మాకు ఆధార్‌ కార్డులు ఇప్పించండి మేడమ్‌! | Public Grievance Redressal programme held in the conference hall at the Collectorate | Sakshi
Sakshi News home page

మాకు ఆధార్‌ కార్డులు ఇప్పించండి మేడమ్‌!

Nov 17 2026 11:05 AM | Updated on Nov 17 2026 11:05 AM

Public Grievance Redressal programme held in the conference hall at the Collectorate

హన్మకొండ అర్బన్‌: హనుమకొండ కలెక్టరేట్‌లో మహిళా, శిశు, పిల్లల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం బాలల గ్రీవెన్స్‌ సెల్‌ నిర్వహించారు. హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ హాజరై వివిధ పాఠశాలల విద్యార్థుల నుంచి వినతులు స్వీకరించారు. బాలల ప్రజావాణికి మొత్తం 51 వినతులు అందాయి. పాఠశాల భవనాల మరమ్మతులు, అల్పాహారం సమస్యలు, పాఠశాలల సమీపంలోన్‌షాపులు, మద్యం దుకాణాల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు, పాఠశాల సమయాలు, ఉపాధ్యాయుల కొరత తదితర సమస్యలను విద్యార్థులు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు.

ఈఫొటోలో కలెక్టర్‌తో మాట్లాడుతున్నది కాజీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు. తమ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరిందని, పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయని, భవనం ఎప్పుడు కూలుతుందో తెలియక భయంతో పాఠాలు వింటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.  దీనిపై స్పందించిన కలెక్టర్‌ తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛంద సంస్థల ద్వారా సమకూరిన ఆర్‌ఓ ప్లాంట్‌కు మరమ్మతులు చేయించాలని డీఈఓకు సూచించారు.

ఈ ఫొటోల్లో కనిపిస్తున్నది హనుమకొండలోని మర్కజీ పాఠశాలకు చెందిన 7 నుంచి 10వ తరగతి విద్యార్థులు. పాఠశాల పరిసరాల్లో మద్యం దుకాణాలు ఉన్నాయని, పాఠశాలకు వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు మద్యం, సిగరెట్లు తాగుతూ గుమిగూడి ఉంటున్నారని, భయమవుతోందని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాలలో 13 సెక్షన్లు ఉండగా.. ఒక్క హిందీ ఉపాధ్యాయుడే ఉన్నారని, అదనపు ఉపాధ్యాయుడిని నియమించాలని కోరారు.

ఈ ఫొటోలోని చిన్నారులు కాజీపేట మండలం మడికొండలోని ఎంఎన్‌నగర్‌కు చెందినవారు. సుమారు 34 మంది డాన్‌ బాస్కో స్వచ్ఛంద సంస్థ ద్వారా చదువుకొనసాగిస్తున్నారు. వీరికి ఇప్పటివరకు జనన ధ్రువీకరణ పత్రాలు లేవు. ఆధార్‌ కార్డులు లేవు. దీంతో తమను స్కూళ్లలో చేర్చుకోవట్లేదని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్‌ స్పందిస్తూ విద్యార్థులెవరూ చదువు ఆపొద్దని, ఆధార్‌ కార్డుల జారీకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement