రామేశ్వరం టూ అయోధ్య.. | Noida Man Cycles 2,500 km From Rameswaram To Ayodhya in 16 Days | Sakshi
Sakshi News home page

రామేశ్వరం టూ అయోధ్య..

Nov 8 2026 5:00 AM | Updated on Nov 8 2026 5:00 AM

Noida Man Cycles 2,500 km From Rameswaram To Ayodhya in 16 Days

సైకిల్‌పై 1,500 కిలోమీటర్ల ప్రయాణం

శ్రీరాముడి స్ఫూర్తితోనే అంటున్న నోయిడా వాసి

అయోధ్య: యూపీలోని నోయిడాకు చెందిన ఓ వ్యక్తి తమిళనాడులోని రామేశ్వరం నుంచి యూపీలోని అయోధ్యకు 1,500 కిలోమీటర్ల దూరం సైకిల్‌పై ప్రయాణం చేశారు. మొత్తం ఏడు రాష్ట్రాల మీదుగా కొనసాగిన తన ప్రయాణానికి 16 రోజులు పట్టిందని చెప్పారు. రామాయణంలో రాక్షస రాజు రావణుడిని సంహరించిన తర్వాత శ్రీరాముడు రామేశ్వరం నుంచి అయోధ్య చేసిన ప్రయాణాన్ని స్ఫూర్తిగా తీసుకుని మూడేళ్లుగా ఈ ప్రయాణాన్ని చేపడుతుననట్లు సార్థక్‌ చౌహాన్‌(36) చెప్పారు. 

శనివారం ఆయన అయోధ్యలో పీటీఐతో మాట్లాడుతూ..దేశంలోని విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలను స్వయంగా తెలుసుకునేందుకు ఇదో అద్భుతమైన మార్గమన్నారు. ‘రావణుడిని సంహరించిన అనంతరం శ్రీరాముడు దసరా రోజున రామేశ్వరంలో పూజలు చేసి, అయోథ్యకు తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆయన సరిగ్గా దీపోత్సవం, దీపావళి రోజున చేరుకున్నారు. నేను కూడా అదేవిధంగా, గత మూడేళ్లుగా దసరా రోజున రామేశ్వరం ఆలయంలో పూజలు చేసి, యాత్ర మొదలుపెడుతున్నాను. దీపోత్సవ్‌ రోజుకల్లా అయోధ్యకు చేరుతున్నాను.

 గత రెండు ప్రయాణాల్లో నాతోపాటు సైకిల్‌ బృందం ఉంది. ఈ దఫా నేనొక్కడినే ఈ యాత్ర మొదలుపెట్టి, విజయవంతంగా పూర్తి చేసుకున్నా’అని సార్థక్‌ తెలిపారు. ‘వచ్చే ఏడాది, సుమారు 50 మంది సైక్లిస్టులతో యాత్రను రామేశ్వరం నుంచి ప్రారంభిస్తా. తామూ పాల్గొంటామంటూ కెనడా, ఇంగ్లంగ్‌లకు చెందిన వారు సైతం ముందుకు వచ్చారు’అని సార్థక్‌ వివరించారు. దేశవ్యాప్తంగా శాంతి భద్రతల పరిస్థితి బాగా మెరుగుపడిందని, ఎవరైనా, ఎప్పుడైనా ఒంటరిగా యాత్ర మొదలుపెట్టవచ్చని ఆయన తెలిపారు. ‘అయోధ్యలో దీపోత్సవమే అసలైన దీపోత్సవం. అయోధ్యకు మాత్రమే కాదు, ఇది దేశానికే పండుగ’అని సార్థక్‌ చెప్పుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement