బెంగళూరు గెలుపు.. పూనకంతో ఊగిపోయిన స్టార్‌ డైరెక్టర్ | Director Prashanth Neel Celebrates RCB Victory In IPL 2025 Final, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Prashanth Neel: ఆర్సీబీ విజయం.. డ్యాన్స్‌ చేస్తూ ఊగిపోయిన ప్రశాంత్ నీల్

Jun 4 2025 6:53 AM | Updated on Jun 4 2025 9:26 AM

Director Prashanth Neel Celebrates RCB Victory In IPL Final

ఐపీఎల్‌ ఫైనల్లో ఆర్సీబీ గెలవడంతో ఫ్యాన్స్‌ ఫుల్ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. రోడ్లపైకి వచ్చిన విక్టరీని ఎంజాయ్ చేశారు. ఈ నేపథ్యంలో స్టార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్ సైతం బెంగళూరు విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. మ్యాచ్‌ ముగిసిన వెంటనే డ్యాన్స్‌ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా.. కేజీఎఫ్‌తో బ్లాక్‌బస్టర్ హిట్స్‌ కొట్టిన ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం మన యంగ్ టైగర్‌తో సినిమా చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో రానున్న చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.  ప్రస్తుతం ఈ మూవీని ఎన్టీఆర్‌-నీల్‌ వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను గుల్షన్‌‌ కుమార్, భూషణ్‌ కుమార్, టి. సిరీస్‌ ఫిల్మ్స్‌ సమర్పణలో కల్యాణ్‌ రామ్‌ నందమూరి, నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ భారీ యాక్షన్‌ చిత్రం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement