ఐపీఎల్-2026 మినీ వేలంలో శ్రీలంక యువ పేసర్ మతీషా పతిరానాకు జాక్ పాట్ తగిలింది. అతడిని రూ. 18 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంతం చేసుకుంది. రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన పతిరానా కోసం తొలుత ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ పోటీపడ్డాయి.
ఆ తర్వాత ఢిల్లీ పోటీనుంచి తప్పుకోవడంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈ జూనియర్ మలింగ కోసం కేకేఆర్, లక్నో మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. లక్నో అతడిని దక్కించుకునేందుకు ఆఖరివరకు ప్రయత్నాలు చేసింది. కానీ కేకేఆర్ మాత్రం బిడ్‌ను పెంచుకుంటూ పోతుండడంతో లక్నో వెనక్కి తగ్గింది. దీంతో ఈ యార్కర్ల కింగ్ కేకేఆర్ సొంతమయ్యాడు.
పతిరానా తన ఐపీఎల్ అరంగేట్రం నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే నాలుగు సీజన్‌ల పాటు తమ జట్టుకు ఆడిన పతిరానాను సీఎస్‌కే.. ఐపీఎల్-2026 వేలంకు ముందు రిటైన్ చేసుకోలేదు. దీంతో వేలంలోకి వచ్చిన పతిరానాపై కాసుల వర్షం కురిసింది. గత సీజన్‌లో సీఎస్‌కే నుంచి రూ.13 కోట్లు అందుకున్న పతిరానా.. ఇప్పుడు కేకేఆర్ నుంచి రూ.18 కోట్లు అందుకోనున్నాడు.
కాగా పతిరానా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరుగాంచాడు. పతిరానా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరుగాంచాడు. పతిరానా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నప్పటికి.. సీఎస్‌కే లెజెండ్ ధోని సారథ్యంలో ఎంతగానో రాటుదేలాడు. మిడిల్ ఓవర్లలో కూడా తన పేస్ బౌలింగ్ బ్యాటర్లను కట్టడి చేయగలడు.
అంతేకాకుండా ఈ జూనియర్ మలింగా యార్కర్లను కూడా అద్భుతంగా సంధించగలడు. ఈ కారణంతోనే అతడిపై కేకేఆర్ కోట్ల వర్షం కురిపించింది. మతీషా పతిరానా ఐపీఎల్‌లో ఇప్పటివరకు 32 మ్యాచ్‌లు ఆడి 47 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: IPL 2026: కామెరూన్ గ్రీన్‌కు భారీ ధర.. ఐపీఎల్ చరిత్రలోనే! ఎన్ని కోట్లంటే?


