పక్షులను హింసిస్తున్న వీడియోలు.. ‘పెటా’ ఫిర్యాదుతో కేసు నమోదు! | Videos of birds being killed Case registered on complaint of PETA | Sakshi
Sakshi News home page

పక్షులను హింసిస్తున్న వీడియోలు.. ‘పెటా’ ఫిర్యాదుతో కేసు నమోదు!

Nov 17 2026 1:03 PM | Updated on Nov 17 2026 1:12 PM

Videos of birds being killed Case registered on complaint of PETA

నిర్మల్: తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో వన్యప్రాణుల వేట వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ‘shikarii_boys_’, ‘shikari.4466’ పేర్లతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో అడవి పక్షులను వేటాడి, వాటిని చంపుతున్న వీడియోలు పోస్టు చేయడంపై ‘పెటా’ ఇండియా అటవీ శాఖకు ఫిర్యాదు చేసింది. దీంతో నవంబర్ 10న అధికారులు కొత్త బొప్పారం గ్రామంలోని షేక్ అఫ్రోజ్ ఇంటిపై దాడి చేసి గులేరు, ఉచ్చు, మొబైల్ ఫోన్, మోటార్‌ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

గ్రే-హెడెడ్ స్వాంప్‌హెన్లు, వైట్-బ్రెస్టెడ్ వాటర్‌హెన్లు, బ్రౌన్ క్రేక్‌లు, గ్రే ఫ్రాంకోలిన్‌లను ఉచ్చులతో పట్టుకోవడం, గులేర్లతో కొట్టడం, వేటాడిన పక్షులను కెమెరా ముందు ప్రదర్శించడం వంటి దృశ్యాలు వీడియోల్లో ఉన్నాయని పెటాలో తెలిపింది. పక్షులతో పాటు వేట పరికరాలను విక్రయించేందుకు కూడా ప్రకటనలు చేసినట్లు ఆరోపించింది.

ఈ ఘటనపై తెలంగాణ అటవీ చట్టం-1967లోని సెక్షన్ 44, వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972లోని సెక్షన్లు 9, 57, 39, 44, 51 కింద ప్రాథమిక నేర నివేదిక (POR) నమోదైంది. షెడ్యూల్-II రక్షిత జాతులపై నేరాలకు గరిష్ఠంగా మూడేళ్ల జైలు లేదా రూ.లక్ష జరిమానా లేదా రెండూ విధించవచ్చు.

అటవీ అధికారుల తక్షణ చర్యలను పెటా ప్రతినిధి వంశీకృష్ణ అభినందించారు. జంతువులపై క్రూరత్వానికి పాల్పడేవారికి మానసిక ఆరోగ్య పరీక్షలు, కౌన్సెలింగ్ నిర్వహించాలని పెటా సంస్థ సూచించింది. జంతు హింసకు పాల్పడేవారు ఇతర నేరాలకు పాల్పడే అవకాశం మూడు రెట్లు ఎక్కువని అంతర్జాతీయ అధ్యయనాన్ని ప్రస్తావించింది. ఈ వివరాలను పెటా ఇండియా ప్రతినిధులు, సకారియా, శృతి ఒక ప్రకటనలో తెలిపారు. 

ఇదీ చదవండి: శబరిమల: అటవీ మార్గం ప్రారంభం.. భక్తులకు హెచ్చరికలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement