Bihar: పెళ్లింట విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి! | Araria Scorpio Accident 6 dead | Sakshi
Sakshi News home page

Bihar: పెళ్లింట విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి!

Nov 19 2026 8:50 AM | Updated on Nov 19 2026 8:50 AM

Araria Scorpio Accident 6 dead

అరారియా: బిహార్‌లోని అరారియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న స్కార్పియో అదుపుతప్పి వంతెనపై నుంచి లోతైన ​కాలువలో పడిపోవడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం అర్ధరాత్రి బైరగాఛి-సిక్టీ ప్రధాన రహదారిపై బీడీ వంతెన సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. సుపౌల్ జిల్లా పిప్రా ప్రాంతంలోని థుమ్హా గ్రామానికి చెందిన ఏడుగురు స్కార్పియోలో సిక్టీ ప్రాంతంలోని భప్టియా గ్రామంలో జరిగిన పెళ్లి వేడుకకు హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన అనంతరం తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో బీడీ వంతెన వద్ద ఉన్న ప్రమాదకరమైన మలుపు దగ్గర వాహనం అదుపుతప్పి నీటిలో పడిపోయింది.

ఘటన జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, గ్రామస్థులు కలిసి సహాయక చర్యలు చేపట్టారు. వాహనాన్ని బయటకు తీసి అందులోని వారిని అరారియా సదర్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆరుగురు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో వ్యక్తికి చికిత్స కొనసాగుతోంది. మృతులను యశ్ కుమార్ (15), ఆదిత్య ఆనంద్ (18), ఆర్యన్ (15), కుందన్ కుమార్ (26), సౌరభ్ (16), మున్నా కుమార్ (14)గా గుర్తించారు. వీరంతా ఒకే గ్రామానికి చెందినవారు. ప్రమాద వార్తతో థుమ్హా గ్రామంలో విషాదం నెలకొంది. అతివేగం, ప్రమాదకరమైన మలుపు కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నది. 

ఇదీ చదవండి: కాలాపానీ జైళ్లలో... ఖైదీలకు ఊహించని కానుక!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement