Delhi: కూలిన మరో భవనం.. ఇద్దరు మృతి! | House Collapses in Delhi | Sakshi
Sakshi News home page

Delhi: కూలిన మరో భవనం.. ఇద్దరు మృతి!

Nov 17 2026 1:58 PM | Updated on Nov 17 2026 2:00 PM

House Collapses in Delhi

న్యూఢిల్లీ: ఢిల్లీలో మరో భవనం కుప్పకూలింది. మంగళవారం ఉదయం షహదరా ప్రాంతంలో ఓ ఇల్లు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మొదటి అంతస్తు ఉన్న ఈ భవనం ఉదయం కూలిపోయినట్లు అసిస్టెంట్ డివిజనల్ ఆఫీసర్ దీపక్ హుడా తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టాయి. స్థానికులు సైతం సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
 

కాగా, సోమవారం పహర్‌గంజ్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలి సుమారు ఎనిమిది మంది కార్మికులు గాయపడ్డారు. అంతకుముందు వారం ఓల్డ్ ఢిల్లీలోని చావ్రీ బజార్‌లో భవనం కూలిన ఘటనలో ఏడుగురు మరణించారు. చావ్రీ బజార్ ప్రమాదంపై ప్రాథమిక నివేదిక ప్రకారం.. రెండో అంతస్తులో పైకప్పు నిర్మాణ పనులు జరుగుతుండగా భవనంలోని కొంత భాగం కూలిపోయింది. భవనానికి మద్దతుగా ఉన్న పిల్లర్లు తడిగా ఉండటంతో పాటు నిర్మాణం ఒకవైపు ఒరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇక సెప్టెంబర్‌లో ఢిల్లీలోని సత్య నికేతన్‌లో పేయింగ్ గెస్ట్ వసతిగా ఉపయోగిస్తున్న ఆరు అంతస్తుల భవనం కూలి ఐదుగురు విద్యార్థులు సహా ఏడుగురు మరణించారు. 

ఇదీ చదవండి: పక్షులను హింసిస్తున్న వీడియోలు.. ‘పెటా’ ఫిర్యాదుతో కేసు నమోదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement