తమిళనాడులో కలకలం.. టీవీకే ఎమ్మెల్యే దాడి? | Man claims TVK MLA Ravi Shankar was thrashed video viral | Sakshi
Sakshi News home page

తమిళనాడులో కలకలం.. టీవీకే ఎమ్మెల్యే దాడి?

Nov 9 2026 9:04 AM | Updated on Nov 9 2026 9:04 AM

Man claims TVK MLA Ravi Shankar was thrashed video viral

చెన్నై: తాగునీటి సమస్యలు పరిష్కరించాలని కోరిన ఓ వ్యక్తికి ప్రజాప్రతినిధి నుంచి చేదు అనుభవం ఎదురైందన్న ఆరోపణలు తమిళనాడులో చర్చనీయాంశంగా మారాయి. తమ ప్రాంతంలో వారం రోజులుగా తాగునీరు రావడం లేదని, వీధుల్లో చెత్త పేరుకుపోతోందని ఫిర్యాదు చేసిన వ్యక్తిపై తమిళనాడు డిప్యూటీ స్పీకర్‌, టీవీకే ఎమ్మెల్యే రవిశంకర్‌ దాడి చేశారంటూ ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బాధితుడిని కాలితో తన్ని, అక్కడి నుంచి తరిమేశారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

వివరాల మేరకు.. తిరుచిరాపల్లి జిల్లాకు చెందిన కార్తీక్‌ కుమార్‌ అనే వ్యక్తి ఈ ఆరోపణలు చేశారు. తురైయూర్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే రవిశంకర్‌ను తన ప్రాంతంలోని సమస్యల గురించి పలుమార్లు సంప్రదించేందుకు ప్రయత్నించినా స్పందన రాలేదని తెలిపారు. వారం రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయిందని, మున్సిపాలిటీకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చెత్త తొలగించడం లేదని వాపోయారు.

ఈ క్రమంలో దీపావళి రోజున (ఆదివారం) వ్యక్తిగత పనిమీద మనచ్చనల్లూరు ప్రాంతానికి వెళ్లిన కార్తీక్‌ కుమార్‌కు అక్కడ నివసించే ఎమ్మెల్యే రవిశంకర్‌ ఎదురయ్యారు. ఈ సందర్భంగా తన ప్రాంతంలోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా వివాదం జరిగినట్లు బాధితుడు ఆరోపించారు. తాను ముఖ్యమంత్రి విజయ్‌కు ఓటు వేసినప్పటికీ ఎమ్మెల్యే తనతో దురుసుగా ప్రవర్తించి, అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడి చేశారని పేర్కొన్నారు.

సోషల్‌ మీడియాలో వైరల్‌గా వీడియో..
ఈ ఘటనకు సంబంధించినదిగా చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఓ వ్యక్తిని మరో వ్యక్తి కాలితో తన్నుతూ తరిమేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే వీడియో చీకటిగా ఉండటంతో ఇద్దరి ముఖాలు స్పష్టంగా కనిపించడం లేదు. కాగా, ఈ ఘటన అనంతరం కార్తీక్‌ కుమార్‌ మనచ్చనల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. మరోవైపు, ఈ ఘటనపై ఎమ్మెల్యే రవిశంకర్‌ స్పందన, అధికారిక విచారణ వివరాలు వెలువడాల్సి ఉంది. ప్రజా సమస్యలపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వ్యక్తిపై దాడి జరిగిందన్న ఆరోపణలు తమిళనాడులో రాజకీయ చర్చకు దారితీశాయి.

ఇదీ చదవండి: మోదీకి సీఎం విజయ్‌ రాసిన లేఖపై డీకే శివకుమార్‌ ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement