టీమిండియా యువ జట్టుపై వైఎస్‌ జగన్‌ ప్రశంసలు | YS Jagan congratulate India U-19 Team on Record 6th World Cup Triumph | Sakshi
Sakshi News home page

టీమిండియా యువ జట్టుపై వైఎస్‌ జగన్‌ ప్రశంసలు

Feb 7 2026 10:14 AM | Updated on Feb 7 2026 1:26 PM

YS Jagan congratulate India U-19 Team on Record 6th World Cup Triumph

సాక్షి, తాడేపల్లి: అండర్-19 ప్రపంచకప్‌లో భారత యువ జట్టు చారిత్రక విజయం సాధించడంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జట్టు సభ్యులకు అభినందనలు తెలుపుతూ.. మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.

‘‘మన అండర్-19 జట్టు ప్రపంచకప్ విజయం సాధించినందుకు హృదయపూర్వక అభినందనలు. మైదానంలో మీరు చూపిన పట్టుదల, క్రమశిక్షణ చూసి దేశం ఎంతో గర్వించింది. ఈ యువ క్రీడాకారులు భారతదేశ భవిష్యత్తుకు వెలుగులు నింపే ప్రతిభావంతులు. ఈ విజయంతో మీరు మరిన్ని మైలురాళ్లు చేరుకోవాలని, కొత్త విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. మొత్తం జట్టుకు నా శుభాకాంక్షలు’’ అంటూ ఎక్స్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారాయన. 

వరల్డ్ కప్ దుమ్మురేపిన కుర్రాళ్లు వైఎస్ జగన్ ప్రశంసలు

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement