విజయవాడ: వైఎస్సార్‌సీపీ శ్రేణులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇబ్రహీంపట్నం పర్యటనను సక్సెస్ కావడాన్ని కూటమి ప్రభుత్వ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు.
మాజీ మంత్రి జోగి రమేష్‌పై మరో అక్రమ కేసు నమోదు చేయడమే ఇందుకు ఉదాహరణ. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని, జన సమూహాన్ని పోగు చేశారంటూ సెక్షన్ 30 యాక్ట్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం పీఎస్‌లో జోగి రమేష్‌పై కేసు నమోదు చేశారు.
వైఎస్ జగన్ ఇబ్రహీంపట్నంకు జన సందోహం స్వచ్ఛదంగా తరలివచ్చింది. వేలాదిగా ప్రజలు రోడ్లపైకి వచ్చి వైఎస్ జగన్ ఘనమైన సంఘీభావం తెలిపారు. చివరి నిమిషంలో వైఎస్ జగన్ పర్యటన రూట్ మ్యాప్ మార్చి కూటమి ప్రభుత్వం కుట్రలు చేసినా.. అది ప్రజాభిమానం ముందు నిలవలేకపోయింది. వైఎస్ జగన్ పర్యటన సక్సెస్ కావడంతో అది కూటమి ప్రభుత్వానికి రుచించడం లేదు. దీనిలో భాగంగా వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్‌పై అక్రమ కేసు బనాయించింది. జన సమీకరణ చేశారంటూ ఏవో కథలు చెబుతూ అక్రమ కేసును నమోదు చేయించింది.

ఇవీ చదవండి:


