కలెక్టర్‌కు ఎలాంటి సందేశం పంపలేదు | TVK MLA Fire On Opposition Parties | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌కు ఎలాంటి సందేశం పంపలేదు

Nov 11 2026 8:27 AM | Updated on Nov 11 2026 8:27 AM

TVK MLA Fire On Opposition Parties

సాక్షి, చెన్నై : కళ్లకురిచ్చి జిల్లా కలెక్టర్‌కు అభ్యంతరకరమైన టెక్ట్స్‌ మెసేజ్‌ పంపారంటూ సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలపై టీవీకే కళ్లకురిచ్చి  ఎమ్మెల్యే అరుల్‌ విఘ్నేష్‌ తీవ్రంగా స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వంతో పాటు తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రతిపక్ష పార్టీల నాయకులు తీవ్ర ద్వేషంతో సోషల్‌ మీడియాలో  అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ నాయకుడు, సీఎం  విజయ్‌ చెప్పినట్లుగా ఇలాంటి నిరాధారమైన నిందలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. 

తనకు ప్రభుత్వ అధికారుల పై ఎంతో మర్యాద ఉందని స్పష్టం చేశారు. కొత్త బస్‌ స్టాండ్‌ నిర్మాణంలో జరిగిన అనేక అవినీతి అక్రమాలపై ఇప్పటికే తాను సీఎం  విజయ్‌కు నివేదించినట్లు తెలిపారు. కాగా జిల్లా కలెక్టర్‌కు ఏవైనా అభ్యంతరకర సందేశాలు పంపారా అని విలేకరులు ప్రశ్నించగా ‘సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతున్నట్లు తాను  ఎలాంటి సందేశాలు పంపలేదన్నారు.. కేవలం నియోజకవర్గ ప్రజలు తనకు సమర్పించిన వినతిపత్రాలు, వారి సమస్యలకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాననని వివరణ ఇచ్చారు. 

 తనపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తూ అపకీర్తి పాలు చేస్తున్న వారిపై ఇప్పటికే పోలీస్‌ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కాగా, కల్టెక్టర్‌ అసభ్యకర మెసేజ్‌ పంపిణీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామి తదితర నేతలు డిమాండ్‌ చేశారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement