● డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అనిత
జనగామ రూరల్: లాభసాటి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ జి.అనిత అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం చిటుకోడూర్ గ్రామంలో స్పెషల్ ఆఫీసర్ గిరి రాజు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సర్పంచ్ కూకట్ల యాదగిరి అధ్యక్షతన రైతులను అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా అగ్రికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ అనిత మాట్లాడుతూ..గ్రామాల్లో నేల స్వభావాన్ని బట్టి పంటల మార్పిడి చేయాలన్నారు. ఉద్యానవన పంటలతో తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి కిరణ్, రైతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


