ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రిటైల్ స్ట్రీట్‌లలో 24వ ర్యాంకు
చ.అ.కు నెల అద్దె రూ. 1,875
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రిటైల్ ప్రాంతాల్లో ఒకటిగా ఢిల్లీలోని ఖాన్ మార్కెట్ కొనసాగుతోంది. 2026కి గాను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ రూపొందించిన జాబితాలో 24వ ర్యాంకును నిలబెట్టుకుంది. ఈ రిపోర్టు ప్రకారం ఖాన్ మార్కెట్లో చ.అ. వార్షిక అద్దె 238 డాలర్లుగా (నెలకు చ.అ.కు రూ. 1,875) ఉంది. రిటైల్ స్పేస్‌కి భారీగా డిమాండ్ నెలకొనడంతో ఇక్కడ అద్దెలు వార్షికంగా 14 శాతం పెరిగాయి. భారత్‌లో కూడా ఇదే అత్యంత ఖరీదైన మార్కెట్‌గా ఉంది.
దేశీయంగా పటిష్టమైన ఫండమెంటల్స్, వినియోగం, రిటైలర్ల కార్యకలాపాల విస్తరణ, ప్రీమియమైజేషన్‌కి పెరుగుతున్న ప్రాధాన్యత తదితర అంశాలు రిటైల్ మార్కెట్‌కి దన్నుగా నిలుస్తున్నాయని కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ రిటైల్ హెడ్ (ఇండియా) మిలిన్ రోహినేష్ తెలిపారు.కు‹Ùమన్ అండ్ వేక్‌ఫీల్డ్ రూపొందించిన మెయిన్ స్ట్రీట్స్ ఎక్రాస్ ది వరల్డ్ 2026 నివేదికలో ప్రపంచవ్యాప్తంగా 147 ఖరీదైన రిటైల్ ప్రాంతాల వివరాలను పొందుపర్చారు. న్యూయార్క్ నిటీలోని అప్పర్ ఫిఫ్త్ ఎవెన్యూ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రిటైల్ స్ట్రీట్‌గా నిల్చింది.


