అమ్మ ఆఖరికోరిక తీర్చిన తనయులు | Secunderabad Gandhi Medical College donation of Sangam Malleswari Davi by her sons | Sakshi
Sakshi News home page

అమ్మ ఆఖరికోరిక తీర్చిన తనయులు

Feb 7 2026 9:44 AM | Updated on Feb 7 2026 9:45 AM

Secunderabad Gandhi Medical College donation of Sangam Malleswari Davi by her sons

గాందీఆస్పత్రి : వైద్య విద్యార్థులకు పరిశోధనల నిమిత్తం తల్లి పార్థివ దేహాన్ని సికింద్రాబాద్‌ గాంధీ మెడికల్‌ కాలేజీకి అప్పగించారు ఆమె కుమారులు. వివరాలు.. కరీంనగర్‌కు చెందిన సంగం మల్లీశ్వరీదేవి (76) ఐఎస్‌సదన్‌లోని ఇందిరా సేవసదన్‌ ఆనాథాశ్రమంలో పెరిగారు. అనంతరం స్థానిక  ఎయిడెడ్‌ పాఠశాలలో ఎస్‌జీటీ టీచర్‌గా పనిచేశారు. భర్త లక్ష్మీనారాయణ పదేళ్ల క్రితం మృతి చెందగా, ఇద్దరు కుమారులు బాలాజీ, భరత్‌లతో చంపాపేట డివిజన్‌ ఎస్‌జీఆర్‌ కాలనీలో ఉంటున్నారు. మల్లీశ్వరీదేవి తన మరణానంతరం పార్థీవదేహాన్ని వైద్యవిద్యార్థుల పరిశోధనలకు అప్పగించాలని కుమారులను కోరారు.

 మల్లీశ్వరీదేవి గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో కుమారులు బాలాజీ, భరత్‌లు మల్లీశ్వరీదేవి పారి్ధవదేహాన్ని శుక్రవారం సికింద్రాబాద్‌ గాంధీ మెడికల్‌ కళాశాలకు అప్పగించారు. వైద్యవిద్యార్థుల పరిశోధన నిమిత్తం గాంధీ అనాటమీ విభాగంలో మృతదేహానికి ఎంబామింగ్‌  చేసి భద్రపరిచారు. కార్యక్రమంలో గాంధీ ప్రిన్సిపాల్‌ ప్రొ. ఇందిర, సూపరింటెండెంట్‌ ప్రొ. వాణి, ఆర్‌ఎంఓ–1 శేషాద్రి, అనాటమీ వైద్యులు, వైద్యవిద్యార్థులు, మల్లీశ్వరీదేవి కుటుంబసభ్యులు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement