హైదరాబాద్ ప్రయాణానికి అనుకూలించని వాతావరణం
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండో రోజూ ఢిల్లీలోనే ఉన్నారు. ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘ఓట్ చోర్–గద్దీ ఛోడ్’ మహాధర్నాలో ఆయన పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే.. సోమవారం హైదారాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రేవంత్ హాజరుకావాల్సి ఉంది.
కానీ.. ఢిల్లీ మొత్తం దట్టమైన పొగమంచు కారణంగా పలు విమానాలు రద్దయ్యాయి. కొన్ని విమానాలు ఆలస్యంగా నడిచాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ తన ప్రయాణం వాయిదా వేసుకున్నారు. ఎంపీలు, ఇతరత్రా ఎవరితోనూ భేటీ కాలేదు. ఎలాంటి సమావేశాల్లోనూ పాల్గొనలేదు.
కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీకి వచ్చిన రేవంత్ పూర్తిగా వారితోనే రోజంతా గడిపారు. సాధారణ పరిస్థితులు నెలకొని విమాన ప్రయాణానికి వాతావరణం అనుకూలిస్తే.. మంగళవారం రేవంత్ హైదరాబాద్‌కు తిరుగుపయనం అవుతారని అధికార వర్గాలు చెప్పాయి.


