న్యూఢిల్లీ: స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జీఎఫ్‌ఐ) జాతీయ స్విమ్మింగ్ చాంపియన్íÙప్‌లో తెలంగాణ స్విమ్మర్లు కర్రా శివాని రెండు పతకాలు, నందిగం శివకుమారి ఒక పతకం సాధించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఈ టోరీ్నలో శివాని అండర్–14బాలికల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో రజతం, 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో స్వర్ణం సొంతం చేసుకుంది.
50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఫైనల్ రేసును శివాని 31.98 సెకన్లలో ముగించి రెండో స్థానంలో .... శివ కుమారి (33.56 సెకన్లు) మూడో స్థానంలో నిలిచారు. 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఫైనల్ రేసును శివాని 2ని:29.30 సెకన్లలో ముగించి జాతీయ స్కూల్‌గేమ్స్ కొత్త రికార్డును నెలకొలి్పంది. గత ఆరేళ్లుగా రిధిమ (కర్ణాటక; 2ని:29.75 సెకన్లు) పేరిట ఉన్న రికార్డును ఆమె సవరించింది. ప్రస్తుతం శివాని గచి్చ»ౌలి స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ స్విమ్మింగ్ కోచ్ ఆయుశ్ యాదవ్ వద్ద శిక్షణ తీసుకుంటోంది.


