ఆడ తోడు కోసం అలుపెరగని ప్రయాణం! | Operation Tiger Continues In Telangana News Latest Updates | Sakshi
Sakshi News home page

ఆడ తోడు కోసం అలుపెరగని ప్రయాణం!

Feb 7 2026 10:01 AM | Updated on Feb 7 2026 11:14 AM

Operation Tiger Continues In Telangana News Latest Updates

సాక్షి, జనగామ: జిల్లాలో పెద్దపులి కోసం ఆపరేషన్‌ కొనసాగుతోంది. నెల రోజులు కావొస్తున్నా.. దాని జాడ మాత్రం చిక్కడం లేదు. ఈ తెల్లవారు జామున నర్మెట మండలం అమ్మపురం గ్రామంలో రెండు దూడలను పులి చంపింది. దీంతో.. చుట్టుపక్కల గ్రామాలు భయాందోళనకు గురవుతున్నాయి.

ఈ పెద్దపులి తొలుత ఆడ తోడు కోసం ఆమ్రాబాద్‌ అడవుల నుంచి వచ్చిందని అటవీశాఖ అధికారులు భావించారు. అయితే ఆ తర్వాతే మహారాష్ట్ర అడవుల నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల మీదుగా తాజాగా జనగామ జిల్లాలోకి ప్రవేశించిందని నిర్ధారించుకున్నారు. మొదటిగా లింగాలఘనపురం మండలంలో అడుగుపెట్టింది. తర్వాత దేవరుప్పల మండలంలోని వ్యవసాయ పొలాల మీదుగా శుక్రవారం రఘునాథపల్లి మండలం మండలగూడెం గ్రామ శివారులో సంచరించినట్లు అటవీ, పోలీస్‌ శాఖల అధికారులు గుర్తించారు. గత.. మూడు రోజులుగా జిల్లాలో పులి సంచారంతో ప్రజలంతా భయాందోళన చెందుతున్నారు. 

ఈ ఉదయం.. పశువుల అరుపులు విన్న వాటి యాజమానులు బయటకు వచ్చేసరికి.. రెండు దూడలు మృతదేహాలుగా కనిపించాయి. ఈ దాడి తర్వాత గ్రామంలో భయం మరింత పెరిగింది. పిల్లలు, మహిళలు బయటకు వెళ్లడానికి భయపడుతున్నారు. రైతులు తమ పశువులను కాపాడుకోవడానికి గూడెల వద్ద కాపలా కాస్తున్నారు. అటవీశాఖ తక్షణమే స్పందించి తమ సిబ్బందిని అక్కడికి పంపించింది. 

తోడు కోసం మొదలైన యాత్ర.. 
యాదాద్రి, సిద్ధిపేట, జనగాం.. జిల్లాల గుండా వెళ్లే దారిలో పులి అక్కడక్కడా లేగదూడలను చంపుతోంది. అయితే.. ఆడ పులి కోసం వెతుకుతూ సంచారం ప్రారంభించిందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. డ్రోన్‌ కెమెరాల సాయంతో జాడ తెలుసుకునేందుకు శ్రమిస్తున్నారు. అదే విధంగా అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న వ్యవసాయ క్షేత్రాల వద్దకు వెళ్లే రైతులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ.. జనగామ, హనుమకొండ జిల్లాల అటవీశాఖ అధికారి లావణ్య ఒక ప్రకటన విడుదల చేశారు. లింగాలఘనపురం, రఘునాథపల్లి, నర్మెట్ట, జనగామ, దేవరుప్పుల, తరిగొప్పుల తదితర మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే.. పులి సంచారంపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంప్రదించాల్సిన ఫోన్‌నంబర్లు

  • బీట్‌ ఆఫీసర్, రఘునాథపల్లి : 96037 80678
  • ఎఫ్‌ఎస్‌వో, రఘునాథపల్లి : 73826 19411
  • ఎఫ్‌ఎస్‌వో, జనగామ: 81213 16323
  • డిప్యూటీ ఆర్‌వో, లింగాలఘనపురం: 97046 01785
  • ఎస్‌హెచ్‌వో, రఘునాథపల్లి : 87126 85211
  • తహసీల్దార్, రఘునాథపల్లి: 96763 88123
  • ఎఫ్‌ఆర్‌వో, జనగామ: 93989 46440
  • డీఎఫ్‌వో, జనగామ: 94408 10093

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement