సోఫాకు సిగరెట్‌ నిప్పంటుకుని.. | retired military employee ends life in hyderabad | Sakshi
Sakshi News home page

సోఫాకు సిగరెట్‌ నిప్పంటుకుని..

Feb 7 2026 9:39 AM | Updated on Feb 7 2026 11:24 AM

retired military employee ends life in hyderabad

హైదరాబాద్: మద్యం మత్తులో సిగరెట్‌ తాగుతుండగా.. సోఫాకు నిప్పంటుకుని విశ్రాంత సైనిక ఉద్యోగి దుర్మరణం పాలైన ఘటన బోరబండ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. సెక్టార్‌ ఎస్‌ఐ కాశయ్య తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నకేశవులు (67) విశ్రాంతి సైనికోద్యోగి. భార్య, ఇద్దరు కుమారులతో కలిసి హెచ్‌ఎఫ్‌ నగర్‌ ఫేజ్‌–1 బస్తీలో నివాసముంటున్నాడు. ఆయనకు మద్యం, పొగ తాగే అలవాటు ఉంది. 

కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చెన్న కేశవులు భవనం పైగదిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం ఆయన ఉన్న గది నుంచి మంటలు రావడంతో భార్య, స్థానికులు వెళ్లి చూడగా.. సోఫాలోనే పూర్తిగా కాలిపోయి ఉన్నాడు. చెన్నకేశవులు మద్యం మత్తులో సిగరెట్‌ తాగుతున్న క్రమంలో సోఫాకు నిప్పు అంటుకోవడంతో మంటలు చెలరేగి కాలిపోయి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement