ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 వేలానికి రంగం సిద్ధమైంది. అబుదాబి వేదికగా మంగళవారం ఆక్షన్ జరుగనుంది. ఈ నేపథ్యంలో బ్రాడ్‌కాస్టర్ జియోస్టార్ సోమవారం మాక్ వేలం (Mock Auction) నిర్వహించగా.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ రికార్డు ధర పలికాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున మాక్ వేలంలో పాల్గొన్న రాబిన్ ఊతప్ప గ్రీన్ కోసం ఏకంగా రూ. 30.50 కోట్లు వెచ్చించాడు.
అతడికి కళ్లు చెదిరే మొత్తం
అదే విధంగా.. ఇంగ్లండ్ స్టార్ లియామ్ లివింగ్‌స్టోన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా రూ. 19 కోట్లు ఖర్చు చేయడం విశేషం. ఐపీఎల్-2025లో పేలవ ప్రదర్శన కారణంగా లివింగ్‌స్టోన్‌ను ఆర్సీబీ (రూ. 8.75 కోట్లు) వదిలేసిన విషయం తెలిసిందే. ఇక టీమిండియా ఆటగాళ్లలో పృథ్వీ షా నామమాత్రపు ధరకు అమ్ముడుపోగా.. రాహుల్ చహర్ (Rahul Chahar)కు కళ్లు చెదిరే మొత్తం దక్కింది.
భారత స్పిన్నర్ రవి బిష్ణోయి కూడా భారీ ధర దక్కించుకున్నాడు. మరి వీరందరితో పాటు మాక్ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు, అమ్ముడుపోకుండా మిగిలిపోయిన ప్లేయర్లపై ఓ లుక్కేద్దామా!
మాక్ వేలంలో అమ్ముడు పోయిన ఆటగాళ్లు
💰కామెరాన్ గ్రీన్- రూ. 30.50 కోట్లు- కోల్‌కతా నైట్ రైడర్స్
💰పృథ్వీ షా- రూ. 2.75 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్
💰వెంకటేశ్ అయ్యర్- రూ. 6 కోట్లు- ఆర్సీబీ
💰సర్ఫరాజ్ ఖాన్- రూ. 7 కోట్లు- చెన్నై సూపర్ కింగ్స్
💰లియామ్ లివింగ్‌స్టోన్- రూ. 19 కోట్లు- లక్నో సూపర్ జెయింట్స్
💰మతీశ పతిరణ- రూ. 13 కోట్లు- కోల్‌కతా నైట్ రైడర్స్
💰రవి బిష్ణోయి- రూ. 11.50 కోట్లు- రాజస్తాన్ రాయల్స్
💰రాహుల్ చహర్- రూ. 10 కోట్లు- చెన్నై సూపర్ కింగ్స్
💰గెరాల్డ్ కోయెట్జి- రూ. 8 కోట్లు- సన్‌రైజర్స్ హైదరాబాద్
💰అన్రిచ్ నోర్జే- రూ. 7.50 కోట్లు- చెన్నై సూపర్ కింగ్స్
💰డేవిడ్ మిల్లర్- రూ. 9.50 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్
💰లుంగి ఎంగిడి- రూ. 6.50 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్
💰ఆకాశ్ దీప్- రూ. 5 కోట్లు- సన్‌రైజర్స్ హైదరాబాద్
💰చేతన్ సకారియా- రూ. 6.5 కోట్లు- గుజరాత్ టైటాన్స్
💰జానీ బెయిర్ స్టో- రూ. 2.5 కోట్లు- కోల్‌కతా నైట్ రైడర్స్
💰జేక్ ఫ్రేజర్-మెగర్క్- రూ. 2 కోట్లు- పంజాబ్ కింగ్స్
💰వనిందు హసరంగ- రూ. 2 కోట్లు- చెన్నై సూపర్ కింగ్స్
💰జేమీ స్మిత్- రూ. 2 కోట్లు- గుజరాత్ టైటాన్స్
💰విజయ్ శంకర్- రూ. 2 కోట్లు- గుజరాత్ టైటాన్స్
💰డారిల్ మిచెల్- రూ. 2 కోట్లు- గుజరాత్ టైటాన్స్
💰క్వింటన్ డికాక్- రూ. కోటి- ఢిల్లీ క్యాపిటల్స్
💰మహీశ్ తీక్షణ- రూ. 2 కోట్లు- సన్‌రైజర్స్ హైదరాబాద్
💰రాహుల్ త్రిపాఠి- రూ. 75 లక్షలు- కోల్‌కతా నైట్ రైడర్స్
💰శివం మావి- రూ. 2.50 కోట్లు- చెన్నై సూపర్ కింగ్స్
మాక్ వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే
బెన్ డకెట్, రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే
కాగా మాక్ వేలంలో కేకేఆర్ తరఫున ఊతప్ప, సన్‌రైజర్స్ తరఫున ఎస్.బద్రీనాథ్, చెన్నై తరఫున సురేశ్ రైనా, ఆర్సీబీ తరఫున అనిల్ కుంబ్లే, గుజరాత్ తరఫున ఛతేశ్వర్ పుజారా, ముంబై ఇండియన్స్ తరఫున అభినవ్ ముకుంద్, ఢిల్లీ తరఫున మొహమ్మద్ కైఫ్, లక్నో తరఫున ఇర్ఫాన్ పఠాన్, పంజాబ్ తరఫున సంజయ్ బంగర్, రాజస్తాన్ తరఫున ఆకాశ్ చోప్రా పాల్గొన్నారు.
చదవండి: IND vs SA: అక్షర్ పటేల్ స్థానంలో అతడే.. బీసీసీఐ ప్రకటన


