
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ తన ఆల్ టైమ్ ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు. అయితే తన ఎంచుకున్న జట్టులో కేవలం ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న ప్లేయర్లకు మాత్రమే గిల్‌క్రిస్ట్ అవకాశమిచ్చాడు. ఈ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎక్కువగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారు.
ఎందుకంటే ఈ రెండు ఫ్రాంచైజీలు చెరో ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాయి. ఈ జట్టుకు కెప్టెన్‌గా సీఎస్‌కే దిగ్గజం ఎంఎస్ ధోనిని గిల్ ఎంపిక చేశాడు. ధోనితో పాటుగా సీఎస్‌కే లెజెండ్స్ సురేష్ రైనా, రవీంద్ర జడేజాలు ఉన్నారు.
అదేవిధంగా ముంబై ఇండియన్స్ నుంచి ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ రోహిత్ శర్మ, విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, విండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్, డేంజరస్ పేస్ ద్వయం లసిత్ మలింగ,జస్ప్రీత్ బుమ్రాలకు అతడు ఛాన్స్ ఇచ్చాడు.
ఇక రెండు సార్లు ఛాంపియన్ కేకేఆర్ నుంచి సునీల్ నరైన్‌కు మాత్రమే చోటు దక్కింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి డేవిడ్ వార్నర్, భువనేశ్వర్ కుమార్‌ను గిల్ క్రిస్ట్ ఎంపిక చేశాడు. అయితే ఆర్సీబీ టైటిల్ గెలవకపోవడంతో ఈ జట్టులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి చోటు దక్కలేదు. కాగా భారత్-పాక్ ఉద్రిక్తల నేపథ్యంలో వాయిదా పడిన ఐపీఎల్-2025 సీజన్ తిరిగి మే 17 నుంచి ప్రారంభం కానుంది.
గిల్ క్రిస్ట్ ఆల్ టైమ్ ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్
ఎంఎస్ ధోని (కెప్టెన్), రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, సురేష్ రైనా, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, సునీల్ నరైన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ, భువనేశ్వర్ కుమార్
చదవండి: రోహిత్ శర్మకు రాహుల్ ద్రవిడ్ మెసేజ్.. వీడియో వైరల్