ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చూడండి
రఘునాథపల్లి: మండల పరిధిలోని పలుప్రాంతాల్లో పులి సంచారం నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అటవీశాఖ సమన్వయంతో తగిన చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రఘునాథపల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్‌లోని రికార్డ్, స్టేషన్ రైటర్ రూమ్‌లు, రిసెప్షన్ సెంటర్, ఇతర విభాగాలను పరిశీలించారు. స్టేషన్ పరిధిలో నేరాల రేటు, రోడ్డు ప్రమాదాలు, చోరీలు, నమోదైన కేసుల పురోగతిపై ఆరా తీశారు. అధికారులు, సిబ్బంది పనితీరును మరింత మెరుగు పరుచుకొని చేపట్టాల్సిన విధి విధానాలపై సీఐ, ఎస్సైలకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో స్టేషన్‌ఘన్‌పూర్ ఏసీపీ భీంశర్మ, జనగామ రూరల్ సీఐ ఎడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై దూదిమెట్ల నరేశ్ ఉన్నారు.
అటవీశాఖతో సమన్వయం చేసుకోవాలి
రఘునాథపల్లి పోలీస్‌స్టేషన్‌ను
తనిఖీ చేసిన సీపీ


