ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి బిగ్ అప్‌డేట్ అందింది. లీగ్ ప్రారంభ తేదీ మారినట్లు ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ క్రిక్‌బజ్ పేర్కొంది. ముందుగా ప్రకటించినట్లు ఐపీఎల్ 2026 మార్చి 15న కాకుండా మార్చి 26న ప్రారంభం కానున్నట్లు తెలిపింది. మే 31తో ముగియనున్నట్లు పేర్కొంది.
ఇవాళ (డిసెంబర్ 15) అబుదాబీలో జరిగిన ఫ్రాంఛైజీల మీటింగ్‌లో ఈ విషయం ఖరారైనట్లు వెల్లడించింది. సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ విషయంలో ఇంకా స్పష్టత లేనట్లు ప్రకటించింది.
సాధారణంగా సీజన్ ఓపెనర్ డిఫెండింగ్ ఛాంపియన్స్ (ఆర్సీబీ) హోం గ్రౌండ్‌లో జరుగుతుంది. అయితే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంపై సందిగ్దత నెలకొనడంతో ఈ విషయాన్ని ఇంకా ఖరారు చేయలేదు. పై విషయాలను ఐపీఎల్ సీఈవో హేమంగ్ అమిన్ తమతో షేర్ చేసుకున్నట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది.
కాగా, రేపు అబుదాబీ వేదికగా ఐపీఎల్ 2026 మినీ వేలం జరుగనున్న విషయం తెలిసిందే. ఈ వేలంలో 10 ఫ్రాంచైజీలకు సంబంధించి 77 స్లాట్లు భర్తీ కానున్నాయి. ఇందులో 31 విదేశీ స్లాట్లు కాగా.. మిగతావన్నీ దేశీయ ఆటగాళ్లతో భర్తీ చేయబడతాయి.
10 ఫ్రాంచైజీల వద్ద రూ. 237.55 కోట్ల నిధులు ఉన్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ వద్ద అత్యధికంగా రూ. 64.30 కోట్లు, రెండో అత్యధికంగా చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ. 43.40 కోట్లు ఉన్నాయి. ఈ వేలంలో తాజా అడిషన్స్‌తో పాటు (అభిమన్యు ఈశ్వరన్) మొత్తం 369 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.


