కీసర: కంచికచర్ల మండలం కీసర వద్ద ఘోర బస్సు ప్రమాదం తప్పింది. ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగాయి. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న ఇంటర్సిటీ వరుణ్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. బస్సులో 39 ప్రయాణికులు అందరూ సురక్షితంగా కిందకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు
ఉదయం 5:30 ల సమయంలో బస్సు ఇంజన్ వద్ద సౌండ్ రావడంతో బస్సు నిలుపుదల చేశాడు డ్రైవర్. వెనుక నుంచి పోగలను గమనించిన ప్రయాణికులు అప్రమత్తం అయి కిందకు దిగి చూడగా అప్పటికే మంటలు రావడాన్ని పసిగట్టారు ప్రయాణికులు. దాంతో వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఆపై ఫైర్ నేషనల్ హైవే సిబ్బంది అప్రమత్తతో మంటలను అదుపులోకి కొచ్చారు ఫైర్ సిబ్బంది.


