breaking news
Sarthak
-
వావ్ ‘సార్థక్’.. నాడు సీబీఎస్ఈ.. నేడు టెండర్ల స్కామ్!
రాంచీ: జార్ఖండ్‌లోని రాంచీకి చెందిన 17 ఏళ్ల టెక్నాలజీ పరిశోధకుడు, సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థి సార్థక్ సిద్ధాంత్ మరో సరికొత్త సంచలనానికి తెరలేపారు. ఇటీవలే సీబీఎస్ఈ వెబ్‌సైట్‌లోని లోపాలను ఎండగట్టిన ఈ కుర్రాడు ఇప్పుడు భారత ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ (సీపీపీ) పోర్టల్ నుండి దాదాపు 1.66 కోట్ల ప్రభుత్వ కొనుగోలు రికార్డులను సేకరించి, వాటిని ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతూ, ఒక బహిరంగ డేటా పోర్టల్‌ను ప్రారంభించాడు. పారదర్శకత అనేది ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతోనే తాను ఈ సాహసోపేతమైన అడుగు వేసినట్లు సార్థక్ ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది.మార్కుల పోరాటం.. స్కామ్ గుట్టురట్టుసార్థక్ సిద్ధాంత్ ఇటీవల సీబీఎస్ఈ క్లాస్ 12 పరీక్షలు రాశారు. అయితే ఆశించిన దానికంటే తక్కువ మార్కులు రావడంతో, రీవాల్యుయేషన్ కోసం తన స్కాన్ చేసిన జవాబు పత్రాల కాపీలను కోరారు. ఈ ప్రక్రియను లోతుగా పరిశీలిస్తున్న సమయంలో, పరీక్షల మూల్యాంకనానికి ఉపయోగించే ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) విధానంలో, దానికి అనుబంధంగా ఉన్న ‘కోఎమ్ట్’ అనే సంస్థ టెండర్ ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగినట్లు ఆయన గుర్తించారు. గత రెండు వారాలుగా రేయింబవళ్లు శ్రమించి సేకరించిన ఈ కీలక డేటాను sarthaksiddhant.com అనే వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఈ రికార్డులను పౌరులు, జర్నలిస్టులు, పరిశోధకులు ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని విశ్లేషించవచ్చని సార్థక్ పిలుపునిచ్చారు.రంగంలోకి రాహుల్ గాంధీఈ వ్యవహారం రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపుతోంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ జూన్ 2వ తేదీన సార్థక్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన 8 నిమిషాల 15 సెకన్ల వీడియోను జూన్ 7న ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పంచుకున్నారు. సీబీఎస్ఈ, కోఎమ్ట్ సంస్థల మధ్య ఉన్న రహస్య ఒప్పందాన్ని ఈ యువకుడు బట్టబయలు చేశాడని రాహుల్ ప్రశంసించారు. నేటి యువత కేవలం రీల్స్ చేస్తూ, పకోడీలు వేపుకుంటూ కూర్చోవాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటోందని, కానీ ప్రశ్నించే తత్వమున్న ఈ యువత స్వయంగా నిజాలను వెలికితీసిందని రాహుల్ గాంధీ విమర్శించారు.వివాదాస్పద 'కోఎమ్ట్' నేపథ్యంఈ వివాదంలో చిక్కుకున్న కోఎమ్ట్ ఎడ్యుటెక్ సంస్థకు తెలంగాణతో సంబంధం ఉంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ తెలంగాణ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో బోర్డు పరీక్షల డిజిటల్ మూల్యాంకన పనులను నిర్వహిస్తోంది. గతంలో 2019లో ఈ సంస్థ ‘గ్లోబరీనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో ఉండేది. ఆ ఏడాది తెలంగాణ ఇంటర్ బోర్డు పరీక్షల డేటా ప్రాసెసింగ్‌లో జరిగిన లోపాల వల్ల పరీక్ష రాసిన 9.74 లక్షల మంది విద్యార్థుల్లో ఏకంగా 3 లక్షల మందికి పైగా ఫెయిల్ అయ్యారు. అప్పట్లో ఈ సంస్థపై తీవ్రస్థాయిలో అవకతవకల ఆరోపణలు వచ్చాయి. -
కేకేఆర్‌లోకి పప్పు యాదవ్ కొడుకు.. ధర ఎంతంటే?
అబుదాబి వేదికగా జరిగిన ఐపీఎల్-2026 మినీ వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ భారీ బిడ్డింగ్స్‌తో ఆశ్చర్యపరిచింది. రూ. 64.30 కోట్ల భారీ పర్సుతో వేలంలోకి దిగిన కేకేఆర్.. మొత్తం 13 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసి తమ జట్టును పటిష్టం చేసుకుంది.ఈ వేలంలో కేకేఆర్ ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను ఏకంగా రూ. 25.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసి సంచలనం సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా గ్రీన్ నిలిచాడు. అదేవిధంగా కేకేఆర్.. భారత అన్క్యాప్డ్ ప్లేయర్ల కోసం కూడా తమ పర్స్‌లో ఉన్న మొత్తాన్ని వెచ్చింది. కేకేఆర్ కొనుగోలు చేసిన మొత్తం 13 మంది ఆటగాళ్లలో స్వతంత్ర ఎంపీ రాజేష్ రంజన్ (పప్పు యాదవ్) కుమారుడు సార్థక్ రంజన్ కూడా ఉన్నాడు. సార్థక్‌ను రూ. 30 లక్షల కనీస ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. 29 ఏళ్ల సార్థక్ ఐపీఎల్‌కు ఎంపిక కావడం ఇదే తొలిసారి.సార్థక్ రంజన్ డొమెస్టిక్ క్రికెట్లో ఢిల్లీ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు 2 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతడు 9.33 సగటుతో 28 పరుగులు చేశాడు. లిస్ట్-ఎ క్రికెట్లో 105, టీ20ల్లో 5 మ్యాచ్‌లు 66 పరుగులు చేశాడు. ఇక తన కుమారుడు ఐపీఎల్‌కు ఎంపిక కావడం పట్ల పప్పు యాదవ్ సంతోషం వ్యక్తం చేశాడు."అభినందనలు సార్థక్! నీ టాలెంట్‌తో నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకో, నీ కలలను నిజం చేసుకో" అంటూ ఎక్స్ వేదికగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కాగా పప్పు యాదవ్ బీహార్‌లోని పూర్ణియా నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు.చదవండి: Prithvi Shaw: ఒకప్పుడు రూ.8 కోట్లు.. ఇప్పుడు ధర తెలిస్తే షాక్! -
పాపం.. తాతామనవళ్లను పొట్టనపెట్టుకున్నాడు
ముంబై: అన్నీ సవ్యంగా సాగినట్టయితే ఆ బాలుడు మరో రెండు వారాల్లో ఆరో పుట్టినరోజు వేడుకలు చేసుకోవాల్సివుంది. మద్యంతాగిన కారు డ్రైవర్ రూపంలో మృత్యువు ఊహించని విధంగా వచ్చింది. పాపం ఆ చిన్నారితో పాటు అతని తాతను పొట్టనపెట్టుకుంది. ముంబై శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో సార్తక్, తాత భికు కొలెకర్ (65) మరణించారు. మద్యంమత్తులో కారు నడిపిన వ్యక్తి దర్శకుడు, నిర్మాత. సార్తక్ కుటుంబ సభ్యులు బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లి ఆదివారం రాత్రి ఇంటికి తిరుగుపయనమయ్యారు. ఒషివరాలోని ఆనంద్ నగర్లో సార్తక్, తల్లి శిల్ప, అవ్వతాతలు ఇందు (58), భికుకొలెకర్ రోడ్డు దాటుతుండగా.. స్పీడ్‌గా వచ్చిన వోక్స్ వ్యాగన్ కారు వారిని ఢీకొట్టింది. సార్తక్ గాల్లో ఎగిరి కారు బ్యానెట్‌పై పడి దొర్లుకుంటూ రోడ్డు మీద పడ్డాడు. తాతా భికు తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయాడు. శిల్ప భుజాలకు స్వల్ప గాయాలయ్యాయి. సార్తక్ను, తల్లి శిల్పను సమీపంలోని రూబీ ఆస్పత్రికి తీసుకెళ్లగా, సార్తక్ అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన సార్తక్ తాతను కూపర్ హాస్పిటల్‌కు తరలించగా, ఆయన కూడా మరణించినట్టు వైద్యులు చెప్పారు. దీంతో ఈ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సార్తక్ తండ్రి సందీప్ ఈ పార్టీకి వెళ్లలేదు. కారు డ్రైవర్ మద్యంమత్తులో తన కొడుకు, తండ్రిని బలితీసుకున్నాడని కన్నీటిపర్యంతమయ్యాడు. మద్యంమత్తులో ఈ కుటుంబాన్ని ఢీకొట్టిన కారు డ్రైవర్ ఇంద్రజిత్ నట్టోజి (45) వాహానాన్ని ఆపకుండా వెళ్లిపోయాడు. స్థానికులు బైకులపై వెళ్లి అతన్ని పట్టుకుని బందించారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. మోతాదుకు మించి మద్యంతాగి వాహనాన్ని నడిపినట్టు పోలీసులు చెప్పారు.


