breaking news
IPL
-
ఆ మాటతో నా మనసు ముక్కలు.. పాత గాయాన్ని మళ్లీ రేపాడు.. షాకింగ్ వీడియో
భారత్‌లో మెగా టీ20 క్రికెట్ లీగ్ 2008లో పురుడుపోసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పేరుతో మొదలై.. పద్దెనిమిదేళ్లుగా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపిస్తూ క్యాష్ రిచ్ లీగ్‌గా పేరొందిన ఐపీఎల్.. ఎంతో మంది దేశీ, విదేశీ ఆటగాళ్ల ప్రతిభకు వేదికై.. అంతర్జాతీయ స్థాయికి చేరుకునే వీలు కల్పించింది.ఈ మెగా లీగ్ వ్యవస్థాపకుడు, తొలి చైర్మన్ లలిత్ మోదీ (Lalit Modi). మనీలాండరింగ్ కేసులో బుక్కైన ఈ వ్యాపారవేత్త ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకుంటున్నాడు. తాజాగా అతడు ఓ షాకింగ్ వీడియో విడుదల చేశాడు. ఐపీఎల్ చరిత్రలో మచ్చలా మిగిలిపోయిన ‘‘స్లాప్‌గేట్’’కు సంబంధించిన దృశ్యాలను బయటపెట్టాడు.శ్రీశాంత్‌ను చెంపదెబ్బ కొట్టిన భజ్జీఐపీఎల్ అరంగేట్ర సీజన్ 2008లో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. మరోవైపు.. భారత మాజీ పేసర్ శ్రీశాంత్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్)కు ఆడేవాడు. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య నాడు మ్యాచ్ ముగిసిన తర్వాత.. ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలో భజ్జీ.. శ్రీశాంత్‌ను చెంపదెబ్బ కొట్టాడు.ఇరువురి మధ్య వాగ్వాదం తలెత్తిన క్రమంలో భజ్జీ ఈపని చేయగా.. తదుపరి మ్యాచ్‌లలో ఆడకుండా అతడిపై నిషేధం పడింది. ఇక లలిత్ మోదీ తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ పాడ్‌కాస్ట్ సందర్భంగా భజ్జీ- శ్రీశాంత్‌ను కొట్టిన వీడియోను విడుదల చేశాడు.‘‘ఆరోజు మ్యాచ్ ముగిసింది. కెమెరాలన్నీ ఆఫ్ చేశారు. అయితే, నా దగ్గర ఉన్న సెక్యూరిటీ కెమెరా మాత్రం ఆన్‌లో ఉంది. శ్రీశాంత్, భజ్జీ మధ్య జరిగిన ఘటన అందులో రికార్డైంది. ఇదిగో ఇదే ఆ వీడియో. చాలా కాలంగా నేను దీనిని దాచి ఉంచాను’’ అని లలిత్ మోదీ పేర్కొన్నాడు.నన్ను నేనే క్షమించుకోలేనుకాగా శ్రీశాంత్‌ను చెంపదెబ్బకొట్టడం గురించి భజ్జీ ఇటీవల పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. రవిచంద్రన్ అశ్విన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్ నుంచి దేన్నైనా తొలగించుకునే అవకాశం వస్తే.. దానిని లిస్టు నుంచి తుడిచేస్తా. ఆరోజు నేను అలా చేయకుండా ఉండాల్సింది.ఇప్పటికి 200 సార్లు క్షమాపణ చెప్పి ఉంటా. అవకాశం దొరికినప్పుడల్లా ఏ వేదిక మీదైనా సరే సారీ చెబుతూనే ఉన్నా. నిజంగా ఆరోజు నేను తప్పుచేశాను. ఆరోజు కంటే నేను హర్ట్ అయిన విషయం మరొకటి ఉంది.కొన్నేళ్ల క్రితం శ్రీశాంత్ కూతురిని నేను కలిశాను. ఆమెతో ప్రేమగా మాట్లాడుతూ ఉండగా.. ‘నేను నీతో మాట్లాడను. నువ్వు మా నాన్నను కొట్టావు’ అంది. ఆ మాటతో నా మనసు ముక్కలైపోయింది. ఆ చిన్నారి మనసులో నాపై అలాంటి ముద్ర ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయాను. తన తండ్రిని చెంపదెబ్బ కొట్టిన వ్యక్తిగా మాత్రమే తను నన్ను గుర్తుపెట్టుకుంటుంది. ఆమెకు కూడా క్షమాపణలు చెప్పాను’’ అంటూ హర్భజన్ సింగ్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. అయితే, లలిత్ మోదీ మాత్రం పాత గాయాన్ని రేపుతూ వీడియోను బయటకు తేవడం గమనార్హం.చదవండి: భారత క్రికెట్లో అనూహ్య పరిణామం.. బీసీసీఐ అధ్యక్షుడి రాజీనామా View this post on Instagram A post shared by Beyond23 Cricket Podcast (@beyond23cricketpod) -
ఐపీఎల్ ‘ముడేసిన బంధం’.. అప్పుడే ప్రేమ బయటపడింది!
ఇద్దరూ క్లాస్మేట్స్.. ఆ అబ్బాయేమో గుంభనంగా ఉంటాడు.. పుస్తకాల పురుగు.. ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతాడు.. ఆ అమ్మాయి మాత్రం చలాకీ.. హుషారైన పిల్ల.. చుట్టూ ఉన్నవాళ్లతో ఇట్టే కలిసిపోతుంది.. మూడీగా ఉన్నవాళ్ల ముఖంలో చిరునవ్వులు తెప్పించగలదు..ఇలా భిన్నమైన మనస్తత్వాలు ఉన్న ఆ ఇద్దరు.. పెద్దయ్యాక ప్రేమలో పడ్డారు.. చిన్ననాటి నుంచి అతడు ఆమెపై పెంచుకున్న ఇష్టాన్ని తెలిపేందుకు ‘ఐపీఎల్’ అవకాశాన్ని ఇచ్చింది. ఇద్దరూ కలిసి ఒకే జట్టుకు పనిచేశారు.. అతడేమో ఆటగాడు.. ఆమె ఆ జట్టు సోషల్ మీడియా అకౌంట్ మేనేజర్.మాటలు, మనసులు కలిశాయి.. పెళ్లి బంధంతో ఇద్దరూ ఒక్కటయ్యారు.. ఇద్దరు చక్కటి, ముత్యాల్లాంటి పిల్లలకు తల్లిదండ్రులయ్యారు.. ఇప్పుడతడు ఆటకు వీడ్కోలు పలికాడు.. ఐపీఎల్ నుంచీ వైదొలిగాడు.. ఇక అతడి సమయమంతా మాతోనే అని ఆమె సంబరపడిపోలేదు.‘‘లవ్ యూ.. నువ్వు నీ కొత్త ప్రయాణంలో మరింత గొప్పగా ముందుకు సాగాలి.. శిఖరాగ్రాలను అధిరోహించాలి’’ అని భర్తను ప్రోత్సహించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానంటూ ప్రేమను చాటుకుంది. టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin)- ప్రీతి నారాయణన్ (Priti Narayanan) గురించే ఈ ఉపోద్ఘాతమంతా!చెన్నైకి చెందిన అశ్విన్- ప్రీతి క్లాస్మేట్స్. ఒకే స్కూళ్లో చదివారు. అయితే, క్రికెట్లో రాణించే క్రమంలో అశూ స్కూల్ మారినా.. ప్రీతితో మాత్రం టచ్‌లోనే ఉన్నాడు. ఆమె ఈవెంట్ మేనేజర్‌గా కెరీర్ నిర్మించుకుంటే.. అశూ టీమిండియా కీలక స్పిన్నర్‌గా ఎదిగాడు.ఈ క్రమంలోనే అశ్విన్ ఐపీఎల్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లో చేరగా.. ప్రీతి అదే జట్టు సోషల్ మీడియా అకౌంట్ మేనేజర్‌గా వచ్చింది. అప్పుడే ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా రూపాంతరం చెందింది. ప్రీతిని కలిసిన పదేళ్ల తర్వాత అశూ తన ప్రేమను తెలపగా.. అందుకు ఆమె సమ్మతించింది.కపుల్గోల్స్పెద్దల అంగీకారంతో ఆ జంట 2011లో పెళ్లిపీటలు ఎక్కింది. అశూ- ప్రీతిలకు కుమార్తెలు అకీరా, ఆధ్య సంతానం. పద్నాలుగేళ్లుగా ఒకరికొకరు అండగా ఉంటూ కలిసి అడుగులు వేస్తున్న ఈ జంట కపుల్గోల్స్ సెట్ చేయడంలో ముందుంటారు. ఇక అశ్విన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకగా.. ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై చెప్పేశాడు. తదుపరి విదేశీ లీగ్‌లలో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో అతడిని చీర్ చేస్తూ ప్రీతి ఉద్వేగపూరిత పోస్ట్ పెట్టగా.. వీరి ప్రేమకథ మరోసారి తెరమీదకు వచ్చింది.అందుకే ఐపీఎల్‌కూ వీడ్కోలుకాగా గతేడాది చివర్లో టెస్టు రిటైర్మెంట్ తర్వాత 2025 సీజన్ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగాడు. తన సొంత టీమ్వంటి సీఎస్కేతో మరికొంత కాలం లీగ్‌లో సాగాలని అతను భావించాడు. అయితే పరిస్థితులు మారిపోవడంతో లీగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వేలంలో రూ.9.75 కోట్లతో చెన్నై అశ్విన్‌ను ఎంచుకోగా 9 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన అతను పూర్తిగా విఫలమయ్యాడు. ఏకంగా 9.12 ఎకానమీతో 7 వికెట్లు మాత్రమే తీశాడు.సీఎస్కే యాజమాన్యం కూడా యువకులతో జట్టును పునర్నిర్మించే ప్రయత్నంలో భాగంగా అశ్విన్‌ను కొనసాగించే ఉద్దేశం లేదని పరోక్షంగా చెప్పేసింది. 39 ఏళ్ల వయసులో కొత్త ఫ్రాంచైజీ ఎంచుకునే అవకాశాలు కూడా తక్కువగా ఉండటంతో అతను లీగ్ నుంచి రిటైర్ అయ్యాడు. 2009లో తొలిసారి లీగ్‌లోకి అడుగు పెట్టిన అతను వరుసగా ఏడు సీజన్ల పాటు సీఎస్కే తరఫునే బరిలోకి దిగాడు.ఆ విదేశీ లీగ్‌లలో కనిపించే అవకాశంఆ తర్వాత పుణే సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ టీమ్‌ల తరఫున కూడా ఆడాడు. 221 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 7.20 ఎకానమీతో 187 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాళ్ల జాబితాలో అతను ఐదో స్థానంలో నిలిచాడు. అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటన చేయడంతో ఇకపై అశ్విన్ ఇతర విదేశీ లీగ్‌లలో ఆడేందుకు బీసీసీఐ అనుమతిస్తుంది. మున్ముందు బిగ్‌బాష్, ఎస్ఏటి20, సీపీఎల్, హండ్రెడ్ తదితర టోర్నీలలో అతను కనిపించే అవకాశం ఉంది. చదవండి: ఆమెతో పెళ్లి, విడాకులు.. తొలిసారి స్పందించిన షమీ -
అందుకే ఐపీఎల్ నుంచి తప్పుకొన్నా.. ధోని మాత్రం గ్రేట్: అశ్విన్
టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అశ్విన్.. ఇప్పుడు ఐపీఎల్ నుంచి కూడా తప్పుకొని అందరికి షాకిచ్చాడు. ఐపీఎల్-2025 ఎడిషన్‌లో సూపర్ కింగ్స్ (CSK) తరపున చివరిసారిగా ఆడిన అశ్విన్, ఇకపై విదేశీ లీగ్‌లలో ఆడేందుకు సిద్దంగా ఉన్నట్లు వెల్లడించాడు. వచ్చే ఏడాది ఇంగ్లండ్‌కు చెందిన ది హాండ్రడ్ లీగ్‌లో అశూ భాగమయ్యే అవకాశముంది. ఇక ఐపీఎల్ నుంచి రిటైర్ కావాలనే తన ఆకస్మిక నిర్ణయానికి గల కారణాన్ని అశ్విన్ తాజాగా వెల్లడించాడు. దాదాపు మూడు నెలల పాటు కంటిన్యూగా క్రికెట్ ఆడేందుకు తను సిద్దంగా లేనందున ఐపీఎల్ నుంచి తప్పుకొన్నట్లు తెలిపాడు. అదేవిధంగా 44 ఏళ్ల వయస్సులోనూ ఐపీఎల్లో ఆడుతున్న ధోనిను అశ్విన్ ప్రశంసించాడు."వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్లో ఆడాలని తొలుత నిర్ణయించుకున్నాను. కానీ మూడు నెలల పాటు క్రికెట్ అంటే కొంచెం కష్టంగా అన్పించింది. అందుకు నా శరీరం సహకరించదని అనుకుంటున్నాను. ఐపీఎల్ నుంచి తప్పుకోవడానికి ఇదే ప్రధాన కారణం.ధోని మాత్రం నిజంగా గ్రేట్. అతడి ఫిట్నెస్ చూసి నేను ఎప్పుడూ ఆశ్యర్యపోతుంటాను. వయస్సు పెరుగుతున్న కొద్ది ఐపీఎల్ వంటి టీ20 లీగ్‌లో ఆడడం అంత సులువు కాదు. దాదాపు మూడు నెలల పాటు అందుకు కేటాయించాల్సి వుంటుంది.దేశ వ్యాప్తంగా ప్రయాణం చేస్తూ మ్యాచ్‌లు ఆడాలి. ఒక మ్యాచ్ తర్వాత మరొక మ్యాచ్‌కు సిద్దంగా ఉండాలి. కొన్ని సార్లు ఒకట్రెండు రోజుల వ్యవధిలోనే మ్యాచ్ ఆడాల్సి వస్తుంది. అందుకు మన శరీరం సహకరించాలి అని తన యూట్యూబ్ ఛానల్లలో అశ్విన్ పేర్కొన్నాడు.అశ్విన్ తన కెరీర్లో మొత్తంగా 221 ఐపీఎల్ మ్యాచ్‌లలో 187 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా బ్యాటింగ్‌లో కూడా 833 పరుగులు సాధించాడు. 38 ఏళ్ల అశ్విన్ ఐపీఎల్లో ఐదు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. సీఎస్కే, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ తరపున ఆడాడు.చదవండి: Danish Malewar: డబుల్ సెంచరీతో చెలరేగిన యువ సంచలనం.. తొలి ప్లేయర్‌గా రికార్డు -
ఐపీఎల్ చరిత్రలో అతి భారీ రికార్డు అశ్విన్ ఖాతాలోనే..!
భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ నిన్న (ఆగస్ట్ 27) ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రికెట్ జీనియస్ క్యాష్ రిచ్ లీగ్ నుంచి తప్పుకున్న నేపథ్యంలో అతని పేరిట ఓ భారీ ఐపీఎల్ రికార్డు తెరపైకి వచ్చింది. అదేంటంటే.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక బంతులు వేసిన రికార్డు.2009లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన అశ్విన్.. తన 221 మ్యాచ్‌ల కెరీర్లో 4710 బంతులు వేశాడు. ఐపీఎల్లో ఓ బౌలర్ వేసిన అత్యధిక బంతులు ఇవే. అశ్విన్ తర్వాత ఐపీఎల్లో అత్యధిక బంతులు వేసిన ఘనత సునీల్ నరైన్‌కు దక్కుతుంది. నరైన్ తన ఐపీఎల్ కెరీర్లో 4345 బంతులు సంధించాడు. ఈ విభాగంలో అశ్విన్, నరైన్ తర్వాతి స్థానాల్లో భువనేశ్వర్ కుమార్ (4222), రవీంద్ర జడేజా (4056) ఉన్నారు.37 ఏళ్ల ఆశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసి, 2025 సీజన్లో అదే ఫ్రాంచైజీ తరఫున తన చివరి మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్ కెరీర్లో మొత్తం 221 మ్యాచ్‌లు ఆడిన అతను 187 వికెట్లు తీశాడు. అలాగే ఓ హాఫ్ సెంచరీ సాయంతో 833 పరుగులు చేశాడు. సీఎస్కే తరఫున రెండు టైటిళ్లు (2010, 2011) సాధించిన అశ్విన్.. రైజింగ్ పూణే, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్ వంటి జట్లకు సేవలందించారు. రెండు సీజన్లలో (2018, 2019) పంజాబ్‌కు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. 16 సీజన్ల పాటు ఐపీఎల్లో తన మాయాజాలాన్ని ప్రదర్శించిన అశ్విన్.. త్వరలో విదేశీ లీగ్‌ల్లో పాల్గొంటాడని తెలుస్తుంది.ఐపీఎల్లో అశ్విన్ పేరిట ఉన్న ప్రత్యేకమైన రికార్డులుఐదో అత్యధిక వికెట్లు (187)సీఎస్కే తరఫున మూడో అత్యధిక వికెట్లు (97)ఐపీఎల్లో కెప్టెన్‌గా ఐదో అత్యధిక వికెట్లు (25)ఐపీఎల్ చరిత్రలో మూడో అత్యధిక డాట్ బాల్స్ (1663)ఐపీఎల్ చరిత్రలో అత్యధిక బాల్స్ (4710)ఇతర గుర్తించదగిన ఘట్టాలు2011 ఎడిషన్ ఫైనల్లో క్రిస్ గేల్‌ను డకౌట్ చేయడం2019 ఎడిషన్‌లో జోస్ బట్లర్‌ను మన్కడింగ్ చేయడంఐపీఎల్లో రిటైర్డ్ ఔటైన తొలి ఆటగాడు (2022 ఎడిషన్‌లో)ఐదు సీజన్లలో ఐదు వేర్వేరు జట్ల తరఫున (CSK, RPS, PBKS, DC, RR) ఆడటం -
అశ్విన్ కీలక నిర్ణయం
భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిన్న (ఆగస్ట్ 27) ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదివరకే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతడు.. భారత క్రికెట్‌తో తన బంధాన్ని పూర్తిగా తెంచుకున్నాడు. ఐపీఎల్ రిటైర్మెంట్ తర్వాత అశ్విన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.ఇంగ్లండ్ వేదికగా జరిగే హండ్రెడ్ లీగ్‌లో ఆడేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నాడని సమాచారం. అలాగే ఆస్ట్రేలియా, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా దేశాల్లో జరిగే టీ20 లీగ్‌ల్లో కూడా పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు పలు ఫ్రాంచైజీలతో సంప్రదింపులు జరుగుతున్నాయట.బీసీసీఐ నియమాల ప్రకారం.. భారత ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తేనే విదేశీ లీగ్‌ల్లో ఆడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అశ్విన్‌కు భారత క్రికెట్‌తో కాని, ఐపీఎల్‌తో కాని సంబంధాలు లేవు. కాబట్టి యాష్‌కు విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకు లైన్ క్లియర్ అయ్యింది. విదేశీ లీగ్‌ల్లో పాల్గొనాలనుకునే విషయాన్ని అశ్విన్ తన ఐపీఎల్ రిటైర్మెంట్ సందేశంలో పరోక్షంగా ప్రస్తావించాడు.37 ఏళ్ల ఆశ్విన్ 2009లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసి, 2025లో అదే ఫ్రాంచైజీ తరఫున తన చివరి మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్ కెరీర్లో మొత్తం 221 మ్యాచ్‌లు ఆడి 187 వికెట్లు తీశాడు. సీఎస్కేతో రెండు టైటిళ్లు సాధించాడు. పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్ వంటి జట్లకు సేవలందించారు. కొన్ని మ్యాచ్‌ల్లో పంజాబ్‌కు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. 16 సంవత్సరాల పాటు ఐపీఎల్లో తన మాయాజాలాన్ని ప్రదర్శించిన అశ్విన్.. త్వరలో విదేశీ లీగ్‌ల్లో కూడా సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు. -
ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్
టీమిండియా స్పిన్ లెజెండ్, చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం రవి చంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బుధవారం సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని అశ్విన్ వెల్లడించాడు."నా కెరీర్లో సరికొత్త అధ్యాయం మొదలు కానుంది. ఐపీఎల్ క్రికెటర్‌గా నా ప్రయాణ ఈ రోజుతో ముగిసింది. కానీ ప్రతీ ముగింపునకు ఒక కొత్త ప్రారంభం ఉంటుంది. ఇకపై వివిధ ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో ఆడేందుకు నా అన్వేషణను మొదలు పెట్టనున్నాను.ఈ 16 ఏళ్ల ఐపీఎల్ జర్నీలో నాకు ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. నాకు సపోర్ట్‌గా నిలిచిన అన్ని ఫ్రాంచైజీలకు, బీసీసీఐకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అని తన రిటైర్మెంట్ నోట్లో అశ్విన్ రాసుకొచ్చాడు. ఈ ఏడాది ఆరంభంలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అశ్విన్.. ఇప్పుడు ఐపీఎల్ నుంచి కూడా తప్పుకొన్నాడు.2009లో సీఎస్కే తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన అశ్విన్.. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో తనకంటూ ఓ పత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మొత్తంగా 221 ఐపీఎల్ మ్యాచ్‌లలో 187 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా బ్యాటింగ్‌లో కూడా 833 పరుగులు సాధించాడు. 38 ఏళ్ల అశ్విన్ ఐపీఎల్లో ఐదు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. సీఎస్కే, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ తరపున ఆడాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ముందు వరకు రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీలో అశ్విన్ భాగంగా ఉన్నాడు. అయితే ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు అశూను రాజస్తాన్ విడిచిపెట్టడంతో రూ. 9.75 కోట్ల భారీ ధరకు సీఎస్కే కొనుగోలు చేసింది. ఈ ఏడాది సీజన్లో 9 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ కేవలం 7 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో వచ్చే ఏడాది సీజన్‌కు ముందు అశ్విన్‌ను సీఎస్కే విడిచిపెట్టేందుకు సిద్దమైనట్లు వార్తలు వచ్చాయి. అంతలోనే రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాకిచ్చాడు. అశ్విన్ ఇక బిగ్ బాష్ లీగ్, సౌతాఫ్రికా టీ20, మేజర్ లీగ్ క్రికెట్ వంటి విదేశీ ఫ్రాంచైజీ లీగ్స్‌లో ఆడే అవకాశముంది. కాగా భారత ఆటగాడు విదేశీ లీగ్స్‌లో ఆడాలటే భారత క్రికెట్‌కు సంబంధించి అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోవాలి.చదవండి: విజయ్ శంకర్ సంచలన నిర్ణయం.. 13 ఏళ్ల బంధానికి ముగింపు? -
దుమ్ములేపుతున్న యువ సంచలనం.. ఐపీఎల్ ఎంట్రీ ఇస్తాడా?
కేరళ క్రికెట్ నుంచి మరో యువ సంచలనం పుట్టుకొచ్చాడు. కేవలం 19 ఏళ్ల వయస్సులోనే తన బ్యాటింగ్ ప్రదర్శనలతో అందరిని ఆకట్టుకున్నాడు. ఓపెనర్‌గా వచ్చి ప్రత్యర్ధి బౌలర్లకు విరుచుకుపడుతున్నాడు. అతడే అహమ్మద్ ఇమ్రాన్. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కేరళ క్రికెట్ లీగ్ (KCL) 2025లో త్రిస్సూర్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.ఈ టోర్నీలో భాగంగా శనివారం గ్రీన్ ఫీల్డ్ స్టేడియం వేదికగా కాలికట్ గ్లోబ్స్టార్స్తో జరిగిన మ్యాచ్‌లో ఇమ్రాన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 55 బంతుల్లోనే 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.ఈ ఏడాది కేసీఎల్ సీజన్లో సెంచరీ చేసిన తొలి ప్లేయర్ నిలిచాడు. అంతకముందు అల్లెప్పీ రిప్పిల్స్తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఇమ్రాన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 44 బంతుల్లో 8 ఫోర్లు సాయంతో 61 పరుగులు చేశాడు. ఇప్పటివరకు 2 మ్యాచ్‌లు ఆడిన ఇమ్రాన్.. 161 పరుగులతో లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అతడి తర్వాతి స్ధానంలో వస్తాల్ గోవింద్(104), మనోహరన్(80) ఉన్నారు.కాగా తిరువనంతపురంకు చెందిన 19 ఏళ్ల ఇమ్రాన్‌కు బ్యాట్‌తో పాటు బంతితో కూడా మ్యాజిక్ చేసే సత్తా ఉంది. ఎడమచేతి వాటం బ్యాటర్ అయినప్పటికి రైట్ ఆర్మ్ ఆఫ్-బ్రేక్‌తో బౌలింగ్ చేస్తాడు. అతడు ఇప్పటికే కేరళ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 4 లిస్ట్-ఎ మ్యాచ్‌లలో ఆడాడు. ఇమ్రాన్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే ఐపీఎల్లో జాక్ పాట్ కొట్టే అవకాశముంది. కాగా కేసీఎల్-2025లో టీమిండియా స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్ కొచ్చి బ్లూ టైగర్స్ తరపున ఆడుతున్నాడు.చదవండి: మా నాన్న చాలా నేర్పించారు.. కానీ అతడే నాకు రోల్ మోడల్: ఆర్యవీర్ సెహ్వాగ్ -
సంచలన ప్రదర్శనలతో దూసుకుపోతున్న సన్‌రైజర్స్ మెరుపు వీరుడు
సన్‌రైజర్స్ హైదరాబాద్ మెరుపు వీరుడు స్మరన్ రవిచంద్రన్ స్వరాష్ట్రమైన కర్ణాటకలో జరుగుతున్న మహారాజా టీ20 టోర్నీలో సంచలన ప్రదర్శనలతో దూసుకుపోతున్నాడు. స్మరన్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 157.29 స్ట్రయిక్‌రేట్‌తో 75.50 సగటున 302 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు విధ్వంసకర అర్ద శతకాలు ఉన్నాయి.తన రెండో మ్యాచ్‌లో 22 బంతుల్లో అజేయమైన 52 పరుగులు చేసిన స్మరన్.. ఐదో మ్యాచ్‌లో 39 బంతుల్లో 52.. ఆరో మ్యాచ్‌లో 30 బంతుల్లో అజేయమైన 53 పరుగులు.. తాజాగా ఎనిమిదో మ్యాచ్‌లో 48 బంతుల్లో అజేయమైన 84 పరుగులు చేశాడు. స్మరన్ మెరుపు ప్రదర్శనలతో దూసుకుపోతుండటంతో అతని జట్టు గుల్బర్గా మిస్టిక్స్ కూడా వరుస విజయాలతో అదరగొడుతుంది. ఈ టోర్నీలో స్మరనే మిస్టిక్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.22 ఏళ్ల స్మరన్ తాజా ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎంపికయ్యాడు. అయితే అనూహ్యంగా గాయపడి ఒక్క మ్యాచ్‌కే నిష్క్రమించాడు. స్మరన్‌కు భారీ హిట్టర్‌గా పేరుంది. ఎంతటి బౌలింగ్‌లో అయినా స్మరన్ అలవోకగా షాట్లు బాదగలడు. గత ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ ఈ ప్రదర్శనను దృష్టిలో పెట్టుకునే స్మరన్పై 30 లక్షల పెట్టుబడి పెట్టింది. అయితే అతను ఒక్క మ్యాచ్‌కే గాయపడి వైదొలిగాడు.మహారాజా టోర్నీలో తాజా ప్రదర్శనల తర్వాత స్మరన్ పేరు మార్మోగిపోతుంది. ఈసారి అతడు ఐపీఎల్ వేలంలో హాట్ కేక్‌గా అమ్ముడుపోతాడని అంచనాలు ఉన్నాయి. స్మరన్‌ను సన్‌రైజర్సే తిరిగి దక్కించుకునే ఛాన్స్ ఉంది. అతడిపై 2 లేదా 3 కోట్లు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. -
ఐపీఎల్‌పై రూ. 7.50 లక్షల ప్రశ్న.. సమాధానం మీకు తెలుసా?
‘కౌన్ బనేగా కరోడ్‌పతి’.. ఇండియాలో మోస్ట్ పాపులర్ రియాలిటీ గేమ్ షోలలో ఒకటి. ఎన్నో సీజన్ల నుంచి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంటున్న ఈ షో తాజాగా 17వ సీజన్ నడుస్తోంది. ఈ సీజన్లో కూడా బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.అయితే గత వారంలో కంటెస్టెంట్లకు క్రికెట్‌కు సంబంధించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్‌పై సెంచరీతో చేసిన భారత ఆటగాడు ఎవరు అన్న ప్రశ్న హోస్ట్ అమితాబ్ అడిగారు. ఈ ప్రశ్నకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ అనే నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. ఇందుకు సమాధానం ఆప్షన్ బి విరాట్ కోహ్లి. ఛాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్ధిపై కోహ్లి అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. కాగా ఈ ప్రశ్న "సూపర్ సాండూక్" అనే స్సెషల్ రౌండ్లో భాగంగా అడిగారు. ఈ రౌండ్లో మొత్తం పది ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు పదివేలు. మొత్తం పది ప్రశ్నలకు సరైన సమాధానం చెబితే లక్ష రూపాయలు బహుమతిగా లభించనుంది. అదేవిధంగా మరో కంటెస్టెంట్‌కు రూ. 7.50 లక్షలకు గానూ ఐపీఎల్ నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. ఐపీఎల్ చరిత్రలో రెండు సార్లు పర్పుల్ క్యాప్ గెలవని ప్లేయర్ ఎవరు? అన్న ప్రశ్న అమితాబ్ అడిగారు. ఇందుకు ఆప్షన్స్‌గా ఎ. లసిత్ మలింగ, బి.హర్షల్ పటేల్, సి. డ్వేన్ బ్రావో, డి. భువనేశ్వర్ కుమార్. సరైన సమాధనం అప్షన్ ఎ. లసిత్ మలింగ. మలింగ మినహా హర్షల్ పటేల్, డ్వేన్ బ్రావో, భువనేశ్వర్ ఐపీఎల్లో రెండు సార్లు పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా నిలిచారు.చదవండి: AUS vs SA: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. సౌతాఫ్రికాకు భారీ షాక్ -
గ్లెన్ మ్యాక్స్‌వెల్‌పై భారత క్రికెట్ అభిమానుల ఆగ్రహం
ఆసీస్ విధ్వంసక బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తీరు భారత క్రికెట్ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తుంది. ఈ వెటరన్ మెరుపు వీరుడు ఐపీఎల్ మినహా అన్ని చోట్లా సత్తా చాటడమే ఇందుకు కారణం. తాజాగా మ్యాక్సీ తన జాతీయ జట్టుకు ఆడుతూ (సౌతాఫ్రికాతో నిర్ణయాత్మక మూడో టీ20) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఓడిపోవాల్సిన మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి తన జట్టును గెలిపించాడు. ఈ గెలుపుతో ఆసీస్ సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. తీవ్ర ఒత్తిడిలో ఆడిన ఈ ఇన్నింగ్స్ మ్యాక్స్‌వెల్ టీ20 కెరీర్లో అత్యుత్తమైందిగా చెప్పుకోవచ్చు.173 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ 88 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండింది. ఈ దశలో బరిలోకి దిగిన మ్యాక్సీ కళ్లు మూసి తెరిచేలోపు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని తన జట్టును సేఫ్ జోన్లో ఉంచాడు. అంతేకాకుండా చివరి 2 బంతుల్లో 4 పరుగులు అవసమైన తరుణంలో ఊహించని షాట్ ఆడి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 36 బంతులు ఎదుర్కొన్న అతను 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 62 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఈ ఇన్నింగ్స్ తర్వాత మ్యాక్సీపై అందరూ ప్రశంసలు కురిపిస్తుండగా.. భారత అభిమానులు మాత్రం గుర్రుగా ఉన్నారు. మ్యాక్స్‌వెల్ ఐపీఎల్లో ఆడడు కానీ, మిగతా చోట్లంతా సత్తా చాటుతాడంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి భారత క్రికెట్ అభిమానుల్లో బాధకు అర్దముంది. ఎన్నో ఆశలు పెట్టుకుని ఇతగాడికి ఐపీఎల్ అవకాశాలిస్తే.. దారుణంగా నిరుత్సాహపరిచాడు. గత రెండు మూడు సీజన్లుగా పరిస్థితి ఇదే. గత సీజన్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉండింది. 5 మ్యాచ్‌ల్లో కేవలం 48 పరుగులే చేసి మధ్యలో స్వదేశానికి చెక్కేశాడు. పంజాబ్ కింగ్స్ అతనిపై భారీ అంచనాలు పెట్టుకొని, మంచి మొత్తానికి కొనుగోలు చేసింది. వారి ఆశలపై మ్యాక్స్‌వెల్ నీళ్లు చల్లాడు.ఈ వైఫల్యాలు చూసి మ్యాక్స్‌వెల్ ఫామ్ కోల్పోయుంటాడనుకోవడానికి వీళ్లేదు. ఎందుకంటే ఐపీఎల్ తర్వాత జరిగిన మేజర్ లీగ్ క్రికెట్లో అతను అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. 12 మ్యాచ్‌ల్లో 175 స్ట్రయిక్‌రేట్‌తో 252 పరుగులు చేశాడు. తన జాతీయ జట్టుకు ఆడేప్పుడు మ్యాక్స్‌వెల్ మరింత అంకితభావంతో ఆడి చెలరేగుతాడు. ఈ ఏడాది టీ20ల్లో ప్రదర్శనలే ఇందుకు ఉదాహరణ. ఈ యేడు అతను ఆసీస్ తరఫున 8 టీ20 ఇన్నింగ్స్‌లు ఆడి 174.2 స్ట్రయిక్‌రేట్‌తో 169 పరుగులు చేశాడు.మ్యాక్స్‌వెల్ తన సొంత దేశం తరఫున ఎలా ఆడినా.. భారత అభిమానులకు పోయేదేమీ లేదు. అయితే దేశం తరఫున ఆడేప్పుడు చూపే అంకితభావాన్ని ఐపీఎల్‌ల్లోనూ కనబర్చాలని వారు ఆశిస్తున్నారు. ఏ ఫ్రాంచైజీ అయినా ఆటగాళ్లను భారీ అంచనాలు పెట్టుకునే కొనుగోలు చేస్తుంది. అలాంటప్పుడు ఆటగాళ్లు తమపై పెట్టిన పెట్టుబడికి న్యాయం చేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించాలి.అయితే మ్యాక్సీ మాత్రం అలా చేస్తున్నట్లు కనిపిండం లేదు. ఏదో హాలిడే ఎంజాయ్ చేసేందుకు భారత్‌కు వస్తున్నాడా అనిపిస్తుంది. అతను పెళ్లి చేసుకుంది కూడా ఇక్కడే కాబట్టి, అత్తగారింటికి చుట్టపు చూపుకు వచ్చినట్లు వచ్చిపోతున్నాడు. ఐపీఎల్ ఆరంభంలో మ్యాక్సీలో కనిపించిన కమిట్మెంట్ ఇటీవలకాలంలో కనిపించడం లేదు. పంజాబ్‌కు ముందు ఆర్సీబీ తరఫున తరఫున కూడా వైఫల్యాల పరంపర కొనసాగించాడు. ఇది చూస్తే, చాలా మంది ఆసీస్ ఆటగాళ్ల లాగే మ్యాక్స్‌వెల్‌కు కూడా ఐపీఎల్ అంటే గిట్టదేమో అని అనిపిస్తుంది. -
నిబంధనల ప్రకారమే తీసుకున్నాం!
చెన్నై: దక్షిణాఫ్రికా సంచలన బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్‌ను ఐపీఎల్–2025 సీజన్ మధ్యలో జట్టులో తీసుకోవడం గురించి వివాదంపై చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) వివరణ ఇచ్చిoది. సీజన్ మధ్యలో గాయపడిన పేస్ బౌలర్ గుర్జప్నీత్ సింగ్ స్థానంలో అతను జట్టులోకి వచ్చాడు. దీని కోసం సీఎస్కే బ్రెవిస్‌కు రూ.2.20 కోట్లు చెల్లించింది. సీజన్ ఆరంభానికి ముుందు రూ.75 లక్షల కనీస విలువతో వచ్చిన బ్రెవిస్‌ను ఐపీఎల్ వేలంలో ఎవరూ తీసుకోలేదు. మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టి20లో బ్రెవిస్ 56 బంతుల్లోనే 125 పరుగులు బాది వార్తల్లో నిలిచాడు. ఈ నేపథ్యంలో సీఎస్కే టీమ్ సభ్యుడైన సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ చానల్లో బ్రెవిస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 6 మ్యాచ్‌లు ఆడిన బ్రెవిస్ 180 స్ట్రైక్‌రేట్‌తో 225 పరుగులు సాధించి చెన్నై గెలిచిన మ్యాచ్‌లలో కీలక పాత్ర పోషించాడు. ‘బ్రెవిస్ అద్భుతమైన బ్యాటర్. అయితే కనీస ధర ఎక్కువ కావడంతో అతడిని ఎవరూ తీసుకోలేదు. సీజన్ మధ్యలో ఏ జట్టయినా తీసుకుంటే అతని కనీస ధరనే చెల్లించాలి. కానీ నేను ఫలానా మొత్తం ఇస్తేనే వస్తానంటూ బ్రెవిస్ ఏజెంట్ల ద్వారా డిమాండ్ చేశాడు. అయినా సరే సీఎస్కే తీసుకుంది’ అని అన్నాడు. దీనిపై సీఎస్కే తాజాగా స్పందించింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారమే తాము బ్రెవిస్‌ను తీసుకున్నామని చెప్పింది. ‘గాయపడిన ఆటగాడి స్థానంలో ఎవరినైనా తీసుకుంటే ఆ ప్లేయర్‌కు ఇచ్చే మొత్తమే కొత్త ఆటగాడికి ఇవ్వాలని నిబంధనల్లో ఉంది. మేం దీనిని ఎక్కడా ఉల్లంఘించలేదు’ అని సీఎస్కే పేర్కొంది. వచ్చే సీజన్ కోసం చెన్నైను వీడేందుకు అశ్విన్ దాదాపుగా సిద్ధమైన తరుణంలో ఇది చర్చనీయాంశమైంది. -
ఐపీఎల్లో హిట్టు.. డీపీఎల్‌లో ఫట్టు.. అతడు మాత్రం అలా కాదు..!
గత ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున సంచలన ప్రదర్శనలు చేసి వెలుగులోకి వచ్చిన ఢిల్లీ మిస్టరీ స్పిన్నర్ దిగ్వేశ్ సింగ్ రాఠీ.. ప్రస్తుతం జరుగుతున్న ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతున్నాడు. రాఠీ ఈ డీపీఎల్ సీజన్లో వరుసగా 4 మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేక ఉసూరుమనిపించాడు. పైగా 10 ఎకానమీ రేట్‌కు తగ్గకుండా పరుగులు సమర్పించుకుని ప్రత్యర్థి బ్యాటర్లు పండుగ చేసుకునేలా చేశాడు.ఐపీఎల్ 2025లో ఆకట్టుకునే ఎకానమీతో (8.25) బౌలింగ్ చేసి 14 వికెట్లు (13 మ్యాచ్‌ల్లో) తీసిన రాఠీపై డీపీఎల్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ లీగ్‌లో అతను సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ తరఫున ఆడుతున్నాడు. రాఠీ న్యూఢిల్లీ టైగర్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో తొలి రెండు ఓవర్లలో కేవలం 9 పరుగులే ఇచ్చి గాడిలో పడినట్లు కనిపించాడు. అయితే చివరి రెండు ఓవర్లలో ఏకంగా 24 పరుగులిచ్చి మళ్లీ మొదటికొచ్చాడు.ఎన్నో ఆశలు పెట్టుకున్న రాఠీ వరుసగా వైఫల్యాలు చెందుతుండటంతో అతని జట్టు సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ ఆడిన 5 మ్యాచ్‌ల్లో నాలుగింట ఓడింది. రాఠీ మున్ముందు జరిగే మ్యాచ్‌ల్లో రాణిస్తేనే సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ నాకౌట్ చేరే అవకాశం ఉంటుంది. గత సీజన్లో రాఠీ ప్రదర్శన ప్రస్తుత సీజన్‌కు భిన్నంగా ఉంది. 2024 సీజన్లో అతను 10 మ్యాచ్‌ల్లో కేవలం 7.83 ఎకానమీ రేట్‌తో 14 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శన కారణంగానే రాఠీకి ఐపీఎల్ నుంచి పిలుపు వచ్చింది. ఐపీఎల్లో తన అరంగేట్రం సీజన్లోనే రాఠీ ఆకట్టుకున్నాడు. నాణ్యమైన స్పిన్ బౌలింగ్‌తో పాటు నోట్ బుక్ సెలబ్రేషన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు.రాఠీకి భిన్నంగా ప్రియాంశ్ ఆర్యప్రస్తుత డీపీఎల్ సీజన్లో మరో ఐపీఎల్ స్టార్ ప్రియాంశ్ ఆర్య (ఔటర్ ఢిల్లీ) తొలుత నిరాశపరిచినా, ఆతర్వాత గాడిలో పడ్డాడు. ఈ సీజన్లో తొలి మూడు మ్యాచ్‌ల్లో సామర్థ్యం మేరకు రాణించలేకపోయిన ఆర్య.. ఈస్ట్ ఢిల్లీ రైడర్స్‌తో జరిగిన నాలుగో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆ మ్యాచ్‌లో కేవలం 56 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 111 పరుగులు చేశాడు.ఆర్య గత డీపీఎల్ సీజన్లోనూ ఇలాంటి విధ్వంసకర శతకాలు బాది ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అనంతరం ఐపీఎల్‌లోనూ పంజాబ్ కింగ్స్ తరఫున అంచనాలకు మించి రాణించాడు. సీఎస్కేతో మ్యాచ్‌లో 39 బంతుల్లోనే శతక్కొట్టిన ఆర్య.. సీజన్ మొత్తం నిలకడగా మెరుపులు మెరిపించి (17 మ్యాచ్‌ల్లో 179.25 స్ట్రయిక్‌రేట్‌తో 475 పరుగులు) పంజాబ్‌ను ఫైనల్స్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. -
చెన్నైతో అశ్విన్ కటీఫ్!
చెన్నై: సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్–2026కు ముందు కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. తన సొంత జట్టులాంటి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) నుంచి అతను తప్పుకోవాలనే యోచనలో ఉన్నాడు. ఈ విషయాన్ని అతను సీఎస్కే మేనేజ్మెంట్తో ఇప్పటికే చర్చించాడు. ఆటగాళ్లను అట్టిపెట్టుకునే కటాఫ్ తేదీకి ముందు సాధారణంగా అన్ని జట్లూ తమ ఆటగాళ్లతో భేటీ అవుతాయి. ఇందులో భాగంగానే జరిగిన సమావేశంలో అశ్విన్ తన మనసులో మాటను చెప్పాడు. అతని నిర్ణయం వెనుక కారణాలు తెలియకపోయినా... త్వరలోనే దీనిపై సీఎస్కే స్పష్టతనివ్వనుంది. మరో సమాచారం ప్రకారం వచ్చే ఏడాది కోసం జట్టు పునర్నిర్మాణంలో భాగంగా అశ్విన్‌ను తప్పించాలని మేనేజ్మెంట్ స్వయంగా భావిస్తోంది. దీంతో అశ్విన్ కూడా మరో జట్టు వైపు చూస్తున్నాడు. ‘కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ ఇంట్రస్ట్’ సమస్య రాకూడదని సీఎస్కే ఆధ్వర్యంలోని అకాడమీ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ పదవికి కూడా అశ్విన్ రాజీనామా చేసే అవకాశం ఉంది. 2025 సీజన్లో చెత్త ప్రదర్శనతో చెన్నై చివరి స్థానంలో నిలిచింది. 9 మ్యాచ్‌లే ఆడిన అశ్విన్ ఏకంగా 9.12 ఎకానమీతో 7 వికెట్లే తీయగలిగాడు. సీఎస్కే దిద్దిన స్టార్... చెన్నై సూపర్ కింగ్స్ అతి పెద్ద మ్యాచ్ విన్నర్లలో ఒకడిగా అశ్విన్ గుర్తింపు పొందాడు. తొలిసారి అతను 2009లో సీఎస్కే టీమ్ ద్వారానే లీగ్‌లో అడుగు పెట్టాడు. రెండు సీజన్లు నిలకడైన ప్రదర్శన, ధోని అండతో అతనికి భారత జట్టులో స్థానం దక్కింది. 2010, 2011లో సీఎస్కే టైటిల్స్ సాధించడంలో అతను కీలకపాత్ర పోషించాడు. వరుసగా ఏడేళ్ల పాటు 2015 వరకు చెన్నైకి ఆడిన అనంతరం ఆ తర్వాత ఎనిమిది సీజన్లు వరుసగా రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లకు అశ్విన్ ప్రాతినిధ్యం వహించాడు. 2025 వేలంలో రూ.9 కోట్ల 75 లక్షల మొత్తానికి చెన్నై అతడిని మళ్లీ సొంతం చేసుకుంది. సూపర్ కింగ్స్ తరఫున 106 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 6.68 ఎకానమీతో 97 వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా ఐపీఎల్లో అతను 221 మ్యాచ్‌లలో 7.20 ఎకానమీతో 187 వికెట్లు పడగొట్టాడు. 39 ఏళ్ల అశ్విన్ గత డిసెంబర్లో ఆ్రస్టేలియాపై అడిలైడ్‌తో టెస్టు మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. -
IPL 2026: మరో ప్రియాంశ్ ఆర్య లోడింగ్..!
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ అరంగేట్రం ఎడిషన్ (2024) ప్రియాంశ్ ఆర్య లాంటి విధ్వంసకర బ్యాటర్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ సీజన్లో ప్రియాంశ్ మెరుపులు ఆకాశాన్ని తాకాయి. ఫలితంగా అతనికి ఐపీఎల్ ఆఫర్ వచ్చింది.ప్రియాంశ్ డీపీఎల్ 2024లో 198.69 స్ట్రయిక్‌రేట్‌తో 67.56 సగటున 2 విధ్వంసకర సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 608 పరుగులు చేశాడు. ఓ మ్యాచ్‌లో ప్రియాంశ్ 6 బంతుల్లో 6 సిక్సర్లు బాది, 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ ప్రదర్శన తర్వాతే ప్రియాంశ్ వెలుగులోకి వచ్చాడు.ఆతర్వాత ప్రియాంశ్ ఐపీఎల్ 2025లో ఏం చేశాడో అందరం చూశాం. సీఎస్కేతో మ్యాచ్‌లో 39 బంతుల్లోనే శతక్కొట్టిన అతను.. సీజన్ మొత్తం నిలకడగా మెరుపులు మెరిపించి (17 మ్యాచ్‌ల్లో 179.25 స్ట్రయిక్‌రేట్‌తో 475 పరుగులు) తన జట్టును (పంజాబ్ కింగ్స్) ఫైనల్స్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. తాజాగా ప్రియాంశ్ లాగే మరో ఆటగాడు ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో మెరుపులు మెరిపిస్తూ ఐపీఎల్వైపు దూసుకొస్తున్నాడు. వెస్ట్ ఢిల్లీ లయన్స్‌కు చెందిన ఆయుశ్ దొసేజా నిన్న (ఆగస్ట్ 7) పురానీ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 52 బంతుల్లో శతక్కొట్టి ప్రియాంశ్ ఆర్యను గుర్తు చేశాడు. దీనికి ముందు మ్యాచ్‌లో కూడా దొసేజా విధ్వంసం సృష్టించాడు. ఈస్ట్ ఢిల్లీ రైడర్స్‌పై 48 బంతుల్లో అజేయమైన 84 పరుగులు చేశాడు.దొసేజా దూకుడు చూస్తుంటే అందరికీ ప్రియాంశ్ ఆర్యనే గుర్తుకు వస్తున్నాడు. అతను ఈ సీజన్లో ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే ఐపీఎల్ 2026 వేలంలో హాట్ పిక్ అవుతాడు. దొసేజా ప్రదర్శనలు చూసి భారత క్రికెట్ అభిమానులు మరో ప్రియాంశ్ ఆర్య లోడింగ్ అంటూ చర్చించుకుంటున్నారు. దొసేజా ఓ పక్క చెలరేగుతుంటే డీపీఎల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంశ్ ఆర్య మాత్రం ఈ సీజన్లో నిరాశపరుస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. -
‘నేను వెళ్లిపోతా...వదిలేయండి’
జైపూర్: ఐపీఎల్ జట్టు రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సామ్సన్‌కు, టీమ్ యాజమాన్యానికి మధ్య విభేదాలు ఉన్నట్లు తాజా పరిణామంతో స్పష్టమైంది. రాజస్తాన్ టీమ్‌లో సుదీర్ఘ కాలంగా భాగమైన సంజు సామ్సన్ జట్టు నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యాడు. ఐపీఎల్–2026 సీజన్‌కు ముందు తనను విడుదల చేయాలని అతను ఫ్రాంచైజీని కోరినట్లు సమాచారం. నిజానికి ఈ ఏడాది లీగ్ ముగియగానే సామ్సన్ తన మనసులో మాటకు మేనేజ్మెంట్కు వెల్లడించాడు. అయితే దీనిపై రాయల్స్ యాజమాన్యం ఇంకా స్పందించలేదు.2025లో రూ.18 కోట్లతో సామ్సన్ను జట్టు అట్టి పెట్టుకుంది. అయితే గాయం కారణంగా సామ్సన్ 9 మ్యాచ్‌లే ఆడాడు. 14 మ్యాచ్‌లలో 4 మాత్రమే గెలిచిన రాయల్స్ 9వ స్థానంతో ముగించింది. తాను కోలుకున్నా రియాన్ పరాగ్‌కే కెపె్టన్సీ కొనసాగించడంతో పాటు సీజన్‌కు ముందు జోస్ బట్లర్‌ను టీమ్ వదిలేసుకోవడంపై కూడా యాజమాన్యంతో సామ్సన్‌కు విభేదాలు వచ్చాయి. 2013 నుంచి 2015 వరకు రాజస్తాన్ తరఫున ఆడిన సంజు ఆ తర్వాత రెండు సీజన్లు ఢిల్లీకి ఆడి 2018లో మళ్లీ రాయల్స్‌కే వచ్చాడు. 2021లో అతనికి కెప్టెన్సీ ఇవ్వగా తర్వాతి ఏడాదే జట్టు ఫైనల్‌కు కూడా చేరింది. మొత్తం జట్టు తరఫున 11 సీజన్లలో కలిపి అతను 149 మ్యాచ్‌లు ఆడి 4027 పరుగులు చేశాడు. -
ప్రీతి జింటా జట్టుకు కొత్త కెప్టెన్
కరీబియన్ ప్రీమియర్ లీగ్-2025 సీజన్ ప్రారంభానికి ముందు సెయింట్ లూసియా కింగ్స్ కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసుకుంది. గత సీజన్లో కింగ్స్‌ను ఛాంపియన్‌గా నిలిపిన ఫాఫ్ డుప్లెసిస్ వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు. దీంతో కింగ్స్ మేనేజ్మెంట్ నమీబియా వెటరన్ ఆల్‌రౌండర్ డేవిడ్ వీస్‌ను కొత్త కెప్టెన్‌గా ప్రకటించింది. వీస్ 2021 ఎడిషన్ నుంచి కింగ్స్‌లో సభ్యుడిగా ఉన్నాడు. అతను ఈ ఫ్రాంచైజీ తరఫున 26 మ్యాచ్‌ల్లో 36 వికెట్లు తీసి, 338 పరుగులు చేశాడు.ఈ సీజన్‌కు ముందు కింగ్స్ టిమ్ డేవిడ్, తబ్రేజ్ షంషి లాంటి స్టార్ ప్లేయర్లను రీటైన్ చేసుకుంది. అలాగే మీకా మెకెంజీ, జావెల్ గ్లెన్ లాంటి కొత్త ముఖాలను జట్టులో చేర్చుకుంది. గత సీజన్ ఫైనల్లో కింగ్స్ నాటి డిఫెండింగ్ ఛాంపియన్ గయనా అమెజాన్ వారియర్స్‌ను మట్టికరిపించి ఛాంపియన్‌గా అవతరించింది.ఈ సీజన్ సీపీఎల్ ఆగస్ట్ 14 నుంచి ప్రారంభం కానుంది. లూసియా కింగ్స్ ఆగస్ట్ 17న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ మ్యాచ్‌లో కింగ్స్ ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్‌తో తలపడనుంది.కాగా, సెయింట్ లూసియా కింగ్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన పంజాబ్ కింగ్స్ యాజమాన్యం అండర్లో నడుస్తుంది. లూసియా కింగ్స్‌కు బాలీవుడ్ నటి ప్రీతి జింటా సహ యజమానిగా వ్యవహరిస్తుంది.సెయింట్ లూసియా కింగ్స్ స్క్వాడ్ : టిమ్ డేవిడ్, అల్జరి జోసఫ్, జాన్సన్ చార్లెస్, టిమ్ సీఫెర్ట్, రోస్టన్ చేజ్, తబ్రైజ్ షంషి, డేవిడ్ వీస్ (కెప్టెన్), డెలానో పోట్గీటర్, మాథ్యూ ఫోర్డ్, ఆరోన్ జోన్స్, ఖారీ పియరీ, జావెల్లె గ్లెన్, మికా మెకెంజీ, షడ్రక్ డెస్కార్టే, జోహన్ జెరెమియా, కియోన్ గాస్టన్, అకీమ్ అగస్టే -
విజృంభించిన ఆర్సీబీ స్టార్ స్పిన్నర్.. మరోసారి విఫలమైన ప్రియాంశ్ ఆర్మ
ఆర్సీబీ స్టార్ స్పిన్నర్ సుయాశ్ శర్మ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ఆరో మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. ఈ టోర్నీలో ఔటర్ ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న సుయాశ్.. నిన్న (ఆగస్ట్ 5) పురానీ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లతో విజృంభించాడు. తన జట్టు 149 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో సుయాశ్ మ్యాజిక్ చేశాడు. 4 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఫలితంగా అతని జట్టు ప్రత్యర్థిని 14.3 ఓవర్లలో 66 పరుగులకే ఆలౌట్ చేసింది. పురానీ ఢిల్లీ పతనాన్ని శాశించడంలో సుయాశ్‌కు శౌర్య మాలిక్ (3-0-10-3) జత కలిశాడు. శివమ్ శర్మ, హర్ష్ త్యాగి తలో వికెట్ తీశారు. పురానీ ఢిల్లీ ఇన్నింగ్స్‌లో సమర్థ్ సేథ్ (18), లలిత్ యాదవ్ (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.అంతకుముందు ఔటర్ ఢిల్లీ.. ఉధవ్ మోహన్ (4-0-26-5) విజృంభించడంతో 148 పరుగులకే పరిమితమైంది. ఉధవ్ మోహన్‌తో పాటు రజ్నీశ్ దాదర్ (4-0-22-2), పర్దీప్ పరాషార్ (3-0-11-2) రాణించారు. ఔటర్ ఢిల్లీ ఇన్నింగ్స్‌లో సనత్ సాంగ్వాన్ (26) టాప్ స్కోరర్‌గా నిలువగా.. సిద్దాంత్ శర్మ (21), వరున్ యాదవ్ (18), ధృవ్ సింగ్ (19), హర్ష్ త్యాగి (17) రెండంకెల స్కోర్లు చేశారు. ఐపీఎల్ సంచలనం, పంజాబ్ కింగ్స్ విధ్వంసకర ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (16) వరుసగా రెండో మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఈ లీగ్ తొలి మ్యాచ్‌లో ఆర్మ 26 పరుగులకే పరిమితమయ్యాడు.వాస్తవానికి డీపీఎల్ 2025 ప్రారంభానికి ముందు నుంచి ప్రియాంశ్ ఆర్మపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ లీగ్ ఇనాగురల్ ఎడిషన్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడిన ఆర్య మరోసారి సీన్ రిపీట్ చేస్తాడని అంతా ఆశించారు. డీపీఎల్ అరంగేట్రం సీజన్లో ఆర్య 67.56 సగటున, 198.69 స్ట్రయిక్‌రేట్‌తో 608 పరుగులు చేసి వెలుగులోకి వచ్చాడు. ప్రియాంశ్ ఓ మ్యాచ్‌లో 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదాడు. అలాగే 50 బంతుల్లో 120 పరుగులు చేశాడు.ఆర్య ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్లో 17 మ్యాచ్‌లు ఆడి సెంచరీ, 2 అర్ద సెంచరీల సాయంతో 179.24 స్ట్రయిక్‌రేట్‌తో 475 పరుగులు చేసి పంజాబ్ ఫైనల్స్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు. -
హండ్రెడ్ లీగ్‌లో ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఇవే..!
ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రైవేట్ క్రికెట్ లీగ్ ప్రారంభమైన ఐపీఎల్ ఫ్రాంచైజీల ఓనర్లు అక్కడ వాలిపోతారు. ప్రస్తుతం వరల్డ్‌లో సూపర్ హిట్ అయిన ప్రతి లీగ్‌లోనూ ఐపీఎల్ ఫ్రాంచైజీల ఓనర్లు పాతుకుపోయారు. వెస్టిండీస్‌లో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్, యూఏఈలో జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్, సౌతాఫ్రికాలో జరిగే సౌతాఫ్రికా టీ20 లీగ్, అమెరికాలో జరిగే మేజర్ లీగ్ క్రికెట్.. ఇలా మెజార్టీ శాతం క్రికెట్ లీగ్‌ల్లో ఐపీఎల్ ఫ్రాంచైజీల ఓనర్ల హవా నడుస్తుంది.తాజాగా ఐపీఎల్ ఫ్రాంచైజీల ఓనర్లు ఇంగ్లండ్‌లో జరిగే హండ్రెడ్ లీగ్‌లోనూ కాలు మోపారు. ఈ లీగ్‌లో వారు ఏకంగా నాలుగు ఫ్రాంచైజీలను కొనుగోలు చేశారు. ఇవాల్టి నుంచి (ఆగస్ట్ 5) హండ్రెడ్ లీగ్ ఐదో ఎడిషన్ ప్రారంభం కానుండగా.. ఏ ఫ్రాంచైజీలను ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీల ఓనర్లు కొనుగోలు చేశారో ఓ లుక్కేద్దాం.ఓవల్ ఇన్విన్సిబుల్స్: ఈ ఫ్రాంచైజీని ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. ఇన్విన్సిబుల్స్లోని 49 శాతం వాటాను ముకేశ్ అంబానీ సామ్రాజ్యం రిలయన్స్ ఇండస్ట్రీస్ దక్కించుకుంది. మిగతా 51 శాతం వాటాను సర్రే కౌంటీ క్లబ్ తమ వద్దనే ఉంచుకుంది. ఈ లీగ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఇన్విన్సిబుల్స్‌కు సామ్ కర్రన్ నాయకత్వం వహించనున్నాడు.సథరన్ బ్రేవ్: ఈ ఫ్రాంచైజీని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యమైన జీఎంఆర్ గ్రూప్ దక్కించుకుంది. ఇందులో 49 శాతం వాటాను డీసీ మేనేజ్మెంట్ సొంతం చేసుకుంది. మిగతా 51 శాతం వాటాను హ్యాంప్‌షైర్ కౌంటీ క్లబ్ రీటైన్ చేసుకుంది. ఈ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా జేమ్స్ విన్స్ వ్యవహరిస్తాడు.నార్త్రన్ సూపర్ ఛార్జర్స్: ఈ ఫ్రాంచైజీని సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం అయిన సన్ గ్రూప్ కొనుగోలు చేసింది. ఈ ఫ్రాంచైజీలో మొత్తం వాటాను కావ్యా మారన్ సంస్థ రూ. 1,094 కోట్లకు చేజిక్కించుకుంది. ఈ జట్టుకు ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ నాయకత్వం వహిస్తున్నాడు. జట్టులో డేవిడ్ మిల్లర్, డేవిడ్ మలాన్ లాంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు.మాంచెస్టర్ ఒరిజినల్స్: ఈ ఫ్రాంచైజీని లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గొయెంకా కొనుగోలు చేశాడు. అతని నేతృత్వంలోని ఆర్పీఎస్జీ గ్రూప్ మాంచెస్టర్ ఒరిజినల్స్లోని 70 శాతం వాటాను దక్కించుకుంది. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఫిల్ సాల్ట్ వ్యవహరిస్తాడు. -
కావ్యా మారన్ జట్టులో పాక్ ఆటగాళ్లు.. వివాదంలో ఎస్ఆర్హెచ్ ఓనర్
కావ్యా మారన్ నేతృత్వంలోని సన్ గ్రూప్ ఇంగ్లండ్ వేదికగా జరిగే ద హండ్రెడ్ లీగ్‌లో నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ అనే ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. ఈ ఫ్రాంచైజీలో మొత్తం వాటాను సన్ గ్రూప్ రూ. 1,094 కోట్లకు చేజిక్కించుకుంది. హండ్రెడ్ లీగ్‌లోని 8 ఫ్రాంచైజీల్లో నాలుగింటిని భారత కంపెనీలు (ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లు కూడా) కొనుగోలు చేయగా.. మరో రెండు ఫ్రాంచైజీలను భారతీయ-అమెరికన్ పెట్టుబడిదారులు సొంతం చేసుకున్నారు.ఇంతవరకు అంతా బాగానే ఉంది. ఇవాల్టి నుంచి (ఆగస్ట్ 5) ప్రారంభం కాబోయే 2025 సీజన్ కోసం కావ్యా మారన్ ఓనర్షిప్లోని నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ ఇద్దరు పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడంతో వివాదం మొదలైంది. నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ బెన్ డ్వార్షుయిస్ (ఆస్ట్రేలియా), మిచెల్ సాంట్నర్‌కు (న్యూజిలాండ్) ప్రత్యామ్నాయంగా పాక్ మాజీలు మొహమ్మద్ ఆమిర్, ఇమాద్ వసీంలను ఎంపిక చేసుకొని భారత అభిమానులచే సోషల్‌మీడియా వేదికగా ట్రోలింగ్‌ను ఎదుర్కొంటుంది.ఈ సీజన్‌కు ముందు మెజార్టీ శాతం ఫ్రాంచైజీలను భారత ఇన్వెస్టర్లు చేజిక్కించుకోవడంతో వేలంలో ఏ పాకిస్తాన్ ఆటగాడికి అవకాశం దక్కలేదు. ఫ్రాంచైజీలు పరోక్షంగా పాక్ ఆటగాళ్లను బ్యాన్ చేశాయి. అయితే మధ్యలో నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ పాక్ ఆటగాళ్లను అక్కున చేర్చుకోవడంతో భారతీయులు మండిపడుతున్నారు.పహల్లాం దాడి తర్వాత పాక్‌తో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ అన్ని క్రీడా విభాగాల్లో దాయాదిని బ్యాన్ చేసింది. ఇటీవల ఇంగ్లండ్‌లో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలోనూ గ్రూప్ దశ, సెమీస్‌లో మ్యాచ్‌లను బాయ్‌కాట్ చేసింది.ఇలాంటి పరిస్థితుల్లో కావ్యా మారన్ జట్టు పాక్ ఆటగాళ్లను అక్కున చేర్చుకోవడం భారతీయులకు అస్సలు నచ్చడం లేదు. భారతీయ పెట్టుబడి దారులు లేదా ఐపీఎల్ ఓనర్లు కొనుగోలు చేసిన వేర్వేరు లీగ్ల్లోని ఏ ఫ్రాంచైజీలో కూడా పాక్ ఆటగాళ్లకు ప్రవేశం లేదు. ఐపీఎల్ ఓనర్లు కొనుగోలు చేసిన సౌతాఫ్రికా టీ20 లీగ్ ఫ్రాంచైజీల్లో అయితే పాక్ ఆటగాళ్ల ఊసే లేదు.కావ్యా మారన్ పాక్ ఆటగాళ్లను జట్టులో చేర్చుకొని పెద్ద తప్పే చేసిందని భారతీయులు అంటున్నారు. ఈ సీజన్లో నార్త్రన్ సూపర్ ఛార్జర్స్‌కు ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ నాయకత్వం వహిస్తున్నాడు. జట్టులో డేవిడ్ మిల్లర్, డేవిడ్ మలాన్ లాంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. ఈ సీజన్లో నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ ఆగస్ట్ 7న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. -
‘హండ్రెడ్’లో ఐపీఎల్ ఫ్రాంచైజీల హవా
లండన్: ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్వహిస్తున్న ‘హండ్రెడ్’ లీగ్‌లోని ఎనిమిది జట్లలో వాటాల అమ్మకం దాదాపుగా పూర్తయింది. ఆరు జట్లకు సంబంధించి ఒప్పందాలు అధికారికంగా ఖాయం అయ్యాయని, మరో రెండు జట్ల విషయంలో చర్చలు తుది దశలో ఉన్నాయని ఈసీబీ ప్రకటించింది.ఈ రెండు జట్లకు సంబంధించి కూడా కొన్ని చిన్న సాంకేతిక అంశాలు మాత్రమే మిగిలి ఉన్నాయని, త్వరలోనే ఇది కూడా పూర్తవుతుందని బోర్డు వెల్లడించింది. ఈ ఎనిమిది టీమ్‌లలో నాలుగు టీమ్‌లను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో జట్లు ఉన్న యాజమాన్యాలే సొంతం చేసుకోవడం విశేషం. టి20 క్రికెట్ నుంచి స్వల్ప మార్పులతో 100 బంతులు ఆడే విధంగా 2021లో ప్రారంభమైన ‘హండ్రెడ్’ లీగ్ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటూ నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు నేరుగా ఈసీబీ ఈ టోర్నీఎనిమిది జట్ల నిర్వహణను పర్యవేక్షిస్తుండగా...ఒప్పందాలు పూర్తయిన తర్వాత అక్టోబర్ 1 నుంచి ఆయా ఫ్రాంచైజీ యజమాన్యాలు నడిపించుకునే విధంగా హక్కులు అందిస్తారు.అయితే అంతకు ముందే ఆగస్టు 5 నుంచి 31 వరకు జరిగే 2025 సీజన్‌ను కూడా ఈసీబీనే నిర్వహిస్తుంది. ‘హండ్రెడ్’లో ఉన్న జట్లలో నార్తర్న్ సూపర్ చార్జర్స్‌ను 100 శాతం వాటాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం సన్ గ్రూప్ సొంతం చేసుకోగా, లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ యజమాని సంజీవ్ గోయెంకా 70 శాతం వాటాతో మాంచెస్టర్ ఒరిజినల్స్‌ను దక్కించుకున్నారు.సదరన్ బ్రేవ్ టీమ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం జీఎంఆర్ గ్రూప్ 49 శాతం వాటాతో తీసుకోగా...ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ కూడా 49 శాతం వాటాతో ఓవల్ ఇన్విన్సిబుల్స్లో భాగస్వామిగా మారింది. అయితే ఇంకా రిలయన్స్–ఓవల్ ఒప్పందం అధికారికంగా ఖాయం కాలేదు.ఇదే తరహాలో ట్రెంట్ రాకెట్స్ జట్టుకు సంబంధించి కెయిన్ ఇంటర్నేషనల్ కంపెనీ ఒప్పందం కూడా ఇంకా పూర్తి కాలేదు. మరో వైపు బర్మింగ్‌హామ్ ఫోనిక్స్ టీమ్‌కు నైట్‌హెడ్ క్యాపిటల్ సంస్థ, లండన్ స్పిరిట్ టీమ్‌లో క్రికెట్ ఇన్వెస్టర్ హోల్డింగ్స్ లిమిటెడ్, వెల్ష్ ఫైర్ టీమ్‌లో సంజయ్ గోవిల్ ప్రధాన వాటాదారులుగా ఉన్నారు. ‘హండ్రెడ్’లో ఎనిమిది జట్ల కోసం బయటి వ్యక్తులను భాగస్వాములుగా చేసుకోవడంలో ఈసీబీలో 500 మిలియన్ పౌండ్లు (సుమారు రూ.5,800 కోట్లు) పెట్టుబడుల రూపంలో వచ్చాయి. -
IPL: కేకేఆర్‌కు సంబంధించి బిగ్ న్యూస్
ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. తమ ఫ్రాంచైజీ నుంచి హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ తప్పుకున్నాడని కేకేఆర్ యాజమాన్యం ట్విటర్ వేదికగా ప్రకటించింది.పండిట్ కొత్త అవకాశాలను అన్వేషించాలని నిర్ణయించుకున్నారు. ఇకపై అతను కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రధాన కోచ్‌గా కొనసాగరు. అతని అమూల్యమైన సహాయ సహకారాలకు కృతజ్ఞతలు. 2024 ఎడిషన్‌లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలపడంలో కీలకపాత్ర పోషించడంతో పాటు బలమైన, దృఢమైన జట్టును నిర్మించడంలో సహాయపడినందుకు అతనికి ధన్యవాదాలు. అతని నాయకత్వం మరియు క్రమశిక్షణ జట్టుపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి. భవిష్యత్తు కోసం అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అంటూ కేకేఆర్ యాజమాన్యం తమ ట్విటర్ మెసేజ్‌లో పేర్కొంది.కాగా, పండిట్ 2024 ఎడిషన్‌లో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడంతో కీలకపాత్ర పోషించాడు. అయితే గత సీజన్లో అతని ఆథ్వర్యంలో కేకేఆర్ పేలవ ప్రదర్శనలు చేసి ఎనిమిదో స్థానంలో (14 మ్యాచ్‌ల్లో కేవలం 5 విజయాలు) నిలిచింది. అప్పటి నుంచి కేకేఆర్ యాజమాన్యం పండిట్‌పై అసంతృప్తిగా ఉంది. తాజాగా పండిట్ హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నట్లు యాజమాన్యమే ముందుగా ప్రకటన చేసింది.పండిట్ 2022 ఆగస్ట్‌లో కేకేఆర్ హెడ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. నాటి కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ ఇంగ్లండ్ టెస్ట్ జట్టు ప్రధాన కోచ్ ఎంపిక కావడంతో కేకేఆర్ హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు. పండిట్ ఆధ్వర్యంలో కేకేఆర్ 3 సీజన్లలో 42 మ్యాచ్‌లు ఆడి 22 మ్యాచ్‌ల్లో గెలిచి, 18 మ్యాచ్‌ల్లో ఓడింది. 2 మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు.బౌలింగ్ కోచ్ కూడా తప్పుకున్నాడు..కేకేఆర్ యాజమాన్యం హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్‌తో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కూడా తప్పించినట్లు తెలుస్తుంది. భరత్ అరుణ్ త్వరలో చెన్నై సూపర్‌కింగ్స్ బౌలింగ్ కోచ్‌గా జాయిన్ అవుతాడని సమాచారం. అరుణ్ 2014-2021 వరకు టీమిండియా బౌలింగ్ కోచ్‌గా అందరికీ సుపరిచితుడు. -
ICC: చాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీకి గ్రీన్ సిగ్నల్!
దాదాపు దశాబ్దం క్రితం రద్దయిన చాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీ (Champions League T20)ని మళ్లీ ప్రారంభించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) యోచిస్తోంది. దీనిని సమర్థవంతంగా నిర్వహించేందుకుకొత్తగా ప్రణాళికలు రూపొందించేందుకు సిద్ధమైంది. సింగపూర్‌లో జరిగిన ఐసీసీ సమావేశంలో చాంపియన్స్ లీగ్‌పై వచ్చిన ప్రతిపాదనకు అన్ని బోర్డులూ మద్దతు పలికినట్లు సమాచారం.అందుకే పక్కన పెట్టారుకాగా వేర్వేరు దేశాలకు చెందిన క్లబ్ టీమ్‌లు బరిలోకి దిగుతూ 2009–2014 మధ్య నిర్వహించిన ఈ టోర్నీని పలు కారణాలతో రద్దు చేశారు. ఐపీఎల్‌లాంటి టోర్నీలతో పోలిస్తే ప్రేక్షకాదరణ చాలా తక్కువగా ఉండటంతో పాటు వాణిజ్యపరంగా కూడా సరైన స్పందన లభించకపోవడంతో లీగ్‌ను పక్కన పెట్టాల్సి వచ్చింది.అంత ఈజీ ఏం కాదుఅయితే ఇప్పుడు కూడా దీనిని నిర్వహించడం అంత సులువు కాకపోవచ్చు. టీ20 స్టార్ ఆటగాళ్లంతా ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు జట్ల తరఫున ఆడుతున్నారు. చాంపియన్స్ లీగ్ జరిగితే వారు ఏ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తారనే విషయంలో నిర్ణయం తీసుకోవడం అంత సులువు కాదు.మరోవైపు టెస్టు క్రికెట్‌ను రెండు వేర్వేరు స్థాయిల్లో (2 టియర్ సిస్టం) నిర్వహించాలనే ఆలోచనతో ఉన్న ఐసీసీ దీనిపై సాధ్యాసాధ్యాల కోసం ప్రత్యేకంగా వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఎనిమిది మంది సభ్యుల ఈ కమిటీకి ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా నాయకత్వం వహిస్తారు. చాంపియన్స్ లీగ్ టీ20 (2009-2014) విజేతల జాబితా ఇదే👉2009- న్యూ సౌత్ వేల్స్ బ్లూస్- కెప్టెన్ సైమన్ కటిచ్ (బిగ్‌బాష్ లీగ్)👉2010- చెన్నై సూపర్ కింగ్స్- కెప్టెన్ ఎంఎస్ ధోని (ఐపీఎల్)👉2011- ముంబై ఇండియన్స్- కెప్టెన్ హర్భజన్ సింగ్(ఐపీఎల్)👉2012- సిడ్నీ సిక్సర్స్- కెప్టెన్ బ్రాడ్ హాడిన్ (బిగ్‌బాష్ లీగ్)👉2013- ముంబై ఇండియన్స్- కెప్టెన్ రోహిత్ శర్మ (ఐపీఎల్)👉2014- చెన్నై సూపర్ కింగ్స్- కెప్టెన్ ఎంఎస్ ధోని (ఐపీఎల్).చదవండి: IND vs ENG: కరుణ్‌పై వేటు.. అతడి అరంగేట్రం?.. తుదిజట్టు ఇదే! -
BCCI: క్రికెట్ ఒక్కటేనా?.. అదో పెద్ద సామ్రాజ్యం! ఆర్థిక వనరులు ఇవే..
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రపంచ క్రికెట్లో పెద్దన్న పాత్ర పోషిస్తుంది. వరల్డ్‌లోనే సంపన్నమైన క్రికెట్ బోర్డుగా బీసీసీఐ ఖ్యాతి గడించింది. తాజాగా బీసీసీఐ మరోసారి సంపద సృష్టిలో చరిత్ర సృష్టించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి ( BCCI ) రికార్డు స్థాయిలో రూ.9,741.7 కోట్ల ఆదాయాన్ని సంపాదించినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలో భారత క్రికెట్ బోర్డుకు ఆదాయం వచ్చే మార్గాలపై ఓ లుక్కేద్దాం.ఐపీఎల్ బంగారు బాతు..భారత క్రికెట్ బోర్డుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) బంగారు బాతులా మారింది. 2007లో పురుడుపోసుకున్న ఐపీఎల్.. బీసీసీఐకి ప్రదాయ ఆదాయ వనరుగా ఉంది. తాజా నివేదిక ప్రకారం 2023-2024 సంవత్సరానికి గాను ఈ క్యాష్ రిచ్ లీగ్ నుంచి రూ. 5,761 కోట్లు బోర్డు ఖాతాలో చేరాయి.మీడియా హక్కులు, ఫ్రాంచైజీ ఫీజులు, స్పాన్సర్‌షిప్‌ల రూపంలో వచ్చాయి. బీసీసీఐ ఆర్జించిన మొత్తంలో 59 శాతంతో ఐపీఎల్ ప్రధాన వాటాదారుగా నిలిచింది. అదేవిధంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ద్వారా బీసీసీఐకి రూ.1042 కోట్లు(10.7%) వచ్చాయి.అంతేకాకుండా ఐపీఎల్ యేతర మీడియా హక్కుల(భారత అంతర్జాతీయ మ్యాచ్‌లు బ్రాడ్‌కాస్టింగ్) ద్వారా బోర్డు అదనంగా రూ. 813 కోట్లు సంపాదించింది. మరోవైపు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అరంగేట్ర సీజన్ ద్వారా బోర్డుకు రూ. 378 కోట్లు వచ్చాయి.భారత్ అంతర్జాతీయ పర్యటనలో టికెట్ అమ్మకాలు, స్పాన్సర్లు, లైసెన్సింగ్ ద్వారా 361 కోట్లు అదనంగా బీసీసీఐకి లభించాయి. స్టేడియంలో ప్రకటనలు, జరిమానాలు, ఇతర రుసుముల రూపంలో భారత క్రికెట్ బోర్డుకు 400 కోట్ల ఆదాయం సమకూరింది.వెయ్యి కోట్ల పైగా వడ్డీ..భారత క్రికెట్ బోర్డు దగ్గర దాదాపు రూ. 30 వేల కోట్లు రిజర్వ్‌లో ఉన్నాయి. దీని వల్ల ఏడాదికి రూ. 1,000 కోట్ల వడ్డీ వస్తున్నట్లు తెలుస్తోంది.బీసీసీఐకి ఖర్చు కూడా ఎక్కువే..భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదాయాన్ని సంపాదించడంలోనే కాదు ఖర్చు చేయడంలో మిగిలిన బోర్డులకంటే ముందు ఉంది. క్రికెట్ అభివృద్ది కోసం బీసీసీఐ ఖర్చు చేసే ఆంశాలను ఓసారి పరిశీలిద్దాం. ఆటగాళ్ల జీతాలు, మ్యాచ్ ఫీజులు, బోనస్‌లు కింద బీసీసీఐ ప్రతీ ఏటా రూ.250 కోట్ల పైగా ఖర్చుచేస్తోంది. అదేవిధంగా కోచింగ్ స్టాప్ జీతాల కోసం రూ.100 కోట్ల పైగా బీసీసీఐ వెచ్చిస్తోంది.అంతేకాకుండా స్టేట్ క్రికెట్ ఆసోయేషిన్‌లకు నిధుల రూపంలో రూ.1000 కోట్ల పైగా భారత క్రికెట్ బోర్డు ఖర్చుచేస్తోంది. మ్యాచ్‌లను నిర్వహించేందుకు రూ. 500 కోట్లు, మహిళల క్రికెట్ అభివృద్ది కోసం 150 కోట్లు బీసీసీఐ ప్రతీ ఊటా కేటాయిస్తోంది.పరిపాలన, కార్యకలాపాలు(ట్రావిలింగ్, మార్కెటింగ్) కోసం బీసీసీఐ 300 పైగా కోట్లు ఖర్చు చేస్తోంది. మరోవైపు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ప్రారంభించడానికి బీసీసీఐ భారీ ఖర్చు చేసింది. అందులో మీడియా హక్కుల కోసం రూ. 951 కోట్లు వెచ్చించింది.చదవండి: ENG vs IND: క్రికెట్ ప్లేయర్లు లంచ్ బ్రేక్‌లో ఏమి తింటారో తెలుసా? -
ఎస్ఆర్హెచ్ కీలక ప్రకటన.. కోచ్‌గా 'ఊహించని ప్లేయర్'
సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు బౌలింగ్ కోచ్ టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్(Varun Aaron)ను ఎస్ఆర్హెచ్ మెనెజ్‌మెంట్ నియమించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఎస్ఆర్హెచ్ వెల్లడించింది. గత సీజన్లో ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన కివీస్ మాజీ ఆల్‌రౌండర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ స్ధానాన్ని భర్తీ చేయనున్నాడు.ఆరోన్‌కు అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉంది. జార్ఖండ్‌కు చెందిన వరున్ ఆరోన్ 9 టెస్టులు, 9 వన్డేల్లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా 29 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్), రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తరపున ఆడాడు.తన ఐపీఎల్ కెరీర్లో 44 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా 95 టీ20ల్లో 93 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆరోన్ చివరగా విజయ్ హాజారే ట్రోఫీ 2024-25 సీజన్లో జార్ఖండ్ తరపున ఆడాడు. ఆ తర్వాత అన్ని ఫార్మాట్లకు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ స్పీడ్ స్టార్.. కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. గత సీజన్లో సన్‌రైజర్స్ తమ స్దాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. 14 మ్యాచ్‌లు ఆడి కేవలం ఆరింట మాత్రమే విజయం సాధించింది.చదవండి: IND vs ENG: జోఫ్రా ఆర్చర్ సూపర్ డెలివరీ.. రిషబ్ పంత్‌కు మైండ్ బ్లాంక్! వీడియో -
కేకేఆర్‌లోకి సంజూ శాంసన్..? ఆసక్తి రేపుతున్న సోషల్‌మీడియా పోస్ట్
ఐపీఎల్ 2025 సీజన్ ముగిసి కొద్ది రోజులు కూడా గడవకముందే తదుపరి సీజన్‌పై చర్చ మొదలైంది. పలానా ఆటగాడు పలానా ఫ్రాంచైజీకి మారతాడు, పలానా ఫ్రాంచైజీ కెప్టెన్‌ను మారుస్తుందని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ చర్చల్లో ట్రేడింగ్ విండో అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఉన్న సంజూ శాంసన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ట్రేడింగ్ విండో ఆప్షన్ ద్వారా చేజిక్కించుకోనుందని ప్రచారం జరుగుతుంది. ఈ అంశంపై సంజూ శాంసన్ కానీ, ఇరు ఫ్రాంచైజీలు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయినా సంజూ సీఎస్కే చేరతాడంటూ సోషల్‌మీడియా కోడై కూస్తుంది.సంజూకు సంబంధించి తాజాగా మరో ప్రచారం మొదలైంది. ఈ కేరలైట్ వచ్చే సీజన్లో కేకేఆర్‌కు ఆడబోతున్నాడని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ ప్రచారానికి కేకేఆర్ స్కౌటింగ్ హెడ్ బిజూ జార్జ్ బీజం వేశాడు. బిజూ తాజాగా తన ఇన్‌స్టా ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు. ఇందులో సంజూ అతను చాలాకాలం క్రితం కలిసి దిగిన ఫోటో ఉంది. ఈ ఫోటోకు బిజూ "కొన్ని జ్ఞాపకాలు ప్రత్యేకమైనవి" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇది చూసి నెటిజన్లు సంజూ కోసం కేకేఆర్ పావులు కదుపుతుందని ప్రచారం మొదలుపెట్టారు.వాస్తవానికి కేకేఆర్‌కు వచ్చే సీజన్ కోసం వికెట్‌కీపర్‌తో పాటు కెప్టెన్ అవసరం ఉంది. సంజూ శాంసన్ ఈ రెండు పాత్రలను న్యాయం చేస్తాడని ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం తప్పక భావించవచ్చు. గత సీజన్లో కేకేఆర్ అజింక్య రహానే కెప్టెన్సీలో చాలా ఇబ్బంది పడింది. దీంతో శాంసన్ లాంటి విజవంతమైన నాయకుడు తమ కష్టాలు తీరుస్తాడని కేకేఆర్ అనుకోవడంలో తప్పులేదు. ఎలాగూ ట్రేడింగ్ విండో ఆప్షన్ ఉంది కాబట్టి కేకేఆర్ శాంసన్ కోసం ఎంత డబ్బైనా వెచ్చించవచ్చు. ఏం జరుగుందో తెలియాలంటే మరి కొద్ది రోజుల వెయిట్ చేయాల్సిందే.కాగా, సంజూ శాంసన్ 2013లో రాజస్థాన్ రాయల్స్‌తో తన జర్నీని ప్రారంభించాడు. అతి కొద్ది కాలంలో శాంసన్ రాయల్స్‌లో కీలక ఆటగాడిగా మారిపోయాడు. మధ్యలో రాజస్థాన్ రాయల్స్ సస్పెండ్ కావడంతో శాంసన్ రెండేళ్ల పాటు ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు మారాడు. 2018లో అతని తిరిగి రాయల్స్ గూటికి చేరాడు. 2021 సీజన్లో శాంసన్ రాయల్స్ కెప్టెన్సీని చేపట్టాడు. అతని సారథ్యంలో రాయల్స్ 2022 సీజన్లో ఫైనల్‌కు చేరింది. తాజాగా ముగిసిన సీజన్లో శాంసన్ గాయం కారణంగా పెద్దగా కనిపించలేదు. అతని స్థానంలో రియాన్ పరాగ్ మెజార్టీ మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ చేశాడు. ఈ సీజన్లో రాయల్స్ చాలావరకు గెలవాల్సిన మ్యాచ్‌ల్లో ఓటమిపాలై ప్లే ఆఫ్స్‌కు కూడా చేరలేకపోయింది.రికార్డు ధరసంజూ శాంసన్ ఐపీఎల్ తర్వాత ఖాళీగా ఉన్నాడు. ఇటీవల జరిగిన కేరళ క్రికెట్ లీగ్ వేలంలో సంజూ రికార్డు ధరకు అమ్ముడుపోయాడు. కొచ్చి బ్లూ టైగర్స్ ఫ్రాంచైజీ సంజూను రూ. 26.8 లక్షలకు సొంతం చేసుకుంది. కేరళ క్రికెట్ లీగ్ చరిత్రలో ఇదే భారీ డీల్. -
హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్రావు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) ఫ్రాంచైజీ, హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్(HCA) వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్రావును తెలంగాణ సీఐడీ బుధవారం అరెస్ట్ చేసింది. జగన్‌తోపాటు హెచ్‌సీఏ ఆరుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో విజిలెన్స్ సిఫార్సు మేరకు సీఐడీ ఈ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.గత ఐపీఎల్ సీజన్లో హెచ్‌సీఏ-ఎస్ఆర్హెచ్ మధ్య టికెట్ల వివాదం జరిగిన సంగతి తెలిసిందే. హెచ్‌సీఏ ప్రెసిడెంట్ హోదాలో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీని జగన్మోహన్రావు బెదిరించారన్నది ప్రధాన అభియోగం. అయితే ఆ అభియోగాలన్నీ వాస్తవమేనని విజిలెన్స్ నిర్ధారించడంతో సీఐడీ ఇప్పుడు అరెస్టులు చేసింది. హెచ్‌సీఏకు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం 10 శాతం టికెట్లు ఉచితంగా ఇస్తోంది. అయితే మరో 20 శాతం టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని, లేకుంటే మ్యాచ్‌లు జరగబోనివ్వమని ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని జగన్మోహన్రావు డిమాండ్ చేశారు. అయితే హెచ్‌సీఏ ద్వారా రిక్వెస్ట్ పెట్టుకుంటే ఆలోచన చేస్తామని ఆ సమయంలో హెచ్ఆర్ఎస్ ఆయనకు స్పష్టం చేసింది. అయితే.. తనకు వ్యక్తిగతంగా 10 శాతం వీఐపీ టికెట్లు కచ్చితంగా ఇవ్వాలని, లేకుంటే మ్యాచ్‌లు జరగనివ్వబోమని ఆయన బెదిరింపులకు దిగారు. అందుకు ఎస్ఆర్హెచ్ అంగీకరించలేదు. దీంతో లక్నో మ్యాచ్ సందర్భంగా వీఐపీ కార్పొరేట్ బాక్స్‌కు ఆయన తాళాలు కూడా వేయించారు. ఈ పరిణామంతో షాక్ తిన్న ఎస్ఆర్హెచ్ యాజమాన్యం.. హైదరాబాద్ నుంచి వెళ్లిపోతామంటూ ప్రకటించడం సంచలన చర్చకు దారి తీసింది. ఐపీఎల్ టికెట్ల వివాదం నేపథ్యంతో ఈ ఘటనపై విజిలెన్స్ ఎంక్వయిరీకి తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ వ్యవహారంలో విజిలెన్స్ నివేదిక ఆధారంగా హెచ్‌సీఏ అక్రమాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన సీఐడీ.. ఇప్పుడు ఆ అక్రమాలు వాస్తవమేనని తేలడంతో ఏకంగా అరెస్టులు చేసింది. -
అత్యంత విలువైన జట్టుగా ఆర్సీబీ.. పడిపోయిన సీఎస్కే.. భారీగా పెరిగిన పంజాబ్ విలువ
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 17 సీజన్ల పాటు ఒక్కసారి టైటిల్ సాధించకపోయినా సరే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు అభిమానుల్లో మంచి క్రేజ్ కొనసాగింది. 2025 సీజన్లో తొలి సారి విజేతగా నిలవడంతో ఇప్పుడు వాణిజ్యపరంగా కూడా ఆ జట్టు విలువ అమాంతం పెరిగిపోయింది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ హూలీహాన్ లోకీ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఆర్సీబీ టీమ్ విలువ అక్షరాలా 269 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2306 కోట్లు).ఈ జాబితాలో ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌ను (సీఎస్కే) వెనక్కి నెట్టిన ఆర్సీబీ టాప్కు చేరింది. ఈ సీజన్లో చెత్త ప్రదర్శనతో చివరి స్థానంలో నిలిచిన సీఎస్కే 235 మిలియన్ డాలర్లు (రూ. 2014 కోట్లు) విలువతో మూడో స్థానానికి పడిపోయింది. ముంబై ఇండియన్స్ విలువను 242 మిలియన్ డాలర్లు (రూ. 2074 కోట్లు)గా బ్యాంక్ హూలీహాన్ లెక్కగట్టింది. ఇతర ఐపీఎల్ జట్లలో కోల్‌కతా నైట్‌రైడర్స్ (రూ. 1946 కోట్లు) , సన్‌రైజర్స్ హైదరాబాద్ (రూ. 1320 కోట్లు), పంజాబ్ కింగ్స్ (రూ. 1209 కోట్లు) విలువ కలిగి ఉన్నాయి. ఈ సీజన్లో అత్యధిక వృద్ధి సాధించిన జట్టు పంజాబ్ కింగ్స్. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో ఈ సీజన్ ఫైనల్‌కు చేరిన పంజాబ్ ఏకంగా 39.6 శాతం వృద్ధి సాధించింది. మరో వైపు ఐపీఎల్ విలువ కూడా 13.8 శాతం పెరిగి 3.9 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 33 వేల కోట్లు)కు చేరింది.అత్యంత విలువైన ఐపీఎల్ జట్లు1) RCB - 269 మిలియన్లు (సుమారు రూ. 2306 కోట్లు)2) MI - 242 మిలియన్లు (రూ. 2074 కోట్లు)3) CSK - 235 మిలియన్లు (రూ. 2014 కోట్లు)4) KKR - 227 మిలియన్లు (రూ. 1946 కోట్లు) 5) SRH - 154 మిలియన్లు (రూ. 1320 కోట్లు)6) DC - 152 మిలియన్లు (రూ. 1303 కోట్లు)7) RR - 146 మిలియన్లు (రూ. 1252 కోట్లు)8) GT - 142 మిలియన్లు (రూ. 1217 కోట్లు)9) PBKS - 141 మిలియన్లు (రూ. 1209 కోట్లు)10) LSG - 122 మిలియన్లు (రూ. 1046 కోట్లు) -
కౌంటీల్లో అరంగేట్రం చేయనున్న మరో భారత క్రికెటర్
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లోకి మరో భారత ఆటగాడు అరంగేట్రం చేయనున్నాడు. తమిళనాడు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవిశ్రీనివాస్ సాయి కిషోర్ సర్రే కౌంటీ జట్టుతో రెండు మ్యాచ్‌ల స్వల్ప ఒప్పందం చేసుకున్నాడు. సాయి కిషోర్ ఈ నెల 22న యార్క్‌షైర్‌తో జరుగబోయే మ్యాచ్‌తో కౌంటీ అరంగేట్రం చేస్తాడు. ఆ మ్యాచ్‌లో సాయి తన మాజీ సీఎస్కే సహచరడు రుతురాజ్ గైక్వాడ్‌ను ఢీకొంటాడు. రుతురాజ్ కూడా ఇదే సీజన్‌తో యార్క్‌షైర్ తరఫున కౌంటీ అరంగేట్రం చేశాడు.28 ఏళ్ల సాయి సర్రే క్లబ్‌తో ఒప్పందం చేసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశాడు. ఘన చరిత్ర కలిగిన సర్రేకు ఆడటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపాడు. సాయి ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడతాడు. రంజీ ట్రోఫీలో తమిళనాడు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. భారత్ తరఫున 3 టీ20లు ఆడిన సాయికి ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ ఫార్మాట్లో అతను 23.5 సగటున 192 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో 2022 సీజన్ నుంచి గుజరాత్‌కు ఆడుతున్న సాయి.. ఈ లీగ్‌లో 25 మ్యాచ్‌లు ఆడి 20.3 సగటుతో 32 వికెట్లు తీశాడు.ఈ సీజన్లో ఆరో క్రికెటర్ప్రస్తుత కౌంటీ సీజన్లో ఆడేందుకు భారత ఆటగాళ్లు క్యూ కడుతున్నారు. ఈ సీజన్లో ఇప్పటికే ఐదుగురు భారత ఆటగాళ్లు వేర్వేరు క్లబ్‌లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇషాన్ కిషన్ నాటింగ్హమ్షైర్, తిలక్ వర్మ హ్యాంప్‌షైర్, ఖలీల్ అహ్మద్ ఎసెక్స్, రుతురాజ్ గైక్వాడ్ యార్క్‌షైర్, యుజ్వేంద్ర చహల్ నార్తంప్టన్‌షైర్‌కు ఆడుతున్నారు.వీరిలో యువ బ్యాటర్లు తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ తమ అరంగేట్రం మ్యాచ్‌ల్లోనే ఇరగదీశారు. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో తిలక్ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ చేయగా.. ఇషాన్ రెండు మ్యాచ్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలు చేశారు. -
ఆర్సీబీ స్టార్ క్రికెటర్‌పై మహిళ ఫిర్యాదు.. కేసు నమోదు
ఆర్సీబీ స్టార్ క్రికెటర్ యశ్ దయాల్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ యువతి యశ్ దయాల్‌పై లైంగిక వేధింపులు సహా శారీరక హింస, మానసిక వేధింపులు మరియు తప్పుడు వాగ్దానాల వంటి ఆరోపణలు చేస్తూ సీఎం గ్రీవెన్స్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసింది. Ghaziabad, UP: An FIR has been registered against cricketer Yash Dayal at PS Indirapuram, under BNS Section 69, on charges of sexual exploitation, physical violence, mental harassment and cheating by making false promises of marriage.— ANI (@ANI) July 7, 2025ఈ ఫిర్యాదు ఆధారంగా ఇందిరాపురం పోలిస్ స్టేషన్లో యశ్ దయాల్‌పై కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 69 కింద యశ్‌పై కేసు కట్టారు. పెళ్లి, ఉద్యోగం వంటి తప్పుడు వాగ్దానాలతో మోసం చేసిన ఘటనల్లో ఈ సెక్షన్ వాడతారు. ఈ కేసులో నేరం రుతువైతే పదేళ్ల వరకు శిక్ష పడుతుంది.ఫిర్యాదు ప్రకారం.. ఘజియాబాద్‌కు చెందిన యువతి దయాల్‌తో తనకు ఐదేళ్ల సంబంధం ఉందని తెలిపింది. దయాల్ తనను అతని కుటుంబానికి పరిచయం చేశాడని, వారు తనను కోడలుగా స్వాగతించారని ఆమె పేర్కొంది. సదరు యువతి గత 5 సంవత్సరాలుగా దయాల్‌తో సంబంధంలో ఉన్నట్లు చెప్పుకొచ్చింది.దయాల్ మోసాన్ని గ్రహించి నిరసన తెలిపినప్పుడు శారీరక, మానసిక వేధింపులకు గురయ్యానని ఫిర్యాదు చేసింది. దయాల్‌తో సంబంధంలో ఉన్నప్పుడు ఆర్దికంగానూ నష్టపోయానని ఆరోపించింది. దయాల్‌కు తనతో పాటు మరో ముగ్గురు మహిళలలో కూడా సంబంధాలు ఉన్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నట్లు పేర్కొంది. దయాల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాగా, 27 ఏళ్ల యశ్ దయాల్‌ను ఆర్సీబీ గత ఐపీఎల్ సీజన్‌కు ముందు రూ. 5 కోట్లకు రీటైన్ చేసుకుంది. తాజాగా ముగిసిన సీజన్లో దయాల్ 15 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీసి పర్వాలేదనిపించాడు. ఈ సీజన్లో దయాల్ మంచి ఎకానమీతో బౌలింగ్ చేసి ఆర్సీబీ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. దయాల్ 2023 సీజన్లో రింకూ సింగ్‌కు బౌలింగ్ చేస్తూ చివరి ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు ఇచ్చి తొలిసారి వార్తల్లో నిలిచాడు. దయాల్ విరాట్ కోహ్లి మద్దతుతో ఆర్సీబీలో కొనసాగుతున్నాడు. -
అత్యధిక పారితోషికం అందుకునే వ్యాఖ్యాతలు వీరే.. గవాస్కర్‌కు అత్యధికంగా..!
ఐపీఎల్లో అత్యధిక పారితోషికం అందుకున్న వ్యాఖ్యాతల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మొట్టమొదటి స్థానంలో ఉన్నాడు. 2024 ఐపీఎల్ సీజన్ లెక్కల ప్రకారం.. గవాస్కర్ ఓ సీజన్లో ఇంగ్లీష్ కామెంట్రీ చేసినందుకు గానూ రూ. 4.5 కోట్లు తీసుకుంటాడు. అంటే ఓ మ్యాచ్‌కు అతని రెమ్యూనరేషన్ రూ. 6 నుంచి 10 లక్షల మధ్యలో ఉంటుంది. వ్యాఖ్యాతలు కామెంట్రీతో పాటు మ్యాచ్ ప్రిడిక్షన్స్, స్టోరీస్ కూడా చేయాల్సి ఉంటుంది. వీటన్నిటికీ కలిపి వారి పారితోషికం ఉంటుంది.గవాస్కర్‌తో సమానంగా ఐపీఎల్లో పారితోషికం అందుకునే వ్యాఖ్యాతలుగా మాథ్యూ హేడెన్, కెవిన్ పీటర్సన్, ఇయాన్ బిషప్ ఉన్నారు. వీరంతా ఇంగ్లీష్ కామెంట్రీకి తలో రూ. 4.17 కోట్లు అందుకుంటారు. వీరి తర్వాత ఇంగ్లీష్ కామెంట్రీకి హర్షా భోగ్లే రూ. 4.1 కోట్లు, రవిశాస్త్రి రూ. 4 కోట్లు అందుకుంటారు.హిందీ కామెంట్రీకి అత్యధిక పారితోషికం అందుకునే వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా. అతనికి సీజన్‌కు రూ. 2.92 కోట్లు లభిస్తుంది. ఆకాశ్ చోప్రా తర్వాత సంజయ్ మంజ్రేకర్ అత్యధికంగా రూ. 2.8 కోట్లు అందుకుంటాడు. ఆతర్వాత సురేశ్ రైనా రూ. 2.5 కోట్లు, హర్భజన్ సింగ్ రూ. 1.5 కోట్లు రెమ్యూనరేషన్‌గా తీసుకుంటారు.సీనియర్ వ్యాఖ్యాతల పారితోషికాలు ఇలా ఉంటే, జూనియర్లకు మ్యాచ్‌ల లెక్కన పేమెంట్ ఇస్తారు. ఇంగ్లీష్, హిందీతో పాటు అన్ని స్థానిక భాషల్లో వ్యాఖ్యానం చేసే వారికి ఒకే లెక్కన మ్యాచ్‌కు రూ. 35 వేలు ఇస్తారు. ఇటీవలికాలంలో క్రికెట్లో కామెంట్రీకి ప్రాధాన్యత చాలా పెరిగింది. వ్యాఖ్యాతలకు కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే, వారి క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్దం చేసుకోవచ్చు. ప్రస్తుతం భారతీయ వ్యాఖ్యాతలు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, హర్షా భోగ్లేకు ప్రపంచ వ్యాప్తంగా పిచ్చ క్రేజ్ ఉంది. ఔటైనప్పుడు కానీ సిక్సర్లు కొట్టినప్పుడు వీరి వ్యాఖ్యానం పతాక స్థాయిలో ఉంటుంది. -
మరో ఫ్రాంచైజీతో ఒప్పందం చేసుకున్న ఆర్సీబీ హెడ్ కోచ్
మహిళల ఆర్సీబీ హెడ్ కోచ్ లూక్ విలియమ్స్ మహిళల హండ్రెడ్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2025 సీజన్ కోసం సథరన్ బ్రేవ్ హెడ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుత కోచ్ చార్లోట్ ఎడ్వర్డ్స్ ఇంగ్లండ్ మహిళల జట్టుకు హెడ్ కోచ్‌గా వెళ్లడంతో లూక్ నియామకం జరిగింది.లూక్ హండ్రెడ్ లీగ్ ప్రారంభ ఎడిషన్ నుంచి చార్లోట్ ఎడ్వర్డ్స్‌కు డిప్యూటీగా వ్యవహరించాడు. వీరి ఆధ్వర్యంలో బ్రేవ్ 2021, 2022 ఎడిషన్లలో రన్నరప్‌గా.. 2023 ఎడిషన్‌లో విజేతగా నిలిచింది.లూక్ మహిళల ఐపీఎల్లో స్మృతి మంధన నేతృత్వంలోని ఆర్సీబీకి తొలి టైటిల్‌ను అందించాడు. 2024 ఎడిషన్‌లో లూక్ ఆధ్వర్యంలో ఆర్సీబీ టైటిల్ ఎగరేసుకుపోయింది. లూక్‌కు మహిళల బిగ్‌బాష్ లీగ్‌లోనూ ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. అతని ఆథ్వర్యంలో అడిలైడ్ స్ట్రయికర్స్ వరుసగా 2022, 2023 ఎడిషన్లలో విజేతగా నిలిచింది.బ్రేవ్ ఫ్రాంచైజీ రానున్న సీజన్ కోసం లూక్‌తో పాటు మరో కీలక నియామకం చేపట్టింది. ఆ ఫ్రాంచైజీ తమ బ్యాటింగ్ కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ మార్కస్ ట్రెస్కోధిక్కు నియమించుకుంది. జిమ్మీ కానర్స్ స్థానంలో ట్రెస్కోధిక నియామకం జరిగింది.సథరన్ బ్రేవ్ గత సీజన్లో ఘోర ప్రదర్శన చేసింది. 8 మ్యాచ్‌ల్లో ఒకే ఒక విజయం సాధించి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలిచింది.2025 మహిళల హండ్రెడ్ లీగ్ కోసం సథరన్ బ్రేవ్ జట్టు.. లారా వోల్వార్డ్, డాని వ్యాట్-హాడ్జ్, మైయా బౌచియర్, లారెన్ బెల్, ఫ్రెయా కెంప్, జార్జియా ఆడమ్స్, టిల్లీ కోర్టీన్-కోల్మన్, రియానా సౌత్‌బై, సోఫీ డెవిన్, క్లోయ్ ట్రయాన్, మాడీ విలియర్స్, జోసీ గ్రోవ్స్, ఫోబ్ గ్రాహం -
పాకిస్తాన్ హెడ్ కోచ్‌గా కేకేఆర్ మాజీ ప్లేయర్
పాకిస్తాన్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్‌గా ఐపీఎల్ ఆడిన ఓ పాక్ మాజీ ఆటగాడు ఎంపికయ్యాడు. 50 ఏళ్ల అజహార్ మహమూద్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తాత్కాలిక ప్రాతిపదికన హెడ్ కోచ్‌గా ఎంపిక చేసింది. ఈ పదవిలో అజహార్ 2026 ఏప్రిల్ వరకు కొనసాగుతాడు. గతేడాది అక్టోబర్‌లో అజహార్ తొలుత పాక్ ఆల్ ఫార్మాట్ అసిస్టెంట్ కోచ్‌గా ఎంపికయ్యాడు. తాజాగా ప్రమోషన్ పొంది టెస్ట్ జట్టుకు హెడ్ కోచ్ అయ్యాడు. ఆకిబ్ జావిద్ నుంచి అజహార్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. టెస్ట్ జట్టు హెడ్ కోచ్‌గా అజహార్ ప్రయాణం త్వరలో స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగబోయే టెస్ట్ సిరీస్‌తో మొదలవుతుంది. అజహార్ పాక్ తరఫున 21 టెస్ట్‌లు, 143 వన్డేలు ఆడి 3 సెంచరీలు, 4 అర్ద సెంచరీల సాయంతో 2400 పైచిలుకు పరుగులు చేశాడు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన ఇతను.. టెస్ట్‌ల్లో 39, వన్డేల్లో 123 వికెట్లు తీశాడు. అజహార్‌కు కౌంటీ క్రికెట్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. అతను రెండు సార్లు కౌంటీ ఛాంపియన్షిప్ నెగ్గిన జట్లలో సభ్యుడిగా ఉన్నాడు. అజహార్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడిన అతి కొద్ది మంది పాక్ ఆటగాళ్లలో ఒకడు. 2012లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఇతను.. నాలుగు సీజన్ల పాటు క్యాష్ రిచ్ లీగ్‌లో పాల్గొని 23 మ్యాచ్‌ల్లో 2 హాఫ్ సెంచరీల సాయంతో 388 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 29 వికెట్లు పడగొట్టాడు. 2015 సీజన్లో అజహార్ న్యూజిలాండ్ ఆటగాడు జేమ్స్ నీషమ్‌కు ప్రత్యామ్నాయంగా కేకేఆర్ జట్టులో చేరాడు. ఐపీఎల్లో ఇదే అతనికి చివరి సీజన్. అప్పటికే భారత్-పాక్ మధ్య ఉద్రిక్తల కారణంగా పాక్ ఆటగాళ్లను ఐపీఎల్లో ఆడనివ్వలేదు. అయితే అజహార్‌కు బ్రిటన్ పౌరసత్వం ఉండటంతో ఐపీఎల్లో ఆడగలిగాడు. -
ప్రపంచంలో అత్యంత ధనిక క్రికెట్ లీగ్‌లు ఇవే.. ఐపీఎల్ తర్వాత అదే!
క్రికెట్లో ప్రస్తుతం టీ20 ఫార్మాట్ హవా నడుస్తోంది. పొట్టి క్రికెట్‌ను చూసేందుకు నవతరం యువత ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో టీ20 లీగ్‌లు పుట్టుకొచ్చాయి. వీటి ద్వారా ఆటగాళ్లు రెండు చేతులా సంపాదించుకుండగా.. ఆయా బోర్డులపై కూడా కనక వర్షం కురుస్తోంది.స్పాన్సర్‌షిప్‌లు. టీవీ ప్రసార హక్కులు, టికెట్ల విక్రయం తదితర మార్గాల ద్వారా బోర్డులు ఆదాయం సమకూర్చుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ లీగ్‌లే ప్రపంచ క్రికెట్ మార్కెట్‌ను ఏలుతున్నాయి. మరి 2025 నాటికి పేరెన్నికగన్న ధనిక పొట్టి లీగ్‌లలో టాప్-10లో ఉన్న లీగ్‌లు ఏవో తెలుసా?!ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)సందేహమే అక్కర్లేదు.. అవును.. ప్రపంచ టీ20 మార్కెట్లో ఐపీఎల్‌దే అగ్రస్థానం. 2008లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) దీనిని మొదలుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా మేటి జట్ల ఆటగాళ్లంతా ఈ లీగ్‌లో భాగమవుతూ.. కోట్లాది రూపాయాలు ఆర్జిస్తున్నారు.ఎంతో మంది యువ క్రికెటర్లు కూడా వెలుగులోకి వచ్చి జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహించే అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇక అత్యంత ఆదరణ పొందిన లీగ్‌గా పేరున్న ఐపీఎల్ కేవలం బ్రాడ్కాస్ట్ డీల్స్ ద్వారానే 6.2 బిలియన్ డాలర్లు సంపాదించినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ప్రస్తుతం ఐపీఎల్ విలువ- 11 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపుగా 94, 220.5 కోట్ల రూపాయలు) వరకు ఉంటుందని అంచనా.రెండో స్థానంలో ఐఎల్టీ20 (ILt20)నెట్వర్త్పరంగా ఐపీఎల్ తర్వాతి స్థానం యూఏఈ వేదికగా సాగే ఇంటర్నేషనల్ లీగ్టీ20ది. మధ్య ప్రాచ్చ దేశాల పెట్టుబడి, ఐపీఎల్ ఫ్రాంఛైజీల ఆధ్వర్యంలో నడుస్తున్న ఐఎల్టీ20 విలువ 15 మిలియన్ డాలర్లు (సుమారుగా రూ. 128.64 కోట్లు) అని తెలుస్తోంది. పన్ను లేని కాంట్రాక్టులు మేటి క్రికెటర్లను కూడా ఐఎల్టీ20 వైపు ఆకర్షిస్తున్నాయి.సౌతాఫ్రికా టీ20 లీగ్ (SAT20)2023లో మొదలైన సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో జట్లన్నీ ఐపీఎల్ ఫ్రాంఛైజీలవే. హైదరాబాద్ (సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్), లక్నో (డర్బన్ సూపర్ జెయింట్స్), రాజస్తాన్ (పర్ల్ రాయల్స్), ఢిల్లీ (ప్రిటోరియా క్యాపిటల్స్), చెన్నై (జొబర్గ్ సూపర్ కింగ్స్), ముంబై (ఎంఐ కేప్‌టౌన్)ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఇందులో పెట్టుబడులు పెట్టాయి. ఈ లీగ్ విలువ 12 మిలియన్ డాలర్లు (దాదాపుగా రూ. 102.79 కోట్లు) అని అంచనా.బిగ్‌బాష్ లీగ్ (BBL)ఆస్ట్రేలియాకు చెందిన ఈ టీ20 లీగ్ నికర విలువ పది మిలియన్ల డాలర్ల (దాదాపు రూ. 85. 65 కోట్లు)వరకు ఉంటుందని తెలుస్తోంది.ది హండ్రెడ్ఇంగ్లండ్ వేదికగా సాగే 100 బాల్ టోర్నీ ‘ది హండ్రెడ్ లీగ్’ వాల్యూ తొమ్మిది మిలియన్ డాలర్లు (సుమారు రూ. 77.08 కోట్లు) అని అంచనా.మేజర్ లీగ్ క్రికెట్ (MLC)అమెరికాకు చెందిన ఈ పొట్టి లీగ్ విలువ 6.9 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 59.09 కోట్లు) అని సమాచారం.పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)పాకిస్తాన్ సూపర్ లీగ్ నెట్‌వర్త్ 5.7 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు 48.82 కోట్లు) అని అంచనా.బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL)బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ వాల్యూ 4.8 మిలియన్ డాలర్లు (సుమారు 41.11 కోట్ల రూపాయలు) అని తెలుస్తోంది.కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)ఈ వెస్టిండీస్ టీ20 లీగ్‌లోనూ ఐపీఎల్ ఫ్రాంఛైజీల పెట్టుబడులు ఉన్నాయి. దీని నెట్‌వర్త్ 4.6 మిలియన్ డాలర్లు (సుమారు 39.40 కోట్లు) అని అంచనా.లంక ప్రీమియర్ లీగ్ (LPL)శ్రీలంకకు చెందిన ఈ పొటి ఫార్మాట్ లీగ్ వాల్యూ 3.98 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 34.09 కోట్లు) అని తెలుస్తోంది.చదవండి: రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం.. పోస్ట్ ఏమిటంటే?! -
BCCI: బీసీసీఐకి ‘భారీ’ షాక్
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి గట్టి షాక్ తగిలింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో భాగమైన ఒకప్పటి ఫ్రాంఛైజీ కొచ్చి టస్కర్స్ కేరళకు ముంబై హైకోర్టులో భారీ ఊరట లభించింది. కాగా ఐపీఎల్లో ఒక సీజన్ తర్వాత తగిన కారణాలు లేకుండా తమ జట్టును రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ కొచ్చి టస్కర్స్ కేరళ టీమ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.ఈ అంశంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ వ్యవహారంలో బీసీసీఐదే తప్పని తేల్చింది. అదే విధంగా.. కొచ్చి యాజమాన్యానికి రూ. 538 కోట్లు చెల్లించాలని ముంబై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఎనిమిదో స్థానంలోకాగా ఐపీఎల్- 2011 సీజన్లో మాత్రమే ఆడిన టస్కర్స్ టీమ్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. అయితే జట్టు మేనేజ్మెంట్ నిబంధనలు ఉల్లంఘించిందని, సరైన సమయంలో బ్యాంక్ గ్యారంటీ చెల్లించలేదని పేర్కొంటూ కొచ్చి టీమ్‌ను బీసీసీఐ లీగ్ నుంచి తప్పించింది.ఈ విషయంపై... టీమ్‌లో భాగస్వాములైన కొచ్చి క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ (కేసీపీఎల్), రెండేవూ స్పోర్ట్స్ వరల్డ్ (ఆర్ఎస్డబ్ల్యూ) కోర్టుకెక్కాయి. చివరకు 2015లో కోర్టు ఆర్బిట్రేటర్ కొచ్చికి అనుకూలంగా తీర్పునిస్తూ రూ. 538 కోట్లు చెల్లించాలని ఆదేశించారు. అయితే, ఆర్బిట్రేటర్ నిర్ణయాన్ని బోర్డు హైకోర్టులో సవాల్ చేయగా...ఇప్పుడు అదే తీర్పునకు హైకోర్టు కూడా ఆమోద ముద్ర వేసింది. దీని ప్రకారం కేసీపీఎల్కు రూ.385.50 కోట్లు, ఆర్ఎస్డబ్ల్యూకు రూ.153.34 కోట్లు చెల్లించాలని తీర్పు వెలువరించింది. దీనిపై మళ్లీ అప్పీల్ చేసేందుకు బీసీసీఐకి ఆరు వారాల గడువు ఉంది. ప్రస్తుతం పదికాగా ఐపీఎల్లో ప్రస్తుతం పది జట్లు ఉన్నాయి. రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ క్యాష్ రిచ్ లీగ్‌లో కొనసాగుతున్నాయి. వీటిలో ముంబై, చెన్నై అత్యధికంగా ఐదేసి సార్లు టైటిల్ గెలవగా.. కోల్‌కతా మూడుసార్లు ట్రోఫీని ముద్దాడింది. ఇక 2008 నాటి తొలి సీజన్లో రాజస్తాన్ చాంపియన్‌గా నిలవగా.. సన్‌రైజర్స్, గుజరాత్ టైటాన్స్ ఒక్కోసారి టైటిల్ అందుకున్నాయి. తాజాగా ఐపీఎల్-2025లో విజేతగా నిలిచి బెంగళూరు జట్టు కూడా చాంపియన్ల జాబితాలో చేరింది. ఇక కొచ్చి టస్కర్స్‌తో పాటు దక్కన్ చార్జర్స్, గుజరాత్ లయన్స్ కూడా ఇప్పుడు ఉనికిలో లేవు. వీటిలో హైదరాబాద్ ఫ్రాంఛైజీ దక్కన్ చార్జర్స్ కూడా ఓసారి టైటిల్ గెలిచింది.చదవండి: ప్రపంచంలో ధనిక క్రికెట్ బోర్డులు ఇవే.. చివరి స్థానంలో ఊహించని పేరు -
చెలరేగిన నూర్ అహ్మద్.. వరుస విజయాలతో దూసుకుపోతున్న సూపర్ కింగ్స్
చెన్నై సూపర్ కింగ్స్ సిస్టర్ ఫ్రాంచైజీ టెక్సాస్ సూపర్ కింగ్స్ మేజర్ లీగ్ క్రికెట్ 2025 ఎడిషన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ సీజన్లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. భారతకాలమానం ప్రకారం ఇవాళ (జూన్ 17) ఉదయం జరిగిన మ్యాచ్‌లో టీఎస్కే సీయాటిల్ ఓర్కాస్‌ను 93 పరుగుల తేడాతో మట్టికరిపించి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఓర్కాస్‌ను టీఎస్కే బౌలర్లు బెంబేలెత్తించారు. ముఖ్యంగా నూర్ అహ్మద్ తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. నూర్‌తో (4-0-18-3) పాటు జియా ఉల్ హక్ (3-0-16-3), నండ్రే బర్గర్ (3.5-1-10-3), మార్కస్ స్టోయినిస్ (2-0-4-1) చెలరేగడంతో ఓర్కాస్ 13.5 ఓవర్లలో 60 పరుగులకే కుప్పకూలింది. ఓర్కాస్ ఇన్నింగ్స్‌లో ఆరోన్ జోన్స్ (17), జస్దీప్ సింగ్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అంతలా టీఎస్కే బౌలర్లు ఓర్కాస్ బ్యాటర్లను కట్టడి చేశారు. ఓర్కాస్ ఇన్నింగ్స్‌లో స్టార్ బ్యాటర్లు డేవిడ్ వార్నర్ (9), కైల్ మేయర్స్ (0), స్టీవెన్ టేలర్ (4), హెన్రిచ్ క్లాసెన్ (0), సికందర్ రజా (4), సుజిత్ నాయర్ (5) హర్మీత్ సింగ్ (0), ఓబెద్ మెక్కాయ్ (3) దారుణంగా విఫలమయ్యారు.అంతకుముందు సాయితేజ ముక్కామల్ల (30), మార్కస్ స్టోయినిస్ (28), డారిల్ మిచెల్ (25) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో టీఎస్కే గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. టీఎస్కే ఇన్నింగ్స్‌లో డెవాన్ కాన్వే (13), డుప్లెసిస్ (7), సావేజ్ (9) నిరాశపరిచారు. ఆఖర్లో మిలింద్ కుమార్ (18 నాటౌట్), శుభమ్ రంజనే (15 నాటౌట్) వేగంగా పరుగులు సాధించే ప్రయత్నం చేశారు. ఓర్కాస్ బౌలర్లలో హర్మీత్ సింగ్, జస్దీప్ సింగ్ తలో 2 వికెట్లు తీయగా.. మెక్కాయ్, వకార్ సలాంఖీల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ సీజన్లో టీఎస్కే వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓ మోస్తరు స్కోర్లు చేసి అద్భుతంగా డిఫెండ్ చేసుకుంది. మూడు మ్యాచ్‌ల్లో టీఎస్కే విజయాల్లో నూర్ అహ్మద్ కీలకపాత్ర పోషించాడు. ఎంఐ న్యూయార్క్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి ఓ వికెట్ తీసిన నూర్.. లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 4 ఓవర్లలో 25 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. తాజాగా ఓర్కాస్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సత్తా చాటిన నూర్ 4 ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. నూర్ తాజాగా ముగిసిన ఐపీఎల్ 2025 సీజన్లోనూ ఇదే తరహా ప్రదర్శనలు (14 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు) చేసినప్పటికీ.. చెన్నై సూపర్ కింగ్స్ ఆశించిన విజయాలు సాధించలేకపోయింది. 2025 సీజన్లో ఆ జట్టు 14 మ్యాచ్‌ల్లో నాలుగే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలిచింది. -
సచిన్ టెండూల్కర్ ఆడిన జట్టుతో ఒప్పందం చేసుకున్న రుతురాజ్
సీఎస్కే కెప్టెన్, టీమిండియా యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ఇంగ్లండ్ కౌంటీల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రాతినిథ్యం వహించిన యార్క్‌షైర్ జట్టుతో ఒప్పందం చేసుకున్నాడు. జులై నెలాఖరులో యార్క్‌షైర్‌తో జతకట్టనున్న రుతురాజ్.. కౌంటీ ఛాంపియన్షిప్, మెట్రో బ్యాంక్ వన్డే కప్ పూర్తయ్యే వరకు ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. 28 ఏళ్ల రుతురాజ్ కౌంటీల్లో ఆడటం ఇదే మొదటిసారి. కౌంటీల్లో ఆడబోయే తొలి మహారాష్ట్ర క్రికెటర్‌గా రుతురాజ్ రికార్డుల్లోకెక్కనున్నాడు.రుతురాజ్ ప్రస్తుతం ఇంగ్లండ్‌లోనే ఉన్నాడు. ఇంగ్లండ్ లయన్స్‌తో ఆడుతున్న భారత-ఏ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అయితే ఈ సిరీస్‌లో అతని ఆడే అవకాశం రాలేదు. రుతురాజ్ తాజాగా ముగిసిన ఐపీఎల్ సందర్భంగా మోచేతి గాయానికి గురై సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ సీజన్లో రుతురాజ్ ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. రుతురాజ్ గత ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్ బాధ్యతలు చేపట్టాడు.2021లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రుతురాజ్ టీమిండియా తరఫున 6 వన్డేలు, 23 టీ20లు ఆడాడు. ఇందులో సెంచరీ, ఐదు అర్ద సెంచరీల సాయంతో 748 పరుగులు చేశాడు. 2022 ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన భారత జట్టుకు రుతురాజ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.2020లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన రుతురాజ్.. అప్పటి నుంచి సీఎస్కేకే ఆడుతూ 71 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీల సాయంతో 2502 పరుగులు చేశాడు.దేశవాలీ క్రికెట్లో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహించే రుతురాజ్.. ఆ జట్టుకు పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రుతురాజ్‌కు ఫస్ట్‌క్లాస్, లిస్ట్-ఏ ఫార్మాట్లలో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. రుతురాజ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 7, లిస్ట్-ఏ క్రికెట్లో 16 సెంచరీలు చేశాడు.రుతురాజ్ యార్క్‌షైర్‌తో ఒప్పందం చేసుకోవడం పట్ల ఆ జట్టు హెడ్ కోచ్ ఆంధోని మెక్‌గ్రాత్ హర్షం వ్యక్తం చేశాడు. రుతురాజ్ కూడా యార్క్‌షైర్‌లో చేరడం పట్ల ఆసక్తిని వ్యక్త పరిచాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 1992లో యార్క్‌షైర్ తరఫున ఆడాడు. ఆ జట్టు తరఫున సచిన్ 16 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 46.52 సగటున 1070 పరుగులు చేశాడు. -
అమ్మకానికి ఆర్సీబీ..?
గత కొన్ని రోజులుగా ఆర్సీబీ అభిమానులు మిశ్రమ అనుభవాలను ఎదుర్కొంటున్నారు. జూన్ 3న ఆ జట్టు 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ తమ తొలి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ గెలుపును ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్సీబీ అభిమానులు అవథుల్లేకుండా ఎంజాయ్ చేశారు. అయితే ఆ మరుసటి రోజే ఓ ఊహించని ఘటన ఆర్సీబీ అభిమానులను కృంగదీసింది. విజయోత్సవాల్లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన నుండి తేరుకోకఉందే ఆర్సీబీ అభిమానులకు మరో షాకింగ్ వార్త తెలిసింది. ఈ ఫ్రాంచైజీని అమ్మకానికి పెట్టినట్లు ఓ ప్రముఖ దినపత్రిక తమ కథనంలో పేర్కొంది. సదరు కథనం ప్రకారం, ఆర్సీబీ చేతులు మారే అవకాశం ఉంది. ప్రస్తుత యాజమాన్యం (డియాజియో అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ స్పిరిట్స్) ఆర్సీబీని సుమారు 2 బిలియన్ డాలర్లకు విక్రయించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.ఎందుకు విక్రయించాలని అనుకుంటుందంటే..?ఆర్సీబీకి భారత్‌లోనే కాక ప్రపంచవ్యాప్తంగా విశేషమైన ప్రజాదరణ ఉంది. ఈ ఫ్రాంచైజీ ఒక్కసారే టైటిల్ గెలిచినా (అది కూడా ఈ ఏడాదే) ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన బ్రాండ్లలో ఒకటిగా చలామణి అవుతుంది. దీన్నే ప్రస్తుత యాజమాన్యం క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.ఫ్రాంచైజీ యొక్క పెరుగుతున్న విలువను ఉపయోగించుకుని ఎక్కువ భాగం కాకపోయినా, కొన్ని వాటాలైనా విక్రయించాలని యునైటెడ్ స్పిరిట్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. తద్వారా యునైటెడ్ స్పిరిట్స్ భారీగా లబ్ది పొందే అవశామున్నట్లు సమాచారం. యునైటెడ్ స్పిరిట్స్ ఆర్సీబీని విక్రయించడానికి మరో కారణం కూడా ఉండొచ్చని తెలుస్తుంది. గత కొన్ని సీజన్ల నుండి బీసీసీఐ పొగాకు ఉత్పత్తులు, ఆల్కహాల్ కంటెంట్ ప్రకటనలపై అనేక ఆంక్షలు విధించింది. దీని వల్ల యునైటెడ్ స్పిరిట్స్ ఉత్పత్తుల యొక్క ప్రచారం కష్టతరం అవుతుంది. ఇది తమ కంపెనీ వృద్ధికి ఆటంకం కలిగిస్తుందని యునైటెడ్ స్పిరిట్స్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఆందోళనలో ఫ్యాన్స్ఇదిలా ఉంటే, యాజమాన్యం చేతులు మారే ప్రచారం మొదలైనప్పటి నుంచి ఆర్సీబీ అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు. వారు ఎంతగానో ఇష్టపడే ఆర్సీబీ పేరు మారుతుందేమోనని దిగాలు పడుతున్నారు.విజయ్ మాల్యా నుంచి చేజిక్కించుకున్న డియాజియోఆర్సీబీకి భారత వ్యాపారవేత్త విజయ్ మాల్యా పురుడు పోశాడు. వేర్వేరు కారణాల వల్ల మాల్యా తన స్పిరిట్స్ వ్యాపారాన్ని డియాజియోకు విక్రయించడంతో వారి భారత విభాగం 'యునైటెడ్ స్పిరిట్స్' ఆర్సీబీ యాజమాన్యాన్ని చేజిక్కించుకుంది. డియాజియో గురించి చెప్పాలంటే.. ఇది 1997లో స్థాపించబడిన బ్రిటిష్ కంపెనీ. ఈ బ్రాండ్ ఆల్కహాలిక్ మరియు నాన్ ఆల్కహాలిక్ పానీయాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్పిరిట్స్ కంపెనీ. -
బీసీసీఐకి ఐపీఎల్ బంగారు బాతు
భారత్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు ఇదో వేడుక. మ్యాచ్‌లు జరిగినన్ని రోజులు నిత్యం వీటిపైనే చర్చ. అయితే ఈసారి ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి ఎంత సంపద సమకూరిందోననే అనుమానం ఎప్పుడైనా వచ్చిందా? ఐపీఎల్ 2025లో బీసీసీఐకు మీడియా హక్కులు, ఇతర ప్రకటనలు వంటి వాటి ద్వారా ఎంత రాబడి వచ్చిందో తెలుసుకుందాం.ఐపీఎల్ 2025 జూన్ 3న ముగిసింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనన్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటిసారి ఈ లీగ్‌ను గెలుచుకుంది. బీసీసీఐకి కీలకంగా మారిన ఐపీఎల్లో వివిధ మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతోంది. ప్రసార రుసుము ద్వారా రూ.9,678 కోట్లు అంటే ఒక్కో ఆటకు సుమారు రూ.130.7 కోట్లు రాబడి వచ్చినట్లు కొన్ని నివేదికలు తెలిపాయి. టెలివిజన్ హక్కుల నుంచి డిజిటల్ హక్కులను బీసీసీఐ వేరు చేయడంతో ఆదాయం మరింత పెరిగింది.టెలివిజన్ హక్కులు స్టార్ స్పోర్ట్స్ వద్ద ఉండగా, డిజిటల్ హక్కులు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన వయాకామ్ 18 వద్ద ఉన్నాయి. వీటిని అదనంగా స్పాన్సర్షిప్ ఫీజు వస్తుంది. లీగ్ టైటిల్ స్పాన్సర్ టాటా గ్రూప్. ఇది 2024 నుంచి 2028 వరకు ఐపీఎల్‌తో తన స్పాన్సర్షిప్ ఒప్పందాన్ని రూ.2,500 కోట్లకు పొడిగించింది. అంటే 2025 సీజన్‌తో సహా ప్రతి సీజన్‌కు రూ.500 కోట్ల డీల్ కుదుర్చుకుంది.ఇదీ చదవండి: ఐటీఆర్ గడువు తేదీ పొడిగింపు.. విస్తుగొలిపే కారణాలువీటితో పాటు అసోసియేట్ పార్టనర్స్ మై11సర్కిల్, ఏంజెల్ వన్, రూపే వంటి ఇతర స్పాన్సర్ల నుంచి కూడా బీసీసీఐ డబ్బు సంపాదించింది. స్ట్రాటజిక్ టైమ్ అవుట్ పార్టనర్ - సియెట్; అధికారిక అంపైర్ భాగస్వాములు - వండర్ సిమెంట్; ఆరెంజ్ & పర్పుల్ క్యాప్ పార్టనర్- ఆరామ్కో వంటి కంపెనీలు బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. టిక్కెట్లు అమ్మడం ద్వారా వచ్చే ఆదాయం బీసీసీఐకి అదనం. అయితే నిర్ణీత కేంద్ర ఆదాయ భాగస్వామ్య ప్రక్రియలో భాగంగా ఒక్కో జట్టుకు బీసీసీఐ రూ.425 కోట్లు ఇస్తుంది. 2024లో బీసీసీఐకి రూ.20,686 కోట్లు సమకూరాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.16,493 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. -
Arun Dhumal: తొక్కిసలాట గురించి మాకు తెలీదు!
-
రిటైర్మెంట్ ప్రకటించిన ఐపీఎల్ దిగ్గజం
ఐపీఎల్ దిగ్గజ బౌలర్ పియూశ్ చావ్లా క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఇవాళ (జూన్ 6) వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాలీ క్రికెట్‌కు కూడా ఇది వర్తిస్తుందని పేర్కొన్నాడు. 36 ఏళ్ల పియూశ్ చావ్లాకు ఐపీఎల్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. View this post on Instagram A post shared by Piyush Chawla (@piyushchawla_official_)ఆరంభ సీజన్ నుంచి (2008) క్యాష్ రిచ్ లీగ్ ఆడుతున్న అతను 192 మ్యాచ్‌ల్లో 192 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్ల జాబితాలో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్లో చహల్ (221), భువనేశ్వర్ కుమార్ (198) మాత్రమే చావ్లా కంటే ఎక్కువ వికెట్లు తీశారు. సునీల్ నరైన్ చావ్లాతో సమానంగా 192 వికెట్లు తీశాడు.2008లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో కెరీర్ ప్రారంభించిన చావ్లా.. ఆతర్వాత కేకేఆర్, సీఎస్కే, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించాడు. చివరిగా 2024 సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన చావ్లాను ఈ సీజన్ మెగా వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్ బౌలర్ అయిన చావ్లా 2006లో టీమిండియా తరఫున టెస్ట్ అరంగేట్రం చేసి, ఆ ఫార్మాట్లో 3 మ్యాచ్‌లు ఆడి 7 వికెట్లు తీశాడు. ఆ తర్వాత 2007లో వన్డే, 2010లో టీ20 అరంగేట్రం చేసిన చావ్లా 25 వన్డేల్లో 32 వికెట్లు, 7 టీ20ల్లో 4 వికెట్లు తీశాడు. చావ్లా అంతర్జాతీయ కెరీర్ అంత సుదీర్ఘంగా సాగనప్పటికీ.. భారత్ గెలిచిన రెండు వరల్డ్‌కప్ టోర్నీల్లో భాగంగా ఉన్నాడు. చావ్లా 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్లలో సభ్యుడిగా ఉన్నాడు.ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీఘడ్‌లో జన్మించిన చావ్లా.. సొంత రాష్ట్రం తరఫున 2008-2013 వరకు దేశవాలీ క్రికెట్ ఆడాడు. ప్రస్తుతం అతను గుజరాత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చావ్లాకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇందులో 137 మ్యాచ్‌లు ఆడిన చావ్లా మూడు 10 వికెట్ల ప్రదర్శనలు, 23 ఐదు వికెట్ల ప్రదర్శనల సాయంతో 446 వికెట్లు తీశాడు. దేశవాలీ క్రికెట్లో చావ్లా బ్యాటర్‌గానూ రాణించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతని పేరు మీద 6 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
Bengaluru Stampede Case: ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసలే అరెస్ట్
-
IPL 2025: ఆర్సీబీ అభిమానులకు నిరాశ
ఇండియన్స్ ప్రీమియర్ లీగ్‌లో (ఐపీఎల్) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టైటిల్ చేజిక్కించుకుంది. నిన్న (జూన్ 3) జరిగిన ఫైనల్లో ఆర్సీబీ పంజాబ్‌ను 6 పరుగుల తేడాతో ఓడించి తమ తొలి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన పంజాబ్ లక్ష్యానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓడినా అద్భుతమైన పోరాటపటిమ కనబర్చింది. చివరి బంతి వరకు పోరాడింది. సీజన్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన పంజాబ్ టైటిల్ గెలవలేకపోయినా ప్రతి క్రికెట్ అభిమాని మనసును దోచుకుంది. యువ జట్టుతో శ్రేయస్ అయ్యర్ పంజాబ్ అద్భుతంగా నడిపించాడు. వ్యక్తిగతంగా రాణించడంతో పాటు జట్టుకు మంచి మార్గదర్శిగా నిలిచాడు. మరోవైపు సీజన్ ప్రారంభం నుంచి పంజాబ్‌తో పోటీపడిన ఆర్సీబీ ఫైనల్లో తమ అనుభవాన్నంత రంగరించి టైటిల్‌ను చేజిక్కించుకుంది. ఈ గెలుపుతో ఆర్సీబీ అభిమానుల 17 ఏళ్ల కల నెరవేరింది. ప్రతి సీజన్లో ఆ జట్టు అభిమానులు ఈ సాలా కప్ నమదే అంటూ ఎదురుచూసేవారు. ఎట్టకేలకు వారి కల 18వ ప్రయత్నంలో సాకారమైంది. 18 ఏళ్లుగా ఆర్సీబీకే ఆడుతున్న విరాట్ కోహ్లి కూడా ప్రతి సీజన్‌కు ముందు ఈ సాలా కప్ నమదే అనుకుంటూ బరిలోకి దిగేవాడు. ఎట్టకేలకు అతని కల కూడా ఈ సీజన్‌తో సాకారమైంది.18వ ప్రయత్నంలో టైటిల్ గెలిచాక ఆర్సీబీ అభిమానుల ఆనందానికి అవథుల్లేవు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం సాధించిన టైటిల్ కావడంతో ప్రతి అభిమాని తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు. టైటిల్ గెలిచాక ఆర్సీబీ అభిమానుల సంబురాలు అంబరాన్నంటాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో అభిమానులు హడావుడి చేశారు. ఆర్సీబీ యాజమాన్యం ఈ రోజు బెంగళూరులో విజయోత్సవ ర్యాలీని ప్లాన్ చేసింది. ఓపెన్ టాప్ బస్సులో విక్టరీ పరేడ్ నిర్వహించాలని అనుకుంది. అయితే ఈ ర్యాలీకి పోలీసులు అనుమతిని నిరాకరించారు. భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుందన్న కారణంగా విక్టరీ పరేడ్‌ను అనుమతివ్వలేమని ఆర్సీబీ యాజమాన్యానికి సమాచారమిచ్చారు. పోలీసుల నిర్ణయంతో ఆర్సీబీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.అయితే సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు చిన్నస్వామి స్టేడియంలో ఆటగాళ్ల సత్కార కార్యక్రమానికి మాత్రం అనుమతి లభించింది. అయితే ఇక్కడ కూడా పరిమితులతోనే కార్యక్రమం జరుపుకోవాలని సూచనలు అందాయి. టికెట్, పాస్ ఉన్న వారికి మాత్రమే స్టేడియంలోకి అనుమతి ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. -
బెంగళూరు విజయం.. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ సెలబ్రేషన్స్ చూశారా?
ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలవడంతో సంబురాలు మిన్నంటాయి. కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కోహ్లీ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత విజయం సాధించడంతో కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ఆనందం పట్టలేకపోయింది. ఒక్కసారిగా మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చింది. అనంతరం కోహ్లీని కౌగిలించుకుని ఎమోషనలైంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అనుష్క శర్మ వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి కోహ్లీని హత్తుకుని ఓదార్చింది.(ఇది చదవండి: ఆర్సీబీ విజయం.. అత్తారింటికి దారేది సీన్‌తో లింక్!)అనుష్క గురించి కోహ్లీ మాట్లాడుతూ.. "అనుష్క నాకు అన్ని కష్టాల్లోనూ అండగా నిలిచింది. వందశాతం ఆర్సీబీకి మద్దతుగా ప్రతి మ్యాచ్‌కు వస్తోంది. ఈ విజయం అనుష్క శర్మ గర్వంగా భావిస్తుందని కోహ్లీ అన్నారు. తను నాతో అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అండగా నిలిచింది. ఆమెకు బెంగళూరుతో చాలా అనుబంధం కలిగి ఉంది. ఎందుకంటే తను కూడా బెంగళూరు అమ్మాయి. అందుకే ఈ గెలుపు ఆమెకు కూడా చాలా ప్రత్యేకమైనది. ఈ విజయంతో తను చాలా గర్వంగా ఉంది.' అని అన్నారు.After IPL win, Virat posed with Anushka, whom he always credits for his success.🔥🔥🔥🔥#iplfinal2025 #RCBvsPBKSfinal #ViratKohli #AnushkaSharma#RCBChampion #ABdeVilliers pic.twitter.com/NGubvamHav— Gagan Meena (@GaganMeena47) June 4, 2025Thank you Anushka Sharma for taking care of this Kid for us 😭❤️ thank you so being there every time he needed someone so strong who can control that storm in him Thank you for being our Lady luck ❤️RCB RCB RCB #AnushkaSharma #EeSalaCupNamde pic.twitter.com/MZpZ9glX6c— Rahul | 🇮🇳 (@TheGoatNDevil) June 3, 2025 -
ఆర్సీబీ విజయం.. అత్తారింటికి దారేది సీన్‌తో లింక్!
ఆర్సీబీ టీమ్ ఐపీఎల్ టైటిల్ గెలవడంతో ఫ్యాన్స్ ఓ రేంజ్లో సెలబ్రేట్ చేసుకున్నారు. అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చి వరల్డ్ కప్ గెలిచినంత సంబురాలు చేసుకున్నారు. ముఖ్యంగా కోహ్లీ అభిమానుల సంబురాలు మిన్నంటాయి. 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ కప్ గెలవడంతో సినీ ప్రముఖులు సైతం అభినందనలు చెబుతున్నారు. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ట్విటర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఏకంగా డ్యాన్స్ చేస్తూ బెంగళూరు విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.అయితే ఆర్సీబీ విజయంపై ప్రముఖ ఓటీటీ సంస్థ చేసిన వీడియో నెట్టింట వైరలవుతోంది. జియో హాట్‌స్టార్ తెలుగు తన ట్విటర్ వేదికగా బెంగళూరు విజయంపై ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో ఆర్సీబీ విజయాన్ని.. పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేదీ క్లైమాక్స్ సీన్‌తో పోల్చింది. రైల్వేస్టేషన్లో పవన్ కల్యాణ్ తన అత్తను చూసి భావోద్వేగానికి గురయ్యే వీడియోను పంచుకుంది. ఇది చూసిన అభిమానులు ఆర్సీబీ టీమ్ క్రేజ్ వేరే లెవెల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో ఇదెక్కడి సింక్రా మావ అంటూ ఫన్నీ పోస్టులు పెడుతున్నారు. This part of my life, this little part, is called happiness. 🥹😭🏆#EeSaalaCupNamde #RCBvsPBKS #IPLFinal #Victory #JioHotstarTelugu pic.twitter.com/4k3rBcgLQ6— JioHotstar Telugu (@JioHotstarTel_) June 3, 2025 -
ఆర్సీబీ విజయంపై అల్లు అర్జున్ ట్వీట్.. అయాన్ ఫుల్ ఎమోషనల్!
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో బెంగళూరు టీమ్ విజయంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. ఈ క్షణం కోసమే 18 ఏళ్లుగా ఎదురు చూస్తున్నామని ట్విటర్ వేదికగా ఆనందాన్ని పంచుకున్నారు. వెయిట్ ఈజ్ ఓవర్.. ఈ సాలా కప్ నమ్దే అంటూ బన్నీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్సీబీ జట్టుకు, అభిమానులకు అభినందనలు తెలిపారు.ఆర్సీబీ మ్యాచ్ గెలిచన అనంతరం అల్లు అర్జున్ కుమారడు అయాన్ ఫన్నీగా సెలబ్రేట్ చేసుకున్నాడు. తాను కోహ్లీకి వీరాభిమానినని అయాన్ ఆనందం వ్యక్తం చేశాడు. తలపై వాటర్ బాటిల్‌తో నీళ్లు పోసుకుని బెంగళూరు విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇది చూసిన బన్నీ నవ్వుతూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫుల్లీ ఎమోషనల్ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు ఐకాన్ స్టార్.కాగా.. గతేడాది పుష్ప-2 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ప్రస్తుతం సినిమాలకు కాస్తా విరామం ఇచ్చాడు. ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేయనున్నారు. ఇటీవలే పుష్ప-2 సినిమాకు ఉత్తమ నటుడిగా గద్దర్ అవార్డ్ అందుకున్నారు. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) THE WAIT IS OVER . “Ee sala cup namde!” At last! ❤️We’ve been waiting for this day for 18 years.A big, big congratulations to RCB! ❤️ pic.twitter.com/2khiWPLWKV— Allu Arjun (@alluarjun) June 3, 2025 -
బెంగళూరు గెలుపు.. పూనకంతో ఊగిపోయిన స్టార్ డైరెక్టర్
ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ గెలవడంతో ఫ్యాన్స్ ఫుల్ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. రోడ్లపైకి వచ్చిన విక్టరీని ఎంజాయ్ చేశారు. ఈ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సైతం బెంగళూరు విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. మ్యాచ్ ముగిసిన వెంటనే డ్యాన్స్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. కేజీఎఫ్‌తో బ్లాక్‌బస్టర్ హిట్స్ కొట్టిన ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం మన యంగ్ టైగర్‌తో సినిమా చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో రానున్న చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీని ఎన్టీఆర్-నీల్ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ చిత్రం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. Director #PrashanthNeel is overjoyed as he celebrates #RCB’s victory in IPL 2025🏆#IPL2025Final #TeluguFilmNagar pic.twitter.com/tnXGeqqkem— Telugu FilmNagar (@telugufilmnagar) June 3, 2025 -
ఐపీఎల్ ఫైనల్.. వార్-2 టీమ్ స్పెషల్ సర్ప్రైజ్!
బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2ట'. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో మొదటి సారిగా ఎన్టీఆర్ విలన్ పాత్రలో కనిపించనుండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హృతిక్, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవలే మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా వార్-2 గ్లింప్స్ విడుదల చేసిన మేకర్స్ మరో సర్ప్రైజ్కు సిద్ధమయ్యారు.ఇవాళ జరగనున్న ఐపీఎల్ ఫైనల్లో మ్యాచ్‌లో వార్-2ను ప్రమోట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ స్పెషల్ ప్రోమోలను స్టేడియంలో ప్రసారం చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఏర్పాట్లు చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో హృతిక్, ఎన్టీఆర్‌ల పాత్రలకు సంబంధించిన వీడియోను ఓవర్ బ్రేక్‌ల మధ్య దాదాపు పది సెకన్ల పాటు ప్రసారం చేయనున్నారని సమాచారం. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. ట్విటర్ వేదికగా ఆయన పంచుకున్నారు. మరోవైపు ఈ చిత్రంలో గేమ్ ఛేంజర్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారు. కాగా.. ఇవాళ జరిగే ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్, బెంగళూరు టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. 'WAR 2' 10-SECOND PROMOS TO PREMIERE DURING IPL 2025 FINALS... The 10-second promos of #War2 – starring #HrithikRoshan, #JrNTR and #KiaraAdvani – will premiere on #JioHotstar during the #RCB vs #PBKS #IPLFinals tomorrow [3 June 2025]. #RCBvsPBKS pic.twitter.com/hPvvUBc6F1— taran adarsh (@taran_adarsh) June 2, 2025 -
ఆర్సీబీ గెలుపు కోసం అభిమానుల పూజలు
మైసూరు: మైసూరు నగరంలోని దివాన్రోడ్డులోని సమృద్ధంశ్వర ఆలయంలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనున్న ఆర్సీబీ, పంజాబ్ జట్ల మధ్య బుధవారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టు గెలుపొందాలని అభిమానులు విశేష హోమాలు, పూజలు నెరవేర్చారు. ఆర్సీబీ జట్టు గెలుపు కోసం ప్రారి్థంచి ఆర్సీబీ జర్సీ ధరించి అభిమానుల తరపున విశేష పూజలను చెల్లించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు కుమార్ నేతృత్వంలో విజయదుర్గ హోమాన్ని నెరవేర్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీ‹Ùగౌడ ఆర్సీబీ జెర్సీ ధరించి పాల్గొన్నారు. ఈసారి ఆర్సీబీ గెలుస్తుందని మేం ఆశిస్తున్నాం. ఈసారి ప్రతి ఆటగాడు బాగా రాణించాడు. కార్యక్రమంలో దేవరాజ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమే‹Ù, రాయప్ప, కర్ణాటక విజయ రక్షణ వేదిక అధ్యక్షుడు వినయ్‌కుమార్, గురురాజిత్ నవీన్, రవిచంద్ర పాల్గొన్నారు. -
IPL 2025: శ్రేయస్ వేట..గంభీర్ విలవిల
-
ఐపీఎల్ ఫైనల్.. ఎవరు గెలిచినా అది మాత్రం తప్పదు: ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్
ఐపీఎల్ క్వాలిఫయర్-2 మ్యాచ్‌పై దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్ చేశారు. ముంబయితో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అద్భుతమైన విజయం సాధించడంపై ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా బుమ్రా, బౌల్ట్ యార్కర్లను థర్ట్ మ్యాన్ దిశగా బౌండరీకి తరలించడంపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను కొనియాడారు. అతని బ్యాటింగ్ అద్భుతంగా ఉందని ట్వీట్ చేశారు.గతంలో ఢిల్లీ టీమ్‌ను ఫైనల్‌కు తీసుకొచ్చిన శ్రేయస్ అయ్యర్‌ను వదిలేశారని.. ఆ తర్వాత కోల్‌కతాకు ట్రోఫిని అందించినా శ్రేయస్ అయ్యర్‌ను మళ్లీ తీసుకోలేదని రాజమౌళి పోస్ట్ చేశారు. ఈ ఏడాది దాదాపు 11 ఏళ్ల తర్వాత పంజాబ్‌ను ఫైనల్ వరకు తీసుకొచ్చిన శ్రేయస్ అయ్యర్ టైటిల్ కొట్టేందుకు పూర్తిగా అర్హుడని రాజమౌళి అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే సమయంలో విరాట్ కోహ్లీ కొన్నేళ్లుగా బెంగళూరు తరపున వేల పరుగులు సాధించాడని.. కానీ టైటిల్ గెలిచేందుకు సమయం ఆసన్నమైందని రాసుకొచ్చాడు. ఈ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ఫలితం ఏదైనా హార్ట్ బ్రేకింగ్ మాత్రం తప్పదని అంటున్నారు రాజమౌళి.ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే మన దర్శకధీరుడు క్రికెట్‌పై ట్వీట్ చేయడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మహేశ్ బాబుతో ఓ భారీ అడ్వెంచరస్ మూవీని తెరకెక్కిస్తున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. ఇటీవలే ఒడిశాలో రాజమౌళి- మహేశ్ బాబు సినిమా షూటింగ్ కూడా జరిగింది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. Iyer guiding Bumrah’s and Boult’s yorkers to the third man boundary… Exquisite…This man leads Delhi to a final… and is dropped…Leads Kolkata to a trophy… dropped…Leads a young Punjab to the finals after 11 years.He deserves this year’s trophy too…On the other hand,… pic.twitter.com/ws0anhcZ3l— rajamouli ss (@ssrajamouli) June 2, 2025 -
IPL 2025: పంత్ తప్పు చేశాడా?
-
LSG Vs RCB: బెంగళూరుకు ‘ఆఖరి’ చాన్స్
లక్నో: ఐపీఎల్ లీగ్ దశ ఆఖరి అంకానికి చేరింది. 66 రోజులుగా జరుగుతున్న లీగ్ దశకు నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ఫలితంతో తెరపడుతుంది. ఈ సీజన్లో ఎప్పుడో నాలుగు జట్లు ‘ప్లే ఆఫ్స్’ చేరాయి. అలాగని ఈ మ్యాచ్ పూర్తిగా నామమాత్రమని కొట్టిపారేయడానికి వీలు లేదు. ఎందుకంటే ‘ప్లే ఆఫ్స్’ చేరిన నాలుగు జట్లలో ఒకటైన ఆర్సీబీ సేఫ్ జోన్ టాప్–2లో నిలిచేందుకు ఇదే ఆఖరి అవకాశం. ఈడెన్ గడ్డపై మార్చి 22న మొదలైన ఐపీఎల్లో కోల్‌కతాపై గెలిచి శుభారంభం చేసిన బెంగళూరు... ఇప్పుడు మరో పరాయిగడ్డ లక్నోలోనూ సూపర్ జెయింట్స్‌పై గెలిచి టాప్–2లో చేరాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు ఈ సీజన్లో ఎలాగూ ముందంజ వేయలేకపోయిన లక్నో... కనీసం సొంత ప్రేక్షకుల మధ్య విజయంతో ముగింపు పలకాలనే పట్టుదలతో ఉంది. మిడిలార్డర్ మెరిపిస్తే... బెంగళూరు జట్టులో ఓపెనర్లు ఫిల్ సాల్ట్, కోహ్లి మంచి ఆరంభాన్నే ఇస్తున్నారు. హైదరాబాద్‌తో జరిగిన తమ చివరి మ్యాచ్‌లో ఓపెనింగ్ వికెట్‌కు 7 ఓవర్లలో 80 పరుగులు జోడించారు. తర్వాత వచ్చిన మిడిలార్డర్ బ్యాటర్లు రజత్ పాటీదార్, జితేశ్ శర్మ, షెఫర్డ్, కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్‌లు తీవ్రంగా నిరుత్సాహపరిచారు. వీళ్లందరూ మూకుమ్మడిగా విఫలమవడం మ్యాచ్ ఫలితాన్నే మార్చింది. లేదంటే 200 పైచిలుకు లక్ష్యాన్ని బెంగళూరు ఛేదించేంది. ఇక బౌలర్లు గత మ్యాచ్‌లో విరివిగా పరుగులు సమర్పించుకున్నారు. యశ్ దయాళ్, ఇన్‌గిడి, షెఫర్డ్, సుయశ్లు తేలిపోవడం ప్రత్యర్థి బ్యాటర్లకు అనుకూలతనిచ్చింది. అయితే టాప్–2లో నిలిపే కీలకమైన పోరులో సమష్టిగా బాధ్యత కనబరిస్తే ఆర్సీబీకి ఢోకా ఉండదు. తడాఖా చూపేనా లక్నో ప్లే ఆఫ్స్‌కు మాత్రమే దూరమైంది. అంతమాత్రాన పోరాటానికి విరామమివ్వలేదు. గత రెండు మ్యాచ్‌ల్ని పరిశీలిస్తే ఈ విషయమే అర్థమవుతుంది. సొంతగడ్డపై లక్నో 205 పరుగులు చేసింది. కానీ సన్‌రైజర్స్ దూకుడుతో ఓడింది. ఇక గుజరాత్ గడ్డ అహ్మదాబాద్‌పై టైటాన్స్‌పై 235 పరుగులు చేసి గెలిచింది. గత రెండు మ్యాచ్‌ల్లోనూ సులువుగా 200 పైచిలుకు పరుగులు చేసిన లక్నో బ్యాటింగ్ దుర్భేధ్యంగా ఉంది. ముఖ్యంగా ఓపెనర్లు మిచెల్ మార్‡్ష, మార్క్రమ్, మిడిలార్డర్లో నికోలస్ పూరన్ ఫామ్‌లో ఉన్నారు. ప్రత్యర్థి బౌలర్లపై చెలరేగుతున్నారు. లక్నో బ్యాటింగ్‌కు అండ, దండా ఈ ముగ్గురే! బౌలింగ్ విభాగానికి వస్తే రూర్కే, అవేశ్ ఖాన్లు నిలకడగా వికెట్లు తీస్తున్నారు. ఒక మ్యాచ్ సస్పెన్షన్‌తో గత మ్యాచ్‌కు దూరమైన స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి రావడం కలిసొచ్చే అంశం. అతని ప్రవర్తన పక్కనబెడితే స్పిన్‌తో బ్యాటర్లను బాగా ఇబ్బంది పెడుతున్నాడు. నేటి మ్యాచ్‌లో వీళ్లందరూ ఆశించిన మేర రాణిస్తే విజయంతో బైబై చెప్పడం ఏమంత కష్టం కానేకాదు. పిచ్, వాతావరణం బ్యాటింగ్‌కు కలిసొచ్చే పిచ్ ఇది. మూడు మ్యాచ్‌ల్లో 200 పైచిలుకు స్కోరు సాధ్యమైంది. ఇందులో ఒకసారైతే 206 లక్ష్యఛేదన సులువైంది. టాస్ నెగ్గిన జట్టు మొదట ఫీల్డింగ్‌కే మొగ్గుచూపుతుంది.. మంగళవారం వర్ష సూచనైతే లేదు. తుది జట్లు (అంచనా) బెంగళూరు: రజత్ పాటీదార్ (కెపె్టన్), సాల్ట్, కోహ్లి, మయాంక్, జితేశ్, రొమారియో షెఫర్డ్, కృనాల్, టిమ్ డేవిడ్, భువనేశ్వర్, యశ్ దయాళ్, ఇన్‌గిడి. లక్నో: రిషభ్ పంత్ (కెపె్టన్), మార్క్రమ్, మిచెల్ మార్‡్ష, పూరన్, ఆయుశ్ బదోని, సమద్, హిమ్మత్ సింగ్, షాబాజ్, అవేశ్‌ఖాన్, ఆకాశ్‌దీప్, విల్ రూర్కే. -
IPL: రిటైర్మెంట్పై ధోని కీలక వ్యాఖ్యలు
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఈ ఏడాది ఐపీఎల్ ఆఖరి సీజన్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తన రిటైర్మెంట్ వార్తలపై ధోని స్పందించాడు. తన నిర్ణయాన్ని వెల్లడించడానికి ఇంకా సమయం ఉందని ధోని చెప్పుకొచ్చాడు.ఐపీఎల్-2025లో ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 83 పరుగుల తేడాతో సీఎస్కే ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం ప్రెజేంటర్ ధోని తన రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి ప్రశ్నించాడు."వచ్చే సీజన్ ఆడాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి నాలుగు లేదా ఐదు నెలల సమయం ఉంది. రిటైర్మెంట్ విషయంలో తొందరపడాల్సిన అవసరం లేదు. ఇది ప్రొఫెషనల్ క్రికెట్. ఏ ఆటగాడైనా ఫిట్‌గా ఉండి, ఆడాలనే తపన ఉన్నంత కాలం ఆడొచ్చు. ప్రదర్శన ఆధారంగా రిటైర్ అవ్వాలంటే, ప్రతీ ఆటగాడు 22 ఏళ్లకే వీడ్కోలు పలకాలి. నేను తిరిగి రాంఛీకి వెళ్లి ఫ్యామిలీతో సమయాన్ని గడుపుతాను. ఆ తర్వాత ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను. అయితే వచ్చే సీజన్‌కు తిరిగి వస్తాను అని చెప్పలేను.. అలా అని రానని చెప్పలేను. నాకు ఇంకా చాలా సమయముందని" 43 ఏళ్ల ధోని బదులిచ్చాడు. -
వారి ఆట అద్భుతం.. మేం కూడా నిరూపించుకున్నాం: పంత్
ఐపీఎల్-2025లో లక్నోసూపర్ జెయింట్స్ ఎట్టకేలకు మరో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన లక్నో.. టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్‌కు చెక్ పెట్టింది. గుజరాత్ జట్టును 33 పరుగుల తేడాతో మట్టికరిపించింది. 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 202 పరుగులకు పరిమితమైంది. లక్నో విజయంపై కెప్టెన్ రిషబ్ పంత్ ఆనందం వ్యక్తం చేశాడు.మ్యాచ్ ముగిసిన అనంతరం, లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ.. విజయం పట్ల కచ్చితంగా సంతోషంగా ఉంది. ఓ జట్టుగా మేము మంచి క్రికెట్ ఆడగలమని నిరూపించాం. టోర్నమెంట్లో మాకు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశాలు ఒకప్పుడు ఉన్నాయి. ఇప్పుడు గెలిచినా రేసులో లేము. కానీ అది ఆటలో భాగం. ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి. టాప్ త్రీలో చోటు సంపాదించడం ఎప్పుడూ సులభం కాదు. మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్‌లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఫీల్డింగ్‌లో కొన్ని తప్పిదాలు చేశాం. మరికొంత మెరుగు కావాల్సి అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.గుజరాత్ కెప్టెన్ శుభమన్ గిల్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్ ఓటమి ద్వారా జట్టులో కొన్ని లోపాలు, సానుకూల అంశాలను తెలుసుకున్నాం. పవర్‌ప్లేలో మేము బాగా బౌలింగ్ చేశాం. కానీ, అనుకున్న ప్రకారం వికెట్టు సాధించలేకపోయాం. మా బౌలర్లు భారీగా పరుగులిచ్చారు. 15-20 పరుగులు అదనంగా ఇచ్చాం. వారిని 210 దగ్గర ఆపాలనుకున్నాము. 210కి 230 మధ్య భారీ తేడా ఉంటుంది. 240 పరుగులను ఛేదించడం ఎప్పుడూ సులభం కాదు. రూథర్‌ఫోర్డ్, షారుఖ్ బ్యాటింగ్ మాకు పెద్ద పాజిటివ్ అంశం. ప్లేఆఫ్‌లోకి వెళ్లే క్రమంలో మళ్లీ పుంజుకుని విజయం సాధిస్తామని తెలిపాడు.ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (117; 64 బంతుల్లో 10×4, 8×6) మెరుపు శతకం సాధించడంతో ఎల్ఎస్జీ 2 వికెట్లకు 235 పరుగుల భారీ స్కోరు సాధించింది. నికోలస్ పూరన్ (56 నాటౌట్; 27 బంతుల్లో 4×4, 5×6), మార్క్రమ్ (36; 24 బంతుల్లో 3×4, 2×6) కూడా రాణించారు. అనంతరం ఛేదనలో గుజరాత్ 9 వికెట్లకు 202 పరుగులే చేయగలిగింది. షారుఖ్ ఖాన్ (57; 29 బంతుల్లో 5×4, 3×6) టాప్‌స్కోరర్. ఎల్ఎస్జీ బౌలర్లలో ఒరూర్క్ (3/27), ఆయుష్ బదోని (2/4) రాణించారు. 13 మ్యాచ్‌ల్లో గుజరాత్‌కిది 4వ ఓటమి కాగా.. లక్నో ఆరో విజయం నమోదు చేసింది. ఈ సీజన్లో నిలకడకు మారుపేరుగా నిలిచిన సాయి సుదర్శన్ (21) ఇన్నింగ్స్‌ను మెరుగ్గానే ఆరంభించినా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. -
ఖరీదైన ఫ్లాట్ కొన్న శిఖర్ ధావన్.. ధర తెలిస్తే షాక్!
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేశాడు. గురుగ్రామ్ (Gurugram)లోని విలాసవంతమైన ఈ ఇంటి కోసం దాదాపు రూ. 69 కోట్లు ఖర్చు చేశాడు. కాగా భారత జట్టు మాజీ ఓపెనర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు శిఖర్ ధావన్.రోహిత్ శర్మ (Rohit Sharma)కు ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగిన ధావన్.. 2013లో టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మెగా ఐసీసీ ఈవెంట్లో కేవలం ఐదు ఇన్నింగ్స్‌లోనే 363 పరుగులతో సత్తా చాటి ధోని సేన ట్రోఫీని ముద్దాడేలా చేశాడు.జాతీయ జట్టు తరఫున ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన ధావన్.. శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్‌ల రాకతో టీమిండియాలో స్థానం కోల్పోయాడు. ఈ క్రమంలో 2022లో చివరగా భారత్‌కు ఆడిన ధావన్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.రెండు చేతులా సంపాదన.. నికర ఆస్తి?మొత్తంగా టీమిండియా తరఫున 288 మ్యాచ్‌లు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 10867 పరుగులు సాధించాడు. ఇక ఫామ్‌లో ఉండగా రెండు చేతులా సంపాదించిన ధావన్.. ఐపీఎల్ ద్వారా కూడా కోట్లాది రూపాయలు ఆర్జించాడు. పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గానూ వ్యవహరించి తన నెట్‌వర్క్‌ను పెంచుకున్నాడు.జాతీయ స్పోర్ట్స్ వెబ్సైట్ నివేదిక ప్రకారం.. 2025 నాటికి శిఖర్ ధావన్ నికర ఆస్తుల విలువ రూ. 120 కోట్లు ఉన్నట్లు అంచనా. ఇక 39 ఏళ్ల ధావన్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. ఆయేషా ముఖర్జీ అనే డివోర్సీని పెళ్లి చేసుకున్న గబ్బర్‌కు కుమారుడు జొరావర్ ఉన్నాడు.మరోసారి ప్రేమలో గబ్బర్అయితే, ఆయేషాతో విభేదాల కారణంగా 2023లో విడాకులు తీసుకున్నాడు. ఇక గత కొంతకాలంగా ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్ అనే మహిళతో శిఖర్ ధావన్ డేటింగ్ చేస్తున్నాడు. ఈ జంట సహజీవనంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో గబ్బర్ గురుగ్రామ్‌లో కొత్త ఫ్లాట్ కొనడం విశేషం.గురుగ్రామ్‌లోని డీఎల్ఎఫ్ 5, సెక్టార్ 54, గోల్ఫ్ కోర్స్ రోడ్‌లోని రెసిడెన్షియల్ ప్రాజెక్టులో ధావన్ ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీని ధర రూ. సుమారు 65.61 కోట్లు కాగా..స్టాంపు డ్యూటీగా రూ. 3.28 కోట్లు చెల్లించినట్లు సమాచారం.అద్బుత ఆట తీరుతోకాగా అంతర్జాతీయ క్రికెట్లో మొత్తంగా 167 వన్డేలు ఆడి 6793 పరుగులు చేసిన గబ్బర్..టెస్టు ఫార్మాట్లో 34 మ్యాచ్‌లు ఆడి 2315 రన్స్ సాధించాడు. ఇక టీమిండియా తరఫున 68 టీ20లలో 1759 పరుగులు చేసిన గబ్బర్.. ఐపీఎల్లో 221 ఇన్నింగ్స్‌లో 6769 పరుగులు సాధించాడు. తద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఇప్పటికీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇలా తన అద్బుత ఆట తీరుతో కోట్లు గడించాడు ధావన్.చదవండి: ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్ -
గిల్ క్రిస్ట్ ఆల్ టైమ్ ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్.. కోహ్లికి నో ఛాన్స్
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ తన ఆల్ టైమ్ ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు. అయితే తన ఎంచుకున్న జట్టులో కేవలం ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న ప్లేయర్లకు మాత్రమే గిల్‌క్రిస్ట్ అవకాశమిచ్చాడు. ఈ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎక్కువగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే ఈ రెండు ఫ్రాంచైజీలు చెరో ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాయి. ఈ జట్టుకు కెప్టెన్‌గా సీఎస్కే దిగ్గజం ఎంఎస్ ధోనిని గిల్ ఎంపిక చేశాడు. ధోనితో పాటుగా సీఎస్కే లెజెండ్స్ సురేష్ రైనా, రవీంద్ర జడేజాలు ఉన్నారు.అదేవిధంగా ముంబై ఇండియన్స్ నుంచి ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ రోహిత్ శర్మ, విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, విండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్, డేంజరస్ పేస్ ద్వయం లసిత్ మలింగ,జస్ప్రీత్ బుమ్రాలకు అతడు ఛాన్స్ ఇచ్చాడు. ఇక రెండు సార్లు ఛాంపియన్ కేకేఆర్ నుంచి సునీల్ నరైన్‌కు మాత్రమే చోటు దక్కింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి డేవిడ్ వార్నర్, భువనేశ్వర్ కుమార్‌ను గిల్ క్రిస్ట్ ఎంపిక చేశాడు. అయితే ఆర్సీబీ టైటిల్ గెలవకపోవడంతో ఈ జట్టులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి చోటు దక్కలేదు. కాగా భారత్-పాక్ ఉద్రిక్తల నేపథ్యంలో వాయిదా పడిన ఐపీఎల్-2025 సీజన్ తిరిగి మే 17 నుంచి ప్రారంభం కానుంది.గిల్ క్రిస్ట్ ఆల్ టైమ్ ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్ఎంఎస్ ధోని (కెప్టెన్), రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, సురేష్ రైనా, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, సునీల్ నరైన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ, భువనేశ్వర్ కుమార్చదవండి: రోహిత్ శర్మకు రాహుల్ ద్రవిడ్ మెసేజ్.. వీడియో వైరల్ -
IPL 2025: 16 లేదా 17 నుంచి ఐపీఎల్!
న్యూఢిల్లీ: ప్రతీ వేసవిలో మెరుపు క్రికెట్ వినోదాన్ని పంచే ఐపీఎల్‌కు ఈసారి ఉద్రిక్త పరిస్థితుల సెగ తగిలింది. భారత్, పాక్‌ల మధ్య డ్రోన్ల యుద్ధంతో లీగ్‌ను వారంపాటు వాయిదా వేశారు. ఇపుడు తాజా కాల్పుల విరమణ నేపథ్యంలో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్న బీసీసీఐ ఐపీఎల్ పునఃప్రారంభానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ వారాంతంలోనే ఆటను తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నెల 16 లేదంటే 17 నుంచి ఐపీఎల్ మళ్లీ మొదలవనుంది. ఫైనల్ వేదికను కోల్‌కతా నుంచి అహ్మదాబాద్‌కు మార్చే యోచనలో బీసీసీఐ ఉంది. ఈ మార్పునకు వర్ష సూచనే కారణమని తెలిసింది. ఆటగాళ్ల సంసిద్ధత, విదేశీ ఆటగాళ్లను వెంటనే రప్పించే ఏర్పాట్లను వెంటనే పూర్తిచేయాలని రేపటికల్లా ఫ్రాంచైజీలన్నీ రెడీగా ఉండాలని బీసీసీఐ సూచించింది. అన్నీ డబుల్ హెడర్‌లేనా? ఈ నెలాఖరుకల్లా ఐపీఎల్‌ను పూర్తిచేయాలని పట్టుదలతో ఉన్న లీగ్ పాలకమండలి మిగతా లీగ్ మ్యాచ్‌ల్ని డబుల్ హెడర్ (రోజూ రెండు మ్యాచ్‌ల చొప్పున)లుగా నిర్వహించే ప్రణాళికతో ఉంది. హైదరాబాద్‌లోనే ఆ రెండు ప్లే ఆఫ్స్ హైదరాబాద్ అభిమానులకు ఎలాంటి నిరాశలేకుండా ముందనుకున్న షెడ్యూల్ ప్రకారమే రెండు ‘ప్లేఆఫ్స్’ మ్యాచ్‌లు ఉప్పల్ స్టేడియంలోనే జరుగుతాయని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. తేదీలు మారినా... తొలి క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌లు హైదరాబాద్‌లోనే నిర్వహిస్తారు. అయితే రెండో క్వాలిఫయర్ సహా ఫైనల్ పోరుకు వేదికైన కోల్‌కతాలోనే వాతావరణ సమస్యలు ఎదురవుతాయని తెలిసింది. ఈ నేపథ్యంలో విజేతను తేల్చే మ్యాచ్‌కు వర్షం అడ్డులేకుండా ఉండేలా అహ్మదాబాద్‌ను ఫైనల్ వేదికగా ఖరారు చేసే అవకాశముంది. మొత్తానికి సోమవారం షెడ్యూల్‌పై కసరత్తు పూర్తి చేస్తారని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. -
ఐపీఎల్ నిలిపివేత.. కంపెనీలకు నష్టం ఎంతంటే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)–2025 మ్యాచ్‌లను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. భారత్-పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఐపీఎల్‌ను వెంటనే నిలిపేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టం చేసింది. ప్రస్తుతానికి వారం రోజులపాటు లీగ్‌ను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. తదుపరి మ్యాచ్‌లకు సంబంధించి తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. ఐపీఎల్ 2025ను నిలిపివేయడం ప్రకటనదారులు, బ్రాడ్కాస్టర్లలో ఆందోళనలకు కారణమవుతుంది. ప్రకటనల ఆదాయంలో 35% తగ్గవచ్చని నిపుణులు భావిస్తున్నారు. లీగ్ వాయిదా పడడం వల్ల మార్కెటింగ్ ప్రణాళికలకు అంతరాయం కలిగినట్లు తెలియజేస్తున్నారు.బ్రాడ్కాస్టర్లు, బ్రాండింగ్ కంపెనీల ఆందోళనభారతదేశంలో అత్యంత లాభదాయకమైన క్రీడా ఈవెంట్లలో ఐపీఎల్ ఒకటి. ఇది మిలియన్ల మంది వీక్షకులను ఆకర్షిస్తోంది. భారీ ప్రకటనల ఆదాయాన్ని సృష్టిస్తోంది. మార్కెటింగ్ కీలకంగా మారిన ఈ లీగ్ పునఃప్రారంభించకపోతే జియోహాట్‌స్టార్ వంటి బ్రాడ్కాస్టర్లు రూ.2,000 కోట్ల ఆదాయ లోటును ఎదుర్కోవాల్సి ఉంటుందని కొందరు అంచనా వేస్తున్నారు. చాలా బ్రాండ్లు ఐపీఎల్ వాణిజ్య ప్రకటనల కోసం గణనీయంగా బడ్జెట్ కేటాయించాయి. అధిక వ్యూయర్షిప్ ద్వారా రాబడిని పెంచాలని నిర్ణయించాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వారు తీవ్రమైన ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీన్ని నివారించడానికి కొత్త వ్యూహాలతో ముందుకుసాగాలని కంపెనీలు భావిస్తున్నట్లు తెలియజేస్తున్నారు.జట్లు, ఫ్రాంచైజీలపై ప్రభావంప్రకటనదారులు, బ్రాడ్కాస్టర్లకు మించి ఈ వాయిదా నిర్ణయం నేరుగా ఐపీఎల్ ఫ్రాంచైజీలపై ప్రభావం చూపుతుంది. సెంట్రల్ రెవెన్యూ పూల్‌పై ఆధారపడే జట్లు తమ సంపాదనలో 20% క్షీణతను చూడవచ్చని కొందరు అంటున్నారు. భారత్-పాక్ యుద్ధ సమయంలో అనిశ్చితి కారణంగా అనేక ఫ్రాంచైజీలు స్పాన్సర్షిప్లను, టిక్కెట్ల అమ్మకాల ద్వారా సమకూరే ఆదాయాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.ఇదీ చదవండి: ఇండియా-యూఎస్ వయా యూరప్భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో లీగ్ నిలిపివేతకు జాతీయ ప్రయోజనాలే కారణమని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పేర్కొంది. తొలుత వారం రోజుల విరామం ప్రకటించినప్పటికీ, అప్పటివరకు యుద్ధం సమసిపోనట్లయితే ఇది మరింతకాలం పోడిగించే అవకాశం ఉంది. ఇంకా ఆలస్యం అయితే లీగ్‌ను రద్దు చేసుకోవచ్చని కూడా కొందరు అంచనా వేస్తున్నారు. -
స్ట్రీట్ వేర్.. షీక్ స్టైల్.. ఐపీఎల్ క్రికెటర్ @ఐవేర్..
సాక్షి, సిటీబ్యూరో : ఫ్యాషన్ ప్రపంచంలో స్ట్రీట్ వేర్‌కు తనకంటూ ఓ స్టైల్ ఉంది.. ప్రముఖ బ్రాండ్స్ తమదైన శైలిలో వీటిని డిజైన్ చేసి యూత్‌ని ఆకట్టుకుంటుంటాయి.. అదే క్రమంలో ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ షీక్ తమ స్ట్రీట్ వేర్‌ను నగరంలో ప్రదర్శించింది. మాదాపూర్‌లోని నోవోటెల్ హోటల్లో నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది.. ఈ సందర్భంగా బ్రాండ్‌ను సిటీలో లాంచ్ చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. చదవండి: వెయిటర్ టు కరోడ్‌పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్స్పైరింగ్ జర్నీఅగ్రగామి క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ నగరంలో సందడి చేశాడు. అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు, షేక్ హ్యాండ్స్ ఇస్తూ వారిని అలరించాడు. నగరంలోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్లోని ఐవేర్ బ్రాండ్ అయిన ఎఓ ఆప్టికల్స్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాండ్ రూపొందించిన సరికొత్త కళ్లజోళ్ల కలెక్షన్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బ్రాండ్ డైరెక్టర్ ప్రియాంక గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి : Operation Sindoor సలాం, హస్నాబాద్!ఇంటర్న్ షిప్‌తో కెరీర్‌కు ఊతం నగరంలోని కేఎల్‌హెచ్ డీమ్డ్ యూనివర్సిటీ, అజీజ్ నగర్ క్యాంపస్, తమ విద్యార్థులు ప్రముఖ బహుళజాతి సంస్థలు ( MNఇలు) సహా ప్రఖ్యాత కంపెనీల నుంచి పెద్ద సంఖ్యలో ప్లేస్మెంట్ ఆఫర్లు పొందారు. ఈ విషయాన్ని యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ కోనేరు లక్ష్మణ్ హవిష్ తెలిపారు. పలు సంస్థల్లో విద్యార్థులకు ఇంటర్న్íÙప్ ఆధారిత ఉద్యోగాలు లభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ కెరీర్‌కు ఎంతో మేలు చేస్తాయని, పెద్ద సంఖ్యలో తమ విద్యార్థులు ఒప్పో వంటి సంస్థల్లో ఇంటర్న్íÙప్ టూ ప్లేస్‌మెంట్స్ ఆఫర్స్ ద్వారా రూ.19లక్షల ప్యాకేజీ దక్కించు కోనున్నారని వెల్లడించారు. మరికొందరు విద్యార్థులు సీమన్స్ సంస్థ నుంచి నేరుగా ప్లేస్మెంట్ ఆఫర్స్ దక్కించుకున్నారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. -
మేకను బలి ఇచ్చిన అభిమానులపై కేసు
దొడ్డబళ్లాపురం: విరాట్ కోహ్లి కటౌట్ ముందు మేకను బలి ఇచ్చిన ఆర్సీబీ అభిమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన చిత్రదుర్గ జిల్లా మొళకాల్మూరు తాలూకా మారమ్మనహళ్లిలో చోటుచేసుకుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ విజయం సాధించారు. దీంతో ఆనందం పట్టలేని అభిమానులు మారమ్మనహళ్లిలో విరాట్ కోహ్లి కటౌట్ పెట్టి మేకను బలి ఇచ్చారు. సదరు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో మొళకాల్మూరు పోలీసులు పాలయ్య, జయణ్ణ, తిప్పేస్వామిలపై కేసు నమోదు చేశారు. -
ఐపీఎల్ ప్రారంభం నుండి మొదట నిష్క్రమించిన జట్లు ఇవే..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. 49వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమితో ఈ సీజన్లో సీఎస్కే ఖేల్ ఖతమైంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఈ సీజన్లో సీఎస్కే మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మే 3న ఆర్సీబీ, మే 7న కేకేఆర్, మే 12న రాజస్థాన్, మే 18న గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.కాగా, ఓ ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలవడం ఐదు సార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ ఇది కొత్తేమీ కాదు. 2020 సీజన్లో కూడా ఆ జట్టు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. ఐపీఎల్ ప్రారంభం నుండి అత్యధిక సార్లు తొలుత ఎలిమినేట్ అయిన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ఈ ఫ్రాంచైజీ అత్యధికంగా మూడు సీజన్లలో అన్ని జట్లకంటే ముందే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.ఢిల్లీ తర్వాత డెక్కన్ ఛార్జర్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, ఆర్సీబీ, సీఎస్కే, ముంబై ఇండియన్స్ తలో రెండు సీజన్లలో అన్నిటి కంటే ముందే టైటిల్ వేట నుంచి నిష్క్రమించాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, పూణే వారియర్స్ ఇండియా, కేకేఆర్, పంజాబ్ కింగ్స్ తలో సారి అన్ని జట్ల కంటే ముందే టైటిల్ వేటను ముగించాయి.సీజన్ల వారీగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి మొదట నిష్క్రమించిన జట్లు..2008- డెక్కన్ ఛార్జర్స్2009- కేకేఆర్2010- కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 2011- డెక్కన్ ఛార్జర్స్2012- కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 2013- పూణే వారియర్స్ ఇండియా 2014- ఢిల్లీ క్యాపిటల్స్2015- పంజాబ్ కింగ్స్2016- రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్2017- ఆర్సీబీ2018- ఢిల్లీ క్యాపిటల్స్2019- ఆర్సీబీ2020- సీఎస్కే2021- సన్‌రైజర్స్ హైదరాబాద్2022- ముంబై ఇండియన్స్2023- ఢిల్లీ క్యాపిటల్స్2024- ముంబై ఇండియన్స్2025- సీఎస్కేకాగా, ప్రస్తుత సీజన్లో సీఎస్కే ఎలిమినేట్ అయిన మరుసటి రోజే రాజస్థాన్ రాయల్స్ కూడా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం మరో రెండు జట్లు ప్రమాదం అంచుల్లో (ఎలిమినేషన్) ఉన్నాయి. వీటిలో సన్‌రైజర్స్ భవితవ్యం ఈ రోజే తేలిపోతుంది. కేకేఆర్ ఫేట్ డిసైడ్ కావాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే. ఇవాళ (మే 2) సన్‌రైజర్స్ గుజరాత్ టైటాన్స్‌ను వారి సొంత మైదానంలో ఢీకొట్టనుంది. -
Vaibhav Suryavanshi: అమ్మా నాన్నల త్యాగం సూర్యవంశీ ఎమోషనల్
-
విరాట్ కోహ్లి తొందరపడ్డాడు.. అప్పటి వరకు ఆడాల్సింది: సురేష్ రైనా
ఐపీఎల్-2025లో టీమిండియా స్టార్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి దుమ్ములేపుతున్నాడు. గురువారం చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి హాఫ్ సెంచరీతో మెరిశాడు. కోహ్లికి ఇది వరుసగా రెండో హాఫ్ సెంచరీ కావడం గమనార్హం.ఈ మ్యాచ్‌లో 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేసి కింగ్ కోహ్లి ఔటయ్యాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 392 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో కోహ్లిపై భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ చాలా త్వరగా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్ ప్రకటించాడని, 2026 టీ20 ప్రపంచ కప్ వరకు ఆడింటే బాగుండేదని రైనా అభిప్రాయపడ్డాడు."విరాట్ కోహ్లి టీ20 క్రికెట్ నుంచి కాస్త ముందుగా రిటైర్ అయ్యాడని నేను ఇప్పటికీ భావిస్తున్నాను. ప్రస్తుతం అతడు ఆడుతున్న తీరును చూస్తుంటే టీ20 ప్రపంచకప్-2026 కొనసాగింటే బాగుండేది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో కోహ్లి అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతడు ఇప్పటికీ చాలా ఫిట్నెస్గా కన్పిస్తున్నాడు" అని స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రైనా పేర్కొన్నాడు. కాగా టీ20 వరల్డ్‌కప్-2024 విజయం అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజాలు అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.కాగా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో విరాట్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 125 మ్యాచ్‌లు ఆడి, 48.69 సగటుతో 4188 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 38 అర్ధ సెంచరీలు, 124 ఫోర్లు, 54 సిక్సర్లు ఉన్నాయి. టీ20 ప్రపంచ కప్‌లలో కోహ్లి 1292 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు -
రోహిత్ పై పాండ్యా విషం.. నువ్వు మారవా బ్రో?
-
ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్
పలు కన్నడ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న అర్చన కొట్టిగె(Archana Kottige) పెళ్లి చేసుకుంది. తన రాష్ట్రానికి చెందిన శరత్ అనే క్రికెటర్ తో కొత్త జీవితం ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.2018 నుంచి ఇండస్ట్రీలో ఉన్న అర్చన.. డియర్ సత్య, యెల్లో గ్యాంగ్స్, విజయానంద్, హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే తదితర సినిమాల్లో నటించింది. ఈమె వయసు ప్రస్తుతం 28 ఏళ్లే. అయితేనేం కర్ణాటక తరఫున క్రికెటర్ గా గుర్తింపు తెచ్చుకున్న శరత్ బీఆర్(Sharath Br)ని పెళ్లి చేసుకుంది. బుధవారం ఉదయం సంప్రదాయ పద్ధతిలో వీళ్ల పెళ్లి(Heroine Wedding) జరిగింది.(ఇదీ చదవండి: ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?)ఇకపోతే మంగళవారం రాత్రి అర్చన-శరత్ వెడ్డింగ్ రిసెప్షన్ జరగ్గా.. కాంతార హీరోయిన్ సప్తమి గౌడతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అలానే శరత్ కోసం కర్ణాటకకు చెందిన ప్రసిద్ధ్ కృష్ణ, యష్ దయాల్, దేవదత్ పడిక్కల్ తదితరులు హాజరయ్యారు.కర్ణాటక తరఫున అండర్-23 ఆడిన శరత్.. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్. గతేడాది ఐపీఎల్ లోనూ గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడాడు. కనీస ధర రూ.20 లక్షలకు ఇతడిని టీమ్ దక్కించుకుంది. కానీ తుది జట్టులో అవకాశం దక్కలేదు. ఇప్పుడు ఇతడు పెళ్లి చేసుకోవడంతో సినీ, క్రికెట్ సెలబ్రిటీలు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్) -
ఐదు ప్రశ్నలకు సమాధానం.. ఫ్రీగా ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ టికెట్స్ !
ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన తాజా చిత్రం చౌర్యపాఠం(Chaurya Paatam Movie). ఈ సినిమాకు నిఖిల్ గొల్లమారి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు, చూడామణి సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేయగా..ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.అయితే ఈ సినిమాకు రిలీజ్‌కు ఇంకా రెండు రోజులు సమయం ఉండడంతో మూవీ టీమ్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. దీంతో చౌర్యపాఠం చిత్రబృందం అందరికంటే కాస్తా భిన్నంగా ప్రమోషన్స్ ప్రారంభించింది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ ఫుల్ స్వింగ్‌లో ఉండడంతో ప్రమోషన్లలో వాడేశారు. ఈనెల 23న హైదరాబాద్‌లో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌కు ఉచితంగా టిక్కెట్స్ గెలుచుకునే అవకాశాన్ని కల్పించారు. దీనికోసం ఓ చిన్న కాంటెస్ట్‌ను ప్లాన్ చేశారు. అదేంటో తెలుసుకుందాం.చౌర్యపాఠం ట్రైలర్ చూసి అందులో ఐదు ప్రశ్నలకు కరెక్ట్‌గా సమాధానాలు పంపాలి. ఐదింటికి సరైన సమాధానాలు పంపిన వారిలో లక్కీ డ్రా ఎంపిక చేస్తారు. ఈ ప్రశ్నలను ట్విటర్ ద్వారా షేర్ చేశారు హీరో ఇంద్ర రామ్. మొదటి ప్రశ్న- ట్రైలర్లో వినిపించే గ్రామం పేరేంటి? రెండోది- ప్రతి రోజు బెల్ ఎన్ని గంటలకు మోగుతుంది? మూడోది.. వీక్నెస్ కోసం వినియోగించే ట్యాబ్లెట్ పేరేంటి? నాలుగో ప్రశ్న- ఈ ట్రైలర్ వాడిన ముగ్గురు హీరోయిన్ల పేర్లు? ఇక ఐదో ప్రశ్న- చౌర్యపాఠం మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు? ఈ ఐదింటికి సరైన సమాధానాలు వాట్సాప్ ద్వారా పంపిస్తే విజేతలను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం మీరు ఓ సారి ట్రై చేయండి. Hey hai #IPL lovers Need #IPL tickets for Hyderbad match tomorrow ?Then participate in our #ChauryaPaatam contents and the best answers can grab IPL tickets for free ☺️#ChauryaPaatamonApr25th #3daystogo pic.twitter.com/heEyYXqRQq— Velivela Indhra Ram (@indhraram) April 22, 2025 -
IPL 2025 LSG vs DC: లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం
IPL 2025 LSG vs DC Live Updates: ఐపీఎల్-2025లో ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతున్నాయి.లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయంఎక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయాన్ని అందుకుంది. 160 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం రెండు వికెట్ల మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్(42 బంతుల్లో3 ఫోర్లు, 3 సిక్స్‌లతో57 నాటౌట్), అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. అక్షర్ పటేల్(20 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లతో 34 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. లక్నో బౌలర్లలో పార్ట్ టైమ్ స్పిన్నర్ ఐడైన్ మార్క్రమ్ ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు. మిగితా లక్నో బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు.ఢిల్లీ రెండో వికెట్ డౌన్..అభిషేక్ పోరెల్(51) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. మార్క్రమ్ బౌలింగ్‌లో పోరెల్ ఔటయ్యాడు. ఢిల్లీ 15 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(40), అక్షర్ పటేల్(17) పరుగులతో ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న ఢిల్లీ160 పరుగుల లక్ష్య చేధనలో ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగా ఆడుతోంది. 11 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ పోరెల్(50), రాహుల్(28) ఉన్నారు.ఢిల్లీ తొలి వికెట్ డౌన్..కరుణ్ నాయర్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన నాయర్.. మార్క్రమ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 3.4 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 36/1నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన లక్నోఎక్నా స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేసింది. లక్నో బ్యాటర్లలో ఐడైన్ మార్క్రమ్(52) టాప్ స్కోరర్‌గా నిలవగా..మిచెల్ మార్ష్(45), ఆయూష్ బదోని(36) రాణించారు. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, చమీరా తలా వికెట్ సాధించారు.17 ఓవర్లకు లక్నో స్కోర్: 130/414వ ఓవర్లో లక్నో సూపర్ జెయింట్స్ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో తొలి బంతికి అబ్దుల్ సమద్ ఔట్ కాగా.. ఆఖరి బంతికి మిచెల్ మార్ష్(45) క్లీన్ బౌల్డయ్యాడు. 17 ఓవర్లు ముగిసే సరికి లక్నో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. క్రీజులో మిల్లర్(11), బదోని(10) పరుగులతో ఉన్నారు.లక్నో రెండో వికెట్ డౌన్నికోలస్ పూరన్ రూపంలో లక్నో రెండో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన పూరన్.. స్టార్క్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.లక్నో తొలి వికెట్ డౌన్..ఐడైన్ మార్క్రమ్ రూపంలో లక్నో తొలి వికెట్ కోల్పోయింది. 52 పరుగులు చేసిన దుష్మాంత చమీరా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10 ఓవర్లకు లక్నో వికెట్ నష్టానికి 87 పరుగులు చేసింది.మార్క్రమ్ ఫిప్టీ..లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు మార్క్రమ్, మిచెల్ మార్ష్ దూకుడుగా ఆడుతున్నారు. 9 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. క్రీజులో మార్ష్(32), మార్క్రమ్(50) ఉన్నారు.నిలకడగా ఆడుతున్న లక్నో.. మూడు ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. క్రీజులో మర్క్రమ్(13), మిచెల్ మార్ష్(6) ఉన్నారు.ఐపీఎల్-2025లో మరో కీలక పోరుకు రంగం సిద్దమైంది. సెకెండ్ రౌండ్లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓ మార్పుతో బరిలోకి దిగింది. మోహిత్ శర్మ స్దానంలో దుష్మాంత చమీరా తుది జట్టులో వచ్చాడు. లక్నో మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా ఆడుతోంది.తుది జట్లుఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ XI: అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ XI: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్), అబ్దుల్ సమద్, డేవిడ్ మిల్లర్, దిగ్వేష్ సింగ్ రాఠీ, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ -
IPLకు తగ్గుతున్న క్రేజ్ ...ఎందుకంటే..
-
PBKS VS RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. మరో భారీ రికార్డు సొంతం
పరుగుల యంత్రం విరాట్ కోహ్లి మరో భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 20) పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన కోహ్లి.. ఐపీఎల్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో విరాట్ ఇప్పటివరకు 67 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశాడు. ఇందులో 59 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో రెండో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ 66 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశాడు. ఇందులో 62 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీలు ఉన్నాయి.ఐపీఎల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన టాప్-5 బ్యాటర్స్..విరాట్- 67 (59 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలు)వార్నర్- 66 (62, 4)శిఖర్ ధవన్- 53 (51, 2)రోహిత్ శర్మ- 45 (43, 2)కేఎల్ రాహుల్- 43 (39, 4)ఏబీ డివిలియర్స్- 43 (40, 3)మ్యాచ్ విషయానికొస్తే.. ముల్లాన్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేయగా.. ఆర్సీబీ 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ అజేయ అర్ద శతకంతో (73) ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. జితేశ్ శర్మ (11) సిక్సర్ బాది మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో దేవ్‌దత్ పడిక్కల్ (61) మెరుపు అర్ద సెంచరీ చేయగా.. సాల్ట్ (1), రజత్ పాటిదార్ (12) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, హర్‌ప్రీత్ బ్రార్, చహల్ తలో వికెట్ పడగొట్టారు.పంజాబ్ ఇన్నింగ్స్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (33) టాప్ స్కోరర్‌గా కాగా.. ప్రియాన్ష్ ఆర్య 22, శ్రేయస్ అయ్యర్ 6, జోస్ ఇంగ్లిస్ 29, నేహల్ వధేరా 5, స్టోయినిస్ 1, శశాంక్ సింగ్ 31 (నాటౌట్), జన్సెన్ 25 (నాటౌట్) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ తలో రెండు వికెట్లు తీయగా.. రొమారియో షెపర్డ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.ప్రతీకారం తీర్చుకున్న ఆర్సీబీఈ మ్యాచ్‌లో గెలుపుతో ఆర్సీబీ గత మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఇరు జట్ల మధ్య రెండు రోజుల కిందటే బెంగళూరు వేదికగా మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో పంజాబ్ ఆర్సీబీని చిత్తుగా ఓడించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ పంజాబ్‌ను కిందికి దించి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం గుజరాత్, ఢిల్లీ, ఆర్సీబీ, పంజాబ్, లక్నో తలో 10 పాయింట్లతో టాప్-5లో ఉన్నాయి. -
చిచ్చరపిడుగు.. సిక్సర్‌తో ఆగమనం! తగ్గేదేలే.. (ఫొటోలు)
-
హై-ఎండ్ కార్లు.. లగ్జరీ ప్రాపర్టీలు.. కేఎల్ రాహుల్ ఆస్తుల వివరాలు
భారత్‌లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఇందుకు తగ్గట్టుగానే క్రికెటర్ల బ్రాండింగ్ మార్కెట్ అధికంగా ఉంటుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ పుణ్యమా అని వారి వ్యక్తిగత సంపాదన కూడా పెరుగుతోంది. దానికితోడు కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తుల బ్రాండ్ ప్రమోషన్ల కోసం భారీ మొత్తంలోనే ముట్టజెప్పుతున్నారు. దాంతో చాలామంది క్రికెటర్లు దీపం ఉన్నప్పుడు ఇళ్లు చక్కబెట్టుకోవాలనే చందంతో వయసురీత్యా ఎక్కువ రోజులు క్రికెట్లో కొనసాగకపోవచ్చనే భావన, భవిష్యత్తుపై భరోసాను దృష్టిలో ఉంచుకొని స్థిరాస్తులను కూడబెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ టీమ్ లక్నో సుపర్ జెయింట్స్ మాజీ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆస్తుల వివరాలతోపాటు తాను ఎండార్స్ చేస్తున్న బ్రాండ్ల సంగతుల గురించి తెలుసుకుందాం.భారత మోస్ట్ స్టైలిష్, నిలకడైన క్రికెటర్లలో ఒకరైన కేఎల్ రాహుల్ గత కొన్నేళ్లుగా ఆకట్టుకునే ఆర్థిక పోర్ట్‌ఫోలియోను నిర్మించారు. 2025 నాటికి ఆయన సందప నికర విలువ రూ.100 కోట్లు (సుమారు 12 మిలియన్ డాలర్లు) ఉంటుందని అంచనా. బీసీసీఐ కాంట్రాక్టులు, ఐపీఎల్ వేతనాలు, బ్రాండ్ ఎండార్స్మెంట్లు, వ్యక్తిగత పెట్టుబడులు సహా పలు వనరుల నుంచి ఆయనకు సంపద సమకూరుతుంది.రాహుల్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో గ్రేడ్-ఏ ఒప్పందంలో భాగంగా సంవత్సరానికి రూ.5 కోట్లు వరకు సంపాదిస్తున్నాడు.గతంలో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా రాహుల్ ప్రతి సీజన్‌కు సరాసరి రూ.16 కోట్ల పారితోషికం తీసుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీ తరఫున ఆడుతున్నారు.పూమా, రెడ్ బుల్, భారత్ పే, బోట్, టాటా నెక్సాన్, బియర్డో, క్యూర్.ఫిట్, నుమి.. వంటి ప్రధాన బ్రాండ్లను రాహుల్ ప్రమోషన్ చేస్తున్నారు. ఇది అతని ఆదాయానికి గణనీయంగా దోహదం చేస్తుంది.మెర్సిడెస్ బెంజ్, బీఎమ్‌డబ్ల్యూ, ఆడీ మోడళ్లతో సహా హై-ఎండ్ కార్ల సేకరణతో పాటు బెంగళూరులో ఆయనకు లగ్జరీ ప్రాపర్టీలు ఉన్నాయి.ముంబైలోని కార్టర్ రోడ్లో సుమారు రూ.10 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ను కలిగి ఉన్నారు. రాహుల్-అతియా శెట్టి దంపతులకు బెంగళూరులో విలాసవంతమైన నివాసం కూడా ఉంది.ఇదీ చదవండి: డీజిల్‌కు తగ్గిన డిమాండ్.. ఎందుకంటే..మెటామాన్ అనే పెర్ఫ్యూమ్స్, జువెలరీ బ్రాండ్‌కు రాహుల్ కేవలం బ్రాండ్ అంబాసిడర్ మాత్రమే కాదు. అందులో తాను పెట్టుబడి కూడా పెట్టారు.అర్బన్ ఫ్యాషన్ బ్రాండ్ గల్లీ లైవ్ ఫాస్ట్‌కు రాహుల్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు.బోల్డ్ ఫిట్ అనే అథ్లెట్ దుస్తుల తయారీ కంపెనీలో రాహుల్ ఇన్వెస్ట్ చేశారు.రాహుల్ నిలకడైన గేమింగ్ ప్రదర్శన, నాయకత్వ బాధ్యతలు, బ్రాండ్ వాల్యూ పెరగడం వల్ల తన నికర విలువ క్రమంగా అధికమవుతోంది. భారత్‌లో క్రికెట్‌కు కమర్షియల్ అప్పీల్ పెరగడంతో రాబోయే కాలంలో తన సంపాదన మరింత పెరుగుతుందని తెలుస్తుంది. -
CSK Vs LSG: చెన్నై గెలిచిందోచ్...
మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు కాస్త ఊరట... వరుసగా ఐదు పరాజయాల తర్వాత పూర్తిగా ఆట మరచినట్లు కనిపించిన జట్టు ఎట్టకేలకు విజయాన్ని నమోదు చేసింది. ప్రత్యర్థి లక్నోను ఆ జట్టు వేదికపైనే స్పిన్‌తో కట్టడి చేసిన సీఎస్కే ఆ తర్వాత మరో మూడు బంతులు మిగిలి ఉండగా లక్ష్యం చేరింది. బౌలింగ్‌లో నూర్ అహ్మద్, రవీంద్ర జడేజా కీలకపాత్ర పోషించగా, బ్యాటింగ్‌లో శివమ్ దూబే రాణించాడు. అన్నింటికి మించి మరో ఐదు ఓవర్లు మిగిలి ఉండగా క్రీజ్‌లోకి వచ్చిన ధోని తడబాటు లేకుండా, దూకుడుగా ఆడి జట్టుకు అవసరమైన ‘విలువైన’ పరుగులు సాధించడం మరో సానుకూలాశం. మరోవైపు ‘హ్యాట్రిక్’ విజయాలతో జోరు మీద కనిపించిన లక్నో సమష్టి వైఫల్యంతో ఓటమిని ఆహా్వనించింది. లక్నో: ఐపీఎల్లో ఎట్టకేలకు మూడు వారాల విరామం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) గెలుపు రుచి చూసింది. సోమవారం జరిగిన పోరులో సీఎస్కే 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. కెపె్టన్ రిషభ్ పంత్ (49 బంతుల్లో 63; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా, మిచెల్ మార్‡్ష (25 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం చెన్నై 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసింది. శివమ్ దూబే (37 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) గెలుపు దిశగా నడిపించగా, ఎమ్మెస్ ధోని (11 బంతుల్లో 26 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) చివర్లో అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 28 బంతుల్లో అభేద్యంగా 57 పరుగులు జోడించారు. పంత్ హాఫ్ సెంచరీ... తొలి ఓవర్లోనే మార్క్రమ్ (6) అవుట్ కాగా, టోర్నీ ప్రస్తుత టాప్ స్కోరర్ నికోలస్ పూరన్ (8) కూడా విఫలం కావడంతో లక్నోకు సరైన ఆరంభం లభించలేదు. ఖలీల్ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టి మార్‡్ష జోరు ప్రదర్శించగా, పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 42 పరుగులకు చేరింది. సీజన్లో ఇప్పటి వరకు ఆడిన ఐదు ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 80 స్ట్రయిక్‌రేట్‌తో 40 పరుగులే చేసిన పంత్ ఈ మ్యాచ్‌లో పట్టుదలగా ఆడి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. మరో ఎండ్‌లో మార్‡్షను జడేజా వెనక్కి పంపగా... ఒవర్టన్ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టిన ఆయుశ్ బదోని (17 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కూడా జడేజా బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. అప్పటి వరకు మెరుగ్గానే ఆడిన పంత్‌ను చెన్నై స్పిన్నర్లు పూర్తిగా కట్టిపడేశారు. ముఖ్యంగా నూర్ బౌలింగ్‌లో 15 బంతులు ఆడిన పంత్ 10 బంతుల్లో సింగిల్ కూడా తీయలేకపోయాడు! అయితే ఆ తర్వాత పతిరణ ఓవర్లో 2 సిక్స్‌లు బాదడంతో 42 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. చివరి 3 ఓవర్లలో లక్నో 45 పరుగులు సాధించింది. కీలక భాగస్వామ్యం... 2023 సీజన్ నుంచి చెన్నై జట్టుతో ఉన్న ఆంధ్ర ఆటగాడు షేక్ రషీద్ (19 బంతుల్లో 27; 6 ఫోర్లు)కు తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడే అవకాశం లభించింది. కొన్ని చక్కటి షాట్లతో అతను ఆకట్టుకున్నాడు. ఆకాశ్‌దీప్ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన అతను, శార్దుల్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టడం విశేషం. అయితే అవేశ్ ఓవర్లో భారీ షాట్ ఆడే క్రమంలో అతని ఇన్నింగ్స్ ముగిసింది. మరో ఎండ్‌లో రచిన్ రవీంద్ర (22 బంతుల్లో 37; 5 ఫోర్లు) కూడా వేగంగా ఆడటంతో పవర్‌ప్లేలో చెన్నై 59 పరుగులు సాధించింది. అయితే ఆ తర్వాత తక్కువ వ్యవధిలో జట్టు రచిన్, త్రిపాఠి (9), జడేజా (7), విజయ్‌శంకర్ (9) వికెట్లు కోల్పోవడంతో పాటు పరుగులు రావడం కూడా కష్టంగా మారిపోయింది. విజయానికి 30 బంతుల్లో 56 పరుగులు కావాల్సిన స్థితిలో దూబే, ధోని జత కలిశారు. తాను ఆడిన తొలి బంతుల్లోనే 3 ఫోర్లు, ఒక సిక్స్ బాది ధోని దూకుడు ప్రదర్శించడంలో ఒత్తిడి కాస్త తగ్గింది. చివరి 2 ఓవర్లలో 24 పరుగులు అవసరమయ్యాయి. శార్దుల్ వేసిన 19వ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ సహా 19 పరుగులు రాబట్టి విజయాన్ని దాదాపు ఖాయం చేసుకున్న చెన్నై... మరో మూడు బంతుల్లో లాంఛనం పూర్తి చేసింది. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) త్రిపాఠి (బి) అహ్మద్ 6; మార్‡్ష (బి) జడేజా 30; పూరన్ (ఎల్బీ) (బి) కంబోజ్ 8; పంత్ (సి) ధోని (బి) పతిరణ 63; బదోని (స్టంప్డ్) ధోని (బి) జడేజా 22; సమద్ (రనౌట్) 20; మిల్లర్ (నాటౌట్) 0; శార్దుల్ (సి) రషీద్ (బి) పతిరణ 6; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–6, 2–23, 3–73, 4–105, 5–158, 6–158, 7–166. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4–0–38–1, అన్షుల్ కంబోజ్ 3–0–20–1, ఒవర్టన్ 2–0–24–0, జడేజా 3–0–24–2, నూర్ అహ్మద్ 4–0–13–0, పతిరణ 4–0–45–2. చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: రషీద్ (సి) పూరన్ (బి) అవేశ్ 27; రచిన్ (ఎల్బీ) (బి) మార్క్రమ్ 37; రాహుల్ త్రిపాఠి (సి అండ్ బి) రవి బిష్ణోయ్ 9; జడేజా (సి) మార్క్రమ్ (బి) రవి బిష్ణోయ్ 7; శివమ్ దూబే (నాటౌట్) 43; విజయ్‌శంకర్ (సి) అవేశ్ (బి) దిగ్వేశ్ రాఠీ 9; ధోని (నాటౌట్) 26; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (19.3 ఓవర్లలో 5 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1–52, 2–74, 3–76, 4–96, 5–111. బౌలింగ్: శార్దుల్ ఠాకూర్ 4–0–56–0, ఆకాశ్‌దీప్ 1–0–13–0, దిగ్వేశ్ రాఠీ 4–0–23–1, అవేశ్ ఖాన్ 3.3–0–32–1, రవి బిష్ణోయ్ 3–0–18–2, మార్క్రమ్ 4–0–25–1. ఐపీఎల్లో నేడుపంజాబ్ X కోల్‌కతా వేదిక: ముల్లాన్‌పూర్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
హైదరాబాద్ లోని పార్క్ హయత్‌లో అగ్నిప్రమాదం
-
ఐపీఎల్‌కు పోటీగా రేపటి నుండి (ఏప్రిల్ 11) పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంభం
ఐపీఎల్‌కు పోటీగా రేపటి నుండి (ఏప్రిల్ 11) పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంభం కానుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి పీఎస్ఎల్ ఐపీఎల్‌తో పోటీపడుతూ ఒకే సమయంలో లీగ్‌ను నిర్వహిస్తుంది. ఐపీఎల్, పీఎస్ఎల్ సమాంతరంగా జరుగనుండటంతో ఈసారి పాక్ అభిమానులు కూడా పీఎస్ఎల్పై ఆసక్తి చూపడం లేదు.ఐపీఎల్ 2025లో ప్రతి మ్యాచ్ రసవత్తరంగా సాగుతుండటంతో పాక్ ఫ్యాన్స్ క్యాష్ రిచ్ లీగ్‌ను చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఐపీఎల్‌తో తేదీలను క్లాష్ చేసుకుని పీఎస్ఎల్ ఇబ్బందులను కొని తెచ్చుకుంది. సాధారణంగా ఈ లీగ్ ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరుగుతుంది. అలాంటిది అంతర్జాతీయ షెడ్యూల్‌ను కారణంగా చూపుతూ పాక్ క్రికెట్ బోర్డు పీఎస్ఎల్ను ఐపీఎల్ జరిగే ఏప్రిల్, మే నెలలకు మార్చింది.పైకి చెప్పనప్పటికీ పీసీబీ ఐపీఎల్‌తో పోటీపడాలనే పీఎస్ఎల్ను ఏప్రిల్, మే నెలలకు మార్చింది. తీరా చూస్తే స్వదేశంలోనే ఆదరణ లేకపోవడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంది. డేవిడ్ వార్నర్ లాంటి వెటరన్ ఆటగాళ్లు మినహా విదేశీ స్టార్లంతా ఐపీఎల్‌లోనే ఉండటంతో ఈసారి పీఎస్ఎల్ కళావిహీనంగా మారింది. అదే ఐపీఎల్‌తో పోటీపడకపోయుంటే కొందరైనా విదేశీ స్టార్లు పీఎస్ఎల్లో ఆడేవారు. ఐపీఎల్‌తో పోటీ పడి పీసీబీ చేజేతులా సొంత లీగ్‌ను నాశనం చేసుకుంది. ఈ సారి లీగ్‌కు ప్రజాదరణ లేకపోవడంతో ఆటగాళ్లే రంగలోకి దిగి అభిమానులను తమవైపు మళ్లించుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా పాక్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ మంచి మాటలు చెబుతూ సొంత అభిమానులను ఐపీఎల్ పైనుంచి దృష్టి మరల్చే ప్రయత్నం చేశాడు. మంచి క్రికెట్ ఆడి వినోదాన్ని పంచితే జనాలు ఐపీఎల్‌ను వదిలి పాకిస్తాన్ సూపర్ లీగ్‌ను (పీఎస్ఎల్) చూస్తారని హసన్ అన్నాడు.ఎవరూ ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యుత్తమ లీగ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐపీఎల్‌కు లభించిన ప్రజాదరణ చూసి పాక్ సహా చాలా దేశాలు సొంత లీగ్‌ను ప్రారంభించి ఆశించినంత సక్సెస్‌ను సాధించలేకపోయాయి.పీఎస్ఎల్-2025 విషయానికొస్తే.. రేపు జరుగబోయే లీగ్ ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇస్లామాబాద్ యునైటెడ్, లాహోర్ ఖలందర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్లో హసన్ అలీ కరాచీ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2016లో మొదలైన పీఎస్ఎల్ గతేడాది వరకు అడపాదడపా ఆదరణతో సాగింది. అయితే ఈ సీజన్లో ఐపీఎల్‌తో పోటీ పెట్టుకోవడంతో ఉన్న కాస్త ప్రజాదరణ కూడా కోల్నోయే ప్రమాదాన్ని తెచ్చుకుంది.పాక్ జాతీయ జట్టు విషయానికొస్తే.. గత రెండేళ్లలో అదఃపాతాళానికి పడిపోయిన ఈ జట్టు ఇటీవలికాలంలో మరింత పతనమైంది. స్వదేశంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో బరిలోకి దిగి ఒక్క విజయం కూడా లేకుండా గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఆతర్వాత న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లి అక్కడ కూడా ఘోర పరాభవాలను ఎదుర్కొంది. ఆ పర్యటనలో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-4 తేడాతో కోల్పోయిన పాక్ జట్టు.. ఆతర్వాత జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయ్యింది. -
RCB VS DC: హిట్‌మ్యాన్ సిక్సర్ల రికార్డుకు ఎసరు పెట్టిన విరాట్ కోహ్లి
రికార్డుల రారాజుగా పేరున్న విరాట్ మరో భారీ రికార్డుపై కన్నేశాడు. ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా గుర్తింపు పొందేందుకు మరో ఐదు సిక్సర్ల దూరంలో ఉన్నాడు. నేటి వరకు ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా రోహిత్ శర్మ రికార్డుల్లో ఉన్నాడు. రోహిత్ ఐపీఎల్లో 256 ఇన్నింగ్స్‌ల్లో 282 సిక్సర్లు బాదాడు. 248 ఇన్నింగ్స్‌ల్లో 278 సిక్సర్లు బాదిన విరాట్ మరో 5 సిక్సర్లు కొడితే హిట్‌మ్యాన్ రికార్డును బద్దలు కొడతాడు. ఐపీఎల్ 2025లో నేడు (ఏప్రిల్ 10) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగబోయే మ్యాచ్‌లో విరాట్ ఈ సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టేందుకు ఆస్కారముంది. ఈ మ్యాచ్‌లో విరాట్ ఐదు సిక్సర్లతో పాటు హాఫ్ సెంచరీ కూడా చేస్తే మరో భారీ రికార్డును కూడా సొంతం చేసుకుంటాడు. ప్రస్తుతం టీ20ల్లో 99 హాఫ్ సెంచరీలు చేసిన విరాట్ నేటి మ్యాచ్‌లో మరో హాఫ్ సెంచరీ చేస్తే హాఫ్ సెంచరీల సెంచరీని పూర్తి చేసుకుంటాడు.ఓవరాల్‌గా చూస్తే ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ 141 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 357 సిక్సర్లు బాదాడు. గేల్ తర్వాత రోహిత్, కోహ్లి, ధోని, డివిలియర్స్ ఉన్నారు.ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-5 ఆటగాళ్లు..క్రిస్ గేల్- 357రోహిత్ శర్మ- 282విరాట్ కోహ్లి- 278ఎంఎస్ ధోని- 259ఏబీ డివిలియర్స్- 251కాగా, ఐపీఎల్ ప్రారంభం నుంచి సిక్సర్ల వీరుడిగా పేరున్న రోహిత్ శర్మ గత రెండు సీజన్ల నుంచి కాస్త మెత్తబడ్డాడు. 2024 సీజన్ నుంచి ఇప్పటివరకు రోహిత్ కేవలం 25 సిక్సర్లు మాత్రమే బాదాడు. సిక్సర్ల విషయంలో రోహిత్.. సహచరుడు విరాట్ కంటే ఎప్పుడూ ఓ అడుగు ముందే ఉండేవాడు. అలాంటిది గత సీజన్ నుంచి రోహిత్ విరాట్ కంటే వెనుకపడిపోయాడు. 2024 సీజన్ నుంచి రోహిత్ కేవలం 25 సిక్సర్లు మాత్రమే బాదగా.. విరాట్ 44 సిక్సర్లు కొట్టాడు. ప్రస్తుత సీజన్లో విరాట్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 6 సిక్సర్లు కొట్టాడు. ఈ సీజన్లో లక్నో ఆటగాడు నికోలస్ పూరన్ 5 మ్యాచ్‌ల్లో ఏకంగా 24 సిక్సర్లు బాది లీడింగ్ సిక్స్ హిట్టర్‌గా ఉన్నాడు. పూరన్ తర్వాత మిచెల్ మార్ష్ (15), శ్రేయస్ అయ్యర్ (14) ఉన్నారు.ఆర్సీబీ, ఢిల్లీ మధ్య ఇవాళ జరుగబోయే మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఇరు జట్లు అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్నాయి. గత రికార్డుల ప్రకారం ఢిల్లీపై ఆర్సీబీ పైచేయి సాధించినా.. ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే ఢిల్లీకే విజయావకాశలు ఎక్కువగా ఉన్నాయి. ఇరు జట్లలో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమాంతర శక్తులు ఉన్నాయి. ఢిల్లీకి బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్ ఉండగా.. ఆర్సీబీకి హాజిల్‌వుడ్ ఉన్నాడు. ఢిల్లీ తరఫున స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఉండగా.. ఆర్సీబీకి విరాట్ కోహ్లి ఉన్నాడు. ఆర్సీబీలో ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, లివింగ్‌స్టోన్ లాంటి విధ్వంసకర వీరులు ఉండగా.. ఢిల్లీ జట్టులో జేక్ ఫ్రేజర్, డుప్లెసిస్, ట్రస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ లాంటి చిచ్చరపిడుగులు ఉన్నారు. మొత్తంగా ఇరు జట్లు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్నాయి.తుది జట్లు (అంచనా)..ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యష్ దయాల్, రసిఖ్ సలామ్/సుయాష్ శర్మఢిల్లీ క్యాపిటల్స్: ఫాఫ్ డు ప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ/T నటరాజన్, ముఖేష్ కుమార్ -
సన్ రైజర్స్ అడ్రెస్ గల్లంతు! ప్లే ఆఫ్ చేరాలంటే...
-
IPL : సిరాజ్ పగ కోహ్లి ఫ్యూజులౌట్
-
చాహల్‌తో డేటింగ్ రూమర్స్.. ఇలా దొరికిపోయిందేంటి?
ప్రముఖ యూట్యూబర్, ఆర్జే మహ్వశ్ పేరు ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్ తర్వాత అందరి దృష్టి ఆమెపైనే పడింది. అంతవరకు ముక్కు మొహం తెలియని ఆమె గురించి నెటిజన్స్ తెగ వెతికారు. ఇంతకీ ఆమె ఎవరంటూ ఆరా తీశారు. దీనికంతటికీ కారణం ఆ టీమిండియా క్రికెటరే. అతనితో కలిసి మ్యాచ్‌లో కనిపించడంతో ఒక్కసారిగా ఫేమ్‌లోకి వచ్చేసింది. టీమిండియా స్పిన్నర్ చాహల్‌తో కలిసి ఛాంపియన్ ట్రోఫీలో సందడి చేసింది. ఇక అప్పటి నుంచి వరుసగా ఏదో ఒక సందర్భంలో టాక్ వినిపిస్తూనే ఉంది. అంతేకాకుండా వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే.తాజాగా మరోసారి ఆర్జే మహ్వశ్ వార్తల్లో నిలిచింది. అయితే ఈ సారి చాహల్‌తో కలిసి మాత్రం కనిపించలేదు. అతని ఆడుతున్న ఐపీఎల్ మ్యాచ్ కోసం లక్నోలో వాలిపోయింది ముద్దుగుమ్మ. నగరంలో ప్రముఖ హోటల్లో ఆర్జే మహ్వశ్ ఈత కొడుతున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది.అయితే చాహల్‌తో డేటింగ్ రూమర్స్ వస్తున్న వేళ.. ఐపీఎల్ మ్యాచ్ కోసం ఆర్జే మహ్వశ్ రావడంతో మరోసారి వీరిద్దరిపై రిలేషన్‌పై టాక్ నడుస్తోంది. నిజంగానే ఈ జంట డేటింగ్లో ఉన్నారా? అనే చర్చ మొదలైంది. కాగా.. చాహల్ ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్ లీగ్ ఆడుతున్నారు. ఇటీవలే తన భార్య ధనశ్రీ వర్మతో విడాకులు కూడా తీసుకున్నారు. మార్చి 20, 2025న ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.లక్నోలో ఆర్జే మహ్వశ్ కనిపించడంతో చాహల్‌తో డేటింగ్ నిజమేనంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పంజాబ్, లక్నో మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో ఆమె కనిపించడంతో రూమర్స్‌కు మరింత బలం చేకూరుతోంది. మీ రిలేషన్‌షిప్‌ను ఇంకెన్నాళ్లు సీక్రెట్‌గా ఉంచతారని నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు.ఎవరీ ఆర్జే మహ్వశ్?ఆర్జే మహ్వశ్ రేడియో మిర్చిలో రేడియో జాకీ(ఆర్జే)గా పని చేస్తోంది. సోషల్ మీడియాలో ప్రాంక్ వీడియోలు చేస్తూ పాపులర్ అయింది. చాహల్‌తో డేటింగ్ కథనాలు రావడంతో జనవరిలో 1.5 మిలియన్లు ఉండే ఫాలోవర్ల ఒక్కసారిగా అమాంతం పెరిగింది. అంతేకాకుండా నవాజుద్దీన్ సిద్దిఖీ, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన 'సెక్షన్ 108' సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది. వీటితో పాటు హీరోయిన్గా ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. -
లంక మాజీ క్రికెటర్ తో 51 ఏళ్ల మలైకా డేటింగ్?
మలైకా అరోరా పేరు చెప్పగానే ఐటమ్ సాంగ్స్ గుర్తొస్తాయి. తర్వాత డేటింగ్ వ్యవహారం గుర్తొస్తుంది. ఎందుకంటే హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ పెళ్లి చేసుకున్న ఈమె.. దాదాపు 19 ఏళ్ల తర్వాత విడాకులు ఇచ్చేసింది. కొన్నాళ్లకు తన కంటే చిన్నవాడైన అర్జున్ కపూర్ తో ప్రేమలో పడింది.(ఇదీ చదవండి: మోనాలిసాకి ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ అరెస్ట్)మూడు నాలుగేళ్ల పాటు అర్జున్-మలైకా తెగ తిరిగారు. టూర్లకు కూడా కలిసి వెళ్లారు. పెళ్లి ఏమైనా చేసుకుంటారేమో అని అందరూ అనుకుంటున్న టైంలో విడిపోయి షాకిచ్చారు. ప్రస్తుతానికైతే మలైకా ఒంటరిగానే ఉంటోంది. అలాంటిది ఇప్పుడు ఈమె మరోసారి ప్రేమలో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి.చెన్నై-రాజస్థాన్ జట్ల మధ్య ఆదివారం రాత్రి గౌహతిలో ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. దీనికి హాజరైన మలైకా.. లంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర పక్కన కూర్చుని కనిపించింది. దీంతో వీళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారా అంటూ బాలీవుడ్ మీడియా ఉదయం నుంచి తెగ ఉదరగొట్టేస్తుంది. మరోవైపు మలైకా సన్నిహితులు మాత్రం.. అనుకోకుండా పక్కన కూర్చున్నంత మాత్రం డేటింగ్ అనేస్తారా అని అంటున్నారు. అంటే డేటింగ్ కామెంట్స్ అన్ని గాసిప్స్ అనమాట.(ఇదీ చదవండి: 'సికిందర్' తొలిరోజు కలెక్షన్స్.. మరీ ఇంత తక్కువా?) -
సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ.. చెపాక్‌లో సందడి చేసిన సుప్రీత (ఫోటోలు)
-
ధోనీపై విమర్శలు!
-
ఐసీయూలో తల్లి.. IPLకు నో చెప్పిన హీరోయిన్
హీరోయిన్, ఐటమ్ సాంగ్స్ చేసి గుర్తింపు తెచ్చుతున్న నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్. తెలుగులోనూ ప్రభాస్ సాహో మూవీలో నటించింది. కెరీర్ పరంగా ఎప్పుడూ ఏదో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉండే ఈమె.. సడన్ గా ఆస్పత్రిలో కనిపించింది. ఈమె తల్లి ఐసీయూలో ఉండటమే దీనికి కారణం.(ఇదీ చదవండి: పరువు పోతుందని భయపడ్డాను.. ఒకప్పటి హీరోయిన్ సుహాసిని)శ్రీలంకకు చెందిన జాక్వెలిన్.. చాన్నాళ్ల క్రితమే మన దేశానికి వచ్చేసింది. హిందీ మూవీస్ చేస్తూ ముంబైలో సెటిలైపోయింది. తెలుగు, కన్నడ, తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె తల్లితో పాటు కలిసుంటోంది. అయితే జాక్వెలిన్ తల్లి కిమ్ కి సోమవారం గుండెపోటు రావడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఇంకా ఆమె ఐసీయూలోనే ఉన్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ కూడా పరామర్శించి వెళ్లినట్లు తెలుస్తోంది.ఇకపోతే ఐపీఎల్ లో గౌహతి వేదికగా గురువారం కోల్ కతా-రాజస్థాన్ మ్యాచ్ జరగనుంది. దీనికి ముందు ప్రారంభోత్సవ వేడుకలకు జాక్వెలిన్ హాజరై ఫెర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉంది. కానీ తల్లి ఐసీయూలో ఉండటంతో దీనికి నో చెప్పేసింది. ప్రస్తుతాకైతే ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: మిలియన్ డాలర్ 'కోర్ట్'.. నానికి ఇది చాలా స్పెషల్) -
ఇషాన్ సక్సెస్ సీక్రెట్ ఇదే!
-
రాహుల్ తండ్రయ్యాడు...
కేఎల్ రాహుల్ ఐపీఎల్లో కొత్త ఫ్రాంచైజీ ఢిల్లీ తరఫున తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు. వ్యక్తిగత కారణాలతో మ్యాచ్‌కు దూరమైనట్లు ముందుగా ఫ్రాంచైజీ ప్రకటించింది. మ్యాచ్ సాగుతున్న సమయంలో రాహుల్ శుభవార్త ట్వీట్ చేశాడు. తమకు అమ్మాయి పుట్టినట్లు రాహుల్, అతియా శెట్టి ప్రకటించారు. 2023 జనవరిలో వీరిద్దరి పెళ్లి జరిగింది. -
ఐపీఎల్లో బెట్టింగ్ జోరు
ఈ సీజన్ ఐపీఎల్లో మొదటి మ్యాచ్ కోల్‌కత నైట్రెడర్స్ (కేకేఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మధ్య మొదలైంది. డఫ్పా బెట్‌తో పాటు దాదాపు అన్ని బెట్టింగ్ యాప్‌లు కేకేఆర్ ఫేవరెట్ టీంగా బెట్టింగ్ నిర్వహించాయి. ఆర్సీబీపై మొదట్లో బెట్టింగ్ కాసిన వారు ఆ తర్వాత మళ్లీ కేకేఆర్‌పై బెట్టింగ్ కాశారు. కానీ, చివరికి ఆర్సీబీ గెలుపొందింది. దీంతో కేకేఆర్‌పై బెట్టింగ్ చేసిన వారంతా నిండా మునిగిపోయారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచుల్లో బెట్టింగ్‌ల జోరు తీరిది.సాక్షి ప్రతినిధి కర్నూలు : అందరి చేతిలో స్మార్ట్ఫోన్లు ఉండటం, ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్లైన్లో బెట్టింగ్ యాప్‌లు పుష్కలంగా ఉండడంతో అధికశాతం క్రికెట్ అభిమానులు ఆన్లైన్ బెట్టింగ్‌లో మునిగిపోతున్నారు. సెలబ్రిటీలు కూడా వీటిని ప్రమోట్ చేస్తుండడంతో రెండేళ్లుగా ఈ యాప్‌లు భారీగా పెరిగాయి. పైగా.. ఈసారి ప్లేయర్ల ఆక్షన్‌లో ఎక్కువశాతం ప్లేయర్లు జట్లు మారారు. దీంతో బెట్టింగ్ రాయుళ్లు జట్ల విజయావకాశాలను సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. చివరికి.. వారి ఖాతాల్లోని డబ్బు ఆవిరవుతోంది. ఆఫ్‌లైన్ కంటే ఆన్లైన్లోనే బెట్టింగ్‌లు ఎక్కువగా జరుగుతుండడంతో పోలీసులకు కూడా ఇవి సవాల్‌గానే మారాయి. ఈ ఐపీఎల్ సీజన్ ముగిసేలోపు రూ.లక్ష కోట్లు చేతులుమారే అవకాశముందని అంచనా.బెట్టింగ్ యాప్‌లు ఇవే.. ఆన్లైన్ బెట్టింగ్‌లో ఎక్కువమంది ‘డఫ్పా బెట్టింగ్’ యాప్‌ను వాడుతున్నారు. దీంతో పాటు ఎక్స్ బెట్, స్కై ఎక్సే్ఛంజ్, ఫ్యాన్సీ లైఫ్, క్రికెట్ మజా, లైవ్‌లైన్, లోటస్, బెట్ 65, బెట్ ఫెయిర్, టెన్క్రిక్, 22 బెట్, ఫోర్రాబెట్, వన్ విన్, పారిమ్యాచ్, మెల్బెట్తో పాటు అనేక బెట్టింగ్ యాప్‌లు ఉన్నాయి.ఆన్లైన్ బెట్టింగ్ తీరిది..⇒ ఈ విధానంలో మ్యాచ్‌కు గంట ముందే కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. దాంతోనే బెట్టింగ్ కాయాలి. ⇒ మ్యాచ్‌కు ముందు రేటింగ్స్ ఇస్తారు. ఆ ప్రకారం పందెం వేయాలి. ⇒ మ్యాచ్ సాగేతీరును బట్టి ఇవి మారుతుంటాయి. డిపాజిట్ క్లోజ్ అయితే అప్పటికప్పుడు డిపాజిట్ చేసి బెట్టింగ్ కాసే అవకాశం ఉండదు. దీంతో చాలామంది రూ.50వేల నుంచి లక్షల రూపాయలు ముందుగానే యాప్స్‌లో డిపాజిట్ చేస్తున్నారు. ⇒ మ్యాచ్ పరిస్థితి, రేటింగ్స్‌ను బట్టి అప్పటికప్పుడు ఆకర్షితులై కూడా భారీగా బెట్టింగ్ కాస్తారు. ⇒ బెట్టింగ్‌లో గెలిస్తే క్షణాల్లో డబ్బు ఖాతాల్లో జమవుతుంది. ఓడిపోతే ఖాతా ఖాళీ అవుతుంది. .. ఇలా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఆన్లైన్ బెట్టింగ్ ఊబిలో చిక్కుకుని రూ.వేల నుంచి రూ.లక్షల వరకూ పొగొట్టుకుంటున్నారు.ఆఫ్‌లైన్ బెట్టింగ్ ఇలా.. టాస్ నుంచి బాల్ టు బాల్ వరకూ బెట్టింగ్ సాగుతుంది. టాస్ ఎవరు గెలుస్తారు? తొలి ఓవర్ స్పిన్నర్‌తో బౌలింగ్ వేయిస్తారా? పేసర్‌తో వేయిస్తారా? మొదటి ఓవర్లో ఎన్ని పరుగులు వస్తాయి? జట్టు ఎంత స్కోర్ చేస్తుంది? ఎవరు గెలుస్తారు? ఫలానా బాల్‌కు ఫోర్ వస్తుందా? సిక్స్ వస్తుందా? లేదా ఒక్క పరుగే వస్తుందా? ఇలా అనేక రకాలుగా బెట్టింగ్‌లు ఉంటాయి. ఇక బుకీలు ముంబై, హైదరాబాద్, బెంగళూరులో ఉంటారు. జిల్లా, పట్టణ కేంద్రాల్లో సబ్‌బుకీలు ఉంటారు. మ్యాచ్ మారుతున్న స్వరూపాన్ని బట్టి బెట్టింగ్ లెక్కలు మారుస్తారు. వీరు వాట్సప్ గ్రూపుల్లో బెట్టింగ్ ధరలు నిర్ధారిస్తారు. ఆఫ్‌లైన్‌లో బెట్టింగ్ కాసేవారు బార్లతో పాటు హోటళ్లలో కూర్చుని బెట్టింగ్ కాస్తారు. 357 రకాల వెబ్సైట్లు బ్లాక్.. బెట్టింగ్‌లను అరికట్టేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) 357 రకాల వెబ్సైట్లను బ్లాక్ చేసింది. వాటికి చెందిన 2,400 బ్యాంకు ఖాతాల్లో రూ.126 కోట్లను ఫ్రీజ్ చేసింది. మరో 700 యాప్‌లపై నిఘా ఉంచింది. అనుమతితో నడిచే బెట్టింగ్ యాప్‌లను టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు సోషల్ మీడియా సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తున్నారు. ఈనెల 16న ఫణీంద్రశర్మ అనే వ్యక్తి ఫిర్యాదుతో హైదరాబాద్‌లో దగ్గుబాటి రానా, ప్రకాశ్‌రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత, శ్రీముఖి, వర్షిణితో పాటు 24 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ బెట్టింగ్ ఊబిలో వ్యాపారులు, ఉద్యోగులతో పాటు యువత ఎక్కువగా చిక్కుకుంటున్నారు. -
ఇ'షాన్‌దార్' రైజర్స్
తొలి 42 బంతుల్లో 100 పరుగులు... 87 బంతుల్లో 200 పరుగులు... ఇక మిగిలింది 300 లక్ష్యమే... ఐపీఎల్లో 300 పరుగులు సాధ్యమా అనే ప్రశ్నకు జవాబిచ్చేలా ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు దానిని ఈసారి అందుకోలేకపోయినా దాదాపు చేరువగా వచ్చిoది. తమ అత్యధిక టీమ్ స్కోరుకు ఒక పరుగు మాత్రమే తక్కువ చేసి ఐపీఎల్ టోర్నీ చరిత్రలో రెండో అత్యధిక స్కోరును తమ పేరిటే లిఖించుకుంది. మారింది సీజన్ మాత్రమే తాము కాదు అంటూ సన్‌రైజర్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. గత ఏడాది లాగే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ మెరుపులకు తోడు ఈసారి కొత్తగా జట్టులో చేరిన ఇషాన్ కిషన్ కూడా దూకుడుగా ఆడడంతో జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఛేదనకు ముందే ఓటమిని అంగీకరించినట్లు కనిపించిన రాజస్తాన్ కొంత పోరాడినా లక్ష్యం మరీ పెద్దది కావడంతో చివరకు ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. మొత్తానికి 528 పరుగుల మ్యాచ్‌తో హైదరాబాద్ అభిమానులు ఆదివారం పండుగ చేసుకున్నారు. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్–18 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమదైన రీతిలో మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగింది. ఘన విజయంతో టోర్నీని మొదలు పెట్టింది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గత ఏడాది రన్నరప్ సన్‌రైజర్స్ 44 పరుగుల తేడాతో మాజీ చాంపియన్ రాజస్తాన్ రాయల్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇషాన్ కిషన్ (47 బంతుల్లో 106 నాటౌట్; 11 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీతో కదం తొక్కాడు. ట్రావిస్ హెడ్ (31 బంతుల్లో 67; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించాడు. హెన్రిచ్ క్లాసెన్ (14 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ కుమార్ రెడ్డి (15 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్) కూడా దూకుడుగా ఆడారు. సన్‌రైజర్స్ టాప్–5 బ్యాటర్లంతా 200కు పైగా స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించడం విశేషం. 3ఇషాన్ కిషన్పరుగులు 106 బంతులు 47 ఫోర్లు 11 సిక్స్‌లు 6 స్ట్రయిక్‌రేట్ 225.53 అనంతరం 287 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 242 పరుగులు చేసి ఓడిపోయింది. ధ్రువ్ జురేల్ (35 బంతుల్లో 70; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), సంజూ సామ్సన్ (37 బంతుల్లో 66; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. సన్‌రైజర్స్ బౌలర్లలో సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్ రెండు వికెట్ల చొప్పున తీశారు. సన్‌రైజర్స్ జట్టు తమ తదుపరి మ్యాచ్‌ను ఈనెల 27న ఉప్పల్ స్టేడియంలోనే లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో ఆడుతుంది. మెరుపు బ్యాటింగ్... అభిషేక్ శర్మ (11 బంతుల్లో 24; 5 ఫోర్లు), హెడ్ ఎప్పటిలాగే రైజర్స్‌కు శుభారంభం అందించారు. ఫారుఖీ ఓవర్లో అభిషేక్ మూడు ఫోర్లు కొట్టగా, అదే ఓవర్లో హెడ్ సిక్స్ కొట్టాడు. తొలి వికెట్‌కు 19 బంతుల్లో 45 పరుగుల భాగస్వామ్యం తర్వాత అభిషేక్ వెనుదిరిగాడు. అభిషేక్ స్థానంలో వచ్చిన ఇషాన్ కిషన్ కూడా అదే జోరును కొనసాగించాడు. ఆర్చర్ వేసిన ఐదో ఓవర్లో హెడ్ చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో అతను 4 ఫోర్లు, సిక్స్ బాదడంతో మొత్తం 23 పరుగులు వచ్చాయి. పవర్‌ప్లే ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 94 పరుగులకు చేరగా, 21 బంతుల్లోనే హెడ్ హాఫ్ సెంచరీ పూర్తయింది. ఎట్టకేలకు హెడ్‌ను తుషార్ అవుట్ చేసినా... కిషన్ తనదైన శైలిలో ధాటిగా ఆడాడు. హెడ్, కిషన్ రెండో వికెట్‌కు 39 బంతుల్లోనే 85 పరుగులు జోడించారు. ఆర్చర్ ఓవర్లో రెండు వరుస సిక్స్‌లతో కిషన్ 25 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. అదే ఓవర్లో అతను మరో సిక్సర్ బాదాడు. మరోవైపు నితీశ్ రెడ్డి, క్లాసెన్ ఎక్కడా తగ్గలేదు. వీరిద్దరు దూకుడుతో స్కోరు వేగంగా దూసుకుపోయింది. సందీప్ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన క్లాసెన్, ఆర్చర్ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టాడు. సందీప్ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు బాది 98కి చేరిన కిషన్ తర్వాతి బంతికి రెండు పరుగులు చేసి సెంచరీ (45 బంతుల్లో)తో విజయనాదం చేశాడు. శతక భాగస్వామ్యం... దాదాపు అసాధ్యమైన లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన రాజస్తాన్ 50 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. యశస్వి జైస్వాల్ (1), రియాన్ పరాగ్ (4), నితీశ్ రాణా (11) వెనుదిరగడంతో జట్టు ఛేదనావకాశాలు తగ్గిపోయాయి. అయితే సామ్సన్, జురేల్ కొద్దిగా ప్రయత్నం చేశారు. సిమర్జీత్ ఓవర్లో సామ్సన్ 2 ఫోర్లు, సిక్స్ కొట్టగా, కమిన్స్ ఓవర్లో జురేల్ 3 ఫోర్లు, సిక్స్ కొట్టడం హైలైట్‌గా నిలిచాయి. రాయల్స్ బ్యాటర్లు కూడా అక్కడక్కడా మెరుపులు మెరిపించినా హైదరాబాద్ ఇన్నింగ్స్ ముందు అవన్నీ దిగదుడుపుగా కనిపించాయి. నాలుగో వికెట్‌కు 60 బంతుల్లో 111 పరుగులు జత చేసిన అనంతరం ఒకే స్కోరు వద్ద సామ్సన్, జురేల్ అవుట్ కావడంతో రాజస్తాన్ ఆశలు అడుగంటాయి. చివర్లో హెట్‌మైర్ (23 బంతుల్లో 42; 1 ఫోర్, 4 సిక్స్‌లు), శుభమ్ దూబే (11 బంతుల్లో 34 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్‌లు) పోరాడినా లాభం లేకపోయింది. స్కోరు వివరాలుసన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) యశస్వి జైస్వాల్ (బి) తీక్షణ 24; హెడ్ (సి) హెట్‌మైర్ (బి) తుషార్ దేశ్‌పాండే 67; ఇషాన్ కిషన్ (నాటౌట్) 106; నితీశ్ కుమార్ రెడ్డి (సి) యశస్వి జైస్వాల్ (బి) తీక్షణ 30; క్లాసెన్ (సి) పరాగ్ (బి) సందీప్ 34; అనికేత్ (సి) ఆర్చర్ (బి) తుషార్ దేశ్‌పాండే 7; అభినవ్ మనోహర్ (సి) పరాగ్ (బి) తుషార్ దేశ్‌పాండే 0; కమిన్స్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 286. వికెట్ల పతనం: 1–45, 2–130, 3–202, 4–258, 5–279, 6–279. బౌలింగ్: ఫారుఖీ 3–0–49–0, తీక్షణ 4–0–52–2, ఆర్చర్ 4–0–76–0, సందీప్ శర్మ 4–0–51–1, నితీశ్ రాణా 1–0–9–0, తుషార్ దేశ్‌పాండే 4–0–44–3. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (సి) మనోహర్ (బి) సిమర్జీత్ 1; సంజూ సామ్సన్ (సి) క్లాసెన్ (బి) హర్షల్ పటేల్ 66; పరాగ్ (సి) కమిన్స్ (బి) సిమర్జీత్ 4; నితీశ్ రాణా (సి) కమిన్స్ (బి) షమీ 11; ధ్రువ్ జురేల్ (సి) ఇషాన్ కిషన్ (బి) ఆడమ్ జంపా 70; హెట్‌మైర్ (సి) మనోహర్ (బి) హర్షల్ పటేల్ 42; శుభమ్ దూబే (నాటౌట్) 34; ఆర్చర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 242. వికెట్ల పతనం: 1–20, 2–24, 3–50, 4–161, 5–161, 6–241. బౌలింగ్: మొహమ్మద్ షమీ 3–0–33–1, సిమర్జీత్ సింగ్ 3–0–46–2, కమిన్స్ 4–0–60–0, అభిషేక్ 2–0–17–0, ఆడమ్ జంపా 4–0–48–1, హర్షల్ పటేల్ 4–0–34–2.286 ఐపీఎల్లో ఇది రెండో అత్యధిక స్కోరు. గత ఏడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై సన్‌రైజర్స్ చేసిన 287 పరుగుల స్కోరు అగ్రస్థానంలో ఉంది. ఐపీఎల్ చరిత్రలో టాప్–5 అత్యధిక టీమ్ స్కోర్లలో నాలుగు సన్‌రైజర్స్ పేరిటే ఉండటం విశేషం.76 జోఫ్రా ఆర్చర్ ఇచ్చిన పరుగులు. ఐపీఎల్‌లోని ఒక మ్యాచ్‌లో ఒక బౌలర్ ఇచ్చిన అత్యధిక పరుగులు ఇవే. గత ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ మోహిత్ శర్మ అత్యధికంగా 73 పరుగులు ఇచ్చాడు. మోహిత్ పేరిట ఉన్న రికార్డును ఆర్చర్ తన పేరిట లిఖించుకున్నాడు. 34 టి20 ఫార్మాట్లో ఒక మ్యాచ్ ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు (34) కొట్టిన జట్టుగా సన్‌రైజర్స్ రికార్డు నెలకొల్పింది. గతంలో ఈ రికార్డు మిడిల్సెక్స్ కౌంటీ (33 ఫోర్లు; సర్రే జట్టుపై 2023లో) జట్టు పేరిట ఉంది. ఐపీఎల్ టోర్నీ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక బౌండరీలు కొట్టిన రికార్డు ఢిల్లీ డేర్‌డెవిల్స్ (31 ఫోర్లు; 2017లో గుజరాత్ లయన్స్‌పై) జట్టు పేరిట ఉంది. దానిని కూడా సన్‌రైజర్స్ బ్రేక్ చేసింది. 3 ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన మూడో భారత ప్లేయర్‌గా ఇషాన్ కిషన్ (45 బంతుల్లో) గుర్తింపు పొందాడు. తొలి స్థానంలో యూసుఫ్ పఠాన్ (37 బంతుల్లో ముంబై ఇండియన్స్‌పై 2010లో) ఉన్నాడు. తాజా ఇన్నింగ్స్‌తో మయాంక్ అగర్వాల్ (45 బంతుల్లో; రాజస్తాన్ రాయల్స్‌పై 2020లో) సరసన ఇషాన్ కిషన్ చేరాడు. -
వరుసగా 13వ ఏడాది...
సీజన్ ఆరంభ మ్యాచ్‌లో పరాజయం పాలయ్యే ఆనవాయితీని ముంబై ఇండియన్స్ మరోసారి కొనసాగించింది. వరుసగా 13వ ఏడాది ముంబై జట్టు ఐపీఎల్లో తాము ఆడిన తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైంది. గతేడాది పాయింట్ల పట్టిక అట్టడుగున నిలిచిన ముంబై ఇండియన్స్ ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడింది. బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించలేకపోయిన ముంబై... బౌలింగ్‌లోనూ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. చెన్నై: ఐదుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 18వ సీజన్లో శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో చెన్నై నాలుగు వికెట్ల తేడాతో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై గెలిచింది. 2012 ఐపీఎల్లో చివరిసారి తాము ఆడిన తొలి మ్యాచ్‌లో నెగ్గిన ముంబై జట్టు ఆ తర్వాత ఇప్పటి వరకు మొదటి పోరులో శుభారంభం చేయలేకపోయింది. మొదట ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. హైదరాబాద్ యువతార ఠాకూర్ తిలక్ వర్మ (25 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్), దీపక్ చాహర్ (15 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) తలా కొన్ని పరుగులు చేశారు. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (0) డకౌట్ కాగా... రికెల్టన్ (13), విల్ జాక్స్ (11) ఎక్కువసేపు నిలవలేకపోయారు. చెన్నై బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నూర్ అహ్మద్ 4, ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం చెన్నై 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకాలతో రాణించారు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) దూబే (బి) ఖలీల్ 0; రికెల్టన్ (బి) ఖలీల్ 13; జాక్స్ (సి) దూబే (బి) అశ్విన్ 11; సూర్యకుమార్ (స్టంప్డ్) ధోని (బి) నూర్ 29; తిలక్ వర్మ (ఎల్బీ) (బి) నూర్ 31; రాబిన్ (సి) జడేజా (బి) నూర్ 3; నమన్ (బి) నూర్ 17; సాంట్నర్ (ఎల్బీ) (బి) ఎలీస్ 11; దీపక్ చాహర్ (నాటౌట్) 28; బౌల్ట్ (సి) రుతురాజ్ (బి) ఖలీల్ 1; సత్యనారాయణ రాజు (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–0, 2–21, 3–36, 4–87, 5–95, 6–96, 7–118, 8–128, 9–141. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4–0–29–3; స్యామ్ కరన్ 1–0–13–0; ఎలీస్ 4–0–38–1; అశ్విన్ 4–0– 31–1; జడేజా 3–0–21–0; నూర్ అహ్మద్ 4–0– 18–4. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రచిన్ (నాటౌట్) 65; రాహుల్ త్రిపాఠి (సి) రికెల్టన్ (బి) చాహర్ 2; రుతురాజ్ (సి) జాక్స్ (బి) విఘ్నేశ్ 53; దూబే (సి) తిలక్ వర్మ (బి) విఘ్నేశ్ 9; దీపక్ హుడా (సి) సత్యనారాయణ (బి) విఘ్నేశ్ 3; కరన్ (బి) జాక్స్ 4; జడేజా (రనౌట్) 17; ధోని (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (19.1 ఓవర్లలో 6 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1–11, 2–78, 3–95, 4–107, 5–116, 6–152. బౌలింగ్: బౌల్ట్ 3–0–27–0; చాహర్ 2–0–18–1; సత్యనారాయణ 1–0–13–0; సాంట్నర్ 2.1–0–24–0; జాక్స్ 4–0–32–1; విఘ్నేశ్ 4–0–32–3; నమన్ 3–0–12–0. ఐపీఎల్లో నేడుఢిల్లీ X లక్నో వేదిక: విశాఖపట్నంరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
IPL తొలి మ్యాచ్ లో బెంగళూరు బోణీ
-
రైజర్స్ బొణీ కొట్టేనా!
బాదుడే పరామావధిగా చెలరేగి గత సీజన్లో రన్నరప్‌గా నిలిచిన సన్రజర్స్ హైదరాబాద్... ఈ ఏడాది అదే జోరు కొనసాగించేందుకు సిద్ధమైంది. సొంతగడ్డపై మాజీ చాంపియన్ రాజస్తాన్ రాయల్స్‌తో... నేడు కమిన్స్ సేన కప్ వేట ప్రారంభించనుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్‌కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్‌తో సన్‌రైజర్స్ బ్యాటింగ్ లైనప్ శత్రు దుర్బేధ్యంగా ఉండగా... యశస్వి జైస్వాల్, సంజూ సామ్సన్, రియాన్ పరాగ్, హెట్‌మైర్, ధ్రువ్ జురెల్‌తో సవాలు విసిరేందుకు రాజస్తాన్ రాయల్స్ రెడీ అయింది. మరి రైజర్స్ దూకుడుకు రాయల్స్ అడ్డుకట్ట వేస్తుందా చూడాలి! సాక్షి, హైదరాబాద్: గత ఏడాది అందినట్లే అంది దూరమైన ఐపీఎల్ ట్రోఫీని ఈసారైనా ఒడిసి పట్టాలనే లక్ష్యంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలి మ్యాచ్‌కు రెడీ అయింది. ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా జరగనున్న తొలి ‘డబుల్ హెడర్’లో ఆదివారం జరగనున్న తొలి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనుంది. ఒకప్పుడు కట్టుదిట్టమైన బౌలింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సన్‌రైజర్స్... గత సీజన్లో విధ్వంసక బ్యాటింగ్‌తో రికార్డులు తిరగరాసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ నుంచి మొదలు పెట్టుకొని కెప్టెన్ కమిన్స్ వరకు ప్రతి ఒక్కరూ దూకుడుగా ఆడేవాళ్లు ఉండటం రైజర్స్‌కు కలిసి రానుండగా... సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాలి. గత ఏడాది మ్యాచ్ మ్యాచ్‌కు మరింత రాటుదేలుతూ అరాచకం సృష్టించిన రైజర్స్ బ్యాటర్లు... ఈ సీజన్లో తొలి మ్యాచ్ నుంచే జోరు కనబర్చాలని తహతహలాడుతున్నారు. ప్రాక్టీస్ సెషన్లలో హెడ్, క్లాసెన్, అభిషేక్, నితీశ్ వంతులు వేసుకొని మరి భారీ షాట్లు సాధన చేశారు. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. వేలంలో కొత్తగా తీసుకున్న ఇషాన్ కిషన్ రాకతో రైజర్స్ బ్యాటింగ్ మరింత పదునెక్కింది. గతేడాది ఒకటికి మూడుసార్లు 250 పైచిలుకు పరుగులు చేసిన రైజర్స్... ఈ సారి 300 మార్క్ అందుకోవాలనే లక్ష్యంతో కనిపిస్తోంది. గాయం నుంచి కోలుకున్న ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మిడిలార్డర్లో కీలకం కానున్నాడు. మరోవైపు వేలి గాయంతో ఇబ్బంది పడుతున్న రాజస్తాన్ రాయల్స్ రెగ్యులర్ కెప్టెన్ సంజూ సామన్స్ ఈ మ్యాచ్‌లో కేవలం ప్లేయర్‌గా బరిలోకి దిగనున్నాడు. సీజన్ తొలి మూడు మ్యాచ్‌లకు సామ్సన్ స్థానంలో రియాన్ పరాగ్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సామ్సన్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా... స్వదేశీ ఆటగాళ్ల నైపుణ్యంపైనే ప్రధానంగా ఆధారపడుతున్న రాజస్తాన్ రాయల్స్‌కు... రెగ్యులర్ కెప్టెన్ సంజూ సామ్సన్ గాయం ఇబ్బంది పెడుతోంది. అతడు కేవలం బ్యాటర్‌గా మాత్రమే బరిలోకి దిగనున్నాడు. అంటే ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అతడి స్థానంలో రియాన్ పరాగ్ జట్టును నడిపించనుండగా... ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు అందుకోనున్నాడు. యశస్వి జైస్వాల్, సామ్సన్, నితీశ్ రాణా, పరాగ్, ధ్రువ్ జురేల్ ఇలా టాప్–5లో స్వదేశీ ఆటగాళ్లే బ్యాటింగ్ చేయనున్నారు. మిడిలార్డర్లో విండీస్ హిట్టర్ హెట్‌మైర్ కీలకం కానుండగా... ఆర్చర్, తీక్షణ, వనిందు హసరంగ బౌలింగ్ భారం మోయనున్నారు. విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న రైజర్స్ బ్యాటింగ్ లైనప్‌ను రాయల్స్ బౌలింగ్ దళం ఎలా అడ్డుకుంటుందనే దానిపైనే ఈమ్యాచ్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. బ్యాటింగ్ బలంగా... ఇంటా బయటా అనే తేడా లేకుండా గతేడాది బరిలోకి దిగిన ప్రతి మ్యాచ్‌లో పరుగుల వరద పారించిన సన్‌రైజర్స్... ముఖ్యంగా ఉప్పల్‌లో ఊచకోత సాగించింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో పోరులో ఆ జట్టు నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఆరెంజ్ ఆర్మీ 9.4 ఓవర్లలో వికెట్ కోల్పోకుండానే ఛేదించి సంచలనం సృష్టించింది.ఓపెనర్లు అభిషేక్ శర్మ, హెడ్ బంతిపై పగబట్టినట్లు విజృంభిస్తుండటం రైజర్స్‌కు ప్రధాన బలం కాగా... ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్‌తో కూడిన మిడిలార్డర్ జట్టుకు మరింత బలాన్నిస్తోంది. అయితే ఫ్రాంఛైజీ తరఫున తొలిసారి బరిలోకి దిగనున్న అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారనేది ఆసక్తికరం. గాయం కారణంగా శ్రీలంకతో పర్యటనతో పాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన ఆ్రస్టేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్... గాయం నుంచి కోలుకొని జట్టును నడిపించేందుకు సిద్ధమయ్యాడు. పేస్ బౌలింగ్‌లో మొహమ్మద్ షమీ, హర్షల్ పటేల్ కీలకం కానుండగా, ఆడమ్ జంపా స్పిన్ బాధ్యతలు మోయనున్నాడు. తుది జట్లు (అంచనా) సన్‌రైజర్స్ హైదరాబాద్: కమిన్స్ (కెప్టెన్), హెడ్, అభిషేక్, ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి, క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, షమీ, జాంపా. రాజస్తాన్ రాయల్స్: రియాన్ పరాగ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సంజూ సామ్సన్, నితీశ్ రాణా, ధ్రువ్ జురెల్, హెట్‌మైర్, హసరంగ, శుభమ్ దూబే, ఆర్చర్, తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్ పాండే. పిచ్, వాతావరణం గతేడాది ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌ల్లో పరుగుల వరద పారింది. మొత్తం 13 మైదానాల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగగా... అందులో రెండో అత్యధికం (ఓవర్‌కు 10.54 పరుగులు) హైదరాబాద్‌లో నమోదైంది. ఈసారి కూడా అందుకు భిన్నంగా ఉండకపోవచ్చు. మ్యాచ్‌కు వర్ష సూచన లేదు. చెన్నై X ముంబైసాయంత్రం గం. 7:30 నుంచిచెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్లుగా చెరో ఐదు సార్లు ట్రోఫీలు గెలిచిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య చెపాక్ వేదికగా ఆదివారం రెండో మ్యాచ్ జరగనుంది. గాయం కారణంగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, నిషేధం కారణంగా హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోగా... సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టును నడిపించనున్నాడు. రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రికెల్టన్, నమన్ ధిర్‌తో ముంబై బ్యాటింగ్ బలంగానే ఉంది. బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్ అనుభవం ముంబైకి ప్రధానాయుధం కాగా... దీపక్ చాహర్, కరణ్ శర్మ, సాంట్నర్, ముజీబ్ ఉర్ రహమాన్ మిగిలిన బాధ్యతలు చూసుకోనున్నారు. మరోవైపు ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్ సుదీర్ఘ విరామం తర్వాత చెన్నై జట్టులో తిరిగి చేరాడు. చెపాక్ లాంటి స్లో పిచ్‌పై అశ్విన్, జడేజా, నూర్ అహ్మద్‌ను ఎదుర్కోవడం కష్టమైన పనే. ఎప్పట్లాగే మహేంద్ర సింగ్ ధోని వికెట్ల వెనుక నుంచి చెన్నై జట్టుకు దిశానిర్దేశం చేయనుండగా... బ్యాటింగ్‌లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కాన్వే, రాహుల్ త్రిపాఠి, శివమ్ దూబే, స్యామ్ కరన్, జడేజా కీలకం కానున్నారు. గత సీజన్లో ఎక్కువ శాతం బ్యాటింగ్‌కు రాని ధోని ఈ సారి బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వస్తాడా చూడాలి. ఇరు జట్ల మధ్య చివరగా జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట చెన్నై విజయం సాధించింది. గత సీజన్లో పేలవ ప్రదర్శనతో పట్టిక అట్టడుగు స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌ను తాజాగా ప్రారంభించాలని చూస్తోంది. -
ఈడెన్‌లో మెరుపులతో మొదలు
డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ కొత్త సీజన్‌ను ఓటమితో మొదలు పెట్టింది. సొంతగడ్డ ఈడెన్ గార్డెన్స్‌లో ఆడిన మ్యాచ్‌లోనూ శుభారంభం చేయలేకపోయింది. బ్యాటింగ్‌లో రహానే, నరైన్ మెరుపులతో ఒక దశలో 200 సాధించగలదనిపించిన టీమ్ ఆ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలి స్వల్ప స్కోరుకే పరిమితమైంది.ఆర్సీబీ బౌలర్లు కేకేఆర్‌ను సరైన సమయంలో నిలువరించడంలో సఫలమయ్యారు. ఆ తర్వాత సాల్ట్, కోహ్లి మెరుపు ఓపెనింగ్‌తో విజయానికి బాటలు వేసుకున్న బెంగళూరు ఆశావహ దృక్పథంతో తమ ప్రయాణాన్ని మొదలు పెట్టింది. మరో 22 బంతులు మిగిలి ఉండగానే గెలిచిన మ్యాచ్‌తో రజత్ పాటీదార్ కెపె్టన్‌గా శుభారంభం చేశాడు. కోల్‌కతా: ఐపీఎల్ తొలి పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పైచేయి సాధించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అజింక్య రహానే (31 బంతుల్లో 56; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించగా... సునీల్ నరైన్ (26 బంతుల్లో 44; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), అంగ్కృష్ రఘువంశీ (22 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. రహానే, నరైన్ రెండో వికెట్‌కు 55 బంతుల్లోనే 103 పరుగులు జోడించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కృనాల్ పాండ్యా (3/29) కీలక సమయంలో 3 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అనంతరం బెంగళూరు 16.2 ఓవర్లలో 3 వికెట్లకు 177 పరుగులు సాధించింది. విరాట్ కోహ్లి (36 బంతుల్లో 59 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఫిల్ సాల్ట్ (31 బంతుల్లో 56; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో చెలరేగగా...తొలి సారి కెప్టెన్‌గా వ్యవహరించి రజత్ పాటీదార్ (16 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా దూకుడుగా ఆడాడు. భారీ భాగస్వామ్యం... 10 ఓవర్లలో 107 పరుగులు...ఇన్నింగ్స్ తొలి భాగంలో కోల్‌కతా బ్యాటింగ్ జోరింది. డి కాక్ (4) మొదటి ఓవర్లోనే వెనుదిరిగిన తర్వాత రహానే, నరైన్ కలిసి చెలరేగిపోయారు. సలామ్ ఓవర్లో ఫోర్, 2 సిక్స్‌లు బాదిన రహానే...కృనాల్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. అదే ఓవర్లో సిక్స్‌తో నరైనా కూడా జత కలిశాడు. దయాళ్ ఓవర్లో కూడా ఇదే తరహాలో రహానే 2 ఫోర్లు, సిక్స్‌తో చెలరేగిపోయాడు. సుయాశ్ ఓవర్లో సిక్స్‌తో 25 బంతుల్లోనే రహానే అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా...చివరి రెండు బంతులను రహానే సిక్స్, ఫోర్‌గా మలిచాడు. సలామ్ తర్వాతి ఓవర్లో కూడా 4, 6 కొట్టిన నరైన్ అదే ఊపులో చివరి బంతికి అవుటయ్యాడు. ఇక్కడే కేకేఆర్ ఇన్నింగ్స్ మలుపు తిరిగింది. ఒక్కసారిగా చెలరేగిన బెంగళూరు బౌలర్లు ప్రత్యర్థిపై పట్టు సాధించారు. 16 పరుగుల తేడాతో రహానే, వెంకటేశ్ అయ్యర్ (6) వెనుదిరగ్గా...ఐదు పరుగుల వ్యవధిలో భారీ హిట్టర్లు రింకూ సింగ్ (12), ఆండ్రీ రసెల్ (4) వికెట్లను జట్టు కోల్పోయింది. దాంతో అంచనాలకు అనుగుణంగా భారీ స్కోరును సాధించలేకపోయింది. దూకుడుగా దూసుకుపోయి... ఛేదనలో బెంగళూరు చెలరేగిపోయింది. ఇన్నింగ్స్ తొలి బంతినే ఫోర్‌గా మలచిన సాల్ట్ ఘనంగా మొదలు పెట్టగా, అతనికి కోహ్లి తోడవడంతో టీమ్ లక్ష్యం దిశగా సునాయాసంగా దూసుకుపోయింది. అరోరా ఓవర్లో సాల్ట్ 2 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టగా, కోహ్లి మరో ఫోర్ బాదడంతో మొత్తం 20 పరుగులు వచ్చాయి. నైట్‌రైడర్స్ ఎంతో ఆశలు పెట్టుకున్న వరుణ్ చక్రవర్తికి తొలి ఓవర్లో బాగా దెబ్బ పడింది. వరుస బంతుల్లో సాల్ట్ 4, 6, 4, 4 బాదడంతో పరిస్థితి అంతా ఆర్సీబీకి అనుకూలంగా మారిపోయింది. జాన్సన్ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు బాది తానూ తగ్గలేదని కోహ్లి చూపించగా, 25 బంతుల్లో సాల్ట్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. తక్కువ వ్యవధిలో సాల్ట్, పడిక్కల్ (10) వికెట్లు తీసి కోల్‌కతా కాస్త ఊరట చెందినా...తర్వాత వచ్చిన పాటీదార్ కూడా బౌండరీల వర్షం కురిపించాడు. రాణా ఓవర్లోనే అతను ఏకంగా 4 ఫోర్లు కొట్టడం విశేషం. 30 బంతుల్లో విరాట్ హాఫ్ సెంచరీ సాధించాడు. చివర్లో వరుసగా 6, 4 కొట్టి లివింగ్‌స్టోన్ (15 నాటౌట్) మ్యాచ్ ముగించాడు. స్కోరు వివరాలుకోల్కాత నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: డి కాక్ (సి) జితేశ్ (బి) హాజల్‌వుడ్ 4; నరైన్ (సి) జితేశ్ (బి) సలామ్ 44; రహానే (సి) సలామ్ (బి) పాండ్యా 56; వెంకటేశ్ (బి) పాండ్యా 6; రఘువంశీ (సి) జితేశ్ (బి) దయాళ్ 30; రింకూ (బి) పాండ్యా 12; రసెల్ (బి) సుయాశ్ 4; రమణ్‌దీప్ (నాటౌట్) 6; హర్షిత్ (సి) జితేశ్ (బి) హాజల్‌వుడ్ 5; జాన్సన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–4, 2–107, 3–109, 4–125, 5–145, 6–150, 7–168, 8–173. బౌలింగ్: హాజల్‌వుడ్ 4–0–22–2, యశ్ దయాళ్ 3–0–25–1, రసిఖ్ సలామ్ 3–0–35–1, కృనాల్ పాండ్యా 4–0–29–3, సుయాశ్ శర్మ 4–0–47–1, లివింగ్‌స్టోన్ 2–0–14–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) జాన్సన్ (బి) వరుణ్ 56; కోహ్లి (నాటౌట్) 59; పడిక్కల్ (సి) రమణ్‌దీప్ (బి) నరైన్ 10; పటీదార్ (సి) రింకూ (బి) అరోరా 34; లివింగ్‌స్టోన్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (16.2 ఓవర్లలో 3 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–95, 2–118, 3–162. బౌలింగ్: వైభవ్ అరోరా 3–0–42–2, స్పెన్సర్ జాన్సన్ 2.2–0–31–0, వరుణ్ చక్రవర్తి 4–0–43–1 హర్షిత్ రాణా 3–0–32–0, సునీల్ నరైన్ 4–0–27–1. సందడిగా ప్రారంభోత్సవంతొలి మ్యాచ్‌కు ముందు ఈడెన్ గార్డెన్స్‌లో ఐపీఎల్ ప్రారంభ వేడుకలు జరిగాయి. షారుఖ్ ఖాన్ వ్యాఖ్యానంతో ఈ కార్యక్రమం మొదలు కాగా...ఆ తర్వాత ప్రముఖ గాయని శ్రేయా ఘోషాల్ తన పాటతో అలరించింది. అనంతరం దిశా పటాని తన డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. సింగర్ కరణ్ ఔజ్లా ఆమెకు జత కలిశాడు. చివర్లో షారుఖ్ చిత్రం ‘పఠాన్’లోని సూపర్ హిట్ పాటకు అతనితో కలిసి విరాట్ కోహ్లి వేసిన స్టెప్పులు హైలైట్‌గా నిలిచాయి. తొలి ఐపీఎల్ నుంచి ఇప్పటి వరకు ఆడుతున్న విరాట్ కోహ్లికి బీసీసీఐ ప్రత్యేక ‘18’ జ్ఞాపికను అందించింది. ఐపీఎల్లో నేడుహైదరాబాద్ X రాజస్తాన్ వేదిక: హైదరాబాద్ మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి చెన్నై X ముంబైవేదిక: చెన్నైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఉప్పల్ లో ఐపీఎల్ బ్లాక్ టికెట్ దందా
-
IPL మ్యాచ్ టికెట్ల దందా.. ఉప్పల్ మెట్రో వద్ద బ్లాక్‌లో అమ్మకం
సాక్షి, ఉప్పల్: నేటి నుంచి ఐపీఎల్ సీజన్-18 ప్రారంభం కానుంది. ఇక, రేపు హైదరాబాద్ వేదికగా రాజస్థాన్, SRH మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు బ్లాక్‌లో అమ్మడం కలకలం రేపింది. ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను అమ్ముతున్న వ్యక్తిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాల ప్రకారం.. ఐపీఎల్ సందడి వేళ ఉప్పల్‌లో ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లు తిలకించేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. మ్యాచ్ టికెట్స్ కోసం ఎగబడతారు. కానీ, కొందరు మాత్రం మ్యాచ్ టికెట్లను బ్లాక్‌లో అమ్మడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రేపు జరగబోయే RR Vs SRH మ్యాచ్ టికెట్లను ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద ఓ వ్యక్తి అమ్మడం కలకలం రేపింది. మెట్రో స్టేషన్ వద్ద భరద్వాజ్ అనే వ్యక్తి టికెట్లను అమ్మడం కొందరు గుర్తించారు. దీంతో, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఓటీ పోలీసులు అక్కడిని చేరుకుని భరద్వాజ్‌కు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, అతడి వద్ద ఉన్న ఐపీఎల్ మ్యాచ్ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో మ్యాచ్ టికెట్లను ఎక్కువ ధరకు అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు. -
IPL 2025: రాహుల్ రానట్టేనా?
విశాఖ స్పోర్ట్స్: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో తమ తొలి మ్యాచ్ ఆడేందుకు లక్నో సూపర్ జెయింట్స్(ఎల్ఎస్జీ) జట్టు విశాఖపట్నం చేరుకుంది. శుక్రవారం ప్రత్యేక విమానంలో లక్నో నుంచి జట్టు విశాఖకు వచ్చింది. వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఈ నెల 24వ తేదీ రాత్రి 7.30 గంటలకు ఎల్ఎస్జీ, ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రిషబ్ పంత్ విశాఖ స్టేడియంలో రెండు మ్యాచ్‌లు ఆడాడు. ఈసారి ఎల్ఎస్జీ జట్టు కు రిషబ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధించాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాక్టీస్ ప్రారంభించగా, ఎల్ఎస్జీ జట్టు శనివారం ప్రాక్టీస్ చేయనుంది. ఎల్ఎస్జీ జట్టుకు మెంటర్‌గా జహీర్ ఖాన్, హెడ్ కోచ్‌గా లాంగర్, సహాయ కోచ్‌లుగా జాంటీ రోడ్స్, ప్రవీణ్ తంబే, లాన్స్ క్లుసెనర్ వంటి వారు ఉన్నారు. జట్టులో వికెట్ కీపర్లుగా ఆర్యన్, నికోలస్ అందుబాటులో ఉన్నారు. ఆల్రౌండర్లుగా మార్క్రమ్, మార్ష్, షాబాజ్ ఉండగా, బ్యాటింగ్‌లో ఆయుష్, డేవిడ్ మిల్లర్, సమద్ తమ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. బౌలింగ్‌లో రవి బిష్ణోయ్, ఆవేష్, ఆకాష్‌తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్‌గా సిద్ధార్థ్ లేదా అర్షిన్ ఆడే అవకాశం ఉంది. అయితే మయాంక్, మోషిన్, ఆవేష్ గాయా ల కారణంగా జట్టుకు అందుబాటులో ఉండటంపై సందేహాలు ఉన్నాయి. ప్రాక్టీస్ సెషన్ తర్వాత బౌలింగ్ విభాగంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇరు జట్లు గ్రూప్–2లో ఉన్నాయి. గత సీజన్లో ఇరు జట్లు కూడా లీగ్ దశలోనే నిష్క్రమించాయి.రాహుల్ రానట్టేనా?కాగా.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాడు కె.ఎల్.రాహుల్ ఇంకా విశాఖ చేరుకోలేదు. దీంతో ఆయన విశాఖలో జరిగే రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం అనుమానమే.! దీంతో ఎల్ఎస్జీతో జరిగే తొలి మ్యాచ్‌లో ఢిల్లీ తరపున ఫెరీరా వికెట్ కీపర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. గత సీజన్లో రాహుల్ లక్నో జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. -
MS Dhoni: ఆ ఒక్కటీ అడక్కు!
ఐపీఎల్(IPL) రాగానే ఎమ్మెస్ ధోనికి(MS Dhoni) ఇదే ఆఖరి సీజనా అనే చర్చ మళ్లీ మొదలవుతుంది! గత నాలుగేళ్లుగా అతను ‘డెఫినెట్లీ నాట్’ అంటూ చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నాడు. లీగ్‌లో బ్యాటర్‌గా ధోని ప్రభావం దాదాపు సున్నాగా మారిపోయింది. అతని స్థాయి ఆట ఎంతో కాలంగా అస్సలు కనిపించడం లేదు. తప్పనిసరి అయితే తప్ప బ్యాటింగ్‌కు రాకుండా బౌలర్లను ముందుగా పంపిస్తున్నాడు. ఒక రకంగా టీమ్ 10 మందితోనే ఆడుతోంది! అయితే చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ ఆలోచనలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఆటగాడిగా ఎలా ఉన్నా అతను మైదానంలో ఉంటే చాలు అని వారు భావిస్తున్నారు. అధికారికంగా కెప్టెన్ కాకపోయినా జట్టును నడిపించడంలో, వ్యూహాల్లో, టీమ్‌కు పెద్ద దిక్కుగా అతనికి అతనే సాటి. ఫిట్‌గానే ఉన్నాడు కాబట్టి అతను తనకు నచ్చినంత కాలం ఆడతాడేమో. -
ముంబై బుస్ బుస్.. చెన్నై తుస్
-
‘ఎంపిక నా చేతుల్లో లేదు’
బెంగళూరు: పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ ఆ్రస్టేలియాతో టెస్టు సిరీస్ తర్వాత భారత జట్టులో చోటు కోల్పోయాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌తో పాటు టీమిండియా విజేతగా నిలిచిన చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌లోనూ అతనికి స్థానం లభించలేదు. అయితే ఈ హైదరాబాదీ పేసర్ జాతీయ జట్టులోకి త్వరలోనే పునరాగమనం చేస్తానని ఆశాభావంతో ఉన్నాడు. ప్రస్తుతం అంతగా ఆందోళన చెందడం లేదని, ఐపీఎల్లో సత్తా చాటాలనే పట్టుదలతో బరిలోకి దిగుతున్నట్లు అతను చెప్పాడు.ఐపీఎల్లో సిరాజ్ ఈసారి గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. ‘భారత జట్టు ఎంపిక నా చేతుల్లో ఉండదనేది వాస్తవం. నా చేతుల్లో బంతి మాత్రమే ఉంటుంది. దాంతో ఏం చేయగలను అనేదే ముఖ్యం. టీమ్ సెలక్షన్ గురించి అతిగా ఆలోచిస్తూ ఒత్తిడి పెంచుకోను. అలా చేస్తే నా ఆటపై ప్రభావం పడుతుంది. మున్ముందు ఇంగ్లండ్ పర్యటన, ఆసియా కప్లాంటివి ఉన్నాయనే విషయం నాకు తెలుసు. ఏం జరుగుతుందో చూద్దాం. ప్రస్తుతానికి దృష్టంతా ఐపీఎల్ పైనే ఉంది’ అని సిరాజ్ వ్యాఖ్యానించాడు. టీమిండియా తరఫున ఆడని సమయంలో బౌలింగ్ మెరుగుపర్చుకోవడంతో పాటు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టినట్లు సిరాజ్ వెల్లడించాడు. ‘గత కొన్నేళ్లుగా నిరంతరాయంగా ఆడుతున్నాను. సాధారణంగా విశ్రాంతి తక్కువగా దొరుకుతుంది. కానీ ఈసారి మంచి విరామం లభించింది. అందుకే బౌలింగ్, ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి పెట్టా. కొత్త బంతులు, పాత బంతులతో బౌలింగ్ చేశాం. స్లో బంతులు, యార్కర్ల విషయంలో ప్రత్యేక సాధన చేశాను. కొత్తగా నేర్చుకున్న అంశాలను ఐపీఎల్లో ప్రదర్శిస్తా’ అని అతను చెప్పాడు. శుబ్‌మన్ గిల్ నాయకత్వంలో ఆడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు సిరాజ్ వెల్లడించాడు. ‘బెంగళూరు జట్టుకు దూరం కావడం కొంత బాధకు గురి చేసిందనేది వాస్తవం. కోహ్లి అన్ని రకాలుగా అండగా నిలిచాడు. అయితే ఇక్కడా గిల్ సారథ్యంలో చాలా మంచి జట్టుంది. గిల్ కెపె్టన్సీలో బౌలర్లకు మంచి స్వేచ్ఛ ఉంటుంది. ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తే ఎప్పుడూ వారించడు. మేమిద్దరం ఒకే టెస్టుతో అరంగేట్రం చేశాం. వ్యక్తిగతంగా కూడా మంచి సాన్నిహిత్యం ఉంది’ అని సిరాజ్ సంతోషం వ్యక్తం చేశాడు. తమ టీమ్‌లో రబాడ, రషీద్, ఇషాంత్, కొయెట్జీ లాంటి అగ్రశ్రేణి బౌలర్లు ఉండటం సానుకూల విషయమని, ఇది అందరిపై ఒత్తిడి తగ్గిస్తుందని అతను అభిప్రాయ పడ్డాడు. గత సీజన్ వరకు ఇదే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించిన మొహమ్మద్ షమీతో తనను పోల్చడంపై స్పందిస్తూ... ‘టైటాన్స్ టీమ్ తరఫున షమీ భాయ్ చాలా బాగా ఆడాడు. కీలక సమయాల్లో స్వింగ్‌తో వికెట్లు తీశాడు. నేను కూడా ఆయనలాగే పెద్ద సంఖ్యలో వికెట్లు తీసి జట్టుకు ఉపయోగపడితే చాలు. మొతెరా మైదానంలో కొత్త బంతితో షమీ వికెట్లు తీయడం నేను చూశాను. అదే తరహాలో పవర్‌ప్లేలో వికెట్లు తీయడమే నా పని’ అని సిరాజ్ చెప్పాడు. టైటాన్స్ కోచ్‌గా ఉన్న మాజీ పేసర్ ఆశిష్ నెహ్రాతో కలిసి పని చేసేందుకు, ఆయన వద్ద కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఈ హైదరాబాదీ పేర్కొన్నాడు. -
ఒక్క టైటిల్ కోసం...
ఐపీఎల్ మొదలైనప్పుడు ఉన్న ఎనిమిది జట్లలో ఐదు టీమ్‌లు ఎప్పుడో విజేతగా నిలిచాయి... బెంగళూరు ఒక్కసారి కూడా గెలవకపోయినా ఆ జట్టు మూడుసార్లు ఫైనల్‌కు వెళ్లింది. పైగా విరాట్ కోహ్లిలాంటి దిగ్గజం కారణంగా ఫలితాలతో సంబంధం లేకుండా ఆకర్షణ కోల్పోని జట్టుగా సాగుతోంది... కానీ మరో రెండు టీమ్‌లు మాత్రం ప్రతీ సీజన్లో ఎన్నో ఆశలతో బరిలోకి దిగడం, సగం టోర్నీ ముగిసేవరకే పేలవ ప్రదర్శనతో చేతులెత్తేయడం దాదాపుగా రివాజుగా మారిపోయింది... ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఆటగాళ్లు, కెప్టెన్లు, సిబ్బందిని మార్చి మార్చి ప్రయోగాలు చేసినా, వ్యూహాలు మార్చినా ఆశించిన ఫలితం దక్కలేదు. డేర్‌డెవిల్స్ నుంచి క్యాపిటల్స్‌గా మారినా... కింగ్స్ ఎలెవన్ నుంచి కింగ్స్‌కు పరిమితమైనా రాత మాత్రం మారలేదు. మరోసారి కొత్త మార్పులు, కొత్త బృందంతో దండయాత్రకు సిద్ధమవుతున్న ఢిల్లీ, పంజాబ్ టీమ్‌లకు ఇప్పుడైనా టైటిల్ రూపంలో అదృష్టం తలుపు తడుతుందా చూడాలి. –సాక్షి క్రీడా విభాగం అక్షర్ అద్భుతం చేసేనా? 2020 సీజన్లో ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ రన్నరప్‌గా నిలిచి సంతృప్తి చెందింది. ఐపీఎల్లో ఢిల్లీకిదే అత్యుత్తమ ప్రదర్శన. ఆ తర్వాత నాలుగు సీజన్లలో ఢిల్లీ వరుసగా 3, 5, 9, 6 స్థానాల్లో నిలిచింది. గత ఏడాది తొలి ఐదు మ్యాచ్‌లలో ఓడిన తర్వాత కోలుకోవడం కష్టమైంది. ఈసారి జట్టు ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బందిలో కూడా భారీ మార్పు జరిగింది. వేలానికి ముందు అట్టి పెట్టుకున్న అక్షర్ పటేల్, కుల్దీప్, స్టబ్స్, పొరేల్లతో పాటు వేలంలో జేక్ ఫ్రేజర్‌ను మళ్లీ తెచ్చుకుంది. ఇప్పుడు అందరి దృష్టి కేఎల్ రాహుల్‌పై ఉంది. లక్నో యాజమాన్యంతో విభేదాల తర్వాత ఆ జట్టుకు దూరమైన రాహుల్ బ్యాటింగ్‌పై దృష్టి పెట్టేందుకే కెపె్టన్సీని తిరస్కరించినట్లు సమాచారం. ఇటీవలి ఫామ్ చూస్తే రాహుల్ చక్కటి ప్రదర్శనపై అంచనాలు పెరుగుతున్నాయి. ఓపెనింగ్‌లో ఫ్రేజర్, డుప్లెసిస్‌తో పాటు మిడిలార్డర్లో స్టబ్స్ దూకుడు కీలకం కానుంది. గత ఏడాది పంజాబ్ తరఫున చెలరేగిన అశుతోష్ శర్మతో పాటు సమీర్ రిజ్వీ ఫినిషర్లుగా సిద్ధమయ్యారు. ఇక ఆల్‌రౌండర్‌గా, కెపె్టన్‌గా అక్షర్ పటేల్ తన ముద్రను చూపించాల్సి ఉంది. ముఖ్యంగా టి20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీలలో సత్తా చాటి ఒక్కసారిగా స్థాయిని పెంచుకున్న అతను ఢిల్లీని సమర్థంగా నడిపిస్తే చరిత్రలో నిలిచిపోగలడు. స్టార్క్‌లాంటి దిగ్గజం జట్టుతో ఉండటం ఎప్పుడైనా బలమే. ముకేశ్, నటరాజన్, కుల్దీప్లు అతనికి అండగా నిలవాల్సి ఉంది. మోహిత్ రూపంలో మరో చక్కటి బౌలింగ్ ప్రత్యామ్నాయం అందుబాటులో ఉంది. హెడ్ కోచ్‌గా హేమంగ్ బదాని, డైరెక్టర్ హోదాలో వచ్చిన వేణుగోపాలరావు ఎలాంటి మార్పు తీసుకొస్తారనేది ఆసక్తికరం. మాజీ ఇంగ్లండ్ స్టార్ కెవిన్ పీటర్సన్ మెంటార్‌గా తన ప్రభావం చూపించవచ్చు. స్టార్క్ మినహా మిగతా భారత పేసర్లకు బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్ ఎలా మార్గనిర్దేశం చేస్తాడో చూడాలి. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: అక్షర్ పటేల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, జేక్ ఫ్రేజర్, మిచెల్ స్టార్క్, ఫాఫ్ డుప్లెసిస్, ముకేశ్ కుమార్, కరుణ్ నాయర్, డొనొవాన్ ఫెరీరా, అభిషేక్ పొరేల్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, దర్శన్ నల్కండే, విప్రాజ్ నిగమ్, అజయ్ మండల్, మన్వంత్ కుమార్, త్రిపురాన విజయ్, మాధవ్ తివారి, టి.నటరాజన్, మోహిత్ శర్మ, దుష్మంత్ చమీరా. శ్రేయస్ నాయకత్వంలోనైనా... 2014లో అనూహ్య ప్రదర్శనతో దూసుకుపోయి ఫైనల్ వరకు వెళ్లగలగడం పంజాబ్ కింగ్స్ జట్టు సాధించిన ఘనత. కానీ ఆ తర్వాత లీగ్‌లో మరే ఇతర జట్టుకు లేనంత చెత్త రికార్డును ఈ టీమ్ నమోదు చేసింది. తర్వాతి పదేళ్లలో ఒక్కసారి కూడా కనీసం ‘ప్లే ఆఫ్స్’కు అర్హత సాధించలేకపోయిన జట్టు వరుసగా 8, 8, 5, 7, 6, 6, 6, 6, 8, 9 స్థానాలకు పరిమితమైంది! గత సీజన్లో 14 మ్యాచ్‌లలో 5 మాత్రమే గెలిచిన టీమ్ ఈసారి ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే అట్టి పెట్టుకొని మళ్లీ కొత్తగా మొదలు పెట్టేందుకు సిద్ధమైంది. ప్రభ్‌సిమ్రన్ సింగ్, శశాంక్ సింగ్‌లను కొనసాగించి వారిపై అంచనాలు పెంచుకున్న టీమ్ వేలంలో యువ పేస్ అర్‡్షదీప్‌ను తిరిగి తెచ్చుకోవడం సరైన నిర్ణయం. ఏడాది కాలంగా ఫామ్‌లో ఉన్న అతను టీమ్ విజయాలను శాసించగలడు. ఢిల్లీ కోచ్‌గా ఫలితాలు సాధించలేకపోయిన రికీ పాంటింగ్, 2024 ఐపీఎల్ విన్నింగ్ కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ కాంబినేషన్లో జట్టు సంచలనాలు ఆశిస్తోంది. ట్రోఫీ గురించి ఇప్పుడే మాట్లాడకపోయినా కనీసం గతంలోకంటే మెరుగైన విజయాలు అందుకొని ముందుగా ప్లే ఆఫ్స్ వరకు వెళ్లాలని జట్టు భావిస్తోంది. జట్టుపై ఆ్రస్టేలియన్ల ప్రభావం చాలా ఉంది. గతంలో ఐదు సీజన్లు ఇదే టీమ్‌కు ఆడిన మ్యాక్స్‌వెల్ మళ్లీ ఇక్కడికే వచ్చాడు. కెరీర్ చివర్లో ఉన్న అతను ఎంతగా ప్రభావం చూపిస్తాడనేది చర్చనీయాంశం. మరో నలుగురు ఆసీస్ ఆటగాళ్లు స్టొయినిస్, ఇన్‌గ్లిస్, బార్ట్లెట్, హార్డీ టీమ్‌తో ఉన్నారు. అయ్యర్ కెప్టెన్సీతో పాటు దూకుడైన బ్యాటింగ్ చూపించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్లో చక్కటి ఫామ్‌లో ఉన్న అజ్మతుల్లా, మార్కో యాన్సెన్ కచ్చితంగా ప్రభావం చూపించగలరు. ఐపీఎల్ స్టార్ స్పిన్నర్ చహల్ ఉండటం జట్టుకు అదనపు బలం. హాడిన్, హోప్స్, సునీల్ జోషిలతో కూడిన సహాయక సిబ్బంది కూడా కీలకం కానున్నారు. పంజాబ్ కింగ్స్ జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అర్ష్ దీప్ సింగ్, యుజువేంద్ర చహల్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, శశాంక్ సింగ్, స్టొయినిస్, మ్యాక్స్‌వెల్, ఇన్‌గ్లిస్, హర్‌ప్రీత్ బ్రార్, మార్కో యాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఫెర్గూసన్, నేహల్ వధేరా, విష్ణు వినోద్, హర్నూర్ పన్ను, పైలా అవినాశ్, ప్రియాన్‡్ష ఆర్య, ఆరోన్ హార్డీ, ముషీర్ ఖాన్, సూర్యాంశ్ షెడ్గే, వైశాక్ విజయ్‌కుమార్, యశ్ ఠాకూర్, కుల్దీప్ సేన్, ప్రవీణ్ దూబే, జేవియర్ బార్ట్లెట్. -
IPL : ఈసారి కప్ కొట్టే కెప్టెన్ ఇతనే..
-
‘సిక్సర్’ కొట్టేదెవరో?
ఐపీఎల్లో విజయవంతమైన జట్టుగా గుర్తింపు... హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించిన ఫ్రాంచైజీగా రికార్డు... నైపుణ్యాన్ని వలవేసి పట్టే నేర్పరితనం... యువ ఆటగాళ్లకు అండగా నిలిచే యాజమాన్యం... వెరసి ఐపీఎల్ టోర్నీ చరిత్రలో 5 ట్రోఫీలు సాధించిన ముంబై ఇండియన్స్ జట్టు గత కొన్నాళ్లుగా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతోంది. రోహిత్ శర్మ నుంచి సారథ్య బాధ్యతలు హార్దిక్ పాండ్యాకు అప్పగించడంతో జట్టులో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అభిమానుల అసహనం, మాజీల రుసరుసలు, విశ్లేషకులు వెటకారాలతో గత సీజన్ గడిచిపోగా... 2024 ఐపీఎల్ తర్వాత భారత జట్టుకు రోహిత్ శర్మ 2 ఐసీసీ ట్రోఫీలు అందించాడు. ఈ రెండింట్లో హార్దిక్ కీలకపాత్ర పోషించడంతో సమస్య సమసిపోయినట్లైంది. మరి ఈ ఏడాదైనా ముంబై సమష్టిగా సత్తాచాటి మునుపటి జోరు సాగిస్తుందా చూడాలి! ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు ఏదైనా ఉందంటే... అది ముమ్మాటికీ చెన్నై సూపర్ కింగ్సే! ఇప్పటి వరకు 15 సీజన్లు ఆడిన చెన్నై జట్టు అందులో 10 సార్లు ఫైనల్‌కు చేరి ఐదుసార్లు ట్రోఫీ చేజిక్కించుకుంది. ఈ గణాంకాలు చాలు ఐపీఎల్లో చెన్నై జోరు ఏంటో చెప్పేందుకు. వికెట్ల వెనక ధోని మాయాజాలం... కాన్వే, రచిన్ రవీంద్ర బ్యాటింగ్ సామర్థ్యం... శివమ్ దూబే, రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్ మెరుపులు, అశ్విన్, పతిరణ బౌలింగ్ నైపుణ్యం ఇలా అన్నీ విభాగాల్లో పటిష్టంగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్... ఆరో కప్పువేటకు సిద్ధమైంది. –సాక్షి క్రీడావిభాగం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం నుంచి నిలకడ కొనసాగిస్తున్న ముంబై ఇండియన్స్ జట్టు ఆరోసారి ట్రోఫీ చేజిక్కించుకునేందుకు సిద్ధమవుతోంది. గత కొన్ని సీజన్లుగా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న ముంబై ఇండియన్స్ ఈసారి మెరుగైన ప్రదర్శన చేయడమే లక్ష్యంగా సాగుతోంది. గత సీజన్ ఆరంభానికి ముందు ఫ్రాంచైజీకి ఐదు ట్రోఫీలు (2013, 2015, 2017, 2019, 2020) అందించిన ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మను కాదని... గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను తీసుకొచ్చి సారథ్య బాధ్యతలు అప్పగించడం అభిమానులకు ఏమాత్రం రుచించలేదు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ముంబై ఇండియన్స్ నిర్ణయాన్ని దుమ్మెత్తిపోసిన అభిమానులు... మైదానంలో హార్దిక్‌ను గేలి చేశారు. సొంత మైదానం వాంఖడేతో పాటు... దేశంలో ఎక్కడ మ్యాచ్ ఆడేందుకు వెళ్లినా... పాండ్యాకు ఇదే అనుభవం ఎదురైంది. దీంతో సహజంగానే డ్రెస్సింగ్‌రూమ్ వాతావరణం దెబ్బతింది. అదే మైదానంలో ప్రస్ఫుటమైంది. గత సీజన్లో 14 మ్యాచ్‌లాడిన ముంబై ఇండియన్స్ జట్టు కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి 10 పరాజయాలతో పట్టికలో అట్టడుగున నిలిచింది. గత నాలుగు సీజన్లలో ఒక్కసారి (2023లో) మాత్రమే ముంబై జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరింది. 2022, 2024లో పట్టికలో కింది స్థానంతో లీగ్‌ను ముగించింది. అయితే అప్పటికీ ఇప్పటికీ జట్టులో ఎంతో తేడా కనిపిస్తోంది. ఏడాది వ్యవధిలో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఐసీసీ టి20 ప్రపంచకప్‌తో పాటు, చాంపియన్స్ ట్రోఫీ చేజిక్కించుకుంది. ఈ రెండు విజయాల్లోనూ కీలకంగా నిలిచిన హార్దిక్ పాండ్యాను అభిమానులు తిరిగి అక్కున చేర్చుకున్నారు. దీనికి తోడు రోహిత్ వంటి అనుభవజ్ఞుడి సలహాలు, సూచనలు ఉంటే... పాండ్యా జట్టును మరింత ముందుకు తీసుకెళ్లడం ఖాయమే. బుమ్రా ఫిట్నెస్ సాధించేనా! ఆ్రస్టేలియా పర్యటన సందర్భంగా గాయపడ్డ భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్‌పై ముంబై ఆందోళన చెందుతోంది. వెన్నునొప్పితో చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన ఈ ఏస్ పేసర్... ఐపీఎల్ తొలి దశ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండబోడని ఇప్పటికే ఫ్రాంచైజీ వెల్లడించింది. అయితే అతడి సేవలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయనే దానిపై స్పష్టత లేదు. గతేడాది వేలంలో బుమ్రా, రోహిత్, హార్దిక్, సూర్యకుమార్‌తో పాటు హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మను ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది. అందులో అత్యధికంగా బుమ్రాకు రూ. 18 కోట్లు కట్టబెట్టింది. యువ ఆటగాడు ఇషాన్ కిషన్‌ను వేలానికి వదిలేసిన ముంబై... ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, సాంట్నర్‌తో బౌలింగ్‌ను మరింత పటిష్టం చేసుకుంది. రోహిత్‌తో కలిసి దక్షిణాఫ్రికా ప్లేయర్ రికెల్టన్ ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నాడు. భారత ఆటగాళ్ల విషయంలో పటిష్టంగా కనిపిస్తున్న ముంబై ఇండియన్స్... విదేశీ ఆటగాళ్ల ఎంపిక మాత్రం కాస్త అనూహ్యంగా ఉంది. లోయర్ ఆర్డర్లో ధాటిగా ఆడగల విదేశీ పించ్ హిట్టర్ లోటు కనిపిస్తోంది. రూ.5 కోట్ల 25 లక్షలు వెచ్చించి ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా తిరిగి దక్కించుకున్న నమన్ ధీర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. బుమ్రా గైర్హాజరీలో బౌల్ట్, సాంట్నర్, దీపక్ చాహర్, కరణ్ శర్మ పై బౌలింగ్ భారం పెరగనుంది. ఆంధ్ర ఆటగాడు పెనుమత్స సత్యనారాయణ రాజు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ జట్టులో ఉన్నా... వారికి మ్యాచ్ ఆడే అవకాశం దక్కడం కష్టమే. ముంబై ఇండియన్స్ జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్ ), రోహిత్, సూర్యకుమార్, తిలక్, రాబిన్ మిన్జ్, రికెల్టన్, శ్రీజిత్ క్రిష్ణన్, జాకబ్స్, నమన్ ధీర్, జాక్స్, సాంట్నర్, అంగద్ , విఘ్నేశ్, కార్బిన్, బౌల్ట్, కరణ్ శర్మ, దీపక్ చాహర్, అశ్వని కుమార్, టాప్లీ, వెంకట సత్యనారాయణ, అర్జున్ టెండూల్కర్, ముజీబ్, బుమ్రా. అంచనా: ముంబై ఇండియన్స్ ఆటతీరు పరిశీలిస్తే... ఆడితే అందలం, లేకుంటే అట్టడుగు స్థానం అనేది సుస్పష్టం. గత నాలుగు సీజన్లలో కేవలం ఒక్కసారే ప్లే ఆఫ్స్‌కు చేరిన ముంబై... స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే ఈ సారి కూడా ప్లే ఆఫ్స్ చేరొచ్చు. సాధారణ ఆటగాడు సైతం... అసాధారణ ప్రదర్శన చేయడం... అప్పటి వరకు జట్టులో చోటు దక్కడమే కష్టమనుకున్న ప్లేయర్ సైతం... ‘ఎక్స్’ ఫ్యాక్టర్‌గా మారడం... చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో నిత్యకృత్యం.అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోవడంలో చెన్నైని మించిన జట్టు లేదనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటి వరకు 5 సార్లు (2010, 2011, 2018, 2021, 2023) ఐపీఎల్ ట్రోఫీ చేజిక్కించుకున్న సూపర్ కింగ్స్ మరో 5 సార్లు (2008, 2012, 2013, 2015, 2019) రన్నరప్‌గా నిలిచింది. గతేడాదే రుతురాజ్ గైక్వాడ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించిన ఫ్రాంచైజీ... అతడితో పాటు రవీంద్ర జడేజాకు రూ. 18 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకుంది.పతిరణను రూ. 13 కోట్లు, శివమ్ దూబేను రూ. 12 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకుంది. అంతర్జాతీయ మ్యాచ్ ఆడి ఐదేళ్లు దాటిపోయిన మహేంద్రసింగ్ ధోనిని రూ. 4 కోట్లకు కొనసాగించింది. వీరితో పాటు రచిన్ రవీంద్రను రూ. 4 కోట్లతో ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా తిరిగి సొంతం చేసుకుంది. ఇక సుదీర్ఘ కాలం తర్వాత రవిచంద్రన్ అశ్విన్‌ను తిరిగి కొనుగోలు చేసుకుంది. మరి గత కొంత కాలంగా నిలకడగా రాణించలేకపోతున్న సూపర్ కింగ్స్ ఈసారి ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. తలా... అన్నీ తానై! అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ధోని... ఈసారి కూడా జట్టును ముందుండి నడిపించనున్నాడు. పేరుకు రుతురాజ్ కెప్టెన్ అయినా... వికెట్ల వెనక నుంచి టీమ్‌కు దిశానిర్దేశం చేసేది ధోనినే అనడంలో సందేహం లేదు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడుతున్న ధోనీ గతేడాది బ్యాటింగ్ ఆర్డర్లో మరీ కింది స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. మరి ఈసారైనా అతని బ్యాట్ నుంచి మెరుపులు వస్తాయోమో చూడాలి. బ్యాటింగ్‌లో కాన్వే, రచిన్, దూబే, రుతురాజ్, జడేజా, ధోని కీలకం కానుండగా... పతిరణ, అశ్విన్, ఖలీల్ అహ్మద్, స్యామ్ కరన్ బౌలింగ్ బాధ్యతలు మోయనున్నారు. రచిన్, జడేజా, దూబే, దీపక్ హూడా, విజయ్ శంకర్, అశ్విన్, జేమీ ఓవర్టన్, సామ్ కరన్ ఇలా లెక్కకు మిక్కిలి ఆల్‌రౌండర్లు ఉండటం చెన్నైకి అదనపు బలం. ఆంధ్ర ఆటగాడు షేక్ రషీద్ జట్టులో ఉన్నా... అతడికి మ్యాచ్ ఆడే అవకాశం దక్కుతుందో లేదో వేచి చూడాలి. చెన్నై జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్ ), మహేంద్రసింగ్ ధోని, కాన్వే, రాహుల్ త్రిపాఠి, షేక్ రషీద్, వన్ష్ బేదీ, సిద్ధార్్థ, రచిన్ రవీంద్ర, రవిచంద్రన్ అశ్విన్, విజయ్ శంకర్, స్యామ్ కరన్, అన్షుల్ కంబోజ్, దీపక్ హూడా, జేమీ ఓవర్టన్, కమలేశ్ నాగర్కోటి, రామకృష్ణ ఘోష్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, ముకేశ్, గుర్జప్నీత్ సింగ్, నాథన్ ఎలీస్, శ్రేయస్ గోపాల్, పతిరణ. అంచనా: ఐపీఎల్లో మిగిలిన జట్లతో పోల్చుకుంటే అత్యధిక మంది ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉన్న చెన్నై స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే ఫైనల్ చేరడం పెద్ద కష్టం కాకపోవచ్చు. -
విశాఖ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు
విశాఖ స్పోర్ట్స్: ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడేందుకు ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ) జట్టు విశాఖ చేరుకుంది. సోమవారం రాత్రి ప్రత్యేక విమానంలో విచ్చేసిన జట్టు సభ్యుల్ని అభిమానులు హర్షాతిరేకాలతో స్వాగతం పలికారు. కెపె్టన్ అక్షర్ పటేల్‌తో పాటు జట్టు సభ్యులు, సపొరి్టంగ్ స్టాఫ్ విమానాశ్రయం నుంచి నేరుగా నోవోటల్కు చేరుకున్నారు. వీరంతా మంగళవారం నుంచి నెట్స్‌లో శ్రమించనున్నారు. విదేశీ ఆటగాళ్లు డుప్లెసిస్, ఫ్రేజర్, ఫెరీరా కులసాగా మాట్లాడుకుంటూ విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. డీసీ జట్టు డైరెక్టర్ వేణుగోపాలరావు, హెడ్ కోచ్ హేమంగ బదాని విశాఖ చేరుకున్న వారిలో ఉన్నారు. డీసీ జట్టులో ఆంధ్రా ఆటగాడు త్రిపురాన విజయ్ చేరాడు. ఢిల్లీ క్యాపిటల్స్ విశాఖ వేదికగా 24న లక్నో సూపర్ జెయింట్స్, 30న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లతో తలపడనుంది. అందుబాటులోకి రూ.వెయ్యి టికెట్లు ఐపీఎల్ సీజన్లో విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభ మ్యాచ్ చూసేందుకు లోయర్ డినామినేషన్ రూ.1000, రూ.1500 టికెట్లు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాయి. రూ.వెయ్యి టికెట్ ఈ స్టాండ్‌లో, రూ.1500 టికెట్ ఎం–1 స్టాండ్‌లో అందుబాటులోకి తెచ్చింది. -
ఐపీఎల్‌కు ముందే అన్లిమిటెడ్ ఆఫర్: జియో యూజర్లకు పండగే!
దేశవ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ ఉప్పొంగుతోంది. క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న.. ఐపీఎల్ 2025 త్వరలోనే ప్రారంభం కానుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని జియో (Jio) తన కస్టమర్ల కోసం స్పెషల్ అన్లిమిటెడ్ క్రికెట్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ ద్వారా 90 రోజులపాటు జియోహాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ పొందవచ్చు.జియో ప్రవేశపెట్టిన ఈ ప్లాన్ కోసం రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే మూడు నెలలు జియోహాట్‌స్టార్ ప్రసారాలను వీక్షించవచ్చు. ఈ ఆఫర్ మార్చి 17 నుంచి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.జియో కొత్త ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా.. మొబైల్, టీవీలలో 4కే స్ట్రీమింగ్ సర్వీస్ కూడా పొందవచ్చు. అంతే కాకుండా 50 రోజులపాటు జియో ఫైబర్ సేవలు కూడా ఉచితంగా అందుకోవచ్చు. ఇందులో అన్లిమిటెడ్ వైఫై, 800 కంటే ఎక్కువ ఓటీటీ ఛానల్స్, 11 ఓటీటీ యాప్‌లు వీక్షించవచ్చు.ఇదీ చదవండి: తగ్గుతూనే ఉన్న బంగారం రేటు: నేటి ధరలు ఇవే..జియో ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న తరువాత.. దీని వ్యాలిడిటీ ఐపీఎల్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి 90 రోజుల వరకు ఉంటుంది. ఇప్పటికే ఉన్న జియో వినియోగదారులు రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌తో రీఛార్జ్ చేయడం ద్వారా ఈ ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే మార్చి 17కి ముందు రీఛార్జ్ చేసుకున్న వారు రూ. 100 యాడ్-ఆన్ ప్యాక్‌ను ఎంచుకోవడం ద్వారా కూడా ప్రయోజనాలను పొందవచ్చు. -
18వ సారైనా... బెంగళూరు రాత మారేనా!
పరుగుల వీరులు... వికెట్లు ధీరులు... మెరుపు ఫీల్డర్లు... అశేష అభిమానులు... విశేష ఆదరణ... ఇలా ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఒక్కసారి కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయింది. లీగ్ ఆరంభం (2008) నుంచి ప్రతిసారీ ‘ఈ సాలా కప్ నమ్దే’ అంటూ బరిలోకి దిగడం... రిక్తహస్తాలతో వెనుదిరగడం పరిపాటిగా మారింది. టోర్నమెంట్ ఆరంభం నుంచి ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కిన విరాట్ కోహ్లి... తన జెర్సీ నంబర్ 18వ సారైనా ట్రోఫీని అందిస్తాడా లేదో వేచి చూడాలి! – సాక్షి క్రీడావిభాగం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యధిక జనాదరణ ఉన్న జట్లలో ఒకటైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరోసారి కప్పు వేటకు సిద్ధమైంది. ఇప్పటి వరకు 17 సీజన్లు ఆడి ఒక్కసారి కూడా ట్రోఫీ నెగ్గలేకపోయిన ఆర్సీబీ ఈ సారైనా తమ కల నెరవేర్చుకోవాలని భావిస్తోంది. లీగ్ చరిత్రలో అత్యుత్తమంగా మూడుసార్లు (2009, 2011, 2016లో) రన్నరప్‌గా నిలిచిన ఆర్సీబీ... తమ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి జెర్సీ నంబర్ 18వ సీజన్లో ట్రోఫీ ఒడిసి పట్టాలని పట్టుదలతో ఉంది. అంతర్జాతీయ స్టార్లపై ఎక్కువ నమ్మకముంచే ఫ్రాంచైజీ ఈసారి దేశీ ఆటగాడు రజత్ పాటీదార్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. 2021 నుంచి ఆర్సీబీకు ప్రాతినిధ్యం వహిస్తున్న రజత్ జట్టు రాత మారుస్తాడని ఆశిస్తోంది. గతేడాది జరిగిన ఐపీఎల్ వేలంతోనే ఈసారి విభిన్నమైన ప్రణాళికతో బరిలోకి దిగనున్నట్లు ఆర్సీబీ సంకేతాలు పంపింది. వేలంలో ఒక్కో జట్టు అత్యధికంగా 25 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉన్నా... ఆర్సీబీ 22 మంది ప్లేయర్లకే పరిమితమైంది. విరాట్ కోహ్లికి రూ. 21 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకున్న ఫ్రాంచైజీ... రజత్ పాటీదార్ (రూ. 11 కోట్లు), యశ్ దయాల్ (రూ. 5 కోట్లు)ను రిటైన్ చేసుకుంది. మ్యాక్స్‌వెల్, సిరాజ్ వంటి అంతర్జాతీయ స్టార్లను వదిలేసుకున్న ఆర్సీబీ... స్వప్నిల్ సింగ్‌ను రూ. 50 లక్షలతో ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా తిరిగి తీసుకుంది. కేఎల్ రాహుల్, చహల్, రిషబ్ పంత్ వంటి వారిని వేలంలో చేజిక్కించుకునే అవకాశం ఉన్నా పట్టించుకోలేదు. అటు అనుభవం... ఇటు యువరక్తంతో కూడిన కొత్త బృందాన్ని కొనుగోలు చేసుకుంది. గత సీజన్లో తొలి ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏడింట ఓడి ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచ్‌లు నెగ్గి ప్లేఆఫ్స్‌కు చేరిన బెంగళూరు... ఎలిమినేటర్‌లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. అతడే బలం... బలహీనత ఆర్సీబీ ప్రయాణాన్ని గమనిస్తే... ఆ జట్టుకు అతిపెద్ద బలం విరాట్ కోహ్లినే. అదే సమయంలో బలహీనత కూడా అతడే. విరాట్ రాణించిన మ్యాచ్‌ల్లో అలవోకగా విజయాలు సాధించే ఆర్సీబీ... అతడు విఫలమైన సమయంలో కనీస ప్రదర్శన కూడా కనబర్చలేక వెనుకబడి పోతుంది. 17 సీజన్లుగా ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ ఐపీఎల్లో ఇప్పటి వరకు 252 మ్యాచ్‌లాడి 8004 పరుగులు చేసి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. 8 శతకాలు, 55 అర్ధశతకాలు ఇలా లెక్కకు మిక్కిలి రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలో ఐదు సీజన్లలో జట్టు తరఫున అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచిన కోహ్లి... చాంపియన్స్ ట్రోఫీ తాజా ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కొనసాగించాలని భావిస్తున్నాడు. గతేడాది కోల్‌కతా నైట్‌రైడర్స్ చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించిన ఫిల్ సాల్ట్... ఫార్మాట్‌తో సంబంధం లేకుండా రాణిస్తున్న ఇంగ్లండ్ యువ ఆల్‌రౌండర్ జాకబ్ బెథెల్... హార్డ్ హిట్టర్ లివింగ్‌స్టోన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. రూ. 11 కోట్లు పెట్టి తీసుకున్న భారత వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ, స్పిన్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాపై కూడా టీమ్ మేనేజ్మెంట్ ఆశలు పెట్టుకుంది. ఆండీ ఫ్లవర్ ఆర్సీబీ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా... దినేశ్ కార్తీక్ మెంటార్‌గా వ్యవహరించనున్నాడు.బౌలర్లపైనే భారం... బ్యాటింగ్ విషయంలో బలంగా ఉన్న బెంగళూరు... ఈసారి మెరుగైన బౌలింగ్ దళంతో బరిలోకి దిగనుంది. ఆస్థాన బౌలర్ సిరాజ్‌ను వదిలేసుకున్న ఆర్సీబీ... తిరిగి తీసుకునే అవకాశం వచ్చినా పట్టించుకోలేదు. రూ. 12.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసుకున్న ఆ్రస్టేలియా స్పీడ్‌స్టర్ జోష్ హాజల్‌వుడ్, ఐపీఎల్లో అపార అనుభవం ఉన్న భువనేశ్వర్ కుమార్, గతేడాది మెరుగైన ప్రదర్శన చేసిన యశ్ దయాల్, దక్షిణాఫ్రికా పేసర్ ఇన్‌గిడి పేస్ భారాన్ని మోయనున్నారు. స్వప్నిల్ సింగ్, జాకబ్ బెథెల్, సుయశ్ శర్మ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. అంతర్జాతీయ అనుభవం ఉన్న నాణ్యమైన స్పిన్నర్ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఐపీఎల్లో ఇతర స్టేడియాలతో పోల్చుకుంటే కాస్త చిన్నదైన బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఈ బౌలింగ్ బృందం ప్రదర్శనపైనే ఆర్సీబీ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఆర్సీబీ జట్టు: రజత్ పాటీదార్ (కెప్టెన్ ), కోహ్లి, సాల్ట్, జితేశ్ శర్మ, దేవదత్ పడిక్కల్, స్వస్తిక్, లివింగ్‌స్టోన్, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, మనోజ్, జాకబ్ బెథెల్, హాజల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, రసిక్, సుయశ్ శర్మ, నువాన్ తుషారా, ఇన్‌గిడి, అభినందన్ సింగ్, మోహిత్ రాఠి, యశ్ దయాల్. అంచనా ఇప్పటి వరకు ఐపీఎల్లో 9 సార్లు ప్లేఆఫ్స్‌కు చేరిన చరిత్ర ఉన్న ఆర్సీబీ... స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే ఈసారి కూడా ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశం ఉంది. -
ఒలింపిక్ చాంపియన్‌గా నిలిస్తే బాగుంటుంది!
బెంగళూరు: ఒక క్రికెటర్‌గా ఒలింపిక్ పతకాన్ని గెలుచుకోగలిగితే అది ఎంతో ప్రత్యేకం అవుతుందని, దానికి మరేదీ సాటి రాదని భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అన్నాడు. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలు జరగనున్న నేపథ్యంలో కోహ్లి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 1900 తర్వాత తొలిసారి విశ్వక్రీడల్లో క్రికెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు దక్కడంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కూడా కీలక పాత్ర పోషించిందని కోహ్లి అభిప్రాయపడ్డాడు. ‘ఒలింపిక్ చాంపియన్‌గా నిలిస్తే ఎంతో బాగుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఐపీఎల్ ఇందులో ప్రముఖ పాత్ర పోషించింది. క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో భాగమయ్యే స్థాయికి తెచి్చంది. ఇది యువ ఆటగాళ్లకు గొప్ప అవకాశం. ప్రతి అథ్లెట్ దాని కోసమే కష్టపడతాడు. పురుషుల, మహిళల విభాగాల్లో మన జట్టు పతకానికి చేరువవుతుందని అనుకుంటున్నా’ అని విరాట్ అన్నాడు. ఇటీవల చాంపియన్స్ ట్రోఫీలో చక్కటి ప్రదర్శన కనబర్చిన కోహ్లి... లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ వరకు కెరీర్ కొనసాగిస్తాడా అనేది చూడాలి. 2028కి విరాట్ 40వ పడిలోకి అడుగుపెట్టనున్నాడు. ‘ఇప్పుడే దాని గురించి మాట్లాడటం తొందరపాటు అవుతుంది. ఒకవేళ ఒలింపిక్ పసిడి పతకం కోసం మ్యాచ్ ఆడుతుంటే... నేను గుట్టు చప్పుడు కాకుండా జట్టులో చేరి పతకం సాధించి ఇంటికి వస్తా’ అని విరాట్ చమత్కరించాడు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు వివిధ అంశాలపై విరాట్ పంచుకున్న విశేషాలు అతడి మాటల్లోనే... » మహిళల ప్రీమియర్ లీగ్ వల్ల దేశంలో మహిళల క్రికెట్ ప్రాధాన్యత మరింత పెరిగింది. భారత మహిళల క్రికెట్ జట్టు గత కొంతకాలంగా నిలకడైన ప్రదర్శన చేస్తూ అభిమానుల మనసులు గెలుచుకుంటోంది. » ఆరేడేళ్ల క్రితం మహిళల ఆటకు ఇంత ప్రాధాన్యత దక్కలేదు. డబ్ల్యూపీఎల్‌కు వస్తున్న ఆదరణ చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా వారి గురించి చర్చ జరుగుతోంది. రోజు రోజుకు ఆటలో ప్రమాణాలు పెరుగుతున్నాయి. » వేరే రంగాల్లో విజయం సాధించినప్పుడు రాని పేరు, ప్రఖ్యాతలు క్రీడల్లో సులువుగా వస్తాయి. ఎందుకంటే మైదానంలో ఆడేది తామే అని ప్రతి ఒక్క అభిమాని ఊహించుకుంటాడు కాబట్టే ఇది సాధ్యం. అందుకే క్రీడాకారులు విజయాలు సాధించినప్పుడు యావత్ భారత్ సంబరాలు చేసుకుంటుంది. » ఆటను ఆస్వాదించడం నాకు ఇష్టం... అదే చేస్తున్నా. ఎలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవాలని అనుకోవడం లేదు. మైదానంలో వంద శాతం కష్టపడటం అలవాటు. దాన్ని ఇక మీద కూడా కొనసాగిస్తా. భావోద్వేగాలు ఆటలో భాగం. వాటిని దాచుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించను. » ఆటలో పోటీ సహజం. అప్పుడే మన సహజ నైపుణ్యం బయటకు వస్తుంది. ఈ స్థాయికి చేరుకున్నాక కూడా ఇంకేదో గుర్తింపు పొందాలనుకోవడం లేదు. ఆటపై ప్రేమ ఉన్నంతకాలం మైదానంలో కొనసాగుతా. ఈ అంశంలో రాహుల్ ద్రవిడ్ విలువైన సూచనలిచ్చారు. ‘‘నీతో నువ్వు తరచూ మాట్లాడుతూ ఉండు ఎప్పుడు ఆపేయాలో నీకే తెలుస్తుంది’’ అన్నారు. దాన్నే పాటిస్తున్నా. » జీవితంలో సాధించిన దాంతో సంతృప్తిగా ఉన్నా. కెరీర్ ఆరంభంతో పోల్చుకుంటే సుదీర్ఘ అనుభవం సాధించిన తర్వాత అన్నీ విషయాలను అనుకున్న విధంగా పూర్తి చేయడం కష్టం. వయసు పెరుగుతున్న భావన కలగడం సహజం. ఫిట్‌గా ఉండేందుకు మరింత కష్టపడాల్సి వస్తుంది. » అప్పుడప్పుడు అసంతృప్తి ఆవరిస్తుంది. నా వరకు ఈ ఏడాది ఆరంభంలో ఆ్రస్టేలియా పర్యటనలో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయా. దీంతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నా.. అయితే దాన్ని ఒత్తిడిగా భావించలేదు. అందులో నుంచి బయటపడేందుకు మార్గాలు అన్వేషించి వాటిపై కసరత్తు చేసి ఫలితాలు సాధించా. 2014లో ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అయితే అన్నింటిని అధిగమించాల్సిందే. మరో అవకాశం వచ్చినప్పుడు దాన్ని మరింపిచే ప్రదర్శన చేయాలి. 2018లో నేను అదే చేశా. » క్రికెటేతర విషయాల గురించి ఆలోచించి ఒత్తిడి పెంచుకోను. డ్రెస్సింగ్ రూమ్ బయటి వ్యాఖ్యలకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వను. ఒక్కసారి వాటిని పట్టించుకోవడం ప్రారంభిస్తే ఇక ఒత్తిడి కొండలా పెరుగుతుంది. -
KL Rahul: టాపార్డర్‌లో ఆడటమే ఇష్టం
న్యూఢిల్లీ: టాపార్డర్‌లో బ్యాటింగ్ చేయడమే సౌకర్యవంతంగా ఉంటుందని భారత సీనియర్ క్రికెటర్ కేఎల్ రాహుల్ అన్నాడు. టీమిండియా తరఫున ఇటీవలి కాలంలో మిడిలార్డర్లో బరిలోకి దిగుతున్న రాహుల్... చాంపియన్స్ ట్రోఫీలో వికెట్ కీపింగ్‌తో పాటు ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ఆకట్టుకున్నాడు. వన్డేల్లో నయా ఫినిషర్‌గా సేవలందిస్తున్న రాహుల్... చాంపియన్స్ ట్రోఫీలో 174 పరుగులు చేసి టీమిండియా మూడోసారి టైటిల్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. భారత జట్టు తరఫున ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే రాహుల్... చాంపియన్స్ ట్రోఫీలో అక్షర్ పటేల్ తర్వాత ఆరో ప్లేస్‌లో క్రీజులోకి అడుగుపెట్టి తన క్లాసిక్ గేమ్‌తో ఆకట్టుకున్నాడు. కాగా, మరో వారం రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం కానున్న నేపథ్యంలో రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పటి నుంచి టాపార్డర్‌లోనే ఆడుతున్నా. 11 ఏళ్ల వయసులో మంగళూరులో తొలి మ్యాచ్ నుంచి టీమిండియాకు ఎంపికయ్యే వరకు దాదాపు ‘టాప్’లోనే బ్యాటింగ్ చేశా. అదే నాకు సౌకర్యవంతంగా ఉంటుంది. క్రికెట్ జట్టు క్రీడ. టీమ్ అవసరాలకు తగ్గట్లు ఆడాల్సి ఉంటుంది. జట్టు ఏం కోరుకుంటుందో అది అందివ్వడం ఆటగాడిగా నా బాధ్యత. కెరీర్ ఆరంభం నుంచే అదే కొనసాగిస్తున్నా’ అని రాహుల్ అన్నాడు. పలు అంశాలపై రాహుల్ మనోగతం అతడి మాటల్లోనే... » ఐపీఎల్లో భాగంగా గతంలో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లకు సారథిగా వ్యవహరించాను. ఈసారి వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కొనుగోలు చేసింది. అయితే గతంలో కెప్టెన్‌గా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఈసారి కేవలం ఆటగాడిగానే కొనసాగాలని అనుకుంటున్నాను. » ఐపీఎల్ వేలం చాలా అంశాలతో ముడిపడి ఉంటుంది. గత మూడు సీజన్లలో సారథిగా జట్టును నడిపించా. అదే సమయంలో కోర్ టీమ్‌ను తయారు చేసుకోవడంపై కూడా దృష్టి పెట్టా. దీంతో ఎంతో ఒత్తిడి ఉండేది. వేలం అంటే ఆటగాడి కెరీర్‌కు సంబంధించింది. అదే సమయంలో ఫ్రాంచైజీలు వేరే విధంగా ఆలోచిస్తాయి. ఆటగాడి భవితవ్యం వేలంతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఒత్తిడి తప్పదు. » ఐపీఎల్ వేలం సమయంలో నేను కూడా ఒత్తిడికి గురయ్యాను. అయితే ఈసారి కేవలం ఆటగాడిగానే ఆడాలనుకుంటున్నాను. కెరీర్లో ఇదే సరైన నిర్ణయం అనుకుంటున్నా. చాలా ఉత్సుకతతో ఎదురుచూస్తున్నా. » ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో భాగం కావడం ఆనందంగా ఉంది. ఫ్రాంచైజీ సహ యజమాని పార్థ్ జిందాల్‌తో మంచి స్నేహం ఉంది. ఆట గురించే కాకుండా అనేక విషయాలపై మేము సుదీర్ఘంగా చర్చించుకుంటాం. క్రికెట్‌పై అమితాసక్తితో పాటు చక్కటి అవగాహన ఉంది. మంచి జట్టు అందుబాటులో ఉంది. కొత్త ఫ్రాంచైజీతో కలిసి ప్రయాణించేందుకు ఆసక్తిగా చూస్తున్నా. » కొత్త జట్టులో అడుగుపెట్టినప్పుడు ఎన్నో ఆలోచనలు చుట్టుముట్టడం సహజం. ప్రస్తుతం నా పరిస్థితి కూడా అలాగే ఉంది. అయితే అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, స్టార్క్ వంటి ఆటగాళ్లతో చక్కటి అనుబంధం ఉంది. వారితో కలిసి టీమ్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తా. జట్టులో అటు అనుభవజు్ఞలు, ఇటు యువ ఆటగాళ్లు మెండుగా ఉన్నారు. ఇలాంటి ప్రతిభావంతులతో కలిసి ఆడేందుకు ఉత్సుకతతో ఉన్నాను. » సవాళ్లను ఎదుర్కొనే సత్తా ఉంటేనే సుదీర్ఘకాలం అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగవచ్చు. కెరీర్లో ఎన్నో ప్రతిబంధకాలు ఎదురయ్యాయి. వాటన్నింటిని అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నా. వెనక్కి తిరిగి చూసుకుంటే వాటన్నింటికంటే ఈ ప్రయాణమే అద్భుతంగా అనిపిస్తోంది. ఇక భవిష్యత్తుపై దృష్టి పెట్టా. ఇప్పటి వరకు నేర్చుకున్న దానిని ప్రణాళికాబద్ధంగా అమలు పరచడంపై దృష్టి పెడతా. జట్టుకు వీలైనన్ని ఎక్కువ విజయాలు సాధించిపెట్టడమే నా లక్ష్యం. -
దటీజ్.. ద్రవిడ్
జైపూర్: నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనమైన భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్... మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ద్రవిడ్... చేతి కర్రల సాయంతో జట్టు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. ఇటీవల ఓ స్థానిక లీగ్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ద్రవిడ్ గాయపడ్డాడు. దీంతో కాలికి పట్టి, చేతి కర్రల సాయంతోనే మైదానానికి వచ్చిన ద్రవిడ్... ఆటగాళ్ల శిక్షణను పర్యవేక్షించాడు. దీనికి సంబంధించిన వీడియోను ఫ్రాంచైజీ తమ అధికారిక ఖాతాలో పోస్ట్ చేయగా... అది కాస్తా వైరల్‌గా మారింది. గోల్ఫ్ కార్ట్‌లో మైదానంలోకి వచ్చిన ద్రవిడ్... ప్లేయర్ల ఆటతీరును పరిశీలించాడు. ఒక్కో ఆటగాడి దగ్గరికి వెళ్లేందుకు చేతి కర్రల సాయం తీసుకున్న ద్రవిడ్... చాలాసేపు వారి ఆటతీరును పరిశీలించాడు. కాలికి మెడికల్ వాకింగ్ బూట్ ధరించిన ద్రవిడ్... యువ ఆటగాళ్లు రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్‌తో సుదీర్ఘంగా చర్చిస్తూ కనిపించాడు. 2022 నుంచి 2024 వరకు భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన రాహుల్ ద్రవిడ్... గతేడాది టీమిండియా టి20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో తిరిగి రాజస్తాన్ జట్టుకు హెడ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర రాజస్తాన్ రాయల్స్ డైరెక్టర్‌గా కొనసాగుతుండగా... సంజూ సామ్సన్ జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. 💗➡️🏡 pic.twitter.com/kdmckJn4bz— Rajasthan Royals (@rajasthanroyals) March 13, 2025 -
Dhoni- Rohit: స్వర్ణయుగం.. ఇద్దరూ ఇద్దరే! నాకు మాత్రం అదే ముఖ్యం!
భారత్ క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni)కి ప్రత్యేక స్థానం ఉంది. సుదీర్ఘ కాలం తర్వాత అతడి నాయకత్వంలోనే టీమిండియాకు మళ్ళీ ప్రపంచ కప్ విజయం లభించింది. 1983లో కపిల్ దేవ్(Kapil Dev) నేతృత్వంలోని తొలిసారి వన్డే ప్రపంచ కప్ సాధించిన భారత్.. 2007 తర్వాత ధోని నాయకత్వంలో వరుసగా మూడు ఐసీసీ టైటిల్స్ సాధించింది. అయితే, సారథిగా ధోని నిష్క్రమణ తర్వాత భారత్ విజయ పరపంపరకి రోడ్‌బ్లాక్ పడింది. పదకొండు సంవత్సరాలు ట్రోఫీ లేకుండా మిగిలిపోయింది. ఇలాంటి కఠిన దశలో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ(Rohit Sharma) 2024, 2025లో వరుసగా వరుసగా రెండు ఐసీసీ ట్రోఫీ లను గెలిపించి భారత్‌కి కొత్త హీరో గా ఖ్యాతి వహించాడు.భారత క్రికెట్‌కు స్వర్ణయుగంవైట్-బాల్ క్రికెట్లో భారతదేశం తిరిగి తమ స్వర్ణ యుగానికి చేరుకుందా అంటే అవుననే చెప్పాలి. 2010ల ప్రారంభంలో ధోని చూపించిన నాయకత్వ లక్షణాలు ఇప్పుడు రోహిత్ శర్మ లో కూడా కనిపిస్తున్నాయి. వీరిద్దరూ సాధించిన ఐసీసీ ట్రోఫీలను పరిశీలిస్తే ఇది కరక్టే అనిపిస్తుంది. ఎంఎస్ ధోని సహజంగా ఎక్కువగా మాట్లాడాడు. సరిగ్గా అవసరమైనప్పుడు తన నిర్ణయాలు, వ్యక్తిగత సామర్ధ్యం ఏమిటో చూపిస్తాడు. తన స్థాయి ఏమిటో తెలియజేస్తాడు.ఇప్పుడు రోహిత్ శర్మ సరిగ్గా అదే చేసి చూపించాడు. ఇక ట్రోఫీల పరంగా చూస్తే ధోని 2007లో టీ20 ప్రపంచ కప్, 2011లో వన్డే ప్రపంచ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలను భారలత్కి అందించాడు.ఇప్పుడు రోహిత్ శర్మ నాయకత్వం లో భారత్ 2023లో వన్డే ప్రపంచ కప్ రన్నరప్‌గా నిలిచింది. 2024లో టీ20 ప్రపంచ కప్ గెలిచింది. మళ్ళీ ఈ సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపొందింది.అప్పటి భారత జట్టు వెనుకబాటుకి కారణం?2014- 2022 మధ్య భారత్ జట్టు వెనుకడిందని చెప్పవచ్చు. నిజానికి టీమిండియాకు అపారమైన ప్రతిభ గల ఆటగాళ్లు ఉన్నా సరళంగా చెప్పాలంటే, వారు తమ బృందానికి న్యాయం చేయడంలో విఫలమయ్యారు. ఈ కాలంలో భారత్ జట్టు ఐసీసీ ప్రధాన టోర్నమెంట్లలో నిలకడ గా ఆడి నాకౌట్ దశలకు చేరుకున్నప్పటికీ, ట్రోఫీ లను అందుకోవడంలో విఫలమైంది. ఫైనల్ కి చేరుకున్న జట్లని ఎవ్వరూ గుర్తుపెట్టుకోరు.ట్రోఫీ గెలిస్తేనే ఆ జట్టు చరిత్రలో విజయం సాధించిన జట్టుగా కీర్తిని గడిస్తుంది. ధోని నాయకత్వంలో భారత్ జట్టు 2007 టీ20 ప్రపంచ కప్ విజయం ఊహించనిది. 2011లో భారత్ భారీ అంచనాల రీతి తగ్గట్టుగా ఆడి సొంత గడ్డ పై ప్రపంచ కప్‌ను సాధించింది. ఈ టోర్నమెంట్లో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్ , హర్భజన్ సింగ్ వంటి ఆటగాళ్లు భారత్ జట్టు విజయంలో కీలక భూమిక వహించారు.ఇక 2013 నాటికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సురేశ్ రైనా, ఇషాంత్ శర్మలతో కూడిన కొత్త తరం ఆటగాళ్లు భారత జట్టులోకి చేరారు. ఇంగ్లండ్‌లో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నప్పుడు ధోని వ్యూహాత్మక ప్రతిభ స్పష్టంగా కనిపించింది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలతో పాటు కొత్త ఫాస్ట్ బౌలర్ల ఆవిర్భావంతో అప్పుడు జట్టును బలోపేతం చేశారు.కాగా 2017లో విరాట్ కోహ్లీ వైట్-బాల్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు, అతడి టెస్ట్ విజయం పరిమిత ఓవర్ల ఆధిపత్యంగా మారలేదు. రెడ్-బాల్ క్రికెట్ పట్ల కోహ్లీకి స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ వైట్-బాల్ టోర్నమెంట్లలో కోహ్లీ అదే విజయ పరంపరను కొనసాగించలేకపోయాడు.రోహిత్ నాయకత్వంలో పునరుజ్జీవనంఇప్పుడు రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ మళ్ళీ మునుపటి విజయ పరంపరను కొనసాగించే స్థాయికి ఎదిగింది. 2007 పరాజయం తర్వాత ధోని భారత్ జట్టు ని ఎలా పునర్నిమించాడో ఇప్పుడు రోహిత్ తనదైన శైలి లో అదే చేసి చూపించాడు. జట్టు లో ఉత్తేజాన్ని పెంచాడు. ఎక్కడా తలవొగ్గ కుండా దూకుడుగా ఆడటాన్ని అలవాటు చేసాడు.2019 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్, 2021 టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన అవమానం, 2022లో ఇంగ్లండ్ చేతిలో జరిగిన సెమీ-ఫైనల్ ఓటమి వంటి హృదయ విదారక సంఘటనలు రోహిత్ మనస్తత్వంలో మార్పును రేకెత్తించాయి. భారత్ జట్టులో తీసుకురావాల్సిన మార్పును సరిగ్గా గుర్తించాడు.నాకు అదే ముఖ్యం2019 ప్రపంచ కప్ లో రోహిత్ ఐదు సెంచరీలు సాధించినప్పటికీ చివరికి ట్రోఫీ గెలువలేకపోవడం బాగా అసంతృప్తిని మిగిల్చింది. రోహిత్ వ్యక్తిగతంగా రాణించినప్పటికీ అది జట్టు విజయానికి దోహదం చేయలేదన్న బాధ అతన్ని కలిచివేసింది. “నేను 2019 ప్రపంచ కప్‌లో వ్యక్తిగతంగా బాగా రాణించాను. కానీ మేము ట్రోఫీ గెలవలేకపోయాం.ఆ సెంచరీల పరంపర, పరుగుల వరద నాకు సంతృప్తి ఇవ్వలేకపోయింది. వ్యక్తిగతంగా 30 లేదా 40 పరుగులు చేసినప్పటికీ ట్రోఫీ గెలిస్తే లభించే ఆనందం వేరే స్థాయిలో ఉంటుంది. అలా చేయడం నాకు చాలా ముఖ్యమని నేను భావిస్తున్నాను" అని రోహిత్ ఆదివారం ఛాంపియన్స్ ట్రోఫీ విజయం అనంతరం వ్యాఖ్యానించడం అతని లోని పరిణతికి అద్దం పడుతుంది.విజయం అనేది ఒక వ్యసనం లాంటిది. భారత్ ఐసీసీ వైట్-బాల్ మ్యాచ్‌లలో ఇంతవరకు వరుసగా 24 మ్యాచ్‌లలో 23 గెలించిందంటే మామూలు విషయం కాదు. వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లను కైవసం చేసుకున్న రోహిత్ శర్మ ఇప్పుడు చారిత్రాత్మక ట్రిపుల్‌పై దృష్టి పెట్టాడు. అంటే 2027 వన్డే ప్రపంచ కప్‌లో టీమిండియాను విజయపథాన నడిపించాలని భావిస్తున్నాడు. అదే జరిగితే రోహిత్ శర్మ ఎంఎస్ ధోని నాయకత్వ రికార్డుని సమం చేసినట్టే!ఇక ఓవరాల్‌గా కెప్టెన్లుగా ధోని- రోహిత్ రికార్డులు చూస్తే ఇద్దరూ చెరో ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచారు. ధోని చెన్నై సూపర్ కింగ్స్ తరఫున.. రోహిత్ ముంబై ఇండియన్స్ తరఫున ఈ ఫీట్ నమోదు చేశారు. ఆసియాకప్ టోర్నమెంట్లోనూ రెండుసార్లు టీమిండియాను విజయపథంలో నిలిపారు. ధోని 2010, 2016.. రోహిత్ 2018, 2023లో టైటిల్స్ గెలిచారు. ఇక చాంపియన్స్ లీగ్ ట్రోఫీలో ధోని రెండుసార్లు (2010, 2014).. రోహిత్ ఒకసారి(2013) టైటిల్ సాధించారు.చదవండి: తప్పులు సరిదిద్దుకుని.. ‘టాప్’ రన్ స్కోరర్‌గా.. మాటలకు అందని అనుభూతి! -
ఐపీఎల్లో పొగాకు, మద్యం ఉత్పత్తుల ప్రకటనలపై నిషేధం?
ప్రజారోగ్యాన్ని పెంపొందించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మ్యాచ్‌లు, సంబంధిత కార్యక్రమాలు, జాతీయ టెలివిజన్ ప్రసారాల సమయంలో అన్ని రకాల పొగాకు, ఆల్కహాల్ ప్రకటనలను నిషేధించాలని కోరింది. ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించడంలో, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) వ్యాప్తిని నియంత్రించడంలో క్రీడల పాత్ర కీలకమని ఎత్తిచూపుతూ ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్, బీసీసీఐకి లేఖ రాసింది.దేశంలో ఏటా సంభవించే మరణాల్లో 70 శాతం ఎన్సీడీల వల్ల జరుగుతున్నవేనని ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖలో హైలైట్ చేసింది. పొగాకు, మద్యపానం హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు, మధుమేహంతో సహా అనేక ఇతర రోగాలకు దోహదం చేసే ప్రధాన ప్రమాద కారకాలుగా ఉన్నాయని తెలిపింది. పొగాకు సంబంధిత మరణాల్లో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి దాదాపు 14 లక్షల మరణాలతో రెండో స్థానంలో ఉందని గణాంకాలను తెలియజేసింది.ఇదీ చదవండి: స్వల్పంగా పెరిగిన బంగారం ధర! తులం ఎంతంటే..క్రికెట్‌కు భారత్‌లో ఆదరణ పెరుగుతోందని తెలియజేస్తూ, క్రీడలు ప్రజల ఆరోగ్య సంరక్షణ బాధ్యతను నిర్వర్తించాలని చెప్పింది. పొగాకు లేదా ఆల్కహాల్ బ్రాండ్లను ప్రోత్సహించే ప్రకటనలను నిరోధించడానికి కఠినమైన నిబంధనలు అనుసరించాలని ఐపీఎల్, బీసీసీఐను మంత్రిత్వ శాఖ కోరింది. అంతేకాకుండా క్రీడాకారులు, కామెంటేటర్లు, ఇతర భాగస్వాములు పొగాకు, ఆల్కహాల్‌తో ముడిపడి ఉన్న ఉత్పత్తులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రోత్సహించకుండా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఐపీఎల్‌కు ఉన్న అపారమైన ప్రజాదరణ, రోల్ మోడల్స్‌గా క్రికెటర్ల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్య కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని తెలిపింది. మార్చి 22 నుంచి ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభంకానుంది. -
ఆర్సీబీకి ఆడాలని ఆరాటపడుతున్న పాక్ ఫాస్ట్ బౌలర్
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అమీర్ ఐపీఎల్ ఆడాలని తెగ ఆరాటపడిపోతున్నాడు. ప్రత్యేకించి ఐపీఎల్లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాలని కలలు కంటున్నాడు. భారత్‌తో దౌత్యపరమైన సంబంధాలు సరిగ్గా లేని కారణంగా పాక్ ఆటగాళ్లకు ఐపీఎల్లో ఎంట్రీ లేని విషయం తెలిసిందే. అయితే అమీర్ బ్రిటన్ పౌరసత్వం పొంది తన ఐపీఎల్ కల నెరవేర్చుకోవాలని ఆశిస్తున్నాడు. అమీర్‌కు 2026 నాటికి యూకే పాస్ట్‌పోర్ట్ వస్తుంది. అప్పుడు ఐపీఎల్ వేలంలో తన పేరును రిజిస్టర్ చేసుకోవాలని అనుకుంటున్నాడు.విరాట్ అంటే అమితమైన అభిమానంఎడమ చేతి వాటం ఫాస్ట్ బౌలర్ అయిన అమీర్‌కు విరాట్ కోహ్లి అంటే అమితమైన అభిమానం. ఈ విషయాన్ని అమీర్ చాలా సందర్భాల్లో చెప్పాడు. 2016 టీ20 ప్రపంచకప్‌కు ముందు కోహ్లి తనకు బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చిన విషయాన్ని అమీర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ఇదే సందర్భంగా అమీర్ కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లి ప్రతిభను ఆరాధించే వ్యక్తి అని కొనియాడాడు. కోహ్లి తనకు బ్యాట్ ఇచ్చినప్పుడు ఉప్పొంగిపోయానని చెప్పుకొచ్చాడు. తాను కోహ్లి బ్యాటింగ్‌ను ఆరాధిస్తానని.. కోహ్లి తన బౌలింగ్‌ను గౌరవిస్తాడని తెలిపాడు. కోహ్లి ఇచ్చిన బ్యాట్‌తో చాలా మంచి ఇన్నింగ్స్‌లు ఆడానని గుర్తు చేసుకున్నాడు. అమీర్ ఆర్సీబీలో చేరితే ఆ జట్టు టైటిల్ కల నెరవేరుతుందని మరో పాకిస్తాన్ ఆటగాడు అహ్మద్ షెహజాద్ అభిప్రాయపడ్డాడు. ఆర్సీబీ బౌలింగ్ సమస్యలు పరిష్కరించడానికి అమీర్ లాంటి బౌలర్ అవసరమని షెహజాద్ అన్నాడు. ఆర్సీబీ బ్యాటింగ్ ఎల్లప్పుడూ బలంగా ఉంది. వారికి బౌలింగే పెద్ద సమస్య. అమీర్ వారితో చేరితే వారు టైటిల్ గెలుస్తారని షెహజాద్ జోస్యం చెప్పాడు.కాగా, 32 ఏళ్ల అమీర్ 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తిరిగి 2024లో (టీ20 ప్రపంచకప్ కోసం) రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. అయితే 2024 ప్రపంచకప్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అమీర్‌ను ఎంపిక చేయలేదు. ప్రస్తుతం అమీర్ ప్రపంచవ్యాప్తంగా వివిథ లీగ్‌ల్లో (ఐపీఎల్ మినహా) ఆడుతున్నాడు.ఇదిలా ఉంటే, ఆర్సీబీ ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్‌తో తలపడనుంది. మార్చి 22న జరిగే ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగనుంది. ఈ ఏడాది ఆర్సీబీ నూతన కెప్టెన్‌గా మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్ ఎంపికయ్యాడు. గత రెండు సీజన్లలో సారథ్యం వహించిన డుప్లెసిస్‌ను ఆర్సీబీ మెగా వేలానికి ముందు వదులుకుంది.ఈ ఏడాది ఆర్సీబీ జట్టు..రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దేవ్‌దత్ పడిక్కల్, టిమ్ డేవిడ్,స్వస్థిక్ చికార, కృనాల్ పాండ్యా, లియామ్ లివింగ్‌స్టోన్, మనోజ్ భాండగే, జేకబ్ బేతెల్, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, మోహిత్ రతీ, ఫిలిప్ సాల్ట్, జితేశ్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, రసిక్ దార్ సలామ్, సుయాశ్ శర్మ, యశ్ దయాల్, నువాన్ తుషార, అభినందన్ సింగ్ఐపీఎల్ 2025లో ఆర్సీబీ షెడ్యూల్మార్చి 22- కేకేఆర్తోమార్చి 28- సీఎస్కేఏప్రిల్ 2- గుజరాత్ఏప్రిల్ 7- ముంబైఏప్రిల్ 10- ఢిల్లీఏప్రిల్ 13- రాజస్థాన్ఏప్రిల్ 18- పంజాబ్ఏప్రిల్ 20- పంజాబ్ఏప్రిల్ 24- రాజస్థాన్ఏప్రిల్ 27- ఢిల్లీమే 3- సీఎస్కేమే 9- లక్నోమే 13- సన్రైజర్స్మే 17- కేకేఆర్ -
IPL 2025: సన్‌రైజర్స్ తొలి రెండు మ్యాచ్‌ల టికెట్లు అమ్మకం
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సొంతగడ్డపై ఆడే తొలి రెండు మ్యాచ్‌లకు సంబంధించి టికెట్లను ఈరోజు ఆన్లైన్లో విక్రయించనున్నారు. ఈనెల 23న ఉప్పల్ స్టేడియంలో జరిగే తమ తొలి లీగ్ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ జట్టుతో సన్‌రైజర్స్ ఆడనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం గం. 3:30 నుంచి జరుగుతుంది. అనంతరం ఈనెల 27న ఉప్పల్ స్టేడియంలోనే జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో సన్‌రైజర్స్ తలపడుతుంది. ఈ మ్యాచ్‌ను రాత్రి గం. 7:30 నుంచి నిర్వహిస్తారు. ఈ రెండు లీగ్ మ్యాచ్‌లకు సంబంధించి టికెట్లను ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ మ్యాచ్‌ల అధికారిక టికెటింగ్ పార్ట్నర్ districtappలో district.in వెబ్సైట్లో ఈ టికెట్లను ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు. -
డ్రెస్సింగ్ రూమ్‌లో ఫ్యామిలీకి ‘నో ఎంట్రీ’
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందర్భంగా పాటించాల్సిన నిబంధనల అంశంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కఠినంగా వ్యవహరించాలని భావిస్తోంది. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు టెస్టు సిరీస్ ‘వైట్‌వాష్’ కావడంతో పాటు... ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించలేకపోవడంతో నిబంధనలను పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించే సమయంలో కూడా భారత ఆటగాళ్లు టీమ్ బస్సుల్లోనే ప్రయాణించాలని వెల్లడించింది. » ఆటగాళ్లు తప్పకుండా జట్టు సభ్యులతో కలిసి ‘టీమ్ బస్’లోనే ప్రయాణించేలా చూడాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు ఫ్రాంచైజీ యాజమాన్యాలకు సూచించింది. » ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కుటుంబ సభ్యులను డ్రెస్సింగ్ రూమ్‌లోకి అనుమతించకూడదని బీసీసీఐ నిర్ణయించింది. ప్రాక్టీస్ రోజుల్లోనూ దీన్ని కొనసాగించాలని సూచించింది. అనుమతించిన సిబ్బంది మినహా డ్రెస్సింగ్ రూమ్‌లోకి మరెవరికీ ప్రవేశం కల్పించకూడదని ప్రకటించింది. » ప్లేయర్ల స్నేహితులు, సన్నిహితులు ఇతర వాహనాల్లో ప్రయాణిస్తూ... హాస్పిటాలిటీ ప్రాంతం నుంచి మ్యాచ్ ప్రాక్టీస్ చూడొచ్చు. నెట్ బౌలర్లు, త్రోడౌన్ స్పెషలిస్ట్‌లు కూడా బీసీసీఐ నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. » ఐపీఎల్ సందర్భంగా ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని పేర్కొన్న బీసీసీఐ... ‘ఆరెంజ్ క్యాప్’, ‘పర్పుల్ క్యాప్’ సాధించిన ఆటగాళ్లు మ్యాచ్ ఆరంభంలో కనీసం రెండు ఓవర్ల పాటైనా వాటిని ధరించాలని సూచించింది. మ్యాచ్ అనంతరం బహుమతి ప్రదానోత్సవంలో ప్లేయర్లు స్లీవ్‌లెస్ జెర్సీలను ధరించకూడదని బీసీసీఐ వెల్లడించింది. » మార్చి 22 నుంచి కోల్‌కతాలో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుండగా... దానికి ముందు ఈ నెల 20న ముంబై వేదికగా కెపె్టన్ల సమావేశం జరగనుంది. సాధారణంగా తొలి మ్యాచ్ జరిగే వేదికలోనే ఈ భేటీ జరుగుతుంది. కానీ ఈసారి అందుకు భిన్నంగా ముంబైలో నిర్వహించనున్నారు. -
ఐపీఎల్లో కొత్త రూల్స్
ఐపీఎల్-2025 (IPL 2025) ప్రారంభానికి ముందు బీసీసీఐ (BCCI) కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. ఆటగాళ్ల కుటుంబ సభ్యులకు సంబంధించి నిబంధనలను కఠినతరం చేసింది. ఆటగాళ్లు జట్టు బస్సులో ప్రయాణించడం తప్పనిసరి చేసింది. గతంలో మాదిరి ఇష్టం వచ్చినన్ని సార్లు ప్రాక్టీస్ సెషన్స్‌ను నిర్వహించుకునే వెసులుబాటును నిషేధించింది. ప్రాక్టీస్ సెషన్లకు సంబంధించి పరిమితులు విధించింది.కొత్త రూల్స్ ప్రకారం ఒక్కో జట్టు ఏడు ప్రాక్టీస్ సెషన్స్ మాత్రమే నిర్వహించుకోవాలని తెలిపింది. మ్యాచ్‌లకు ముందు అలాగే మ్యాచ్‌లు జరిగే సమయంలో PMOA ప్రాంతాల్లో (ఆటగాళ్లు మరియు మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా) ఆటగాళ్ల కుటుంబ సభ్యులు ఉండటాన్ని నిషేధించింది. ప్రాక్టీస్ రోజులలో డ్రెస్సింగ్ రూమ్‌లోకి మరియు మైదానంలోకి కేవలం గుర్తింపు పొందిన సిబ్బందికి మాత్రమే అనుమతి ఉంటుంది.ఆటగాళ్ల కుటుంబ సభ్యులకు ఆతిథ్య ప్రాంతం నుండి జట్టు ప్రాక్టీస్‌ను వీక్షించే వెసులుబాటును కల్పించింది. మ్యాచ్ రోజులలో ఆటగాళ్లకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించలేమని తెలిపింది. ఆటగాళ్ళు కనీసం రెండు ఓవర్ల పాటు ఆరెంజ్ మరియు పర్పుల్ క్యాప్‌లను ధరించాలని పేర్కొంది. ప్రెజెంటేషన్ సెర్మనీలో ఆటగాళ్ళు స్లీవ్‌లెస్ జెర్సీలు ధరించడాన్ని నిషేధించింది.ఈ ఏడాది ఐపీఎల్ ద్వారా అమల్లోకి రానున్న మార్పులు..1. ప్రాక్టీస్ ఏరియాలో 2 నెట్లు మరియు రేంజ్ హిట్టింగ్ చేయడానికి ప్రధాన స్క్వేర్‌లో ఓ సైడ్ వికెట్ లభిస్తాయి. ముంబై లాంటి వేదికల్లో రెండు జట్లు ఒకే సమయంలో ప్రాక్టీస్ చేస్తుంటే, ఒక్కో జట్టుకు రెండు వికెట్లు లభిస్తాయి.2. ఓపెన్ నెట్లు అనుమతించబడవు.3. రెండు జట్లలో ఓ జట్టు ప్రాక్టీస్‌ను ముందుగానే ముగిస్తే, రెండో జట్టు ప్రాక్టీస్ కోసం ఆ వికెట్లను ఉపయోగించకూడదు.4. మ్యాచ్ రోజులలో ఎటువంటి ప్రాక్టీస్‌కు అనుమతించబడదు.5. ప్రధాన స్క్వేర్‌లో మ్యాచ్ రోజున ఫిట్నెస్ పరీక్ష జరగదు.6. ప్రాక్టీస్ రోజులలో డ్రెస్సింగ్ రూమ్ మరియు మైదానంలోకి గుర్తింపు పొందిన సిబ్బందిని మాత్రమే అనుమతిస్తారు.7. ఆటగాళ్ళు ప్రాక్టీస్ కోసం వచ్చే సమయంలో జట్టు బస్సును మాత్రమే ఉపయోగించాలి.8. ఆటగాళ్ళు మరియు సహాయక సిబ్బంది LED బోర్డుల ముందు కూర్చోకూడదు.9. మ్యాచ్ సమయంలో ఆటగాళ్ళు కనీసం రెండు ఓవర్ల పాటు ఆరెంజ్ మరియు పర్పుల్ క్యాప్ ధరించాలి.10. ప్రెజెంటేషన్ సెర్మనీలో స్లీవ్‌లెస్ జెర్సీలు అనుమతించబడవు.11. గత సీజన్ల తరహాలోనే మ్యాచ్ రోజులలో జట్టు వైద్యుడుతో సహా 12 మంది గుర్తింపు పొందిన సహాయక సిబ్బందిని మాత్రమే అనుమతిస్తారు. -
ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్‌గా పీటర్సన్
న్యూఢిల్లీ: ఐపీఎల్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ సహాయక సిబ్బందిలో మరో కొత్త వ్యక్తి చేరాడు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్‌ను క్యాపిటల్స్ మెంటార్‌గా నియమిస్తున్నట్లు ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రకటించింది. 2009–2016 మధ్య పీటర్సన్ ఐపీఎల్ 36 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో మూడు సీజన్ల పాటు ఢిల్లీ (క్యాపిటల్స్) తరఫునే ఆడిన అతను బెంగళూరు, పుణే జట్లకూ ప్రాతినిధ్యం వహించాడు. 17 మ్యాచ్‌లలో ఢిల్లీకి కెప్టెన్‌గా వ్యవహరించిన పీటర్సన్ 11 ఏళ్ల తర్వాత అదే జట్టుకు ఇప్పుడు మెంటార్ బాధ్యతలు చేపడుతున్నాడు. ఓవరాల్‌గా టి20 కెరీర్లో పీటర్సన్ 200 మ్యాచ్‌లు ఆడి 5,695 పరుగులు సాధించాడు. ఆటగాడిగా ఐపీఎల్ కెరీర్ ముగించిన తర్వాత కూడా ఢిల్లీ టీమ్ యాజమాన్యంతో పీటర్సన్ మంచి సంబంధాలు కొనసాగించాడు. ఇంగ్లండ్‌లోని ప్రతిష్టాత్మక కౌంటీ టీమ్‌ను జీఎంఆర్ యాజమాన్యం కొనుగోలు చేయడంలో మధ్యవర్తిగా పీటర్సన్ కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఇప్పుడు ఐపీఎల్లో మళ్లీ మరో హోదాలో అడుగు పెడుతున్నాడు. -
ధోనీ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. రిటైర్ మెంట్ ఫిక్స్?
-
ఐపీఎల్ సమయంలోనూ ‘ఎర్రబంతి’తో...
ముంబై: భారత క్రికెట్ జట్టు చక్కటి ప్రదర్శనతో ఇప్పటికే చాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ చేరింది. తమ స్థాయికి తగినట్లుగా ఆడితే టైటిల్ కూడా సాధించే అవకాశం ఉంది. ఈ టోర్నీ ముగిసిన వెంటనే ఆటగాళ్లంతా ఐపీఎల్ హడావిడిలో పడిపోతారు. తమ ఫ్రాంచైజీల తరఫున సత్తా చాటేందుకు సిద్ధమైపోతారు. అయితే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాత్రం టీమిండియా ఇటీవలి టెస్టు ప్రదర్శనను పూర్తిగా మర్చిపోలేదు. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో అనూహ్యంగా 0–3తో చిత్తయిన భారత్ ఆ తర్వాత ఆ్రస్టేలియాలో 1–3తో సిరీస్ కోల్పోయింది. ఇప్పుడు ఐపీఎల్ ముగిసిన వెంటనే టీమిండియా జూన్–జులైలో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడేందుకు ఇంగ్లండ్ వెళ్లనుంది. ఈ కీలక సిరీస్‌కు ముందు అంతా ఐపీఎల్‌లోనే ఉంటారు కాబట్టి టెస్టుల సన్నద్ధతకు తగిన సమయమే లభించదు. గతంలో ఐపీఎల్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్ వెళ్లిన సందర్భాల్లో (2011, 2014, 2018లలో) భారత్ చిత్తుగా ఓడి సిరీస్‌లు కోల్పోయింది. 2021 సిరీస్‌లో ముందంజలో నిలిచినా... కోవిడ్ కారణంగా కొద్ది రోజుల తర్వాత జరిగిన టెస్టుల ఓడి సిరీస్‌ను 2–2తో సమంగా ముగించింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ సమయంలోనూ భారత క్రికెటర్లు టెస్టులకు సిద్ధమయ్యేలా చూసే ప్రణాళికను బీసీసీఐ రూపొందిస్తోంది. పూర్తిగా టి20కే అంకితం కాకుండా టెస్టుల కోసం ఎర్రబంతితో సాధన చేసేలా చేయడమే దీని ఉద్దేశం. ఈ ప్రతిపాదన ప్రకారం టెస్టు జట్టులో సభ్యులైన భారత ఆటగాళ్లు రెండు నెలల పాటు పూర్తిగా ఐపీఎల్‌కే అంకితమైపోరు. ఒకవైపు ఐపీఎల్ ఆడుతూనే మరోవైపు రాబోయే టెస్టుల కోసం ప్రాక్టీస్ కొనసాగించాల్సి ఉంటుంది. దీని కోసం ప్రత్యేకంగా సెషన్లు ఉంటాయి. ఆటగాళ్లంతా ఇందులో పాల్గొనేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ముగిశాక దుబాయ్‌లో దీనికి సంబంధించి ఇప్పటికే బోర్డు అధికారులు చర్చించారు. చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత జరిగే మరో సమావేశంలో ఈ అంశంపై పూర్తి స్పష్టత వస్తుంది. మొత్తంగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను బోర్డు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ముందుగానే సన్నాహాలు మొదలు పెడుతోంది. -
ముంబై ఇండియన్స్ ఫ్యామిలీలో మరో జట్టుతో జతకట్టిన రషీద్ ఖాన్
ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్‌కు (Rashid Khan) ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఫ్యామిలీతో బంధం మరింత బలపడింది. ఇప్పటికే మూడు లీగ్‌ల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీల్లో సభ్యుడిగా ఉన్న రషీద్.. తాజాగా మరో ఎంఐ ఫ్రాంచైజీతో జతకట్టాడు. రషీద్‌ను ద హండ్రెడ్ లీగ్‌లో ఎంఐ యాజమాన్యంలో నడుస్తున్న ఓవల్ ఇన్విన్సిబుల్స్ (డిఫెండింగ్ ఛాంపియన్) సొంతం చేసుకుంది. ఓవల్ ఇన్విన్సిబుల్స్లో ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఇటీవలే పెట్టుబడులు పెట్టింది. ఇందులో 49 శాతం వాటాను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) కొనుగోలు చేసింది.ప్రస్తుతం రషీద్ ఒక్క ఐపీఎల్ మినహా మిగతా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీల్లో (ఫారిన్ లీగ్‌ల్లో) సభ్యుడిగా ఉన్నాడు. రషీద్ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతున్నాడు. రషీద్ సౌతాఫ్రికా టీ20 లీగ్ ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌కు.. ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్‌కు.. మేజర్ లీగ్ క్రికెట్లో ముంబై ఇండియన్స్ న్యూయార్క్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ద హండ్రెడ్ లీగ్ ప్రారంభం నుంచి (2021) ట్రెంట్ రాకెట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రషీద్‌ను ఓవల్ ఇన్విన్సిబుల్స్ డైరెక్ట్ ఓవర్సీస్ సైనింగ్ ద్వారా దక్కించుకుంది.కాగా, ద హండ్రెడ్ లీగ్-2025 సీజన్ కోసం ప్లేయర్ల రిటెన్షన్ జాబితాలను ఎనిమిది ఫ్రాంచైజీలు ఇవాళ ప్రకటించాయి. గత సీజన్లో తమతో ఉన్న 10 మంది సభ్యులను ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకోవచ్చు. రిటెన్షన్ జాబితాలో ఒక ఇంగ్లండ్ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్ తప్పక ఉండాలి. అలాగే ముగ్గురు ఓవర్సీస్ ప్లేయర్లు ఉండవచ్చు. అదనంగా ఓ విదేశీ ఆటగాడిని డైరెక్ట్ సైనింగ్ చేసుకోవచ్చు. ఈ పద్దతిలోనే ఇన్విన్సిబుల్స్ రషీద్ ఖాన్‌ను దక్కించుకుంది. ఫ్రాంచైజీల్లో మిగిలిన స్థానాల భర్తీ డ్రాఫ్ట్ ద్వారా జరుగుతుంది. డ్రాఫ్ట్ తేదీ ప్రకటించాల్సి ఉంది.ద హండ్రెడ్ లీగ్‌లో ఇటీవలే ఐపీఎల్ ఫ్రాంచైజీలు పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. ఓవల్ ఇన్విన్సిబుల్స్లో ముంబై ఇండియన్స్.. నార్తర్న్ సూపర్చార్జర్స్లో సన్‌రైజర్స్ హైదరాబాద్.. మాంచెస్టర్ ఒరిజినల్స్‌లో లక్నో సూపర్ జెయింట్స్.. సథరన్ బ్రేవ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ షేర్ దక్కించుకున్నాయి. వీటిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ నార్తర్న్ సూపర్‌చార్జర్స్ ఫ్రాంచైజీ మొత్తాన్ని కొనుగోలు చేసింది. మిగతా ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆయా ప్రాంచైజీల్లో 49 శాతం వాటాను దక్కించుకున్నాయి.రిటెన్షన్స్ జాబితా..బర్మింగ్హమ్ ఫీనిక్స్- బెన్ డకెట్, ట్రెంట్ బౌల్ట్ (ఓవర్సీస్), లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్, ఆడమ్ మిల్నే (ఓవర్సీస్), బెన్నీ హోవెల్, టిమ్ సౌథీ (ఓవర్సీస్), డాన్ మౌస్లీ, విల్ స్మీడ్, క్రిస్ వుడ్, ఆనురిన్ డొనాల్డ్లండన్ స్పిరిట్- లియామ్ డాసన్, డాన్ వారోల్, కేన్ విలియమ్సన్ (ఓవర్సీస్), రిచర్డ్ గ్లీసన్, ఓలీ స్టోన్, ఓలీ పోప్, కీటన్ జెన్నింగ్స్మాంచెస్టర్ ఒరిజినల్స్- జోస్ బట్లర్, ఫిలిప్ సాల్ట్, హెన్రిచ్ క్లాసెన్ (ఓవర్సీస్), మ్యాటీ హర్స్ట్, జోష్ టంగ్, స్కాట్ కర్రీ, టామ్ హార్ట్లీ, సోనీ బేకర్, టామ్ ఆస్పిన్వాల్నార్త్రన్ సూపర్ ఛార్జర్స్- హ్యారీ బ్రూక్, డేవిడ్ మిల్లర్ (ఓవర్సీస్), ఆదిల్ రషీద్, మిచెల్ సాంట్నర్ (ఓవర్సీస్), బ్రైడన్ కార్స్, బెన్ డ్వార్షుయిస్ (ఓవర్సీస్), మాట్ పాట్స్, పాట్ బ్రౌన్, గ్రహం క్లార్క్, టామ్ లాస్ఓవల్ ఇన్విన్సిబుల్స్- సామ్ కర్రన్, విల్ జాక్స్, రషీద్ ఖాన్ (ఓవర్సీస్), జోర్డన్ కాక్స్, సామ్ బిల్లింగ్స్, సాకిబ్ మహమూద్, గస్ అట్కిన్సన్, డొనొవన్ ఫెరియెరా (ఓవర్సీస్), నాథన్ సౌటర్, ట్వాండా ముయేయేసథరన్ బ్రేవ్- జోఫ్రా ఆర్చర్, జేమ్స్ విన్స్, క్రిస్ జోర్డన్, టైమాల్ మిల్స్, డుప్లెసిస్ (ఓవర్సీస్), లూయిస్ డు ప్లూయ్, లారీ ఈవాన్స్, క్రెయిగ్ ఓవర్టన్, ఫిన్ అలెన్ (ఓవర్సీస్), డ్యానీ బ్రిగ్స్, జేమ్స్ కోల్స్ట్రెంట్ రాకెట్స్- జో రూట్, మార్కస్ స్టోయినిస్ (ఓవర్సీస్), టామ్ బాంటన్, సామ్ కుక్, జాన్ టర్నర్, సామ్ హెయిన్, టామ్ అల్సోప్, కాల్విన్ హ్యారీసన్వెల్ష్ ఫైర్- జానీ బెయిర్‌స్టో, స్టీవ్ స్మిత్ (ఓవర్సీస్), టామ్ కొహ్లెర్ కాడ్మోర్, టామ్ ఏబెల్, లూక్ వెల్స్, స్టీవీ ఎస్కినాజీ -
ఐపీఎల్ 2025 షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్‌లో కేకేఆర్‌ను ఢీకొట్టనున్న ఆర్సీబీ
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL) షెడ్యూల్ ఇవాళ (ఫిబ్రవరి 16) విడుదలైంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ మార్చి 22న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR).. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో (RCB) తలపడనుంది. ఈ మ్యాచ్ కేకేఆర్ హోం గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్‌లో (Eden Gardens) జరుగుతుంది.ఇదే ఈడెన్ గార్డెన్స్‌లో క్వాలిఫయర్-2 (మే 23) మరియు ఫైనల్ మ్యాచ్‌లు (మే 25) జరుగనున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో క్వాలిఫయర్-1 (మే 20) మరియు ఎలిమినేటర్ (మే 21) మ్యాచ్‌లు జరుగుతాయి. గత సీజన్ రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్.. మార్చి 23న జరిగే తమ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌ను ఎస్ఆర్హెచ్ తమ సొంత మైదానమైన ఉప్పల్ స్టేడియంలో ఆడుతుంది. అదే రోజు చెన్నై వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరుగుతుంది. మొత్తం 65 రోజుల పాటు జరిగే ఐపీఎల్-2025 సీజన్లో 74 మ్యాచ్‌లు జరుగనున్నాయి. దేశవ్యాప్తంగా 13 వేదికల్లో మెగా లీగ్ నిర్వహించబడుతుంది. -
ఐపీఎల్ స్పాన్సర్షిప్ డీల్ దక్కించుకున్న రిలయన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 పానీయాల విభాగంలో స్పాన్సర్షిప్ డీల్‌ను ముఖేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ (RCPL) దక్కించుకుంది. అందుకోసం రిలయన్స్ దాదాపు రూ.200 కోట్లు వెచ్చించింది. గతేడాది ఈ స్పాన్సర్షిప్ హక్కులను కోకాకోలా సొంతం చేసుకుంది. పానీయాల విభాగంలో ఈ డీల్‌ను దక్కించుకోవడంతో రిలయన్స్‌కు చెందిన కంపాకోలా విక్రయాలు పెరిగి, దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతుందని కంపెనీ భావిస్తుంది.వేసవిలో సేల్స్ పెంచుకోవాలని సాఫ్ట్‌డ్రింక్స్ కంపెనీలు ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టాయి. సరిగ్గా ఐపీఎల్ అదే సమయంలో ప్రారంభం కానుండడంతో దీన్ని ఆసరాగా చేసుకుని మరింత ముందుకుసాగాలని భావిస్తున్నాయి. అందులో భాగంగానే రిలయన్స్ ఈ స్పాన్సర్షిప్ హక్కులను దక్కించుకున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కంపా కోలాతో పాటు ఆర్సీపీఎల్ తన స్పోర్ట్స్ డ్రింక్ స్పిన్నర్, రాస్కిక్ గ్లూకో ఎనర్జీని టీ20 లీగ్ సందర్భంగా ప్రచారం చేస్తోంది.ఇదీ చదవండి: ఈపీఎఫ్ఓ వడ్డీరేటుపై త్వరలో నిర్ణయంశ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్‌తో కలిసి రూపొందించిన ‘స్పిన్నర్’ ప్రమోషన్స్ కోసం లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ అనే ఐదు ఐపీఎల్ జట్లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. రూ.10 ధర కలిగిన రాస్కిక్ గ్లూకో ఎనర్జీ కూడా ఈ టోర్నమెంట్‌లోనే అరంగేట్రం చేస్తోంది. ఐపీఎల్ 2025 కోసం టెలివిజన్, ఓటిటి ప్లాట్‌ఫామ్‌ల నుంచి మొత్తం ప్రకటనల ఆదాయం గత సంవత్సరం కంటే 8-10% పెరుగుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది సుమారు రూ.4,500 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నాయి. -
గుజరాత్ టైటాన్స్ సహ యజమానిగా టోరెంట్ కంపెనీ.. ప్రాంచైజీలో 67 శాతం వాటా కొనుగోలు
అహ్మదాబాద్: ఐపీఎల్ (IPL) టీమ్ గుజరాత్ టైటాన్స్‌లో (Gujarat Titans) ప్రముఖ పారిశ్రామిక సంస్థ టోరెంట్ గ్రూప్ (Torrent Group) 67 శాతం వాటాను దక్కించుకుంది. ఈ ఒప్పందం గతంలోనే ఖాయమైనా... బుధవారం ఫ్రాంచైజీ యాజమాన్యం దీనిని అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత యజమాని సీవీసీ క్యాపిటల్స్ ఇక ముందు మిగిలిన 33 శాతం వాటాతో సహ యజమానిగా కొనసాగుతోంది. ఐపీఎల్ జట్టులో భాగమయ్యేందుకు సీవీసీ క్యాపిటల్స్‌కు టోరెంట్ సుమారు రూ.5,025 కోట్లు చెల్లించినట్లు సమాచారం. 2021లో టైటాన్స్‌ను సీవీసీ రూ.5,625 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. ఈ టీమ్ ప్రస్తుత విలువను రూ.7,500 కోట్లుగా లెక్కగట్టారు. ఈ నేపథ్యంలో సీవీసీ గ్రూప్ తాము పెట్టిన పెట్టుబడిలో సుమారు 89 శాతాన్ని తిరిగి తెచ్చుకోవడంతో పాటు 33 శాతం వాటాను ఇంకా తమ వద్దే ఉంచుకోవడం విశేషం. కొత్త ఒప్పందం కారణంగా ఐపీఎల్లో భాగం కావ డం పట్ల సంతోషంగా ఉన్నామని... లీగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు టోరెంట్ గ్రూప్ డైరెక్టర్ జినాల్ మెహతా వ్యాఖ్యానించారు. టోరెంట్ దేశవ్యాప్తంగా ఫార్మాస్యూటికల్స్, విద్యుత్, గ్యాస్ రంగాల్లో పెద్ద ఎత్తున తమ వ్యాపారాలను సాగిస్తోంది. కంపెనీ విలువ దాదాపు రూ.41 వేల కోట్లుగా ఉంది. 2022 ఐపీఎల్ సీజన్లో టైటిల్ సాధించిన గుజరాత్ టైటాన్స్ 2023తో రన్నరప్‌గా నిలిచింది. -
మరో క్రికెట్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్ యాజమాన్యం
ముంబై ఇండియన్స్ (Mumbai Indians) యాజమాన్యం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) మరో క్రికెట్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఐదు క్రికెట్ ఫ్రాంచైజీలు కలిగిన RIL.. తాజాగా ద హండ్రెడ్ లీగ్‌లోని ఓవల్ ఇన్విన్సిబుల్స్ (లండన్ బేస్డ్) ఫ్రాంచైజీలో 49 శాతం వాటాను సొంతం చేసుకుంది. మిగిలిన 51 శాతం వాటాను ఇన్విన్సిబుల్స్ మాతృ సంస్థ అయిన సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్ (SCC) నిలబెట్టుకుంది.RIL, దాని అనుబంధ సంస్థ అయిన RISE వరల్డ్‌వైడ్ ద్వారా సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇన్విన్సిబుల్స్లో తమ వాటా కోసం RIL దాదాపు 644 కోట్ల రూపాయలు (60 మిలియన్ GBP) చెల్లించినట్లు తెలుస్తుంది. ఇంగ్లండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) విక్రయించిన మొట్టమొదటి ఫ్రాంచైజీ ఓవల్ ఇన్విన్సిబుల్స్. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీ విలువ 1320 కోట్ల రూపాయలుగా (123 మిలియన్ GBP) ఉంది. ఓవల్ ఇన్విన్సిబుల్స్‌ను ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ తమ కుటుంబంలోకి స్వాగతించారు.ఈ భాగస్వామ్యంతో ముంబై ఇండియన్స్ అభిమానుల స్థావరాన్ని భారత్‌తో పాటు న్యూయార్క్, UAE, దక్షిణాఫ్రికా, ఇప్పుడు ఇంగ్లండ్‌కు విస్తరిస్తున్నామని ఆమె అన్నారు. మా ప్రపంచ క్రికెట్ ప్రయాణంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నామని నీతా అంబాని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.హండ్రెడ్ లీగ్‌లో ఫ్రాంచైజీని కొన్న మూడో ఐపీఎల్ జట్టు..కాగా, ద హండ్రెడ్ లీగ్‌లో ఇటీవలే ఐపీఎల్ ఫ్రాంచైజీలైన లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా పెట్టుబడులు పెట్టాయి. నార్తర్న్ సూపర్‌చార్జర్స్ ఫ్రాంచైజీను సన్‌రైజర్స్ యాజమాన్యం సన్ గ్రూప్ హస్తగతం చేసుకుంది. ఈ ఫ్రాంచైజీలో మొత్తం వంద శాతాన్ని సన్ గ్రూప్ కొనుగోలు చేసింది.అంతకుముందు లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం RPSG గ్రూప్.. మాంచెస్టర్ ఒరిజినల్స్ (ఇంగ్లండ్) ఫ్రాంచైజీని కళ్లు చెదిరే ధర వెచ్చించి సొంతం చేసుకుంది. ఒరిజినల్స్ మొత్తం విలువలో 49 శాతాన్ని RPSG గ్రూప్ దక్కించుకుంది. భారత కరెన్సీలో ఈ వాటా విలువ రూ. 1251 కోట్లు.హండ్రెడ్ లీగ్‌లో ఇన్విన్సిబుల్స్ హవాఓవల్ ఇన్విన్సిబుల్స్ మహిళల జట్టు 2021, 2022 ఎడిషన్లలో ద హండ్రెడ్ విజేతగా నిలిచింది. పురుషుల జట్టు 2023, 2024 ఎడిషన్లలో ఛాంపియన్‌గా నిలిచింది.ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుముంబై ఇండియన్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా ఉంది. ఈ ఫ్రాంచైజీ 2013, 2015, 2017, 2019, 2020 ఎడిషన్లలో ఛాంపియన్‌గా నిలిచింది. ముంబై ఇండియన్స్ రెండు సందర్భాలలో ఛాంపియన్స్ లీగ్‌ను కూడా గెలుచుకుంది. ఇటీవల, MI కేప్ టౌన్ SA20 2025 టైటిల్‌ను కూడా గెలుచుకుంది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంఐ ఫ్రాంచైజీలు ఇవే..!ముంబై ఇండియన్స్ (ఐపీఎల్), ముంబై ఇండియన్స్ (డబ్ల్యూపీఎల్), ఎంఐ న్యూయార్క్ (మేజర్ లీగ్ క్రికెట్), ఎంఐ కేప్‌టౌన్ (సౌతాఫ్రికా టీ20 లీగ్), ఎంఐ ఎమిరేట్స్ (ఇంటర్నేషనల్ లీగ్ టీ20), తాజాగా ఓవల్ ఇన్విన్సిబుల్స్ (ద హండ్రెడ్ లీగ్) -
జిల్లాకు రూ. 1 కోటి చొప్పున...
సాక్షి, హైదరాబాద్: ప్రతిభ గల యువ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు త్వరలోనే తెలంగాణ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్)ను నిర్వహిస్తామని... హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు వెల్లడించారు. శనివారం ఉప్పల్ స్టేడియంలో జగన్మోహన్ రావు అధ్యక్షతన నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా హెచ్‌సీఏ అధ్యక్షుడు మాట్లాడుతూ... ‘క్రికెట్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఐపీఎల్ అనంతరం యువ క్రికెటర్ల కోసం టీపీఎల్ నిర్వహిస్తాం. ఉమ్మడి 10 జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధికి కోటి రూపాయల చొప్పున ఖర్చు చేయనున్నాం. ప్రతి జిల్లాలో ఒక చోట 10 ఎకరాల స్థలం కొనుగోలు చేసి కొత్త మైదానాలను నిరి్మస్తాం. దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్లో రాణిస్తున్న తెలంగాణ ప్లేయర్లను సత్కరించేందుకు వచ్చే నెలలో హెచ్‌సీఏ అవార్డులు అందిస్తాం. బీసీసీఐ నిబంధనలకు అనుగుణంగా ఉప్పల్ స్టేడియాన్ని ఆధునీకరిస్తాం. మల్టీలెవల్ పార్కింగ్ వ్యవస్థను అభివృద్ధి పరుస్తాం’ అని వెల్లడించారు. ఈ సమావేశంలో హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు దల్జీత్ సింగ్, కార్యదర్శి దేవ్‌రాజ్, కోశాధికారి శ్రీనివాస్, బసవరాజు, సునీల్ అగర్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా మేనేజర్‌గా ఎంపికైన దేవ్‌రాజ్‌ను అపెక్స్ కౌన్సిల్ సభ్యులు అభినందించారు. -
విదేశాలకు విస్తరిస్తున్న ఐపీఎల్ ఫ్రాంచైజీలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం నుంచి భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డుకు లాభాల పంట పండిస్తోంది. అందుకే ఐపీఎల్ ఫ్రాంచైజీల కోసం బడా వ్యాపారవేత్తలు అప్పట్లో ఎగబడ్డారు. ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ వ్యాపారాన్ని విదేశాలకు కూడా విస్తరిస్తున్నారు. వివిధ దేశాల్లో నిర్వహిస్తున్న ఐపీఎల్ తరహా టోర్నమెంట్లలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ లు కడుతున్నారు. తాజాగా ఐపీఎల్లో హైదరాబాద్ వేదికగా పోటీ పడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నిర్వహిస్తున్న 'ది హండ్రెడ్' టోర్నమెట్లోకి రంగ ప్రవేశం చేసింది.మూడో ఐపీఎల్ ఫ్రాంచైజీబుధవారం నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌ను కొనుగోలు కోసం నిర్వహించిన వేలంలో కళానిధి మారన్ యాజమాన్యంలోని సన్ గ్రూప్ పాల్గొని మొత్తం వంద శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు యొక్క 49 శాతం వాటాను, ఈ క్లబ్ నిర్వాహకులైన యార్క్‌షైర్ యొక్క 51 శాతం వాటాను కొనుగోలు చేయడానికి అంగీకారాన్ని పొందింది. దీంతో 'ది హండ్రెడ్' టోర్నమెంట్ లో 100% వాటాను పొందిన తొలి ఫ్రాంచైజ్ గా నిలిచింది. ఈ టోర్నమెంట్ లో వాటాలు చేజిక్కించుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో ఫ్రాంచైజీ కావడం విశేషం. సూపర్‌చార్జర్స్ కొనుగోలు కోసం సన్ గ్రూప్ ఏకంగా 100 మిలియన్ పౌండ్లు వెచ్చించినట్టు తెలుస్తోంది. నాలుగో స్థానంలో సూపర్చార్జర్స్యార్క్షైర్కు వేదికగా పోటీ పడుతున్న సూపర్‌చార్జర్స్ గత సీజన్లో పురుషులు మరియు మహిళల టోర్నమెంట్లలో నాలుగో స్థానంలో నిలిచింది. సూపర్‌చార్జర్స్ పురుషుల జట్టుకు ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుత ఇంగ్లాండ్ జట్లు లో సభ్యుడైన హ్యారీ బ్రూక్ ఈ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.లక్నో సూపర్ జెయింట్స్ నిర్వాహకులైన ఆర్ పి ఎస్ జి గ్రూప్, ముంబై ఇండియన్స్ నిర్వాహకులైన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 'ది హండ్రెడ్' టోర్నమెంట్ లో పోటీ పడుతున్న జట్ల స్టాక్లను కొనుగోలు చేసిన కొన్ని రోజుల తర్వాత సన్ గ్రూప్ కూడా ఈ టోర్నమెంట్ లో పెట్టుబడి పెట్టింది.ప్రారంభంలో లండన్ స్పిరిట్ కొనుగోలు హక్కులను దక్కించుకోవడంలో విఫలమైన ఆర్ పి ఎస్ జి గ్రూప్ తర్వాత మాంచెస్టర్ ఒరిజినల్స్‌లో వాటాను కొనుగోలు చేసింది. రాబోయే రోజుల్లో ది హండ్రెడ్‌లో మరో ఐపీఎల్ క్లబ్ కూడా పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల కథనం.మొదటి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ టాటా గ్రూప్ 2024-2028 సంవత్సరానికి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను దాదాపు 2,500 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. ఇది మునుపటి ఒప్పందం కంటే దాదాపు 50 శాతం అధికం. ఇక ఐపీఎల్ ఫ్రాంచైజీల విషయానికొస్తే, 231.0 మిలియన్ డాలర్లతో చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత విలువైన ఫ్రాంచైజీ గా కొనసాగుతోంది. గత సంవత్సరం ఈ క్లబ్ తొమ్మిది శాతం వృద్ధి రేటు ని సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 227.0 మిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో ఉంది. గత సంవత్సరం ఐపీఎల్ విజేత అయిన కోల్‌కతా నైట్ రైడర్స్ వ్యాపార వృద్ధి లో 19.3 శాతం పెరుగుదలతో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ముంబై ఇండియన్స్ 204.0 మిలియన్ డాలర్లతో బ్రాండ్ విలువతో నాలుగో స్థానంలో ఉంది. తరువాత సన్‌రైజర్స్ హైదరాబాద్ (132 మిలియన్ డాలర్లు), రాజస్థాన్ రాయల్స్ (113 మిలియన్ డాలర్లు) ఉన్నాయి.లాభాల పంటవాణిజ్య ప్రకటనల ద్వారా ఐపీఎల్ ఫ్రాంచైజీలు విపరీతంగా లాభాలు ఆర్జిస్తున్నాయి. దాదాపు ప్రతి జట్టుకు 5 మిలియన్ డాలర్ల నుండి 12 మిలియన్ డాలర్ల వరకు స్పాన్సర్షిప్ ఆదాయం లభించడమే కాక టెలివిజన్ హక్కుల ద్వారా కూడా గణనీయమైన ఆదాయం సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మూడేళ్ల ఒప్పందం కోసం ఖతార్ ఎయిర్వేస్ దాదాపు 175 కోట్ల రూపాయలతో ఒప్పందం ఖరారు చేసుకుందంటే ఐపీఎల్ ఫ్రాంచైజీల ఆదాయం ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. -
మరో క్రికెట్ లీగ్‌లోకి అడుగుపెట్టిన లక్నో సూపర్ జెయింట్స్
ఐపీఎల్ (IPL) టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) మరో క్రికెట్ లీగ్‌లోకి అడుగుపెట్టింది. ఎల్ఎస్జీ యాజమాన్యం హండ్రెడ్ లీగ్‌లోని (The Hundred League) మాంచెస్టర్ ఒరిజినల్స్ (ఇంగ్లండ్) ఫ్రాంచైజీని కళ్లు చెదిరే ధర వెచ్చించి సొంతం చేసుకుంది. ఫ్రాంచైజీ మొత్తం విలువలో 49 శాతాన్ని ఎల్ఎస్జీ యాజమాన్యమైన RPSG గ్రూప్ దక్కించుకుంది. భారత కరెన్సీలో ఈ వాటా విలువ రూ. 1251 కోట్లు. మాంచెస్టర్ ఒరిజినల్స్‌లో (Manchester Originals) వాటా దక్కించుకున్న విషయాన్ని RPSG గ్రూప్ అధినేత సంజీవ్ గొయెంకా వెల్లడించారు. తొలుత ఎల్ఎస్జీ యాజమాన్యం హండ్రెడ్ లీగ్‌లోని మరో ఫ్రాంచైజీ (లండన్ స్పిరిట్) కోసం బిడ్ దాఖలు చేసింది. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదు. అంతిమంగా RPSG గ్రూప్ మాంచెస్టర్ ఒరిజినల్స్‌లో వాటా దక్కించుకుంది. RPSG గ్రూప్‌తో జత కట్టడంపై మాంచెస్టర్ యాజమాన్యం లంకాషైర్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ డీల్‌లో టర్మ్స్ అండ్ కండీషన్స్‌పై తదుపరి 8 వారాల్లో చర్చిస్తామని పేర్కొంది.కాగా, ఇటీవలే హండ్రెడ్ లీగ్‌లోకి మరో ఐపీఎల్ ఫ్రాంచైజీ కూడా అడుగుపెట్టింది. ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ (అంబానీ గ్రూప్).. ఓవల్ ఇన్విన్సిబుల్స్ ఫ్రాంచైజీని భారీ ధరకు కొనుగోలు చేసింది. మరో రెండు ఐపీఎల్ ఫ్రాంచైజీలు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా హండ్రెడ్ లీగ్‌లో ఫ్రాంచైజీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఎస్ఆర్హెచ్కు చెందిన సన్ గ్రూప్.. నార్త్రన్ సూపర్ ఛార్జర్స్, ట్రెంట్ రాకెట్స్‌ను కొనుగోలు చేయాలని చూస్తుండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని అయిన జీఎమ్ఆర్ గ్రూప్ సథరన్ బ్రేవ్‌లో వాటాను దక్కించుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంది.అప్పట్లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్..లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం 2016లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆ ఫ్రాంచైజీ తెరమరుగైంది. రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్‌కు ఎంఎస్ ధోని సారధిగా వ్యవహరించాడు. 2021లో సంజీవ్ గొయెంకాకు చెందిన RPSG గ్రూప్.. లక్నో సూపర్ జెయింట్స్‌ను రూ. 7090 కోట్లకు కొనుగోలు చేసింది. 2023లో RPSG గ్రూప్.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో (SA20) డర్బన్ సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీని కూడా కొనుగోలు చేసింది. -
IPL 2025: పంత్‌కే లక్నో పగ్గాలు
కోల్‌కతా: ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ తమ కెప్టెన్ పేరును అధికారికంగా ప్రకటించింది. ఊహించిన విధంగానే వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌ను సారథిగా నియమిస్తున్నట్లు టీమ్ మేనేజ్మెంట్ వెల్లడించింది. లక్నో ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా సోమవారం జరిగిన కార్యక్రమంలో కెప్టెన్ పంత్‌కు టీమ్ జెర్సీని అందిస్తూ తమ ఎల్ఎస్జీ కుటుంబంలోకి ఆహ్వానించారు. ఐపీఎల్ వేలంలో రూ. 27 కోట్లకు పంత్‌ను లక్నో సొంతం చేసుకోవడంతోనే అతనే కెపె్టన్ కావడం దాదాపు ఖాయమైంది. ‘కొత్త ఆశలు, ఆశయాలతో పాటు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో కొత్తగా మేం మొదలు పెడుతున్నాం. మీకందరికీ మా కొత్త కెప్టెన్ రిషభ్ పంత్‌ను పరిచయం చేస్తున్నాం. మా జట్టుకు సంబంధించి ఇదో కీలక క్షణం. మూడేళ్లు ముగిసిన తర్వాత మా ప్రణాళికల్లో మార్పులతో ముందుకు వెళ్లబోతున్నాం’ అని గోయెంకా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీమ్ మెంటార్ జహీర్ ఖాన్ కూడా పాల్గొన్నాడు. ఐపీఎల్లో మూడు సీజన్లు ఆడిన లక్నోకు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. తొలి రెండు సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు చేరిన ఆ జట్టు గత ఏడాది పూర్తిగా విఫలమైంది. దాంతో పాటు కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌పై కూడా విమర్శలు రావడంతో మార్పు అనివార్యమైంది. వేలంలో పంత్‌ను సొంతం చేసుకున్న టీమ్ ఇప్పుడు కెపె్టన్‌గా బాధ్యతలు అప్పగించింది. 2016 నుంచి 2024 వరకు ఢిల్లీ టీమ్ సభ్యుడైన పంత్... మూడేళ్లు నాయకుడిగా కూడా పని చేశాడు. 200 శాతం ప్రదర్శన కనబరుస్తా... దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ తరఫున ఆడినా... పంత్ స్వస్థలం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్. గతంలో ఇది ఉత్తరప్రదేశ్‌లోనే భాగం. ఇప్పుడు అదే రాష్ట్రానికి చెందిన ఐపీఎల్ టీమ్‌కు అంటే దాదాపుగా సొంత టీమ్‌కు అతను ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. లక్నో మేనేజ్మెంట్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని పంత్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘నా వైపు నుంచి ఎలాంటి లోపం లేకుండా 200 శాతం కష్టపడతానని మీకు మాటిస్తున్నా. కొత్త ఉత్సాహంతో కొత్త జట్టు తరఫున బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నా. నాకు ఇచి్చన బాధ్యతలతో సంతోషంగా ఉన్నా. టీమ్‌లో యువకులు, అనుభవజ్ఞులు ఉన్నారు. కొత్త లక్ష్యాలతో మా ప్రయాణం మొదలైంది’ అని పంత్ వ్యాఖ్యానించాడు. కెపె్టన్‌గా తాను ఇప్పటికే ఎంతో నేర్చుకున్నానని పంత్ అన్నాడు. ‘ఇక్కడ కొత్త ఫ్రాంచైజీ, కొత్త ఆరంభం అని నాకు తెలుసు. కానీ కెప్టెన్సీ బాధ్యతలు నాకు కొత్త కాదు. అయితే మా జట్టు అవసరాలను బట్టి నేనేం చేయాలో మేనేజ్మెంట్తో చర్చిస్తా. సహచరులకు అండగా ఎలా నిలవాలో, వారినుంచి మంచి ప్రదర్శన ఎలా రాబట్టాలో రోహిత్ శర్మ నుంచి, ఇతర సీనియర్ ఆటగాళ్ల నుంచి కూడా ఎంతో నేర్చుకున్నా. ఎవరికి ఎలాంటి బాధ్యతలు ఇవ్వాలనే విషయంపై నాకు స్పష్టత ఉంది’ అని పంత్ వివరించాడు. పంత్‌లో సత్తా ఉంది... భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ ఢిల్లీ కెప్టెన్‌గా ఉన్న 2016లో పంత్ మొదటిసారి ఐపీఎల్‌లోకి అడుగు పెట్టాడు. ఇప్పుడు లక్నో మెంటార్‌గా ఉన్న జహీర్‌తో పంత్ మళ్లీ కలిసి పని చేయనున్నాడు. ‘ఎన్నో ఆటుపోట్లను దాటి పంత్ క్రికెటర్‌గా ఎదగడం నేను ప్రత్యక్షంగా చూశాను. తన ఆటతో అతను అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పాడు. ఇకపై అతను సాధించాల్సింది ఎంతో ఉంది. ఇక్కడ పంత్ ఆ పని చేయగలడు’ అని జహీర్ వ్యాఖ్యానించాడు. మరోవైపు తమ జట్టు మిడిలార్డర్లో అంతా ఎడంచేతి వాటం బ్యాటర్లు ఉండటం కూడా ఒకరకమైన వ్యూహమని తెలిపాడు. -
కరుణ్ నాయర్ ఐపీఎల్ ఆడుతున్నాడా..?
దేశవాలీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో పరుగుల వరద పారిస్తున్న విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాడు. ఏ ఇద్దరు భారత క్రికెట్ అభిమానులు కలిసినా కరుణ్ నాయర్ గురించిన చర్చే నడుస్తుంది. 2022 డిసెంబర్లో డియర్ క్రికెట్.. మరో ఛాన్స్ ఇవ్వు అని ప్రాధేయ పడిన కరుణ్, ఇప్పుడు క్రికెట్ ప్రపంచం మొత్తం తనవైపు చూసేలా చేసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ గణాంకాలు చూస్తే ఎంతటి వారైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ టోర్నీలో కరుణ్ ఏడు ఇన్నింగ్స్‌ల్లో 752 సగటున 752 పరుగులు (112*, 44*, 163*, 111*, 112, 122*, 88*) చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, ఓ అర్ద సెంచరీ ఉన్నాయి. ఈ ఏడు ఇన్నింగ్స్‌ల్లో కరుణ్ కేవలం ఒక్క సారి మాత్రమే ఔటయ్యాడు.కరుణ్ అరివీర భయంకరమైన ఫామ్ చూసిన తర్వాత భారత క్రికెట్ అభిమానులు ఇతని గురించి లోతుగా ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇంతటి విధ్వంసకర బ్యాటర్ అయిన కరుణ్ అసలు ఐపీఎల్ ఆడుతున్నాడా లేదా అని గూగుల్ చేస్తున్నారు. ఆసక్తికరంగా కరుణ్‌ను ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. ఐపీఎల్-2025 మెగా వేలంలో డీసీ కరుణ్‌ను 50 లక్షలకు సొంతం చేసుకుంది. కరుణ్ గతంలోనూ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడాడు. కరుణ్‌కు 2013-22 వరకు ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. ఈ మధ్యకాలంలో అతను వివిధ ఫ్రాంచైజీల తరఫున 76 మ్యాచ్‌లు ఆడి 10 అర్ద సెంచరీల సాయంతో 1496 పరుగులు చేశాడు.వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్ట్‌ల్లో భారత్ తరఫున ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక బ్యాటర్ అయిన కరుణ్ కేవలం కొంతకాలం మాత్రమే అంతర్జాతీయ క్రికెట్ ఆడగలిగాడు. తన మూడో మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ్ ఆతర్వాత సరైన అవకాశాలు రాక కనుమరుగయ్యాడు. తిరిగి ఏడేళ్ల తర్వాత కరుణ్ లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. టీమిండియా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్కు దగ్గర పడిన నేపథ్యంలో కరుణ్‌కు అవకాశాలు ఇవ్వాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం కరుణ్ ఉన్న ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కొనసాగిస్తే మూడు ఫార్మాట్లలో భారత జట్టులో పాగా వేయడం ఖాయం. కరుణ్ 2016-17 మధ్యలో భారత్ తరఫున 6 టెస్ట్‌లు, రెండు వన్డేలు ఆడాడు. టెస్ట్‌ల్లో ట్రిపుల్ సెంచరీ మినహాయించి కరుణ్‌కు చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ లేవు.కాగా, విజయ్ హజారే ట్రోఫీలో ఇవాళ (జనవరి 16) జరుగుతున్న మ్యాచ్‌లో కరుణ్ విశ్వరూపం ప్రదర్శించాడు. మహారాష్ట్రతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో కరుణ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో కరుణ్ 44 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 88 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కరుణ్ విధ్వంసం ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 380 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో విదర్భకు ఇదే అత్యధిక స్కోర్.మహారాష్ట్రతో మ్యాచ్‌లో కరుణ్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడగా.. విదర్భ ఓపెనర్లు దృవ్ షోరే (120 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో 114 పరుగులు), యశ్ రాథోడ్ (101 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో 116 పరుగులు) సెంచరీలు చేశారు. దృవ్, యశ్ తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 224 పరుగులు జోడించారు. తదనంతరం కరుణ్ నాయర్‌తో పాటు జితేశ్ శర్మ (33 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. -
ఆర్సీబీకి గుడ్ న్యూస్.. ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చిన స్టార్ ప్లేయర్
ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆర్సీబీకి గుడ్ న్యూస్ అందింది. బిగ్ బాష్ లీగ్‌లో పేలవ ఫామ్‌లో ఉండిన ఆ జట్టు స్టార్ ప్లేయర్ జేకబ్ బేతెల్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. హోబర్ట్ హరికేన్స్‌తో ఇవాళ (జనవరి 14) జరిగిన మ్యాచ్‌లో బేతెల్ మెరుపు అర్ద సెంచరీ (50 బంతుల్లో 87; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) సాధించాడు. ఫలితంగా అతని జట్టు మెల్బోర్న్ రెనెగేడ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. JACOB BETHELL - A SPECIAL PLAYER. 🌟The Highlights of Jacob Bethel's 87(50) in the BBL and all players combined made 61(70) - Bethel, The Future of RCB. 🔥pic.twitter.com/zIyhli7iOi— Tanuj Singh (@ImTanujSingh) January 14, 2025మెల్బోర్న్ ఇన్నింగ్స్‌లో బేతెల్ మినహా ఎవరూ రాణించలేదు. టిమ్ సీఫర్ట్ (24), కెప్టెన్ సదర్‌ల్యాండ్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. జోష్ బ్రౌన్ 6, మార్కస్ హ్యారిస్ 1, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ 7, హ్యారీ డిక్సన్ 1, టామ్ రోజర్స్ 5 (నాటౌట్), ఫెర్గస్ ఓనీల్ 2 (నాటౌట్) పరుగులు చేశారు. హరికేన్స్ బౌలర్లలో రిలే మెరిడిత్ మూడు వికెట్లు పడగొట్టగా.. నాథన్ ఇల్లిస్, మిచెల్ ఓవెన్ తలో వికెట్ దక్కించుకున్నారు.155 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హరికేన్స్ 7 ఓవర్ల అనంతరం రెండు వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. ఓపెనర్లు మిచెల్ ఓవెన్ (24), కాలెబ్ జువెల్ (1) ఔట్ కాగా.. చార్లీ వకీం (12), నిఖిల్ చౌదరీ (4) క్రీజ్‌లో ఉన్నారు. రెనెగేడ్స్ బౌలర్లలో ఫెర్గస్ ఓనీల్కు ఓ వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో హరికేన్స్ గెలవాలంటే 78 బంతుల్లో 105 పరుగులు చేయాలి.కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్ వేలంలో జేకబ్ బేతెల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2.6 కోట్లకు కొనుగోలు చేసింది. ఆర్సీబీ జేకబ్ బేతెల్పై భారీ అంచనాలే పెట్టుకుంది. అయితే బీబీఎల్ తొలి అర్ద భాగంలో బేతెల్ తుస్సుమనిపించాడు.బీబీఎల్-2025లో బేతెల్ ప్రదర్శనలు..87(50) vs హోబర్ట్ హరికేన్స్1(8) vs మెల్బోర్న్ స్టార్స్2(9) vs పెర్త్ స్కార్చర్స్49(36) vs మెల్బోర్న్ స్టార్స్21(21) vs అడిలైడ్ స్ట్రైకర్స్2(4) vs సిడ్నీ థండర్30(22) vs పెర్త్ స్కార్చర్స్3(6) vs హోబర్ట్ హరికేన్స్ -
కేన్ విలియమ్సన్కు అవమానం
దిగ్గజ బ్యాటర్, న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్కు అవమానం జరిగింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) డ్రాఫ్ట్‌లో కేన్ మామను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ప్లాటినమ్ డ్రాఫ్ట్‌లో కేన్ మరో 43 మంది స్టార్ ఆటగాళ్లతో కలిసి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఐపీఎల్ 2025 వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన కేన్‌ను పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కూడా ఎవరూ పట్టించుకోలేదు. కేన్ బరిలో నిలిచిన ప్లాటినమ్ డ్రాఫ్ట్ నుంచి 10 మంది ఆటగాళ్లను ఎంపిక చేసున్నాయి ఫ్రాంచైజీలు.అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను కరాచీ కింగ్స్ ఫ్రాంచైజీ దక్కించుకుంది. వార్నర్ రిటైర్మెంట్ తర్వాత కూడా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో వార్నర్ అదరగొడుతున్నాడు. ఈ లీగ్‌లో వార్నర్ ఏడు ఇన్నింగ్స్‌ల్లో 63.20 సగటున 142.34 స్ట్రయిక్‌రేట్‌తో 316 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ప్రస్తుత ఫామ్ కారణంగానే పీఎస్ఎల్ డ్రాఫ్ట్‌లో వార్నర్‌కు మాంచి గిరాకీ ఉండింది.విలియమ్సన్ విషయానికొస్తే.. ఈ కివీస్ లెజెండ్ ఇటీవలి కాలంలో పెద్దగా టీ20లు ఆడింది లేదు. 2023లో ఒక్క అంతర్జాతీయ టీ20 కూడా ఆడని కేన్.. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్‌కప్ (2024) కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఐపీఎల్, పీఎస్ఎల్లో కేన్ ఎంపిక కాకపోవడానికి అతని ఫిట్నెస్ కూడా ఓ కారణమే. ఇటీవలి కాలంలో కేన్ తరుచూ గాయాల బారిన పడుతున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్ ఉండి కూడా కేన్ పొట్టి ఫార్మాట్లో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోతున్నాడు. బ్యాటింగ్‌లో వేగం లేకపోవడం, భారీ షాట్లు ఆడలేకపోవడం కేన్‌కు ప్రధాన సమస్యలు.కేన్ ప్రైవేట్ లీగ్‌ల్లో పెద్దగా రాణించలేకపోయినా అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం పర్వాలేదనిపించాడు. కేన్ తన దేశం తరఫున 93 టీ20లు ఆడి 33.44 సగటున 2575 పరుగులు చేశాడు. కేన్‌ను ప్రైవేట్ లీగ్‌ల్లో ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకోకపోవడానికి అతని వయసు మరో ప్రధాన కారణం. ప్రస్తుతం కేన్ మామ వయసు 34 ఏళ్లు.కేన్ ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో కేన్ డర్బన్ జెయింట్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే కేన్ అదరగొట్టాడు. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేన్ 40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.పీఎస్ఎల్ డ్రాఫ్ట్‌లో ఆయా ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకున్న పలువురు స్టార్ ఆటగాళ్లు..డేవిడ్ వార్నర్ (కరాచీ కింగ్స్)డారిల్ మిచెల్ (లాహోర్ ఖలందర్స్)మార్క్ చాప్మన్ (క్వెట్టా గ్లాడియేటర్స్)మైఖేల్ బ్రేస్‌వెల్ (ముల్తాన్ సుల్తాన్స్)ఆడమ్ మిల్నే (కరాచీ కింగ్స్)ఫిన్ అలెన్ (క్వెట్టా గ్లాడియేటర్స్)జేసన్ హోల్డర్ (ఇస్లామాబాద్ యునైటెడ్)ఆమెర్ జమాల్ (కరాచీ కింగ్స్) -
ఐపీఎల్-2025లో పాల్గొనబోయే అత్యధిక వయస్కులు వీరే..!
ఐపీఎల్-2025లో పాల్గొనే అత్యధిక వయస్కుల వివరాలను ఈ ఐటంలో చూద్దాం. ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్‌లో పాల్గొనబోయే అత్యధిక వయస్కుడిగా ధోని రికార్డు సృష్టించాడు. ధోని 43 ఏళ్ల వయసులో ఐపీఎల్ 2025 ఆడతాడు. ధోనిని ఐపీఎల్ మెగా వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ రీటైన్ చేసుకుంది. సీఎస్కేకు ఐదు సార్లు టైటిళ్లు అందించిన ధోని ఈసారి సాధారణ ఆటగాడిగా బరిలోకి దిగుతాడు.ఐపీఎల్-2025లో పాల్గొనబోయే రెండో అత్యధిక వయస్కుడు ఫాఫ్ డుప్లెసిస్. డుప్లెసిస్ 40 ఏళ్ల వయసులో క్యాష్ రిచ్ లీగ్ బరిలో ఉంటాడు. గత సీజన్ వరకు ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించిన డుప్లెసిస్ 2025 ఎడిషన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్నాడు. మెగా వేలంలో డీసీ డుప్లెసిస్‌ను 2 కోట్లకు సొంతం చేసుకుంది. డుప్లెసిస్ ఐపీఎల్లో 145 మ్యాచ్‌లు ఆడి 4571 పరుగులు స్కోర్ చేశాడు.ఐపీఎల్-2025లో మూడో అత్యధిక వయస్కుడు రవిచంద్రన్ అశ్విన్. అశ్విన్ 38 ఏళ్ల వయసులో ఐపీఎల్ ఆడతాడు. ఇటీవల జరిగిన మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ యష్‌ను 9.75 కోట్లకు సొంతం చేసుకుంది. అశ్విన్ 2024 సీజన్లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడాడు.ఐపీఎల్-2025 నాలుగో అత్యధిక వయస్కుడు రోహిత్ శర్మ. హిట్‌మ్యాన్ 37 ఏళ్ల వయసులో ముంబై ఇండియన్స్‌కు ఆడతాడు. ముంబై ఇండియన్స్ 16.3 కోట్లకు రోహిత్‌ను రీటైన్ చేసుకుంది. ఐదు సార్లు ముంబై ఇండియన్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టిన రోహిత్ తదుపరి సీజన్లో సాధారణ ఆటగాడిగా బరిలో ఉంటాడు. రోహిత్ ఐపీఎల్లో 257 మ్యాచ్‌లు ఆడి 6628 పరుగులు స్కోర్ చేశాడు.ఐపీఎల్-2025లో పాల్గొనే ఐదో అత్యధిక వయస్కుడు మొయిన్ అలీ. మొయిన్ అలీ 37 ఏళ్ల వయసులో (రోహిత్ కంటే చిన్నవాడు) క్యాష్ రిచ్ లీగ్ బరిలో ఉంటాడు. మెగా వేలంలో కేకేఆర్ మొయిన్‌ను 2 కోట్లకు సొంతం చేసుకుంది. మొయిన్ తన ఐపీఎల్ కెరీర్లో 67 మ్యాచ్‌లు ఆడి 1162 పరుగులు చేసి 35 వికెట్లు పడగొట్టాడు.ఐపీఎల్-2025లో పాల్గొనబోయే ఆరో అత్యధిక వయస్కుడు కర్ణ్ శర్మ. కర్ణ శర్మ 37 ఏళ్ల (రోహిత్, మొయిన్ కంటే రోజుల్లో చిన్నవాడు) క్యాష్ రిచ్ లీగ్ బరిలో ఉంటాడు. కర్ణ్ శర్మను మెగా వేలంలో ముంబై ఇండియన్స్ 50 లక్షలకు సొంతం చేసుకుంది. కర్ణ్ శర్మ ఐపీఎల్లో 84 మ్యాచ్‌లు ఆడి 76 వికెట్లు పడగొట్టాడు.ఐపీఎల్-2025లో పాల్గొనబోయే ఏడో అత్యధిక వయస్కుడు ఆండ్రీ రసెల్. రసెల్ 36 ఏళ్ల వయసులో ఐపీఎల్ ఆడనున్నాడు. మెగా వేలానికి ముందు రసెల్‌ను కేకేఆర్ రీటైన్ చేసుకుంది. రసెల్ ఐపీఎల్లో 126 మ్యాచ్‌లు ఆడి 2484 పరుగులు చేసి 115 వికెట్లు పడగొట్టాడు.ఐపీఎల్-2025లో పాల్గొనబోయే ఎనిమిదో అత్యధిక వయస్కుడు సునీల్ నరైన్. నరైన్ 36 ఏళ్ల వయసులో (రసెల్ కంటే రోజుల్లో చిన్నవాడు) ఐపీఎల్ ఆడనున్నాడు. మెగా వేలానికి ముందు కేకేఆర్ నరైన్‌ను రీటైన్ చేసుకుంది. నరైన్ ఐపీఎల్లో 1534 పరుగులు చేసి 180 వికెట్లు పడగొట్టాడు.ఐపీఎల్-2025లో పాల్గొనబోయే తొమ్మిదో అత్యధిక వయస్కుడు అజింక్య రహానే. రహానే 36 ఏళ్ల (రసెల్, నరైన్ కంటే రోజుల్లో చిన్నవాడు) వయసులో క్యాష్ రిచ్ లీగ్ ఆడనున్నాడు. రహానేను మెగా వేలంలో కేకేఆర్ 1.5 కోట్లకు సొంతం చేసుకుంది. రహానే తన ఐపీఎల్ కెరీర్లో 185 మ్యాచ్‌లు ఆడి 30.14 సగటున 4642 పరుగులు చేశాడు.ఐపీఎల్-2025లో పాల్గొనబోయే పదో అత్యధిక వయస్కుడు ఇషాంత్ శర్మ. ఇషాంత్ 36 ఏళ్ల వయసులో (రసెల్, నరైన్, రహానే కంటే రోజుల్లో చిన్నవాడు) ఐపీఎల్ ఆడనున్నాడు. ఇషాంత్‌ను 2025 సీజన్ మెగా వేలంలో గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. దీంతో ఇషాంత్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్ (2008) నుంచి వేలంలో అమ్ముడుపోయిన ఏకైక ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇషాంత్ ఐపీఎల్లో 79 మ్యాచ్‌లు ఆడి 93 వికెట్లు పడగొట్టాడు. -
ధోని శిష్యుడి విధ్వంసం.. 20 సిక్స్‌లతో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ
బీసీసీఐ పురుషుల అండర్-23 స్టేట్ ఎ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ కెప్టెన్ సమీర్ రిజ్వీ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో భాగంగా శనివారం త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో సమీర్ రిజ్వీ డబుల్ సెంచరీతో చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లను రిజ్వీ ఊచకోత కోశాడు. మైదానం నలుమూలల బౌండరీలు బాదుతూ అభిమానులను అలరించాడు.రిజ్వీ కేవలం 97 బంతుల్లో 13 ఫోర్లు, 20 సిక్సర్లతో 201 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తరప్రదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. సమీర్ రిజ్వీతో పాటు... శౌర్య సింగ్ (51; 9 ఫోర్లు, 1 సిక్స్), ఆదర్శ్ సింగ్ (52) హాఫ్‌సెంచరీలతో రాణించారు.అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన త్రిపుర జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 253 పరుగులకు పరిమితమైంది. ఆనంద్ (68), తన్మయ్ దాస్ (48) పోరాడినా లాభం లేకపోయింది. ఉత్తరప్రదేశ్ బౌలర్లలో కునాల్ త్యాగీ 3, విజయ్ కుమార్, వన్ష్ చౌదరి చెరో రెండు వికెట్లు తీశారు.రిజ్వీ అరుదైన ఘనత..కాగా ఈ మ్యాచ్‌లో ద్విశతకంతో మెరిసిన సమీర్ రిజ్వీ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. అండర్ 23 స్టేట్-ఎ ట్రోఫీ చరిత్రలో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ ఆటగాడిగా రిజ్వీ నిలిచాడు. అయితే ఈ టోర్నీలో రిజ్వీ చేసిన డబుల్ సెంచరీ లిస్ట్-ఎ క్రికెట్ కిందకి రాదు. లిస్ట్-ఎ క్రికెట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు ప్రస్తుతం న్యూజిలాండ్ ఆటగాడు చాడ్ బోవ్స్ పేరిట ఉంది. కివీస్ దేశీవాళీ టోర్నీ ఫోర్డ్ ట్రోఫీలో బోవ్స్ కేవలం 103 బంతుల్లో ద్విశతకం సాధించాడు.చెన్నై టూ ఢిల్లీ.. ఐపీఎల్-2025 మెగా వేలంలో రిజ్వీని రూ. 95 లక్షలకకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు రిజ్వీ ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్-2024 మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ సమీర్ రిజ్వీని 8.4 కోట్ల భారీ ధరకు అతడిని కొనుగోలు చేసింది. సీఎస్కే దిగ్గజం ఎంఎస్ ధోనితో కలిసి ఆడాడు. అతడి సూచనలు మెరకు ఒకట్రెండు మ్యాచ్‌ల్లో పర్వాలేదన్పించిన రిజ్వీ.. తర్వాతి మ్యాచ్‌ల్లో నిరాశపరిచాడు. ఐదు మ్యాచుల్లో కేవలం 51 పరుగులు మాత్రమే చేశాడు. 2️⃣0️⃣1️⃣* runs9️⃣7️⃣ balls2️⃣0️⃣ Sixes1️⃣3️⃣ foursWatch 🎥 highlights of Uttar Pradesh captain Sameer Rizvi's record-breaking fastest double century in Men's U23 State A Trophy, against Arunachal Pradesh in Vadodara 🔥#U23StateATrophy | @IDFCFIRSTBank pic.twitter.com/WiNI57Tii6— BCCI Domestic (@BCCIdomestic) December 21, 2024 -
'ధోని లాంటి కెప్టెన్‌ను నేను ఎప్పుడూ చూడలేదు.. అతడొక లెజెండ్'
మహేంద్ర సింగ్ ధోని.. భారత అభిమానులందరూ ఆరాధించే క్రికెటర్లలో ఒకడు. అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికి నాలుగేళ్లు అవుతున్నప్పటికి.. ఈ టీమిండియా లెజెండ్‌పై అభిమానం ఇసుమంత కూడా తగ్గలేదు. ఏడాదికి ఓ సారి ఐపీఎల్లో ఆడే తలైవా కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లుతో ఎదురుచూస్తుంటారు.ఇప్పుడు మరోసారి ఫ్యాన్స్ అలరించేందుకు మిస్టర్ కూల్ సిద్దమయ్యాడు. ఐపీఎల్-2025లో ధోని చెన్నై సూపర్ కింగ్స్ తరపున అన్క్యాప్డ్ ప్లేయర్‌గా బరిలోకి దిగనున్నాడు. ఈ నేపథ్యంలో ధోనిపై లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా ప్రశంసల వర్షం కురిపించాడు. ధోని అద్బుతమైన కెప్టెన్ అని, అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాని గోయోంకా తెలిపాడు."భారత క్రికెట్ చరిత్రలో ధోని పేరు నిలిచిపోతుంది. ధోని లాంటి నాయకుడిని నేను ఎప్పుడూ చూడలేదు. అతడి ఆలోచిన విధానం, పరిపక్వత గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అతి చిన్న వయస్సులోనే ఎంఎస్ తనను తను తీర్చుదిద్దుకున్న విధానం నిజంగా అద్బుతం.ధోని తన అనుభవంతో ఎంతో మంది యువ క్రికెటర్లను సైతం తీర్చిదిద్దాడు. మతీషా పతిరానానే ఉదాహరణగా తీసుకుండి. పతిరానాను ధోని ఏకంగా మ్యాచ్ విన్నర్‌గా తాయారు చేశాడు. తన ఆటగాళ్లను ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో ధోనికి బాగా తెలుసు.ధోనిని కలిసిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నాను. ఓసారి లక్నో, చెన్నై మ్యాచ్ సందర్భంగా నేను ధోనిని కలిశాను. నాతో 11 ఏళ్ల నా మనవడు కూడా ఉన్నాడు. అతడికి క్రికెట్ అంటే పిచ్చి. ఐదారేళ్ల కిందట ధోనినే నా మనవడికి క్రికెట్ ఆడటం నేర్పించాడు.ఈ సందర్భంగా అతడు ధోనికి కంటిన్యూగా ఏవో ఏవో ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. అందుకు ధోని విసుగు చెందకుండా సమాధానాలు చెబుతూ వచ్చాడు. చివరికి నేనే ధోని దగ్గరకు వెళ్లి అతడిని విడిచిపెట్టేయండి అని చెప్పా. కానీ ధోని మాత్రం నా మనవుడితో సంభాషణను ఆస్వాదిస్తున్నాను చెప్పాడు.దాదాపు అరగంట పాటు అతడితో ముచ్చటించాడు. ఒక పిల్లవాడి కోసం అంత సమయం వెచ్చించిన ధోని నిజంగా గొప్పవాడు. అతడి క్యారక్టెర్ ఇతరులతో మనం ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది. అందుకే అతడు ధోని అయ్యాడు. అతడు ఎప్పుడు లక్నోతో మ్యాచ్ ఆడినా, స్టేడియం మొత్తం ఎంఎస్‌కి సపోర్ట్‌గా పసుపు రంగు జెర్సీలతో నిండిపోతుంది" అని టీఆర్ఎస్ పోడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోయెంకా పేర్కొన్నాడు.చదవండి: యశస్వి జైస్వాల్‌పై రోహిత్ శర్మ ఆగ్రహం.. ఆఖరికి యువ ఓపెనర్ లేకుండానే.. -
అందుకే ఐపీఎల్‌కు దూరంగా ఉన్నాను: స్టోక్స్
క్రైస్ట్‌చర్చ్: జాతీయ జట్టు తరఫున సాధ్యమైనంత ఎక్కువ కాలం ఆడాలని తాను కోరుకుంటున్నానని... ఈ క్రమంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లాంటి ఇతర టోర్నీలకు దూరంగా ఉంటున్నానని ఇంగ్లండ్ టెస్టు కెపె్టన్ బెన్ స్టోక్స్ అన్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలం కోసం తన పేరును నమోదు చేసుకోకుండా స్టోక్స్ ముందే తప్పుకున్నాడు. గతంలో పుణే, చెన్నై, రాజస్తాన్ జట్ల తరఫున ఆడిన స్టోక్స్‌కు లీగ్‌లో మంచి విలువే పలికింది. అయితే ప్రస్తుత స్థితిలో ఇంగ్లండ్ జట్టు తరఫున కెరీర్‌ను పొడిగించుకోవడమే తన ప్రథమ ప్రాధాన్యత అని అతను స్పష్టం చేశాడు. ఐపీఎల్ తాజా నిబంధన ప్రకారం 2026 వరకు కూడా అతని లీగ్‌లో ఆడే అవకాశం లేదు. ‘నా కెరీర్లో ఇప్పుడు చివరి దశకు చేరుకుంటున్నాననేది వాస్తవం. సాధ్యమైనంత ఎక్కువ కాలం ఆడేందుకు నేను ప్రయత్నిస్తా. నా ఫిట్నెస్ను చూసుకోవడం కూడా చాలా కీలకం. ఈ దశలో ఎప్పుడు ఆడాలనే అంశంపై నా ప్రాధాన్యతలు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. కెరీర్ పొడిగించుకోవాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి. వేర్వేరు చోట్ల వరుసగా క్రికెట్ సాగుతున్న ప్రస్తుత దశలో ఇంగ్లండ్ తరఫున ఎక్కువ కాలం ఆడాలనేది నా కోరిక. అందుకే ఐపీఎల్ నుంచి తప్పుకున్నా’ అని స్టోక్స్ వెల్లడించాడు. సుదీర్ఘ మోకాలి గాయం నుంచి ఇటీవలే కోలుకొని మళ్లీ బరిలోకి దిగిన స్టోక్స్‌కు అక్టోబర్ 2026 వరకు ఇంగ్లండ్ బోర్డు కాంట్రాక్ట్ ఉంది. నేటి నుంచి న్యూజిలాండ్‌తో జరిగే మూడు టెస్టుల సిరీస్‌లో జట్టుకు సారథ్యం వహిస్తున్న స్టోక్స్‌కు వచ్చే ఏడాది స్వదేశంలో భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్, ఆపై యాషెస్ సిరీస్ కీలకం కానున్నాయి. గత ఏడాది వరల్డ్ కప్ తర్వాత వన్డేలకు దూరంగా ఉంటున్న స్టోక్స్ త్వరలో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో మళ్లీ వన్డేలు ఆడే అవకాశం ఉంది. -
ఐపీఎల్ ఆటగాళ్ల ‘వేలం'లో మెరిసిన ఆ చిన్నది ఎవరు?
ఐపీఎల్ ఆటగాళ్ల ‘వేలం’ ముగిసింది. వేలంలో పాల్గొన్న 10 ఫ్రాంచైజీలూ కలిపి ఆటగాళ్ల కోసం రు. 639 కోట్లకు పైగా ఖర్చుపెట్టాయి. మరోవైపు – ఆది, సోమవారాల్లో తొలిరోజు పాట జరుగుతున్నంత సేపూ.. కోటి రూపాయల ప్రశ్న ఒకటి ఇంటర్నెట్ను పల్టీలు కొట్టిస్తూనే ఉంది. ‘‘ఆమె ఎవరు? ఆమె పేరేంటి?’’ – ఇదీ ఆ ప్రశ్న. ‘‘ఆమె జాహ్నవీ మెహతా. కోల్‌కతా నైట్ రైడర్స్’’ – ఇదీ జవాబు. ‘‘జాహ్నవీ మెహతానా! సో క్యూట్’’ – ఒకరు.‘దేవుడా! ఏమిటి ఇంతందం!!’’ – ఇంకొకరు. ఆట ముగిసినా కూడా, ‘‘ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు?’’ అంటూ కొన్ని గంటల పాటు నెట్లో ఆమె కోసం వేట’ సాగుతూనే ఉంది. అందమే కాదు, అందాన్ని మించిన తెలివితేటలు ఉన్న అమ్మాయి జాహ్నవి మెహతా. డాటర్ ఆఫ్ జూహీ చావ్లా. అవునా! అక్కడేం పని ఈ అమ్మాయికి! అక్కడే మరి పని! కోల్‌కతా నైట్ రైడర్స్‌కి కో–ఓనర్ జూహి చావ్లా. టైమ్‌కి ఆమె వేలం పాటకు చేరుకోలేకపోయారు. ‘‘ఇదుగో వస్తున్నా..’’ అంటూ జెడ్డా ఫ్లయిట్ నుంచి వీడియో పంపారు. ఆమె వచ్చేలోపు పాట మొదలైందో, లేక ‘‘నువ్వేశాడు’’ అని అంతటి బాధ్యతను కూతురిపై ఉంచారో.. తల్లికి బదులుగా జాహ్నవి వేలం పాటలో పాల్గొంది. 21 మంది ఆటగాళ్లను దక్కించుకుంది. వాళ్లకు పెట్టిన ఖర్చుపోగా, ఇంకో ఐదు లక్షలు మిగిల్చింది కూడా!జాహ్నవి సోషల్ మీడియాలో కనిపించటం అరుదు. ఆమెకొక ‘పబ్లిక్ ఇన్‌స్ట్రాగామ్ పేజ్’ ఉంది కానీ, అందులో 2022 తర్వాత ఒక్క పోస్టు కూడా ఆమె పెట్టలేదు. అయితే ఆ ఏడాది ఐపీఎల్ వేలంలో మాత్రం షారుక్ ఖాన్ కూతురు సుహానా, కొడుకు ఆర్యన్లతో కలిసి తొలిసారి కనిపించింది. తల్లి తరఫున జాహ్నవి, షారుక్ తరఫున సుహానా, ఆర్యన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కె.కె.ఆర్) వేలంలో కూర్చున్నారు. (షారుఖ్ కూడా కె.కె.ఆర్కి ఒక కో ఫౌండర్). ఆ తర్వాత జాహ్నవి బాహ్య ప్రపంచానికి కనిపించటం మళ్లీ ఇప్పుడే! గత ఏడాదే ఆమె కొలంబియా యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అప్పుడు కూడా ఆమె సోషల్ మీడియాలోకి రాలేదు. జూహీ చావ్లానే గ్రాడ్యుయేషన్ గౌన్‌లో ఉన్న తన కూతురి కాన్వొకేషన్ ఫొటోను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసి, ‘కొలంబియా క్లాస్ 2023’ అని కాప్షన్ పెట్టి తన మురిపెం తీర్చుకున్నారు. జాహ్నవి స్కూల్ చదువు కూడా ఇంగ్లండ్‌లోనే అక్కడి చాటర్ హౌస్ స్కూల్లో సాగింది. అంతకుముందు ముంబైలోని ధీరూబాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివింది. తల్లి పోస్ట్ చేసిన ఫొటోలో గ్రాడ్యుయేషన్ గౌన్‌లో జాహ్నవిని అప్పుడు పెద్దగా ఎవరూ పట్టించుకున్నట్లు లేదు. ఇప్పుడు మాత్రం తల్లి తరఫున ఐపీఎల్ ఆక్షన్‌లో డార్క్ బ్లూ వెల్వెట్ జాకెట్, వైట్ టీ షర్టుతో కనిపించిన జాహ్నవిని చూసి ‘‘ఎవరబ్బా ఈ అమ్మాయి?!’’ అని ఆరాలు తీశారు. ఎవరో తెలిశాక, ‘‘తల్లి పోలికలు ఎక్కడికిపోతాయి?’’ అని ఒకప్పటి మిస్ ఇండియా, బాలీవుడ్ అందాల నటి అయిన జూహీ చావ్లాను కూడా ఆరాధనగా ట్యాగ్ చేశారు. ‘అందం ఒక్కటేనా తల్లి పోలిక? ఆ తెలివి మాత్రం!’ అన్నట్లు ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీ విజేత ఎవరో గుర్తుంది కదా. కోల్‌కతా నైట్ రైడర్స్. (చదవండి: -
IPL 2025 Teams: ముగిసిన ఐపీఎల్ మెగా వేలం
-
ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన సిక్కోలు తేజం.. ఇదో సువర్ణావకాశం
కేఎల్ రాహుల్ క్లాసిక్ షాట్లను దగ్గరుండి చూడొచ్చు. మిచెల్ స్టార్క్ బులెట్ యార్కర్ల గుట్టు తెలుసుకోవచ్చు. హ్యారీ బ్రూక్ పరుగుల దాహం వెనుక రహస్యం తెలుసుకోవచ్చు. ఫాఫ్ డూప్లెసిస్ అనుభవాలను తెలుసుకుని పునాదులు పటిష్టం చేసుకోవచ్చు. జిల్లా స్టార్ క్రికెటర్ త్రిపురాన విజయ్‌కు బంగారం లాంటి అవకాశం తలుపు తట్టింది. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి అడుగుపెట్టబోతున్న విజయ్‌కు అనుభవజు్ఞల ఆటతీరు మార్గదర్శకం కాబోతోంది. టీమిండియాలోకి ప్రవేశించేందుకు ఇది తొలి అడుగు కానుంది. శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా స్టార్ క్రికెటర్ త్రిపురాన విజయ్ ఐపీఎల్లో అడుగుపెట్టబోతున్నాడు. రూ.30 లక్షల బేస్ ప్రైజ్‌తో రిజిస్టర్ చేసుకున్న విజయ్ను ఢిల్లీ డేర్ క్యాపిటల్స్ జట్టు అదే ధరకు కొనుగోలు చేసింది. సౌదీ అరేబియాలో ఈ ఐపీఎల్ వేలం జరిగింది. వేలంలో డీసీ జట్టు కొనుగోలు చేసిందని తెలిశాక క్రికెట్ తల్లిదండ్రులు, జిల్లా క్రికెట్ సంఘ పెద్దలు పట్టరాని సంతోషం వ్యక్తం చేశారు. మూడేళ్లుగా నిలకడగా రాణింపు.. విజయ్ పదేళ్లుగా క్రికెట్ ఆడుతున్నా.. గత మూడే ళ్లుగా నిలకడ చూపిస్తున్నాడు. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి వచ్చిన పిలుపు మేరకు సెలెక్షన్స్ ట్రయల్స్‌లో కూడా పాల్గొన్నాడు. కుచ్‌బిహార్ ట్రోఫీ, విజయ్‌హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ ఆలీ క్రికెట్ టోరీ్నలు, రంజీల్లో రాణించడంతో బీసీసీఐ పెద్దల దృష్టిని ఆకర్షించడంతో ఐపీఎల్ ఎంపిక కచ్చితంగా జరుగుతుందని తల్లిదండ్రులతోపాటు జిల్లా క్రికెట్ సంఘ పెద్దలు ఆశించారు. వారి ఆశలు నిజమయ్యాయి.శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక క్రికెటర్ ఐపీఎల్‌కు చేరువ కావడం గర్వంగా ఉందని జిల్లా క్రికెట్ సంఘ అధ్యక్షులు పెద్దలు పుల్లెల శాస్త్రి, కార్యదర్శి హసన్‌రాజా, మెంటార్ ఇలియాస్ మహ్మద్, కోశాధికారి మదీనా శైలానీ సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాదికి మరో ముగ్గురు నలుగురు క్రికెటర్లను తయారుచేస్తామని వారు చెబుతున్నారు. జిల్లా నుంచి ఒకే ఒక్కడు..జిల్లా నుంచి ఐపీఎల్ వరకు వెళ్లిన మొదటి క్రికెటర్‌గా త్రిపురాన విజయ్ గుర్తింపు అందుకున్నాడు. టెక్కలిలోని అయ్యప్పనగర్‌లో నివాసం ఉంటున్న త్రిపురాన వెంకటకృష్ణరాజు, లావణ్యలు విజయ్ తల్లిదండ్రులు. తండ్రి సమాచారశాఖలో ఉద్యోగిగా పనిచేస్తుండగా తల్లి గృహిణి. ప్రస్తుతం విజయ్ టెక్కలిలోని ఓ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. పాఠశాల దశలో క్రికెట్‌పైన మక్కువతో త్రిపురాన విజయ్ 2013–14లో అరంగ్రేటం చేశాడు. అంతర్ జిల్లాల నార్త్‌జోన్ అండర్–14 జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఉత్తమ ప్రదర్శనతో రాణించడంతో కడప క్రికెట్ అకాడమీకి ఎంపికయ్యాడు. ముఖ్యంగా టాపార్డర్ బ్యాటింగ్‌తోపాటు ఆఫ్‌స్పిన్ మ్యాజిక్‌తో విశేషంగా ఆకట్టుకుంటూ వస్తున్నాడు. ట్రాక్ రికార్డ్2022–23, 2024–25 రెండు సీజన్లలో ప్రతిష్టాత్మక రంజీ పోటీల్లో పాల్గొనే ఆంధ్రా పురుషుల జట్టుకు ఎంపికయ్యాడు. అండర్–19 విభాగంలో ఏసీఏ నార్త్‌జోన్ పోటీల్లో 6 మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు తీయడంతోపాటు 265 పరుగులు సాధించి ఉత్తమ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. అంతర్ రాష్ట్ర అండర్–25 వన్డే క్రికెట్ టో రీ్నలో హైదరాబాద్‌పై జరిగిన మ్యాచ్‌లో 4.4 ఓవర్లలో కేవలం 14 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి సెలెక్టర్లను ఆకర్షించాడు. 2021–22లో అంతర్రాష్ట్ర అండర్–23 క్రికెట్ టోరీ్నలో మెరుగ్గా రాణించడంతో బీసీసీఐ నిర్వహిస్తున్న బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీకి ఎంపికై శిక్షణ పొందారు. ఆంధ్ర ప్రీమియం లీగ్(ఏపీఎల్) టీ–20 క్రికెట్ పోటీల్లో మూడు సీజన్లలోనూ రాణించా డు. రాయలసీమ కింగ్స్‌పై జరిగిన మ్యాచ్‌లో 25 బంతుల్లో 63 పరుగులు సాధించి అజేయంగా నిలిచి విశేషంగా ఆకట్టుకున్నాడు. బౌలింగ్లోను సత్తాచాచడంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నారు. ఏపీఎల్ టీ–20 క్రికెట్ మ్యాచ్‌ల్లో బెస్ట్ ఫీల్డర్‌గా మరో రూ.50వేల నగదు బహుమతిని ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ చేతులమీదుగా అందుకున్నాడు. గత సీజన్లో నాగ్‌పూర్‌లో జరిగిన విదర్భపై తన మొదటి మ్యాచ్‌లోనే నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు. తాజాగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీశాడు.చాలా సంతోషంగా ఉంది మా కుమారుడు విజయ్ ఐపీఎల్‌కు ఎంపిక కావడం నిజంగా సంతోషంగా ఉంది. తల్లిదండ్రులుగా మేము గర్వపడుతున్నాం. ఐపీఎల్లో మ్యాచ్‌లు ఆడే అవకాశం వస్తే తన ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. గత దశాబ్ద కాలంగా క్రికెట్టే శ్వాసగా ఉంటున్నాడు. భగవంతుడు శ్రమకు తగిన ఫలితాన్ని అందించాడని నమ్ముతున్నాం. –వెంకట కృష్ణంరాజు, లావణ్య త్రిపురాన విజయ్ తల్లిదండ్రులుచాలా గర్వంగా ఉంది.. చాలా గర్వంగా, చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఐపీఎల్‌కు ఎంపిక కావాలన్న నా కల సాకారమైంది. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ సెలక్షన్ ట్రయల్స్ పాల్గొన్నప్పుడే నమ్మకం కలిగింది. నా బేస్ ప్రైస్ రూ.30లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యానికి, ప్రతినిధులకు థాంక్స్ చెప్పుకుంటున్నాను. అవకాశం లభించిన మ్యాచుల్లో సత్తా చాటేందుకు ప్రయతి్నస్తాను. ఈ నాలుగు నెలలపాటు కఠోర సాధన చేస్తాను. నన్ను నిరంతరం ప్రోత్సహిస్తున్న నా తల్లిదండ్రులకు, జిల్లా క్రికెట్ సంఘం, ఆంధ్రా క్రికెట్ సంఘ పెద్దలకు కృతజ్ఞతలు. త్రిపురాన విజయ్ -
IPL 2025: ఏ ఫ్రాంచైజీలో ఎవరెవరు..?
ఐపీఎల్ 2025కి సంబంధించి రిటెన్షన్ మరియు వేలం ప్రక్రియ ముగిసింది. సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో రెండు రోజుల పాటు సాగిన మెగా వేలం నిన్నటితో (నవంబర్ 25) సమాప్తమైంది. మెగా టోర్నీ వచ్చే ఏడాది మార్చి 14 నుంచి ప్రారంభం కానుంది. ఏ జట్టులో ఎంత మంది..?రిటెయిన్ చేసుకున్న వారితో కలిపి మొత్తం 25 ఆటగాళ్ల గరిష్ట కోటాను చెన్నై సూపర్‌కింగ్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ పూర్తి చేసుకోగా... లక్నో సూపర్ జెయింట్స్ (24), ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ (23), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (22), డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (21), రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (20) అంతకంటే తక్కువ మందితో సరిపెట్టాయి.ఏ ఫ్రాంచైజీలో ఎవరెవరు..? సీఎస్కేరుతురాజ్ గైక్వాడ్ (రీటెయిన్డ్, 18 కోట్లు)ఎంఎస్ ధోని (రీటెయిన్డ్, 4 కోట్లు)మతీశ పతిరణ (రీటెయిన్డ్, 13 కోట్లు)శివమ్ దూబే (రీటెయిన్డ్, 12 కోట్లు)రవీంద్ర జడేజా (రీటెయిన్డ్, 18 కోట్లు)నూర్ అహ్మద్ (10 కోట్లు)రవిచంద్రన్ అశ్విన్ (9.75 కోట్లు)డెవాన్ కాన్వే (6.25 కోట్లు)ఖలీల్ అహ్మద్ (4.8 కోట్లు)రచిన్ రవీంద్ర (4 కోట్లు, RTM)అన్షుల్ కంబోజ్ (3.4 కోట్లు)రాహుల్ త్రిపాఠి (3.4 కోట్లు)సామ్ కర్రన్ (2.4 కోట్లు)గుర్జప్నీత్ సింగ్ (2.2 కోట్లు)నాథన్ ఇల్లిస్ (2 కోట్లు)దీపక్ హుడా (1.7 కోట్లు)జేమీ ఓవర్టన్ (1.5 కోట్లు)విజయ్ శంకర్ (1.2 కోట్లు)వన్ష్ బేడీ (55 లక్షలు)ఆండ్రే సిద్దార్థ్ (30 లక్షలు)శ్రేయస్ గోపాల్ (30 లక్షలు)రామకృష్ణ ఘోష్ (30 లక్షలు)కమలేశ్ నాగర్కోటి (30 లక్షలు)ముకేశ్ చౌదరీ (30 లక్షలు)షేక్ రషీద్ (30 లక్షలు)ఢిల్లీ క్యాపిటల్స్అక్షర్ పటేల్ (రీటెయిన్డ్, 16.5 కోట్లు)కుల్దీప్ యాదవ్ (రీటెయిన్డ్, 13.25 కోట్లు)ట్రిస్టన్ స్టబ్స్ (రీటెయిన్డ్, 10 కోట్లు)అభిషేక్ పోరెల్ (రీటెయిన్డ్, 4 కోట్లు)కేఎల్ రాహుల్ (14 కోట్లు)మిచెల్ స్టార్క్ (11.75 కోట్లు)టి నటరాజన్ (10.75 కోట్లు)జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (9 కోట్లు, RTM)ముకేశ్ కుమార్ (8 కోట్లు, RTM)హ్యారీ బ్రూక్(6.25 కోట్లు)అషుతోశ్ శర్మ (3.8 కోట్లు)మోహిత్ శర్మ (2.2 కోట్లు)ఫాఫ్ డుప్లెసిస్ (2 కోట్లు)సమీర్ రిజ్వి (95 లక్షలు)డొనొవన్ ఫెరియెరా (75 లక్షలు)దుష్మంత చమీరా (75 లక్షలు)విప్రాజ్ నిగమ్ (50 లక్షలు)కరుణ్ నాయర్ (50 లక్షలు)మాథవ్ తివారి (50 లక్షలు)త్రిపురణ విజయ్ (30 లక్షలు)మాన్వంత్ కుమార్ (30 లక్షలు)అజయ్ మండల్ (30 లక్షలు)దర్శన్ నల్కండే (30 లక్షలు)గుజరాత్ టైటాన్స్శుభ్మన్ గిల్ (రీటెయిన్డ్, 16.5 కోట్లు)రషీద్ ఖాన్ (రీటెయిన్డ్, 18 కోట్లు)సాయి సుదర్శన్ (రీటెయిన్డ్, 8.5 కోట్లు)రాహుల్ తెవాటియా (రీటెయిన్డ్, 4 కోట్లు)షారుఖ్ ఖాన్ (రీటెయిన్డ్, 4 కోట్లు)జోస్ బట్లర్ (15.75 కోట్లు)మొహమ్మద్ సిరాజ్ (12.25 కోట్లు)కగిసో రబాడ (10.75 కోట్లు)ప్రసిద్ద్ కృష్ణ (9.5 కోట్లు)వాషింగ్టన్ సుందర్ (3.2 కోట్లు)షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (2.6 కోట్లు)గెరాల్డ్ కొయెట్జీ (2.4 కోట్లు)గ్లెన్ ఫిలిప్స్ (2 కోట్లు)సాయి కిషోర్ (2 కోట్లు, RTM)మహిపాల్ లోమ్రార్ (1.7 కోట్లు)గుర్నూర్ సింగ్ బ్రార్ (1.3 కోట్లు)అర్షద్ ఖాన్ (1.3 కోట్లు)కరీమ్ జనత్ (75 లక్షలు)జయంత్ యాదవ్ (75 లక్షలు)ఇషాంత్ శర్మ (75 లక్షలు)కుమార్ కుషాగ్రా (65 లక్షలు)మానవ్ సుతార్ (30 లక్షలు)కుల్వంత్ కేజ్రోలియా (30 లక్షలు)అనూజ్ రావత్ (30 లక్షలు)నిషాంత్ సింధు (30 లక్షలు)కేకేఆర్రింకూ సింగ్ (రీటెయిన్డ్, 13 కోట్లు)వరుణ్ చక్రవర్తి (రీటెయిన్డ్, 12 కోట్లు)సునీల్ నరైన్ (రీటెయిన్డ్, 12 కోట్లు)ఆండ్రీ రసెల్ (రీటెయిన్డ్, 12 కోట్లు)హర్షిత్ రాణా (రీటెయిన్డ్, 4 కోట్లు)రమన్‌దీప్ సింగ్ (రీటెయిన్డ్, 4 కోట్లు)వెంకటేశ్ అయ్యర్ (23.75 కోట్లు)అన్రిచ్ నోర్జే (6.50 కోట్లు)క్వింటన్ డికాక్ (3.60 కోట్లు)అంగ్క్రిష్ రఘువంశీ (3 కోట్లు)స్పెన్సర్ జాన్సన్ (2.8 కోట్లు)మొయిన్ అలీ (2 కోట్లు)రహ్మానుల్లా గుర్బాజ్ (2 కోట్లు)వైభవ్ అరోరా (1.80 కోట్లు)అజింక్య రహానే (1.5 కోట్లు)రోవ్‌మన్ పావెల్ (1.5 కోట్లు)ఉమ్రాన్ మాలిక్(75 లక్షలు)మనీశ్ పాండే (75 లక్షలు)అనుకూల్ రాయ్ (40 లక్షలు)లవ్నిత్ సిసోడియా (30 లక్షలు)మయాంక్ మార్కండే (30 లక్షలు)లక్నో సూపర్ జెయింట్స్నికోలస్ పూరన్ (రీటెయిన్డ్, 21 కోట్లు)రవి బిష్ణోయ్ (రీటెయిన్డ్, 21 కోట్లు)మయాంక్ యాదవ్ (రీటెయిన్డ్, 11 కోట్లు)మొహిసిన్ ఖాన్ (రీటెయిన్డ్, 4 కోట్లు)ఆయుశ్ బదోని (రీటెయిన్డ్, 4 కోట్లు)రిషబ్ పంత్ (27 కోట్లు)ఆవేశ్ ఖాన్ (9.75 కోట్లు)ఆకాశ్‌దీప్ (8 కోట్లు)డేవిడ్ మిల్లర్ (7.5 కోట్లు)అబ్దుల్ సమద్ (4.2 కోట్లు)మిచెల్ మార్ష్ (3.4 కోట్లు)షాబాజ్ అహ్మద్ (2.4 కోట్లు)ఎయిడెన్ మార్క్రమ్ (2 కోట్లు)మాథ్యూ బ్రీట్జ్కీ (75 లక్షలు)షమార్ జోసఫ్ (75 లక్షలు, RTM)ఎం సిద్దార్థ్ (75 లక్షలు)అర్శిన్ కులకర్ణి (30 లక్షలు)రాజవర్దన్ హంగార్గేకర్ (30 లక్షలు)యువరాజ్ చౌదరీ (30 లక్షలు)ప్రిన్స్ యాదవ్ (30 లక్షలు)ఆకాశ్ సింగ్ (30 లక్షలు)దిగ్వేశ్ సింగ్ (30 లక్షలు)హిమ్మత్ సింగ్ (30 లక్షలు)ఆర్యన్ జుయల్ (30 లక్షలు)ముంబై ఇండియన్స్జస్ప్రీత్ బుమ్రా (రీటెయిన్డ్, 18 కోట్లు)సూర్యకుమార్ యాదవ్ (రీటెయిన్డ్, 16.35 కోట్లు)హార్దిక్ పాండ్యా (రీటెయిన్డ్, 16.35 కోట్లు)రోహిత్ శర్మ (రీటెయిన్డ్, 16.30 కోట్లు)తిలక్ వర్మ (రీటెయిన్డ్, 8 కోట్లు)ట్రెంట్ బౌల్ట్ (12.50 కోట్లు)దీపక్ చాహర్ (9.25 కోట్లు)విల్ జాక్స్ (5.25 కోట్లు)నమన్ ధిర్ (5.25 కోట్లు, RTM)అల్లా ఘజన్ఫర్ (4.8 కోట్లు)మిచెల్ సాంట్నర్ (2 కోట్లు)ర్యాన్ రికెల్టన్ (1 కోటీ)లిజాడ్ విలియమ్స్ (75 లక్షలు)రీస్ టాప్లే (75 లక్షలు)రాబిన్ మింజ్ (65 లక్షలు)కర్ణ్ శర్మ (50 లక్షలు)విజ్ఞేశ్ పుథుర్ (30 లక్షలు)అర్జున్ టెండూల్కర్ (30 లక్షలు)బెవాన్ జాన్ జాకబ్స్ (30 లక్షలు)వెంకట సత్యనారాయణ పెన్మత్స (30 లక్షలు)రాజ్ అంగద్ బవా (30 లక్షలు)శ్రీజిత్ కృష్ణణ్ (30 లక్షలు)అశ్వనీ కుమార్ (30 లక్షలు)పంజాబ్ కింగ్స్శశాంక్ సింగ్ (రీటెయిన్డ్, 5.5 కోట్లు)ప్రభ్‌సిమ్రన్ సింగ్ (రీటెయిన్డ్, 4 కోట్లు)శ్రేయస్ అయ్యర్(26.75 కోట్లు)యుజ్వేంద్ర చహల్(18 కోట్లు)అర్షదీప్ సింగ్ (18 కోట్లు, RTM)మార్కస్ స్టోయినిస్ (11 కోట్లు)మార్కో జన్సెన్ (7 కోట్లు)నేహల్ వధేరా (4.2 కోట్లు)గ్లెన్ మ్యాక్స్‌వెల్ (4.2 కోట్లు)ప్రియాన్శ్ ఆర్య (3.8 కోట్లు)జోస్ ఇంగ్లిస్ (2.6 కోట్లు)అజ్మతుల్లా ఒమర్జాయ్ (2.4 కోట్లు)లోకీ ఫెర్గూసన్ (2 కోట్లు)విజయ్‌కుమార్ వైశాఖ్ (1.8 కోట్లు)యశ్ ఠాకర్ (1.60 కోట్లు)హర్‌ప్రీత్ బ్రార్ (1.5 కోట్లు)ఆరోన్ హార్డీ (1.25 కోట్లు)విష్ణు వినోద్ (95 లక్షలు)జేవియర్ బార్ట్లెట్ (80 లక్షలు)కుల్దీప్ సేన్ (80 లక్షలు)ప్రవిణ్ దూబే (30 లక్షలు)పైలా అవినాశ్ (30 లక్షలు)సూర్యాంశ్ షెడ్గే (30 లక్షలు)ముషీర్ ఖాన్ (30 లక్షలు)హర్నూర్ పన్నూ (30 లక్షలు)రాజస్థాన్ రాయల్స్సంజూ శాంసన్ (రీటెయిన్డ్, 18 కోట్లు)యశస్వి జైస్వాల్ (రీటెయిన్డ్, 18 కోట్లు)రియాన్ పరాగ్ (రీటెయిన్డ్. 14 కోట్లు)ధృవ్ జురెల్ (రీటెయిన్డ్, 14 కోట్లు)షిమ్రోన్ హెట్‌మైర్ (రీటెయిన్డ్, 11 కోట్లు)సందీప్ శర్మ (రీటెయిన్డ్, 4 కోట్లు)జోఫ్రా ఆర్చర్ (12.50 కోట్లు)తుషార్ దేశ్‌పాండే (6.5 కోట్లు)వనిందు హసరంగ (5.25 కోట్లు)మహీశ్ తీక్షణ (4.40 కోట్లు)నితీశ్ రాణా (4.2 కోట్లు)ఫజల్ హక్ ఫారూకీ (2 కోట్లు)క్వేనా మపాకా (1.5 కోట్లు)ఆకాశ్ మధ్వాల్ (1.20 కోట్లు)వైభవ్ సూర్యవంశీ (1.1 కోట్లు)శుభమ్ దూబే (80 లక్షలు)యుద్ద్‌వీర్ చరక్ (35 లక్షలు)ఆశోక్ శర్మ (30 లక్షలు)కునాల్ రాథోడ్ (30 లక్షలు)కుమార్ కార్తీకేయ (30 లక్షలు)ఆర్సీబీవిరాట్ కోహ్లి (రీటెయిన్డ్, 21 కోట్లు)రజత్ పాటిదార్ (రీటెయిన్డ్, 11 కోట్లు)యశ్ దయాల్ (రీటెయిన్డ్, 5 కోట్లు)జోష్ హాజిల్‌వుడ్ (12.50 కోట్లు)ఫిల్ సాల్ట్ (11.50 కోట్లు)జితేశ్ శర్మ (11 కోట్లు)భువనేశ్వర్ కుమార్ (10.75 కోట్లు)లియామ్ లివింగ్‌స్టోన్ (8.75 కోట్లు)రసిఖ్ దార్ (6 కోట్లు)కృనాల్ పాండ్యా (5.75 కోట్లు)టిమ్ డేవిడ్ (3 కోట్లు)జేకబ్ బేతెల్ (2.6 కోట్లు)సుయాశ్ శర్మ (2.6 కోట్లు)దేవ్‌దత్ పడిక్కల్ (2 కోట్లు)నువాన్ తుషార (1.6 కోట్లు)రొమారియో షెపర్డ్ (1.5 కోట్లు)లుంగి ఎంగిడి (1 కోటీ)స్వప్నిల్ సింగ్ (50 లక్షలు, RTM)మోహిత్ రతీ (30 లక్షలు)అభినందన్ సింగ్ (30 లక్షలు)స్వస్తిక్ చికార (30 లక్షలు)మనోజ్ భాంగడే (30 లక్షలు)సన్‌రైజర్స్ హైదరాబాద్పాట్ కమిన్స్ (రీటెయిన్డ్, 18 కోట్లు)అభిషేక్ శర్మ (రీటెయిన్డ్, 14 కోట్లు)నితీశ్ కుమార్ రెడ్డి (రీటెయిన్డ్, 6 కోట్లు)హెన్రిచ్ క్లాసెన్ (రీటెయిన్డ్, 23 కోట్లు)ట్రవిస్ హెడ్ (రీటెయిన్డ్, 14 కోట్లు)ఇషాన్ కిషన్ (11.25 కోట్లు)మొహమ్మద్ షమీ (10 కోట్లు)హర్షల్ పటేల్ (8 కోట్లు)అభినవ్ మనోహర్ (3.20కోట్లు)రాహుల్ చాహల్ (3.20 కోట్లు)ఆడమ్ జంపా (2.40 కోట్లు)సిమ్రన్‌జీత్ సింగ్ (1.50 కోట్లు)ఎస్హాన్ మలింగ (1.2 కోట్లు)బ్రైడన్ కార్స్ (1 కోటీ)జయదేవ్ ఉనద్కత్ (1 కోటీ)కమిందు మెండిస్ (75 లక్షలు)జీషన్ అన్సారీ (40 లక్షలు)సచిన్ బేబి (30 లక్షలు)అనికేత్ వర్మ (30 లక్షలు)అథర్వ తైడే (30 లక్షలు) -
ఐపీఎల్ మెగా వేలం-2025: ఎవరీ మల్లికా సాగర్? (ఫొటోలు)
-
AP: ఐపీఎల్ రేసులో చిన్నదోర్నాల మనీష్‌రెడ్డి
పెద్దదోర్నాల: ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులను ఉర్రూతలూగించే ఐపీఎల్ రేసులో పెద్దదోర్నాల మండలంలోని చిన్నదోర్నాల గ్రామానికి చెందిన గొలమారు మనీష్‌రెడ్డి ఉన్నారు. గొలమారు ఉమామహేశ్వరరెడ్డి కుటుంబం వ్యాపార రీత్యా విశాఖపట్నంలో స్థిరపడింది. ఉమామహేశ్వరరెడ్డి తండ్రి గొలమారు పెద్దతాతిరెడ్డి గతంలో శ్రీశైల పుణ్యక్షేత్రంలోని అఖిల భారత రెడ్ల సత్రం ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు నిర్వర్తించారు. ఉమామహేశ్వరరెడ్డి పెద్ద కుమారుడు మనీష్‌రెడ్డి చిన్ననాటి నుంచి క్రికెట్‌పై ఆసక్తి పెంచుకుని, ఆంఽధ్ర తరఫున రంజీ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వేలానికి సిద్ధమయ్యారు. రూ.30 లక్షల బేస్ ప్రైజ్‌తో ఐపీఎల్ వేలం రిజిస్టర్ చేసుకున్నారు. పలు ఐపీఎల్ జట్లు కొత్త కుర్రాళ్ల వైపు దృష్టి సారిస్తున్న నేపథ్యంలో మనీష్‌రెడ్డికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని క్రీడాభిమానులు భావిస్తున్నారు. కాగా సోమవారం కూడా నిర్వహించనున్న ఐపీఎల్ వేలంలో మనీష్‌రెడ్డికి అవకాశం దక్కవచ్చని భావిస్తూ మనీష్‌రెడ్డికి ఆల్ ద బెస్ట్ చెబుతున్నారు. -
వేలంలో భారత క్రికెటర్లకు కాసుల పంట.. తొలి రోజు ఎవరు ఎంత ధర పలికారంటే..?
-
ఐపీఎల్ 2025 స్టార్టింగ్ డేట్ వచ్చేసింది..!
ఐపీఎల్లో రాబోయే మూడు సీజన్లకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ (నవంబర్ 22) విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఫ్రాంఛైజీలు వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 14న (శుక్రవారం) మొదలై మే 25న (ఆదివారం) ముగుస్తుంది. 2026 సీజన్ మార్చి 15న (ఆదివారం) మొదలై మే 31న (ఆదివారం) ముగుస్తుంది. 2027 సీజన్ మార్చి 14న (ఆదివారం) మొదలై మే 30న (ఆదివారం) ముగుస్తుంది. కాగా, గతంలో ఐపీఎల్ షెడ్యూల్‌లను చివరి నిమిషంలో విడుదల చేసే వారు. అయితే ఆ ఆనవాయితీకి బీసీసీఐ స్వస్తి పలికి, ఒకేసారి మూడు సీజన్ల షెడ్యూల్‌ను ప్రకటించింది. అంతర్జాతీయ షెడ్యూల్‌తో ఐపీఎల్ షెడ్యూల్ క్లాష్ కాకుండా ఇది తోడ్పడుతుందని బీసీసీఐ తెలిపింది.మెగా వేలంలో జోఫ్రా ఆర్చర్..ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ 2025 మెగా వేలానికి అందుబాటులో ఉంటాడని బీసీసీఐ తెలిపింది. ఆర్చర్ 2025 సీజన్‌తో పాటు రానున్న మూడు సీజన్లకు అందుబాటులో ఉంటానని ప్రకటించినట్లు తెలుస్తుంది. మెగా వేలంలో ఆర్చర్ 575వ ఆటగాడిగా జాయిన్ అవుతాడు. ఆర్చర్ రూ. 2 కోట్ల బేస్‌ప్రైజ్ విభాగంలో తన పేరును నమోదు చేసుకున్నట్లు తెలుస్తుంది. మెగా వేలంలో ఆర్చర్‌తో పాటు మరో ఇద్దరు కూడా జాయిన్ అయ్యారు. అమెరికాకు చెందిన సౌరభ్ నేత్రావల్కర్, భారత్‌కు చెందిన హార్దిక్ తమోర్ వేలంలో తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. వీరిద్దరు 576, 577 నంబర్ ఆటగాళ్లుగా వేలం బరిలో ఉంటారు. -
ఆ 457 మంది పేర్లు చకచకా...
ముంబై: ఐపీఎల్–2025 సీజన్ కోసం ఈ నెల 24, 25 తేదీల్లో సౌదీ అరేబియా లోని జిద్దా నగరంలో వేలం జరగనుంది. వేలంలో మొత్తం 574 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. అయితే ఇంత మంది పేర్లను ఒక్కొక్కరిగా పిలిచి వేలం ప్రక్రియ కొనసాగించడం చాలా సుదీర్ఘంగా, కష్టతరంగా మారే అవకాశం ఉంది. దాంతో బీసీసీఐ ‘యాక్సిలరేటెడ్ ఆక్షన్’ అంటూ వేలాన్ని వేగంగా ముగించేందుకు సిద్ధమైంది. వేలంలో మొదటి 116 మంది కోసం మాత్రమే ఫ్రాంచైజీలు ముందుగా పోటీ పడతాయి. వరుసగా అంతర్జాతీయ క్రికెట్ ఆడిన మార్క్యూ ప్లేయర్లు, స్పెషలిస్ట్ బ్యాటర్లు, ఆల్‌రౌండర్లు, వికెట్‌కీపర్ బ్యాటర్లు, పేస్ బౌలర్లు, స్పిన్ బౌలర్లు... ఇలా వేలం సాగుతుంది. ఈ వరుసలో చివరగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని అన్క్యాప్డ్ ప్లేయర్లు వస్తారు. వీరి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దాంతో 117 నుంచి 574 నంబర్ వరకు ఉన్న ఆటగాళ్లను ఎంచుకునే విషయంలో ఫ్రాంచైజీలకు ముందే ఒక అవకాశం ఇస్తున్నారు. తాము కోరుకుంటున్న ఆటగాళ్ల పేర్లను తొలి రోజు వేలం ముగిసిన తర్వాత రాత్రి 10 గంటల వరకు అందించాలి. వీరి పేర్లనే వేలంలో ప్రకటిస్తారు. అనంతరం అప్పటి వరకు అమ్ముడుపోని ఆటగాళ్లలో ఇంకా ఎవరినైనా తీసుకోవాలనే ఆలోచన ఉంటే వారి పేర్లను కూడా ఈ ‘యాక్సిలరేటెడ్ ఆక్షన్’లో చెప్పాల్సి ఉంటుంది. దీని వల్ల సమయం ఆదా అవుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు.ఈ జాబితాలో 117వ ఆటగాడిగా ఆంధ్ర క్రికెటర్ రికీ భుయ్ ఉండగా... మిగిలిన వారిలో మొయిన్ అలీ, టిమ్ డేవిడ్, స్పెన్సర్ జాన్సన్, ఉమ్రాన్ మలిక్, ముస్తఫిజుర్, సాంట్నర్, నబీ, స్టీవ్ స్మిత్, సర్ఫరాజ్ ఖాన్, జేమ్స్ అండర్సన్ తదితర గుర్తింపు పొందిన ఆటగాళ్లు ఉన్నారు. ఈ వేలం ప్రక్రియను ప్రముఖ ఆక్షనీర్ మల్లికా సాగర్ నిర్వహించనుంది. గత ఏడాది కూడా ఆమెనే ఆక్షనర్‌గా వ్యవహరించింది. మరోవైపు భారత్, ఆ్రస్టేలియా మధ్య జరిగే పెర్త్ టెస్టు మూడో, నాలుగో రోజుల్లో ఈ వేలం నిర్వహించడంపై కాస్త చర్చ జరిగింది. అయితే సమయం భిన్నంగా ఉండటం వల్ల ఆటగాళ్లు, అభిమానులు కూడా పూర్తి స్థాయిలో వేలం ప్రక్రియను అనుసరించవచ్చు. భారత కాలమానం ప్రకారం టెస్టు ఆట మధ్యాహ్నం గం. 2:50 నిమిషాలకు ముగుస్తుంది. వేలం మధ్యాహ్నం గం. 3:30 నిమిషాలకు ప్రారంభం కానుంది. -
ఐపీఎల్ వేలం కోసం వెటోరి
పెర్త్: ఆ్రస్టేలియా క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ డానియెల్ వెటోరి పెర్త్‌లో భారత్‌తో జరిగే తొలి టెస్టు మధ్యలోనే జట్టును వీడి ఐపీఎల్ మెగా వేలానికి బయలుదేరుతాడు. ఈ న్యూజిలాండ్ బౌలింగ్ దిగ్గజం ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)కు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతో 45 ఏళ్ల వెటోరి సౌదీ అరేబియాలోని రెండో పెద్ద నగరం జిద్దాలో ఈ నెల 24, 25 తేదీల్లో జరిగే వేలంలో పాల్గొంటాడు. ఐదు టెస్టుల ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో తొలి టెస్టు 22 నుంచి పెర్త్‌లో జరుగుతుంది. ‘ఐపీఎల్ ఫ్రాంచైజీకి హెడ్ కోచ్ అయిన వెటోరికి మద్దతిస్తాం. అతను మొదటి టెస్టు సన్నాహానికి చేయాల్సిందంతా (ట్రెయినింగ్) చేసే వేలానికి హాజరవుతాడు. ఇందులో మాకు ఏ ఇబ్బంది లేదు. మెగా వేలం ముగిసిన వెంటనే మళ్లీ మా జట్టుతో కలుస్తాడు’ అని క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) ప్రతినిధి ఒకరు వెల్లడించారు. సీఏ నేషనల్ డెవలప్మెంట్ కోచ్ లాచ్లన్ స్టీవెన్స్... తొలి టెస్టు కోసం వెటోరి పాత్రను భర్తీ చేస్తారని సీఏ తెలిపింది. కివీస్‌కు చెందిన వెటోరి మాత్రమే కాదు... ఆ్రస్టేలియన్ దిగ్గజాలు రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్లు సైతం జిద్దాకు పయనమవుతారు. పాంటింగ్ పంజాబ్ కింగ్స్‌కు, లాంగర్ లక్నో సూపర్ జెయింట్స్‌కు హెడ్ కోచ్‌లుగా ఉన్నారు. దీంతో ‘చానెల్ సెవెన్’లో వ్యాఖ్యాతలు వ్యవహరించనున్న వీళ్లిద్దరు కూడా పెర్త్ టెస్టు మధ్యలోనే మెగా వేలంలో పాల్గొననున్నారు. -
IPL 2025 Mega Auction: ఏ దేశం నుంచి ఎంత మంది పాల్గొంటున్నారంటే..?
ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెద్దా నగరం వేదికగా జరుగనుంది. ఈ మెగా వేలంలో 17 దేశాలకు చెందిన 1574 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు. వీరిలో భారత్‌కు చెందిన 1165 ప్లేయర్లు ఉన్నారు. ఈ 1165 మందిలో 965 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు కాగా.. రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సిరాజ్ లాంటి 48 మంది దేశీయ స్టార్ క్యాప్డ్ ఆటగాళ్లు ఉన్నారు.ఇతర దేశాల ఆటగాళ్ల విషయానికొస్తే.. అసోసియేట్ దేశాలకు చెందిన 30 మందిని కలుపుకుని మొత్తం 409 మంది విదేశీ ఆటగాళ్లు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. విదేశీ ఆటగాళ్లలో అత్యధికంగా సౌతాఫ్రికా (91) నుంచి పేర్లు నమోదు చేసుకున్నారు. విదేశీ ఆటగాళ్లలో బట్లర్, స్టార్క్, మ్యాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, బెయిర్‌స్టో, రబాడ, జోఫ్రా ఆర్చర్ లాంటి స్టార్లు ఉన్నారు.దేశాల వారీగా ఆటగాళ్ల సంఖ్య..ఆఫ్ఘనిస్తాన్- 29ఆస్ట్రేలియా- 76బంగ్లాదేశ్- 13కెనడా- 4ఇంగ్లండ్- 52భారత్- 1165ఐర్లాండ్- 9ఇటలీ- 1నెదర్లాండ్స్- 12న్యూజిలాండ్- 39స్కాట్లాండ్- 2సౌతాఫ్రికా- 91శ్రీలంక- 29యూఏఈ- 1యూఎస్ఏ- 10వెస్టిండీస్- 33జింబాబ్వే- 8ఐపీఎల్ మెగా వేలంలో పేర్లు నమోదు చేసుకున్న ఆటగాళ్ల సంఖ్య- 1574ఖాళీల సంఖ్య- 20470 మంది విదేశీ ఆటగాళ్లకు అవకాశం వేలంలో అన్ని ఫ్రాంచైజీలు ఖర్చు చేయబోయే బడ్జెట్- రూ. 641.5 కోట్లుఏయే ఫ్రాంచైజీ దగ్గర ఎంత పర్స్ బ్యాలెన్స్ ఉంది..?పంజాబ్ కింగ్స్- రూ. 110.5 కోట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్- రూ. 45 కోట్లులక్నో- రూ. 69 కోట్లు కేకేఆర్- రూ. 51 కోట్లు ఢిల్లీ క్యాపిటల్స్- రూ. 73 కోట్లు ఆర్సీబీ- రూ. 83 కోట్లు సీఎస్కే- రూ. 55 కోట్లుముంబై ఇండియన్స్- రూ. 45 కోట్లు గుజరాత్- రూ. 69 కోట్లు రాజస్థాన్ రాయల్స్- రూ. 83 కోట్లు -
IPL 2025: మెగా వేలం వేదిక మార్పు..?
2025 ఐపీఎల్ మెగా వేలానికి ముహూర్తం, వేదిక ఖరారైనట్లు తెలుస్తుంది. తొలుత మెగా వేలాన్ని సౌదీ అరేబియాలోని రియాద్ నగరంలో నిర్వహించాలని అనుకున్నారు. అయితే తాజాగా వేదికను జెద్దా నగరానికి మార్చినట్లు సమాచారం. అబేది అల్ జోహార్ అరీనా (బెంచ్‌మార్క్ అరీనా) మెగా వేలానికి వేదిక కానున్నట్లు ఓ ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ వెల్లడించింది. ఫ్రాంచైజీ ప్రముఖులకు వసతి ఏర్పాట్లను అబేది అల్ జోహార్ అరీనా సమీపంలో గల హోటల్ షాంగ్రీ-లాలో సిద్దం చేసినట్లు తెలుస్తుంది. వేలం తేదీల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేనట్లు తెలుస్తుంది. ముందుగా అనుకున్నట్లుగానే నవంబర్ 24, 25 తేదీల్లో వేలం జరుగనుందని సమాచారం.కాగా, వేలంలో పాల్గొనే 10 ఫ్రాంచైజీలు అక్టోబర్ 31న తమ రిటెన్షన్ జాబితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. అన్ని ఫ్రాంచైజీలు మొత్తంగా 46 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకుని.. వారి కోసం రూ. 550.5 కోట్ల మేర ఖర్చు చేశాయి. ఈ 46 మందిలో 36 మంది భారత క్రికెటర్లే కావడం విశేషం. ఈ సారి మెగా వేలానికి మొత్తం 1574 మంది ప్లేయర్లు రిజిస్టర్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో 1165 మంది భారతీయ ఆటగాళ్లు కాగా.. 409 మంది విదేశీ ఆటగాళ్లని సమాచారం. ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకుని వదిలేసిన ఆటగాళ్ల పూర్తి జాబితా..పంజాబ్ కింగ్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లుశశాంక్ సింగ్- రూ. 5.5 కోట్లుప్రభ్మన్సిమ్రన్ సింగ్- రూ. 4 కోట్లుపంజాబ్ కింగ్స్ వదిలేసిన ఆటగాళ్లుశిఖర్ ధవన్ (కెప్టెన్)రిలీ రొస్సోహర్ప్రీత్ సింగ్ భాటియాశివమ్ సింగ్అధర్వ తైడేఅశుతోష్ శర్మవిశ్వనాథ్ సింగ్సికందర్ రజాసామ్ కర్రన్క్రిస్ వోక్స్రిషి ధవన్తనయ్ త్యాగరాజన్జానీ బెయిర్స్టోజితేశ్ శర్మరాహుల్ చాహర్విధ్వత్ కావేరప్పహర్షల్ పటేల్నాథన్ ఎల్లిస్అర్షదీప్ సింగ్ప్రిన్స్ చౌదరీహర్ప్రీత్ బ్రార్వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 110.5 కోట్లు ఆర్టీఎమ్ అవకాశం: నలుగురు క్యాప్డ్ ప్లేయర్లను తీసుకోవచ్చు.సన్‌రైజర్స్ హైదరాబాద్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లుపాట్ కమిన్స్- రూ. 18 కోట్లుఅభిషేక్ శర్మ- రూ. 14 కోట్లునితీశ్కుమార్ రెడ్డి- రూ. 6 కోట్లుహెన్రిచ్ క్లాసెన్- రూ. 23 కోట్లుట్రవిస్ హెడ్- రూ. 14 కోట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్ వదిలేసిన ఆటగాళ్లుగ్లెన్ ఫిలిప్స్రాహుల్ త్రిపాఠిఎయిడెన్ మార్క్రమ్మయాంక్ అగర్వాల్అబ్దుల్ సమద్అన్మోల్ప్రీత్ సింగ్వాషింగ్టన్ సుందర్షాబాజ్ అహ్మద్సన్వీర్ సింగ్మార్కో జన్సెన్ఉపేంద్ర యాదవ్జయదేవ్ ఉనద్కత్టి నటరాజన్జఠావేద్ సుబ్రమణ్యన్మయాంక్ మార్కండేభువనేశ్వర్ కుమార్ఫజల్ హక్ ఫారూఖీఆకాశ్ మహారాజ్ సింగ్ఉమ్రాన్ మాలిక్విజయ్కాంత్ వియాస్కాంత్వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 45 కోట్లు ఆర్టీఎమ్ అవకాశం: ఒక అన్క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చులక్నో సూపర్ జెయింట్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లునికోలస్ పూరన్- రూ. 21 కోట్లురవి బిష్ణోయ్- రూ. 11 కోట్లుమయాంక్ యాదవ్- రూ. 11 కోట్లుమొహిసన్ ఖాన్- రూ. 4 కోట్లుఆయుశ్ బదోని- రూ. 4 కోట్లులక్నో సూపర్ జెయింట్స్ వదిలేసిన ఆటగాళ్లుప్రేరక్ మన్కడ్దేవ్దత్ పడిక్కల్కైల్ మేయర్స్కృనాల్ పాండ్యామార్కస్ స్టోయినిస్అర్షిన్ కులకర్ణిదీపక్ హుడాఆస్టన్ అగర్కృష్ణప్ప గౌతమ్క్వింటన్ డికాక్కేఎల్ రాహుల్ (కెప్టెన్)మణిమారన్ సిద్దార్థ్యుద్ద్వీర్సింగ్ చరక్నవీన్ ఉల్ హక్యశ్ ఠాకూర్షమార్ జోసఫ్అమిత్ మిశ్రాఅర్షద్ ఖాన్మ్యాట్ హెన్రీవేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 69 కోట్లు ఆర్టీఎమ్ అవకాశం లేదు: ఒక క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చుకోల్కతా నైట్‌రైడర్స్ ఆట్టిపెట్టుకున్న ఆటగాళ్లురింకూ సింగ్- రూ. 13 కోట్లువరుణ్ చక్రవర్తి- రూ. 12 కోట్లుసునీల్ నరైన్- రూ. 12 కోట్లుఆండ్రీ రసెల్- రూ. 12 కోట్లుహర్షిత్ రాణా- రూ. 4 కోట్లురమన్దీప్ సింగ్- రూ. 4 కోట్లుకోల్‌కతా నైట్‌రైడర్స్ వదిలేసిన ఆటగాళ్లుమనీశ్ పాండేనితీశ్ రాణాశ్రేయస్ అయ్యర్ (కెప్టెన్)సకీబ్ హుసేన్షెర్ఫాన్ రూథర్ఫోర్డ్వెంకటేశ్ అయ్యర్అనుకుల్ రాయ్అంగ్క్రిష్ రఘువంశీరహ్మానుల్లా గుర్భాజ్శ్రీకర్ భరత్వైభవ్ అరోరాసుయాశ్ శర్మచేతన్ సకారియామిచెల్ స్టార్క్దుష్మంత చమీరాఅల్లా ఘజన్ఫర్వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 51 కోట్లు ఆర్టీఎమ్ అవకాశం లేదుఢిల్లీ క్యాపిటల్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లుఅక్షర్ పటేల్- రూ. 16.5 కోట్లుకుల్దీప్ యాదవ్- రూ. 13.25 కోట్లుట్రిస్టన్ స్టబ్స్- రూ. 10 కోట్లుఅభిషేక్ పోరెల్- రూ. 4 కోట్లుఢిల్లీ క్యాపిటల్స్ వదిలేసిన ఆటగాళ్లురికీ భుయ్యశ్ ధుల్డేవిడ్ వార్నర్పృథ్వీ షాజేక్ ఫ్రేసర్ మెక్గుర్క్స్వస్తిక్ చికారలలిత్ యాదవ్సుమిత్ కుమార్గుల్బదిన్ నైబ్షాయ్ హోప్కుమార్ కుషాగ్రారిషబ్ పంత్ (కెప్టెన్)ఇషాంత్ శర్మజై రిచర్డ్సన్రసిఖ్ దార్ సలామ్విక్కీ ఓస్త్వాల్ఖలీల్ అహ్మద్ముకేశ్ కుమార్అన్రిచ్ నోర్జేప్రవీణ్ దూబేలిజాడ్ విలియమ్స్వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 73 కోట్లు ఆర్టీఎమ్ అవకాశం: ఇద్దరు క్యాప్డ్ ప్లేయర్లను తీసుకోవచ్చురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆట్టిపెట్టుకున్న ఆటగాళ్లువిరాట్ కోహ్లి- రూ. 21 కోట్లురజత్ పాటిదార్- రూ. 11 కోట్లుయశ్ దయాల్- రూ. 5 కోట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వదిలేసిన ఆటగాళ్లుసుయాశ్ ప్రభుదేశాయ్ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్)గ్లెన్ మ్యాక్స్వెల్కెమరూన్ గ్రీన్మహిపాల్ లోమ్రార్మనోజ్ భండగేసౌరవ్ చౌహాన్స్వప్నిల్ సింగ్టామ్ కర్రన్అనూజ్ రావత్కర్ణ్ శర్మవిజయ్కుమార్ వైశాఖ్అల్జరీ జోసఫ్రాజన్ కుమార్మయాంక్ డాగర్లోకీ ఫెర్గూసన్మొహమ్మద్ సిరాజ్హిమాన్షు శర్మఆకాశ్దీప్వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 83 కోట్లు ఆర్టీఎమ్ అవకాశం: ముగ్గురు క్యాప్డ్ ప్లేయర్లను తీసుకోవచ్చుచెన్నై సూపర్ కింగ్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లురుతురాజ్ గైక్వాడ్- రూ. 18 కోట్లుమతీశ పతిరణ- రూ. 13 కోట్లుశివమ్ దూబే- రూ. 12 కోట్లురవీంద్ర జడేజా- రూ. 18 కోట్లుఎంఎస్ ధోని- రూ. 4 కోట్లుచెన్నై సూపర్ కింగ్స్ వదిలేసిన ఆటగాళ్లుఅజింక్య రహానేషేక్ రషీద్సమీర్ రిజ్విడారిల్ మిచెల్డెవాన్ కాన్వేరచిన్ రవీంద్రనిషాంత్ సంధుమిచెల్ సాంట్నర్అరవెల్లి అవనీశ్అజయ్ జాదవ్ మండల్హంగేర్కర్ముకేశ్ చౌదరీప్రశాంత్ సోలంకిశార్దూల్ ఠాకూర్సిమ్రన్జీత్ సింగ్తుషార్ దేశ్పాండేమహీశ్ తీక్షణరిచర్డ్ గ్లీసన్దీపక్ చాహర్వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 55 కోట్లు ఆర్టీఎమ్ అవకాశం: ఒక అన్క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చుముంబై ఇండియన్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లుజస్ప్రీత్ బుమ్రా- రూ. 18 కోట్లుసూర్యకుమార్ యాదవ్- రూ. 16.35 కోట్లుహార్దిక్ పాండ్యా- రూ. 16.35 కోట్లురోహిత్ శర్మ- రూ. 16.30 కోట్లుతిలక్ వర్మ- రూ. 8 కోట్లుముంబై ఇండియన్స్ వదిలేసిన ఆటగాళ్లుటిమ్ డేవిడ్డెవాల్డ్ బ్రెవిస్నేహల్ వధేరానమన్ ధిర్శివాలిక్ శర్మషమ్స్ ములానీశ్రేయస్ గోపాల్రొమారియో షెపర్డ్కుమార్ కార్తీకేయమొహమ్మద్ నబీఅర్జున్ టెండూల్కర్ఇషాన్ కిషన్హార్విక్ దేశాయ్పియూశ్ చావ్లాఅన్షుల్ కంబోజ్గెరాల్డ్ కొయెట్జీఆకాశ్ మధ్వాల్నువాన్ తుషారక్వేనా మపాకాలూక్ వుడ్వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 45 కోట్లు ఆర్టీఎమ్ అవకాశం: ఒక అన్క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చుగుజరాత్ టైటాన్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లురషీద్ ఖాన్- రూ. 18 కోట్లుశుభ్మన్ గిల్- రూ. 16.5 కోట్లుసాయి సుదర్శన్- రూ. 8.5 కోట్లురాహుల్ తెవాతియా- రూ. 4 కోట్లుషారుఖ్ ఖాన్- రూ. 4 కోట్లుగుజరాత్ టైటాన్స్ వదిలేసిన ఆటగాళ్లుడేవిడ్ మిల్లర్కేన్ విలియమ్సన్అభినవ్ మనోహర్విజయ్ శంకర్అజ్మతుల్లా ఒమర్జాయ్వృద్దిమాన్ సాహామాథ్యూ వేడ్శరత్ బీఆర్కార్తీక్ త్యాగినూర్ అహ్మద్రవిశ్రీనివాసన్ సాయి కిషోర్జాషువ లిటిల్స్పెన్సర్ జాన్సన్మొహిత్ శర్మదర్శన్ నల్కండేజయంత్ యాదవ్ఉమేశ్ యాదవ్సందీప్ వారియర్మారవ్ సుతార్గుర్నూర్ బ్రార్పర్సులో మిగిలిన మొత్తం: రూ. 69 కోట్లు ఆర్టీఎమ్ అవకాశం: ఒక క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చురాజస్థాన్ రాయల్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు..సంజూ శాంసన్- రూ. 18 కోట్లుయశస్వి జైస్వాల్- రూ. 18 కోట్లురియాన్ పరాగ్- రూ. 14 కోట్లుదృవ్ జురెల్- రూ. 14 కోట్లుషిమ్రోన్ హెట్‌మైర్- రూ. 11 కోట్లుసందీప్ శర్మ- రూ. 4 కోట్లురాజస్థాన్ రాయల్స్ వదిలేసిన ఆటగాళ్లు..రోవ్‌మన్ పొవెల్శుభమ్ దూబేతనుశ్ కోటియన్రవిచంద్రన్ అశ్విన్డొనొవన్ ఫెరియెరాకునాల్ సింగ్ రాథోర్టామ్ కొహ్లెర్-కాడ్మోర్ఆవేశ్ ఖాన్ట్రెంట్ బౌల్ట్నవ్దీప్ సైనీనండ్రే బర్గర్యుజ్వేంద్ర చహల్కుల్దీప్ సేన్ ఆబిద్ ముస్తాక్కేశవ్ మహారాజ్వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 83 కోట్లు ఆర్టీఎమ్ అవకాశం: ముగ్గురు క్యాప్డ్ ప్లేయర్లను తీసుకోవచ్చు -
IPL 2025 Retentions: జాక్‌పాట్ కొట్టిన ఆటగాళ్లు వీరే..!
ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించిన రిటెన్షన్స్ జాబితాను నిన్న (అక్టోబర్ 31) విడుదల చేశారు. ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాడిని అట్టిపెట్టుకుంది.. ఏ ఆటగాడికి వేలానికి వదిలేసిందన్న విషయం నిన్నటితో తేలిపోయింది. ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్న ఆటగాళ్లలో పలువురు జాక్‌పాట్ కొట్టారు. బేస్ ధర నుంచి ఏకంగా కోట్లకు పడగలెత్తారు. రిటెన్షన్స్‌లో అందరి కంటే ఎక్కువ లబ్ది పొందింది రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ధృవ్ జురెల్. ఈ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్‌ను రాయల్స్ 20 లక్షల నుంచి 14 కోట్లకు సొంతం చేసుకుంది. జురెల్ తర్వాత సీఎస్కే పతిరణ, కేకేఆర్ రింకూ సింగ్ అత్యధికంగా లబ్ది పొందారు. పతిరణ 20 లక్షల నుంచి 13 కోట్లకు.. రింకూ సింగ్ 55 లక్షల నుంచి 13 కోట్లకు రిటైన్ చేసుకోబడ్డారు. వీరి తర్వాత రజత్ పాటిదార్, మయాంక్ యాదవ్ 20 లక్షల బేస్ ధర నుంచి 11 కోట్లకు రిటైన్ చేసుకోబడ్డారు. ఓవరాల్‌గా చూస్తే రిటెన్షన్స్ అనంతరం అత్యధికంగా లబ్ది పొందిన ఆటగాడిగా హెన్రిచ్ క్లాసెన్ నిలిచాడు. క్లాసెన్‌కు గత సీజన్ శాలరీ 5.25 కోట్లు కాగా.. ఎస్ఆర్హెచ్ ఈసారి అతన్ని ఏకంగా 23 కోట్లకు సొంతం చేసుకుంది. అంటే క్లాసెన్ శాలరీ ఏకంగా 17.75 కోట్లు పెరిగింది.రిటెన్షన్స్‌లో అత్యధికంగా లబ్ది పొందిన ఆటగాళ్లు వీరే..!హెన్రిచ్ క్లాసెన్ 5.25 కోట్ల నుంచి 23 కోట్లుధృవ్ జురెల్ 20 లక్షల నుంచి 14 కోట్లుమతిశ పతిరణ 20 లక్షల నుంచి 13 కోట్లురింకూ సింగ్ 55 లక్షల నుంచి 13 కోట్లురజత్ పాటిదార్ 20 లక్షల నుంచి 11 కోట్లుమయాంక్ యాదవ్ 20 లక్షల నుంచి 11 కోట్లుసాయి సుదర్శన్ 20 లక్షలు నుంచి 8.5 కోట్లునితీశ్ కుమార్ రెడ్డి 20 లక్షల నుంచి 6 కోట్లుశశాంక్ సింగ్ 20 లక్షల నుంచి 5.5 కోట్లు -
IPL రిటెన్షన్ లిస్ట్ విడుదల..అత్యధిక ధర ఎవరికంటే?
-
IPL 2025: ఫ్రాంచైజీలు వదులుకున్న ఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే..!
ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించిన రిటెన్షన్స్ జాబితాను నిన్న (అక్టోబర్ 31) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాడిని అట్టిపెట్టుకుంది.. ఏ ఆటగాడికి వేలానికి వదిలేసిందన్న విషయం నిన్నటితో తేలిపోయింది. రిటెన్షన్స్‌లో కొన్ని ఫ్రాంచైజీలు తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు స్టార్ ఆటగాళ్లను వదులుకున్నాయి. రిటెన్షన్స్ అనంతరం ఫ్రాంచైజీలు వదులుకున్న ఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే.పంజాబ్ కింగ్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లుశశాంక్ సింగ్- రూ. 5.5 కోట్లుప్రభ్మన్సిమ్రన్ సింగ్- రూ. 4 కోట్లుపంజాబ్ కింగ్స్ వదిలేసిన ఆటగాళ్లుశిఖర్ ధవన్ (కెప్టెన్)రిలీ రొస్సోహర్ప్రీత్ సింగ్ భాటియాశివమ్ సింగ్అధర్వ తైడేఅశుతోష్ శర్మవిశ్వనాథ్ సింగ్సికందర్ రజాసామ్ కర్రన్క్రిస్ వోక్స్రిషి ధవన్తనయ్ త్యాగరాజన్జానీ బెయిర్స్టోజితేశ్ శర్మరాహుల్ చాహర్విధ్వత్ కావేరప్పహర్షల్ పటేల్నాథన్ ఎల్లిస్అర్షదీప్ సింగ్ప్రిన్స్ చౌదరీహర్ప్రీత్ బ్రార్సన్రైజర్స్ హైదరాబాద్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లుపాట్ కమిన్స్- రూ. 18 కోట్లుఅభిషేక్ శర్మ- రూ. 14 కోట్లునితీశ్కుమార్ రెడ్డి- రూ. 6 కోట్లుహెన్రిచ్ క్లాసెన్- రూ. 23 కోట్లుట్రవిస్ హెడ్- రూ. 14 కోట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్ వదిలేసిన ఆటగాళ్లుగ్లెన్ ఫిలిప్స్రాహుల్ త్రిపాఠిఎయిడెన్ మార్క్రమ్మయాంక్ అగర్వాల్అబ్దుల్ సమద్అన్మోల్ప్రీత్ సింగ్వాషింగ్టన్ సుందర్షాబాజ్ అహ్మద్సన్వీర్ సింగ్మార్కో జన్సెన్ఉపేంద్ర యాదవ్జయదేవ్ ఉనద్కత్టి నటరాజన్జఠావేద్ సుబ్రమణ్యన్మయాంక్ మార్కండేభువనేశ్వర్ కుమార్ఫజల్ హక్ ఫారూఖీఆకాశ్ మహారాజ్ సింగ్ఉమ్రాన్ మాలిక్విజయ్కాంత్ వియాస్కాంత్లక్నో సూపర్ జెయింట్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లునికోలస్ పూరన్- రూ. 21 కోట్లురవి బిష్ణోయ్- రూ. 11 కోట్లుమయాంక్ యాదవ్- రూ. 11 కోట్లుమొహిసన్ ఖాన్- రూ. 4 కోట్లుఆయుశ్ బదోని- రూ. 4 కోట్లులక్నో సూపర్ జెయింట్స్ వదిలేసిన ఆటగాళ్లుప్రేరక్ మన్కడ్దేవ్దత్ పడిక్కల్కైల్ మేయర్స్కృనాల్ పాండ్యామార్కస్ స్టోయినిస్అర్షిన్ కులకర్ణిదీపక్ హుడాఆస్టన్ అగర్కృష్ణప్ప గౌతమ్క్వింటన్ డికాక్కేఎల్ రాహుల్ (కెప్టెన్)మణిమారన్ సిద్దార్థ్యుద్ద్వీర్సింగ్ చరక్నవీన్ ఉల్ హక్యశ్ ఠాకూర్షమార్ జోసఫ్అమిత్ మిశ్రాఅర్షద్ ఖాన్మ్యాట్ హెన్రీకోల్కతా నైట్‌రైడర్స్ ఆట్టిపెట్టుకున్న ఆటగాళ్లురింకూ సింగ్- రూ. 13 కోట్లువరుణ్ చక్రవర్తి- రూ. 12 కోట్లుసునీల్ నరైన్- రూ. 12 కోట్లుఆండ్రీ రసెల్- రూ. 12 కోట్లుహర్షిత్ రాణా- రూ. 4 కోట్లురమన్దీప్ సింగ్- రూ. 4 కోట్లుకోల్‌కతా నైట్‌రైడర్స్ వదిలేసిన ఆటగాళ్లుమనీశ్ పాండేనితీశ్ రాణాశ్రేయస్ అయ్యర్ (కెప్టెన్)సకీబ్ హుసేన్షెర్ఫాన్ రూథర్ఫోర్డ్వెంకటేశ్ అయ్యర్అనుకుల్ రాయ్అంగ్క్రిష్ రఘువంశీరహ్మానుల్లా గుర్భాజ్శ్రీకర్ భరత్వైభవ్ అరోరాసుయాశ్ శర్మచేతన్ సకారియామిచెల్ స్టార్క్దుష్మంత చమీరాఅల్లా ఘజన్ఫర్ఢిల్లీ క్యాపిటల్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లుఅక్షర్ పటేల్- రూ. 16.5 కోట్లుకుల్దీప్ యాదవ్- రూ. 13.25 కోట్లుట్రిస్టన్ స్టబ్స్- రూ. 10 కోట్లుఅభిషేక్ పోరెల్- రూ. 4 కోట్లుఢిల్లీ క్యాపిటల్స్ వదిలేసిన ఆటగాళ్లురికీ భుయ్యశ్ ధుల్డేవిడ్ వార్నర్పృథ్వీ షాజేక్ ఫ్రేసర్ మెక్గుర్క్స్వస్తిక్ చికారలలిత్ యాదవ్సుమిత్ కుమార్గుల్బదిన్ నైబ్షాయ్ హోప్కుమార్ కుషాగ్రారిషబ్ పంత్ (కెప్టెన్)ఇషాంత్ శర్మజై రిచర్డ్సన్రసిఖ్ దార్ సలామ్విక్కీ ఓస్త్వాల్ఖలీల్ అహ్మద్ముకేశ్ కుమార్అన్రిచ్ నోర్జేప్రవీణ్ దూబేలిజాడ్ విలియమ్స్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆట్టిపెట్టుకున్న ఆటగాళ్లువిరాట్ కోహ్లి- రూ. 21 కోట్లురజత్ పాటిదార్- రూ. 11 కోట్లుయశ్ దయాల్- రూ. 5 కోట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వదిలేసిన ఆటగాళ్లుసుయాశ్ ప్రభుదేశాయ్ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్)గ్లెన్ మ్యాక్స్వెల్కెమరూన్ గ్రీన్మహిపాల్ లోమ్రార్మనోజ్ భండగేసౌరవ్ చౌహాన్స్వప్నిల్ సింగ్టామ్ కర్రన్అనూజ్ రావత్కర్ణ్ శర్మవిజయ్కుమార్ వైశాఖ్అల్జరీ జోసఫ్రాజన్ కుమార్మయాంక్ డాగర్లోకీ ఫెర్గూసన్మొహమ్మద్ సిరాజ్హిమాన్షు శర్మఆకాశ్దీప్చెన్నై సూపర్ కింగ్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లురుతురాజ్ గైక్వాడ్- రూ. 18 కోట్లుమతీశ పతిరణ- రూ. 13 కోట్లుశివమ్ దూబే- రూ. 12 కోట్లురవీంద్ర జడేజా- రూ. 18 కోట్లుఎంఎస్ ధోని- రూ. 4 కోట్లుచెన్నై సూపర్ కింగ్స్ వదిలేసిన ఆటగాళ్లుఅజింక్య రహానేషేక్ రషీద్సమీర్ రిజ్విడారిల్ మిచెల్డెవాన్ కాన్వేరచిన్ రవీంద్రనిషాంత్ సంధుమిచెల్ సాంట్నర్అరవెల్లి అవనీశ్అజయ్ జాదవ్ మండల్హంగేర్కర్ముకేశ్ చౌదరీప్రశాంత్ సోలంకిశార్దూల్ ఠాకూర్సిమ్రన్జీత్ సింగ్తుషార్ దేశ్పాండేమహీశ్ తీక్షణరిచర్డ్ గ్లీసన్దీపక్ చాహర్ముంబై ఇండియన్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లుజస్ప్రీత్ బుమ్రా- రూ. 18 కోట్లుసూర్యకుమార్ యాదవ్- రూ. 16.35 కోట్లుహార్దిక్ పాండ్యా- రూ. 16.35 కోట్లురోహిత్ శర్మ- రూ. 16.30 కోట్లుతిలక్ వర్మ- రూ. 8 కోట్లుముంబై ఇండియన్స్ వదిలేసిన ఆటగాళ్లుటిమ్ డేవిడ్డెవాల్డ్ బ్రెవిస్నేహల్ వధేరానమన్ ధిర్శివాలిక్ శర్మషమ్స్ ములానీశ్రేయస్ గోపాల్రొమారియో షెపర్డ్కుమార్ కార్తీకేయమొహమ్మద్ నబీఅర్జున్ టెండూల్కర్ఇషాన్ కిషన్హార్విక్ దేశాయ్పియూశ్ చావ్లాఅన్షుల్ కంబోజ్గెరాల్డ్ కొయెట్జీఆకాశ్ మధ్వాల్నువాన్ తుషారక్వేనా మపాకాలూక్ వుడ్గుజరాత్ టైటాన్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లురషీద్ ఖాన్- రూ. 18 కోట్లుశుభ్మన్ గిల్- రూ. 16.5 కోట్లుసాయి సుదర్శన్- రూ. 8.5 కోట్లురాహుల్ తెవాతియా- రూ. 4 కోట్లుషారుఖ్ ఖాన్- రూ. 4 కోట్లుగుజరాత్ టైటాన్స్ వదిలేసిన ఆటగాళ్లుడేవిడ్ మిల్లర్కేన్ విలియమ్సన్అభినవ్ మనోహర్విజయ్ శంకర్అజ్మతుల్లా ఒమర్జాయ్వృద్దిమాన్ సాహామాథ్యూ వేడ్శరత్ బీఆర్కార్తీక్ త్యాగినూర్ అహ్మద్రవిశ్రీనివాసన్ సాయి కిషోర్జాషువ లిటిల్స్పెన్సర్ జాన్సన్మొహిత్ శర్మదర్శన్ నల్కండేజయంత్ యాదవ్ఉమేశ్ యాదవ్సందీప్ వారియర్మారవ్ సుతార్గుర్నూర్ బ్రార్రాజస్థాన్ రాయల్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు..సంజూ శాంసన్- రూ. 18 కోట్లుయశస్వి జైస్వాల్- రూ. 18 కోట్లురియాన్ పరాగ్- రూ. 14 కోట్లుదృవ్ జురెల్- రూ. 14 కోట్లుషిమ్రోన్ హెట్‌మైర్- రూ. 11 కోట్లుసందీప్ శర్మ- రూ. 4 కోట్లురాజస్థాన్ రాయల్స్ వదిలేసిన ఆటగాళ్లు..రోవ్‌మన్ పొవెల్శుభమ్ దూబేతనుశ్ కోటియన్రవిచంద్రన్ అశ్విన్డొనొవన్ ఫెరియెరాకునాల్ సింగ్ రాథోర్టామ్ కొహ్లెర్-కాడ్మోర్ఆవేశ్ ఖాన్ట్రెంట్ బౌల్ట్నవ్దీప్ సైనీనండ్రే బర్గర్యుజ్వేంద్ర చహల్కుల్దీప్ సేన్ ఆబిద్ ముస్తాక్కేశవ్ మహారాజ్ -
IPL 2025: వేలంలో పాల్గొనబోయే స్టార్ ఆటగాళ్లు వీరే..!
ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించిన రిటెన్షన్స్ జాబితాను నిన్న (అక్టోబర్ 31) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాడిని అట్టిపెట్టుకుంది.. ఏ ఆటగాడికి వేలానికి వదిలేసిందన్న విషయం నిన్నటితో తేలిపోయింది. రిటెన్షన్స్‌లో కొన్ని ఫ్రాంచైజీలు తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు స్టార్ ఆటగాళ్లను వదిలేసుకున్నాయి. ఫ్రాంచైజీలు వదిలేసిన అనంతరం వేలానికి రానున్న స్టార్ ఆటగాళ్లు వీరే.రిలీ రొస్సో సామ్ కర్రన్ జానీ బెయిర్‌స్టో గ్లెన్ ఫిలిప్స్ఎయిడెన్ మార్క్రమ్మార్కస్ స్టోయినిస్కేఎల్ రాహుల్ (కెప్టెన్)శిఖర్ ధవన్ (కెప్టెన్)క్వింటన్ డికాక్శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్)మిచెల్ స్టార్క్రిషబ్ పంత్ (కెప్టెన్)డేవిడ్ వార్నర్జేక్ ఫ్రేసర్ మెక్గుర్క్ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్)గ్లెన్ మ్యాక్స్వెల్కెమరూన్ గ్రీన్డెవాన్ కాన్వేరచిన్ రవీంద్రటిమ్ డేవిడ్డెవాల్డ్ బ్రెవిస్ఇషాన్ కిషన్డేవిడ్ మిల్లర్కేన్ విలియమ్సన్జోస్ బట్లర్ట్రెంట్ బౌల్ట్రవిచంద్రన్ అశ్విన్యుజ్వేంద్ర చహల్చదవండి: ఐపీఎల్ 2025 రిటెన్షన్ జాబితా విడుదల -
IPL 2025 Auction: ఏయే ఫ్రాంచైజీల దగ్గర ఎంత మొత్తం మిగిలి ఉంది..?
ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించిన రిటెన్షన్స్ జాబితాను నిన్న (అక్టోబర్ 31) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాడిని అట్టిపెట్టుకుంది.. ఏ ఆటగాడికి వేలానికి వదిలేసిందన్న విషయం నిన్నటితో తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఏ ఫ్రాంచైజీ దగ్గర ఎంత పర్స్ బ్యాలెన్స్ మిగిలిందన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.రిటెన్షన్స్‌లో అతి తక్కువ ఖర్చు చేసింది పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ. టోటల్ పర్స్ వాల్యూ 120 కోట్లైతే ఈ ఫ్రాంచైజీ కేవలం 9.5 కోట్లు మాత్రమే ఖర్చు చేసి ఇద్దరు ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. పంజాబ్ కింగ్స్ శశాంక్ సింగ్‌ను 5.5 కోట్లకు, ప్రభ్‌మన్‌సిమ్రన్ సింగ్‌ను 4 కోట్లకు రిటైన్ చేసుకుని మిగతా ఆటగాళ్లందరినీ వేలానికి వదిలేసింది. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ దగ్గర ఇంకా 110.5 కోట్లు బ్యాలెన్స్ ఉంది. వేలంలో పాల్గొనే ఫ్రాంచైజీల్లో ఏ ఫ్రాంచైజీ దగ్గర ఇంత మొత్తం లేదు. కాబట్టి పంజాబ్ కింగ్స్ వేలంలో భారీ కొనుగోళ్లు జరిపే అవకాశం ఉంది.పంజాబ్ కింగ్స్ తర్వాత అత్యధిక పర్స్ బ్యాలెన్స్ ఆర్సీబీ దగ్గర ఉంది. ఆర్సీబీ రిటెన్షన్స్‌లో 37 కోట్లు ఖర్చు చేసి ఇంకా 83 కోట్ల పర్స్ బ్యాలెన్స్ కలిగి ఉంది. ఆర్సీబీ రిటెన్షన్స్‌లో భాగంగా విరాట్ కోహ్లికి 21 కోట్లు, రజత్ పాటిదార్‌కు 11 కోట్లు, యశ్ దయాల్‌కు 5 కోట్లు ఖర్చు చేసింది. పంజాబ్, ఆర్సీబీ తర్వాత అత్యధిక పర్స్ బ్యాలెన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద ఉంది. ఈ ఫ్రాంచైజీ దగ్గర ఇంకా 73 కోట్ల బ్యాలెన్స్ ఉంది.పంజాబ్, ఆర్సీబీ, ఢిల్లీ తర్వాత ఎల్ఎస్జీ, గుజరాత్, సీఎస్కే, కేకేఆర్, ఎస్ఆర్హెచ్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ వద్ద వరుసగా 69 కోట్లు, 69, 55, 51, 45, 45, 41 కోట్ల బ్యాలెన్స్ ఉంది. అన్ని ఫ్రాంచైజీల దగ్గర భారీ మొత్తం మిగిలి ఉండటంతో ఈ సారి వేలం ఆసక్తికరంగా మారనుంది. రిటెన్షన్స్‌లో చాలా ఫ్రాంచైజీలు స్టార్ ఆటగాళ్లను వదిలి పెట్టడంతో సదరు స్టార్ ఆటగాళ్ల కోసం వేలంలో ఫ్రాంచైజీలు ఎగబడే అవకాశం ఉంది. చదవండి: ఐపీఎల్ 2025 రిటెన్షన్ జాబితా విడుదల -
IPL 2025: సన్‌రైజర్స్ రీటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే..!
ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి రిటెన్షన్స్ జాబితాను ఇవాళ (అక్టోబర్ 31) విడుదల చేశారు. మెజార్టీ శాతం ఫ్రాంచైజీలు ఊహించిన విధంగానే ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. కొన్ని ఫ్రాంచైజీలు మాత్రం కెప్టెన్లను వదిలేసి పెద్ద సాహసం చేశాయి.సన్‌రైజర్స్ హైదరాబాద్ విషయానికొస్తే.. ఆరెంజ్ ఆర్మీ సాధ్యమైనంత వరకు ఆటగాళ్లను అట్టిపెట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ (18 కోట్లు), అభిషేక్ శర్మ (14 కోట్లు), నితీశ్‌కుమార్ రెడ్డి (6 కోట్లు), హెన్రిచ్ క్లాసెన్ (23 కోట్లు), ట్రవిస్ హెడ్ (14 కోట్లు) మరోసారి రిటైన్ చేసుకుంది.ఫ్రాంచైజీలకు కేవలం ఆరుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే వెసులుబాటు ఉండటంతో ఎస్ఆర్హెచ్ కొందరు స్టార్ ఆటగాళ్లను వదులుకోవాల్సి వచ్చింది. ఇందులో ఎయిడెన్ మార్క్రమ్, గ్లెన్ ఫిలిప్స్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, మార్కో జన్సెన్, ఉమ్రాన్ మాలిక్ ఉన్నారు. ఎవరూ ఊహించని విధంగా కెప్టెన్ పాట్ కమిన్స్ కంటే హెన్రిచ్ క్లాసెన్‌కు అధిక ధర లభించింది. రిటెన్షన్ లిస్ట్‌లో అత్యధిక ధర లభించింది కూడా క్లాసెన్‌కే.సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు పాట్ కమిన్స్- రూ. 18 కోట్లుఅభిషేక్ శర్మ- రూ. 14 కోట్లునితీశ్కుమార్ రెడ్డి- రూ. 6 కోట్లుహెన్రిచ్ క్లాసెన్- రూ. 23 కోట్లుట్రవిస్ హెడ్- రూ. 14 కోట్లుటోటల్ పర్స్ వాల్యూ- రూ. 120 కోట్లుమిగిలిన పర్స్ వాల్యూ- రూ. 45 కోట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్ వదులుకున్న ఆటగాళ్లు గ్లెన్ ఫిలిప్స్రాహుల్ త్రిపాఠిఎయిడెన్ మార్క్రమ్మయాంక్ అగర్వాల్అబ్దుల్ సమద్అన్మోల్ప్రీత్ సింగ్వాషింగ్టన్ సుందర్షాబాజ్ అహ్మద్సన్వీర్ సింగ్మార్కో జన్సెన్ఉపేంద్ర యాదవ్జయదేవ్ ఉనద్కత్టి నటరాజన్జఠావేద్ సుబ్రమణ్యన్మయాంక్ మార్కండేభువనేశ్వర్ కుమార్ఫజల్ హక్ ఫారూఖీఆకాశ్ మహారాజ్ సింగ్ఉమ్రాన్ మాలిక్విజయ్కాంత్ వియాస్కాంత్చదవండి: ఐపీఎల్ 2025 రిటెన్షన్ జాబితా విడుదల -
IPL 2025: కోహ్లి, రోహిత్ కాదు.. రిటెన్షన్‌లో అత్యధిక ధర దక్కింది అతనికే..!
ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను ఇవాళ (అక్టోబర్ 31) విడుదల చేశాయి. ఈ జాబితాలో అందరూ ఊహించిన విధంగానే ఎంపికలు జరిగాయి. అయితే కొన్ని ఫ్రాంచైజీలు మాత్రం తమ కెప్టెన్లను వదిలేసి పెద్ద సాహసమే చేశాయి. మరి కొన్ని ఫ్రాంచైజీలు తమ స్టార్ ఆటగాళ్లను తప్పని పరిస్థితుల్లో వేలానికి వదిలేశాయి.ఐపీఎల్ 2025 రిటెన్షన్స్ అందరూ ఊహించినట్టుగా విరాట్‌కు కాని రోహిత్‌కు కాని అత్యధిక ధర దక్కలేదు. వీరిద్దరితో పోలిస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ అత్యధిక ధర దక్కింది. క్లాసెన్‌పై ఎస్ఆర్హెచ్ ఏకంగా రూ. 23 కోట్లు వెచ్చించింది. భారత స్టార్ల విషయానికొస్తే.. విరాట్‌కు రూ. 21 కోట్లు.. రోహిత్‌కు రూ. 16.30 కోట్లు లభించాయి. ఐపీఎల్ రిటెన్షన్‌లో అత్యధిక ధర పొందిన ఆటగాడిగా విరాట్ నిలిచాడు. విరాట్‌తో సమానంగా లక్నో ఆటగాడు నికోలస్ పూరన్‌కు కూడా రూ. 21 కోట్లు లభించాయి.పాట్ కమిన్స్ (సన్‌రైజర్స్), రుతురాజ్ (సీఎస్కే), బుమ్రా (ముంబై), రషీద్ ఖాన్ (గుజరాత్), సంజూ శాంసన్‌లకు (రాజస్థాన్), యశస్వి జైస్వాల్ (రాజస్థాన్), రవీంద్ర జడేజా (సీఎస్కే) రూ. 18 కోట్లు దక్కాయి. అన్క్యాప్డ్ ప్లేయర్ కోటా కింద ఎంఎస్ ధోనికి అత్యల్పంగా రూ. 4 కోట్లు దక్కాయి. కేకేఆర్ ఆటగాడు రింకూ సింగ్ జాక్ పాట్ కొట్టాడు. అతని పారితోషికం రూ. 55 లక్షల నుంచి రూ. 13 కోట్లకు పెరిగింది.చదవండి: ఐపీఎల్ 2025 రిటెన్షన్ జాబితా విడుదల -
IPL 2025 Retention List: కెప్టెన్లను వదిలేసిన ఫ్రాంచైజీలు ఇవే..!
ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. అన్ని ఫ్రాంచైజీలు ఊహించినట్టుగానే తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించాయి. అయితే కొన్ని ఫ్రాంచైజీలు ఆసక్తికరంగా తమ కెప్టెన్లను వదిలేశాయి.ముందు నుంచి ప్రచారం జరిగినట్టుగా ఢిల్లీ (రిషబ్ పంత్), లక్నో (కేఎల్ రాహుల్), కేకేఆర్ (శ్రేయస్ అయ్యర్), పంజాబ్ కింగ్స్ (శిఖర్ ధవన్), ఆర్సీబీ (ఫాఫ్ డుప్లెసిస్) తమ కెప్టెన్లను వేలానికి వదిలేశాయి. నవంబర్ చివరి వారంలో జరుగబోయే మెగా వేలంలో ఈ ఐదుగురు కెప్టెన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కారణాలు ఏవైనా ఆయా ఫ్రాంచైజీలు కెప్టెన్లను వేలానికి వదిలేయడం ఆసక్తికరంగా మారింది.కెప్టెన్లను వదిలేసిన ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా..కోల్‌కతా నైట్రైడర్స్రింకూ సింగ్- రూ. 13 కోట్లువరుణ్ చక్రవర్తి- రూ. 12 కోట్లుసునీల్ నరైన్- రూ. 12 కోట్లుఆండ్రీ రసెల్- రూ. 12 కోట్లుహర్షిత్ రాణా- రూ. 4 కోట్లురమన్దీప్ సింగ్- రూ. 4 కోట్లుఢిల్లీ క్యాపిటల్స్అక్షర్ పటేల్- రూ. 16.5 కోట్లుకుల్దీప్ యాదవ్- రూ. 13.25 కోట్లుట్రిస్టన్ స్టబ్స్- రూ. 10 కోట్లుఅభిషేక్ పోరెల్- రూ. 4 కోట్లులక్నో సూపర్ జెయింట్స్నికోలస్ పూరన్- రూ. 21 కోట్లురవి బిష్ణోయ్- రూ. 11 కోట్లుమయాంక్ యాదవ్- రూ. 11 కోట్లుమొహిసన్ ఖాన్- రూ. 4 కోట్లుఆయుశ్ బదోని- రూ. 4 కోట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరువిరాట్ కోహ్లి- రూ. 21 కోట్లురజత్ పాటిదార్- రూ. 11 కోట్లుయశ్ దయాల్- రూ. 5 కోట్లుపంజాబ్ కింగ్స్శశాంక్ సింగ్- రూ. 5.5 కోట్లుప్రభ్మన్సిమ్రన్ సింగ్- రూ. 4 కోట్లు