరిమల: శబరిమలలో మండల దీక్ష సీజన్‌ నేపథ్యంలో అయ్యప్ప దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. వర్చువల్‌ క్యూ బుకింగ్స్‌ దాదాపుగా పూర్తయ్యాయి. నవంబర్‌ 19వ తేదీకి మాత్రమే స్లాట్లు అందుబాటులో ఉండగా.. నవంబర్‌ 20 నుంచి డిసెంబర్‌ 25 వరకు, డిసెంబర్‌ 31న దర్శనానికి ఆన్‌లైన్‌ బుకింగ్‌ స్లాట్లు ఖాళీ లేవు. ముందుగా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకోని యాత్రికులు దర్శనం కోసం స్పాట్‌ బుకింగ్‌పైననే ఆధారపడాల్సి ఉంటుంది.

అయ్యప్ప స్వామి స్పష్టంగా కనిపించేలా..
భక్తుల రాకపోకలు సజావుగా సాగేందుకు పోలీసులు వర్చువల్‌ క్యూ సమయ తనిఖీలను మరింత కఠినతరం చేశారు. దర్శన సమయంలో భక్తులకు అయ్యప్ప స్వామి విగ్రహం స్పష్టంగా కనిపించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీకోవిల్‌లో దీపాలు స్పష్టంగా కనిపించేందుకు మందపాటి వత్తులు ఉపయోగించాలని సూచనలు జారీ చేశారు. వర్చువల్‌ క్యూ ద్వారా బుక్‌ చేసుకున్న భక్తుల్లో వాస్తవంగా ఎంతమంది దర్శనానికి వస్తున్నారనే దానిపై స్పాట్‌ బుకింగ్‌ స్లాట్ల పెంపు ఆధారపడి ఉంటుందని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్‌ వెల్లడించారు.

నీలక్కల్‌, పంపా వద్ద ఏర్పాటు చేసిన ఏఐ కెమెరా వ్యవస్థలు, వివిధ శాఖల మధ్య మెరుగైన సమన్వయం వల్లే యాత్రికుల రాకపోకలు సజావుగా సాగుతున్నాయని తెలిపారు. భారీ జనసందోహానికి అలవాటుపడిన ప్రజలకు ప్రస్తుత రద్దీ తక్కువగా కనిపించడం ఆశ్చర్యంగా అనిపించవచ్చని, అయితే ఏర్పాట్లు సమర్థంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. మలయాళ వృశ్చిక మాసం రెండో రోజున కూడా శబరిమల సన్నిధానంలో భక్తుల దర్శనాలు సజావుగా కొనసాగాయి.

ఇదీ చదవండి: రామాయణ వివాదం.. జావేద్ అక్తర్ ‘రామ్‌పాల్‌’ అవుతారా?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement