ప్రధాని మోదీతో ప్రిన్స్‌ విలియమ్‌ దంపతుల భేటీ | Prince William, Kate Middleton meet PM Narendra Modi in Delhi | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీతో ప్రిన్స్‌ విలియమ్‌ దంపతుల భేటీ

Nov 19 2026 6:22 AM | Updated on Nov 19 2026 6:22 AM

Prince William, Kate Middleton meet PM Narendra Modi in Delhi

భారత్‌–యూకే సంబంధాల బలోపేతంపై చర్చ 

న్యూఢిల్లీ: బ్రిటన్‌ యువరాజు విలియమ్, కేథరీన్‌ దంపతులు బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమ య్యారు. రక్షణ, ఆరోగ్యం తదితర రంగాల్లో సహకారంతోపాటు భారత్‌–యూకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై వారు అభిప్రాయా లను పంచుకున్నారు. ప్రధా నమంత్రి కార్యాలయం(పీఎంఓ) విడుద ల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. భారత్‌– యూకే ద్వైపా క్షిక సంబంధాల్లో పురోగతి ని ప్రిన్స్‌ విలియ మ్‌ దంపతులతో భేటీ సందర్భంగా మోదీ స్వాగతించారు. 

జూలైలో ఇండియా–యూకే సమగ్ర ఆర్థిక ఒప్పందం అమల్లోకి రావడంతో ఈ సంబంధాలు మరింత బలపడ్డాయని పేర్కొన్నారు. ఇండియా–యూకే విజన్‌– 2035 గురించి ప్రస్తావించారు. తీవ్రమైన పర్యావరణ సవాళ్లకు వినూత్న పరిష్కారా లను ప్రోత్సహించడంలో ‘ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌’ చేస్తున్న కృషిని మోదీ ప్రశంసించారు. మంగళవారం ముంబైలో జరిగిన ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌ అవార్డుల ప్రదానోత్సవంతో సహా ప్రపంచ పర్యావరణ సవాళ్లను పరిష్కరించడంలో భారతీయ ఆవిష్కర్తల కు, వారి కృషికి ఈ పురస్కారం గుర్తింపునివ్వడాన్ని ఆయన అభినందించారు.   

బ్రిటీష్‌ యువరాజు, యువరాణిని కలవ డం చాలా ఆనందంగా ఉందని మోదీ ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. వారి ఆధ్వర్యంలో ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌ సంస్థ చేస్తున్న ప్రయ త్నాలను అభినందిస్తున్నానని పేర్కొన్నా రు. మన దేశాల ప్రజల, అలాగే విస్తృత ప్రపంచ ప్రజల ఉమ్మడి శ్రేయస్సు కోసం, భారత్‌–యూకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఎదురు చూస్తున్నామని తెలి పారు. ఇటీవల అమల్లోకి వచ్చిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం ద్వారా సాధించిన ఊపును కొనసాగిస్తామన్నారు. భారత్‌–యూకే సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై అభిప్రాయాలను పంచుకోవడానికి ఈ సమావేశం ఒక అవకాశాన్ని కల్పించిందని ఉద్ఘాటించారు. బ్రిటన్‌ రాజు చార్లెస్‌–3కి, యూకే ప్రధానమంత్రి ఆండీ బర్న్‌హామ్‌కు మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement