అబుదాబి వేదికగా జరిగిన ఐపీఎల్-2026 మినీ వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ భారీ బిడ్డింగ్స్‌తో ఆశ్చర్యపరిచింది. రూ. 64.30 కోట్ల భారీ పర్సుతో వేలంలోకి దిగిన కేకేఆర్.. మొత్తం 13 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసి తమ జట్టును పటిష్టం చేసుకుంది.
ఈ వేలంలో కేకేఆర్ ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను ఏకంగా రూ. 25.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసి సంచలనం సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా గ్రీన్ నిలిచాడు. అదేవిధంగా కేకేఆర్.. భారత అన్‌క్యాప్డ్ ప్లేయర్ల కోసం కూడా తమ పర్స్‌లో ఉన్న మొత్తాన్ని వెచ్చింది.
కేకేఆర్ కొనుగోలు చేసిన మొత్తం 13 మంది ఆటగాళ్లలో స్వతంత్ర ఎంపీ రాజేష్ రంజన్ (పప్పు యాదవ్) కుమారుడు సార్థక్ రంజన్ కూడా ఉన్నాడు. సార్థక్‌ను రూ. 30 లక్షల కనీస ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. 29 ఏళ్ల సార్థక్ ఐపీఎల్‌కు ఎంపిక కావడం ఇదే తొలిసారి.
సార్థక్ రంజన్ డొమెస్టిక్ క్రికెట్‌లో ఢిల్లీ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు 2 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతడు 9.33 సగటుతో 28 పరుగులు చేశాడు. లిస్ట్-ఎ క్రికెట్‌లో 105, టీ20ల్లో 5 మ్యాచ్‌లు 66 పరుగులు చేశాడు. ఇక తన కుమారుడు ఐపీఎల్‌కు ఎంపిక కావడం పట్ల పప్పు యాదవ్ సంతోషం వ్యక్తం చేశాడు.
"అభినందనలు సార్థక్! నీ టాలెంట్‌తో నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకో, నీ కలలను నిజం చేసుకో" అంటూ ఎక్స్ వేదికగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కాగా పప్పు యాదవ్ బీహార్‌లోని పూర్ణియా నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు.
చదవండి: Prithvi Shaw: ఒకప్పుడు రూ.8 కోట్లు.. ఇప్పుడు ధర తెలిస్తే షాక్!


