Jangaon
-
రూపాయిన్నర కోసం లొల్లి
జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్ కాటన్ యార్డులో ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రంలో రూ.1.50 (రూపాయిన్నర) లొల్లితో రెండు రోజులుగా కొనుగోళ్లు నిలిచి పోయాయి. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు తీవ్ర ఇబ్బందులు తప్పడంలేదు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని బస్తాలో నింపి కాంటా వేసిన తర్వాత లారీలో లోడ్ చేసినందుకు హమాలీలకు రైతులు క్వింటాకు రూ.80 చెల్లిస్తున్నారు.అయితే లారీ కాంట్రాక్టర్ నుంచి బస్తాకు రూ. 1.50 పైసలు ఇవ్వాలని హమాలీలు డిమాండ్ చేస్తుండగా.. ససేమిరా అనడంతో రెండు రోజులుగా కాంటా నిలిచి పోయింది. రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, సివిల్ సప్లయిస్ డీఎం హతీరామ్, మార్కెటింగ్ మేనేజర్ నరేంద్ర, పౌర సరఫరాల శాఖ నాయబ్ తహసీల్దార్ శ్రీనివాస్ లారీ కాంట్రాక్టర్, హమాలీలతో చర్చలు జరిపారు.అయినా రూ.1.50 పైసలు ఇచ్చేందుకు సదరు కాంట్రాక్టర్ ఒప్పుకోలేదు. ప్రస్తుతం జిల్లాలోని ఐకేపీ సెంటర్లలో క్వింటా ధాన్యం కాంటా వేసి, లోడ్ చేస్తే రూ.60 ఉండగా, ఇక్కడ మాత్రం రూ.80 ఇస్తున్నారని, సర్దుకు పోవాలని హమాలీలకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఇరువురి మధ్య గురువారం రాత్రి వరకు చర్చలు సాగుతూనే ఉన్నాయి. -
ఎలక్ట్రికల్ షాపులో మంటలు!
జనగామ: జిల్లా కేంద్రం హైదరాబాద్ రోడ్డులోని జై భవానీ ఎలక్ట్రికల్, హార్డ్‌వేర్ దుకాణంలో బుధవారం రాత్రి ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. రాత్రి 10.30 గంటలకు వ్యాపారి షాపు మూసివేసి పైఅంతస్తులో ఉన్న ఇంటికి వెళ్లి పోయారు. పది నిమి షాల వ్యవధిలోనే షట్టర్ లోపల నుంచి పొగలు రావడాన్ని స్థానికులు గమనించి అలర్ట్ చేశారు. అప్పటికే దుకాణం లోపల నుంచి మంటలు ఎగసి పడ్డాయి. పోలీసులు, ఫైర్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించగా.. సమీప దుకాణాలకు మంటలు వ్యాప్తి చెందే క్రమంలో బోరు మోటారు పైపులతో మంటలను చల్లార్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మెకానిక్, టైర్లు, ఆటో మొబైల్, తదితర షాపుల వరకు స్వల్ప మంటలు వ్యాప్తి చెందడంతో దుకాణదారులు ఆందోళన చెందారు. పది నిమిషా ల లోపు జనగామ ఫైర్ సేఫ్టీ అధికారులు అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసే కెమికల్‌తో వాటర్ స్ప్రే చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదే సమయంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన ఫైర్ ఇంజిన్ కూడా రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో రూ.50లక్షల వరకు నష్టం జరగవచ్చని అంచనా. డీసీపీ రాజమహేంద్రనాయక్ పర్యవేక్షణలో ఏఎస్పీ పండేరి చేతన నితిన్, సీఐలు దామోదర్‌రెడ్డి, అబ్బయ్యగౌడ్ ఆధ్వర్యంలో ఎస్సైలు రాజేష్, రాజన్‌బాబు, సిబ్బంది, ఫైర్ సేఫ్టీ అధికారులకు సహకారం అందించారు.కుటుంబ సభ్యులు సేఫ్మంటలు చెలరేగిన సమయంలో జై భవానీ దుకాణం కుటుంబ సభ్యులు, అందులో పని చేసే సుమారు 15 మంది కార్మికులు పై అంతస్తులోనే ఉన్నారు. మంటలు పైకి చేరుకునే లోపే వారిని వెనక భాగం నుంచి కిందకు దింపడంతో అంతా సేఫ్‌గా బయట పడ్డారు. దుకాణం లోపల ఎగసి పడుతున్న మంటలు ఆర్పేందుకు షట్టర్లను పగుల గొట్టారు. జిల్లా కేంద్రంలో శ్రీ లక్ష్మి, విజయ షాపింగ్ మాల్స్ దగ్ధమైన సంఘటన మరువక ముందే... జైభవానీ షాపులో మంటలు చెలరేగడం వ్యాపారులతో పాటు పట్టణ ప్రజల్లో ఆందోళన నెలకొంది. -
‘సవాల్లో ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటావా’
జనగామ జిల్లా: దేవునూర్ అటవీ భూముల కబ్జా ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కడియం శ్రీహరి సవాల్ విసిరారు. 30 ఏళ్ల రాజకీయ చరిత్రలో తాను ఏనాడు అవినీతికి పాల్పడలేదని, ఒకవేళ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే రాజయ్య చేసిన ఆరోపణలపై స్టేషన్‌ఘన్‌పూర్‌లో ధ్వజమెత్తారు కడియం శ్రీహరి.‘ దమ్ముంటే రాజయ్య నా సవాల్‌ను స్వీకరించాలి. దళితబంధులో నువ్వు చేసిన అవినీతిని ప్రజాక్షేత్రంలో నిరూపిస్తా. సవాల్లో ఓడితే.. నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటావా రాజయ. మరోసారి చౌకబారు ఆరోపణలు చేస్తే సహించేది లేదు. అవినీతి అక్రమాలకు పుట్ట కేసీఆర్ కుటుంబం. బీఆర్ఎస్, బీజేపీ విమర్శలను కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టాలి’ అని కడియం శ్రీహరి పేర్కొన్నారు. -
జనగామలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, జనగామ: జనగామలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున విజయ షాపింగ్ మాల్లో మంటలు చెలరేగాయి. దీంతో పక్క షాపులకు కూడా విస్తరించాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి.ఈ ప్రమాదంలో రూ.10 కోట్లకు పైగా ఆస్తినష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. మంటలు భారీగా ఎగిసిపడటంతో ఫైర్ సిబ్బంది అదుపుచేయలేకపోతున్నారు. పక్కనే ఎస్బీఐ బ్యాంక్ ఉండటంతో బ్యాంక్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఆలేరు, కోదాడ, స్టేషన్ ఘన్పూర్, కోడకండ్లతో సహ 6 ఫైర్ ఇంజన్లతో సిబ్బంది మంటలార్పుతున్నారు. -
లాయర్ పై పోలీస్ ఓవరాక్షన్.. చివరికి సీన్ రివర్స్
-
జిల్లా స్థాయిలో సాధారణ బదిలీలు షురూ..
జనగామ: జిల్లా స్థాయిలో సాధారణ బదిలీలు మొదలయ్యాయి. ఈనెల 5వ తేదీన ప్రారంభమైన ట్రాన్స్ఫర్ల ప్రక్రియ 20వ తేదీ వరకు కొనసాగనుంది. ఒకేచోట నాలుగేళ్ల పాటు పనిచేస్తున్న ఉద్యోగులు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉండగా.. రెండేళ్ల సర్వీసు కాలంలో కొంతమంది ట్రాన్స్‌ఫర్‌కు ఆప్షన్ ఇచ్చుకున్నారు.బదిలీల సమయంలో ఒకరి కంటే ఎక్కువ మంది ఉద్యోగులు నిర్దిష్ట స్థలాన్ని ఎంచుకు న్న సమయంలో జీఓలో పొందు పరిచిన నిబంధన ల మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది. భార్యాభర్తలు ఉద్యోగులుగా పని చేస్తున్న సమయంలో (స్పౌజ్) ఒకరిని మాత్రమే బదిలీ చేస్తారు. 70శాతం అంతకంటే ఎక్కువ వైకల్యం, మానసిక దివ్యాంగులు, పిల్లలు కలిగి ఉన్న ఉద్యోగులకు ట్రాన్స్ఫర్ సమయంలో కొంత సడలింపు ఇచ్చారు.ఉద్యోగి లేదా ఆయన భార్య, పిల్లలు, వారిపై ఆధారపడిన తల్లిదండ్రులకు న్యూరోసర్జరీ, కిడ్నీమార్పిడి, కాలేయ మార్పిడి, ఓపెన్ హార్ట్ సర్జరీ, బోన్ టీబీ సంబంధిత వైద్య పరీక్షల సమయంలో మెడికల్ గ్రౌండ్స్ కింద బదిలీల్లో ప్రాధాన్యత ఇస్తారు. వ్యక్తిగత లేదా వైద్య కారణాలపై బదిలీలకు సంబంధించి ఆ శాఖ ఉన్నతాధికారి ధ్రువీకరించాల్సి ఉంటుంది. జిల్లా స్థాయి బదిలీల ప్రక్రియ కలెక్టర్ ఆధ్వర్యా న, అదనపు కలెక్టర్, డీఆర్డీఓ తదితర ఉన్నతాధికా రుల పర్యవేక్షణలో కొనసాగుతుంది.బదిలీలకు 256 మంది ఆప్షన్..జిల్లాలో జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఓఎస్, నైట్ వాచ్‌మన్, ఎంఎన్ఓ, పంచాయతీ కార్యదర్శి, మెసెంజర్, రికార్డు అసిస్టెంట్, వాచ్‌మన్, ఫైర్‌మన్, థియేటర్ అసిస్టెంట్, వాటర్ మెన్, స్వీపర్ తదితరులు డిపార్ట్మెంట్ వారీగా 788 మంది ఉన్నారు.ఇందులో 256 మంది బదిలీ కోసం ఆప్షన్లు ఇవ్వగా.. అన్ని కేటగిరీల్లో 155 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఒకేచోట పనిచేస్తూ నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న(తప్పనిసరి) 233 మంది ఉద్యోగులు బదిలీలకు ఆప్షన్ ఇవ్వగా.. జీఓ నిబంధనల మేరకు రెండేళ్లు ఒకేచోట పనిచేస్తున్న 23 మంది సైతం ట్రాన్స్ఫర్లు కోరుకున్నారు.కలెక్టరేట్లో బదిలీ కేటాయింపులుజిల్లా స్థాయి సాధారణ బదిలీల్లో భాగంగా సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ నేతృత్వంలో కలెక్టరేట్ ఏఓ రవీందర్, జెడ్పీ సీఈఓ, ఇన్చార్జ్ డీపీఓ అనిల్‌కుమార్, డీఈఓ రాము, డిప్యూటీ జెడ్పీ సీఈఓ సరిత, డీటీఓ నర్సింహారెడ్డి తదితరుల ఆధ్వర్యాన ఉదయం నుంచి సాయంత్రం వరకు బదిలీల ప్రక్రియ కొనసాగింది. గ్రేడ్ 1,2,3 పంచాయతీ కార్యదర్శుల బదిలీలు మినహా అన్ని శాఖలకు సంబంధించి పూర్తి కాగా.. ఈనెల 20వ తేదీ వరకు ఆర్డర్ కాపీలను అందించనున్నారు.ఇదిలా ఉండగా.. జిల్లా పంచాయతీ శాఖలో సీనియర్ పంచాయతీ, జూనియర్ కార్యదర్శులు 281 మంది ఉండగా.. 162 మంది బదిలీలకు అర్హత కలిగి ఉన్నారు. ఇందులో 95 మంది ఒకేచోట నాలుగేళ్లుగా పనిచేస్తున్నారు. జీఓ నిబంధనలను అనుసరించి 40శాతం మాత్రమే బదిలీలు చేయాలి.. దీంతో 74 మందికి అవకాశం రానుంది. ఇందులో 65 మంది సీనియర్లు, 9 మంది జూనియర్లు మరోచోటకు వెళ్లనున్నారు. వీరి బదిలీలను నేడు(మంగళవారం) చేపట్టనున్నారు. -
డ్రగ్స్ తీసుకున్నా.. విక్రయించినా శిక్షలు తప్పవు
స్టేషన్‌ఘన్‌పూర్: ఎవరైనా సరె డ్రగ్స్ తీసుకున్నా.. విక్రయించినా, నిల్వ ఉంచుకున్నా శిక్షలు తప్పవని స్టేషన్‌ఘన్‌పూర్ ఏసీపీ భీంశర్మ అన్నారు. మండలంలోని శివునిపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం సీపీ ఆదేశాల మేరకు డ్రగ్స్ వలన కలిగే దుష్పరిమాణాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం యువత డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని, ఇలా వాడుతూ దొరికితే జీవితంలో ప్రభుత్వ ఉద్యోగానికి పనికి రాకుండా అవుతారన్నారని, అందుకు డ్రగ్స్ వాడి జీవితాలను నాషనం చేసుకోవద్దని సూచించారు. సీఐ రాజు, ఎస్సైలు పాల్గొన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.రఘునాథపల్లి: విద్యార్థులు గంజాయి లాంటి మత్తు పరార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని జనగామ రూరల్ సీఐ శ్రీనివాస్‌యాదవ్ సూచించారు. సోమవారం మండలంలోని వెల్ది మోడల్ స్కూల్ విద్యార్థులకు గంజాయి, ఇతర మత్తు పదార్థాలతో కలిగే అనర్దాలపై ప్రిన్సిపాల్ వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.మత్తు పదార్థాలు సేవించడం ద్వారా అనారోగ్య సమస్యలతో పాటు విలువైన జీవితం అందకారం కానుందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నతంగా ఎదగాలని సూచించారు. ఎస్సై దూదిమెట్ల నరేశ్ ఉన్నారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్ధాం.పాలకుర్తి టౌన్: డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు విద్యార్థులు, యువత భాగస్వాములు కావాలని పాలకుర్తి సీఐ గట్ల మహేందర్‌రెడ్డి అన్నారు. వరంగల్ సీపీ అదేశాల మేరకు మండలంలోని గూడూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
జనగాం: ఆర్టీసీ బస్సు బీభత్సం.. ముగ్గురి మృతి
సాక్షి, జనగాం: జనగాంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు.. ఓ మొబైల్ టిఫిన్ సెంటర్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. -
రాజకీయ నాయకుల గురించి పిల్లలకు ఎలాంటి మాటలు చెబుతున్నాడో చూడండి
-
పోలింగ్ లో రచ్చ రచ్చ..కాంగ్రెస్, బీఆర్ ఎస్ మధ్య ఫైట్
-
అభివృద్ధి శూన్యం అంటున్న జనగామ జనం
-
అప్పట్లో జనగామను చూసి ఏడ్చా: సీఎం కేసీఆర్
సాక్షి, జనగామ: ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దు. ఆపద మొక్కుల మాదిరిగా కొందరు ఏదేదో చెబుతారు.వాళ్ళ మాటలు నమ్మితే మోసపోయి గోస పడుతాం. ప్రజాస్వామ్యంలో బలమైన ఆయుధం ఓటు అని.. అందుకే ఆలోచించి ఓటేయాలని జనగామ ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపు ఇచ్చారు. సోమవారం సాయంత్రం జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. ‘‘జనగామలో ఒకప్పుడు భయంకరమైన పరిస్థితులు ఉండేవి. గతంలో కరెంట్ కోతలు తప్ప ఏం ఉండేది కాదు. కరువుతో అల్లాడుతున్నామని చెబుతుంటే నాకు దుఃఖం ఆగలేదు. అప్పటి పరిస్థితి చూసి బచ్చన్నపేటలో ఏడ్చాను. తెలంగాణలో గులాబీ జెండా ఎగరగానే.. దేవాదులకు శంకుస్థాపన చేసి చంద్రబాబు మోసం చేశారు. మాయ మాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నాలు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడు నాలుగు నెలలు మథనం చేశాం. ఆర్థిక పరిస్థితిపై చర్చలు చేశాం. ఇప్పుడు తెలంగాణ ఎలా ఉంది?. కరెంట్ కష్టాలు లేవు. నీటి కొరత లేదు. పుట్లకొద్ది పంటలు పండుతున్నాయి. ఎక్కడ కరువు వచ్చినా.. జనగామలో మాత్రం రాదు. పాత వరంగల్ జిల్లాలో అత్యధికంగా వడ్లు పండించే ప్రాంతం జనగామనే. రాష్ట్రం ఏర్పడ్డాక.. భువనగిరి, జనగామలు గ్రోత్‌కారిడార్లు అయ్యాయి. దేవాదుల, కాళేశ్వరం నుంచి నీళ్లు రాబోతున్నాయి అని ప్రసంగించారు కేసీఆర్. భూమిపై హక్కులు రైతులకే ఉండాలి. రైతుల బాధలు నాకు తెలుసు. అందుకే భూములపై అధికారుల అధికారం తొలగించాం. మీ భూమి మీద అధికారం మీకే(రైతుల్ని ఉద్దేశించి..) ఇచ్చాం. నా ప్రాణం పోయినా సరే అది మారనివ్వను. ధరణిని తీసి కాంగ్రెస్ వాళ్లు బంగాళాఖాతలో కలిపేస్తారట. ధరణిని కాదు.. కాంగ్రెస్ వాళ్లనే బంగాళాఖాతంలో వేయాలి. కాంగ్రెస్‌కు ఓటేస్తే.. వీఆర్ఏలు వస్తారు. మళ్లీ ఆగం అవుతారు. వ్యవసాయానికి కాంగ్రెస్ వాళ్లు మూడు గంటల కరెంట్ ఇస్తారట. 24 కరెంట్ కొనసాగాలంటే.. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి అని ప్రజలను కోరారాయన. ఎన్నికలు వచ్చినప్పుడు కనిపించేవారిని నమొద్దు. ఓటు మన తలరాత మారుస్తుంది.. ఆలోచించి ఓటు వేయండి. మంచి ఏదో, చెడు ఏదో గుర్తించి ఓటేయండి. వందకు వంద శాతం జనగామ అభివృద్ధి జరిగి తీరుతుంది. జనగామ లో ఏం జరగాలనుకున్నామో.. అవన్నీ జరుగుతాయి. ఎన్నికల తర్వాత మళ్ళీ వస్తా.. అన్ని పనులు చేస్తాం అని జనగామ సభకు హాజరైన ప్రజానికాన్ని ఉద్దేశించి కేసీఆర్ కోరారు. తన ప్రసంగానికి ముందు.. ముందు సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు కేసీఆర్. పొన్నాలతో పాటు పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే కాకముందే సమస్యలను ప్రస్తావించిన పల్లా రాజేశ్వర్‌రెడ్డిని అభినందించిన సీఎం కేసీఆర్.. ‘‘పల్లా రాజేశ్వర్ రెడ్డి హుషారుగా ఉన్నాడు అనుకున్నా... ఇంత హుషారు అనుకోలేదు. పల్లా కంటే ముత్తిరెడ్డే నయం.చిన్న చిన్న ఇబ్బందులతో ముత్తిరెడ్డి కి బదులు పల్లా ను ఎన్నికల బరిలో నిలిపాం. ఎన్నికల ముందే పల్లా చాటబారతం అంత లిస్టు ఇచ్చిండు అని కేసీఆర్ చమత్కరించారు. అయితే.. అవన్నీ నెరవేర్చదగ్గ హామీలేనన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. హామీలన్నీ నెరవేరుస్తామని, చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా చేస్తామని సీఎం కేసీఆర్ సభా వేదికగా ప్రకటించారు. -
జనగామ బీఆర్ఎస్ లో టికెట్ జగడానికి తెరపడినట్లేనా..?
-
పల్లా, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మధ్య కుదిరిన సయోధ్య..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని హీటెక్కించిన జనగామ జగడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చెక్ పెట్టారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిల మధ్య సయోధ్య కుదిర్చారు. మినిస్టర్స్ క్వార్టర్స్‌లో జనగామ ప్రజాప్రతినిధులు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ముత్తిరెడ్డి లతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించుకోవాలని కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఈ భేటీలో మరో ఇద్దరు టికెట్ ఆశావహులు మండల శ్రీరాములు మరో ఆశావాహి కిరణ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. అయితే, తెలంగాణ ఆర్టీసీ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినా.. జనగామలో బీఆర్ఎస్ తరపున బరిలో తానే ఉంటానంటూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. మరోవైపు, జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని ఎప్పుడు ప్రకటిస్తారని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎదురుచూస్తున్న తరుణంలో పల్లాను గెలిపించుకోవాలంటూ.. ఈ రోజు జరిగిన భేటీలో కేటీఆరే స్వయంగా చెప్పారు. ఆగస్టు 21న 115 మంది అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ జాబితాలో జనగామ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిని పెండింగ్‌లో పెట్టారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి టీఎస్ఆర్టీసీ చైర్మెన్ పదవిని బీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టింది. పల్లాకు లైన్ క్లీయర్ చేసేందుకే ముత్తిరెడ్డికి ఆ పదవిని ఇచ్చినట్లు సమాచారం. చదవండి: ఎమ్మెల్సీకి లైన్ క్లియర్ అయినట్టేనా? ‘పల్లా’ కేనా..!? -
పల్లాపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
సాక్షి, జనగామ: జనగామ బీఆర్ఎస్ ఆధిపత్య పోరు మరింత రాజుకుంటోంది. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తాజా వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో పాటు క్షమాపణ చెప్పాలని పల్లాను డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం.. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు, ఇన్ బ్యాలెన్స్ ఉండేందుకు. అందుకే ఆహ్వానించారే తప్ప కుక్కల్ని చేయడానికి కాదని విషయాన్ని గమనించాలి. పల్లా తన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి. తప్పు జరిగిందని క్షమాపణ చెప్పాలి అని ముత్తిరెడ్డి డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై పల్లా రాజేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలను కుక్కలతో పోల్చారు. ‘ బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కుక్కలు. అటువైపు ఉంటే మొరుగుతారనే బీఆర్ఎస్లో చేర్చుకొని దొడ్లో కట్టేశారు. అటువైపు ఉన్న కుక్కలను ఇటు తీసుకుని.. వారిని పిల్లిలాగా కేసీఆర్ మార్చేశారు. అలా కేసీఆర్ వారిని గీత దాటకుండా చేసేశారు’ అని వ్యాఖ్యానించారు పల్లా. ముత్తిరెడ్డి ఆగ్రహం.. పల్లా వ్యాఖ్యలపై ముత్తిరెడ్డి ఫైర్ అయ్యారు. ‘‘బలుపెక్కువై డబ్బు ఎక్కువ ఉన్నవారు అమాయక ప్రజల మీద డబ్బులు చల్లి అయోమయానికి గురి చేస్తున్నారు. అలా చేయడం సీఎం కేసీఆర్ సంకల్పానికి విరుద్ధం. అమ్ముడుపోయేవారు ఆగమై మట్లే కలిసిపోతారు. కేసీఆర్ నిర్ణయం శిరోధార్యం. కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే అందరం కలిసే ప్రయాణం చేస్తాం. ప్రజల అభిమానాన్ని కోరికను కేసీఆర్ తీరుస్తాడు. ముఖ్యమంత్రి పై నాకు పూర్తి విశ్వాసం ఉంది. 14ఏళ్లుగా మీ కష్టాలు మీ జ్ఞాపకాలు కేసీఆర్ దృష్టిలో ఉన్నాయి. కాబట్టి సీఎం కోరిక తీరుస్తాడు. సముచిత నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా. భారీ మెజార్టీతో గెలుస్తాం’’ అని ముత్తిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చైర్పర్సన్ ప్రసంగానికి అంతరాయం దివ్యాంగుల ఆసరా పెంపు కార్యక్రమంలో ఇవాళ ముత్తిరెడ్డి పల్లాపై మండిపడ్డారు. అయితే.. ఎమ్మెల్యే మాట్లాడిన తర్వాత జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ జమున మాట్లాడారు. ముత్తిరెడ్డి కూడా తన బాధను చెప్పుకున్నారని, ఎవరికీ టికెట్ ఇచ్చిన పని చేయాలని ప్రసంగించారు. ఆ సమయంలో కార్యకర్తలు చైర్పర్సన్ ప్రసంగానికి అడ్డుతలిగారు. ముత్తిరెడ్డి కి అనుకూలంగా నినాదాలు చేయడంతో ఆ కార్యక్రమం గందరగోళంగా మారింది. దీంతో ముత్తిరెడ్డి జోక్యం చేసుకునితన అనుచరుల్ని శాంతింపజేశారు. మరోవైపు జనగామ అభ్యర్థిని త్వరగా ఖరారు చేసి ఉత్కంఠకు తెరదించాలని ముత్తిరెడ్డి వర్గం బీఆర్ఎస్ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తోంది. -
జనగామ ఎవరికీ?.. పొన్నాలను వెంటాడుతున్నదేంటి?
ఆయన ఒకప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో చక్రం తిప్పారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. పీసీసీ చీఫ్‌గానూ పనిచేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఆ నేతకు వచ్చే ఎన్నికల్లో సీటు బాధ మొదలైంది. తన ప్రత్యర్థి సీటు తన్నుకుపోతాడనే భయం మొదలైంది. తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు టికెట్ కష్టాలు మొదలయ్యాయి. జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిని ఏఐసిసి ఇటీవలే నియమించింది. దాంతో జనగామ అసెంబ్లీ టికెట్ కూడా ఆయనే ఎగరేసుకుపోతారేమోననే అనుమానం పొన్నాలను వెంటాడుతోంది. గత ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో రాహుల్ గాంధీ అండతో టిక్కెట్ దక్కించుకున్న పొన్నాల లక్ష్మయ్య ఈసారి మాత్రం ముందుగానే అప్రమత్తమయ్యారు. ఢిల్లీలో ఏఐసిసి పెద్దలను కలుసుకుంటూ తన గోడు వెళ్లబోసుకుంటున్నారు. మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన తనకే తెలియకుండా తన జిల్లా అయిన జనగామ డీసీసీ అధ్యక్షుడిగా తన వ్యతిరేకవర్గ నాయకుడిని నియమించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా కొమ్మూరి నియామకాన్ని రద్దు చేయించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి రికమండేషన్‌తో జనగామ డీసీసీ అధ్యక్ష పదవిని కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి దక్కించుకున్నారు. తనకు వ్యతిరేకంగా ఉన్న ప్రతాప్‌రెడ్డికి ఏకంగా పీసీసీ చీఫ్‌తో పాటు కోమటిరెడ్డి మద్దతు ఇస్తుండడంతో పొన్నాల ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. 2014, 2018 ఎన్నికలలో పొన్నాల ఓటమి పాలు కావడం, వయసు 79 సంవత్సరాల వయస్సుతో వయో భారం పెరగడం ఆయనకు ప్రతికూల అంశాలుగా మారాయి. చదవండి: తెలంగాణలో కమ్మలకు, వెలమలకు చెడిందా? అయితే 2014 ఎన్నికల్లో 52వేల ఓట్లు, 2018 ఎన్నికల్లో 62 వేల ఓట్లు పొన్నాల తెచ్చుకోగలిగారు. అదే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి 2014లో బీజేపీ తరపున బరిలో దిగి దాదాపు 21 వేల ఓట్లు తెచ్చుకున్నారు. ఏజ్ ఫ్యాక్టర్‌తో పాటు పీసీసీ చీఫ్ ఆశీస్సులు కొమ్మూరికి కలిసి వస్తుండగా.. పొన్నాల మాత్రం అధిష్టానంపైనే భారం వేశారు. కొమ్మూరి ప్రతాపరెడ్డి నియామకం రద్దు చేయించడానినికి పట్టువదలని విక్రమార్కుడిలా పొన్నాల తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరి ఈ వృద్ధ నేత ప్రయత్నం ఫలిస్తుందా ? డీసీసీ పదవి రద్దు సంగతేమో గానీ, కనీసం జనగామ టికెట్ అయినా దక్కించుకుంటారా ? అంటూ జనగామ కాంగ్రెస్‌లో చర్చ నడుస్తోంది. -
జనగామ జిల్లాలోని బీఆర్ఎస్ లో సీట్ల లొల్లి
-
జనగామ ఎమ్మెల్యే టికెట్‌పై పోటాపోటీ సమావేశాలు
-
అసమ్మతి మీటింగ్‌కు ముత్తిరెడ్డి! షాకైన నేతలు
సాక్షి, హైదరాబాద్: జనగామ బీఆర్ఎస్ టికెట్ రేస్ పంచాయితీ హైదరాబాద్‌కి చేరింది. ప్రగతి భవన్‌కి కూతవేటు దూరంలో క్యాంప్ రాజకీయం ఆసక్తికరంగా సాగింది. ఎమ్మెల్సీ పల్లాను కలిసేందుకు బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్‌కు రాగా, వారు హైదరాబాద్ వెళ్లారనే సమాచారంతో హుటాహుటిన నగరానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి వచ్చారు. టూరిజం ప్లాజాలో ఆయన ప్రత్యక్షమవడంతో జనగామ బీఆర్ఎస్ నేతలు షాకయ్యారు. ముత్తిరెడ్డికి తెలియకుండానే పల్లా పిలిపించాడని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అధిష్టానం ఇలాంటి చర్యలను క్షమించదని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అన్నారు. ‘‘ఇక్కడకు వచ్చిన వారిలో ముఖ్య కార్యకర్తలు ఎవరూ లేరు. జడ్పీటీసీ, ఎంపీపీ, మండలాధ్యక్షులు నా వెంటే ఉన్నారు. కొంత మంది మా నియోజకవర్గ పార్టీ నేతలు హరిత ప్లాజాకు వచ్చారని తెలిసింది. ఎవరు వచ్చారో తెలుసుకుందామని వచ్చాను. ..తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి నడిచిన వ్యక్తిని నేను. గతంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి నాకు ఫోన్ చేసి ఇలాంటివి ప్రోత్సహించనని చెప్పారు. అసమ్మతి సంగతి అధిష్టానం చూసుకుంటుంది’’ అని ముత్తిరెడ్డి అన్నారు. చదవండి: టార్గెట్ కేసీఆర్.. రేవంత్ ఆరోపణలకు అర్థాలు లేవులే! -
ఇంటి ఓనర్ లైంగిక వేధింపులు వివాహిత ఆత్మహత్య
వర్ధన్నపేట: లైంగిక వేధింపులతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. వర్ధన్నపేట ఎస్సై ప్రవీణ్‌కుమార్ కథనం ప్రకారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు గ్రామానికి చెందిన పస్తం శ్రీనుకు 2006 సంవత్సరంలో మంజుల (34)తో వివాహం జరిగింది. బతుకుదెరువు నిమిత్తం 10 సంవత్సరాల క్రితం ముంబై వెళ్లిన దంపతులు.. మూడు నెలల క్రితం ఇంటికి చేరుకున్నారు. ఈక్రమంలో మండలంలోని ఎలికెట్ట గ్రామం టిక్షతండాకు చెందిన జాటోత్ జితేందర్‌కు తమ ఇంట్లోని ఓ గదిని అద్దెకు ఇచ్చారు. ఈ నేపథ్యంలో జితేందర్ తరుచూ మంజులను లొంగదీసుకోవాలని యత్నించాడు. దీనిపై తొర్రూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు జితేందర్‌కు కౌన్సెలింగ్ నిర్వహించారు. అయినా ఆయనలో మార్పు రాకపోవడంతో మరోసారి పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఈ వేధింపులు తాళ లేక మంజుల 15 రోజుల క్రితం తన సోదరి శారద ఇంటికి వెళ్లింది. అక్కడ మంజులకు మాయమాటలు చెప్పిన జితేందర్.. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని తన గదికి తీసుకెళ్లాడు. అక్కడ లైంగిక దాడికి యత్నించడంతో మంజుల ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా వరంగల్ ఎంజీఎం తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. ఈ ఘటనలో లైంగిక వేధింపులు తట్టుకోలేక తన భార్య మంజుల ఆత్మహత్యకు పాల్పడిందని భర్త శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. -
సొంతంగా పోటీ చేసిన సర్పంచ్‌గా కూడా గెలవలేడు: తుల్జా భవాని
-
మా నాన్న మంచోడు కాదు.. ముత్తిరెడ్డికి కూతురు షాక్
సాక్షి, హైదరాబాద్: జనగాం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కూతురు మరోసారి షాకిచ్చింది. తన తండ్రి మంచోడు కాదంటూ, ముత్తిరెడ్డిలాంటి అవినీతిపరుడిని ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారో తెలియడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆయన కూతురు తుల్జా భవాని రెడ్డి. ఎమ్మెల్యే యాదగిరి రెడ్డిని ప్రశ్నించాల్సింది, ఓడించాల్సింది ప్రజలేనని ఆమె అన్నారు. ప్రజల ఆస్తిని తాను తిరిగి ప్రజలకే ఇచ్చేశానని తెలిపారు. కబ్జా చేశానని ఒక ఎమ్మెల్యే బహిరంగంగా చెప్పినా.. ప్రభుత్వం ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి అవినీతిపరులకు పార్టీ టికెట్ ఇవ్వకూడదని, సొంతంగా పోటీ చేసినా సర్పంచ్‌గా కూడా తన తండ్రి గెలవడని వ్యాఖ్యానించారు. కేవలం కేసీఆర్ పేరు చెప్పుకొని మళ్లీ ఎన్నికల్లో గెలిచారని విమర్శించారు. సాక్షితో ఆమె మరికొన్ని విషయాలు పంచుకున్నారు.. అవి తన మాటల్లోనే సంబంధిత వార్త: చేర్యాల ప్రజలు మా నాన్నను క్షమించండి: భవానీ రెడ్డి 1) ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కూతురు అంటే ఇష్టం లేదా? చిన్నప్పటి నుంచి ఇంతేనా? ఇటీవల కాలంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వర్సెస్ ఆయన కూతురు తుల్జా భవాని రెడ్డిగా మారింది.. ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు.. ఇదంతా ఎందుకు అంటే తుల్జా భవాని రెడ్డి ఒకటే చెప్తున్నారు మహిళ అంటే ఆయనకు చిన్న చూపు ఆయన గురించి ఒక మహిళ ఎదురు తిరిగి మాట్లాడితే ఆయన సహించలేరని అంటున్నారు.. చిన్నప్పటి నుంచి కూడా వారి కుటుంబంలో ఆమె అమ్మానాన్న ఆమె సోదరుడు అంతా ఒక్కటి అయితే తుల్జా భవాని రెడ్డి మాత్రం ఒక్కటిగా ఉండేదని చెప్తున్నారు.. ఆమె పుట్టడమే ఆయనకు ఇష్టం లేనట్లుగా సమాధానం ఇచ్చారు. 2 )ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఆయన కూతురికి మధ్య విభేదాలు ఏంటి? సిద్ధిపేట జిల్లా చేర్యాలలో తన సంతకాన్ని ఫోర్జరీ చేసి ప్రభుత్వ భూమి నీ ఎమ్మెల్యే కబ్జా చేసి తన పేరున రాశారని పేర్కొన్నారు .2020 డిసెంబర్లో ఈ కబ్జా గురించి విషయం బయటకువచ్చినట్లు తెలిపారు. అప్పటి నుంచి ఇంట్లోనే తేల్చుకునేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు కానీ వినకపోవడంతో బయటకు వచ్చి అక్కడ స్థానికంగా అందరి ముందు ఆమె తండ్రిని నిలదీసింది. ఇది వరకే ఎమ్మెల్యేపై భూకబ్జా ఆరోపణలు ఉన్నాయని.. చెరువు భూమి అంటే ఎమ్మెల్యేకి చాలా ఇష్టం అని అందుకే అక్కడ కబ్జా లు చెరువుల పక్కన స్థలాలను కబ్జా చేస్తుంటారని చెప్పుకొచ్చారు. జనగాం జిల్లాలో ఎవరిని అడిగినా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అవినీతి గురించి చెబుతారని ఒకసారి ఏకంగా కలెక్టర్ ప్రెస్ మీట్ పెట్టారంటే అర్థం చేసుకోవాలని అన్నారు.. 3) ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు? కబ్జా చేసినట్లు ఎమ్మెల్యే బహిరంగంగా ఒప్పుకున్నట్లు ఒక క్లిప్పింగ్ వచ్చిందని ఆమె అన్నారు..అన్ని ఒప్పుకున్న తర్వాత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇలాంటీ అవినీతి ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్ ఇవ్వకూడదనీ అన్నారు. ఒక కూతురు అయిన బయటకు మా నాన్న కబ్జాలు చేస్తున్నాడని చెప్పినా ఇప్పటి వరకు ఆయనపై చర్యలు లేవని బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎటువంటి ఫోన్లు రాలేదని అన్నారు 4) రాజకీయ ప్రవేశం? రాజకీయ ప్రవేశం పై అసక్తి లేదనీ అన్నారు తుల్జా భవానీ. న్యాయం వైపు పోరాడితే ప్రజల కోసం చూస్తే రాజకీయాల్లోకి వస్తున్నారని ఆలోచన కరెక్ట్ కాదు అన్నారు. తనకు ఏ పార్టీ కూడా అండ దండ లేదని, తను ఒకతే ఫైట్ చేస్తున్నట్లు తెలిపారు. ఏవైతే కబ్జా ఉన్నాయో ఆ స్థలాలని తీసుకొని ప్రజలకు ఇచ్చేస్తున్నట్లు తెలిపారు అంతే తప్ప రాజకీయాల్లోకి ఎవరు పిలిచినా వెళ్ళేది లేదని కరాఖండిగా చెప్పారు. 5) ఇలాంటి అవినీతిపరులను ఎందుకు ప్రజలు ఎన్నుకుంటున్నారు ? ఒక ప్రజా ప్రతినిధిని ఎన్నుకుంటున్న సమయంలో లీడర్ ఎలా ఉండాలి అని ప్రజల ఆలోచించాలని అన్నారు. ఇలాంటి అవినీతిపరులకు ఓట్లు వేస్తే ప్రజలకు నష్టమే తప్ప లాభం ఉండదని తెలిపారు.. ప్రజలు అవినీతిని ప్రశ్నించాలే తప్ప గెలిపించద్దనీ అన్నారు.. సీఎం కేసీఆర్‌ను చూసి ఓట్లు వేసి గెలిపించారు ప్రజలు.. ఒక్కసారి రిజైన్ చేసి సర్పంచ్‌గా పోటీ చేసి గెలిచి చూపించమని ఆయన కూతురు సవాల్ విసిరారు. త్యాగాలను చేసి తెలంగాణ తెచ్చుకుంది ఇలాంటి అవినీతిపరుల చేతిలో ప్రజాస్వామ్యాన్ని పెట్టేందుకు కాదని సమాధానం ఇచ్చారు. 6) ఎమ్మెల్యే కబ్జా చేసిన బాధితులు ఇంకెవరైనా ఉన్నారా? ఇప్పుడిప్పుడే చాలా మంది బాధితులు ఫోన్ లు చేస్తున్నట్లు తెలిపారు.. వారి పేర్లను ఇప్పుడు నేను బయట పెట్టాలి అనుకోవడం లేదని అన్నారు. తన పేరుపై ఎన్నో ఫోర్జరీలు చేశారని కూడా తెలిపారు 7) అల్లుడు అంటే ఎమ్మెల్యే ముత్తీ రెడ్డి కి ఇష్టం లేదా అందుకే ఇదంతా జరుగుతుందా? తుల్జ భవానీ రెడ్డి తమది లవ్ కం అరేంజ్డ్ వివాహంగా పేర్కొన్నారు... పెళ్ళి చేసే సమయం లో సంతోషంగానే వివాహం చేశారని ఆమె అన్నారు..ఆ వివాహా నికి సీఎం కేసీఆర్ వచ్చినట్లుగా కూడా తెలిపారు.. ఇప్పుడు తను పిల్లలతో , భర్త తో ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు.. తన భర్త ఏ విధంగా కూడా ఆమె తండ్రిపైకి తిరగబడేలా ట్రాప్ చేయలేదనీ చెప్పారు.. 8) ఎన్నికలకి ముందే వేల కోట్ల ఆస్థులు.. 70 ఏళ్ల వయసు... ఇంకా ఎందుకు కబ్జాలు? ఎన్నికలకు ముందే వేల కోట్లు సంపాదించారని అన్నారు.. ప్రస్తుతం అయనకి 70 ఏళ్ల వయసు. ఇప్పటికీ ఇంకా కొన్ని రెంట్స్ కూడా కోటిన్నరకు పైగా వస్తున్నాయని అన్నారు. ఇవన్నీ కాకుండా చెరువుల పక్కన ఆయనకి సాయంత్రం వేళ కూర్చొని ఎంజాయ్ చేయడం ఇష్టంతో కబ్జాలు చేస్తున్నారని అన్నారు. 9) కూతురు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆస్తినీ ఎందుకు తీసుకోలేదు? రూపాయి అస్థి కూడా తీసుకోకుండా భర్తనీ పెళ్ళి చేసుకుని ఇంట్లో నుంచి బయటికీ సంతోషంగా వచ్చినట్లు ఆమె వ్యక్తం చేశారు. మామూలుగా నలుగు పెట్టే సమయం లో ఆడపిల్లలు ఏడుస్తారు కానీ తనకి ఒక కంటి చుక్క కూడా రాలేదని అన్నారు. తన భర్త కట్నం తీసుకోలేదని తనకి పెట్టిన కొన్నిటింని కూడ డబ్బుల రూపంలో తిరిగి ఇచ్చినట్లు తెలిపారు. 10 ) ఎమ్మెల్యే కబ్జా పై ఒప్పుకున్న తర్వాత కూడా కేసులు ఎందుకు? తన పై ఎమ్మెల్యే ఐదు కేసులు పెట్టించరాని తుల్జా భవనీ అన్నారు.. బహిరంగంగా కబ్జా చేశాను అని ఒప్పుకున్న తర్వాత కూడా పోలీస్‌లు మాకు ఫోన్ లు చేసి వేధిస్తున్నారని మనస్థాపం చెందారు. -సుస్మిత, సాక్షి టీవీ చదవండి: Video: మానవత్వం చాటుకున్న కేటీఆర్.. -
భట్టికే చెమట్లు పట్టించారు.. కాంగ్రెస్ నుంచి గెంటేసుకున్న పొన్నాల, కొమ్మూరి
ఆయన ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. కీలక మంత్రిగా హవా నడిపారు. పార్టీకి అధికారం పోయింది. పదవులు చేజారిపోయాయి. ఇప్పుడు టిక్కెట్ తెచ్చుకోవడమే ఆ మాజీ పీసీసీ చీఫ్‌కు కష్టమంటున్నారు. గత ఎన్నికల్లో తనకు ప్రచారం చేసిన నేతే ఇప్పుడు ఆయనకు అడ్డుపడుతున్నాడు. మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి నేనేంటే నేనే అంటూ ఒకరి మీద ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర జనగామలో పోరు యాత్రగా మారింది. రెండు వర్గాలు ఒకరిని మరొకరు కుమ్మేసుకున్నారు. తోసుకున్నారు. తిట్టుకున్నారు. పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. పాదయాత్రలో లొల్లి షురూ.. భట్టి విక్రమార్కకే చెమట్లు పట్టించారు పొన్నాల, కొమ్మూరి. ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలు ఆధిపత్య పోరు ప్రదర్శించారు. ఇద్దరు నేతల మధ్య కొనసాగుతున్న అంతర్గత విభేదాలతో పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. గత ఎన్నికల్లో పొన్నాల ఓటమితో ఈసారి కొమ్మూరి టిక్కెట్‌పై ఆశలు పెంచుకున్నారు. దీంతో ఇద్దరి మధ్యా వార్ మొదలైంది. చాన్నాళ్ళుగా సైలెంట్ ఉన్న వ్యవహారం భట్టి పాదయాత్ర సందర్భంగా రోడ్డున పడింది. ఈ తరుణంలో పొన్నాల అనుచరుడైన డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మాసనపల్లి లింగాజీ కొమ్మూరిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి కొమ్మూరికి కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధంలేదని చెప్పారు. అదే సమయంలో కొమ్మూరి అనుచరులు పొన్నాలనే పార్టీ నుంచి తొలగించినట్లు ప్రకటించారు. ఓడిన తర్వాత నియోజకవర్గాన్ని, పార్టీని పట్టించుకోకుండా అధికార పార్టీకి కోవర్ట్ గా మారి జనగామలో హస్తం పార్టీని అస్తవ్యస్తం చేస్తున్నాడని హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. పోటా పోటీ ఫిర్యాదులతోపాటు భట్టి పాదయాత్రలో తమ సత్తా చాటేందుకు యత్నించారు. భట్టి కూడా ఈ న్యూసెన్స్ ఏంటని ఇరువర్గాలను తీవ్రంగా మందలించారు. (హైదరాబాద్‌లో మళ్లీ ఉగ్ర కదలికలు.. 16 మంది అరెస్ట్) సైడయిపోయిన కొమ్మూరి కొమ్మూరి వస్తే పాదయాత్రకు సహకరించబోనని పొన్నాల స్పష్టం చేయడంతో.. ఒకదశలో భట్టి రెండు చేతులు జోడించి ముందుకు వెళ్ళమని కొమ్మూరికి విజ్ఞప్తి చేశారు. దీంతో కొమ్మూరి పాదయాత్ర నుంచి నిష్క్రమించారు. నర్మెట్టలో కార్నర్ మీటింగ్ పెట్టేందుకు పొన్నాల ఏర్పాటు చేయగా కొమ్మూరి వర్గీయులు నిరసన వ్యక్తం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చేసేది లేక భట్టి కార్నర్ మీటింగ్ ను క్యాన్సల్ చేసుకుని ముందుకు సాగారు. దీంతో పొన్నాల అగ్గిమీద గుగ్గిలమయ్యారు. కొమ్మూరి అనుచరులను సభా వేదిక వద్దకు ఎలా అనుమతిచ్చారంటూ పోలీసులపై ఫైర్ అయ్యారు. కొమ్మూరి మాత్రం పార్టీపై ఉన్న అభిమానంతో భట్టి పాదయాత్ర సక్సెస్ కావాలని పొన్నాల సైకోయిజం వల్లనే పాదయాత్ర కు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గంలో మూడు రోజులపాటు భట్టి పాదయాత్ర సాగగా ఫస్ట్ డే మాత్రమే భట్టితో కొమ్మూరి కనిపించారు. పొన్నాల మాత్రం ఆది నుంచి అంతం వరకు అన్నీ తానై భట్టిని నడిపించారు. ఉల్టా పల్టా గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పొన్నాల నియోజకవర్గానికి దూరం కాగా.. కొమ్మూరి మాత్రం అక్కడ పార్టీ కార్యక్రమాలను నిర్వహించారు. ప్రజలతో మమేకమ్యారు. పార్టీలో రేవంత్‌రెడ్డి వర్గంగా పేరు తెచ్చుకున్నారు. కొమ్మూరికి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్న పొన్నాల.. భట్టి విక్రమార్క పాదయాత్రను తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నారు. ఒకప్పుడు తన చేతితో అభ్యర్థులకు టిక్కెట్ ఇచ్చిన పొన్నాల ఇప్పుడు తనకు టిక్కెట్ వస్తుందో రాదో అన్న దీనస్థితికి దిగజారిపోయారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. (కూతురు ఫిర్యాదుపై స్పందించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.. ఏమన్నారంటే!) -
రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ
ఢిల్లీ: భువనగిరి పార్లమెంట్ స్థానం పరిధిలోని భువనగిరి, జనగామ రైల్వేస్టేషన్ల అభివృద్ధి ఎంతో అవసరం ఉందని, భువనగిరి స్టేషన్ తెలంగాణలోని ప్రముఖంగా రాకపోకలు సాగిస్తున్న రైల్వే స్టేషన్ అని. ఇందుకు సంబంధించి ఆధునీకరణ పనులు చేపట్టాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో గురువారం భేటీ అయిన వెంకట్‌రెడ్డి.. పలు విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. భువనగిరి, జనగామ రైల్వేస్టేషన్ల అభివృద్ధి ఎంతో అవసరం యాదాద్రిలోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. యాదగిరిగుట్ట తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. ప్రతి రోజు వేల మంది భక్తులు ఇక్కడకు వస్తుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. అలాగే, భువనగిరి రైల్వే స్టేషన్ నుంచి విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు నిత్యం హైదరాబాద్ కు రాకపోకలు సాగిస్తుంటారు. జనగామ తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాగా ఏర్పడింది. ఇక్కడి నుంచి కూడా హైదరాబాద్‌కు రోజూ అనేక మంది విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్థులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న భువనగిరి, జనగామ రైల్వేస్టేషన్లను ఆధునికీకరించాల్సిన అవసరం ఉంది. ఈ రెండు స్టేషన్లపై దృష్టి సారించాలి. రాయగిరి వరకు ఎంఎంటీఎస్ పనుల పొడిగింపుపై వినతి ఎంఎంటీఎస్ ను ఘట్ కేసర్ నుంచి రాయగిరి వరకు పొడిగించాల్సిన అవసరం చాలా ఉంది. ఎంఎటీఎస్ రెండోదశకు 2/3 వంతున పనులు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకుని ఏళ్లు గడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఆలస్యం కారణంగా ఇది కార్యరూపం దాల్చడం లేదు. కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి భాగస్వామ్యం లేకుండా వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేయాలి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభ్యర్థనపై కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించినట్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.. కేంద్రమే మొత్తం ఖర్చు భరించి రాయగిరి వరకు ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనులు ప్రారంభించి పూర్తి చేసేలా చూస్తామని హామీ ఇచ్చారని,. భువనగిరి, జనగామ రైల్వేస్టేషన్లను కూడా ఆధునికీకరస్తామని చెప్పారన్నారు. -
జనగామ ఎస్సై దంపతుల మృతి.. ఆత్మహత్యకు ముందు జరిగిందిదే!
సాక్షి, ఉమ్మడి వరంగల్: జనగామలో ఎస్సై శ్రీనివాస్ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తొలుత భార్య స్వరూప ఉరివేసుకొని చనిపోగా.. గంటల వ్యవధిలోనే ఎస్సై శ్రీనివాస్ కూడా తన సర్వీస్ రివాల్వర్‌లో కాల్చుకున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఇద్దరి ప్రాణాలు బలితీసుకుంది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తల్లిదండ్రులు ఇద్దరూ ఒకేసారి దూరమవ్వడంతో పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తల్లిదండ్రుల మరణంపై కొడుకు రవితేజ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై విచారణ జరిపి, పోస్టుమార్టం అనంతరం అమ్మనాన్నల మృతదేహాలను అప్పగించాలని కోరారు. కొడుకు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆత్మహత్య చేసుకున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఎస్సై దంపతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దంపతులు ఆత్మహత్యపై పూర్తిస్థాయిలో విచారణ అనంతరం పూర్తి విషయాలు వెల్లడిస్తామని తెలిపారు. జనగామ ఎస్ఐ దంపతుల ఆత్మహత్యపై కొడుకు ఫిర్యాదు కాపీ అసలేం జరిగిందంటే ఎస్సై కాసర్ల శ్రీనివాస్ గత ఎనిమిదేళ్లుగా జనగామ పట్టణంలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు రవితేజకు ఇటీవలె వివాహమవ్వగా భార్యతో కలిసి హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ బేగంపేట్‌లో ఉంటున్నారు. ఎస్సై దంపతులిద్దరే జనగామలో నివాసముంటున్నారు. బుధవారం రాత్రి శ్రీనివాస్, స్వరూప మధ్య కుటుంబ, ఆర్థిక సంబంధిత విషయాలపై గొడవ జరిగింది. గురువారం తెల్లవారుజామున పాలు పోసే వ్యక్తి వచ్చి డోర్ కొట్టగా ఎవరూ తలుపు తీయలేదు. దీంతో ఇంటి పక్కన నివాసముండే వ్యక్తిని పిలిచి ఇద్దరు కలిసి ఇంటి వెనకున్న డోర్ దగ్గరకు వెళ్లగా బయట ఉన్న బాత్రూమ్లో వెంటిలేటర్ ఇనుపరాడ్‌కు స్వరూప తన చీరతో ఉరివేసుకొని ఉండటం చూశారు. వెంటనే వెనుక డోర్ ద్వారా ఇంట్లోకి వెళ్లి శ్రీనివాస్‌ను నిద్రలేపారు.. ఎస్సై బాత్రూమ్కి వెళ్లి చూసేసరికి భార్య విగతజీవిగా కనిపించింది. విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు ఇంటికి వచ్చి ఎస్సై శ్రీనివాస్‌ను పరామర్శించారు. అనంతరం ఎస్సై నివాసానికి ఏసీపీ దేవేందర్‌రెడ్డి, పట్టణ ఇన్ఛార్జ్ సీఐ నాగబాబు చేరుకుని పరిశీలించారు.భార్య మృతికి గల కారణాలను ఎస్సై శ్రీనివాస్‌ను ఉన్నతాధికారులు అడిగి తెలుసుకున్నారు. భార్య ఆత్మహత్య చేసుకోవడాన్ని తట్టుకోలేక మానసిక వేదనకు గురైన శ్రీనివాస్.. ఉదయం 10 గంటల సమయంలో వాష్‌రూమ్‌కు వెళ్తున్నానని చెప్పి వెళ్లి తుపాకీతో కాల్చుకున్నారు. ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినపడటంతో అప్పటికే ఇంట్లో ఉన్న ఏసీపీ, సీఐ బాత్రూమ్కి వెళ్లి చూడగా.. తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని రక్తపు మడుగులో శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయారు. గంటల వ్యవధిలో ఎస్సై దంపతులు మృతిచెందడంతో ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఎస్సై తుపాకీని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. -
జనగామ: ఎస్సై శ్రీనివాస్ దంపతుల ఆత్మహత్య , భార్య శవాన్ని చూస్తూ ఏడుస్తూ కాసేపటికే..
-
జనగామ: ఎస్సై శ్రీనివాస్ దంపతుల ఆత్మహత్య
సాక్షి, జనగామ: జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. జనగామ ఎస్సై శ్రీనివాస్ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీనివాస్ భార్య స్వరూప(45) ఈ ఉదయం ఉరి వేసుకుని చనిపోయారు. అది చూసి శ్రీనివాస్ కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే.. భార్య చనిపోయిందన్న మనస్థాపంతో కాసేపటికే శ్రీనివాస్ సైతం సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యలకు కారణమని తెలుస్తోంది. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పరిశీలించి పరిష్కరిస్తాం..
ప్రశ్న: కుక్కలు, కోతులతో ఇబ్బంది పడుతున్నాం. పిల్లలను బయటకు పంపితే తోడు వెళ్లాల్సి వస్తోంది. కోతులు ఇళ్లలోకి దూరుతున్నాయి. బెదిరించినా వెంబడిస్తున్నాయి. అర్ధరాత్రి కుక్కలు అరుస్తుంటే నిద్ర పట్టడం లేదు. ● అశోక్, రైస్ మిల్లర్, గీతానగర్, కడారు ప్రవీణ్, ఎండీ.దస్తగిరి, మేకల సమ్మయ్య, చందు, రాములు, శ్రీనివాస్, రమేష్, సురేష్, కవిత, కూరపాటి శ్రీనివాస్, సంతోష్‌కుమార్, మహేష్, వెంకటరమణారెడ్డి, ఎండీ రఫిక్, సుచరిత, లక్ష్మీ– 1, 4, 7, 8, 11, 12, 14, 17, 26, 27 వార్డులు, వీర్స్కాలనీ, శ్రీ విల్లాస్, అంబేడ్కర్‌నగర్, వాసవీ కాలనీ, శ్రీహర్షనగర్ కమిషనర్ : 15 రోజుల్లో సమస్య పరిష్కరిస్తాం. ప్రశ్న: డ్రెయినేజీ నీరు ఇంటిముందే ఆగుతోంది. పందులు తిరుగుతున్నాయి. దోమలు పెరిగాయి. అవోపా బిల్డింగ్ ఏరియాలో సీసీరోడ్డు తవ్వి పూడ్చలేదు. ప్రమాదాలు జరుగుతున్నాయి. 17వ వార్డులో సీసీరోడ్లపై గుంతలు పడుతున్నాయి. 23వ వార్డులో కోతులు కరెంటు తీగలపై సర్కస్ ఫీట్లు చేస్తున్నాయి. హనుమకొండ రోడ్డు దేవీథియేటర్ ఆవరణ అపార్టు మెంటులో అద్దెకు ఉంటున్న వారు రోడ్డుపైనే చెత్త వేస్తున్నారు. ● పవన్‌కుమార్, క్రాంతి, అబ్బాస్, రేకల చంద్రమోహన్ గౌడ్, జాయ మంజుల, కనకరాజు, సయ్యద్ యాకూబ్, ఎ.నర్సింహులు, కృష్ణమూర్తి, స్వరూప, సయ్యద్ జాహంగీర్– 5, 13, 17, 19, 21, 23 వార్డులు బీరప్ప టెంపుల్, ఇందిరమ్మకాలనీ, ప్రగతినగర్, కుర్మవాడ, శ్రీహర్షనగ్ కాలనీ కమిషనర్ :అన్ని సమస్యలను పరిశీలిస్తాంజనగామ: పట్టణ ప్రజలు చెప్పే ప్రతి సమస్యను ఓపికగా వింటూ.. సమాధానం చెబుతూ.. ఇంకా ఏమైనా ఉన్నాయా అంటూ కాలనీ ల్లో నెలకొన్న ఇబ్బందులను తెలుసుకు నే ప్రయత్నం చేశారు మున్సిపల్ కమిషనర్ రజిత. కుక్కలు, కోతుల బెడద, తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్లు తదితర సమస్యలపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఫోన్‌ఇన్ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. ఉదయం 10.40 నుంచి 12.10 గంటల వరకు జరిగిన ఫోన్ఇన్లో కమిషనర్ 50 మందితో మాట్లాడగా.. మరో 265 కాల్స్ వచ్చాయి. కుక్కలు, కోతుల బెడద నియంత్రణకు చంపక్ హిల్స్ డంపింగ్ యార్డు వద్ద జంతు జనన నియంత్రణ సెంటర్ ప్రారంభిస్తున్నామని, 15 రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపిస్తామని కమిషనర్ చెప్పారు. అలాగే డ్రెయినేజీల నిర్వహణ, వీధిదీపాలు, తాగునీటి శుద్ధీకరణ, పారిశుద్ధ్య కార్మి కుల పని తీరు, కుళాయి కనెక్షన్లకు తవ్విన సీసీరోడ్డు మరమ్మతులు, శ్మశాన వాటికలు తదితరాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని పరిశీలించి ఒక్కొక్కటిగా పరిష్కారమయ్యేలా చూస్తామని అన్నారు. లకావత్ లాల్మా, 2వ వార్డు : రూ.లక్ష చెల్లించి ఇంటి అనుమతులు తీసుకున్నాం. డ్రెయినేజీ లేదు. ఇంటి ముందు మురికి నీరు ఆగితే పంచాయితీ అవుతోంది. కమిషనర్ : ఇంజనీరింగ్ అధికారులను పంపిస్తాం రవీందర్, 7వ వార్డు : డిగ్రీ కళాశాల ఏరియాలో 30 కుటుంబాలకు నల్లా కనెక్షన్ లేదు. వాటర్ పైపులైన్ వేయలేదు. కనెక్షన్‌కు అనుమతి తీసుకున్నా పట్టించుకోవడం లేదు. కమిషనర్ : తాగునీరు వచ్చేలా చేస్తాం రాజేష్, 6వ వార్డు, ఎండీ.సయ్యద్, హెడ్‌పోస్టాఫీసు ఏరియా : పోస్టాఫీసు ఆవరణలో దుమ్ము భరించ లేకపోతున్నాం. కొత్తగా నిర్మాణం చేస్తున్న రేడియాలజీ హబ్ భవనంతో డ్రెయినేజీలో చెత్త పేనుకుపోయి మురికి నీరు ఆగి కంపుకొడుతోంది. లక్ష్మణ్, వ్యాపారి : ఆర్టీసీ చౌరస్తా హనుమకొండ రోడ్డువైపు డ్రెయిన్లు నిండి దుర్వాసన వస్తున్నది. కేమిడి చంద్రశేఖర్, 15వ వార్డు అడ్వకేట్ : మురికి కాల్వలను రెగ్యులర్‌గా క్లీన్ చేయడంలేదు. ఒకేచోట మురికినీరు ఆగిపోతున్నది. కమిషనర్ : శుభ్రం చేయిస్తాం. సిరీష, బీరప్పగుడి ఏరియా : పాత ఇనుప సామాను వ్యాపారం చేసే వారు అన్నీ రోడ్డుపైనే వేస్తుండడంతో పందులు, కుక్కలు ఇక్కడే ఉంటున్నాయి. పిల్ల్లలను ట్యూషన్‌కు తీసుకువెళ్లే సమయంలో మీదకు వస్తున్నాయి. కమిషనర్ : భయపడకండి, సమస్య పరిష్కరిస్తాం మహ్మమద్ ఆసిఫ్, గిర్నిగడ్డ: ఆర్నెళ్ల నుంచి మోరీలు క్లీన్ చేయడం లేదు. నల్లా కనెక్షన్ కోసం సీసీరోడ్డు తవ్వి ట్యాప్ బిగించకుండా పోయారు. ఇంటి ఎదురుగా కుక్కలు పెంచుకుంటున్నారు. చిన్నారులను బెదిరిస్తున్నాయి. కమిషనర్ :సమస్యలకు పరిష్కారం చూపిస్తాం శ్రీధర్, 14వ వార్డు: హైమాస్ట్ లైట్ వెలుతురు రావడం లేదు. కాలనీలో రాత్రి చీకటిగా ఉంటోంది. ఆర్డీఓ కార్యాలయం వరకు పైపులైన్ కోసం తవ్వడంతో గర్భిణులు ఆస్పత్రికి వెళ్లే సమయంలో ఇబ్బందిగా ఉంది. అంకం రవీందర్, జనగామ : ప్రభుత్వ ఆస్పత్రి వద్ద హైమాస్ట్ లేక ఇబ్బందిగా ఉంది. కమిషనర్ :విద్యుత్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తాం. కొత్తపల్లి అభినాష్, 5వ వార్డు: కాలనీలో డ్రెయినేజీ లేదు. ఇందిరమ్మ ఇళ్లు సగం వరకు నిర్మించి వదిలేయడంతో అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. కమిషనర్ : ఇళ్ల విషయం రెవెన్యూ అధికారులకు చెబుతాం. కొత్త డ్రెయినేజీ కౌన్సిల్‌కు సూచిస్తాం. అంకిత, ఆస్పత్రి నిర్వాహకురాలు : హైదరాబాద్ రోడ్డు హౌసింగ్‌బోర్డు కాలనీ ఏరియా వేద ఆయుర్వే ద ఆస్పత్రి దారిలో వీధిదీపాలు, నూతన డ్రెయినే జీ, మిషన్ భగీరథ తాగునీటి సౌకర్యం కల్పించాలి. కమిషనర్ : స్ట్రీట్ లైట్లు వేసేందుకు పరిశీలిస్తాం. పట్టణానికి దూరంగా ఉంది కాబట్టి కొద్ది సమయం పడుతుంది. అప్పటి వరకు మురికి నీరు ఇంకడానికి గుంతలు ఏర్పాటు చేసుకోవాలి. ఇల్లెందుల ప్రవీణ్, 9వ వార్డు: గిర్నిగడ్డ ప్రాంతంలోని మాంసం విక్రయదారులు వేస్టేజీని శ్మశాన వాటిక ప్రాంతంలో వేస్తున్నారు. అందులో 40 కుక్కలు తిరుగుతూ ప్రజలను భయపెడుతున్నాయి. కమిషనర్ :నియంత్రణ చర్యలు తీసుకుంటాం. సత్యవర్ధన్‌రెడ్డి, 4వ వార్డు : ఫుట్‌పాత్‌లపై చిరు వ్యాపారాలు నిర్వహిస్తుండడంతో వాహనాలను రోడ్డుపైనే పెట్టాల్సి వస్తున్న ది. దీంతో జరిమానా వేస్తున్నారు. కమిషనర్ : ఫుట్‌పాత్ వ్యాపారంపై తనిఖీలు చేస్తాం నాయిని సంతోష్, 5వ వార్డు, బాణాపురం : 15ఏళ్ల నుంచి శ్మశాన వాటిక లేదు. రంగప్ప చెరువు మత్తడి వద్ద అంతిమ సంస్కారం చేసేది. ఇప్పుడు వద్దంటున్నారు. నెహ్రూపార్కు వైకుంఠ ధామానికి తీసుకువెళ్తున్నాం. బాణాపురంలో శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలి. కమిషనర్ : సమయం పడుతుంది. తప్పకుండా ఏర్పాటు చేయిస్తాం సురేందర్‌రెడ్డి, 25వ వార్డు : నెహ్రూపార్కు నుంచి ఆర్టీసీ చౌరస్తా వరకు రోడ్డుపై దిష్టితీసిన నిమ్మకా యలు, గుమ్మడి కాయలు, మిర్చి, పసుపు, కుంకు మ వేస్తున్నారు. ఇబ్బందిగా ఉంది. కమిషనర్ : ప్రత్యేక డ్రైవ్ చేపడతాం కాసుల శ్రీనివాస్, శ్రీనగర్‌కాలనీ 22వ వార్డు : డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా ఉంది. దోమల నివారణ చర్యలు లేవు. చెత్త సేకరణకు మూడు రోజులకోసారి వస్తున్నారు. కుళాయిలకోసం తీసిన గుంతలు పూడ్చలేదు. కమిషనర్ :సమస్య పరిష్కరించేలా చూస్తాం. జహానా, అంబేడ్కర్‌నగర్ : ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మా ఇళ్లు ఉంది. వర్షాకాలంలో వరద నీరు ఇంటిని ముంచెత్తుతోంది. డ్రెయినేజీ చిన్నగా ఉండడంతో నీరు బయటకు వస్తున్నది. కమిషనర్ : పరిశీలిస్తాం శ్రీనివాస్, 4వ వార్డు, జ్యోతినగర్, సరిత, 3వ వార్డు : తాగునీరు పచ్చగా వస్తోంది. అదికూడా అరగంటకు ఒక బిందె నిండే పరిస్థితి లేదు. కోటిరత్నం ఆస్పత్రి వెనక పందుల సంచారం పెరిగింది. యజమానిని నిలదీసినా పట్టించుకోవడం లేదు. కమిషనర్ :తగిన చర్యలు తీసుకుంటాం మిద్దెపాక స్టాలిన్, 13వ వార్డు అంబేడ్కర్ సంఘం డివిజన్ ప్రెసిడెంట్ : నెహ్రూపార్కు ఏరియాలో ఫుట్‌పాత్ వ్యాపారం కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కోతుల బెడద నివారణకు తీసుకు వచ్చిన రెండు కొండెంగలు కనిపించడంలేదు. కమిషనర్ : ఫుట్‌పాత్ వ్యాపారంపై దృష్టి పెట్టాం బిర్రు రామలింగం, 12వ వార్డు : వీవర్స్‌కాలనీలోని అండర్ బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేసి, వినియోగంలోకి తేవాలి. కమిషనర్ : కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్తాం. ‘సాక్షి’ ఫోన్ఇన్లో మున్సిపల్ కమిషనర్ రజిత కుక్కల సమస్యకు 15 రోజుల్లో పరిష్కారం కోతుల నివారణకు చర్యలు డ్రెయినేజీ, పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక ఫోకస్ ప్రజలు చెప్పిన విషయాలను నోట్ చేసుకున్నాం -
కేసీఆర్ ఒక్క హామీ నెరవేర్చలేదు
స్టేషన్‌ఘన్‌పూర్: ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ను గద్దెనెక్కిన తర్వాత సీఎం కేసీఆర్ నెరవేర్చలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ‘ప్రజాగోస–బీజేపీ భరోసా’ కార్యక్రమంలో భాగంగా శనివారం డివిజన్ కేంద్రం శివాజీచౌక్ వద్ద తాళ్లపెల్లి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చాడా.. కేసీఆర్ కుటుంబంలో ఐదుగురికి ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. ఘన్‌పూర్‌లో మెగా లెదర్‌పార్కు, టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేస్తే ఎందరికో ఉపాధి కలిగేదని పేర్కొన్నారు. ఇంటింటికీ భగీరథ నీరన్నాడు.. అడపా దడపా వచ్చేదీ మురికినీరే.. గ్రామాల్లో బెల్ట్‌షాపులు ఫుల్లుగా ఉన్నాయికానీ.. తాగునీరు అందడం లేదని విమర్శించారు. 18 ఏళ్ల వయస్సుపై వారికే ‘కంటివెలుగు’ నిర్వహించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్రమోదీ దేశంలో మూడు కోట్ల మందికి ఇళ్లు అందించారు.. అందులో తెలంగాణకు 2.40 లక్షల ఇండ్లు ఇస్తే.. సీఎం అవినీతితో ఎవ్వరికీ ఇండ్లు అందించడం లేదన్నారు. గ్రామాల్లో ఇళ్లు, రోడ్లు, సాగునీరు, విద్యుత్, డ్రెయినేజీ తదితర సమస్యల్ని పరిష్కరించేందుకు కేసీఆర్ దగ్గర డబ్బులు ఉండవుకానీ.. లిక్కర్, పత్తాలు, డ్రగ్స్, భూమాఫియా, దొంగ, లంగ, లఫంగి పనులకు మాత్రం ఉంటాయని ఎద్దేవా చేశారు. దళితబంధు బీఆర్ఎస్ నేతలకు కమీషన్ల బంధుగా మారిందని, వారి అనుచరులు, బంధువులకే అందిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో బతుకులు బాగుపడాలంటే పేదల రాజ్యం రావాలని, బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువస్తే పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్య, పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం, పక్కా ఇళ్లు అందిస్తామని, ఫసల్‌బీమాతో రైతులను ఆదుకుంటా మని బండి సంజయ్ హామీ ఇచ్చారు. అనంతరం జనగామకు చెందిన మాలతిరెడ్డితో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు బీజేపీలో చేరారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ గుండె విజయరామారావు, జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి, ఇన్చార్జ్ పాపారావు, నాయకులు మాదాసు వెంకటేష్, బొజ్జపల్లి సుభాష్, కేవీఎల్ఎన్.రెడ్డి, ఉడుగుల రమేష్, వేముల అశోక్, విద్యాసాగర్‌రెడ్డి, ఐలోని అంజిరెడ్డి, ముక్కెర తిరుపతిరెడ్డి, బొక్క ప్రభాకర్, పవన్‌కుమార్, గట్టు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆయన కుటుంబంలోనే ఐదుగురికి ఉద్యోగాలు పేదల రాజ్యంతో బతుకులు మారతాయి ‘ప్రజాగోస–బీజేపీ భరోసా’లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ -
వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
జనగామ రూరల్: డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ సత్వరం వైద్యసేవలు అందించాలని కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య అన్నారు. శనివారం అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్‌తో కలిసి వైద్యాధి కారులతో కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంసీహెచ్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పీహెచ్‌సీలు, సబ్ సెంటర్లలో వైద్యలు అందుబాటులో ఉండాలని, అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నార్మల్ డెలివరీలను ప్రోత్సహించడంతో పాటు ఆధునిక వైద్య సేవల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. ఇప్పటికే వైద్యరంగంలో మెరుగైన సేవలందిస్తున్న జనగామ జిల్లా.. వివిధ పారామీటర్లలో ముందువరుసన ఉందని, డయాగ్నోస్టిక్ ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రజలు వైద్యం కోసం ప్రైవేటుకు వెళ్లకుండా ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, వైద్యులు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ స్థాయిలో డెలివరీల వివరాలు నమోదు చేయాలని, గర్భవతులకు ఐసీడీఎస్ ద్వారా ఇచ్చే న్యూట్రిషన్ కిట్టును అందరికీ అందించాలని చెప్పారు. సమీక్ష సమావేశంలో సూపరింటెండెంట్ సుగుణాకర్‌రాజు, డాక్టర్ సుఽధీర్‌కుమార్, అశోక్‌కుమార్, రవీందర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. రుణాలు వెంటనే మంజూరు చేయాలి జనగామ రూరల్: ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం లబ్ధిదారులకు బ్యాంక్ రుణాలు వెంటనే మంజూరు చేయాలని కలెక్టర్ శివలింగయ్య అన్నారు. శనివారం తన చాంబర్లో నిర్వహించిన టీఎస్ ఐ–పాస్ సమావేశంలో ఆయన మాట్లాడు తూ.. జిల్లాలో 12 యూనిట్లకు 21 దరఖాస్తులు రాగా 19 ఆమోదం పొందాయని, ఒకటి తిరస్కరించగా.. మరొకటి పురోగతిలో ఉందని పేర్కొన్నారు. సుమారు రూ.20 కోట్లతో 105 మంది లబ్ధిదారుల కు ఉపాధి అవకాశాలు అందుతాయని చెప్పారు. టి ప్రైడ్ పథకం ద్వారా ఎస్సీలకు 5, ఎస్టీలకు 18 వాహనాలు మంజూరు చేసినట్లు తెలిపారు. పీఎం ఎంప్లాయిమెంట్ జనరేషన్ స్కీం కింద 75 యూనిట్లకు 29 ఆమోదం పొందాయని, మిగతావి మార్చిలోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఇండస్ట్రీస్ జనర ల్ మేనేజర్ రమేష్, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీధర్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాదవ్, ఆర్టీ శ్రీనివాస్‌రావు, ఎస్సీ కార్పొరేషన్ ఏడీ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య -
బ్రహ్మోత్సవాలకు వేళాయె
చిల్పూరు: తెలంగాణలో రెండో తిరుపతిగా పేరుగాంచిన చిల్పూరు శ్రీబుగులు వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు పాల్గుణ శుద్ధ సప్తమి ఆదివారం(నేడు) నుంచి ప్రారంభమవుతున్నాయి. మార్చి 5వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు చేశామని ఆలయ ఈఓ వెంకట్రావు, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, ప్రధాన అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచార్యులు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం తొళక్కంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. మార్చి 2న ఎదుర్కోళ్లు, 3న స్వామివారి కల్యాణం, 4న రథోత్సవం, 5న చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయి. చిల్పూరు ఆలయం వరంగల్–హైదరాబా ద్ జాతీయ రహదారి చిన్నపెండ్యాల బస్‌స్టేజీ వద్ద ఆర్చిగేట్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేటి నుంచి వేంకటేశ్వరస్వామి వేడుకలు ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు -
చట్టాలపై అవగాహన ఉండాలి
జనగామ రూరల్: విద్యార్థులకు చట్టాలపై అవగా హన ఉండాలని జూనియర్ సివిల్ జడ్జి పృథ్వీరా జ్ డీటీ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యాన జిల్లా కేంద్రంలోని మైనార్టీ జూనియర్ గురుకుల కళాశాలలో శనివారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో జడ్జి మాట్లాడారు. మనుషుల అక్రమ రవాణా, డ్రగ్స్ వాడకం, ర్యాగింగ్, మైనర్లు వాహనాలను నడపడం చట్టరీత్యా నేరమని అన్నారు. చట్టాన్ని అతిక్రమించిన వారికి శిక్ష తప్పదని స్పష్టం చేశారు. లోక్ అదాలత్ ద్వారా రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవచ్చని ఈ సందర్భంగా సూచించారు. అనంతరం విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాది మంచాల రవీందర్, రాగళ్ల శ్రీహరి, కళాశాల ప్రిన్సిపాల్ అనిల్ బాబు పాల్గొన్నారు. ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో.. ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి సీహెచ్ నర్మద పాల్గొన్నారు. ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లోని ఫొటోలు అప్లోడ్ చేయవద్దని చెబుతూ.. వాటి వల్ల కలిగే అనర్థాలను జడ్జి వివరించారు. బాలికలు ఎలాంటి సమస్యలు వచ్చినా ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ధైర్యంగా చెప్పాలని సూచించారు. జూనియర్ సివిల్ జడ్జి పృథ్వీరాజ్ డీటీ -
సంప్రదాయాల పరిరక్షణకు కృషి
దేవరుప్పుల: సర్వమత సంప్రదాయాల పరిరక్షణ కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండల పరిధి కోలుకొండలో శనివారం జరిగిన శ్రీ దుర్గామాత, బొడ్రాయి పునఃప్రతిష్ఠాప న, శ్రీకంఠమహేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన తదితర కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భగా మాట్లాడుతూ అన్ని సామాజిక వర్గాలు జరుపుకునే పండుగలకు ప్రాధాన్యత ఇస్తున్న సీఎం కేసీఆర్.. ఆలయాల పూజారులకు ధూపదీన నైవేద్యం, బతుకమ్మ పండుగకు మహిళలకు చీరెలు, క్రిస్టమస్, రంజాన్ పండుగలకు వస్త్రాలు పంపిణీ చేస్తూ ఆధ్యాత్మిక సమాజ స్థాపనకు పాటుపడుతున్నారని పేర్కొన్నారు. అనంతరం ఆరాధ్య పౌండేష న్ జిల్లా అధ్యక్షుడు ముస్త్యాల కుమారస్వామి ఆధ్వర్యంలో రూ.3 లక్షలతో గనుపాక జ్యోతి కుటుంబా నికి నిర్మించిన నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ కె.రవి, ఉపసర్పంచ్ కృష్ణమూర్తి, ఎంపీటీసీ దామెర రమ, రైతు కోఆర్డినేటర్ కోతి పద్మ, మార్కెట్ డైరెక్టర్ బోనగిరి యాకస్వామి, బీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దయాకర్, రవి, పల్ల సుందర్‌రామి రెడి, కొల్లూరి సోమన్న, రాజు, బాబు, అర్జున్, కోతి ప్రవీణ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ‘ఎర్రబెల్లి’ -
కరువు నేలకు మహర్దశ
జనగామ: కరువుకు కేరాఫ్‌గా మారిన జిల్లాలోని బీడువారిన పొలాలను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసిన ప్రభుత్వం.. ఎత్తైన ప్రాంతాల రైతుల సాగు నీటి కష్టాలను సైతం తీర్చేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మూడు మినీ లిఫ్టు ట్యాంకుల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన తెలంగాణ సర్కారు.. రూ.104.92 కోట్ల నిధులతో పాటు ఈ ఏడాది జనవరి 13న పరిపాలనా అనుమతులు ఇచ్చింది. మినీ లిఫ్టు ట్యాంకుల నిర్మాణానికి ఈనెల 27న వేలేరులో మంత్రి కేటీఆర్ భూమిపూజ చేయనున్నారు. పనులు పూర్తయితే 6,794 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. దేవాదుల నుంచి రిజర్వాయర్లకు.. జిల్లా ఇరిగేషన్ పరిధిలో గండిరామారం, బొమ్మకూరు(నర్మెట), చీటకోడూరు(జనగామ), నవాబుపేట(లింగాలఘణపురం) ఆర్ఎస్ ఘన్పూర్ (స్టేషన్‌ఘన్‌పూర్), అశ్వరావుపల్లి(రఘునాథపల్లి), మైలారం బ్యాలెన్సింగ్(రాయపర్తి) రిజర్వాయర్లు ఉన్నా యి. దేవాదుల ప్రాజెక్టు నుంచి ధర్మసాగర్ మీదుగా రిజర్వాయర్లకు నీటిని మళ్లిస్తున్నారు. మొత్తం 965 చెరువులు, కుంటలకు వానాకాలం, యాసంగి సీజన్ల వారీగా గోదావరి జాలలను కాల్వల ద్వారా విడుదల చేస్తున్నారు. దీంతో బీడువారిన పొలాలు సైతం సస్యశ్యామలంగా మారినా.. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ పరిధిలోని ఎత్తైన ప్రాంతాలకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం మినీ లిఫ్టు ట్యాంకులను నిర్మించి గ్రావిటీ కెనాల్ ద్వారా చెరువులతో పాటు ఆయకట్టుకు సాగు నీరందించేలా ప్రణాళిక రూ పొందించింది. ఆయా పనులను ఈ ఏడాది నవంబర్ 23 వరకు నూరుశాతం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మినీ లిఫ్టు–1 : తరిగొప్పుల మండలం బొత్తలపర్రె కొండపై మినీ లిఫ్టు ఇరిగేషన్ ట్యాంకు నిర్మాణం చేపట్టనున్నారు. గండిరామారం రిజర్వాయర్ నుంచి కొండపై నిర్మించే మినీ లిఫ్టు ట్యాంకు వరకు 17 కిలోమీటర్ల పొడవునా పైపులైన్ వేసి మోటార్ల ద్వారా నీటిని పంపింగ్ చేస్తారు. అక్కడి నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా గ్రామల పరిధి 23 మినీ ట్యాంకులను నింపుతారు. ఈ స్కీంలో చిల్పూరు, తరిగొప్పుల, వేలేరు, జనగా మ నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా మద్దూరు మండలాల పరిధి లింగంపల్లి, శ్రీపతిపల్లి, కొండాపూర్, మద్దులగూడెం, కన్నారం, పీచర, అబ్దుల్‌నాగారం, నర్సాపూర్, తరిగొప్పుల, సోలిపురం, పోతారం, అంకుషాపూర్, బొంతగట్టునాగారం, కూటిగల్ గ్రామాల్లోని 3,354 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందిస్తారు. మినీ లిఫ్టు–2: స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, హనుమకొండ నియోజకవర్గాల పరిధి ధర్మసాగర్, వేలేరు మండలాల్లోని ముప్పారం, నారాయణగిరి, వేలేరు, శోడసపల్లి, మల్లికుదుర్ల, శాలపల్లి గ్రామాలకు సాగునీరు అంది స్తారు. ఇందుకు గుండ్లగడ్డ వయా లోక్యాతండా మీదుగా 4.90 కిలోమీటర్ల మేర పైపులైన్ ఏర్పాటు చేసి ఆయా గ్రామాల పరిధి 12 ట్యాంకులను నింపి 1,620 ఎకరాల ఆయకుట్టకు సాగు నీరు పారించేలా ప్రణాళిక రూపొందించారు. మినీ లిఫ్టు–3: నష్కల్ రిజర్వాయర్ వద్ద పంప్‌హౌస్ నిర్మాణంతో పాటు ట్యాంకు నుంచి 9.09 కిలోమీటర్ల మేర పైపులైన్ ఏర్పాటు చేస్తారు. చిల్పూరు, ధర్మసాగర్, ఐనవోలు మండలాల పరిధి వంగాలపల్లి, ధర్మపురం, మల్లక్కపల్లి, వనమాలకనపర్తి, కొండపర్తి, వెంకటా పూర్, ఐనవోలు, సింగారం, పున్నేలు, పంథిని గ్రామాల్లోని 18 ట్యాంకులను నింపి 1,820 ఎకరాల ఆయకుట్టకు సాగునీరు ఇవ్వనున్నారు. ప్రతి రైతు కళ్లలో ఆనందం చూడాలి వ్యవసాయాన్ని పండుగ చేసి ప్రతి రైతు కళ్లలో ఆనందం చూడాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష. జిల్లాలోని ఎత్తైన ప్రదేశాలకు సైతం సాగు నీరు అందించేలా మూడు మినీ లిఫ్టు ట్యాంకుల నిర్మాణానికి రూ.104 కోట్లు మంజూరుతోపాటు పరిపాలనా అనుమతులు ఇచ్చారు. దీంతో 6,794 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందనుంది. – ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్యే, జనగామ మినీ లిఫ్టు పైపులైన్ ట్యాంకులు ఆయకట్టు (కిలోమీటర్లు) (ఎకరాలు) 1 17 23 3,354 2 4.90 12 1,620 3 9.09 18 1,820 -
సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలి
జనగామ రూరల్: విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని డీఈఓ రాము అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో శుక్రవారం అటల్ టింకరింగ్ ల్యాబ్‌ను ప్రారంభించిన అనంతరం ప్రిన్సిపాల్ కనగాల శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల్లో దాగిఉన్న పరిజ్ఞానాన్ని వెలికి తీయడానికి అటల్ టింకరింగ్ ల్యాబ్ ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రాంతీయ సమన్వయ అధికారి రజిని మాట్లాడుతూ.. విలువలతో కూడిన విద్య అందించడానికి ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేయాలని అన్నారు. నర్సింహారా వు, రాంరాజ్, నర్సింహులు, వెంకటలక్ష్మి, నాగేశ్వర్రావు, కిషన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
రఘునాథపల్లి: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బీమా పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిడిగొండ ఆంద్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్ శ్రవన్ అన్నారు. శుక్రవారం మండలంలోని ఫతేషాపూర్‌లో నిడిగొండ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై సర్పంచ్ ఎండీ హయతలి అధ్యక్షతన గ్రామస్తులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. బీమా పథకాలతో కుటుంబాలకు భరోసా లభిస్తోందన్నారు. రైతుబంధు మండల సభ్యుడు గాజులపాటి విరోజి, వీఓఏలు గాజులపాటి రమ, ఉమ్మగోని విమల, గ్రామ పెద్దలు హింగె మోహన్, నానాజి, లోడె నర్సయ్య, బీమయ్య, మహేందర్, కళాకారుల బృందం సభ్యులు రామాంజనేయులు, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు
దేవరుప్పుల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నారని ఐసీడీఎస్ ఏసీడీపీఓ జి.విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం కడవెండి దొడ్డి కొమురయ్య స్మారక భవన్‌లోని కుట్టుశిక్షణ కేంద్రం, సఖి కేంద్రం ఆధ్వర్యాన హైస్కూల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సర్పంచ్ బెత్లీనా, ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రీదేవి, హెచ్ఎంలు వెంకన్న, బాలు, ఎస్ఎంసీ చైర్మన్ వీరాచారీ, కిరణ్‌కుమార్‌రెడ్డి, చైల్డ్‌లైన్ ప్రతినిధి పద్మ, సఖి కౌన్సిలర్ రాధిక, అంగన్వాడీ టీచర్లు రహమత్బేగం, విజయకుమారి, కోమలత, అరుణ పాల్గొన్నారు. -
కేసీఆర్ అస్థిత్వాన్ని కాపాడుకుంటున్నారు
బచ్చన్నపేట: నాలుగు కోట్ల రాష్ట్ర ప్రజలు పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తానని కేవలం తన అస్థిత్వాన్ని మాత్రమే కాపాడుకుంటున్నారని మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర నాయకుడు బూర నర్సయ్యగౌడ్ అన్నారు. శుక్రవారం కట్కూర్లో అసెంబ్లీ కన్వీనర్ బళ్ల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజాగోస–బీజేపీ భరోసా స్ట్రీట్ కార్నర్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్థానికేతరుడు అయిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి రెండు సార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలిచి ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. ఇలాంటి నాయకులకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. కట్కూర్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన శ్రవణ్‌గౌడ్, కుంట్ల రాములు ఇద్దరు పార్టీ కార్యకర్తల కుటుంబాలకు రూ. 5వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు బేజాడి బీరప్ప, మండల అధ్యక్షుడు సద్ది సోమిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి జూకంటి గణేష్, బూత్ అధ్యక్షులు కదునూరి పాండు, గుడ్ల మల్లయ్య, నాయకులు పాల్గొన్నారు. బీజేపీ సభాస్థలి పరిశీలన స్టేషన్‌ఘన్‌పూర్: ‘ప్రజా గోస–బీజేపీ భరోసా’ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న శక్తి కేంద్ర కార్నర్ మీటింగ్‌ల ముగింపు సందర్భంగా శనివారం డివిజన్ కేంద్రంలో జరిగే సభకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో సభాస్థలిని జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ గుండె విజయరామారావు, నియోజకవర్గ పాలక్ వట్టివల్లి శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర నాయకుడు మాదాసు వెంకటేష్ శుక్రవారం పరిశీలించారు. నియోజకవర్గ కన్వీనర్ ఐలోని అంజిరెడ్డి, వరంగల్ పార్లమెంట్ కోకన్వీనర్ ఇనుగాల యుగేందర్‌రెడ్డి, గట్టు కృష్ణ, శివరాజ్‌యాదవ్, రడపాక పవన్ పాల్గొన్నారు. కేసీఆర్ చేసింది శూన్యం నర్మెట: ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి శూన్యమని, రాష్ట్రంలో కొసాగుతున్న అరాచక కుటుంబ పాలనను అంతమొందించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు ముక్కెర తిరుపతిరెడ్డి అన్నారు. మండలకేంద్రంతోపాటు ఇప్పలగడ్డలో శుక్రవారం ఏర్పాటుచేసిన ప్రజాగోస–బీజేపీ భరోసా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. పార్టీ శాఖ అధ్యక్షుడు ధరావత్ రాజు, జిల్లా కార్యదర్శి సొక్కం అనిల్ కుమార్, చిర్ర తిరుపతిరెడ్డి, పినింటి శ్రీనివాస్‌రెడ్డి, గంగం ప్రభాకర్‌రెడ్డి, పాతూరి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. బంగారు తెలంగాణ బీజేపీతోనే సాధ్యం పాలకుర్తి టౌన్: బంగారు తెలంగాణ బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు లేగ రామ్మోన్‌రెడ్డి, దొంగరి మహేందర్ అన్నారు. శుక్రవారం మండలంలోని శాతాపురం గ్రామంలో ప్రజాగోస– బీజేపీ భోరోసా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడూతూ గతంలో బంగారు తెలంగాణ చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం తాగుబోతుల, అప్పుల తెలంగాణ చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ర శ్రీనివాస్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మారం రవికుమార్, పట్టణ అధ్యక్షులు దుంపల సంపత్, అమరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
నిందితుడిని శిక్షించాలి
జనగామ రూరల్: కేఎంసీ విద్యార్థి ప్రీతి ఆత్మహత్యాయత్నానికి కారకుడైన సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఉల్లెంగుల రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాజు మట్లాడుతూ సీనియర్ విద్యార్థి వేధింపులు భరించలేక ప్రీతి అధిక మొత్తంలో అనస్థీషియా తీసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని అన్నారు. పొన్నాల రమేష్, కార్తీక్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ర్యాంగింగ్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి విద్యాలయాల్లో ర్యాగింగ్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి విద్యార్థుల ప్రాణాలను రక్షించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు దడిగే సందీప్ కోరారు. కేఎంసీ జూనియర్ విద్యార్థినిపై ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనగామ నెహ్రు పార్క్ వద్ద జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నాయకులు యశ్వంత్‌రెడ్డి, పవన్, శ్రవణ్, మమత, మాధవి, రోహిత్ తదితరులు పాల్గొన్నారు. సైఫ్‌ను ఉరి తీయాలి పాలకుర్తి టౌన్: వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతిని మానసికంగా వేధించిన సైఫ్‌ను ఉరితీయాలని గిరిజన నాయకులు లావుడ్యా మల్లునాయక్, దేవేందర్‌నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో రాజీవ్ చౌరస్తాలో ప్రీతిని వేదించిన సైఫ్‌ను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేస్తూ గిరిజన నాయకలు నిరసన తెలిపారు. మహేందర్, బీమా నాయక్, బాలజీనాయక్, అనిల్, సుమన్, ప్రశాంత్, రాజు, ప్రవీన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలి కొడకండ్ల: గిరిజన విద్యార్థిని ప్రీతిని మానసికంగా హింసించిన దోషులను చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ధరావత్ సురేష్‌నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండలకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సరస్వతీ పుత్రికగా చదువులో రాణిస్తూ పేద ప్రజలకు వైద్య సేవ చేయాలనే లక్ష్యంతో జూనియర్‌గా సేవలందిస్తున్న ప్రీతిని సీనియర్ సైఫ్ మానసికంగా హింసిస్తున్న విషయాన్ని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా కూడా ఉన్నతాధికారులు పట్టించుకొకపోవడంతోనే ఈ దుస్థితి దాపురించిందన్నారు. సైఫ్ డిగ్రీని రద్దు చేయడంతో పాటు చట్టరీత్యా కఠినంగా శిక్షించాలన్నారు. ఎస్టీ, ఎస్సీ సెల్ అధ్యక్షులు రాహూల్, భిక్షపతి, జంగిలి జగన్నాథం, రాజులు పాల్గొన్నారు. -
అంధత్వ రహిత సమాజమే లక్ష్యం
రఘునాథపల్లి: అంధత్వ రహిత సమాజమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమం చేపట్టారని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని గబ్బెటలో ఆయన కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మానవ శరీరంలో అన్నింటి కంటే ప్రధాన మైనది కంటి చూపు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ హషిం, ఎంపీటీసీలు గూడెల్లి శిరీష, కేమిడి రమ్య, వైద్యులు డాక్టర్ కమలహసన్, డాక్టర్ రాధిక, సందీప్, బిక్కునాయక్, విష్ణువర్దన్‌రెడ్డి, యశోద, మమత తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజల కళ్లల్లో వెలుగులు దేవరుప్పుల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమంతో పేద ప్రజల కళ్లల్లో వెలుగులు చూస్తున్నామని సర్పంచ్ బిల్లా అంజమ్మ అన్నారు. ఎనిమిది రోజులు కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలతోపాటు మందులు అందించినట్లు తెలిపారు. శుక్రవారం మండలంలోని కామరెడ్డి గూడెంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిర ముగింపు సందర్భంగా వైద్య బృందం, సిబ్బందిని ఆమె ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. వైద్యులు ఏల అనిల్ కుమార్, బొబ్బిలి, మేడబద్రి, జెస్సీకా, అంజలి, భాగ్య, వసంత, సంపూర్ణ, ఉప్పలయ్యల పాల్గొన్నారు. -
జనగామలో క్లోరిన్ గ్యాస్ లీక్
-
త్రీఫేజ్ విద్యుత్ సరఫరా ఎలా జరుగుతోంది?
రఘునాథపల్లి: వ్యవసాయ మోటార్లకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా ఎలా జరుగుతుందో తెలుసుకునేందుకు టీఎస్ ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు జనగామ జిల్లా రఘునాథపల్లి సబ్ డివిజన్ సెక్షన్ ఆఫీస్, ఈఆర్వో కార్యాలయం, 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. త్రీఫేజ్ కరెంట్ సరఫరా అస్తవ్యస్తంగా ఉండటంతో పొలాలకు నీరు పెట్టేందుకు రైతులు రాత్రివేళ పడుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’ప్రధాన సంచికలో మంగళవారం ‘చేను తడవాలంటే జాగారమే’శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. వ్యవసాయానికి త్రీఫేజ్ సరఫరా ఎలా జరుగుతుంది, ఏమైనా ఇబ్బందులున్నాయా.. 33/11 పవర్ ట్రాన్స్ఫార్మర్ల తీరు తెన్నులు అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన, వర్క్ కేటాయింపు రిజిస్టర్లను తనిఖీ చేశారు. వినియోగదారులకు, రైతులకు ఎలాంటి ఆటంకం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. అధికారులు, ఉద్యోగులు హెడ్‌క్వార్టర్‌లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆయన వెంట సూపరింటెండెంట్ æఇంజనీర్ వేణుమాధవ్, డీఈ ఆపరేషన్ ఎంఎల్ఎన్ రెడ్డి, డీఈ ఐటీ అనిల్‌కుమార్, ఏడీఈ మనోహర్‌రెడ్డి, ఎస్‌ఏవో జయరాజ్, ఏఏవో హన్మంత్‌నాయక్, ఏఈ రాహుల్ తదితరులున్నారు. -
కలెక్టరేట్‌పై దంపతుల ఆత్మహత్యాయత్నం
జనగామ: తమ తాతనుంచి వారసత్వంగా వచ్చిన భూమిని కొందరు రెవెన్యూ అధికారులు ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేసి.. అన్యాయం చేశారని ఆరోపిస్తూ సోమవారం జనగామ జిల్లా సమీకృత కలెక్టరేట్‌పైకి ఎక్కి ఓ దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇలా వీరు ఈ సమస్యపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఇది మూడోసారని తెలుస్తోంది. వివరాలిలా ఉన్నాయి. జనగామ మండలం పసరమడ్ల గ్రామానికి చెందిన నిమ్మల నర్సింగారావు, రేవతి దంపతులు బతుకు దెరువు కోసం ఐదేళ్ల క్రితం ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఏలుబాకకు వెళ్లారు. అక్కడ నర్సింగారావు కారు డ్రైవింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కాగా, గ్రామంలో తమ తాత నుంచి వారసత్వంగా వచ్చిన 4 ఎకరాల భూమిని అప్పటి తహసీల్దార్ రమేశ్, వీఆర్ఓ క్రాంతి అదే గ్రామానికి చెందిన కొందరి పేరిట రిజస్ట్రేషన్ చేశారని నర్సింగారావు ఆరోపించారు. ఈ విషయమై తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఎన్ని సార్లు విన్నవించుకున్నా ఫలితం కనిపించలేదని తెలిపారు. కలెక్టర్‌ను కలిసి..: నర్సింగారావు దంపతులు ఉదయం 11 గంటల తర్వాత గ్రీవెన్స్ కార్యక్రమంలో కలెక్టర్ సీహెచ్ శివలింగయ్యను కలసి వినతిపత్రం అందజేశారు. నాలుగేళ్లనుంచి తమ సమస్య పరిష్కారంకోసం తిరుగుతున్నామని, త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్.. ‘మీకు న్యాయం జరిగేలా చూస్తున్నా.. కొంత ఆలస్యం జరుగుతుంది, కొద్దిగా ఓపిక పట్టండి’అని సమాధానం చెప్పారు. అయితే ఓపిక నశించిన ఆ దంపతులు కలెక్టరేట్ పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నర్సింగారావు దంపతులు ఒంటిపై డీజిల్ పోసుకుని చేతిలో అగ్గిపెట్టె పట్టుకుని.. తాము చచ్చిపోతున్నామని, ఇక్కడ న్యాయం జరగదని అరవడంతో అక్కడికి వచ్చిన అధికారులు, పోలీసులు, జనం గంటసేపు వారిని బతిమిలాడారు. చివరికి పై నుంచి ఆ దంపతులపై నీళ్లు పోయగా, అక్కడే ఉన్న పోలీసులు చాకచక్యంగా వారిని పట్టుకుని కిందకు తీసుకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం తహసీల్దార్ రవీందర్ వారితో మాట్లాడారు. పట్టా రద్దు వ్యవహారం కోర్టు ద్వారా రావాల్సి ఉందని.. తమ చేతుల్లో లేదని, కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలని దంపతులకు చెప్పి పంపించారు. -
పథకాల పేర్లతో మోసం చేస్తున్నారు
జనగామ: రాష్ట్ర ప్రజలకు సంక్షేమం అంటే ఏంటో చూపించిన మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని విమర్శించే సీఎం కేసీఆర్... బొంకుడు మాటలు మాట్లాడేది ఎవరో చెప్పాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా విమర్శించారు. వైఎస్ఆర్పై అసెంబ్లీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను షర్మిల ఖండించారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో సోమవారం జరిగిన సభలో ఆమె మాట్లాడారు. పథకాల పేరు చెబుతూ... ప్రజలను మోసం చేసేది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 33 ప్రాజెక్టుల నిర్మాణం చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి బొంకుడు మనిషి అయ్యారా? అటువంటి బొంకుడు మాటలు చెప్పే అలవాటు నీకే ఉందని కేసీఆర్‌పై ఆమె నిప్పులు చెరిగారు. ప్రజల గుండెల్లో వైఎస్సార్ దేవుడిగా నిలిచిపోతే... కేసీఆర్‌ను దెయ్యమని పిలుచుకుంటున్నారన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిది పాదయాత్రనో.. దొంగయాత్రనో అర్థం కావడంలేదని విమర్శించా రు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి, కేసీఆర్ చేతిలో పిలకగా మారిన రేవంత్.. ప్రజల గురించి మాట్లాడతాడంటే మనం నమ్మొచ్చా అని ప్రశ్నించారు. షర్మిల వెంట నేతలు ఏపూరి సోమన్న, జిల్లా అధ్యక్షుడు గౌరబోయిన సమ్మయ్య ఉన్నారు. -
తల్లి తలను నరికి.. ఆ తలతో అటూ ఇటూ తిరిగి..
జనగామ రూరల్: చెల్లికి భూమి రాసి ఇచ్చి.. తనకు మాత్రం భూమి ఇవ్వడం లేదన్న కక్షతో కన్నతల్లిని ఓ కొడుకు అత్యంత కర్కశంగా చంపేశాడు. చికెన్కొట్టే కత్తితో తల్లి మెడ నరికి తలను వేరు చేశాడు. అనంతరం నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ దారుణ ఘటన జనగామ జిల్లా జనగామ మండలం మరిగడి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మరిగడి గ్రామానికి చెందిన కూరాకుల రాజయ్య, రమణమ్మలకు కుమారుడు కన్నప్ప, కూతురు లావణ్య ఉన్నారు. వీరికి పది ఎకరాల భూమి ఉంది. పదేళ్ల క్రితం రాజయ్య పక్ష వాతంతో చనిపోయాడు. గతంలో చికెన్ దుకాణం నడిపిన కన్నప్ప రెండు నెలలుగా స్థానికంగా సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. కుమార్తె తన భర్తతో గొడవపడి మూడు నెలలనుంచి తల్లి వద్దే ఉంటోంది. ఈక్రమంలో కుమార్తెకు ఎలాంటి ఆధారం లేనందున ఉన్న భూమిలో కొంత ఇవ్వాలని తల్లి రమణమ్మ కొద్ది కాలంగా కుమారుడితో పట్టుబడుతోంది. ఇందుకు అతను సుముఖంగా లేకపోవడంతో పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో కన్నప్పకు తెలియకుండా గత నెల 30న కుమార్తెకు 4ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసింది. విషయం తెలుసుకున్న కుమారుడు మిగిలిన భూమిని తనకు ఇవ్వాలని తల్లిని కోరాడు. ఇందుకు ఆమె ససేమిరా అంది. తాను బతికి ఉండగా ఆస్తిని ఇవ్వనని.. కుమారుడికి తెగేసి చెప్పడంతో కక్ష పెంచుకున్నాడు. నాలుగు రోజుల క్రితం ఇరువురూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకోగా కుమారుడిపై కేసు కూడా నమోదైంది. ఈ క్రమంలో గురువారం ఉదయం చెల్లి లావణ్య పాల కోసం బయటకు వెళ్లింది. బైక్‌పై వచ్చిన కన్నప్ప వెంట తెచ్చుకున్న చికెన్ కొట్టే కత్తితో ఇంటిగడప వద్ద ఉన్న తల్లి రమణమ్మ (60) మెడపై నరికాడు. దీంతో ఆమె కుప్పకూలిపోయింది. ఆ తరువాత తలను వేరు చేసి దానిని పట్టుకుని ఇంటిముందు అటూ ఇటూ కాసేపు తిరిగాడు. అనంతరం బైక్‌పై వెళ్లి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. జనగామ డీసీపీ సీతారాం, ఏసీపీ దేవేందర్‌రెడ్డి, సీఐ, ఎస్సైలు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. -
జనగామ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్‌పై అవిశ్వాస నోటీసులు
జనగామ: జనగామ మున్సిపల్ చైర్పర్స పోకల జమున, వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్పై అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు శుక్రవారం అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్‌కి అవిశ్వాస నోటీసులు అందజేశారు. తొమ్మిది రోజులపాటు క్యాంపు రాజకీయం నడిపించిన అధికార పక్షం ఆ ఇద్దరిని తొలగించాలని కోరుతూ 11 మంది బీఆర్ఎస్, 8 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు వేర్వేరుగా అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. ఫ్లోర్‌లీడర్ మారబోయిన పాండును తొలగించాలని అధిష్టానాన్ని కోరినట్లు బీఆర్ఎస్ కౌన్సిలర్లు తెలిపారు. కాంట్రాక్టర్లు, ఇళ్లనిర్మాణ అనుమతులకు కమీషన్లు వసూలు చేస్తూ పార్టీని అప్రతిష్టపాలు చేస్తుండటంతో అవిశ్వాసం నోటీసులు ఇచ్చినట్లు చైర్పర్సన్ రేసులో ఉన్న 19వ వార్డు సభ్యురాలు బండ పద్మ తెలిపారు. కాగా, నలుగురు బీజేపీ సభ్యులు కూడా తమతో టచ్‌లో ఉన్నారని ఆమె చెప్పారు. -
కేసీఆర్ అభివృద్ధి ఎలక్షన్ టూ ఎలక్షన్: ఈటల
జనగామ: తెలంగాణలో అభివృద్ధి..కొత్త కొత్త జీఓలు ఎలక్షన్ టు ఎలక్షన్‌గా మారాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం జనగామ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఈటల మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడే ప్రభుత్వం పని చేస్తుందని, ప్రతీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వస్తే బాగుంటుందనే ఆలోచనలో ప్రజలు ఉన్నారన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇంకా పూర్తి చేయకుండానే, దొంగ జీఓలను విడుదల చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 127 చోట్ల మున్సిల్, కార్పొరేషన్లో అసమ్మతి సెగలను కంట్రోల్ చేయని దుస్థితిలో సీఎం ఉన్నారన్నారు. తెలంగాణలో 24 గంటలపాటు కరెంటు సరఫరా ఇవ్వలేని కేసీఆర్ దేశం మొత్తం ఉచితంగా ఇస్తామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. -
ప్రభుత్వంపై బీజేపీ కక్షసాధింపు
జనగామ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ, ఐటీ దాడులతో తెలంగాణ ప్రభుత్వంపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని లొంగదీసుకునేందుకు కేంద్ర సర్కారు అడ్డదారులు తొక్కుతోందని మండిపడ్డారు. టీఆర్ఎస్ పై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్న సమయంలో.. బీజేపీ దాడులతో సానుభూతి పెరిగేలా చేస్తోందని వ్యాఖ్యానించారు. మునుగోడు ఎన్నికల్లో విజ యం సాధించి.. తెలంగాణలో రెండో శక్తిగా ఎదగాలనే బీజేపీ ఆశలపై అక్కడి ఓటర్లు నీళ్లు చల్లారని అన్నా రు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో తమకు సంబంధం లేదని చెబుతున్న బీజేపీ.. హైకోర్టు, సుప్రీం కోర్టు మెట్లు ఎందుకు ఎక్కుతుందో ప్రజలకు సమాధానం చెప్పాలని తమ్మినేని డిమ ండ్ చేశారు. ఈడీ, ఐటీ దాడులను వెంటనే ఆపకుంటే జనం తిరగబడడం ఖాయమన్నారు. టీఆర్ఎస్తో పొత్తుపై ఇప్పుడే మాట్లాడం టీఆర్ఎస్తో పొత్తుపై ఇప్పుడే మాట్లాడేది లేదని, ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాతనే దీనిపై స్పష్టత ఇస్తామని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలతో పాటు బీజేపీ ద్వంద్వ విధానాలపై పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించాలని, అటవీ శాఖ అధికారిని హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అటవీ శాఖ అధికారులకు ఆయుధాలు ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయం మేరకే ఉంటుందని తమ్మినేని అభిప్రాయపడ్డారు. -
Jangaon: గొంతులో ఆమ్లెట్ ఇరుక్కొని వ్యక్తి మృతి
మద్యం తాగేందుకని ఓ వ్యక్తి వైన్ షాపుకెళ్లాడు. తనకు నచ్చిన బ్రాండు తీసుకుని పక్కనే ఉన్న పర్మిట్ రూమ్(మద్యం తాగేందుకు అనుమతి గది)లోకి వెళ్లాడు. ఖాళీగా ఉన్న ఓ టేబుల్ చూసుకుని కూర్చున్నాడు. బాటిల్ ఓపెన్ చేసి.. ఓ పెగ్గు కలిపాడు. అప్పుడు గుర్తొచ్చింది మనోడికి మంచింగ్ సంగతి. మందు ఓకే.. మరి మంచింగ్ ఏం తీసుకుందాం అని కాసేపు ఆలోచిస్తే.. మరీ కాస్ట్లీవి మనకెందుకనిఓ ఆమ్లెట్‌తో సరిపెట్టేద్దాంలే అనుకుని ఆర్డర్ ఇచ్చాడు. వేడివేడిగా ఆమ్లెట్ టేబుల్‌పైకి వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం అనుకుని ఓ పెగ్గేశాడు. వేడివేడి ఆమ్లెట్‌ను తీసుకుని అలా నోట్లో పెట్టుకున్నాడు. అంతే.. అదే ఆమ్లెట్ యమపాశమై మనోడి ప్రాణాలను తీసేసింది. జనగామ జిల్లా బచ్చన్నపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. బచ్చన్నపేటకు చెందిన ఈదులకంటి భూపాల్‌రెడ్డి (38) స్థానిక మద్యం దుకాణంలోని అనుమతి గదిలో కూర్చొని మద్యం తాగుతున్నాడు. తాను తింటున్న ఆమ్లెట్ గొంతులో ఇరుక్కుపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ప్రాణం తీసిన ఆమ్లెట్.. మందు తాగుతుండగా గొంతులో ఇరుక్కొని.. -
రైతు నిజాయితీ.. 15 గుంటలకు పట్టా పుస్తకం వచ్చినా కూడా తనకెందుకని..
పాలకుర్తి టౌన్: ఆస్తి కోసం రక్తం పంచుకుపుట్టిన అన్నదమ్ములు, అక్కాచెళ్లెళ్ల మధ్య జరుగుతున్న వివాదాలు చూస్తూనే ఉన్నాం. కన్నవారిపైనే అమానుషానికి పాల్పడుతున్న వారసుల గురించి విన్నాం. కానీ, తనది కాని భూమి తనకెందుకని ఓ యువరైతు నిజాయితీ చాటుకున్నాడు. తన పేరుపై పొరపాటున నమోదై పట్టా పుస్తకం వచ్చినా కూడా భూమిని తిరిగి ఇచ్చేశాడు. ఈ ఆసక్తికర ఘటన జనగామ జిల్లా పాలకుర్తిలో వెలుగుచూసింది. పాలకుర్తి మండల పరిధి తిరుమలగిరి గ్రామంలో పొన్నం రాజు అనే రైతు ఉన్నాడు. అదే గ్రామానికి చెందిన రైతు బక్క సోమయ్యకు చెందిన 15 గుంటల పట్టా భూమి రికార్డుల్లో తప్పిదం కారణంగా పొన్నం రాజు పేరున నమోదైంది. అయితే, ఆ భూమి తనది కాదని సోమయ్యకు చెందినదని రాజు గుర్తించాడు. మండల తహసీల్దార్ పాల్‌సింగ్ వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. స్వచ్ఛందంగా తహసీల్దార్ సమక్షంలో శనివారం సోమయ్యకు పట్టా చేయించి నిజాయితీ చాటుకున్నాడు. ఉప సర్పంచ్ నాగరాజుతో పాటు గ్రామస్తులు, రెవెన్యూ అధికారులు రాజును అభినందించారు. (చదవండి: బద్రినాథ్‌యాత్రలో వరంగల్ వైద్యురాలు మృతి) -
జనగామలో బండి సంజయ్ పాదయాత్ర నేపథ్యంలో హైటెన్షన్
-
లా అండ్ ఆర్డర్ చేతకాకుంటే ఇంట్లో కూర్చోవాలి: బండి సంజయ్
సాక్షి, జనగామ: జిల్లాలోని దేవరుప్పుల ఘటనతో పోలీస్ సెక్యూరిటీని బండి సంజయ్ నిరాకరించారు. భద్రతా సిబ్బందిని ఉపసంహరించుకోవాలని తేల్చి చెప్పారు. ఆయన భద్రతను తన కార్యకర్తలే చూసుకుంటారన్నారు. బీజేపీ కార్యకర్తల తలల పగలకొడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. లా అండ్ ఆర్డర్ చేతకాకుంటే సీపీ ఇంట్లో కూర్చోవాలన్నారు. దాడి ఘటనపై వెంటనే డీజీపీ స్పందించాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర ప్రశాంతంగా జరిగేలా చాడాలని అన్నారు. లేదంటే గాయపడ్డ కార్యకర్తలను తమ దగ్గరికి తీసుకొస్తానని సవాల్ విసిరారు. జరగబోయే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పోలీసులకు జీతాలు కేసీఆర్ జేబుల్లోంచి ఇస్తున్నారా? అని నిలదీశారు. చదవండి: బండి సంజయ్ పాద్రయాత్రలో ఉద్రిక్తత.. బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య ఫైట్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తిన విషయం తెలిసిందే. దేవరుప్పల సభలో సంజయ్ ప్రసంగిస్తుండగా.. టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. టీఆర్ఎస్ సర్కార్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని బండి సంజయ్ ప్రశ్నించారు. దేశంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని సంజయ్‌ను టీఆర్ఎస్ నేత అడగడంతో వివాదం మొదలైంది. టీఆర్ఎస్ కార్యకర్తలు సంజయ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షమ జరిగింది. పరస్పరం రాళ్లు విసురుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. -
9 నెలల చిన్నారిని బలి తీసుకున్న చైన్ స్నాచర్
-
చిన్నారిని బలితీసుకున్న చైన్ స్నాచర్.. నీటి సంపులో పడేయడంతో..
సాక్షి, జనగామ జిల్లా: పాప వయస్సు ఏడాది.. అయినా బోర్లా పడరాదు..చేతులతో ముందుకు కదలలేదు.. ఆస్పత్రులకు వెళితే బాగయ్యే పరిస్థితి లేదన్నారు.. ఒకవైపు మూడేళ్ల కొడుక్కి ఓపెన్ హార్ట్ సర్జరీ జరగడం, చిన్నారి పరిస్థితిలో తీవ్ర మనోవేదనకు గురైన కన్న తల్లే చిన్నబిడ్డను నీటి సంప్‌లో వేసి చంపేసింది. ‘అయ్యో దొంగోడొచ్చాడు.. నా మెడలో పుస్తెల తాడు లాక్కోబోయాడు.. అడ్డుకున్నందుకు చంటి పాపను సంపులో వేసి చంపేశాడంటూ దొంగేడుపుతో అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. చివరకు జైలు పాలయింది. అప్పటివరకు తన కూతురును ఎత్తుకుని ఆడించిన తండ్రి.. హెయిర్ కటింగ్ సెలూన్‌కు వెళ్లిన అరగంటకే ఫోన్లో ఆమె మరణ వార్త తెలియడంతో అక్కడే కుప్పకూలి పోయాడు. జనగామ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌నగర్‌లో సోమవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కొడుక్కి ఓపెన్ హార్ట్.. కూతురు కదల్లేని స్థితి జనగామ మండలం చీటకోడూరు గ్రామానికి చెందిన నడిగోటి భాస్కర్‌కు యాదాద్రి భువనగిరి జిల్లా పొద్దుటూరు గ్రామానికి చెందిన ప్రసన్నతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు.. మూడేళ్ల నవనీత్, తేజస్వి (12 నెలలు) ఉన్నారు. హెయిర్ కటింగ్ సెలూన్ నడిపించే భాస్కర్, బతుకు దెరువు కోసం జనగామ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌నగర్‌కు మకాం మార్చాడు. అనారోగ్యానికి గురైన నవనీత్‌కు ఇటీవలే ఓపెన్ హార్టు సర్జరీ చేయించగా, రూ.8 లక్షల వరకు ఖర్చయింది. తేజస్వి కూడా సరైన ఎదుగుదల లేక సరిగ్గా కదలలేని స్థితిలో ఉండేది. దీంతో అనేక ఆస్పత్రులకు తిప్పారు. లక్షల రూపాయలు ఖర్చు చేసినా, బాగయ్యే పరిస్థితి లేదని డాక్టర్లు తేల్చి చెప్పడంతో ప్రసన్న తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలిసింది. కూతురు హత్యకు ముందే ప్లాన్ సోమవారం వీరితోనే ఉంటున్న అత్త, మామ, మరిది వేరే ఊరికి వెళ్లారు. ఉదయం 10.30 గంటలకు భాస్కర్ హెయిర్ కటింగ్ సెలూన్‌కు వెళ్లగా, ప్రసన్న ఇంటి గేటుకు తాళం వేసుకుని లోపలే ఉండి పోయింది. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం కూతుర్ని చంపాలని నిర్ణయించుకుంది. ఇంటి బయట నీటి సంప్‌లో పడేసింది. చనిపోయిన తర్వాత బయటకు తీసి అరుపులు, కేకలతో ఏడుపు మొదలుపెట్టింది. అటుగా బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి రావడంతో అతనికి చైన్ స్నాచింగ్ కథ విని్పంచింది. అతనితో కలిసి బైక్‌పై ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ నుంచి చంపక్‌హిల్స్ ఎంసీహెచ్‌కు తరలించారు. చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రి ఉంచి ఆమెతో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ‘గోడ మీదుగా హెల్మెట్ ధరించిన దుండగుడు ఇంట్లోకి ప్రవేశించి, మెడలోని పుస్తెల తాడు బ్లేడ్‌తో తెగ్గొట్టే ప్రయత్నం చేశాడని పోలీసులకు, చుట్టుపక్కల వారికి ప్రసన్న చెప్పుకొచి్చంది. తాను అతనితో పెనులాడడానని, దుండగుడు రెండు ముక్కలైన పుస్తెల తాడు తీసుకుని, మరో వైపు పసిపాపను లాక్కుని, ఇంటి ఆవరణలో ఉన్న సంపులో వేసి, గోడ దూకి పారిపోయాడంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. అయితే అక్కడ ప్రసన్న చెబుతున్నట్టుగా సీన్ కనిపించకపోవడంతో అనుమానించిన ఏసీపీ జి.క్రిష్ణ, సీఐ ఇ.శ్రీనివాస్ భార్యాభర్తలను స్టేషన్‌కు తీసుకుని వెళ్లి ప్రసన్నను తమదైన శైలిలో విచారించారు. తానే పాపను హత్య చేసినట్లు ఆమె నోటితోనే చెప్పించారు. ఆ మేరకు భర్త ఇచి్చన ఫిర్యాదుతో హత్యా నేరం కింద కేసు నమోదు చేసుకుని జైలుకు పంపించారు. తల్లి డ్రామా బట్టబయలైయింది : డీసీపీ ఈ కేసును పోలీసులు ఏడు గంటల్లోనే ఛేదించారు. కూతురును హత్య చేసి, చైన్‌స్నాచర్ చేతిలో హతమైనట్లుగా నమ్మించేందుకు ప్రయతి్నంచిన తల్లి నిజాన్ని ఒప్పుకుందని డీసీపీ పి.సీతారాం విలేకరులకు తెలిపారు. పాప అనారోగ్య సమస్యతో బాధపడుతుండడంతోనే హత్య చేసినట్లు ప్రసన్న అంగీకరిచిందని తెలిపారు. బతికినంత కాలం కూతురితో ఇబ్బందులు పడాల్సి వస్తుందని భావించి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చెప్పిందన్నారు. పోలీసులను తప్పుదారి పట్టించడం కోసమే చైన్ స్నాచింగ్ డ్రామా చేసిందన్నారు. -
అయ్యో పాపం! ఇప్పుడే వస్తానంటూ.. ‘వెళ్లిపోయింది’
జనగామ: పక్షవాతంతో మంచాన పడిన భర్త.. ఆయనకు సపర్యలు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న భార్య.. ఏదో పనుండి ఇంట్లో నుంచి బయటకెళ్లిన భార్య కాస్తా కారు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఇప్పుడే వస్తానన్న భార్య మాట కోసం రెండు గంటలపాటు ఎదురుచూసి ఇక ఎప్పటికీరాదన్న విషయాన్ని తెలుసుకుని తను ఒంటరైపోయానని తల్లడిల్లిపోతున్న వైనం స్థానికుల్ని కలచివేస్తోంది. కష్టాల కడలిలో సంసార నావను ఈదుతోన్న కుటుంబాన్ని కారు ప్రమాద రూపంలో నిలువునా ముంచేసిన వైనం బుధవారం జనగామ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని లింగాల ఘనపురం మండలం వడిచెర్లకు చెందిన నంగునూరి సత్యనారాయణ, లక్ష్మి(65) దంపతులు జనగామలోని ఓల్డ్ లక్ష్మీకృష్ణ థియేటర్ ప్రాంతంలో ఓ అద్దె ఇంట్లో నివాస ముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే చిన్నతనం లోనే పిల్లలు చనిపోగా సత్యనారాయణ వడ్రంగి పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కొన్నాళ్ల క్రితం పక్షవాతంతో రెండు కాళ్లు చచ్చుబడిపోవడంతో సత్యనారాయణ మంచానికే పరిమితమైపోయాడు. అప్పట్నుంచి ఆయనకు లక్ష్మి సపర్యలు చేస్తూ వస్తోంది. కుటుంబ పోషణ కోసం శ్రీచెన్న కేశ్వరస్వామి ఆలయంతోపాటు ఓ ప్రభుత్వ కార్యాలయంలో లక్ష్మి పనికి కుదిరింది. వచ్చిన డబ్బులతో భర్తకు వైద్యం చేయిస్తూ బతుకు బండి లాగిస్తోంది. ఈ క్రమంలో ఏదో పనుండి లక్ష్మి బయటకు వెళ్లాల్సి రావడంతో.. భర్తకు ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. అదే సమయంలో పక్కనే ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ జమున లింగయ్య ఇంటి నుంచి ఆమె కుమారుడి కారును డ్రైవర్ వెనక్కి తీసుకొస్తుండగా అదుపుతప్పి కారు లక్ష్మి మీదకు దూసుకొచ్చింది. అప్పటికే తనవైపుగా వస్తున్న కారును చూసి ‘‘బాబూ.. మెల్లగా రా బాబూ’’..అంటూ లక్ష్మి ఎంత అరిచినా డ్రైవర్ వినిపించుకోకుండా కారును ఆమె పైనుంచి పోనివ్వడంతో లక్ష్మి తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (క్లిక్: ఇళ్లంతా సందడి.. కానీ చూస్తుండగానే..!) -
సిగరెట్ అట్టముక్కే మందుల చీటీ.. డాక్టర్లపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
జనగామ: సిగరెట్ డబ్బా అట్టముక్కలపై మందులు రాసి బయట తెచ్చుకోమంటున్నారని మంత్రి హరీశ్‌రావుకు జనగామ చంపక్‌హిల్స్ మాతా శిశుసంరక్షణ ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లోని బాలింతలు, రోగుల బంధువులు ఫిర్యాదు చేశారు. పేరుకే ఉచితమని.. సూదులు, సిరప్లు కూడా బయటే కొంటున్నామని మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. నకిరేకల్ నుంచి సిద్దిపేటకు వెళ్లే క్రమంలో మార్గమధ్యలో ఉన్న చంపక్‌హిల్స్ ఎంసీహెచ్‌ను మంత్రి శనివారం తనిఖీ చేశారు. నేరుగా జనరల్ వార్డులోని బాలింతల వద్దకు వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. వారికి అందుతున్న వైద్య సేవలు, ఇతర సదుపాయాల గురించి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న లింగాల ఘణపురానికి చెందిన మహేశ్‌ను మంత్రి పలకరించగా.. ‘సిగరెట్ డబ్బాల అట్టముక్కలపై మందుగోలీలు బయటకు రాస్తున్నారు. చూడండి సారూ’అంటూ తన వద్ద ఉన్న ప్రిస్క్రిప్షన్‌ను మంత్రికి చూపించారు. ‘ఉచితం పేరుకే. నొప్పుల సూది.. సిరప్లు కూడా బయటనే కొంటున్నాం’అంటూ జనగామ మండ లం గోపిరాజుపల్లికి చెందిన భాగ్యలక్ష్మి తన గోడు వెళ్లబోసుకున్నారు. ఆస్పత్రి నివేదికివ్వాలని వైద్యారోగ్య శాఖ కమిషనర్‌కు ఆదేశం ప్రభుత్వం నుంచి కొరత లేకుండా మందు లు పంపిస్తుంటే ప్రైవేటు మెడికల్ దుకాణాలకు ఎం దుకు రిఫర్ చేస్తున్నారని డాక్టర్లు, సిబ్బందిపై మం త్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంసీహెచ్ ఎదుట ఉన్న మెడికల్ దుకాణాలను వెంటనే సీజ్ చేయిం చాలని ఆదేశించా రు. ఒక్కో పేషెంట్ వద్దకు వెళ్లి వారు చెప్పిన ప్రతి విషయాన్ని వింటూ పక్కనే ఉన్న ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుగుణాకర్‌రాజును వివరణ కోరారు. ప్రైవేటు స్కా నింగ్ సెంటర్లను ప్రోత్సహించకుండా ఎంసీహెచ్‌లోనే గర్భిణులకు ఈ సేవలను ఉచితంగా అందించాలన్నారు. ఆస్పత్రిలోని లోపాలను గుర్తించి అక్కడి నుంచే వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణతో ఫోన్లో మాట్లాడారు. జనగామ ఎంసీహెచ్‌కు సంబంధించిన సమగ్ర నివేదికను అందించాలని ఆదేశించారు. -
ఢిల్లీ కోటలు బద్దలు కొడతాం: సీఎం కేసీఆర్
-
ఖబడ్దార్ మోదీ.. ఇది తెలంగాణ పులి బిడ్డా: సీఎం కేసీఆర్
సాక్షి, జనగామ: పిడికెడు లేని బీజేపీ నేతలు తమ జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విద్యుత్ సంస్కరణల పేరిట రైతులను మోసం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. తమ ప్రాణం పోయినా బావుల వద్ద మోటార్లకు కరెంట్ మీటర్లు పెట్టమని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు జనగామలోని యశ్వంత్‌పూర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణను కొట్లాడి సాధించుకున్నామని తెలిపారు. తమను ముట్టుకుంటే అడ్రస్ లేకుండా చేస్తామని బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు ఢిల్లీ కోటలు బద్దలు కొడుతాం తెలంగాణ ప్రజలతో పెట్టుకుంటే ఢిల్లీ కోటలు బద్దలు కొడుతాం.. నరేంద్ర మోదీ జాగ్రత్త అని కేసీఆర్ హెచ్చరించారు. ఖబర్ధార్ మోదీ.. ఇది తెలంగాణ అడ్డా అంటూ నిప్పులు చెరిగారు. నీ ఉడుత ఊపులకు, పిట్ట బెదిరింపులకు భయపడేది లేదని మోదీని ఉద్ధేశిస్తూ విమర్శించారు. దేశ రాజకీయాల్లో పాత్ర పోషించాల్సి వస్తే కొట్లాడటానికి సిద్ధమని పేర్కొన్నారు. సిద్దిపేట ప్రజలు నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపితే తెలంగాణను సాధించామని, మీరందరూ పంపిస్తే ఢిల్లీ గోడలు బద్దలు కొట్టేందుకు సిద్ధమన్నారు. చదవండి: ఉద్యోగులకు జీతాలు ఇంకా పెరుగుతాయి: సీఎం కేసీఆర్ పిట్ట బెదిరింపులకు భయపడేది లేదు ‘జాగ్రత్త నరేంద్ర మోదీ.. ఇది తెలంగాణ పులిబిడ్డ. జనగామ టౌన్లో టీఆర్ఎస్ కార్యకర్తలను బీజేపీ వాళ్లు కొట్టారు. బీజేపీ వాళ్లను మేం టచ్ చేయం.. బీజేపీ బిడ్డల్లారా మమ్మల్ని ముట్టుకుంటే నశం నశం చేస్తాం. మేం ఊదితే మీరు అడ్రస్ లేకుండా పోతారు. రాష్ట్ర సాధన కోసం ఎంతో పోరాటం చేశాం. మీ జాగ్రత్తలా మీరు ఉండండి. మా జాగ్రత్తలా మేం ఉంటాం అని కేసీఆర్ సూచించారు. గతంలో బచ్చన్నపేటను చూస్తే బాధనిపించేది. తెలంగాణ వచ్చాక పరిస్థితి మారింది.రాష్ట్రంలో తాగునీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ప్రతి దళిత కుటుంబానికి చేయూతగా దళితబంధు తెచ్చాం. జనగామ ఒకప్పుడు కరువు సమీగా ఉండేది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ది చేశాం. మోదీ ప్రభుత్వం మీటర్లు పెట్టాలంటోంది. మేము మీటర్లు పెట్టం. పాలకుర్తి, స్టేషన్ ఘన్‌పూర్‌లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని, మెడికల్ కాలేజీపై త్వరలోనే జీవో ఇస్తాం’ అని కేసీఆర్ తెలిపారు -
11న జనగామకు సీఎం కేసీఆర్
జనగామ: జనగామ జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ భవనం, టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవంతోపాటు బహిరంగ సభలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ ఈనెల 11న జిల్లాకు రానున్నట్లు పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఈ మేరకు నూతన కలెక్టరేట్లో శనివారం మంత్రి విలేకరులతో మాట్లా డుతూ ముఖ్యమంత్రి శుక్రవారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ ప్రారంభించి, అక్కడే అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారని వెల్లడించారు. మధ్యాహ్నం 2 గంటలకు టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత ప్రజాప్రతినిధులతో రివ్యూ చేసి మధ్యాహ్నం 3 గంటలకు అదే ప్రాంతంలో జరిగే సభలో పాల్గొంటారని తెలిపారు. -
సేవలు చాలని గెంటేశారు.. రోడ్డునపడ్డ జీసీడీఓ కాంట్రాక్టు ఉద్యోగులు..
సాక్షి, కాళోజీ సెంటర్(జనగామ) : విద్యాశాఖలో ఖాళీగా ఉన్న గల్స్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్(జీసీడీఓ) పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన తొమ్మిది సంవత్సరాల క్రితం భర్తీ చేసి వారి సేవలను వినియోగించుకున్నారు. ఇప్పుడు వారి సేవలు చాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు తొలగిస్తునట్లు మార్చి 29న ఉత్తర్వులు జారీ చేయడంతో వారు రోడ్డున పడ్డారు. ఆర్సీ నంబర్ 435/ఆర్బీఎం/ఎస్ఎస్ఏ/బీఏ/2012 జూలై 7న విడదల చేసిన నోటిఫికేషన్ ఆధారంగా ఎంట్రన్స్ ద్వారా ఎంఏ, బీఎడ్ పూర్తి చేసి, ఏదైనా ఎన్జీఓలో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యతినిచ్చి ఇంటర్వూలు నిర్వహించి భర్తీ చేశారు. అందులో అర్హత సాధించిన 20 మందికి జీసీడీఓలుగా మరి కొంత మందికి ఏజీసీడీఓలుగా అవకాశం కల్పించారు. ఇటీవల జీసీడీఓల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి అప్పటికే పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఎంపిక చేసి జీసీడీఓలు కొనసాగాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీనితోపాటు ఇంత కాలం జీసీడీఓలుగా పనిచేసిన వారిని తొలగిస్తూ.. ఉత్తర్వులు రావడంతో ఉపాధి కోల్పోయి దిక్కుతోచన పరిస్థితిలో పడిపోయారు. కోర్టు సానుకూలత.. ఈ తొమ్మిది ఏండ్లలో జీసీడీఓ హోదాలో పనిచేయించుకొని ఒకసారిగా మీ సేవలు ఇక చాలు అని ఉత్తర్వులు జారీచేయడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. సానుకూలంగా స్పందించిని కోర్టు వారి సేవలను కొనసాగించుకోవాలని చెప్పింది. కానీ, అధికా రుల అందకు సానుకూలంగా లేరని తెలిసింది. మించిపోయిన వయోపరిమితి.. ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే వయోపరిమితి 35 నుంచి 40 సంవత్సరాల వయస్సు తప్పనిసరి. వ యోపరిమితి దాటితే ప్రభుత్వం భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అనర్హులు. 9 సంవత్సరాల కాలం విద్యాశాఖ లో జీసీడీఓలుగా పనిచేసిన వారిని ప్రభుత్వం తొలగించడంతో వయస్సు దాటిపోయి మరో ఉద్యోగాని కి నోచుకోలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వీరిని తొలగించి వారి స్థానంలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న సీనియర్ స్కూల్ అసిసెట్లకు ఆ బాధ్యతలను అప్పగించారు. ఉపాధి కూలీగా పోయే పరిస్థితి.. ప్రభుత్వం 2012లో విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా మెరిట్ ఆధారంగా మమ్మల్ని జీసీడీఓలుగా తీసుకున్నారు. 9 ఏండ్లుగా సేవలు అందిస్తున్న క్రమంలో సడన్‌గా మీరు అవసరం లేదని తొలిగించడం బాధాకరం. ఇప్పుడు ఎటుగాని పరిస్థితి ఉంది. ఉపాధి కూలీ పనులే దిక్కయ్యేలా ఉన్నాయి. – వై.సంపత్, వరంగల్ రూరల్ జిల్లా క్రమబద్ధీకరిస్తామంటే నమ్మినం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతా సీఎం కేసీఆర్ కాంట్రాక్ట్ ఉద్యోగలును క్రమబద్ధీకరణ చేస్తానని ప్రకటించడంతో ఇంత కాలం నమ్మి పనిచేసినం. ఇప్పుడు ఎటుగాకుండా చేసి వెల్లగొట్టారు. ఇది ఎంతవరకు సమంజసం. ప్రభుత్వం పునరాలోచన చేసి, తొలగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు రద్దుచేయాలి. – బండారు విజయ్‌కుమార్, మహబూబాబాద్ -
విషాదం: నిమిషాల వ్యవధిలో భార్యాభర్తలు మృతి..
సాక్షి, పర్వతగిరి(జనగామ): వివాహ బంధంతో ఒక్కటైన వారు కష్టసుఖాలు పంచుకుంటూ జీవనం సాగించారు. చివరకు మృత్యువులోనూ తమనెవరూ విడదీయలేరన్నట్లుగా నిమిషాల తేడాతో కన్నుమూసిన ఘటన ఇది. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన దారం అన్నపూర్ణ(65), దారం కాశయ్య(68) దంపతులు. వీరికి ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నా, ఇతర ప్రాంతాల్లో నివనిస్తున్నారు. కాగా, అన్నపూర్ణ కొద్ది రోజులుగా పక్షవాతంతో బాధపడుతూ మంచానికే పరిమితమైంది. అప్పటి నుంచి భార్యకు అన్నీ తానై కాశయ్య సేవలు చేస్తున్నాడు. ఇంతలోనే అన్నపూర్ణ సోమవారం అర్ధరాత్రి దాటాక అకస్మాత్తుగా మృతి చెందింది. ఈ విషయం తెలియగానే ఆమె భర్త కాశయ్య సైతం శ్వాస విడిచారు. దీంతో బంధువులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. పక్షవాతం బారిన పడిన తనకు భర్త సేవ చేస్తుండడాన్ని తట్టుకోలేక అన్నపూర్ణ మనస్తాపంతో మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు కుమారుడు, కుమార్తెలు చేరుకున్నాక అంత్యక్రియలు నిర్వహించగా, ఆర్యవైశ్య సంఘం బాధ్యులు దారం పూర్ణచందర్, దారం రాము, దారం వెంకన్న, చిదురాల వేణుగోపాల్, దారం సంతోష్ పాల్గొన్నారు. -
ఏడాది కిత్రమే పెళ్లి: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
సాక్షి, వరంగల్: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో తన భర్తను హత్య చేయించింది ఓ మహిళ. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం నమిలిగొండలో చోటుచేసుకుంది. వివరాలు.. ఘట్ కేసర్‌కు చెందిన అశ్వినికి ఆకుల మహేతో ఏడాది క్రితం వివాహమైంది. మహేష్ ఆటో నడుపుతూ జీవనం గడిపేవాడు. ఈ నెల 5 వ తేదీన ఇంటి నుంచి వెళ్లిన మహేష్ తిరిగి రాకపోవడంతో ఘట్ కేసర్లో మిస్సింగ్ కేసు నమోదైంది. పోలీసులు అతని సెల్ నంబర్ అనాలిసిస్ చేశారు. చివరి లొకేషన్ నమిలిగొండ అని చూపింది. దీనితో కాల్ లిస్టులో చాలాసార్లు ఉన్న నెంబర్ అడ్రస్‌ను పోలీసులు తెలుసుకున్నారు. అందులో పసుల కుమార్ అనే వ్యక్తి నంబర్ ఉండగా..అతనిది మీదికొండ గ్రామంగా పోలీసులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకోని విచారించగా మహేష్‌ను హత్య చేసినట్లు అంగీకరించాడు. మహేష్‌ను ఈ నెల 5 వ తేదీన హైదరాబాద్ నుంచి నమిలిగొండలోని తన బామ్మర్ది పాలేపు కృష్ణ ఇంటికి తీసుకెళ్లినట్లు తెలిపాడు. అతనికి మద్యం తాగించి రాత్రి 11 గంటల వరకు అక్కడే ఉంచి.. తరువాత నమిలిగొండ శివారులోని రేకుల కొట్టం వద్ద తలపై రాయితో కొట్టి చంపినట్లు పేర్కొన్నాడు. అనంతరం మృతదేహాన్నిసంచిలో మూటగట్టి బావిలో పడేశానని వెల్లడించాడు. మహేష్ మృతదేహాన్ని బావి నుంచి పైకి తీసున్న పోలీసులు అయితే పెళ్లికి ముందు నుంచే మృతుని భార్య ఆకుల అశ్వినితో పసుల కుమార్ అక్రమ సంబంధం పెట్టుకుని, తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే నెపంతో హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మృతుని భార్య అశ్వినిని ఘట్ కేసర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పోలీసులు తెలిపారు. చదవండి: దొంగతనం కేసులో ఇద్దరు సీరియల్ యాక్టర్స్ అరెస్ట్ దారుణం: తల్లిదండ్రులను కోల్పోయిన చెల్లెలిపై మూడేళ్లుగా.. -
కష్టకాలంలో.. మానవత్వం చాటిన ట్రాన్స్జెండర్లు ..
సాక్షి, లింగాలఘణపురం(జనగామ): కరోనాతో మృతిచెందిన లింగాలఘణపురం మండలం నవాబుపేటకు చెందిన రంపె వెంకటమ్మ అంత్యక్రియలు గురువారం జనగామ పట్టణంలోని పలువురు ట్రాన్స్జెండర్లు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి కుటుంబ సభ్యులెవరూ ముందుకు రాలేదు. దీంతో జనగామ పట్టణానికి చెందిన ట్రాన్స్‌జెండర్ ఓరుగంటి ఉషా, ఓరుగంటి నిత్య ముందుకొచ్చి అంత్యక్రియలు చేశారు. ఈ సందర్భంగా కోవిడ్ 19 సేవాసమితి నిర్వాహుకులు మల్లిగారి రాజు వారిని అభినందించారు. రాజన్న, నాగరాజు, వీరస్వామి ఉచిత అంబులెన్స్ సర్వీసులను అందించారు. చదవండి: ఊరంతా ఏకమై.. మహిళను చితకబాది, జుట్టు కత్తిరించి -
ఐదు రోజులుగా ఇలాగే.. కొంటారా? కొనరా?
అయితే ధాన్యం కొనుగోలు కేంద్రంలో.. లేదంటే రోడ్డుపై.. ఎక్కడైనా రైతులకు పడిగాపులు తప్పట్లేదు. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం మెరిపిరాల సమీపంలోని వరంగల్ – ఖమ్మం హైవేపై ఐదురోజులుగా కిలోమీటర్ మేర నిలిచిపోయిన ధాన్యం లోడు ట్రాక్టర్లివి. అక్కడి హరిచందన రైస్‌మిల్లు యజమానులతో పాటు అధికారులను ధాన్యాన్ని అన్లోడ్ చేయాలని రైతులు కోరుతున్నా స్పందన లేదు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, వరంగల్ అర్బన్ కొంటారా? కొనరా? మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తిలో ధాన్యాన్ని కాంటా పెట్టించుకున్న రైతులు.. 20 రోజులుగా లారీల కోసం ఎదురుచూస్తున్నారు. గురువారం కురిసిన వర్షంతో కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిసిపోయింది. దీంతో ఆగ్రహించిన రైతులు తడిసిన ధాన్యం కొనాలంటూ.. బస్తాల్ని ప్రధాన రహదారిపైకి చేర్చి ఆందోళనకు దిగారు. అంతకుముందు ధాన్యానికి నిప్పంటించి నిరసన తెలిపారు. – మహబూబాబాద్ రూ.2 లక్షల నష్టం నీళ్లుతోడుతూ వడ్లగింజల్ని ఒడిసిపట్టే యత్నంలో ఉన్న ఈ రైతు పేరు మారబోయిన స్వామి (చీటకోడూరు). స్థానిక వ్యవసాయ మార్కెట్‌కు 250 బస్తాల ధాన్యం తెచ్చాడు. బుధవారం అర్ధరాత్రి వర్షానికి 150 బస్తాలు తడిసి ముద్దయ్యాయి. మరికొన్ని కొట్టుకుపోయాయి. ఈ ఒక్క రైతే రూ.2 లక్షల మేర నష్టపోయాడు. ఈ మార్కెట్లో పలువురు రైతులకు చెందిన పదివేలకు పైగా బస్తాల ధాన్యం వర్షాలకు దెబ్బతింది. – జనగామ ధాన్యం.. మొలకెత్తిన దైన్యం చేతికొచ్చిన పంట చెదలుపడుతోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల కష్టార్జితం నీళ్లపాలై మొలకలెత్తుతోంది. ఈ ఫొటోలోని రైతు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ముత్యాలగూడెంకు చెందిన బడేటి పుల్లయ్య. నెలన్నర క్రితం స్థానిక కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకెళ్లాడు. ఇన్నాళ్లూ కాంటా కూడా వేయలేదు. అప్పట్నుంచి పట్టాలు కప్పి ధాన్యాన్ని కంటికిరెప్పలా కాపాడుకుంటున్నా.. అడపాదడపా పడిన అకాల వర్షాలు అతని శ్రమను తుడిచిపెట్టేశాయి. ఫలితంగా ధాన్యం ఇలా మొలకలెత్తింది. మరికొంత ధాన్యం బూజుపట్టిపోయింది. – కూసుమంచి చదవండి: బండెనక బండి.. ధాన్యం లెండి ధాన్యం తడిసిందని.. మహిళా రైతు బలవన్మరణం -
బండెనక బండి.. ధాన్యం లెండి
జనగామ జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్‌లతో పాటు వ్యవసాయ మార్కెట్ల ద్వారా 195 కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు వాహనాల కొరత ఏర్పడటంతో కొద్దిరోజులుగా భారీగా ధాన్యం పేరుకు పోయింది. పైగా అకాల వర్షాలు పడటంతో ధాన్యం రవాణాకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడిపోతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు రంగంలోకి దిగిన జిల్లా అధికార యంత్రాంగం మంగళవారం ప్రధాన రహదారిపై వెళ్తున్న ఇసుక లారీలను ఆపి మరీ ధాన్యాన్ని మిల్లుల్లో దింపించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ ఏ.భాస్కరావు పర్యవేక్షణలో తహసీల్దార్ రవీందర్, ఇతర శాఖల అధికారులు ధాన్యాన్ని మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకున్నారు. – జనగామ చదవండి: పారిపోయిన కొడుకు.. అత్తకు కోడలు అంతిమ సంస్కారాలు ధాన్యం తడిసిందని.. మహిళా రైతు బలవన్మరణం -
కరోనాతో గంటల వ్యవధిలో అన్నదమ్ములు మృతి
సాక్షి, జనగామ: కరోనా మహమ్మారి ఒకే కుటుంబంలో ముగ్గురిని బలి తీసుకుంది. గత నెల 27న జన గామకు చెందిన గోనె సుశీల కరోనాతో మృతి చెందింది. ఆదివారం అర్ధరాత్రి జనగామలో పంచాయతీరాజ్ డిప్యూటీ ఈఈగా పనిచేస్తున్న ఆమె కుమారుడు గోనెకృష్ణ (58), గంటల్లోనే ఆయన సోదరుడు ఐనవోలు మండల ప్రజాపరిషత్ కార్యాలయం పర్యవేక్షకులు శ్రీనివాస్ మృతి చెందారు. దీంతో ఒకే కుటుంబంలో కరోనాతో మూడు మరణాలు సంభవించడంతో విషాదం నెలకొంది. -
పారిపోలేక.. పోలీస్ స్టేషన్ పైనుంచి దూకాడు
రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఆదివారం పోలీసు స్టేషన్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. నిడిగొండ గ్రామానికి చెందిన వంగాల సోమ నరసయ్య ఉపాధి కోసం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఈనెల 13న ఉగాది కి అతను కుటుంబంతో స్వగ్రామానికి వచ్చాడు. ఆ రోజు రాత్రి ఆరు బయట నిద్రిస్తుండగా, నరసయ్య కొడుకు దినేష్‌ను సుబ్రహ్మణ్యం గొడ్డలితో నరికి చంపాడు. సోమ నరసయ్యకు తమ్ముడి భార్య లక్ష్మీబాయితో ఆస్తితగాదాలు ఉండడంతో ఆమె తన అక్క కొడుకు సుబ్రహ్మణ్యంతో నరసయ్యను హత్య చేయించాలని నిర్ణయించింది. అయితే సుబ్రహ్మణ్యం సరిగా పోల్చుకోలేక నరసయ్యకు బదులు దినేష్‌ను హత్య చేశాడు. పరారీలో ఉన్న సుబ్రహ్మణ్యంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అతను స్టేషన్‌పైకి వెళ్లి అక్కడ నుంచి దూకగా కాలు విరిగింది. అతడిని జనగామలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సుబ్రహ్మణ్యంను రిమాండ్‌కు తరలించే క్రమంలో పారిపోయేందుకు ప్రయత్నించాడని జనగామ రూరల్ సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు. అది సాధ్యం కాక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు చెప్పారు. (చదవండి: బావ గొంతుకోసిన బావమరిది: అందుకే చంపేశానంటూ ) -
లంకె బిందె.. అరుదైన ఆభరణాలు; మాకూ వాటా కావాలి!
జనగామ: రెండోరోజైన గురువారం జరిపిన తవ్వకాల్లోనూ అరుదైన పగడాలు, రాతిపూసలు, నాగుపాము ఆకారంలో ఉన్న బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. జనగామ జిల్లా పెంబర్తి గ్రామశివారు టంగుటూరు రోడ్డు సమీపంలో వెంచర్ కోసం భూమిని చదును చేస్తుండగా గురువారం లంకె బిందె, అందులో గుప్తనిధులు బయటపడ్డ సంగతి తెలిసిందే. ఈ మేరకు పురావస్తు శాఖ వరంగల్ అసిస్టెంట్ డైరెక్టర్ బి.మల్లునాయక్ నేతృత్వంలో ఉద్యోగులు భానుమూర్తి, బాబు శుక్రవారం ఈ ప్రాంతాన్ని సందర్శించి మట్టిని జల్లెడ పట్టించారు. ఈ సందర్భంగా కోరల్ బీడ్(ఎముకలతో తయారు చేసిన పూసలు), రాతి పూసలు(మహిళలు పుస్తెలతాడులో వేసుకునే పగడాలు), ల్యాపిన్ లాజ్యులీ స్టోన్(స్టోన్ రకానికి చెందిన పగడం), నాగుపాము ఆకారంలో ఉన్న బంగారు ఆభరణాలు వెలుగుచూశాయి. మట్టిలో దొరికిన ఆభరణాలను ప్రత్యేక కవర్లో ప్యాక్ చేసి ఉన్నతాధికారులకు అందజేశారు. ఇక అధికారులు ఆభరణాలను సేకరించే సమయంలో రైతులు అక్కడికి చేరుకుని తమకు కూడా వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సై రవికుమార్ సర్దిచెప్పగా వారు వెనక్కి తగ్గారు. అమ్మవారి ఆభరణాలు కావు! వ్యవసాయ క్షేత్రంలో బయటపడినవి అమ్మవారికి అలంకరించే ఆభరణాలు కాకపోవచ్చని పురావస్తు శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. 1930– 40 ప్రాంతంలో రజాకార్ల దాడుల్లో సంపన్న కుటుంబాలు భద్రత కోసమే బండరాళ్ల మధ్య వీటిని దాచిపెట్టాయా.. లేక దారి దోపిడీ దొంగలు ఎత్తుకొచ్చి ఇక్కడ పాతిపెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిల్లో ఎక్కువగా మహిళలు, పిల్లలు వినియోగించే ఆభరణాలు ఉండటం గమనార్హం. కాగా, గురువారం రాత్రి ఈ ప్రాంతంలో ఎలాంటి నిఘా లేకపోవడంతో బంగారు ఆభరణాల కోసం పలువురు పోటీపడి తవ్వినట్లు సమాచారం. కొందరికి బంగారు ఆభరణాలు లభించాయని తెలిసింది. ఈరోజు తవ్వకాల్లో వెలుగుచూసిన ఆభరణాల వివరాలు ►బంగారు ఆభరణాలు: 6 తులాల 300 మి.గ్రా. ►వెండి ఆభరణాలు: 2 తులాల 800 మి.గ్రా. ►కోరల్ బీడ్స్: 7 తులాల 200 మి.గ్రా. చదవండి: జనగామ: బయటపడ్డ లంకె బిందె.. బంగారం, వెండి లభ్యం! -
జనగామ: బయటపడ్డ లంకె బిందె.. 5 కిలోల బంగారం!?
సాక్షి, జనగామ: వెంచర్ ఏర్పాటు కోసం భూమిని చదును చేస్తుండగా బంగారు, వెండి ఆభరణాలతో కూడిన లంకె బిందె బయటపడింది. ఐదు కిలోల బరువైన బిందె బయటపడగా, అందులో మూడు కిలోలకుపైగా మట్టి ఉంది. మిగతా బంగారు, వెండి ఆభరణాలు ఉండగా, అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని ట్రెజరీకి తరలించారు. శుక్రవారం నుంచి ఆ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టాక, హైదరాబాద్‌లో పరిశీలన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. తొలుత ఇవి నిజాం కాలం నాటి ఆలయాల్లోని ఆభరణాలుగా ప్రచారం జరిగినా, పురావస్తు శాఖ అధికారులు మాత్రం 50 ఏళ్ల క్రితం నాటివేననే నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. వెంచర్ కోసం భూమి కొనుగోలు జనగామ మండలం పెంబర్తి శివారు టంగుటూరు క్రాస్ రోడ్డు 399, 409 సర్వే నంబర్లోని 11.06 గుంటల భూమిని సంకటి ఎల్లయ్య, ప్రవీణ్, నర్సయ్య. పర్శరాములు, దేవరబోయిన యాదగిరి, రాంచందర్, సత్తెయ్య తదితరులు ఇటీవల అమ్మారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం బోగారం గ్రామానికి చెందిన మెట్టు నర్సింహ, దుర్గాప్రసాద్, నాగరాజులు ఈ భూమిని కొనుగోలు చేయగా, కొంతమొత్తంలో నగదు అందజేసి వెంచర్ కోసం బుధవారం పనులు ప్రాంభించారు. తొలుత జేసీబీ సాయంతో భూమిలో ఉన్న బండరాళ్లను తొలగిస్తుండగా చిన్న బిందె కనపడటంతో పెద్దగా పట్టించుకోలేదు. మళ్లీ గురువారం ఉదయం పనులు ప్రారంభించగానే ఆ బిందె పగిలి అందులో నుంచి ఆభరణాలు బయటపడడంతో గుప్త నిధులుగా భావించి పోలీసులు, అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అదనపు కలెక్టర్ ఎ.భాస్కరరావు, ఏసీపీ వినోద్ కుమార్, ఇతర అధికారులు అక్కడికి చేరుకున్నారు అమ్మవారి అలంకరణ నగలని కొందరు.. రాగి బిందెలో బయటపడిన బంగారం, వెండి ఆభరణాలు అమ్మ వారికి అలంకరణ కోసం ఉపయోగించిన నగలుగా, మొత్తంగా 5 కిలోల బంగారం బయల్పడినట్లుగా తొలుత ప్రచారం జరిగింది. నిజాం కాలం నాటి ఆభరణాలుగా మరికొందరు చెప్పుకొచ్చారు. స్వర్ణకారుడు మాచర్ల బాలకృష్ణను పిలిపించి పంచనామా చేయించగా.. 18.7 తులాల బంగారు ఆభరణాలతో పాటు కిలోన్నర వెండి ఆభరణాలు, ఏడు గ్రాముల పగడాలు ఉండడంతో ప్రత్యేక బాక్స్‌లో భద్రపరిచి కలెక్టరేట్‌కు తరలించారు. హారాలు, చెవి కమ్మలు, కాళ్ల కడియాలు, నాగపడిగెలు, పూజలు చేసే సమయంలో చేతి వేళ్లకు పెట్టుకునే శివలింగంతో కూడిన ఉంగరాలు ఈ ఆభరణాల్లో ఉన్నాయి. వీటిని చూసేందుకు అనేక గ్రామాల నుంచి వందలాది మంది తరలిరావడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది ట్రెజరీ స్ట్రాంగ్ రూమ్‌కు తరలింపు జిల్లా కలెక్టర్ కె.నిఖిల వాటిని పరిశీలించిన అనంతరం, వరంగల్ అర్బన్ జిల్లా ట్రెజరీ స్ట్రాంగ్ రూంలో భద్రపరిచేందుకు పోలీసు బందోబస్తు మధ్య పంపించారు. అంతకుముందే హైదరాబాద్ నుంచి పురావస్తు శాఖకు చెందిన డిప్యూటీ డైరెక్టర్ రాములునాయక్ తదితరులు తవ్వకాలు చేపట్టిన ప్రాంతాన్ని పరిశీలింన అనంతరం కలెక్టర్‌తో సమావేశమయ్యారు. అక్కడ ఆభరణాలను పరిశీలించి ఇవి యాభై ఏళ్ల క్రితం నాటివేనని నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. స్థానికుల్లో స్థితిమంతులెవరైనా వీటిని తమ పిల్లల కోసం దాచి పెట్టి ఉంటారనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. చదవండి: బయటపడ్డ 1100 ఏళ్ల నాటి బంగారు నాణేలు -
ఇంట్లో దెయ్యం.. కాలనీ మొత్తం ఖాళీ
సాక్షి, తరిగొప్పుల: దెయ్యం తిరుగుతోందన్న భయంతో బేడ, బుడగజంగాల ప్రజలు తాముంటున్న కాలనీని ఖాళీ చేసి వలస పోయారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని పోతారం గ్రామంలో ఇలా సుమారు 40 కుటుంబాలు కాలనీని విడిచిపెట్టి పోవడంతో ఇప్పుడా కాలనీ పూర్తి నిర్మానుష్యంగా మారిపోయింది. పదేళ్లుగా కాలనీలో నిరుపయోగంగా ఉన్న ఓ పాడుబడిన భవనంలో రాత్రిళ్లు దెయ్యం తిరుగుతోందని, ఓ మహిళ నగ్నంగా బోనం ఎత్తుకుని నృత్యం చేస్తోందని కాలనీ వాసులు నమ్ముతున్నారు. వరుస మరణాలతో ఆందోళన.. బేడ బుడగ జంగాల కాలనీలో అన్నదమ్ములు చింతల భాను, చింతల బాలరాజు గతేడాది అక్టోబర్‌లో వారం వ్యవధిలోనే మరణించారు. అదే కాలనీకి చెందిన గంధం రాజు తాజాగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ మరణాలకు చేతబడి, దెయ్యమే కారణమని కాలనీవాసులు నమ్మడంతో ఒక్కొక్కరుగా వలస వెళ్లిపోతుండటంతో మంగళవారానికి కాలనీ పూర్తిగా ఖాళీ అయింది. ఇక కాలనీకి చెందిన గంధం శేఖర్ అనే వ్యక్తి మాట్లాడుతూ..తమ కాలనీలో యువకులు మాత్రమే చనిపోతున్నారని, ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే ఆస్పత్రికి తీసుకెళ్తే రిపోర్టుల్లో ఏమీ లేదంటున్నారని తెలిపారు. దీంతో భయం వేసి కాలనీని వదిలి మండల కేంద్రానికి వెళ్లి గుడిసెలు వేసుకుంటున్నట్లు వివరించారు. ►పోలీసులు, కళాజాత బృందం ఆధ్వర్యంలో దెయ్యం, భూతం లేదని అవగాహన కల్పించినా ఎవరూ నమ్మడం లేదు. వేరేచోట స్థలం కేటాయిస్తామని చెప్పినా ఎవరూ వినట్లేదు. –ఎండబట్ల అంజమ్మ, గ్రామ సర్పంచ్ -
ఊరూరా మహిళా దుకాణాలు
సాక్షి, రఘునాథపల్లి: మహిళలు స్వశక్తితో ఎదిగేలా బ్యాంకు రుణాలందించడంతో పాటు, స్వయం ఉపాధి పొందేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ఆధ్వర్యంలో మహిళా పొదుపు సంఘాల ద్వారా ప్రత్యేక స్టోర్లు ఏర్పాటు చేయించి వ్యాపారవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సాహం అందిస్తున్నారు. జనగామ జిల్లా కలెక్టర్ నిఖిల చొరవతో రాష్ట్రంలోనే ప్రథమంగా ఈ కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా 204 స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) స్టోర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, తొలివిడతగా 60 స్టోర్లు ఏర్పాటు చేశారు. స్టోర్ల ఏర్పాటు, అమ్మకాలు, శిక్షణలో బైరిసన్స్ సంస్థ సహకారం అందిస్తుండటంతో స్టోర్లకు బైరిసన్స్ ఎస్‌హెచ్‌జీ స్టోర్లుగా నామకరణం చేశారు. నిత్యావసర వస్తువులు బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకు అందించడమే స్టోర్ల ఏర్పాటు ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. ఈ స్టోర్లలో సామగ్రి కొనుగోళ్లు, తయారీ, రవాణా, విక్రయం అంతా మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే జరగనుంది. 140 రకాల నిత్యావసర వస్తువులు సాధారణ కుటుంబాలకు నిత్యం ఎన్ని సరుకులు అవసరమన్న అంశంపై సెర్ప్ సిబ్బంది, బైరిసన్స్ ప్రతినిధులు అధ్యయనం చేశారు. ఒక్కో కుటుంబానికి 262 వస్తువులు అవసరమని, ఇందులో 140 అత్యంత అవసరమని గుర్తించారు. వీటితో పాటు ఇతర వస్తువుల క్రయవిక్రయాలపై పొదుపు సంఘాల సభ్యులకు జిల్లా సమాఖ్య ద్వారా శిక్షణ ఇచ్చారు. ఒక్కో మండలంలో 15 నుంచి 20 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇళ్లలో నిత్యం కావాల్సిన పప్పు, ఉప్పు, చక్కెర, బియ్యం, సబ్బులు తదితర సరుకులు విక్రయించనున్నారు. జూట్ సంచుల తయారీ, శారీ డిజైనింగ్, ప్రింటింగ్, సర్ఫ్, ఫినాయిల్, జండుబామ్, హార్ఫిక్, దూప్‌స్టిక్స్, తయారీపై వరంగల్‌కు చెందిన జనశిక్షణ సంస్థాన్ సంస్థ తరఫున శిక్షణ ఇస్తుండగా, వీటిని తయారుచేసి స్టోర్లలో బైరిసన్స్ అగ్రో ఇండియా ఉత్పత్తులతో కలిపి విక్రయించనున్నారు. శిక్షణ పొందిన మహిళలకు రుణాలు శిక్షణ పొందిన మహిళలు వస్తువులు తయారు చేసేందుకు బ్యాంకు, స్త్రీనిధి, సెర్ప్ ద్వారా రుణాలు అందించనున్నారు. ఇంటి వద్ద తయారు చేసిన ప్రతీ వస్తువును డీఆర్డీఓ ఆధ్వర్యాన ఎస్‌హెచ్‌జీ స్టోర్స్‌కు తరలిస్తారు. జిల్లావ్యాప్తంగా ఒకే ధరతో ఓపీఎస్ మిషన్ ద్వారా వినియోగదారులకు కంప్యూటర్ బిల్లులు అందిస్తారు. మార్కెట్ కంటే తక్కువ ధరతో పాటు నాణ్యమైన వస్తువులు స్టోర్లలో లభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళల ఆర్దికాభివృద్ధికి దోహదం మహిళలు ఆర్థికంగా పురోభివృద్ధి సాధించేలా ప్రోత్సహించడమే స్టోర్ల ఏర్పాటు లక్ష్యం. తయారీ నుంచి విక్రయం వరకు అంతా చైన్ సిస్టం ద్వారా జరుగుతుంది. రఘునాథపల్లి మండలంలో 24 గ్రామాల్లో ఎస్‌హెచ్‌జీ స్టోర్లు ఏర్పాటు చేస్తున్నాం. మహిళలు తయారు చేసిన 15 రకాల ఉత్తత్తులను జిల్లావ్యాప్తంగా ఎస్‌హెచ్‌జీ స్టోర్లకు తరలించి అమ్మకాలు సాగేలా చూస్తాం. తద్వారా 100 మందికి పైగా కుటుంబాలకు ఉపాధి లభిస్తుంది. తయారీదారులతోపాటు విక్రయించే వారికీ ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. – సారయ్య, ఏపీఎం, రఘునాథపల్లి ఇళ్ల నుంచే వస్తువులు తీసుకెళ్తాం డీఆర్డీఏ, సెర్ప్ ద్వారా మహిళా సంఘాల సభ్యులకు రుణాలు అందిస్తాం. వస్తువుల తయారీ, రామెటిరీయల్ ఎక్కడి నుంచి పొందాలన్న దానిపై అవగాహన కల్పిస్తాం. ఇళ్లకు వెళ్లి వస్తువులు సేకరించనుండటంతో మార్కెటింగ్ ఇబ్బందులు కూడా ఉండవు. జిల్లాలోని 11 మండలాల్లో ఎస్‌హెచ్‌జీ స్టోర్లు ఏర్పాటు చేయనున్నాం. కలెక్టర్ నిఖిల మహిళల ఆర్థికాభివృద్ధికి సంబంధించి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. మహిళలతోపాటు వినియోగదారులకూ ఇది ఉపయుక్తంగా ఉంటుంది. – గూడూరు రాంరెడ్డి, డీఆర్డీఓ, జనగామ జిల్లా -
మాజీ కౌన్సిలర్ దారుణ హత్య
సాక్షి, జనగామ : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మాజీ కౌన్సిలర్‌ను అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపారు గుర్తు తెలియని ఇద్దరు దుండగులు. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు మేరకు.. మాజీ కౌన్సిలర్ పులిస్వామి గురువారం తెల్లవారుజామున జాగింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆయన్ని అడ్డగించారు. అనంతరం గొడ్డలితో దాడి చేశారు. ( అదృశ్యమైన నాగరాజు దారుణహత్య ) తీవ్రగాయాలపాలైన పులిస్వామి అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఆ వెంటనే హంతకులు అక్కడినుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. భూవివాదం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
జనగామ : దొంగల బీభత్సం.. ఒకే రోజు 11 ఇళ్లలో చోరి
సాక్షి, జనగామ : జిల్లాలోని బచ్చన్నపేట మండల పరిధిలోని రామచంద్రపురంలో సోమవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. సోమవారం అర్థరాత్రి రామచంద్రపురంలోని 11 ఇళ్లల్లో దొంగతనం చేసి పెద్దమొత్తంలో నగదు, బంగారు ఆభరణాలను అపహరించారు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ గా చేసుకుని దొంగలు ఈ చోరీకి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
సఖి సెంటర్లో నవ వధువు ఆత్మహత్య
సాక్షి, జనగామ: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంటను వారి కుటుంబాలు కాదు పొమ్మనడంతో.. ప్రేమికురాలు ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన ఆదివారం జనగామ జిల్లా కేంద్రం సఖి సెంటర్లో చోటు చేసుకుంది. జనగామ సీఐ మల్లేశ్ కథనం ప్రకారం.. కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామానికి చెందిన మద్దెబోయిన నర్సయ్య కూతురు శ్రీలేఖ(20), అదే గ్రామానికి చెందిన దేశబోయిన మనోహర్ (20) ప్రేమించుకున్నారు. ఈనెల 16న ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. హైదరాబాద్‌లో ఈ నెల 22న శ్రీలేఖ, మనోహర్ ప్రేమ వివాహం చేసుకుని, రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు. ఇరువురి కుటుంబాలకు పోలీసులు సమాచారం అందించగా కొత్త జంటను తీసుకువెళ్లేందుకు నిరాకరించారు. దీంతో శ్రీలేఖను రక్షణ కోసం జనగామలోని సఖి సెంటర్‌కు పంపించారు. సఖి సెంటర్లో మానసిక వేదనకు గురైన శ్రీలేఖ.. టాయిలెట్ డోర్‌కు చున్నీతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. -
పదేళ్లుగా మంచినీళ్లు ముట్టని ముసలవ్వ
సాక్షి, తరిగొప్పుల(వరంగల్) : ఈ ఫొటోలో ఉన్న అవ్వను చూశారా.. ఓ విలక్షణ లక్షణం ఆమె సొంతం. అదేంటో తెలిస్తే.. ఎవరైనా, ఔరా.. అనక మానరు! దాహమంటే.. ఏమిటో ఆమెకు తెలియదు. ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా పదేళ్లపాటు ఆమె చుక్కనీరు ముట్టితే ఒట్టు! బుక్కెడు బువ్వ తినకుండా ఉపాసం ఉండొచ్చుకానీ.. గుక్కెడు మంచి నీళ్లు తాగకుండా ఉండలేం. అలాంటిది పదేళ్లుగా చుక్క నీరు తాగకుండా ఉంటోంది జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రానికి చెందిన పింగిళి ప్రమీల (70). ఆకలేసినప్పుడు అన్నం తిన్నా మంచినీళ్లు మాత్రం తాగదు. అన్నం తిన్నప్పుడు ఛాతీ భాగంలో తట్టుకున్నట్టు అనిపిస్తే.. నాలుకపై కొంచెం కారం వేసుకుంటే సరిపోతుందని ఈమె చెబుతోంది. పదేళ్ల క్రితం వరకు మంచినీళ్లు తాగిన ప్రమీలకు ఒక్కసారిగా తాగునీటిపై అనాసక్తి ఏర్పడటంతో మానేసినట్లు చెబుతోంది. చదవండి: చికెన్.. చికెన్.. మటన్.. చికెన్ చదవండి: కరోనా సోకితే 8 నెలలు సేఫ్? -
నేలపై పడుకుని టీఆర్ఎస్ ఎమ్మెల్యే నిరసన
సాక్షి, జనగామ: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి యశ్వంతపూర్ గ్రామం వద్ద శనివారం వినూత్న నిరసనకు దిగారు. జనగామ మున్సిపాలిటి నుంచి యశ్వంతపూర్ వాగులోకి మళ్లించే మురికి కాల్వ విషయంలో ఆ గ్రామ మాజీ సర్పంచ్ సుశీల తన తీరు తీరు మార్చుకోవాలని కోరారు. యశ్వంతపూర్ వాగులోకి జనగామ మున్సిపాలిటీ మురికి కాల్వ వద్దని చెప్పి గతంలో తెచుకున్న కోర్టు స్టేను వెనక్కి తీసుకోవావాలని విజ్ఞప్తి చేశారు. మాజీ సర్పంచ్ తనకు స్పష్టమైన హామీ ఇవ్వాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నేలపై పడుకొని నిరసన తెలిపారు. స్టేను వెనక్కి తీసుకుంటేనే అభివృద్ది పనులకి శంకుస్థాపన చేస్తానని భీష్మించుకు కూర్చున్నారు. దాంతో మాజీ సర్పంచ్ సుశీల తన స్టే వెనక్కి తీసుకొని ఎమ్మెల్యేకి సహకరిస్తానని చేప్పడంతో ఆయన లేచి అభివృద్ది పనులకి శంకుస్థాపన చేశారు. గ్రామస్తుల ఆరోపణలివే.. యశ్వంతపూర్ గ్రామస్తుల అభ్యంతరాలపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వివరణ ఇచ్చారు. ఫిల్టర్ చేసిన నీటినే వాగులోకి తరలిస్తామని చెప్పారు. అయినా కూడా తనను అడ్డుకోవడం సమంజసం కాదని హితవు పలికారు. విషయమేంటంటే.. జనగామ మున్సిపాలిటీకి సంబంధించి మురికి నీటి కాలువ బతుకమ్మ కుంటవద్ద నుంచి నెల్లుట్ల చెరువులోకి చేరుకునేది. ప్రస్తుతం కాలువను యశ్వవంతపూర్ వాగులోకి డైవర్ట్ చెయ్యడానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్లాన్ చేశారు. అయితే, బతుకమ్మ కుంట నుంచి నీటి కాలువ వెళ్లకుండా చేసి ముత్తిరెడ్డి భారీగా లాభ పడుదామని చూస్తున్నారని యశ్వంతపూర్ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే తన అనుచరులతో బతుకమ్మ కుంట కింద వెంచర్ చేయించే ఆలోచనలో ఉన్నట్టు చెప్తున్నారు. -
లంచం తీసుకుంటూ.. ఏసీబీకి అడ్డంగా దొరికిపోయి..
సాక్షి, జనగామ: ఇరిగేషన్ డిపార్టమెంట్‌కు చెందిన ఓ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. వివరాల్లోకెళ్తే.. ఇరిగేషన్ డిపార్టమెంట్ డీఈ రవీందర్ రెడ్డి శనివారం ఓ కాంట్రాక్టర్ నుంచి 50 వేల రూపాయలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. (నడి రోడ్డు మీద లంచావతారం..) -
ఆ సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నా : కేసీఆర్
సాక్షి, జనగామ : రైతు పెద్దవాడే కానీ కూర్చొని మాట్లాడుకునేందుకు స్థలమే లేదని, అందుకే రైతు వేదికలను ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణలో తొలి రైతు వేదికను ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం జనగాం జిల్లా కొడకండ్లలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రైతు వేదిక ఏర్పాటు వ్యవసాయ రంగంలో సరికొత్త అధ్యాయం అన్నారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడా రైతులకు ఒక వేదిక లేదని, తెలంగాణాలోనే తొలిసారి రైతుల కోసం భవనాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఉద్యమ సమయంలో రైతుల బాధలను చూసి కన్నీళ్లు పెట్టుకున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రైతులను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. (చదవండి : రైతన్నకు ‘వేదిక’) ఇతర దేశాల్లో మాదిరి మన దేశంలో రైతులకు సబ్సిడీ అందడం లేదని విమర్శించారు. రాష్ట్రాలకు అందించాలనుకున్నా కేంద్రం ఆక్షలు అడ్డుపతున్నాయని ఆరోపించారు. ధాన్యానికి ఎక్కువ ధరలు ఇస్తామంటే ఎఫ్‌సీఐ వడ్లు కొనుగోలు నిలిపివేసిందన్నారు. రైతులను నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ధాన్యం సన్నవైనా, దొడ్డవైనా రూ.1,880లకే కొనుగోలు చేస్తామని ఎఫ్‌సీఐ చెబుతోందని, అంత కంటే ఎక్కువైతే ధాన్యం సేకరించేదే లేదని ఆంక్షలు విధించిందని గుర్తు చేశారు. కేంద్రం రైతులకు అన్యాయం చేస్తుందని విమర్శించారు. కేంద్రంపై రైతులు పిడికిలి పట్టి ఉద్యమించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ నుంచే ఉద్యమం ప్రారంభం కావాలన్నారు. రైతు సంఘటితం కావడానికి రైతు వేదిక ఉపయోగపడాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. -
మూడో పంట పండింది
జనగామ: వరి సాగు ఏడాదికి ఎన్నిసార్లు సాగు చేస్తారని అడిగితే ఎవరైనా రెండు సార్లు అంటూ సమాధానం చెబుతారు. కానీ జనగామ జిల్లా రైతులు మాత్రం మూడుసార్లు సాగు చేస్తామని అంటారు. ఏటా రబీ, వానాకాలం సాగు మధ్యలో కత్తెర పంటను సాగుతో అదనపు ఆదాయం సాధిస్తారు. మూడో పంట (కత్తెర) సాగుకు అనుకూలమైన నేలలు ఉండటంతో రైతులకు కలసి వస్తుంది. ఏప్రిల్ చివరి వారం నుంచి సాగు పనులు మొదలుపెట్టి, ఆగస్టు మొదటి వారంలో కోతలను ప్రారంభిస్తారు. ఈసారి గోదావరి జలాల పరుగులతో పాటు జోరుగా కురిసిన వర్షాలతో భూగర్భ జలాలు పెరగడంతో జిల్లాలో సుమారు 30 వేల ఎకరాలకు పైగా కత్తెర పంట సాగు చేయగా, 54 వేల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా. కొనుగోళ్లు ప్రారంభం కత్తెర పంటకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న జనగామ జిల్లాలో ఆగస్టు 24వ తేదీ నుంచి కొనుగోళ్లు ప్రారంభమయ్యా యి. ఎకరాకు 30 బస్తాలకుపైగా దిగుబడి వస్తోందని రైతులు చెబుతున్నారు. ఇప్పటి వరకు పది వేల బస్తాలకు పైగా ధాన్యం కొనుగోలు చేసినట్లు అంచనా. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం తరఫున కొనుగోళ్లకు అనుమతులు లేకపోవడంతో ప్రైవేట్ వ్యా పారులు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. నాణ్యత ఆధారంగా క్వింటా ధాన్యానికి రూ.1,220 నుంచి రూ.1440 వరకు ధర లభిస్తోంది. -
చేపల వేటకు వెళ్లి ఒకరు గల్లంతు..
జనగామ: జనగామ జిల్లా చిల్పూర్ మండలం నష్కల్ వద్ద ఆకేరు వాగులో చేపల వేట కోసం మంగళవారం ఉదయం 9 గంటలకు నలుగురు యువకులు వెళ్లారు. ఈ నేపథ్యంలో నలుగురు యువకులు చెక్ డ్యామ్ వద్ద చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు 23 సంవత్సరాల ఆరూరి వంశీ గల్లంతయ్యాడు. ఈ క్రమంలో ఆరూరి వంశీని కాపాడడానికి అతని వెంట ఉన్న ఆరూరి శ్రవణ్, పాశం సందీప్, శాగంటి ప్రమోద్ ప్రయత్నించారు. కానీ ఆరూరి వంశీ ఆచూకీ దొరకలేదు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా యంత్రాంగం, కలెక్టర్, డీసీపీ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు ఆరూరి వంశీ ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందంతో గాలింపు చర్యలు చేపట్టిన ఇంకా వంశీ ఆచూకీ దొరకలేదు. -
అత్యవసరమైతే ‘ఊపిరి’ పోవాల్సిందేనా!
జనగామ: కరోనా మహమ్మారి ప్రజలను ఊపిరి పీల్చుకోకుండా చేస్తుంది. వైరస్ బారినపడి శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చాలామంది ఆర్థిక పరిస్థితులు అనుకూలించక, ప్రైవేట్ వెళ్లలేక, చివరి క్షణాల్లో గాలిపీల్చుకునే పరిస్థితిలేక ప్రాణాలు వదులుతున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ చెబుతున్నా ఆచరణలో మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ప్రతీ జిల్లా కేంద్రంలో 100 పడకలతో ఏకాంత గదులను(వార్డులు) ఏర్పాటు చేసి కరోనా పాజిటివ్ నిర్ధారణ జరిగిన తర్వాత ఎటువంటి వసతి సౌకర్యం లేని వారిని అందులో ఉంచాలని మంత్రి ఆదేశించిన సంగతి తెలిసిందే. అందులో వెంటిలేటర్లు, ఆక్సిజన్ సైతం ఏర్పాటు చేసి కరోనాకు బలికాకుండా చూడాలని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు సూచించారు. జిల్లా ఆస్పత్రిలోని మూడు వార్డుల్లో వెంటిలేటర్స్, ఆక్సిజన్ కనెక్షన్ అమర్చినా నేటికీ సేవలను ప్రారంభించడం లేదు. వెంటిలేటర్లు, ఆక్సిజన్ సేవలు ఎప్పుడు? కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు జిల్లా ఆస్పత్రిలోని మూడు ప్రత్యేక వార్డుల్లో ఆరు వెంటిలేటర్స్, 40 ఆక్సిజన్ బెడ్లను సిద్ధం చేశారు. తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీస్ ఇన్ప్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు కార్పోరేషన్ (టీఎస్ఎంఎస్ఐడీసీ) పర్యవేక్షణలో వెంటిలేటర్స్, ఆక్సిజన్ యంత్రాలను అమర్చారు. కేంద్ర ప్రభుత్వం మూడు వెంటిలేటర్స్ అందించగా, రెండు కలెక్టర్ నిధుల నుంచి కొనుగోలు చేయగా మరొకటి చంపక్‌హిల్స్ ఎంసీహెచ్ నుంచి తెప్పించారు. ఇందుకోసం ముగ్గురు వైద్యులను కాంటాక్టు పద్ధతిలో రిక్రూట్ చేసుకోగా, మరో 20 మంది స్టాఫ్ నర్సులు, వెంటిలేటర్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. వెంటిలేటర్స్, ఆక్సిజన్ వార్డులను సిద్ధం చేసి నెలలు గడిచిపోతున్నా సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో నిర్లక్ష్యం కనిపిస్తుంది. పాజిటివ్, తీవ్రమైన లక్షణాలతో శ్వాస సంబంధిత సమస్యతో బాధపడే పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు అప్పులు చేసి ప్రైవేట్‌కు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా ఆస్పత్రిలో సేవలకు సిద్ధంగా ఉన్న వెంటిలేటర్స్, ఆక్సిజన్ సేవలను త్వరితగతిన అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. సేవలను త్వరితగతిన ప్రారంభిస్తాం జిల్లా ఆస్పత్రిలో మూడు వార్డుల్లో ఆరు వెంటిలేటర్లు, 40 ఆక్సిజన్ పరికరాలను అమర్చారు. కరోనా పేషెంట్లకు అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయి. టీఎస్ఎం ఎస్ఐడీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల్లో ఇన్స్టాలేషన్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న పనులు పూర్తి కాగానే ఇక్కడకు రానున్నారు. సేవలను త్వరతగతిన ప్రారంభించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం ముగ్గురు వైద్యులను రిక్రూట్ చేసుకోగా, స్టాఫ్‌నర్సు, వెంటిలేటర్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.– డాక్టర్ పుజారి రఘు, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ -
కారులో కోల్డ్‌వార్
సాక్షి, జనగామ: అధికార టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు మరోసారి బహిర్గతమయ్యాయి. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఇద్దరు నాయకులను బహిష్కరించడం కలకలం రేపుతోంది. వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారే కారణంతో సొంత పార్టీ నాయకులపై వేటు వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో మండల అధ్యక్షుడు, మండల ఇన్చార్జిలను బహిష్కరించడంతో ఆధిపత్యపోరు మరోసారి తెరపైకి వచ్చింది. ఇద్దరిపై బహిష్కరణ వేటు.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడమే కాకుండా ఎమ్మెల్యే రాజయ్యపై అనుచిత వ్యాఖ్యాలు చేస్తున్నారనే కారణంతో ఇద్దరు నాయకులపై ఆదివారం బహిష్కరణ వేటు వేశారు. ఏడాది క్రితం చిల్పూర్ మండల అధ్యక్షుడిగా కేసిరెడ్డి మనోజ్‌రెడ్డి, టీఆర్ఎస్ సాంస్కృతిక విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలు ఎడవెల్లి విజయను మండల ఇన్చార్జిగా నియమించారు. కొంతకాలం నుంచి ఎమ్మెల్యే రాజయ్యకు మండల అధ్యక్షుడు మనోజ్‌రెడ్డి మధ్య దూరం పెరుగుతూ వస్తుంది. ఎమ్మెల్యే ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోకపోవడమే కాకుండా ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి దగ్గర అవుతున్నారు. దీంతో మనోజ్‌రెడ్డిని మండల అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. దీంతో మనోజ్‌రెడ్డి, మండల ఇన్చార్జి సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం ఇటీవల వైరల్‌గా మారాయి. దీంతో ఆదివారం సాయంత్రం చిల్పూర్ మండల ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే రాజయ్య అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులతో చర్చించి కేసిరెడ్డి మనోజ్‌రెడ్డి, ఎడవెల్లి విజయను పార్టీ నుంచి సస్పెన్షన్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరోసారి తెరపైకి ఆధిపత్య పోరు.. ఇద్దరు నాయకులను పార్టీ నుంచి బహిష్కరించడంతో స్టేషన్‌ఘన్‌పూర్‌లో మరోసారి ఆధిపత్య పోరు తెరపైకి వచ్చింది. ఎ మ్మెల్సీ కడియం శ్రీహరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే కారణంగానే నాయకులపై వేటు వేశారని జోరుగా ప్రచారం సాగుతోంది. నియోజకవర్గంలో ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య వేర్వేరు పార్టీల్లోనూ, ప్రస్తుతం ఒకే పార్టీలో ఉన్నప్పుడు కూడా ప్రత్యర్థులుగానే వ్యవహరిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మొత్తం కడియం, రాజయ్య వర్గాలుగా విడిపోయింది. 2018లో జరిగిన ఎన్నికల సమయంలో కేటీఆర్ రెండు వర్గాల మధ్య సయోధ్య కుదర్చడంతో కలిసి పనిచేశారు. ఆ తరువాత మళ్లీ ఆధిపత్య పోరు యాధావిధిగానే కొనసాగుతూ వస్తుంది. పార్టీ సంస్థాగత కమి టీల్లోనూ ఎక్కడా కడియం వర్గీయులకు చోటు కల్పించకుండా రాజయ్య జాగ్రత్తగా వ్యవహరించారు. గ్రామ పంచా యతీ, ప్రాదేశిక ఎన్నికల్లోనూ కడియం అనుచరులకు ఎక్కడా టికెట్లు ఇవ్వలేదు. 2019 సెప్టెంబర్‌లో ఎమ్మెల్యే రాజయ్య, కడియం శ్రీహరి వేర్వేరుగా కాళేశ్వరం సందర్శన యాత్రను చేపట్టడం రెండు వర్గాల మధ్య మరింతగా చిచ్చుపెట్టింది. దేవాదుల నీటితో నియోజకవర్గంలోని చెరువులను నింపడానికి ఇద్దరు నేతలు పోటీపడడంతో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. పార్టీ ఆవిర్బావ వేడుకల్లో కడియంపై రాజయ్య పరోక్షంగా హెచ్చరికలు జారీ చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. పైకి మాత్రం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అని పేర్కొంటున్నప్పటికీ పరోక్షంగా మాత్రం కడియం వర్గీయులుగా మారడంతోనే వేటువేశారని చర్చించుకుంటున్నారు. ఈ చర్యతో మరోసారి పార్టీలో ఆధిపత్యపోరు బహిర్గతం అయ్యింది. -
బస్టాప్ వెనుక ప్రసవం
జనగామ: నిండు గర్భిణి ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో రెండు గంటలు నరకయాతన అనుభ వించింది. నొప్పులు తీవ్రమవుతున్నా వైద్యులు కనికరించలేదు. రక్తం తక్కువగా ఉందని... హన్మకొండకు తీసుకెళ్లమని చెప్పి చేతులెత్తేశారు. అంబులెన్స్ అందుబాటులో లేక ఆ గర్భిణి పురిటి నొప్పులతో విలవిల్లాడి పోయింది. చివరకు ప్రభుత్వాసుపత్రి పక్కనే రోడ్డుపైనున్న బస్టాప్ వెనుకకు వెళ్లి పడిపోయింది. అక్కడే ప్రసవించింది. మానవత్వానికి మచ్చ తెచ్చిన ఈ ఘటన ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలోని చంపక్‌హిల్స్ మాతాశిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రంలో జరిగింది. వైద్యసిబ్బంది తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన షేక్ హుస్సేన్ తన భార్య షేక్ బీబీని నాలుగో కాన్పు కోసం ఆదివారం చంపక్‌హిల్స్ మాతాశిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రాని(ఎంసీహెచ్)కి తీసుకు వచ్చాడు. అంతకు ముందు సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా, వైద్యుల సూచన మేరకు 108 అంబులెన్స్‌లో ఎంసీహెచ్‌కు తరలించారు. ఉదయం 10 గంటలకు డాక్టర్‌ను సంప్రదిం చగా, కాన్పు కోసం మెటర్నిటీ వార్డుకు తీసుకువెళ్లారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యురాలు, గర్భిణికి రక్తం తక్కువగా ఉన్నట్లు గుర్తించి వెంటనే హన్మకొండ మెటర్నిటీ దవాఖానాకు రెఫర్ చేశారు. మరోవైపు బీబీకి నొప్పులు తీవ్రమ య్యాయి. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు ‘కాన్పు చేయండి.. ఏం జరిగినా మాదే బాధ్యత’ అంటూ వేడుకున్నా వైద్యులు పట్టించుకోలేదు. అంబులెన్స్ కోసం నిరీక్షణ హన్మకొండకు వెళ్లేందుకు బయటకు వచ్చిన గర్భిణికి అంబులెన్స్ కనిపించక పోవడంతో అక్కడే నిరీక్షించింది. గంటసేపు ఎదురు చూసి ప్రైవేట్ వాహనంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యు లు సిద్ధమయ్యారు. అప్పటికే తీవ్ర నొప్పులతో బాధపడుతున్న షేక్బీబీ... ఆస్పత్రి గేటుబయట బస్టాప్ వెనకకు వెళ్లింది. నిమిషం వ్యవధిలోనే అరుపులు, కేకలు వినిపించడంతో తల్లీ, భర్త అటు వైపు వెళ్లారు. పండంటి కొడుకును చేతిలో పట్టు కుని, అలాగే గోడకు కూర్చుని ఉన్న బీబీని చూసి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. నా బిడ్డను కాపా డండి అంటూ తల్లి కన్నీటిపర్యంతం కావడంతో డాక్టర్, వైద్య సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. తల్లిబిడ్డను ఎమర్జెన్సీవార్డుకు తరలించి చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. ఎంసీహెచ్ ఘటనపై ఎంపీ కోమటిరెడ్డి ఆరా జనగామలో గర్భిణి ఆస్పత్రి బయటనే ప్రసవించిన సంఘటనపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరా తీశారు. ప్రసూతి కోసం ఆస్పత్రికి వచ్చే పేద కుటుంబాలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఎంపీ కోమటిరెడ్డి సూచించారు. ఎంపీ స్థానిక నాయకుల ద్వారా బాధిత మహిళ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. గర్భిణికి అధిక రక్తస్రావం కావడం వల్లే... గర్భిణి షేక్ బీబీకి అధిక రక్తస్రావం జరి గింది. హన్మకొండ ఆస్పత్రికి వెళ్లాలని రెఫర్ చేశాం. బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్‌కు కరోనా పాజిటివ్ రావడంతో రక్తం యూనిట్లు ఇక్కడ దొరికే పరిస్థితి లేదు. అందుకే డాక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంబులెన్స్ కూడా సిద్ధం చేయగా, కుటుంబ సభ్యులు హన్మకొండకు వెళ్లేందుకు విముఖత చూపించి సిద్దిపేటకు వెళ్తామని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సమయంలోనే ఆమె బయటకు వెళ్లడంతో కాన్పు జరిగిపోయింది. ఇందులో మా నిర్లక్ష్యం లేదు. – డాక్టర్ పజారి రఘు, ఎంసీహెచ్ సూపరింటెండెంట్ -
పరీక్షలు చేయట్లే!
జనగామ: జిల్లాలో కరోనా టెస్టులను నిలిపివేశారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫర్టిలైజర్ కాంటాక్టు ద్వారా పాజిటివ్ కేసులు పెరుగుతున్న సమయంలో పరీక్షలు చేయకపోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. జిల్లాలో ఇప్పటి వరకు 81 పాజిటివ్ కేసులు నమోదు కాగా కేవలం ఫర్టిలైజర్ కాంటాక్టు ద్వారా 63 మందికి వైరస్ వచ్చినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ నిర్ధారించింది. లక్షణాలు కనిపించిన మరికొంత మందిని వైద్యుల పర్యవేక్షణలోహోం క్వారంటైన్లో ఉంచారు. ఫర్టిలైజర్ యజమానికి పాజిటివ్ రిపోర్టు రాగానే అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం, 17వ తేదీ మినహా 20వ తేదీ వరకు రోజుకు 50 మంది చొప్పున శాంపిళ్లను సేకరించారు. ఇందులో ఒక్కరోజు 34 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆపేసినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో ఫర్టిలైజర్‌తో కాంటాక్టు ఉన్న వ్యక్తులు ఆందోళనకు గురవుతున్నారు. దగ్గు, జలుబుతో బాధపడుతూ పలువురు పరీక్షలు చేయాలని జనగామ జిల్లా ఆస్పత్రికి వెళితే ఆరోగ్యంగానే ఉన్నారని మాత్రలు ఇచ్చి పంపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 61 శాంపిళ్లు ఏమయ్యాయి.. మున్సిపల్ ముఖ్యనాయకులు, వ్యాపార వేత్తలు, కీలక అధికారులు, సామాన్యులకు సంబంధించి, ఈ నెల20న జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో 61 మంది నుంచి కరోనా టెస్ట్ కోసం లాలాజలాన్ని సేకరించారు. శాంపిళ్లను సేకరించిన వెంటనే, పరీక్షల కోసం వరంగల్ ఎంజీఎంకు పంపించాల్సి ఉంటుంది. కానీ వాటిని అక్కడకు పంపించకుండా, వృథా చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. జనగామలో కరనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న సమయంలో టెస్ట్‌లను పెంచి కాంటాక్టు కేసులను తగ్గించే ప్రయత్నం చేయాల్సింది పోయి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై ఓ వ్యాపార వేత్త మాట్లాడుతూ 20వ తేదీన తీసిన శాంపిళ్లను పరీక్షలకు పంపించకుండా నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం రఘునాథపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన 20 మంది రైతులను శాంపిళ్ల కోసం పీహెచ్‌సీకి పిలిపించి సాయంత్రం వరకు అక్కడే ఉంచుకుని పరీక్షలు చేయకుండానే పంపించేశారు. దీనికి తోడు జిల్లాలో మూడు రోజులుగా కరోనా టెస్ట్‌లను నిలిపి వేయడంతో ఫర్టిలైజర్‌తో కాంటాక్టులో ఉన్న చాలా మంది భయాందోళనకు గురువుతు న్నారు. ఈ విషయమై డీఎంహెచ్ఓ మహేందర్ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నదే తమ ఉద్దేశమని ఫర్టిలైజర్‌తో దాదాపుగా కాంటాక్టులు తొలగిపోనట్లేనన్నారు. గతంలో చేసిన పరీక్షలకు సంబంధించి ఒకేరోజు 34 కేసులు రాగా, వారి పర్యవేక్షణలో వైద్యారోగ్య శాఖతో పాటు మిగతా అధికారులు కూడా ఉన్నారన్నారు. -
బాబూ... పని ఇస్తారా?
ఆమె ఆ ఇంటికి పెద్ద దిక్కు. కూరగాయలు అమ్మి ఇంటిని నడిపించేది. భర్తకు క్యాన్సర్.పిల్లలు ఇంకా స్థిరపడలేదు. వారికీ శారీరక సమస్యలు.ఇప్పుడు కరోనా వచ్చింది. హైదరాబాద్ నుంచి ఊరికి తిప్పి పంపింది.పని లేదు. సంపాదన లేదు. ఆకలి. పని కావాలి. పని ఇస్తారా? ఇంటి పెద్దగా కాయకష్టం చేసుకుంటూ కుటుంబానికి ఏ లోటు రాకుండా చూసుకున్నాడుఅతను. కట్టుకున్న భర్తకు చేదోడు వాదోడుగా ఆ ఇల్లాలు ఇంటి బాగోగులు చూసుకుంటూ ఉండేది. అక్షరజ్ఞానం లేకపోయినా అణకువగా జీవితాన్ని వెళ్లబుచ్చతున్నారు. ఇద్దరు కూతుళ్లు పుట్టారు. పుట్టుకతోనే ఇద్దరూ మూగవాళ్లని తెలియడంతో వారి పెంపకానికి ఏ దారి వేయాలో తెలియక గుండె చిక్కబట్టుకున్నారు. మూగ అయినా వారిని చదవించడానికే పూనుకున్నారు. జనగామ జిల్లా లింగాల ఘనపురానికి శ్రీనివాస్, లత తమ బిడ్డల భవిష్యత్తును భరోసాగా దిద్దడానికే సిద్ధమయ్యారు. పెద్దమ్మాయి ఉషా మాధవిని డిగ్రీ వరకు చదివించారు. నాలుగేళ్ల క్రితం మూగ అబ్బాయి రమేష్‌తో ఉషా మాధవికి వివాహం చేశారు. చిన్న కూతరు ప్రసన్న హైదరాబాద్‌లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఏదో ఇలా కాలం నెట్టుకొచ్చేద్దాం అనుకున్న సమయంలో క్యాన్సర్ ఆ కుటుంబంలో కల్లోలం రేపింది. ఇంటి పెద్ద శ్రీనివాస్‌కు క్యాన్సర్ అని తేలడంతో అతను ఇంటికే పరిమితమయ్యాడు. మందుల మీదనే బతుకుబండి లాగిస్తున్నాడు. వలస వెళ్లిన విధం ఉన్న ఊర్లో పని లేదు. ఉన్న ఇల్లు తప్ప భూమి ఆధారం లేదు. శ్రీనివాస్ వైద్యానికి, చిన్న కూతురు చదువు కోసం లత వారిని తీసుకొని పట్టణం బాట పట్టింది. లత సోదరులు ముంబయ్‌లో ఉండడంతో ఏ ఆధారం లేని తల్లినీ తన దగ్గరకే తెచ్చుకుంది. హైదరాబాద్ ఉప్పల్‌లోని చిలకమ్మనగర్ ప్రాంతంలో అద్దె ఇల్లు తీసుకొని కూరగాయల వ్యాపారాన్ని ప్రారంభించింది. చిన్నకూతురుకు వచ్చే దివ్యాంగపెన్షన్, అల్లుడు రమేష్ సహకారంతో కూరగాయలను అమ్మి తన భర్తకు వైద్యం చేయించడం, కుటుంబాన్ని పోషించే బాధ్యతను భుజానికి ఎత్తుకుంది. రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకు సంపాదిస్తూ కుటుంబానికి పెద్దదిక్కుగా మారింది. ఊరికి పయనం ఇప్పుడు కరోనా ఉన్న ఉపాధిని మింగేసింది. మూడు నెలలుగా కూరగాయల వ్యాపారం మూత పడింది. అద్దెకట్టలేక, తినడానికి తిండి లేక కట్టుబట్టలతో మే నెల చివరి వారంలో కుటుంబం అంతా తమ సొంతూరుకు చేరారు. ఉన్న రేకుల షెడ్డులాంటి ఇల్లు తప్ప మరే ఆధారం లేని ఆ ఊళ్లో ఏదైనా వ్యవసాయ పనులు దొరికితే చేసుకు బతుకుదామనుకున్నారు. కానీ, స్థానికంగా ఎలాంటి ఉపాధి దొరక్కపోవడంతో ఇప్పుడు రోజులు లెక్కపెడుతున్నారు. వ్యవసాయ పనులకు వెళదామంటే పట్టణం నుంచి వచ్చినవారు తమ వద్దకు వస్తే కరోనా అంటుకుంటుందన్న భయంతో ఎవరూ పనికి పిలిచే అవకాశం లేదు. ఎదురుచూపులు.. జీవనోపాధి కోల్పోవడంతో రోడ్డున పడ్డ ఆ కుటుంబం ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తుంది. లత పెద్ద కూతురు ఉషా మాధవి డిగ్రీ వరకు చదువుకున్నది. ఉషా మాధవికి పని కల్పించాలని లత గ్రీవెన్స్ సెల్లో దరఖాస్తు చేసుకుంది. పలుమార్లు తిరిగినప్పటికి ఎలాంటి ఉపాధి దొరకలేదు. కూతురు, అల్లుడు, మరో కూతురు మూగవాళ్లు కావడం, భర్త అనారోగ్యానికి గురి కావడం పనుల్లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో లత ప్రభుత్వ భరోసా కోసం కుటుంబం వేడుకుంటోంది. – ఇల్లందుల వెంకటేశ్వర్లు, సాక్షి, జనగామ -
టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కరోనా పాజిటివ్
సాక్షి, జనగామ: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కరోనా బారిన పడ్డారు. ఆయనకు వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. అలాగే.. ఎమ్మెల్యే సతీమణి, డ్రైవర్, గన్‌మన్, వంట మనిషికి కూడా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో వీరంతా హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారం రోజుల క్రితం జలుబు, దగ్గుతో బాధ పడుతున్న ముత్తిరెడ్డి.. డాక్టర్లను సంప్రదించారు. ఈనెల 11వ తేదీన హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్ అని తేలింది. కాగా, కరోనా అనుమానంతో ఎమ్మెల్యే సతీమణి, డ్రైవర్, గన్‌మన్, వంట మనిషిలకు సైతం పరీక్షలు నిర్వహించగా.. శనివారం సాయంత్రం పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం తమ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎమ్మెల్యే సతీమణి వాయిస్ రికార్డు ద్వారా స్పష్టం చేశారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడం రాష్ట్రంలో ఇదే తొలి కేసు. -
చేయూతనివ్వండి..
చిల్పూరు : జనగామ జిల్లా చిల్పూరు మండలం చిన్నపెండ్యాల గ్రామానికి చెందిన తాళ్లపల్లి రమేష్‌గౌడ్ –రమాదేవిలకు ఇద్దరు ఆడపిల్లలు. రమేష్ కులవృత్తితో పాటు సెంట్రింగ్ కూలీ పనిచేస్తుండగా.. భార్య రమాదేవి కూడా కూలీ పనులు చేస్తూ భర్తకు సాయంగా ఉండేంది. ఇద్దరు కుమార్తెల వివాహం జరిపించారు. ఈక్రమంలో 6 ఏళ్ల క్రితం ఇంటిఆవరణలో ఉన్న చింతచెట్టు పై కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడడంతో వెన్ను పూస ఎముక విరిగింది. దీంతో రెండు కాళ్లు చచ్చుబడి పోయాయి. సరిగా నిలబడలేని భార్యకు రమేష్ సపర్యలు చేస్తూ వచ్చాడు. ఈక్రమంలో 3 నెలల క్రితం రమేష్‌కు గొంతులో నొప్పిగా ఉండడంతో ఆస్పత్రిలో చూపించగా గొంతు కేన్సర్ అని వైద్యులు తేల్చారు. దీంతో ఆహారం నోటినుంచి తీనే పరిస్థితి లేకపోవడంతో పొట్టభాగంలో పైపు వేసి అందులో నుంచి కేవలం పండ్ల రసాలను అందించే ఏర్పాటు చేశారు. గొంతు ఆపరేషన్‌కు రెండు నెలల పాటు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు. చేతిలో చిల్లి గవ్వలేకపోవడంతో స్వగ్రామానికి వచ్చేశారు. అనంతరం హన్మకొండలోని ఫాతిమా కేన్సర్ ఆస్పత్రికి వెళ్లగా ఆరోగ్య శ్రీ కార్డుపై తాము ఆపరేషన్ చేస్తామని అక్కడి వైద్యులు చెప్పినట్లు బాధితులు తెలిపారు. దీంతో దంపతులు ఇద్దరూ ఇలా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఇబ్బంది ఎదుర్కొంటుండడంతో స్థానిక యువకులు వాట్సప్ గ్రూప్‌లో వీరి సమస్యలను వివరిస్తూ సాయం కోరారు. అడ్మిన్లు తాళ్లపల్లి ప్రవీన్, క్రాంతి, మహేందర్, కొత్తపల్లి యాకరాజులు దాతల సాయం కోరుతూ పోస్టు పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, తన గొంతు ఆపరేషన్‌కు ఆరోగ్య శ్రీ కార్డును త్వరగా కిమ్స్‌నుంచి ఫాతిమాకు బదిలీ చేయించాలని ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. దాతలు 83418 11560, 99851 81981 ద్వారా సహకారం అందిచాలని వేడుకుంటున్నారు. -
నేను ప్రేమించా.. నువ్వు పెళ్లి చేసుకోవద్దు
బచ్చన్నపేట: ఇద్దరూ క్లాస్మేట్స్.. కలసి చదువుకున్నారు.. ఆ రకంగా ఏర్పడిన చనువు ప్రేమగా మారింది. ఈ ప్రేమ యువతి పెళ్లి చెడిపోవడానికి కారణమైంది.. దీంతో కక్ష పెంచుకున్న ఆమె సోదరుడు.. చెల్లెలిని ప్రేమించిన యువకుడిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూర్ కమాన్ వద్ద శుక్రవారం జరిగింది. ఎస్సై రఘుపతి కథనం ప్రకారం.. మండలంలోని కొన్నె గ్రామానికి చెందిన పేర్ని కొమురమ్మ, తిరుపతి దంపతులకు ముగ్గురు కుమారులు. (పోలీసుల అదుపులో యాకూబ్.. సెల్ఫోన్లు ఎక్కడ?) కాగా, కొమురమ్మ దంపతులు ఇద్దరు కుమారులతో కలసి జీవనోపాధి కోసం ముంబై వెళ్లగా.. రెండో కుమారుడు శ్రీధర్‌ను అమ్మమ్మ వద్ద మండలంలోని కొడవటూర్‌లో చదివించారు. ఇదే గ్రామానికి చెందిన ఓ యువతి, శ్రీధర్ కలసి ఒకే కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివారు. ప్రస్తుతం యువతి హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో నర్సు శిక్షణ చేస్తుండగా, శ్రీధర్ (22) హైదరాబాద్‌లోనే ఓ హోటల్లో క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. లాక్డౌన్ కావడంతో ఇద్దరూ కొడవటూర్ గ్రామంలోనే ఉంటున్నారు. (బెంగాలీ కుటుంబం.. విషాదాంతం) నేను ప్రేమించాను.. నువ్వు పెళ్లి చేసుకోవద్దు ఈ ప్రేమ వ్యవహారం యువతి ఇంట్లో తెలియడంతో వారు శ్రీధర్‌తో పాటు అతడి తాతను మందలించారు. ఇటీవల యువతికి పెళ్లి నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న శ్రీధర్ ..ఆ యువతిని పెళ్లి చేసుకోబోయే యువకుడికి ఫోన్ చేసి తమ ప్రేమ విషయాన్ని చెప్పాడు. దీంతో పెళ్లి చేసుకోవడానికి ఆ అబ్బాయి నిరాకరించగా యువతి కుటుంబ సభ్యులు శ్రీధర్‌పై కక్ష పెంచుకున్నారు. శుక్రవారం ఉదయం ద్విచక్ర వాహనంపై కొడవటూర్ వెళుతున్న అతడిని యువతి సోదరుడు శివకుమార్ బచ్చన్నపేట – చేర్యాల మెయిన్ రోడ్డుపై కమాన్ వద్ద ఆటోతో ఢీకొట్టగా అతను కింద పడ్డాడు. అనంతరం శ్రీధర్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
మళ్లీ 'కరోనా' కలకలం
జనగామ / రఘునాథపల్లి: జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్న సమయంలో వలస కార్మికుల రూపంలో మళ్లీ కలకలం రేపింది. గతంలో మర్కజ్‌కు వెళ్లి వచ్చిన ఇద్దరికి పాజిటివ్ రాగా, అదే రైలులో ప్రయాణించిన ఓ జవాన్‌కు సైతం పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఇందులో ఇద్దరు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా, ఒకరికి చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఆరెంజ్ జోన్లో ఉన్న జనగామ జిల్లాలోని 12 మండలాల పరిధిలో 100 శాతం, మునిసిపల్ పరిధిలో 50 శాతం వ్యాపారాలకు ప్రభుత్వం సడలింపునిచ్చిన సమయంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన భార్యాభర్తల(వలస కార్మికులు)కు కరోనా పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తుంది. ప్రత్యేక బస్సులో 25 మంది... జిల్లాలోని రఘునాథపల్లి, లింగాలఘనపురం, బచ్చన్నపేట మండలానికి చెందిన 25 మంది బతుకుదెరువు కోసం మహారాష్ట్రకు వెళ్లారు. అక్కడి బాంధ్రా గ్రామం కేర్వాడి మండల (పోలీస్‌స్టేషన్) పరిధిలో నివాసముంటూ రోజువారి పనులు చేసుకుంటున్న వారు లాక్‌డౌన్‌తో యాభై రోజుల పాటు ఇబ్బందులు పడ్డారు. అక్కడి ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక బస్సు మాట్లాడుకుని ఈనెల 10వ బయలు దేరి 11వ తేదీ రాత్రి జిల్లాకు చేరుకున్నారు. ఇందులో రఘునాథపల్లి మండలం నిడిగొండకు చెందిన దంపతులు, బచ్చన్నపేట మండలం కొన్నెకు చెందిన ఐదుగురితో పాటు లింగాలఘనపురం మండలానికి చెందిన 18 మంది ఉన్నారు. కొన్నెకు చెందిన ఐదుగురు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో దిగి ఆటోలో స్వగ్రామానికి వెళ్లారు. ఇక నిడిగొండకు చెందిన భార్యాభర్తలు జనగామ నుంచి ద్విచక్రవాహనంపై వెళ్లారు. అదేరోజు రాత్రి 11 గంటలకు వారికి దగ్గు, గొంతులో మంట రావడంతో స్థానిక వైద్య సిబ్బంది ఉన్నతా«ధికారులకు సమాచారమిచ్చారు. దీంతో అప్రమత్తమైన డిప్యూటీ డీఎంహెచ్ఓ అశోక్‌కుమార్, డీఎస్ఓ పూర్ణచందర్, మండల వైద్యాధికారిని స్రవంతి సిబ్బందితో చేరుకుని దంపతులను అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని కింగ్‌కోఠి ఆస్పత్రికి తరలించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో వారికి పాజిటివ్‌గా తేలినట్లు గురువారం నివేదిక వచ్చిందని డీఎంహెచ్ఓ డాక్టర్ మహేందర్ తెలిపారు. అప్రమత్తమైన అధికారులు మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కార్మికులకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. వైద్య, ఆరోగ్య, రెవెన్యూ, పోలీసు శాఖలు అప్రమత్తమై ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్న 23 మంది వలస కార్మికులు ఉన్న గ్రామాలకు వెళ్లారు. 28 రోజుల పాటు బయటకు రావొద్దని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మందులు పంపిణీ చేశారు. దగ్గు, దమ్ము, జ్వరం వస్తే తమకు సమాచారం ఇవ్వాలని డీఎంహెచ్ఓ సూచించారు. కాగా, డీసీపీ శ్రీనివాసరెడ్డి, ఏసీపీ వినోద్ కుమార్ కూడా గ్రామాలకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. -
పెంబర్తి వద్ద బొలెరో బోల్తా.. ఎస్ఐ మృతి
సాక్షి, జనగామ: వరంగల్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ కర్ణుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న బొలెరో వాహనం జనగామ జిల్లా పెంబర్తి శివారు వద్ద బోల్తా పడింది. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. డిపార్ట్మెంట్ వాహనంలో కర్ణుడు వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నట్టుగా తెలిసింది. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. (చదవండి: దండం పెడుతున్నాం.. రోడ్లపైకి రాకండి) -
బోర్లు వేయడానికి నో..
సాక్షి, జనగామ: అసలే కరువు నేల..వేసవి రానే వచ్చింది. భూగర్భ జలాలు క్రమక్రమంగా అడుగంటిపోతున్నాయి. నీటి వినియోగం..ఉష్ణోగ్రతలు పెరగడంతో భూగర్భ జలాలు ప్రమాద ఘంటికను మోగిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 76 గ్రామాల్లో భూగర్భ జలాలు పడిపోయాయి. బోర్లు వేయడానికి నో.. తక్కువ వర్షపాతానికి జిల్లా కేరాఫ్‌గా మారింది. సముద్ర మట్టానికి 510 మీటర్ల ఎత్తులో ఉంది. గోదావరి, కృష్ణా నదులకు మధ్యలో ఉండడంతో సహజంగానే తక్కువగా వర్షాలు కురుస్తున్నాయి. కురిసే వర్షం కంటే నీటి వినియోగం మాత్రం ఎక్కువగా ఉంటుంది. సాగు, తాగు నీటి అవసరాల కారణంగా భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. నీటి వినియోగం ఎక్కువగా ఉన్న 76 గ్రామాలను భూగర్భ జలశాఖ(గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్) అధికారులు గుర్తించారు. ఆయా గ్రామాల్లో బోర్లు వేయడం, నీటిని బయటకు తోడడం వంటి కార్యక్రమాలపై నిషేధం విధించారు. సాగు నీటి అవసరాలను తగ్గించుకొని కేవలం ఇంటి పనులను తీర్చుకోవడానికే నీటిని వినియోగించాలని సూచనలు చేస్తున్నారు. నీటిని పొదుపుగా వాడుకోవడంపై చర్యలు చేపట్టారు. పడిపోతున్న భూగర్భ జలాలు.. వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. దేవాదుల ద్వారా నీటిని తరలించి చెరువులను నింపడంతో జిల్లాలో సగటున 8 మీటర్ల నుంచి 10 మీటర్ల వరకు భూగర్భ జలాలున్నాయి. ప్రస్తుతానికి 14 మీటర్ల లోతుకు జిల్లా భూగర్భ జలాలు పడిపోయాయి. 76 గ్రామాల్లో 20 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. బోర్లు వేయడం నిషేధం ఉన్న గ్రామాలు ఇవే.. బచ్చన్నపేట మండలం: అలీంపూర్, బండ నాగారం, చిన్న రామన్‌చర్ల, దుబ్బకుంటపల్లి, ఇటుకాలపల్లి, కాసిరెడ్డిపల్లి, కొడవటూరు, లక్ష్మాపూర్, మన్సాన్పల్లి, నారాయణపూర్, పడమటి కేశవాపూర్, పుల్లగూడ(డీ), రామచంద్రాపూర్, తమ్మడపల్లి దేవరుప్పుల మండలం: చిన్నమడూర్, ధర్మపురం, గొల్లపల్లి, మదాపూర్, మన్‌పహాడ్, సింగరాజుపల్లి జనగామ మండలం: అడవి కేశవాపూర్, చీటకోడూరు, చౌడారం, చౌడరపల్లి, గానుగుపహాడ్, గోపరాజుపల్లి, జనగామ పట్టణం, మరిగడి, ఓబుల్‌కేశవాపూర్, పసరమడ్ల, పెద్ద పహాడ్, పెద్ద రామన్‌చర్ల, పెంబర్తి, శామీర్‌పేట, సిద్దెంకి, వడ్లకొండ, గొర్రగొల్లపహాడ్ కొడకండ్ల మండలం: కొడకండ్ల, మొండ్రాయి. రేగుల లింగాలఘనపురం మండలం: చీటూరు, చిన్నరాజిపేట, గుమ్మడవెల్లి, కళ్లెం, నాగారం, నేలపోగుల, నెల్లుట్ల, వడిచర్ల, వనపర్తి నర్మెట మండలం: అమ్మాపురం, బొమ్మకూర్, హన్మంతాపూర్, మల్కాపేట్ పాలకుర్తి మండలం: కోతులబాధ, లక్ష్మీనారాయణపురం, మల్లంపల్లి, ఎల్లరాయి తొర్రూర్ రఘునాథపల్లి మండలం: బానాజీపేట, ఫతేషాపూర్, గోవర్ధనగిరి, కన్నాయిపల్లి, కోడూర్, మాదారం, రఘునాథపల్లి, వెల్ది స్టేషన్‌ఘన్‌పూర్ మండలం: ఇప్పగూడెం, శివునిపల్లి తరిగొప్పుల మండలం: అక్కరాజుపల్లి, అంకూషాపూర్, బొంతగట్టునాగారం జఫర్‌గఢ్ మండలం: అలియాబాద్, సూరారం, తీగారం, తిమ్మంపేట, తిమ్మాపూర్ -
దండం పెడుతున్నాం.. రోడ్లపైకి రాకండి
జనగామ: కరోనా వైరస్ ప్రమాద స్థాయిలో ఉంది.. మనం సేఫ్‌గా ఉన్నా లాక్‌డౌన్‌ను విజయవంతం చేస్తేనే భవిష్యత్‌లో బాగుంటాం.. లాఠీతో మర్యాదచేసినం, కేసులు పెట్టి హెచ్చరించినం.. రెండు చేతులా దండంపెడుతున్నాం.. దయచేసి రోడ్లపైకి రాకండి అంటూ జనగామ పోలీసులు వేడుకుంటున్న తీరు ప్రజలను మేలుకొలుపుతుంది. జిల్లా కేంద్రంలోని నెహ్రూపార్కు చెక్‌పోస్టు వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది ద్విచక్రవాహనంపై వస్తున్న వ్యక్తిని ఆపి, దండం పెడుతూ అనవసరంగా బయటకు రావద్దని విజ్ఞప్తి చేసి మాస్క్‌లు లేకుండా తిరగవద్దని సూచించారు. -
పాజిటివా.. నెగెటివా?
జనగామ: జిల్లాలో రెండు కరోనా పాజిటివ్ కేసులతో కలవరపాటుకు గురైన జిల్లావాసులు మిగతా రిపోర్టులు ఎలా ఉండబోతున్నాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పాజిటివ్ కేసులతో పాటు వారితో సన్నిహితంగా మెదిలి క్వారంటైన్లో ఉంటున్న వారితో పాటు కుటుంబసభ్యులు, డీఆర్డీఏ అధికారులకు వచ్చే రిపోర్టులపైనే అంతా ఎదురుచూస్తున్నారు.పాజిటివ్ వచ్చిన కుటుంబ సభ్యులతో పాటు వారితో కలిసి ఉన్నవారి రిపోర్టులు నేడు వచ్చే అవకాశం ఉంది. జిల్లా కేంద్రం గిర్నిగడ్డ వాసితో పాటు నర్మెట మండలం వెల్దండకు చెందిన ఇద్దరు వ్యక్తులకు పాజిటివ్ నిర్ధారణ ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. వెల్దండ గ్రామానికి చెందిన వ్యక్తికి పాజిటివ్ రాగా అతనితో సన్నిహితంగా ఉన్న 79 మందిని జిల్లాకేంద్రంలో ఐసోలేషన్‌లో ఉంచగా రెండు రోజుల క్రితం అత్యంత సన్నిహితంగా ఉన్న మరో ఆరుగురు వ్యక్తులను ఇందులోకి తీసుకురావడంతో సంఖ్య 85కు చేరుకుంది. డీఆర్డీఏ కార్యాలయంలో అడ్మిన్ అసిస్టెంటుగా (పెన్షన్ విభాగం) పని చేస్తున్న గిర్నిగడ్డకు చెందిన వ్యక్తికి సైతం పాజిటివ్ రాగా వెంటనే ఆయనకు సంబంధించిన ఆరుగురు కుటుంబ సభ్యులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన ఇతను యధావిధిగా మూడు రోజుల పాటు విధులు నిర్వర్తించగా సమీక్షలు, ఆయా గ్రామాల్లో అధికారులతో కలిసి పర్యటనలు చేయడంతో పాటు ఆయన నివాసముంటున్న ప్రాంతాలు, దగ్గరి వ్యక్తులను కలిశారు. వీరిని గుర్తించిన పోలీసులు, వైద్యులు డీఆర్డీఏ అధికారులు, సిబ్బందిని వెలుగు కార్యాలయం, మిగతా వారిని ఎవరి ఇళ్లలో వారిని క్వారంటైన్ చేయగా, ఉన్నతాధికారులను ఇళ్లుదాటి బయటకు రావద్దని వైద్యులు సూచించారు. దీంతో జిల్లా ఉన్నతాధికారుల్లో చాలా వరకు భయాందోళన నెలకొంది. దీంతో ఉన్నతాధికారులతో పాటు వారితో కలిసి పనిచేసిన సిబ్బంది బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. నిబంధనలు మరింత కఠినం కరోనా భూతాన్ని నిర్మూలించేందుకు కొనసాగుతున్న లాక్డౌన్లో పోలీసులు నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు. డీసీపీ శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు ఏసీపీ వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో సీఐ మల్లేష్, ఎస్సైలు శ్రీనివాస్, రాజేష్‌నాయక్, రవికుమార్ జిల్లా కేంద్రాన్ని ఎక్కడికక్కడే దిగ్బంధం చేస్తున్నారు. లాక్‌డౌన్‌కు మరో ఎనిమిది రోజులు మిగిలి ఉండడం, ప్రస్తుత పరిస్థితి ఆందోళన కలిగించే విధంగా ఉండడంతో ఒక్కరు కూడా బయటకు రావద్దని పోలీసులు సూచనలు చేస్తున్నారు. కుర్మవాడ, గణే ష స్ట్రీట్, ఆర్టీసీ బస్టాండు చిన్న గేటు, రైల్వేస్టేషన్‌తో పాటు ప్రధాన రహదారులు, వీధుల నుంచి ఎవరూ కూడా బయటకు రాకుండా దారులను మూసేశారు. నిబంధనలను ఉల్లంఘించి బయటకు వస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇందుకోసం జిల్లాలోని 12 మండలాల నుంచి అదనపు పోలీసు బలగాలను రప్పించారు. దీంతో జిల్లా కేంద్రంలో పూర్తి కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే వారిని సైతం లోనికి అనుమతించలేదు. అత్యవసర పరిస్థితుల్లో పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్న తర్వాతనే పంపించారు. మాస్క్‌లు, శానిటైజర్ల కొరత.. కరోనా ఎఫెక్ట్ ప్రాంతాలతో పాటు ఇంటింటికీ తిరుగుతూ ఆరోగ్య పరీక్షలను నమోదు చేస్తున్న వారికి సరిపడా మాస్క్‌లతో పాటు శానిటైజర్స్ కొరత ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాకేంద్రంలోని క్వారంటైన్ కేంద్రంలో పనిచేసే శానిటేషన్ కార్మికులకు ప్రత్యేక డ్రెస్‌లు లేకుండానే పని చేయిస్తున్నట్లు తెలుస్తుంది. మాస్క్‌లు, శానిటైజర్స్ కోసం పలువురు అధికా రులు వైద్యారోగ్య శాఖను సంప్రదించగా వారు సైతం చేతులు ఎత్తేస్తుండడంతో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. నామమాత్రపు రక్షణ చర్యలతోనే వైద్యులు, అధికారులు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. -
వెల్దండ నుంచి 54 మందిజనగామకు...
జనగామ: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడికి లాక్డౌన్ అమలు చేస్తుండగా ఢిల్లీ నిజాముద్దీన్ ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి తిరిగి వచ్చిన ముగ్గురిలో వెల్దండకు చెందిన వ్యక్తితో పాటు భార్య, కుమారుడిని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకు వెళ్లగా, జనగామకు చెందిన ఇద్దరు వ్యక్తులను వరంగల్ ఎంజీఎంకు తరలించిన విషయం విధితమే. అయితే బుధవారం మరో వ్యక్తి కూడా ఢిల్లీకి వెళ్లి వచ్చినట్లు సమాచారం అందడంతో అధికారులు అలర్టయ్యారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉంటున్న ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు జనగామ అంబేడ్కర్ నగర్‌లోని ఆయన తండ్రిని విచారించారు. అజ్మీర్ దర్గాకు వెళ్లి వచ్చినట్లు చెబుతున్న సదరు వ్యక్తి ఢిల్లీలో ఓ రోజు ఉన్నట్లు తెలియడంతో కొడుకును సిద్దిపేట నుంచి, తండ్రి, తల్లి, సోదరిని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ అశోక్ కుమార్, సీఐ మల్లేస్, వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో జనగామ నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే వెల్దండలో కరోనా కలకలం రావడంతో ఆ గ్రామానికి కొత్త వారెవరూ రాకుండా.. ఆ ఊరి వ్యక్తులు బయటకు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు చేపట్టింది. ఈ విషయమై డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ ఢిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొని జనగామకు ఇంకా ఎవరైనా వచ్చారనే దానిపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. వెల్దండ నుంచి 54 మందిజనగామకు... నర్మెట: మండలంలోని వెల్దండలో గత రెండు రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో టెన్షన్ నెలకొంది. ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యులను అధికారులు మంగళవారం హైదరాబాద్ తరలించడంతో గ్రామస్తుల్లో ఆందోళన కనిపిస్తోంది. కాగా, బుధవారం గ్రామానికి చేరుకున్న పోలీసు, రెవెన్యూ ఉన్నతాధికారులు 54 మందిని జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలకు అంబులెన్స్‌ల్లో తరలిస్తున్నారు. అక్కడ ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన అనంతరం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. -
జనగామలో హైఅలర్ట్..
జనగామ: ఇటీవల ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారిలో జిల్లాకు చెందిన వారు ఉన్నట్లు నిర్ధారణ కావడంతో జనగామలో హైఅలర్ట్ నెలకొంది. కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్న సమయంలో నిజాముద్దీన్ ఘటన ప్రజలను కలవరపాటుకు గురిచేసింది. జనగామ జిల్లా కేంద్రంతోపాటు నర్మెట మండలం వెల్దండకు చెందిన ఐదుగురు ఈనెల 15న ఢిల్లీకి వెళ్లి ప్రార్థనల్లో పాల్గొన్నాక 17వ తేదీన విమానంలో హైదరాబాద్ మీదుగా స్వస్థలాలకు చేరుకున్నారు. ఐదుగురిలో జనగామకు చెందిన ఇద్దరు అక్కడే ఉండిపోగా, ముగ్గురు మాత్రం ఇక్కడకు వచ్చారు. ఇందులో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, ఒకరు ప్రైవేట్ పని చేసుకునే వ్యక్తిగా అధికారులు గుర్తించారు. అయితే, వీరు ఢిల్లీ నుంచి వచ్చినట్లు ముందే తెలుసుకున్న అధికారులు.. వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా తాము ఢిల్లీకి వెళ్లలేదనే సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ఢిల్లీకి వెళ్లి వచ్చిన నాటి నుంచి వీరంతా హోం క్వారంటైన్లో ఉండకుండా, జనాల్లో కలిసి తిరిగినట్లు తెలుస్తోంది. అధికారుల ఆరా ఢిల్లీలో జరిగిన మత ప్రార్ధనల్లో పాల్గొన్న కుటుంబాల వద్దకు వైద్యారోగ్యశాఖ తో పాటు పోలీసులు, రెవెన్యూ అధికారులు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడితో పాటు జిల్లా గ్రామీణాభివృద్ధి కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగి, నర్మెట మండలం వెల్లండకు చెందిన వాసిగా తేలింది. ఇందులో వెల్లండ గ్రామానికి చెందిన వ్యక్తితో పాటు ఆయన భార్య, కుమారుడిని రెస్క్యూ టీం పర్యవేక్షణలో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. జనగామకు చెందిన ఇద్దరిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి వారి కుటుంబీకులను హోం ఐసోలేషన్‌లోనే ఉంచారు. వీరికి సంబంధించిన నివేదికలు వచ్చాక అధికారులు వివరాలు వెల్లడించనున్నారు. వెల్దండలో ఇంటింటి సర్వే ఢిల్లీ ఘటన నేపథ్యంలో జిల్లా కేంద్రంలో బ్లీచింగ్ చేస్తుండగా, వెల్లండ గ్రామంలో ఇంటింటి సర్వే చేస్తున్నారు. వెల్దండకు చెందిన వ్యక్తి ఢిల్లీ నుంచి వచ్చాక ఆ విషయాన్ని దాచి గ్రామంలో మటన్, చికెన్ విక్రయాలు చేసినట్లు సమాచారం. ఈ విషయం ఆలస్యంగా తెలియగా సోమవారం గ్రామానికి వెళ్లిన అధికారులు ఆయనను హోం క్వారంటైన్లో ఉండాల్సిందిగా సూచించారు. ఇక మంగళవారం సదరు వ్యక్తితో పాటు ఆయన భార్య, కుమారుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆయనతో సన్నిహితంగా తిరిగిన 35 కుటుంబాల వ్యక్తులకు హోం క్వారంటైన్ విధిస్తూ నోటీసులు జారీ చేశారు. డీసీపీ శ్రీనివాస్, సీఐ రాపెల్లి సంతోష్ కుమార్, ఎస్సై జక్కుల పరమేశ్వర్, సిబ్బంది జి.నర్సింగారావు, జి.భాస్కర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ లగిశెట్టి అశోక్‌కుమార్, కరోనా బృందానికి చెందిన డాక్టర్ మోజెస్ రాజ్, ఎస్‌యూఓలు రవీందర్, సంతోష్ కుమార్, సర్పంచ్ నర్రా వెంకట రమణారెడ్డి, ఆరోగ్యమిత్ర లక్ష్మారెడ్డి, వీఆర్వో రవీందర్, వీఆర్ఏ అబ్బయ్య, ఏఎన్ఎం అమృత పాల్గొన్నారు. -
బీజేపీ సీనియర్ నాయకుడి మృతి
జనగామ : మృధుస్వభావి, మాజీ ప్రధాని, దివంగత వాజ్‌పేయి శిశ్యుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లుట్ల నర్సింహారావు ఆదివారం తెల్లవారు జాము గుండె పోటుతో మృతి చెందారు. జనగామ నియోజక వర్గ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న నెల్లుట్ల 2004లో ఎమ్మెల్యేగా పోటీచేశారు. పార్టీలో అందరినీ కలుపుకుని పోతూ ఏకతాటిపై నడిపించే ప్రయత్నం చేశాడు. నియోజకవర్గం నుంచి రాష్ట్రం, జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నర్సింహ్మారావుకు కొద్దిరోజుల్లో నామినేటెడ్ పోస్టు వరించనున్న నేపథ్యంలో హఠార్మరణం అభిమానులను కలచివేసింది. ఆయన మరణవార్త తెలుసుకున్న వందలాది మంది హుటాహుటిన హైదరాబాద్‌కు తరలివెళ్లారు. బీజేపీ సీనియర్ నాయకులు నర్సింహ్మారావు జిల్లాకేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కేవీఎల్‌ఎన్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, కౌన్సిలర్ మహంకాళి హరిశ్చంద్రగుప్త, నాయకులు కొంతం శ్రీనివాస్, వెంకట్, ఉడుగుల రమేష్, బొమ్మకంటి అనిల్, ఆగయ్య, సౌడ రమేష్, దేవరాయ ఎల్లయ్య, బొక్క ప్రభాకర్, జగదీష్, మహిపాల్, ఉపేందర్, పిట్టల సత్యం, సంపత్, వినోద్, తిరుపతి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ మండలకమిటీ ఆధ్వర్యంలో ఆర్అండ్డీ అతిథి గృహం ఆవరణలో నెల్లుట్ల చిత్రపటానికి మండల అధ్యక్షులు తిరుపతి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు మహిపాల్, మార్క ఉపేందర్, మహేష్, నిమ్మల మధు, ముక్క స్వామి, రాజశేఖర్, కాంగ్రెస్ నాయకులు గుండ శ్రీధర్‌రెడ్డి నివాళులర్పించారు. -
అడ్డుకుంటేనే ఆగుతారు
విద్యార్ధినులు, యువతులు, మహిళా ఉద్యోగినులు, అంగన్వాడీ, ఆశా మహిళలకు ఆత్మరక్షణ కోసం శిక్షణ ఇస్తున్నారు లక్ష్మి. శాంతి భద్రతలను కాపాడడంతోపాటు, సమాజానికి రక్షణ కల్పించే పనిలో ఉన్న మహిళ కానిస్టేబుళ్లు, హోంగార్డులు, షీ టీం సభ్యులకు సైతం పోరాట కళలో మెళుకువలు నేర్పిస్తున్నారు. నిత్యం జరుగుతున్న ఆగడాల భయంతో ఆడపిల్లలు ఇంట్లోనే ఉండిపోతే తమ కలల్ని నిజం చేసుకోలేరని లక్ష్మి అంటున్నారు. ఈ కథ లక్ష్మిదే అయినా, రవి దగ్గర్నుంచి మొదలుపెట్టాలి. రవిది వరంగల్ జిల్లా కొత్తవాడ. కరాటే అంటే ఆసక్తి. చిన్నతనంలోనే ఏడాదిన్నర వ్యవధిలో బ్లాక్ బెల్ట్ సాధించే దశకు చేరుకున్నాడు! ప్రస్తుతం బ్లాక్ బెల్ట్‌లో సెవన్త్ డాన్. కరాటేనే వృత్తిగా ఎంచుకొని పాఠశాల పిల్లలకు నేర్పిచడానికి రాష్ట్రమంతటా తిరుగుతున్నప్పుడు అతడికి లక్ష్మితో పరిచయం అయింది. లక్ష్మిది నిజామాబాద్ జిల్లా మాకులూరు మండలం శాంతినగర్ గ్రామం. అప్పటికే ఆమెకు కరాటేలో ప్రవేశం ఉంది. ఇద్దరూ 1997లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత కూడా లక్ష్మి మార్షల్ ఆర్ట్స్‌ను కొనసాగించారు. ప్రస్తుతం ఆమె బ్లాక్‌బెల్ట్‌లో సిక్త్స్ డాన్. షీ టీమ్‌లకు కోచింగ్! తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత కోసం షీ టీమ్‌లను ఏర్పాటు చేయడంతో లక్ష్మి ప్రాధాన్యం మరింత పెరిగింది. మహిళా ఐపీఎస్‌ల నేతృత్వంలో విధులు నిర్వర్తించే షీ టీమ్‌లకు శిక్షణ ఇవ్వడానికి లక్ష్మికి అవకాశం వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు మార్షల్ ఆర్ట్స్‌ను నేర్పించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా లక్ష్మికి ప్రాధాన్యం లభించింది. ఆమె చేత పాఠశాలల్లో పని చేస్తున్న పీఈటీలకు శిక్షణ ఇప్పించారు. మూడేళ్ల క్రితం జనగామ జిల్లా కేంద్రంలో జరిగిన ‘సంఘటిత సబల’ కార్యక్రమం గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించడం వెనుక లక్ష్మి కృషి, పట్టుదల ఉన్నాయి. ఆమె భర్త సహకారం ఉంది. – ఇల్లందుల వెంకటేశ్వర్లు, సాక్షి, జనగామ, ఫోటోలు: గోవర్ధనం వేణుగోపాల్ పోకిరీల భయంతో చదువు ఆగకూడదు చిన్నప్పటి నుంచే పోలీసు ఆఫీసర్ కావాలనే కోరిక బలంగా ఉండేది. సుమన్, విజయశాంతి, సినిమాలను చూసి అప్పుడే కరాటే నేర్చుకోవడం ప్రారంభించాను. పదో తరగతి చదువుతున్న సమయంలోనే నా స్నేహితురాలిని కొందరు పోకిరీలు వేధించడంతో భయంతో చదువును ఆపేసి ఇంటి వద్దనే ఉండిపోయింది. ఆ సంఘటన తరువాత ప్రతి విద్యార్థినీ ధైర్యంగా చదువుకోవడానికి స్వేచ్ఛగా వెళ్లాల్సిన ఆత్మ విశ్వాసాన్ని నెలకొల్పాలని భావించాను. ఆ విధిని నా భర్తతో కలసి నెరవేరుస్తున్నాను. – లక్ష్మి -
అందరూ నన్ను వాడుకొని వదిలేశారు!
సాక్షి, జనగామ: గతంలో అందరూ తనను వాడుకొని వదిలేశారని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వదించారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధ్యక్షతన జరిగిన రెండో విడత ‘పల్లె ప్రగతి’అవగాహన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. నాడు అసెంబ్లీలో తెలంగాణ వస్తే కరెంటు రాదని కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.. నేడు సాధించుకున్న రాష్ట్రంలో కేసీఆర్ 24 గంటల కరెంటు అందిస్తూ మహాత్ముడు అయ్యాడని చెప్పారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.13 వేల కోట్లు ఖర్చు పెట్టి రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తోందని చెప్పారు. డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు నిర్మించిన పంచాయతీలకు రూ.84 కోట్లను విడుదల చేసిందని, టాయిలెట్లు నిర్మించుకున్న వారికి చెల్లించాల్సిన నిధులను పది రోజుల్లో చెల్లిస్తామన్నారు. గ్రామాల్లో చెత్త వేసే వారికి నోటీసులు ఇవ్వాలని, ఫైన్లు వేయకుండా నిర్లక్ష్యం వహించే సర్పంచ్, కార్యదర్శి పదవులను కత్తిరించే అవకాశం ఉందన్నారు. పది మండలాలకు కలిపి ఒక అధికారిని ఏర్పాటు చేశామని, నిర్లక్ష్యం ఎవరు చేసినా బాధపడాల్సి వస్తుందని హెచ్చరించారు. -
అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు
స్టేషన్‌ఘన్‌పూర్: పేదల సొంతింటి కలను సాకారం చేసేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం రాఘవాపూర్‌లో నిర్మించిన 40 డబుల్ బెడ్రూం ఇళ్లను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే రాజయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రూ.18 వేల కోట్లతో 2 లక్షల 83 వేల డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేశారని, లక్షా 30 వేల ఇళ్ల నిర్మాణం పూర్తికాగా రూ.7,700 కోట్లు ఖర్చు చేశారన్నారు. సీఎం ఇచ్చిన మాట తప్పరని, ఏది చెప్పారో అదే చేస్తారని అన్నారు. అర్హులందరికీ ఇళ్లు మంజూరు అవుతాయని, ఎవ్వరూ నిరాశపడాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జెడ్పీ చైర్మన్ సంపత్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కృష్ణారెడ్డి, కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
మావోల పేరుతో బెదిరింపులు
జనగామ: మావోయిస్టుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న ఇద్దరు ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం జనగామ డీసీపీ శ్రీనివాసరెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. జనగామకు చెంది న సెంట్రల్ బిర్యానీ సెంటర్ యజమాని ఆరె భాస్కర్, జనగామ మండలం పసరమడ్లకు చెందిన నిమ్మల ప్రభాకర్ మావోయిస్టుల పేరుతో బెదిరింపులకు దిగుతున్నారు. 2015లో ఇలాంటి కేసులో జైలుకు వెళ్లి వచ్చిన ఆరె భాస్కర్ తిరిగి అదే హోటల్లో పని చేస్తున్న ప్రభాకర్‌తో కలసి ముఠాగా ఏర్పడ్డాడు. ఈ క్రమంలో జనగామకు చెందిన తుమ్మ రాజిరెడ్డి, అతని సోదరుడు బాల శౌరిరెడ్డి వాట్సా ప్ నంబర్‌కు చండ్రపుల్లారెడ్డి పేరుతో రూ.25 లక్షలు ఇవ్వాలని మెసేజ్ పంపించారు. లేదం టే కుటుంబసభ్యులను చంపేస్తామని హెచ్చరించారు. అలాగే మరికొందరిని బెదిరించారు. బాధితుల్లో ఒకరైన నర్సింగరావు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల పోలీస్‌స్టేషన్‌లో ఈనెల 12న ఫిర్యాదు చేశారు. దీంతో ముఠా సభ్యులను పట్టుకునేందుకు సీఐ మల్లేష్ ఆధ్వర్యంలో ఎస్సై రాజేష్ నాయక్ బృందం రం గంలోకి దిగింది. దాడులు నిర్వహించి భాస్క ర్, ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రెండు సెల్ఫోన్లు, సిమ్ కా ర్డులను స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్ కు పంపినట్లు డీసీసీ వివరించారు. 24 గం ట ల్లో కేసును ఛేదించిన పోలీసులకు సీపీ రివార్డు ప్రకటించినట్లు పేర్కొన్నారు. -
బోధన.. గుర్తుకొచ్చింది!
సాక్షి, జఫర్‌గఢ్: పూర్వాశ్రమంలో ఆధ్యాపకుడిగా విద్యార్థులకు పాఠాలు భోదించిన కడియం శ్రీహరి తిరిగి ఇంటర్ విద్యార్థులకు పాఠాలు భోదించి ఆధ్యాపకుడి అవతారమెత్తిన ఘటన మండల కేంద్రంలో మోడల్ కళాశాలలో చోటు చేçసుకుంది. మంగళవారం మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ మోడల్ కళాశాలతో పాటు కస్తూర్బా పాఠశాలను కడియం శ్రీహరి ఆకస్మికంగా సందర్శించారు. తొలుత మోడల్ స్కూల్‌ను సందర్శించిన కడియం శ్రీహరి తరగతి గదిలో ఉన్న విద్యార్థులను చూడగానే నేరుగా క్లాసు రూంలోకి వెళ్లి విద్యార్థులకు పాఠం చెప్పడమే కాకుండా వారిని పలు ప్రశ్నలు అడిగారు. లోక్‌సభ, రాజ్యసభలో సభ్యుల సంఖ్యతో పాటు ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఎవరంటూ ప్రశ్నించారు. వీటికి సమాధానం చెప్పిన సుస్మిత అనే విద్యార్థినిని అభినందిస్తూ వెయ్యి రూపాయల పారితోషికాన్ని అందించారు. అనంతరం విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులను పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచే మోడల్ స్కూల్ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డితో ఫోన్లో మాట్లాడి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కడియం శ్రీహరి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పాఠశాలలో నెలకొన్న సమస్యలన్నింటినీ రెండు నెలల్లో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బత్తిని రాజేందర్, డీఈ జెయాకర్, పాఠశాలల ప్రిన్సిపాళ్లు శ్రీకాంత్, సీహెచ్.స్వప్న, సర్పంచ్ నర్సింగరావు, విద్యాకమిటీ చైర్మన్ జయశంకర్, టీఆర్ఎస్ నాయకులు బానోత్ రాజేష్‌నాయక్, అన్నం బ్రహ్మారెడ్డి, ఎంపీటీసీ ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎడ్ల వెంకటస్వామి, నాయకులు కుల్లా మోహన్‌రావు, మారపల్లి ప్రభాకర్, కుల్లా నర్సింగంతో పాటు ఆయా గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
పెళ్లి చేసుకోకుంటే చంపేస్తా..
జనగామ: ఇద్దరు యువతులపై అత్యాచారం, హత్య ఘటనల నుంచి ఇంకా తేరుకోక ముందే.. జనగామ జిల్లా కేంద్రంలో ఓ యువతిని యువకుడు వేధించిన సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బస్సులో యువతిని వెంబడిస్తూ పెళ్లి చేసుకోవాలంటూ వేధింపులకు గురి చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా 20 నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలానికి చెందిన ఓ యువతి(19) హైదరాబాద్ మెహదీపట్నంలోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తోంది. అదే గ్రామానికి చెందిన యువకుడు సంపత్ ఆమెతో కలిసి చదువుకోవడంతో పరిచయం ఉంది. ఆమె స్వగ్రామానికి వచ్చేందుకు శుక్రవారం సికింద్రాబాద్‌లో బస్సు ఎక్కుతున్న క్రమంలో సంపత్ పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడు. తాను కూడా బస్కెక్కి జనగామ వరకు వెంబడించి, బస్టాండ్‌లో దిగాక ఆమె ఫోన్ లాక్కుని పెళ్లి చేసుకోకపోతే చంపుతానంటూ బెదిరించాడు. దీంతో కేకలు వేస్తూ బాధితురాలు సంపత్ నుంచి తప్పించుకుని నేరుగా డీసీపీ కార్యాలయానికి చేరుకుంది. ఆమె వాంగ్మూలం తీసుకున్న సీఐ మల్లేశ్.. 20 నిమిషాల్లోనే సంపత్‌ను పోలీసుల సాయంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆ యువతిని డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి అభినందించారు. ఒంటరిగా ప్రయాణం చేసే సమయంలో ఎటువంటి ఆపద వచ్చినా వెంటనే 100 డయల్‌కు ఫోన్ చేయాలని సూచించారు. -
జనగామ వరకు ఎంఎంటీఎస్‌ను పొడిగించాలి
సాక్షి, హైదరాబాద్: రాయగిరి వరకు ప్రతిపాదించిన ఎంఎంటీఎస్ రైలును జనగామ వరకు పొడిగించాలని, ప్యాసింజర్ రైలు (ఎంఈఎంయూ)ను ఫలక్‌నుమా నుంచి భువనగిరి దాకా విస్తరించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని వివిధ రైల్వే స్టేషన్లలో ఎక్స్‌ప్రెస్, ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లను ఆపడంతోపాటు పలు సమస్యలు పరిష్కరించాల న్నారు. శుక్రవారం సికింద్రాబాద్ లోని రైల్ నిలయంలో జీఎంను కలసిన ఆయన ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. -
మటన్ కత్తితో పిల్లల గొంతు కోసి హత్య
సాక్షి, నర్మెట: కన్నపేగే బిడ్డలపై పాశవికం చూపింది. అతి దారుణంగా మటన్ కోసే కత్తితో గొంతులు కోసి నిద్రించిన మంచంపైనే హత్య చేసింది. ఆపై అదే కత్తితో తానూ గొంతు కోసుకుని ఆత్మహత్నాయత్నానికి పాల్పడింది. ఘటన జనగామ జిల్లా నర్మెట మండలం మల్కపేట శివారు శివబీక్యా తండాలో సోమవారం జరిగింది. అనారోగ్యంతో తల్లిగారింటికి మల్కపేట శివారు శివబీక్యా తండాకు చెందిన గోపాల్‌తో రమకు ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి కుమార్తె భానుశ్రీ (4), కుమారుడు వరుణ్ (2.5 ఏళ్లు) ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న రమ తల్లి గారిల్లయిన మల్కపేటకు వెళ్లింది. రమ అనారోగ్యం వల్ల పిల్లలు తండ్రితోనే ఉంటున్నారు. ఇన్నాళ్లూ తల్లిగారింటి వద్దే ఉన్న రమ సోమవారం అత్తవారింటికి వచ్చింది. అత్తామామలు పనికి.. భర్త ఊరికి రమ వచ్చాక అత్తామామలు పొలం పనులకు పోగా, భర్త గోపాల్ పని మీద వేరే ఊరికి వెళ్లాడు. మధ్యాహ్నం రమ పిల్లలకు భోజనం చేయించి నిద్రపుచ్చింది. మటన్ కోసే కత్తితో నిద్రలో ఉన్న పిల్లలిద్దరీ గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేసింది. అనంతరం అదే కత్తితో తానూ గాయపరచుకుని మంచంపైనే పడిపోయింది. సాయంత్రం పొలం నుంచి వచ్చిన అత్తామామలు ఈ దృశ్యాలను చూసి నివ్వెరపోయారు. అప్పటికే పిల్లలిద్దరికీ తీవ్ర రక్తస్రావమై మృతి చెందారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రమను వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. రమ గత 6 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతోందని, దీనికితోడు ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండటంతో పిల్లలను చంపి తనూ ఆత్మహత్య చేసుకోవాలని భావించిందని జనగామ సీఐ మల్లేష్ యాదవ్ తెలిపారు. -
అమానుషం : పిల్లల్ని నరికి చంపిన తల్లి
సాక్షి, జనగామ : జిల్లాలోని నర్మెట్ట మండలం శివభూక్య తండాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహిత కన్న బిడ్డల్ని నరికి చంపి తనూ ఆత్మహత్యకు పాల్పడింది. భానోతు రమ పిల్లలు భాను శ్రీ (4), వరుణ్ (3)ను అతి దారుణంగా కత్తితో నరికి చంపింది. అనంతరం మెడ కోసుకుని తనూ చనిపోయేందుకు యత్నించింది. కొన ఊపిరితో ఉన్న రమను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు ఆర్థిక ఇబ్బందులే కారణమని ఆమె భర్త చెప్తుండగా.. భర్త వేధింపుల కారణంగానే రమ ఇంతటి అఘాయిత్యానికి పాల్పడిందని బంధువులు ఆరోపిస్తున్నారు. చిన్నారుల మృతితో తండా వాసులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
రూ. వెయ్యికి ఆశపడకండి!
సాక్షి, జనగామ: దండం పెడుతున్నం.. కాళ్లు మొక్కు తం.. రూ. వెయ్యికి ఆశపడి ఉద్యోగానికి రాకండి అప్పుడే ప్రభుత్వానికి శక తగులుతుందని ఆర్టీసీ కార్మికులు తాత్కాలిక ఉద్యోగులకు వేడుకున్నారు. మా పోరాటం భవిష్యత్‌లో మీ కోస మే.. మా బాధను చూస్తున్నారు.. ఆగ్రహాన్ని చూస్తే డిపోలో కాలుకూడా పెట్టలేరని తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీచేశారు. ఆర్టీసీ సమ్మె సోమవారం నాటికి 17వ రోజుకు చేరుకోగా కార్మికులు కుటుంబ సభ్యులతో జనగామ డిపో గేటు ఎదుట భైఠాయించారు. బస్సులను బయటకు రానివ్వకుండా సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. ఏపీ ముఖ్య మంత్రి జగనన్న అచ్చాహై అంటూ నినాదాలు చేస్తూ కార్మికుల పిల్లలు నినదించారు. సీఐ మల్లేష్ యాదవ్, ఎస్సైలు శ్రీనివాస్, రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు చేపట్టారు. కార్మికులు డిపోలోకి వెళ్లకుండా పోలీసులు ముందుగానే గేట్లు మూసేశారు. రెండు గంటల పాటు బైఠాయింపు ఆర్టీసీ కార్మికులు కుటుంబసభ్యులతో డిపో గేటు ఎదుట రెండు గంటల పాటు భైఠాయించడంతో బస్సులు బయటకు రాలేదు. నియంత పాలనలో ఆర్టీసీని కనుమరుగు చేస్తున్నారని కార్మిక సంఘం నాయకులు ఆరోపణలు గుప్పించారు. ప్రైవేట్‌పరం చేస్తే టికెట్‌కు అడిగినంత డబ్బులు ఇచ్చుకోవాల్సిందేనన్నారు. అన్ని వర్గాల ప్రజలు కలిసి వస్తుంటే.. కొంతమంది నిరుద్యోగులు డబ్బులకు కక్కుర్తి పడి తాత్కాలిక ఉద్యోగాలు చేస్తూ తమను ఆకలితో చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రూ.వెయ్యా...లేక టికెట్‌పై అదనపు వసూళ్ల కోసం వస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికీ మా మాట వినకుంటే కార్మిక కుటుంబాల ఉసురు తగిలిపోతారని శాపనార్దాలు పెట్టారు. డిపో నుంచి ర్యాలీగా బస్టాండు ఆవరణకు చేరుకుని మానవహారం నిర్వహించి అవుట్ గేట్ వద్ద కాసేపు ధర్నా నిర్వహించారు. వాగ్వాదం.. పలు డిపోలకు చెందిన బస్సు సర్వీసులు బస్టాండుకు రాగా తాత్కాలిక, ఆర్టీసీ కార్మికులకు మాటల యుద్ధం కొనసాగింది. కండక్టర్లు, డ్రైవర్లకు దండంపెట్టి.. ఉద్యోగాలకు రావద్దని వేడుకుంటుండగా.. మా ఇష్టం అంటూ మాట్లాడడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తాత్కాలిక కండక్టర్ ఆర్టీసీ కార్మికులపైకి రావడంతో అంతా ఒక్కటయ్యారు. దీంతో పోలీసులు కలుగజేసుకుని గొడవను సద్దుమణిగించారు. అక్కడి నుంచి ర్యాలీగా దీక్షా శిబిరానికి చేరుకున్నారు. నేడు ఆర్టీసీ కార్మికులు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో ముఖాముఖి చర్చలు కొనసాగించనున్నారు. -
24 గంటల్లో 17 ప్రసవాలు
జనగామ: జనగామ జిల్లా కేంద్రం చంపక్‌హిల్స్ మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం డెలివరీల్లో రికార్డు సొంతం చేసుకుంది. 24 గంటల్లో 17 సాధారణ ప్రసవాలతో సర్కారు ఆస్పత్రిని ఆదర్శంగా నిలిపారు. ఈ నెల 19వ తేదీ ఉదయం 9 నుంచి 20వ తేదీ ఉదయం 9 గంటల వరకు 17 సాధారణ ప్రసవాలు చేశారు. 22 మంది గర్భిణులకు డెలివరీ చేయగా.. ఇందులో రెండో, మూడో కాన్పు కోసం వచ్చిన ఐదుగురికి ఆపరేషన్ చేసి.. మొదటి కాన్పు కోసం వచ్చిన 17 మందికి నార్మల్ డెలివరీ చేసి రికార్డు సృష్టించారు. డాక్టర్ ప్రణతి ఆధ్వర్యంలో ఎనిమిది మంది సహాయకుల పర్యవేక్షణలో ఈ కాన్పులు చేశారు. -
యూరియా కష్టాలు.. గంటల కొద్ది పడిగాపులు
సాక్షి, జనగాం : రైతులను యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. బస్తా యూరియా కోసం గంటల కొద్ది లైన్లలో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయం ఆరు గంటల నుంచే క్యూలైన్ల వద్ద చెప్పులతో రైతులు బారులు తీరుతున్నారు. పాలకుర్తి మండలం ఎఫ్ఎస్సీఎస్ కోపరేట్ బ్యాంకు వద్ద యూరియా బస్తాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. కాళ్లు తిమ్మిర్లు పట్టేలా గంటల పాటు వరుసలో నిలబడి ఉన్నా ఒక బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారు. ఒక లారీ లోడ్‌లో 506 యూరియా బస్తాలు వస్తే రోజు వెయ్యి మంది నుoచి 1200 మంది రైతులు బస్తాలకోసం వస్తున్నారు. తమ పరిస్థితిని గుర్తించి ప్రభుత్వం వెంటనే స్పందించాలని, యూరియా బస్తాల కొరత లేకుండా అన్ని ప్రాంతాలకు రవాణా చేసి అధికారులు ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు. -
దద్దరిల్లిన జనగామ
సాక్షి, జనగామ: సమస్యల పరిష్కారం కోసం ‘జనగామ’ గళమెత్తింది. పట్టణ సమస్యలపై ఒకరు.. కార్మికుల కష్టాలపై మరొకరు.. మా భూములు మాకిప్పించాలని బాధిత కుటుంబాలు.. సంచార జాతులు.. కుల ధ్రువీకరణ, గోదావరి జలాల కోసం తలపెట్టిన నిరసనలతో సోమవారం కలెక్టరేట్ దద్దరిల్లిపోయింది. ధర్నాలు లేని తెలంగాణ వస్తదని చెప్పిన పాలకుల మాటలకు ఆచరణలో విరుద్ధంగా కనిపిస్తుంది. జనగామ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కలెక్టరేట్ ప్రాంగణంలో సంఘాలు.. పార్టీలు.. భూసంబంధిత సమస్యలపై ఎనిమిది ధర్నాలు, దీక్షలు జరిగాయి. ఆయా గ్రామాల నుంచి తరలివచ్చిన వేలాది మందితో కలెక్టరేట్ రహదారి నిండిపోయింది. దీంతో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కావడంతో పోలీసులు ఇరిగేషన్ కార్యాలయం నుంచి దారి మళ్లించారు. ధర్నాలు, దీక్షలతో కలెక్టరేట్ ప్రాంగణం హోరెత్తిపోగా గొడవలు చోటు చేసుకోకుండా పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు చేపట్టారు. పట్టణ సమస్యలపై ఇటీవల సీపీఎం నిర్వహించిన పాదయాత్రలో గుర్తించిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆ పార్టీ ఆధ్వర్యంలో జనగామ మునిసిపల్ కార్యాలయం ఎదుట భైఠాయించారు. మరిగడి గ్రామంలోని కొత్తచెరువుకు గోదావరి జలాలను తీసుకురావాలని 500 మంది గ్రామస్తులతో కలెక్టరేట్‌ను ముట్టడించా రు. వడిచర్ల గ్రామంలో కుర్మకులస్తులకు చెందిన భూమిని ఆక్రమణదారుల నుంచి విడిపించి 110 కుటుంబాలకు పట్టాలుచేసి ఇవ్వాలని నిరసన తెలిపారు. చేనేతరంగాన్ని ఆదుకోవడంతో పాటు జిల్లాలో భారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని తలపెట్టిన దీక్షకు ప్రొఫెసర్ కోదండరాం సంఘీభావం ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర బీసీ జాబితాలో పూసల కులం పేరును చేర్చే విధంగా చూడాలని పూసల కులస్తులు కలెక్టరేట్ ఎదుట భైఠాయించారు. కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని యాచకవృత్తి చేసుకునే 25 కుటుంబాలు కలెక్టరేట్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. పలువురు వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం నెలల తరబడి కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. కోదండరాం రాక.. నిరసనలకు మరింత ఊపు చేనేత కార్మికుల దీక్షను ప్రారంభించేందుకు ముఖ్యఅతిథిగా వచ్చిన ప్రొఫెసర్ కోదండరాంతో నిరసనకారులకు కొత్త ఊపునిచ్చినట్లుగా మారిపోయింది. చేనేత దీక్షలను ప్రారంభించి నేరుగా మరిగడి వాసుల వద్దకు వెళ్లి సంఘాభావం ప్రకటించారు. దీంతో కలెక్టరేట్, మునిసిపల్ రెండు ప్రధాన గేట్లను పోలీసులు మూసివేయడంతో నిరసనకారులు లోనికి వెళ్లే ప్రయత్నంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు కలెక్టరేట్ ఏరియా ఆందోళన కార్యక్రమాలతో బిజీబిజీగా కనిపించింది. -
డిజిటల్ వైపు జీపీలు
సాక్షి, జనగామ: గ్రామ పాలనను మరింత జవాబుదారీతనంగా తీర్చిదిద్దడానికి గ్రామ పంచాయతీల్లో డిజిటల్ సేవలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ధ్రువీకరణ పత్రాల జారీ నుంచి బిల్లుల చెల్లింపుల వరకు అన్నీ ఆన్లైన్లోనే అందించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో ఇ–గవర్నెన్స్ అమలు కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఈ ప్రక్రియ ద్వారానే పంచాయతీల్లోని పనులను నిర్వహించనున్నారు. డిజిటల్ సేవలపై ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. త్వరలో మరో 20 రోజుల శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడానికి ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. చేతి రాతకు చెల్లు చీటీ గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం అమలు పర్చుతోంది. అందులో భాగంగా పంచాయతీ రాజ్ చట్టం–2018ను అమలులోకి తీసుకొచ్చింది. 500 జనాభా కలిగిన గిరిజన తండాతోపాటు శివారు గ్రామాలను సైతం గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. ఒక్కొక్క పంచాయతీకి ఒక్కొక్క పంచాయతీ కార్యదర్శిని సైతం నియమించింది. ఇక పాలనలో మార్పులకు శ్రీకారం చుట్టబోతుంది. గ్రామ పంచాయతీలో ప్రస్తుతం ఉన్న మ్యానువల్ విధానానికి స్వస్తి చెప్పనున్నారు. ఇ–గవర్నెన్స్ అమలులో భాగంగా డిజిటల్ సేవలను అమలు చేయనున్నారు. గ్రామ పంచాయతీ నుంచి పొందే ప్రతి ధ్రువీకరణ పత్రాన్ని ఆన్లైన్ నుంచే తీసుకునే విధంగా చర్యలను ప్రారంభించారు. ఇక నుంచి ఇ–పంచాయతీ అప్లికేషన్లు, భవన నిర్మాణ అనుమతులు, పేరు మార్పిడి, లైసెన్సుల జారీ, ఇంటి పన్ను వసూళ్లు, లే–అవుట్ అనుమతులు అన్నీ ఆన్లైన్ ద్వారా జారీచేస్తారు. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హరితహారం కార్యక్రమం ప్రొగ్రెస్ రిపోర్ట్ ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయనున్నారు. ఆన్లైన్లోనే చెక్‌లు.. గ్రామ పంచాయతీలో రాత చెక్కులకు స్వస్తి చెప్పనున్నారు. పాత చెక్కుల విధానానికి చెక్‌పెట్టి పూర్తి పారదర్శకతతో చెక్కులను అందించడానికి డిజిటల్ కీ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. పాత విధానంతో గ్రామపంచాయతీల్లో నిధుల దుర్వినియోగం అవుతున్నాయనే భావనతో ఈ దిద్దుబాటు చర్యలను చేపట్టారు. ఇది వరకు గ్రామ పంచాయతీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల కోసం చేసిన ఖర్చులను చెక్ రూపంలో చెల్లించే వారు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సంతకం చేసిన చెక్‌ను ట్రెజరీ ద్వారా బ్యాంకుకు పంపించేది. అన్నీ సరి చూసుకున్న తరువాత బ్యాంకు ద్వారా నగదు విడుదలయ్యేది. ఈ విధానం ద్వారా పనులు తక్కువ.. నిధుల వినియోగం ఎక్కువగా ఉండి ప్రజాధనం ఎక్కువగా దుర్వినియోగం అయ్యేది. మారిన పంచాయతీ రాజ్ చట్టం ప్రకారంగా ప్రతి పైసాకు లెక్క చూపే విధంగా డిజిటల్ కీ అమలు చేయబోతున్నారు. సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కు చెక్ పవర్ అధికారం ఇచ్చారు. గ్రామంలో చేపట్టిన పనుల వివరాలను ముందుగా ఇ–పంచాయతీ సాఫ్ట్‌వేర్‌లో గ్రామ కార్యదర్శులు నమోదు చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను నమోదుచేసిన తరువాత ఆన్లైన్ చేస్తే డిజిటల్ చెక్ బయటకు వస్తుంది. సర్పంచ్, ఉప సర్పంచ్ల సెల్‌నంబర్లకు ఓటీపీ వస్తుంది. డిజిటల్ చెక్‌పై సర్పంచ్, ఉససర్పంచ్ సంతకాలు చేసి కార్యదర్శి ఎస్టీఓకు పంపిస్తారు. అప్పుడు నిధులు విడుదల అవుతాయి. ఏమాత్రం తప్పులు దొర్లినా నిధుల విడుదల చేతికి రావడం కష్టం. ఈ–పంచాయతీ సేవలపై శిక్షణ కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం డిజిటల్ సేవలు అమలు చేయబోతున్నాం. ఆన్లైన్లోనే చెక్కులను అందిస్తాం. సంతకాలను స్కాన్ చేసి ఆన్లైన్ చేయాలి. డిజిటల్ సేవలపై పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చాం. త్వరలో జిల్లాలో ఇ–గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. – డి. వెంకటేశ్వరరావు, డీపీఓ -
ఏసీబీ వలలో ఎంఈఓ
సాక్షి, బచ్చన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ప్రభుత్వ ఉపాధ్యాయులకు వేలల్లో జీతాలను ఇస్తుంటే అవేవి చాలవన్నట్లు అదే ప్రభుత్వ ఉపాధ్యాయుల వద్ద లంచాలను తీసుకుంటున్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యాధికారి తేలుకంటి ముత్తయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాడెండ్‌గా చిక్కిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తూ, ఇన్చార్జి మండల విద్యాధికారిగా కూడా అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. మండలంలోని నాగిరెడ్డిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మద్దికుంట కృష్ణారెడ్డి ఆరోగ్యం సహకరించక అనారోగ్యంతో జూలై 17, 18న సెలవులు పెట్టాడు. ఈ నేపథ్యంలో ఎంఈఓ ముత్తయ్య ఆ పాఠశాలను ఆ సమయంలో తనిఖీ చేశాడు. మరుసటి రోజు డీఈఓ యాదయ్య కూడా అదే పాఠశాలను తనిఖీ చేయగా హెచ్ఎం లేక పోవడంతో ఆయన స్థానంలో విద్యావలంటీర్ ఉండడంతో, సమాచారం లేకుండా సెలవు ఎలా పెడతాడని ఆగ్రహం వ్యక్తం చేసి హాజరు రిజిస్టర్లో రిమార్కు వేశాడు. ఈ సాకును అదనుగా తీసుకున్న ఎంఈఓ ముత్తయ్య హెచ్ఎం కృష్ణారెడ్డిని సస్పెండ్ చేయిస్తానని వేధించసాగాడు. డబ్బులు ఇస్తేనే అన్ని వ్యవహారాలు చక్కగా ఉంటాయని లేనిచో శాఖాపరమైన చర్యలు తప్పవని పలు మార్లు హెచ్చరించాడు. ఇందులో పలువురు ఉపాధ్యాయులు మధ్యవర్తిత్వం చేసి చివరకు రూ.30 వేలు ఇవ్వాలని రాజీ కుదిర్చారు. దీనికి కృష్ణారెడ్డి కూడా ఒప్పుకొని ముందుగా రూ.10 వేలు ఇస్తానని తెలిపాడు. అనంతరం ఈ విషయంపై హెచ్ఎం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారు అనుకున్నట్టుగానే ముందుగా రూ.10 వేలు అన్నీ ఐదు వందల రూపాయల నోట్లను కృష్ణారెడ్డికి ఏసీబీ అధికారులు ఇచ్చి పాఠశాలకు సోమవారం పంపించారు. కృష్ణారెడ్డి ఎంఈఓ ముత్తయ్యకు డబ్బులు ఇచ్చి పాఠశాల గేట్ కూడా దాటకముందే అనుకున్న పథకం ప్రకారం ఏసీబీ అధికారులు ముత్తయ్యను రెడ్ హ్యాడెపట్టుకున్నారు. ఈ దాడుల్లో సీఐ రవి, ఇన్స్పెక్టర్లు సతీష్, క్రాంతితో పాటు సిబ్బంది పాల్గొన్నారు. -
ఉద్యమానికి సై అంటున్న జనగామ
సాక్షి, జనగామ : పోరాటాలకు పురుడు పోసుకున్న ‘జనగామ’ మరో ఉద్యమానికి ఊపిరి పోస్తుందా.. ఇందుకు నిదర్శనం ‘సాక్షి’ లో ‘జిల్లాలోకి మూడు మండలాలు?’ అనే శీర్షికన ప్రధానంగా ప్రచురితమైన కథనం జనగామ, సిద్దిపేట జిల్లాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఎక్కడ ఏ ఇద్దరు కలిసినా ‘సాక్షి’లో వచ్చిన కథనంపైనే చర్చించుకున్నారు. తెల్లవారుజామున ఆరు గంటల నుంచే సోషల్ మీడియాలో సాక్షి వార్తాకథనం చక్కర్లు కొట్టడం ప్రారంభమైంది. జనగామతో పాటు నియోజకవర్గంలోనే ఉన్న ప్రస్తుత సిద్దిపేట జిల్లా పరిధిలోని చేర్యాల, మద్దూరు, కొమురవెల్లిలో హాట్‌టాపిక్‌గా మారిపోయింది. వాట్సప్, ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సోషల్ మీడియాలో జనగామ జిల్లాలో మూడు మండలాలు కలవబో తున్నాయా అంటూ మాట్లాడుకోవడం కనిపించింది. కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేయాలంటూ ప్రతిపాదనలు తీసుకు రావడం, లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజక వర్గాలు ఒకే జిల్లాలో ఉండాలనే నిబంధన ఉండడంతో ‘మూడు మండలాల’ కలయిక చర్చకు వచ్చింది. జనగామ జిల్లా కేంద్రంలో నాటి జిల్లా ఉద్యమకారులకు సాక్షి కథనం ఊపిరిపోసినట్లుగా మారింది. మూడు మండలాల కోసం మరోఉ ద్యమం చేద్దామంటూ ముందడుగు వేస్తున్నారు. జనగామ జిల్లా ఏర్పాటు చేసే సమయంలో చేర్యాల, మద్దూరు మండలాలను కలపాలని విశ్వప్రయత్నం చేశారు. భౌగోళికంగా చరిత్ర పరంగా నాటి నుంచి ఒక్కటిగా ఉన్న ప్రాంతాలను విడదీ యవద్దని వేడుకున్నారు. తెలంగాణ సాయుధ పోరా>టం, భైరాన్‌పల్లి వీరోచిత ఘటనలు ఈ ప్రాంత చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తాయి. అలాంటి ప్రాంతాన్ని రెండు ముక్కలు చేయడంతో ప్రజలు ఆవేదనకు గురయ్యారు. మళ్లీ ఒక్కటయ్యే అవకాశం రావడంతో ఈ సారి జనగామలో కలవాలనే పట్టుదలతో ఉద్యమ కార్యాచరణ ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నారు. ఉద్యమ కార్యాచరణకు సన్నద్ధం జనగామ జిల్లాలో చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి మండలాలను విలీనం చేయాలని అన్ని పార్టీల నాయకులు, మేధావులు, కవులు, కళాకారులు ఉద్యమ కార్యాచరణకు సన్నద్ధమవుతున్నారు. ఇందుకు చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన సమితి ప్రతినిధులు కాటం శ్రీధర్, తాడెం ప్రశాంత్, బిజ్జ రాము, రాచమల్ల శ్రీనివాస్, రాళ్లబండి భాస్కర్, కాటం శ్రీకాంత్, విజయ్, కిషన్, సత్తెయ్య ప్రసాద్ సోమవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. లోక్‌సభ నియోజక వర్గాల పరిధిలోని మండలాలను ఒకే జిల్లాలో కలపాలి, చేర్యాలను రెవెన్యూ డివిజన్‌తో పాటు నియోజక వర్గ కేంద్రంగా చేసి పూర్వవైభవాన్ని తీసుకురావాలని తీర్మానించుకున్నారు. జనగామ నియోజకవర్గంలో కొనసా గుతూనే జిల్లాపరంగా సిద్దిపేటలో కలిసి గజ్వేల్, హుస్నాబాద్, సిద్దిపేటకు పనుల నిమిత్తం తిరుగుతూ అష్టకష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మద్దూరు మండల పరిస్థితి మరీ అధ్వానం. ఇక్కడి ప్రజలు రెవెన్యూ, వ్యవసాయం, విద్యుత్, రిజిస్ట్రేషన్ ఇలా ఏ పని కావాలన్నా మూడు నియోజకవర్గాల పరిధిలోకి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో జిల్లాల పునర్విభజన సమయం నుంచే మద్దూరువాసులు జనగామలో కలపాలని కొట్లాట చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల అండతో.. మూడు మండలాలను జనగామ జిల్లాలో విలీనం చేసేందుకు ప్రజాప్రతినిధులతో కలిసి ఉద్యమ కార్యాచరణ రూపొందించాలనే ఆలోచనలో అక్క డి రాజకీయ పార్టీలు, ఉద్యమకారులు ఉన్నట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీతో పాటు ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌లను కలుపుకుని ప్రజల అభిప్రాయాలను సీఎం కేసీఆర్‌కు వివరిం చేలా ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ నియోజక వర్గాల డీలిమిటేషన్ ప్రక్రియ మొదలు కాక ముం దే సిద్దిపేట జిల్లాలో ఉన్న మూడు మండలాలను జనగామలో కలిపేందుకు ప్రభుత్వం నుంచి సంకేతాలు వచ్చేలా ఒత్తిడి తీసుకురావాలనే సంకల్పంతో ఉన్నట్లు అనుకుంటున్నారు. -
తల్లీకూతురును కలిపిన వాట్సాప్
యాదగిరిగుట్ట: తప్పి పోయిన బాలికను తల్లి ఒడికి చేర్చింది వాట్సాప్. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన అక్షిత అనే విద్యార్థిని శుక్రవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. తల్లి నిర్మల మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చి చూడగా కూతురు కనిపించలేదు. కంగారు పడిన తల్లి.. అక్షితకు స్కూల్లో చదువు చెప్పిన అమ్మఒడి అనాథ ఆశ్రమ నిర్వాహకురాలు జెల్లా దివ్యకు తెలిపింది. వెంటనే ఆమె భర్త జెల్లా శంకర్‌కు అక్షిత ఫొటో, వివరాలతోపాటు తప్పిపోయిన సమాచారాన్ని తెలిపింది. ఆయన అమ్మఒడి అనాథ ఆశ్రమం వాట్సాప్ గ్రూప్‌లతోపాటు వివిధ గ్రూప్‌లలో పెట్టారు. దీంతో అక్షిత గుంటూరు జిల్లా కేంద్రం లో ఉందని, పోలీసులకు అప్పగించామని స్థానికులు.. ఆశ్రమ నిర్వాహకులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. బాలికలను పోలీసులు గుంటూరులోని సీడబ్ల్యూసీ కేంద్రానికి తరలించారు. శనివారం ఉదయం అక్షిత తల్లి నిర్మల, అమ్మఒడి ఆశ్రమ నిర్వాహకులు గుంటూరుకు వెళ్లి బాలికను తీసుకువచ్చారు. -
నా బిడ్డను భర్తే చంపేశాడు..
జనగామ : అదనపు కట్నం కోసం నా బిడ్డను అత్తింటి వారు వేధిస్తే.. వ్యవసాయ బావి వద్దకు తీసుకు వెళ్లి భర్త కడతేర్చారని మృతురాలి తల్లిదండ్రులు భూషణబోయిన కనకయ్య, కనకవ్వ ఆరోపించారు. జనగామ మండలం వెంకిర్యాల గ్రామంలో ఈ నెల 28న అనుమానాస్పద స్థితిలో దుర్గం మమత అలియాస్ కీర్తన మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై సోమవారం సీఐ మాట్లాడుతూ మార్చి 31న వెంకిర్యాల గ్రామానికి చెందిన దుర్గం పరుశరాములతో మమతను ఇచ్చి వివాహం జరిపించారు. వివాహం సమయంలో రూ.5.30లక్షల కట్నం, 3 తులాల బంగారం, 22 తులాల వెండి ఆభరణాలు ఇచ్చారు. వివాహం జరిగిన కొద్ది రోజులకే ద్విచక్రవాహనం కావాలని భర్త వేధిస్తే.. అత్త లక్ష్మి, మామ బాలయ్య, మరిది నర్సింహులు అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేశారని మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు. ఉగాది పండగ రోజున మమత భర్తతో కలిసి పుట్టింటికి వెళ్లగా, మొపైడ్ వాహనం కొనిచ్చే ఆర్థిక స్థోమత లేదని అల్లున్ని వేడుకుని.. రూ.30 వేలు నగదును అందజేశారు. ఈ క్రమంలో ఈనెల 28న భర్తతో కలిసి తమ వ్యవసాయ బావి వద్ద కుక్కలకు భోజనం పెట్టేందుకు మమత వెళ్లింది. అక్కడ ఏం జరిగిం దో తెలియదు కానీ.. బావిలో పడి మమత శవమై తేలింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. ఇన్చార్జి ఏసీపీ వెంకటేశ్వరబాబు కేసు విషయమై విచారణ చేస్తుండగా, జనగామ తహసీల్దార్ రవీందర్ శవపంచనామా చేసిన అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సర్పంచ్ కీర్తి లక్ష్మినర్సయ్యతో పాటు పలువురు పోలీసుల విచారణలో పాల్గొన్నారు. -
అమ్మో.. ఎలుగుబంటి..!
సాక్షి, జనగామ: అది జనగామ జిల్లా కేంద్రంలోని డీసీపీ కార్యాలయం.. సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయం.. కార్యాలయం సమీపంలో ఓ నల్లటి ఆకారం... ఏదో జంతువు మాదిరిగా అటూ ఇటూ తిరుగుతోంది.. అది గమనించిన కొంత మంది యువకులు దగ్గరగా వెళ్లి చూస్తే ఎలుగుబంటి.. వారు భయభయంగానే దానిని తరిమివేసేందుకు ప్రయత్నించారు.. అది నేరుగా ఆర్టీసీ డిపోలో చొరబడి ఓ చెట్టెక్కి కూర్చొంది. విషయం తెలుసుకున్న ఆర్టీసీ, పోలీసు, అటవీశాఖల అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఎలుగుబంటి కిందకు దిగే ప్రయత్నం చేయడంతో చెట్టుచుట్టూ ముళ్లకంపను వేశారు. పెద్ద ఎత్తున జనాలు గుమిగూడటంతో అది మరింత పైకి వెళ్లింది. చివరకు నాలుగు మత్తు ఇంజక్షన్లు ఇచ్చిన అధికారులు ఎలాగోలా భల్లూకాన్ని బంధించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఎలా వచ్చింది... చంపక్‌హిల్స్ ప్రాంతంలో సంచరిస్తున్న ఎలుగుబంటి పసరమడ్ల, శామీర్‌పేట గ్రామాల మీదుగా 2.30 గంటలకు జనగామ పట్టణానికి చేరుకుంది. రోడ్డుపై వస్తున్న ఎలుగుబంటిని చూసిన కొమురవెల్లి స్పెషల్ ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రయాణికులతో పాటు ఆయా గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. డీసీసీ కార్యాలయం సమీపంలోని కుర్మవాడలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఎలుగుబంటిని ఆ సమయంలో అక్కడే ఉన్న పలువురు యువకులు కర్రలతో బెదిరించారు. దీంతో అది పరుగులు పెడుతూ ఆర్టీసీ బస్ డిపోలోకి చొరబడింది. గుడ్డేలుగును చూసి అందులో ఉన్న పలువురు సిబ్బంది లగెత్తారు. డిపోలోని ప్రహరీ పక్కనే వరంగల్ రోడ్డును ఆనుకుని ఉన్న ఓ చెట్టుపైకి ఎక్కింది. 6 గంటలకు పారెస్ట్ అధికారులకుసమాచారం.. ఉదయం ఆరు గంటల సమయంలో ఫారెస్ట్ అధికారులకు గుడ్డేలుగు వచ్చిన సమాచారాన్ని అధికారులు అందించారు. మత్తుమందు.. డాక్టర్.. రెస్క్యూ టీం.. బోను.. వలలను వెంట బెట్టుకుని తొమ్మిది గంటలకు జనగామకు చేరుకున్నారు. జూసంరక్షణ పశువైద్యాధికారి ప్రవీణ్ కుమార్ గన్ సహాయంతో వరుసగా రెండుసార్లు మత్తు ఇంజక్షన్లు ఇచ్చారు. పదిహేను నిమిషాల తర్వాత కూడా గుడ్డేలుగు స్పృహలోనే ఉండడంతో.. మరో మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. ఇరవై నిమిషాలు నిరీక్షించినా.. గుడ్డేలుగు కొంతమేర తప్పటడుగులు వేసినా.. మరుక్షణమే తేరుకుంది. అప్పటికే డిపో లోపలి భాగంతో పాటు వరంగల్ హైవే పై చెట్టుకు రెండు వైపులా వలలు వేసి సిద్ధంగా ఉంచారు. చెట్టు పై నుంచి కిందకు ఎంతకూ రాకపోవడంతో గుడ్డేలుగును కర్రల సహాయంతో కిందకు నెట్టేసే ప్రయత్నం చేయడంతో.. వారిపైకి వచ్చే ప్రయత్నం చేసి.. మళ్లీ పైకి వెళ్లింది. ఇరవై నిమిషాల తర్వాత మెళ్లగా చెట్టు దిగే ప్రయత్నంలో వలలో పడేలా శతవిధాలా ప్రయత్నం చేశారు. చెట్టుపై నుంచి బస్‌డిపో గోడపై ఉన్న ఫెన్సింగ్ తీగలను చొచ్చుకుని..అందులో ప్రవేశించింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఫారెస్ట్ సిబ్బందితో పాటు ఆర్టీసీ సివిల్ ఇంజినీర్ బాబాపైకి గుడ్డేలుగు పరుగులు పెట్టడంతో వణికిపోయారు. తప్పించుకుందామనుకునే లోపే... గుడ్డేలుగు వారి పైకి వచ్చేసినంత పని చేసింది. ఆ సమయంలోనే అక్కడే న్న రోడ్డు రోలర్‌కు గుడ్డేలుగు బలంగా తాకడంతో... వారు తృటిలో ప్రా ణాపాయం నుంచి తప్పించుకున్నారు. స్వల్ప గా యంతో ఇబ్బందులు పడ్డ గుడ్డేలుగు.. డిపోలోని సిబ్బంది రెస్ట్ తీసుకునే గది వెనకకు వచ్చి చేరింది. వలతో అటవీశాఖ సిబ్బంది పట్టుకున్నారు. గంటన్నర పాటు ముప్పు తిప్పలు.. డిపోలో చొరబడ్డ గుడ్డేలుగును పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ముప్పుతిప్పలు పడ్డారు. మూడు మత్తు ఇంజక్షన్లు ఇచ్చినా.. అటు వైపు వెళ్లిన వారిపైకి వచ్చేందుకు ప్రయత్నించిం ది. ప్రహరీ దూకి భవానీనగర్ వైపు వెళ్లేందుకు ఒకటికి రెండు సార్లు ప్రయత్నించి విఫలమైంది. గుడ్డేలుగును పట్టుకునే విజువల్స్‌ను కవరేజ్ చేస్తున్న మీడియాపైకి సైతం రంకెలు వేయడంతో పరుగులు పెట్టారు. రెండుసార్లు వలలో చిక్కినట్టే చిక్కుకుని.. సంకెళ్లను తెంపుకుని బయటకు వచ్చింది. అతికష్టం మీద...11.05 నిమిషాలకు గుడ్డేలుగును పట్టుకుని.. బోనులో బంధించారు. అనంతరం మత్తు ఇంజక్షన్లు ఇచ్చిన ప్రదేశంలో.. ప్రాథమిక పరీక్షలు చేసి...ఏటూరునాగారం– తాడ్వాయి అటవీ ప్రాంతానికి తరలించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వరంగల్ అర్బన్, జనగామ జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ రామలింగం పర్యవేక్షించగా, ఎఫ్ఆర్ఓలు శ్రీనివాస్‌కుమార్, మంగీలాల్ రేంజ్ ఆఫీసర్ పున్నంచందర్, కంపౌండర్ ఆకేష్, రిస్క్ టీం నాగేశ్వరావు, స్వామి, క్రిష్ణ ఉన్నారు. అడవిలో ఆహారం లేకనే అడవులు అంతరించి పోతుండడంతో మూగ జీవాలు జనావాసాల్లోకి వస్తున్నాయని డీఎఫ్ఓ రామలింగం అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ సుమారు 12 సంవత్సరాల వయస్సు కలిగి.. 80 కేజీలు ఉంటుందన్నారు. అడవుల్లో తాగునీటి కొరత లేకుండా సాసర్ కుండీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలాంటి గాయాలు లేకుండా.. యాక్టివ్‌గా ఉండడంతో.. జనావాసాలు లేని తాడ్వాయి– ఏటూరునాగారం అటవీ ప్రాంతంలో వదిలి పెడతామన్నారు. చెట్టు పైనుంచి సురక్షితంగా కిందకు దింపేందుకే సమయం ఎక్కువగా తీసుకున్నామన్నారు. -డీఎఫ్ఓ రామలింగం -
తటస్థులే ‘కీ’లకం
సాక్షి, జనగామ: లోక్‌సభ ఎన్నికల సైరన్ మోగడంతో విజయంపై ఎవరికి వారే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల విజయోత్సవంతో గులాబీ దళం ఒకడుగు ముందుకు వేస్తుండగా.. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని మిగతా పార్టీలు కిందస్థాయి నుంచి కసరత్తు మొదలు పెట్టాయి. నామినేషన్ల ప్రక్రియ షెడ్యూల్ కోసం మరో రెండు రోజుల గడువు ఉండడంతో వ్యూహాలకు పదును పెడుతున్నారు. నామినేషన్ల పర్వం మొదలు కాకముందే ఎవరికి వారే తమ ప్రత్యర్థుల కదలికలను గమణిస్తున్నారు. గ్రామాల వారీగా చేరికలకు శ్రీకారం చుడుతూ ముఖ్యులపై కన్నేస్తున్నారు. తటస్థ ఓటర్లను ఆకర్షించేందుకు ఇప్పటి నుంచే ఎక్కువ సమయం కేటాయి స్తున్నారు. పార్టీలకు సంబంధం లేని ఓటర్ల హృదయాలను గెలుచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 6,96,535 లక్షల ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళలు 3,48,301, పురుషులు 3,48,222, ఇతరులు 12 మంది ఉన్నారు. ప్రముఖులతో కాంటాక్టు.... లోక్‌సభ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, బీజేపీ తలపడనున్నాయి. భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న జనగామ నియోజక వర్గంతో పాటు వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో ‘ఎంపీ’ ఎలక్షన్ల వేడి మొదలైంది. ఆయా నియోజక వర్గాల పరిధిలోని మండల, జిల్లా నాయకులతో పాటు ఎమ్మెల్యేలు విశ్రాంత ఉద్యోగులు, ఆయా వర్గాల్లోని వ్యాపారులు, యువకులు, ఉద్యోగులతో పాటు పార్టీలకు అతీతంగా తటస్థంగా ఉన్న ఓటర్లపై కన్నేశారు. ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకంగా మారడంతో ఒక్కరిని కూడా వదిలిపెట్టడం లేదు. ఆయా గ్రామాల్లో ప్రముఖులను కలుస్తూ అన్ని వర్గాల ప్రజల ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఫోన్లో అప్యాయంగా పలకరిస్తూ... నామినేషన్ల సమయం దగ్గర పడుతుండడంతో...గ్రామాల్లోని ద్వితీయ శ్రేణి నాయకులను దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్లో ఆప్యాయంగా పలకరిస్తూ... పార్టీ సంగతుల గురించి వాకబు చేస్తున్నారు. పట్నంపై నజర్.. ఇతర ప్రాంతాలకు బతుకు దెరువు కోసం వెళ్లి... సొంత గ్రామాల్లో ఓటు హక్కు ఉన్న వారి వివరాలను సేకరిస్తున్నారు. వీరంగా ఎన్నికల సమయంలో సొంత గ్రామాలకు వచ్చి.. ఓట్లు వేస్తారు. -
యమ టేస్టీ గురూ..
సాక్షి, జనగాం: తమిళనాడు నుంచి వ్యాపార నిమిత్తం వచ్చిన గణేష్ బృందం సభ్యులు తాటిబెల్లం విశిష్టతను తెలుపుతూ మార్కెట్లో విక్రయిస్తున్నారు. తాటిబెల్లం వల్ల శరీరంలోని వేడిని, వాతం, దగ్గును తొలగించడమే కాకుండా షుగర్ ఉన్నవారికి సైతం ఉపయోగపడేలా లవంగం, అల్లం, మిరియాలు, దనియాలు తాటిపానీయంలో కలిపి అచ్చుపోసి బట్టికి వేస్తారు. ఈ బెల్లాన్ని మందుల తయారీకి ఉపయోగిస్తారు. దీని ధర కిలో రూ.200. పెద్ద గడ్డల ధర కిలో రూ.150 పలుకుతోంది. తాటిబెల్లం బాగా టెస్టీగా ఉండడంతో పట్టణవాసులు పెద్దఎత్తున కొనుగోలుకు ఆసక్తి కనబర్చుతున్నారు. విక్రయానికి సిద్ధం చేసిన తాటిబెల్లం సాదా తాటిబెల్లం -
అపెండెక్స్ ఆపరేషన్ కోసం వస్తే..
జనగామ: అపెండెక్స్ నొప్పితో ఓ యువకుడు జిల్లా ప్రధాన ఆస్పత్రికి వస్తే.. వైద్యుల నిర్లక్ష్యంతో.. నాలుగు గంటలపాటు బాధితుడు నిరీక్షించిన ఘటన గురువారం రాత్రి జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. లింగాలఘనపురం మండలం కుందారం గ్రామానికి చెందిన ఎం.ఆంజనేయులు, లక్ష్మిల కుమారుడు రాజు(17) అపెండెక్స్ నొప్పితో బాధపడుతుండడంతో మధ్యాహ్నం 3 గంటలకు జనగామలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరిశీలించి అపెండెక్స్‌గా గుర్తించి ఆపరేషన్ చేయాలని తల్లిదండ్రులకు వివరించారు. ఆర్థిక స్థోమత లేకపోవడంతో కుమారున్ని జిల్లా ప్రధాన ఆస్పత్రికి తీసుకు వచ్చారు. అనస్తిషియా(మత్తు డాక్టర్) వైద్యులు లేరు. వరంగల్ తీసుకు వెళ్లండి అంటూ వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సారూ.. పైసా లేదు.. కొడుకు నొప్పి తట్టుకోవడం లేదు..ఇక్కడే ఆపరేషన్ చేయాలని తల్లిదండ్రులు కాళ్లా వేళ్లా పడ్డా కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగడంతో పాటు ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ రఘు, కలెక్టర్ వినయ్‌క్రిష్ణారెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని.. సూపరింటెండెంట్‌ను ఆదేశించడంతో రాత్రి 7.30 గంటలకు ఆపరేషన్ ప్రారంభించారు. పేద కుటుంబాలకు చెందిన రోగులు ఆస్పత్రికి వస్తే.. నిర్లక్ష్యం చేయరాదని కలెక్టర్ మందలించినట్లు తెలిసింది. -
‘బీసీ’ల నారాజ్..!
సాక్షి, జనగామ: జెడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లలో ఒక్కో స్థానం మాత్రమే బీసీలకు దక్కాయి. జిల్లావ్యాప్తంగా 12 జెడ్పీటీసీ స్థానాల్లో బచ్చన్నపేట మాత్ర మే బీసీ మహిళకు కేటాయిం చారు. 12 ఎంపీపీ స్థానాల్లో బచ్చన్నపేట మాత్రమే బీసీలకు కేటాయించారు. రెండు మండలాల్లో నిల్.. జిల్లా వ్యాప్తంగా 140 ఎంపీటీసీ స్థానాల్లో బీసీలకు 18 మాత్రమే దక్కాయి. నర్మెట, కొడకండ్ల మండలాల్లో బీసీలకు ఒక్కస్థానం కూడా దక్కలేదు. నర్మెటలో ఏడు, కొడకండ్లలో తొమ్మిది ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఒక్కటి కూడా బీసీలకు దక్కలేదు. దీంతో ఈ రెండు మండలాల్లో బీసీలకు ప్రాతినిధ్యం లేకుం డాపోయింది. చిల్పూర్, రఘునాథపల్లి, దేవరుప్పుల, తరిగొప్పుల మండలాల్లో ఒక్కో స్థానం మాత్రమే బీసీలకు రిజర్వయ్యాయి. బచ్చన్నపేట మండలంలో మాత్రం బీసీలకు ఎక్కువ స్థానాలు దక్కాయి. బచ్చన్నపేటలో జెడ్పీటీసీ, ఎంపీపీ రెండు బీసీలకే దక్కాయి. అత్యధికంగా నాలుగు ఎంపీటీసీ స్థానాలు బీసీలకు దక్కడం విశేషం. బీసీలకు కేటాయించిన స్థానాలు బచ్చన్నపేట జెడ్పీటీసీ బీసీ మహిళ బచ్చన్నపేట ఎంపీపీ బీసీ మహిళ బీసీలకు కేటాయించిన ఎంపీటీసీ స్థానాలు.. చిల్పూర్ (బీసీ మహిళ) బచ్చన్నపేట–1(చిల్పూర్) (బీసీ జనరల్) కేశిరెడ్డిపల్లి(చిల్పూర్) (బీసీ జనరల్) కొన్నె(చిల్పూర్) (బీసీ మహిళ) లింగంపల్లి (చిల్పూర్) (బీసీ మహిళ) కోలుకొండ(దేవరుప్పుల) (బీసీ మహిళ) స్టేషన్ ఘన్పూర్–1(దేవరుప్పుల) (బీసీ జనరల్), ఇప్పగూడెం(దేవరుప్పుల) (బీసీ మహిళ) గానుపహాడ్(జనగామ) (బీసీ మహిళ) పెంబర్తి(జనగామ) (బీసీ జనరల్) నవాబుపేట(జనగామ) (బీసీ జనరల్) మాణిక్యపురం(జనగామ) (బీసీ మహిళ) జఫర్‌గఢ్–1(జనగామ) (బీసీ మహిళ) తమ్మడపల్లి (జి)(జనగామ) (బీసీ జనరల్) అబ్ధుల్నాగారం(తరిగొప్పుల) (బీసీ మహిళ) గబ్బెట(రఘునాథపల్లి) (బీసీ మహిళ) పాలకుర్తి–1(రఘునాథపల్లి) (బీసీ మహిళ) లక్ష్మీనారాయణపురం(రఘునాథపల్లి) (బీసీ జనరల్) నిరాశలో బీసీ నేతలు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో బీసీలకు రిజర్వేషన్లలో తక్కువ స్థానాలు రిజర్వు కావడంతో బీసీ నాయకులను నిరాశ పర్చింది. ప్రధాన పార్టీల్లో బీసీలు ద్వితీయ శ్రేణి నాయకులుగా రాణిస్తున్నారు. గ్రామ, మండల స్థాయిల్లో ప్రజాప్రతినిధులు ఎన్నికై ప్రజలకు సేవ చేద్దామని ఆలోచించిన బీసీ నాయకులకు రిజర్వేషన్ కలిసి రాకపోవడంతో ఆశ నిరాశగా మారింది. దీంతో మెజార్టీ బీసీ నాయకులు పోటీకి దూరం కావాల్సి రావడంతో నారాజ్ అవుతున్నారు. -
తరగతి గదిలో పేలిన సెల్‌ఫోన్ బ్యాటరీ
సాక్షి, రఘునాథపల్లి : సెల్‌ఫోన్ బ్యాటరీ పేలి ఓ విద్యార్థికి గాయాలయ్యాయి. ఈ సంఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం అశ్వారావుపల్లి ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మామిడాల శంకర్-లక్ష్మి దంపతుల కుమారుడు రాజు స్థానిక ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఎప్పటిలానే స్కూల్‌కు వచ్చాడు. గణితం టీచర్ సునీత పాఠం బోధిస్తున్న సమయంలో సెల్‌ఫోన్ బ్యాటరీ పెద్ద శబ్దంతో ఒక్కసారిగా పేలింది. దీంతో విద్యార్థి దవడ, ఛాతీ చేతికి గాయలయ్యాయి. గాయపడిన రాజును స్థానిక ఆర్ఎంపీ వద్ద ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సెల్‌ఫోన్ బ్యాటరీతో ఆడుతుండగా ప్రమాదం జరిగినట్లు పాఠశాల హెచ్ఎం నర్సింహారెడ్డి తెలిపారు. -
‘గులాబీ’ గూడుపై కసరత్తు
సాక్షి, జనగామ : గులాబీ గూడుపై టీఆర్ఎస్ శ్రేణులు కసరత్తు చేస్తున్నాయి. పార్టీ సైనికుల బాగోగుల గురించి ప్రారంభించబోతున్న కార్యాలయం నిర్మాణం కోసం విస్తృతంగా అన్వేషణ జరుగుతోంది. జిల్లా నలుమూలల నుంచి వచ్చే కేడర్‌కు అనువుగా ఉండే విధంగా కార్యాలయం నిర్మాణం ఉండాలనే ధ్యేయంగా ఆలోచనలు చేస్తున్నారు. మూడు నియోజకవర్గాల కార్యకర్తలకు కేంద్రంగా ఉండే స్థల సేకరణ కోసం ప్లాన్ చేస్తున్నారు. ఆరు నెలల్లోనే కార్యాలయం అందుబాటులోకి రావాలని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీ నేతలను ఆదేశించారు. త్వరగా స్థల సేకరణ చేసి కార్యాలయ నిర్మాణం చేపట్టాలని జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు సూచించారు. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ ఎన్నికైన తర్వాత తొలిసారిగా గత సంవత్సరం డిసెంబర్ 20న జిల్లాకు వచ్చారు. కార్యకర్తల ఆశీర్వదసభలో పాల్గొన్న కేటీఆర్ ప్రతి జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించబోతున్నామని ఇక్కడే ప్రకటించారు. జిల్లాలోనే తొలిసారిగా ప్రకటించడంతో త్వరగా కార్యాలయం నిర్మాణం చేయాలనే ఆలోచనతో ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతలు స్థల సేకరణపై దృష్టి పెట్టారు. పరిశీలనలో నాలుగు ప్రాంతాలు.. జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం నాలుగు ప్రాంతాలను పరిశీలించారు. టీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి, జిల్లా ఇన్చార్జి బాలమల్లుతో కలిసి జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. హైదరాబాద్ రోడ్డులోని ప్రస్తుత వన నర్సరీ సమీపంలోని కుమ్మరికుంట, చంపక్‌హిల్స్‌లోని ఎంసీహెచ్ ఆస్పత్రి పక్కన, హన్మకొండ రోడ్డులోని దయ నిలయం సమీపంలోని ప్రభుత్వ స్థలం, సూర్యాపేట రోడ్డులోని ప్రస్తుత కలెక్టరేట్ నిర్మాణం జరుగుతున్న వెనుక ప్రాంతాన్ని పరిశీలించారు. దయ నిలయం వైపే మొగ్గు.. పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం 4750 గజాల స్థలం(ఎకరం) కావాల్సి ఉంది. పార్కింగ్ స్థలంతోపాటు, రవాణా సౌకర్యం, పార్టీ కార్యక్రమాలకు అనువైన స్థలం ఉండే విధంగా చూస్తున్నారు. అయితే చంపక్‌హిల్స్‌లో పార్టీ కార్యాలయం నిర్మిస్తే కేవలం జనగామ నియోజకవర్గానికి మాత్రమే అనువుగా ఉంటుందని, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాలకు దూరంగాఉంటుందనే వాదనను పార్టీ నాయకులు తమ అభిప్రాయాలను చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో కుమ్మరికుంట, దయనిలయం సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలం అయితే బెటర్‌గా ఉంటుందని పార్టీ నాయకులకు వివరించారు. సూర్యాపేటరోడ్డులో అయితే అందరికీ అనుకూలంగా ఉన్నప్పటికీ కలెక్టరేట్ కోసం సేకరించిన స్థలం ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. స్థలంతోపాటు, పార్కింగ్, రవాణా సౌకర్యం పరంగా దయ నిలయం వెనుక ఉన్న స్థలంలోనే కార్యాలయం నిర్మిస్తే భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బంది ఉండదనే పార్టీ నేతలు చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. పక్కనే పోలీసు క్వార్టర్స్ ఉండడంతో సెక్యూరిటీ ప్రకారంగా ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. పెద్ద నాయకులు వస్తే ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా వన్‌వే ఉంటుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా దయ నిలయం పక్కనే ఉన్న స్థలాన్ని అంబేడ్కర్ భవన నిర్మాణం కోసం కేటాయించాలని దళిత సంఘాలు కోరుతున్నాయి. కలెక్టర్, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు సైతం అందిస్తున్నారు. పండుగ తర్వాత ఫైనల్.. జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం నిర్మాణం స్థలం ఖరారు సంక్రాంతి పండుగ తర్వాత ఫైనల్ చేసే అవకాశం ఉంది. స్థల సేకరణ పూర్తయితే వెంటనే నిర్మాణం చేపట్టే ఆలోచన చేస్తున్నారు. జూన్ 2 రాష్ట్ర అవతరణ నా టికి కార్యాలయం అందుబాటులోకి తీసుకువచ్చే అవకా శం ఉందని పార్టీ నాయకుడొకరు వివరించారు. పార్టీ కా ర్యాలయం ఎక్కడ నిర్మిస్తారనే అంశం సొంత పార్టీ శ్రేణుల్లో కాకుండా రాజకీయవర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది. -
‘కాంగ్రెసోళ్లంత నెత్తిమీద దస్తీ వేసుకొని పోవాల్సిందే’
సాక్షి, జనగామ : కాంగ్రెస్ నాయకులు ఎంత తిరిగిన తెలంగాణ ప్రజలు వారిని నమ్మే పరిస్థితి లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.ఇక తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నెత్తి మీద దస్తీ వేసుకోని పోవడమే తప్పా చేసేదేమి లేదని ఎద్దేవా చేశారు. గురువారం జనగామలో ఏర్పాటు చేసిన కార్యకర్తల ఆశీర్వాద సభలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశారని కొనియాడారు. టీఆర్ఎస్ పుట్టుక ఓ చరిత్ర అని, 14 ఏళ్లు పోరాడి కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తల కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి వరంగలే కీలకపాత్ర పోషించిందని గుర్తుచేశారు. జనగామ నుంచి ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లా నుంచి ఒకరికైనా మంత్రి పదవి వచ్చేలా చూస్తామన్నారు. దేవాదుల ద్వారా త్వరలోనే జనగామలోని చెరువులన్నింటిని నింపి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యకర్తలే టీఆర్ఎస్కు బలం అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, బీజేపీని కాదని దేశం మొత్తం టీఆర్ఎస్ వైపు చూస్తుందన్నారు. కేసీఆర్ నాయకత్వం దేశానికే దిక్సూచిగా మారనుందని వివరించారు. పంచాయతీ, సొసైటీ, మున్సిపల్, ఎంపీల ఎన్నికల్లో బూత్ స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేస్తే అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 16ఎంపీ స్థానాలు గెలిచి ఢిల్లీని శాసిద్దామని కార్యకర్తలు వివరించారు. -
ఎన్నికల ‘హవా’లా!
సాక్షి, జనగామ: ఎన్నికలకు మరో రెండు రోజులే మిగిలి ఉండటంతో పంపిణీ నిమిత్తం డబ్బు విపరీతంగా రవాణా అవుతోంది. చిన్న నోట్లను తరలించడంలో ఇబ్బందులు ఉండటంతో రూ.500, రూ.2 వేల నోట్ల కట్టలను తరలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అక్రమ మార్గంలో వందల కోట్లు ఇక్కడికి రవాణా అవుతున్నాయి. ఏపీ అధికార పార్టీ తమ అభ్యర్థులతో పాటు కూటమి అభ్యర్థులను గెలిపించుకునేందుకు పెద్ద మొత్తంలో నగదు తరలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో హవాలా మార్గంలో తరలిస్తున్న రూ.5.80 కోట్లను మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో పాటు ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ డబ్బంతా కాంగ్రెస్, టీడీపీ నేతృత్వంలోని కూటమి అభ్యర్థులకు ఇవ్వడానికి తీసుకెళుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. జనగామ జిల్లా హైదరాబాద్–వరంగల్ 163వ జాతీయ రహదారిపై పెంబర్తి వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ వి.రవీందర్ మీడియాకు వెల్లడించారు. వెనుక సీటు కింద నోట్ల కట్టలు.. ‘హైదరాబాద్ నుంచి కారులో పెద్ద మొత్తంలో డబ్బు తరలిస్తున్నట్లు స్టేట్ ఇంటలీజెన్స్కు సమాచారం అందింది. కారు వివరాలు కూడా తెలియడంతో గూగుల్ మ్యాప్ ద్వారా సెర్చ్ చేశారు. మంగళవారం తెల్లవారుజామున ఆ కారు వరంగల్ దిశగా వెళుతున్నట్లు గుర్తించిన అధికా>రులు జనగామ పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో జనగామ జిల్లా పెంబర్తి చెక్‌పోస్టు వద్ద ఎస్సై శ్రీనివాస్ వాహనాల తనిఖీలు చేస్తుండగా, ఏపీ 37 సీకే 4985 నంబర్ షిప్టు డిజైర్ కారు వచ్చింది. అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులు, డ్రైవర్ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో వారిని విచారించారు. ఈ సమయంలో హైదరాబాద్ గోషామహల్‌కు చెందిన కీర్తి కుమార్ జైన్, రాజస్తాన్‌కు చెందిన డ్రైవర్ నవరాం, మహబూబాబాద్ జిల్లా కాన్వాయ్గూడెంకు చెందిన ముత్యం ప్రకాష్ కారులో ఉన్నారు. విచారణ సందర్భంగా కారులో డబ్బు ఉందని, వరంగల్‌కు తీసుకుపోతున్నామని చెప్పారు. కారులోని వెనుక సీట్ల కింద దాచిన నోట్ల కట్టలను పోలీసులు గుర్తించారు. కారును, అందులో ప్రయాణిస్తున్న వారిని జనగామ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎన్నికల అధికారులు, పోలీసుల సమక్షంలో కౌంటింగ్ మిషన్ల సాయంతో డబ్బును లెక్కించగా మొత్తం రూ.5,80,65,000 ఉన్నట్లు తేలిందని’ సీపీ చెప్పారు. ‘కూటమి’ అభ్యర్థులకు ఇవ్వడానికి.. ‘తనిఖీల్లో పట్టుబడిన డబ్బు కాంగ్రెస్, టీడీపీ నేతృత్వంలో ఏర్పడిన కూటమి అభ్యర్థులకు చెందినదిగా గుర్తించాం. కీర్తి కుమార్ జైన్ హైదరాబాద్‌లోని గోషామహల్ ఏరియాలో నివాసం ఉంటూ హవాలా మార్గం ద్వారా డబ్బును రవాణా చేస్తుంటాడు. ఎన్నికలు కావడంతో స్థానికంగా కొందరు డబ్బు కావాలని అతన్ని కోరారు. దీంతో హైదరాబాద్ నుంచి డబ్బు తీసుకొని వరంగల్ వస్తూ పెంబర్తి వద్ద పట్టుపడ్డారు. ఈ డబ్బులో ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వర్రావుకు రూ.1.5 కోట్లు, వరంగల్ తూర్పు కాంగ్రెస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్రకు రూ.2 కోట్లు, పరకాల కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ భర్త ఎమ్మెల్సీ కొండా మురళీకి రూ. 2.3 కోట్లు ఇవ్వడానికి తీసుకువెళుతున్నట్లు చెప్పారు. మొత్తం డబ్బు రూ.5,80,65,000లతో పాటు కారును స్వాధీనం చేసుకొని ప్రధాన నిందితుడు కీర్తి కుమార్ జైన్, డ్రైవర్లు నవరాం, ముత్యం ప్రకాశ్‌ను అరెస్టు చేసి కోర్టుకు తరలించాం. కారు కీర్తి కుమార్ జైన్ సోదరుడు ప్రవీణ్‌కుమార్ జైన్ భార్య సుమిత్రా జైన్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. కోట్లలో డబ్బు పట్టుబడటంతో పూర్తిస్థాయి విచారణ కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడీ)కు అప్పగించే అవకాశాలున్నాయని’ రవీందర్ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సీపీతో పాటు డీసీపీ శ్రీనివాసరెడ్డి, సీఐ ముష్క శ్రీనివాస్, ఎస్సై శ్రీనివాస్ పాల్గొన్నారు. అన్నీ పెద్ద నోట్ల కట్టలే.. పట్టుబడిన నగదులో అన్నీ రూ.2000, రూ.500 నోట్ల కట్టలే ఉన్నాయి. 2000 నోట్లు 20,051 ఉండగా, వాటి విలువ రూ.4,01,02,000. 500 నోట్లు 35,926 ఉండగా, వాటి విలువ రూ.1,79,63,000. తెల్లవారుజామున 5 గంటలకు నగదును లెక్కింపు ప్రారంభించగా ఉదయం 11 గంటలకు పూర్తయింది. నోట్లను లెక్కించడానికే ఆరు గంటల సమయం పట్టడం గమనార్హం. పట్టుకున్న నగదులో నకిలీ రెండు వేల నోటును కూడా గుర్తించారు. భారీ నగదులో నకిలీ నోటు రావడం అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఏపీ నుంచి తెలంగాణకు.... కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ నుంచి డబ్బు ప్రవాహం కట్టలు తెంచుకుంది. కాంగ్రెస్‌తో కలసి ప్రజాకూటమి ఏర్పాటు చేసిన టీడీపీ.. తమ అభ్యర్థులకు ఏపీ నుంచి ఆర్థిక వనరులను సమకూర్చుతోందని పోలీసులకు పట్టుబడుతున్న డబ్బు సంచులు చెబుతున్నాయి. పెంబర్తి చెక్‌పోస్టు వద్ద పట్టుబడ్డ రూ.5.80 కోట్లు ఏపీ నుంచి వచ్చిన కారులోనే లభించడం విశేషం. కీర్తి కుమార్ జైన్ కూడా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంనకు చెందిన వ్యాపారి కావడం గమనార్హం. పాలకొల్లు పక్కనే ఉన్న నరసాపురం కేంద్రంగా పెద్ద ఎత్తున హవాలా వ్యాపారం సాగుతూ ఉంటుంది. కారు పాలకొల్లుకు చెందినది కావడంతో ఏపీకి చెందిన అధికార పార్టీ నేతలే ఇలా హవాలా రూపంలో పెద్ద మొత్తం తరలించే ఏర్పాట్లు చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. కాగా కీర్తికుమార్ జైన్ గతంలో అనేక సందర్భాల్లో డబ్బుతో పట్టుబడ్డాడు. 2014 ఎన్నికల్లో భీమవరంలో అత్యధిక మొత్తం దొరికిన సొమ్ము కీర్తికుమార్‌కు చెందినదేనని అప్పట్లో విచారణ జరిపారు. అదే ఎన్నికల్లో ఒక అధికార అభ్యర్థి తమ అధిష్టానానికి ఇదే హవాలా వ్యాపారి ద్వారా రూ.5 కోట్లు ఎన్నికల ఫండ్ పంపిన తర్వాతే సీటు వచ్చిందన్న ప్రచారం ఉంది. కృష్ణా, గోదావరి నదుల గట్టుదాటి.. ఏపీ నుంచి తెలంగాణకు డబ్బు రవాణాకు జలమార్గాన్ని మేలైన మార్గంగా ఎంచుకున్నారనేది విశ్వసనీయ సమాచారం. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నడుమ ఉన్న కృష్ణా, గోదావరి నదులు దాటితే ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి చేరుకోవచ్చు. ఎక్కడికక్కడ డబ్బు తరలింపునకు వీలవుతుంది. ఎవరికీ అనుమానం రాకుండా నాటు పడవల ద్వారా డబ్బు సంచులు చేరవేస్తున్నారని ఓ నిఘా అధికారి విశ్లేషించారు. మరోవైపు ప్రతిరోజూ ఏపీ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వందలాది ఇసుక లారీలు, కార్లు, ఇతర వాహనాల సీట్లు, బాడీ కింద అరల్లోను, పాలవ్యాన్లు, ఇతర వాహనాల్లోను నోట్ల కట్టలను సునాయాసంగా తరలిస్తున్నారని, ఇందుకు తమకు అనుకూలురైన అధికారులను ఎక్కడికక్కడ సెట్ చేసుకున్నారని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ముందుగానే ఎంపిక చేసుకున్న వాహనాలను ఎవరూ తనిఖీ చేయకుండా ఏపీలోని చెక్‌పోస్టులకు మౌఖిక ఆదేశాలిచ్చినట్టు కూడా పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. అశ్వారావుపేట నుంచి ఏపీలో కలిసిన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల నుంచి, మరోవైపు జీలుగుమిల్లి, చింతలపూడి మండలాల సరిహద్దుల నుంచి డబ్బు, పెద్ద ఎత్తున మద్యం నిల్వలు తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
రేవంత్ అరెస్ట్ అప్రజాస్వామికం: పొన్నాల
జనగామ: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికమని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. విలేకరులతో పొన్నాల మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని బలవంతంగా అరెస్ట్ చేయడాన్ని తప్పుబట్టారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంత పాలనలో ఉన్నామా అనిపిస్తోందని చెప్పారు. జాతీయ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌పై ఇలా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందన్నారు. పోలీసులు సంయమనం పాటిస్తే బాగుండేదన్నారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. రేవంత్‌ను కట్టడి చేయడానికే ఈ కుట్ర జరిగిందని, కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై ఇలాంటి అప్రజాస్వామిక విధానాలు అనుసరిస్తున్నాయని విమర్శించారు. -
బావిలో నెట్టేసి బాలికపై అత్యాచారయత్నం
జఫర్‌గఢ్ (స్టేషన్‌ఘన్‌పూర్): ఇంటి ముందు నిల్చున్న ఓ బాలికను పక్కింటి యువకుడు బలవంతంగా ఎత్తుకెళ్లి సమీపంలోని పాడుబడిన వ్యవసాయ బావిలో పడేశాడు. అతడు కూడా అందులో దూకి అత్యాచారానికి యత్నించాడు. బాలిక అరుపులు విన్న స్థానికులు ఆమెను రక్షించారు. ఈ ఘటన జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన బాలిక (17) హన్మకొండలోని ఓ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. దసరా సెలవులు కావడంతో రెండు రోజుల క్రితమే ఇంటికి వచ్చింది. ఆమె మధ్యాహ్నం ఇంటి ముందు నిల్చొని ఉండగా గమనించిన పక్కింటి యువకుడు కేశోజు రాజేష్‌చారి (23) వచ్చి ఆమెను బలవంతంగా ఎత్తుకుని రోడ్డు అవతలకు వెళ్తుండగా బాలిక పెద్ద పెట్టున కేకలు వేసింది. స్థానికులు విని వస్తుండగా రాజేష్‌చారి ఆ బాలికను సమీపంలోని పాడుబడిన బావిలో పడేశాడు. అతడు కూడా బావిలో దూకాడు. బాలిక తల, కాళ్లకు గాయాలైనప్పటికీ ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. అప్పటికే బావి వద్దకు చేరుకున్న స్థానికులు పైనుంచి అతడిని బెదిరించి బాలికను తాళ్ల సాయంతో పైకి లాగారు. గాయపడిన బాలికను వెంటనే 108లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని ఆస్పత్రికి తరలించే క్రమంలో గ్రామస్తులు అడ్డుకుని వాగ్వాదానికిదిగారు. -
కరువు నేలకు కల్పతరువు
సాక్షి, సిద్దిపేట : రాష్ట్రంలోనే అత్యంత కరువు పీడిత ప్రాంతాలు జనగామ, సిద్దిపేట జిల్లాలకు తపాస్‌పల్లి రిజర్వాయర్ కల్పతరువుగా మారింది. ఈ జిల్లాల్లోని బీడు భూములకు దేవాదుల ఎత్తిపోతల ద్వారా సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం తపాస్‌పల్లి వద్ద రిజర్వాయర్‌లో నీటిని ఎత్తిపోసి సాగునీరు అందిస్తున్నారు. 54 చెరువులకు ఆధారం.. దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి ఏటా సిద్దిపేట, జనగామ జిల్లాల్లోని కొమురవెల్లి, చేర్యాల, మద్దూరు, బచ్చన్నపేట, కొండపాక మండలాల్లోని సుమారు 54 చెరువులను నింపుతున్నారు. ఈ రిజర్వాయర్ సామర్థ్యం 0.3 టీఎంసీ కాగా, మరో 1.2 టీఎంసీలను గోదావరి జలాలతో ఈ 5 మండలాల్లోని చెరువులకు తరలిస్తున్నారు. గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లకు తాగునీటి కోసం కొమురవెల్లిలోని 13 చెరువులు, చేర్యాలలో 8, మద్దూరులో 1, కొండపాకలో 7 చెరువులు, బచ్చన్నపేటలోని 25 చెరువులు నింపారు. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి మరిన్ని చెరువులను నింపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కృషితో... సముద్ర మట్టానికి 500 మీటర్ల ఎత్తులో ఉన్న సిద్దిపేట ప్రాంతానికి గోదావరి జలాలు తరలించాలంటే ఎత్తిపోతలే మార్గం.. దీన్ని గుర్తించిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా 2007లో తపాస్‌పల్లి ఎత్తిపోతల పనులకు శ్రీకారం చుట్టారు. 65 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో దీని నిర్మాణం చేపట్టారు. వైఎస్సార్ హయాం తర్వాత పెద్దగా పనులు జరగలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్, నీటి పారుదల మంత్రి హరీశ్‌రావుల సహకారంతో ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. దీంతో ఈ రిజర్వాయర్ కింద 82,500 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. 25 శాతం పనులు పెండింగ్‌లోనే... 2007లో ప్రారంభించిన తపాస్‌పల్లి రిజర్వాయర్ నిర్మాణంలో ఇప్పటికీ 75 శాతం పనులే మాత్రమే పూర్తయ్యాయి. మరో 25 శాతం పనులు పెండింగ్‌లో ఉన్నాయి. కష్టాలు తీరాయి.. గోదావరి జలాలతో తపాస్‌పల్లి రిజర్వా యర్‌ను నింపి, తద్వార చెరువులు నింపడంతో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో కరువు ప్రాంతమైన సాగుకు అనుకూలమైంది. ఏటా చెరువులు నింపడంతో వ్యవసాయం చేయడానికి నీళ్ల కష్టం తొలగిపోయింది. ఇప్పుడు రైతులు సంతోషంగా ఉన్నారు. – మెరుగు క్రిష్ణ , రైతు ఐనాపూరు కాల్వల నిర్మాణం పూర్తి చేయాలి రిజర్వాయర్ ఎడమ, కుడి కాల్వలు, ఉపకాల్వలను పూర్తిచేసి సాగునీరు అందించాలి. మెయిన్ కాల్వలు పూర్తయినా నిరుపయోగంగా ఉన్నాయి. వెంటనే కాల్వల నిర్మాణం పూర్తి చేసి పొలాలకు నీరందించాలి. – చెరుకు రమణారెడ్డి, ఐనాపూర్ -
కేసీఆర్‌పై పొన్నాల ఫైర్
జనగాం జిల్లా: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య తీవ్రంగా మండిపడ్డారు. జనగామలో విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అప్రజాస్వామిక పాలన కొనసాగించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. మీడియా సమక్షంలో ప్రజల ముందు కేసీఆర్ చర్చకు వచ్చే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లతో గెలిచి కేసీఆర్ తన ఫాంహౌజ్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన అప్రజాస్వామికమని, అవినీతిమయ పాలన అని ధ్వజమెత్తారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జగ్గారెడ్డిని అరెస్ట్ చేయించారని, రేవంత్ రెడ్డిని కూడా అక్రమంగా ఐటీ కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నయీం కేసు, లారీలలో ఉన్న డబ్బు, కాగితాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మియాపూర్ భూకుంభకోణం, అయ్యప్ప సొసైటీ కుంభకోణం కేసుల సంగతి ఏమైందని సూటిగా అడిగారు. తెలంగాణ హక్కులను మోదీ దగ్గర తాకట్టు పెట్టి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో భారీగా చేరికలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. -
ప్రజాభిప్రాయం మేరకే టికెట్లు..
సాక్షి, జనగామ : ముందస్తు ఎన్నికలకు సై అంటూ సంకేతాలు ఇస్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటనలతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మరోసారి అధికారమే టార్గెట్‌గా ముందుకు సాగుతున్న ‘గులాబీ’ బాస్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు కొత్త సంప్రదాయానికి తెరతీసినట్లుగా తెలుస్తోంది. నామినేషన్ల సమయంలోనే అభ్యర్థులను ప్రకటించే ఆనవాయితీకి స్వస్తి చెప్పి.. కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. ఎన్నికలకు ముందుగానే అభ్యర్థులను ప్రకటించి బరిలోకి దిగాలని యోచిస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీలో ముందస్తుగా అభ్యర్థుల ఎంపిక కోసం చేస్తున్న సన్నాహాలు రాజకీయంగా ఉత్కంఠను రేపుతున్నాయి. టికెట్ల ఖరారుకు రహస్య సర్వే.. టీఆర్ఎస్ పార్టీలో టికెట్ల ఖరారు కోసం ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రహస్యంగా సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై పలు దఫాలుగా సర్వేలు చేయించారు. ప్రజాప్రతినిధుల పనితీరు ఎలా ఉందనే కోణంలో సర్వేలు చేయించి బహిర్గత పర్చారు. ప్రస్తుతం ముందస్తు ఎన్నికల కోసం సిద్ధపడుతున్న కేసీఆర్ సమర్థులైన అభ్యర్థుల కోసం వేట ప్రారంభించినట్లుగా ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలతోపాటు ఆశావహుల పేర్లతో జాబితాను తయారు చేసి ప్రజల అభిప్రాయాన్ని రహస్యంగా సేకరిస్తున్నారు. సిట్టింగ్‌లకే సీట్లు అని చెప్పినప్పటికీ.. కొంతమంది ప్రజాప్రతినిధులపై అవినీతి ఆరోపణలు, ప్రజావ్యతిరేకత వంటి విమర్శలున్నాయి. దీంతో వారికి టికెట్లు ఇస్తే ఓడిపోతారనే ప్రచారం కారణంగా ఆశావహుల పేర్లతో కూడా సర్వే చేపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రజా మద్దతును బట్టే ఖరారు.. రహస్యంగా కొనసాగుతున్న సర్వే ఆధారంగానే రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలున్నాయి. జిల్లాలోని జనగామ, పాలకుర్తి, ఘన్పూర్ నియోజకవర్గాల్లో సర్వే ఫలితాలను బట్టే అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో సర్వేలో ప్రజలు ఎక్కువగా మద్దతు ఇచ్చే వారికే టికెట్ వరించే పరిస్థితి ఉంది. సిట్టింగ్‌లకు మద్దతు తెలపకపోతే కొత్త వారికి అవకాశాలు కల్పించే ఆలోచన జోరుగా ప్రచారం సాగుతోంది. మొత్తానికీ.. రహస్య సర్వే ఇటు సిట్టింగ్లలోను అటు ఆశావహుల్లోను టెన్షన్ పెట్టిస్తోంది. -
ఎమ్మెల్యే రాజయ్యతో ఎలాంటి విభేదాలు లేవు : కడియం
సాక్షి, జనగామ : తనకు రాజయ్యకు ఎలాంటి విభేదాలు లేవనీ, పార్టీ ఇచ్చిన అవకాశాన్ని మాత్రమే వినియోగిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ ఘన్‌పుర్ మండలంలోని తాటికొండ గ్రామంలోని నూతన పంచాయితీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్ని జన్మలెత్తినా స్టేషన్ ఘన్‌పుర్ ప్రజల రుణం తీర్చుకోలేనని అన్నారు. ఎవరికీ తలవంపులు తీసుకురాకుండా.. ఒక్క పైసా లంచం తీసుకోకుండా పనిచేస్తున్నానని అన్నారు. నియోజక వర్గ ప్రజల విశ్వాసాన్ని నిలబెడతానని, నాకు రాజయ్యకు ఎలాంటి విభేదాలు లేవనీ కలిసే పని చేస్తామని స్పష్టం చేశారు. ఆనాడు దేవాదుల ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చానని, ఈనాడు లింగంపల్లి రిజర్వాయర్ తీసుకొచ్చానని చెప్పుకొచ్చారు. వారంలోపే లింగంపల్లి రిజర్వాయర్ పనులకు టెండర్లు పిలిచి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. తాటికొండ, మీదికొండ, కొత్తపల్లి గ్రామాలకు 4వేల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు కాలువలు ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. తాటికొండ నుండి గండిరామరం మీదుగా నర్మెట వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తామని అన్నారు. నాలుగేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అందించారని, ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆడపిల్లలకు అనేక సంక్షేమ పథకాలను అందించారని కొనియాడారు. స్టేషన్ ఘన్పూర్ అభివృద్దికి నా సహాయసహాకారాలు ఉంటాయని చెబుతూనే.. రాజయ్య కోరిన జూనియర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటుపై దాట వేశారు. -
సెల్ టవర్ ఎక్కి ఆందోళన
-
సెల్ టవర్ ఎక్కి.. పరిహారం చెల్లించాలని
సాక్షి, జనగామ : వడ్లకొండ చంపక్ హిల్స్ ప్రాంతంలో ఉద్రిక్త వాతారణం ఏర్పడింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 400 కేవీ సబ్‌స్టేషన్ నిర్మిస్తోంది. అయితే పరిహారం ఇవ్వకుండా నిర్మాణాలు చేపడుతున్నారంటూ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. తీసుకున్న భూములకు తగిన పరిహారం ఇవ్వాలని సెల్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. -
వధువు అనైతిక సంబంధం.. వారిద్దరు అరెస్ట్
సాక్షి, వరంగల్, రఘునాథపల్లి: కాబోయే వరుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో వధువు అరుణ, ఆమె సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వరుసకు అన్నయ్య అయిన బాలస్వామితో కొనసాగించిన ప్రేమ వ్యవహారమే వరుడి హత్యాయత్నానికి దారి తీసిందని స్టేషన్ ఘణపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు గురువారం మీడియాకు తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే వధువు అరుణ, వరుడు యాకయ్యకు ఇంటి బయటకు రప్పించగా.. అప్రమత్తంగా ఉన్న బాలస్వామి వరుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు సమాచారం. అసలేం జరిగిందంటే.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన గొంగోళ్ల సామ్యేల్- యాదమ్మల కుమారుడు యాకయ్యకు మాదరం గ్రామానికి చెందిన అరుణతో ఈనెల 21న పెళ్లి చేయాలని ఇరువర్గాల కుటుంబసభ్యులు నిర్ణయించారు. వధువుకు మాత్రం ఈ వివాహం ఇష్టం లేదు. కారణం ఆమె గత మూడేళ్లుగా బాలస్వామితో ప్రేమలో ఉంది. కానీ, బాలస్వామి మరెవరో కాదు.. వధువుకు స్వయాన పెద్దమ్మ కొడుకు. పెళ్లిని ఆపేందుకు బాలస్వామితో కలిసి వధువు పథకం పన్నింది. మరోవైపు ఆదివారం 18 తేది నాడు కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసిన వరుడు కుటుంబం రాత్రి బంధువులతో హడావిడిలో ఉండగా వధువు అరుణ నుండి యాకయ్యకు ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ సిగ్నల్ సరిగా లేదని బయటకు మాట్లాడమని అరుణ చెప్పడంతో వరుడు యాకయ్య బయటకు వచ్చాడు. అప్పటికే మాటువేసిన బాలస్వామి ఒక్కసారిగా యాకయ్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కాలిన గాయాలతో ఉన్న యాకయ్యను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం అరుణ, బాలస్వామిలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వివరించారు. -
మురికి కాలువలో పసిపాప మృతదేహం
సాక్షి, జనగాం: కళ్లు తెరిచి వారం రోజులు కూడా కాలేదు. కానీ నిండు నూరేళ్లు నిండిపోయాయి.. కాదు కాదు నింపేశారు. ఎవరు చేశారో తెలీదు కాని ఈ ప్రపంచంలోకి వచ్చిన వారం రోజులకే ఆ పసిప్రాణాన్ని మురికి కాలువలో కలిపేశారు. వివరాల్లోకి వెళ్తే జనగామ జిల్లాలో మరో దారుణం జరిగింది. కళ్లు తెరిచి వారం రోజులు కాకుండానే రోజుల వయసున్న పసిపాప మృతదేహం మురికి కాలువలో కనిపించింది. పాప చేతికి ఉన్న ట్యాగ్‌పై నవనీత, నర్సింహులు అనే పేర్లు ఉన్నాయి. స్థానికులు ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నర్మెటలో భారీ అగ్నిప్రమాదం
నర్మెట(జనగామ) : ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించడంతో రెండు ఇళ్లు దగ్ధమైన సంఘటన సోమవారం మండల కేంద్రంలో సాయంత్రం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు రూ. 20 లక్షల ఆస్తినష్టం వాటిల్లునట్లు బాధితులు తెలిపారు. బాధితులు, చుట్టుపక్కల వారు తెలిపిన వివరాల ప్రకారం.. రైతు కందకట్ల చంద్రమౌళి భార్యతో కలిసి పండుగకు తన అత్తగారిల్లు అయిన వెల్దండకు వెళ్లాడు. మరో ఇంట్లో ఉన్న తల్లి లలిత తన పెద్ద కూతురుతో కలిసి గ్రామంలోనే ఉంటున్న చిన్న కూతురింటికి వెళ్లారు. అకస్మాత్తుగా ఇంట్లోంచి మంటలు రావడంతో గమనించిన చుట్టుపక్కల వారు మంటలార్పే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని యజమాని చంద్రమౌళికి, జనగామలోని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. పెంకుటిళ్లల్లో నిల్వ ఉంచిన సుమారు 40 క్వింటాళ్ల పత్తి, ఇతర సామగ్రి అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో టీవీలు, రిఫ్రిజిరేటర్, కూలర్, ఫ్యాన్లు, ధాన్యం, మక్కలు అమ్మగా వచ్చిన బీరువాలోని నగదు రూ.3.70 లక్షలు, 5 తు లాల బంగారు ఆభరణాలు, 12 క్వింటాళ్ల బియ్యం బస్తాలు దగ్ధమయ్యాయి. సమారు రూ. 20 లక్షలు నష్టం వాటిల్లిందని బాధితుడు రోదిస్తూ చెప్పాడు. విషయం తెలుసుకున్న ఏఎస్సై కాశిరెడ్డి సిబ్బందితో సోమవారం రాత్రి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. తహసీల్దార్ శ్రీపతి వెంకటేశం పంచనామా నిర్వహించారు. మంగళవారం సంఘటనా స్థలానికి చేరుకున్న జనగామ ఏసీపీ బాపురెడ్డి, క్లూస్ టీం, తరిగొప్పుల ఎస్సై రాజేష్‌నాయక్ బాధితులు, చుట్టుపక్కల వారి నుంచి వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుçపుతున్నట్లు పోలీసులు తెలిపారు. బాధిత కుటుంబాలకు పరామర్శ సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్ర నష్టం వాటిల్లిన కందకట్ల చంద్రమౌళి, లలిత, మాదాసు శ్రీలత కుటుంబాలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు కేవీఎల్ఎన్.రెడ్డి మంగళవారం పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి దరఖాస్తు చేసుకోవాలని, తమవంతు సహకారం అందిస్తామని బాధితులకు తెలిపారు. ఆయన వెంట నాయకులు రవి, సంపత్, సాయి, కరుణాకర్‌రెడ్డి, అనిల్‌కుమార్, ప్రసాద్, చంద్రారెడ్డి, శంకర్ తదితరులు ఉన్నారు. -
తేడా వస్తే.. తాట తీస్తారు
సాక్షి, జనగామ రాష్ట్రంలోనే తొలిసారిగా జనగామ జిల్లాలోని డ్వాక్రా మహిళా పొదుపు సంఘాల సభ్యులకు అధికారులు ఆత్మరక్షణపై శిక్షణ అందిస్తున్నారు. ఇంటాబయటా జరుగుతున్న దాడుల నుంచి రక్షణ పొందేందుకు మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తున్నారు. మెడలోంచి బంగారు ఆభరణాలను లాక్కెళ్లడం, అత్యాచార యత్నం, యాసిడ్, కత్తులతో దాడులు.. వంటి వాటి నుంచి సులువుగా బయటపడటంపై అవగాహన కల్పిస్తున్నారు. 15 రకాల టెక్నిక్లను నేర్పిస్తూ.. మహిళల్లో ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. గతంలో పాఠశాల, కళాశాల స్థాయి బాలికలకు సెల్ఫ్ డిఫెన్స్‌పై మార్షల్ ఆర్ట్స్‌ను నేర్పించారు. జనగామ కేంద్రంగా 2017 జనవరి 24న 13,686 మంది విద్యార్థినులతో ‘సంఘటిత సబల’ప్రదర్శనను నిర్వహించి గిన్నీస్ బుక్ రికార్డును నెలకొల్పారు. ఇప్పుడు అదే తరహాలో డ్వాక్రా సంఘాలకు మార్షల్ ఆర్ట్స్‌లో తర్ఫీదు ఇచ్చి మరో భారీ ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. శిక్షణ సాగుతోందిలా.. తాజాగా బదిలీ అయిన జిల్లా కలెక్టర్ అల్లమరాజు దేవసేన, డీఆర్డీవో మేకల జయచంద్రారెడ్డి.. డ్వాక్రా మహిళలకు కరాటే శిక్షణపై ఆలోచన చేశారు. డిసెంబర్ మొదటివారంలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకుని శిక్షణ బాధ్యతలను రాణి రుద్రమదేవి సెల్ఫ్‌డిఫెన్స్ అకాడమీకి అప్పగించారు. డీఆర్డీఓ, మండల సమాఖ్యల నుంచి ఖర్చులను భరించి ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. తొలి విడతలో గ్రామైక్య సంఘాలు(వీఓ)ల్లోని అధ్యక్ష, కార్యదర్శులకు, చురుగ్గా ఉండే మహిళలను ఎంపిక చేశారు. గత నెల 20 నుంచి 24 వరకు జిల్లాలోని బచ్చన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, లింగాలఘణపురం, నర్మెట, తరిగొప్పుల, రఘునాథపల్లి, దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి, చిల్పూరు, జఫర్‌గఢ్, గుండాల మండలాల్లో 1,884 మందికి శిక్షణ ఇచ్చారు. మండల కేంద్రాల్లో రెండ్రోజుల పాటు శిక్షణ పొందిన వీఓలు, మహిళలు గ్రామాల్లో మిగిలిన డ్వాక్రా సంఘాల సభ్యులకు శిక్షణ ఇస్తారు. జిల్లాలోని 210 గ్రామ పంచాయతీల పరి«ధిలో ఉన్న మహిళలకు మార్షల్ ఆర్ట్స్‌పై శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక రచించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ఈ నెలాఖరులో అన్ని గ్రామాల్లో ఒకేసారి 1,25,998 మంది మహిళలకు మార్షల్ ఆర్ట్స్‌పై శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆత్మవిశ్వాసం పెరిగింది ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే భయపడే రోజులు ఇవి. ఏ వైపు నుంచి ఓ ప్రమాదం వస్తుందో తెలియదు. అన్ని సమయాల్లో అందరు తోడుగా ఉంటారని చెప్పలేం. సెల్ఫ్ డిఫెన్స్‌పై శిక్షణ తీసుకున్నాక కొంత ధైర్యం వచ్చింది. మహిళల కోసం ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టడం ఆనందంగా ఉంది. –గొడిశాల సమత, దేవరుప్పుల -
భగ్గుమన్న భూకక్షలు.. ఒకరు మృతి
సాక్షి, పాలకుర్తి: రెండు కుటుంబాల మధ్య భూతగాదాలు భగ్గుమనడంతో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో జరిగింది. వివరాలివి.. వెంకటయ్య, రాజు అనే సోదరులపై బుధవారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన కొమురయ్యతో పాటు అతని సోదరులు ఐదుగురు గొడ్డళ్లతో దాడికి దిగారు. తీవ్రంగా గాయపడిన రాజు అక్కడిక్కడే మృతి చెందగా వెంకటయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ప్రధాన నిందితుడు కొమురయ్య, మరో ఐదుగురు పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. క్షతగాత్రుడిని జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
సాహసం.. కడుపుపై 1016 బైక్‌లు !
సాక్షి, జనగామ: పవన్ కల్యాణ్ మొదటి సినిమా అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయిలో చేతులపై కారులు పోవటం మనం చూశాం. అలాంటి సంఘటనే జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే కార్లు కాదండోయ్.. ఓ కరాటే మాస్టర్ తన కడుపుపై బైక్‌లు వెళ్లే సాహసానికి తలపెట్టారు. వివరాలివి.. జిల్లా కేంద్రంలోని సెయింట్ మెరీస్ ఉన్నత పాఠశాలలో ఎండీ అబ్బాస్ కరాటే మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. 1016 బైక్‌లను ఆయన తన కడుపు మీదుగా వెళ్లే సాహసానికి తలపెట్టారు. దాదాపుగా 18.44 నిమిషాల్లో 1016 బైకులు ఆయన పొట్టమీదుగా వెళ్లాయి. ప్రపంచ రికార్డు లక్ష్యంగా అబ్బాస్ ప్రదర్శన సాగింది. -
టీజేఏసీ నేతల అరెస్ట్.. జనగామలో ఉద్రిక్తత
జనగామ: అమరుల స్ఫూర్తి యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఆరో విడత అమరుల స్ఫూర్తి యాత్రలో భాగంగా శనివారం జనగామ జిల్లా కేంద్రంలో జరుగనున్న కోదండరాం పర్యటన నేపధ్యంలో శనివారం తెల్లవారుజామునే స్థానిక జేఏసీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. టీజేఏసి జిల్లా చైర్మన్ ఆకుల సతీష్ తో పాటు మరో 20మందిని అదుపులోకి తీసుకొని.. బచ్చన్నపేట, జనగామ, లింగాలఘన్పూర్, రఘునాధపల్లి, స్టేషన్ ఘన్ పూర్ పోలీస్టేషన్లకు తరలించారు. జేఏసీ నేతల ముందస్తు అరెస్ట్ ఫై ప్రొఫెసర్ కోదండరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. స్ఫూర్తి యాత్రకు నాలుగు రోజుల ముందే అనుమతి కోరినా.. అక్రమ అరెస్ట్‌లు చేయడం ప్రభుత్వ దమన కాండకు నిదర్శనమని జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జేఏసీ నాయకుల అరెస్ట్ తో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు జిల్లా వ్యాప్తంగా బందోబస్తు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 12గంటలకు కోదండరాం జనగామకు చేరుకుంటారని జేఏసీ నాయకులు చెబుతున్నారు. -
రాసలీలల్లో ఉండి రెడ్ హ్యాండెడ్‌గా బుక్కు
జనగామ: అతడు బాధ్యతగల ఉద్యోగి. పైగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. భార్యాపిల్లలు ఉన్నారు. కానీ, అతడు వక్రబుద్దితో మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఫలితంగా పచ్చని సంసారంలో సమస్యలు మొదలయ్యాయి. తాను ఎలాంటి తప్పు చేయడం లేదంటూ బుకాయిస్తూ వస్తున్న అతడి ఆట ఎట్టకేలకు ఆటకట్టయింది. రెడ్ హ్యాండెడ్‌గా అతడిని బంధువులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. రాజనర్సయ్య అనే వ్యక్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, అతడి భార్యాపిల్లలు ఉండగా మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంపై ఇన్ని రోజులపాటు బుకాయిస్తూ వస్తున్న అతడు పరాయి మహిళతో రాసలీలల్లో ఉండగా ఆయన బంధువులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. -
జిల్లా కేంద్రాల నుంచి రాజధానికి నేరుగా బస్సులు
జనగామ: జిల్లా కేంద్రాల నుంచి రాజధాని హైదరాబాద్‌కు నేరుగా బస్సులు నడుపుతామని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. జనగామలోని రవాణా శాఖ కార్యాలయంలో హరిత హారం కార్యక్రమంలో భాగంగా ఆయన మంగళవారం మొక్కలు నాటారు. జనగామ డిపోకు వజ్ర ఏసీ బస్సులు అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రజా రవాణా లేని 1200 గ్రామాలకు రోడ్లు వేసి బస్సులు నడుపుతామని చెప్పారు. ప్రజల సహకారంతో హరితహారం కార్యక్రమం సామాజిక ఉద్యమంలా సాగుతోందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలతోపాటు హరితహారం వంటి సీఎం కేసీఆర్ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఏ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, శాసనమండలిలో ప్రభుత్వ విప్ బోడికుంటి వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు. -
అలజడి రేపిన వింత ఘటన
పెంబర్తి: మానసికరోగి మాటలు నమ్మి స్థానికులు జాతీయ రహదారిని తవ్వేసిన వింత ఘటన జనగామ జిల్లా పెంబర్తిలో చోటుచేసుకుంది. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై కొంతమంది జేసీబీతో పెద్దగొయ్యి తవ్వారు. దీనిపై ఆరా తీసిన పోలీసులకు అవాక్కయ్యే నిజం తెలిసింది. ఇక్కడ శివలింగం ఉందని మనోజ్ అనే వ్యక్తి చెప్పడంతో గొయ్యి తవ్వినట్టు స్థానికులు తెలిపారు. తనకు శివుడు కలలో కనిపించి ఇక్కడ తవ్వమన్నాడని మనోజ్ చెప్పడం గమనార్హం. శివుడు తనను పూనినట్టుగా వింతగా ప్రవర్తిస్తుడటంతో స్థానికులు అతడి మాటలు నమ్మారు. తాను చెప్పినట్టు చేయకపోతే శివుడు శపిస్తాడని అతడు భయపెట్టాడు. దీంతో స్థానికులు జేసీబీ సహాయంతో 10 అడుగుల గుంతను తవ్వారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మనోజ్‌తో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. తాము గొయ్యి తవ్విన చోట కచ్చితంగా శివలింగం ఉందని మనోజ్ అంటున్నాడు. శివరాత్రి రోజునే ఇక్కడ తవ్వాలనుకున్నా కుదర్లేదని చెప్పాడు. గొయ్యి తవ్వడానికి స్థానిక రాజకీయ నేతలు సహకరించారని వెల్లడించారు. అయితే పిచ్చోడి మాటలు నమ్మి రోడ్డు తవ్వారని ప్రగతిశీలవాదులు అంటున్నారు. -
కరువును పారదోలుతాం: కడియం
జనగామ: రాష్ట్రంలో ప్రతిఒక్కరికి తాగు, సాగు నీరందించి కరువును పాదదోలుతామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. జిల్లాలోని జనగామ మండలం చీటకోడూరు నాగులకుంట చెరువు వద్ద మిషన్ కాకతీయ ఫేజ్-3 పనులకు ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ స్వరాష్ట్రంలో జనగామ ప్రాంతం సుభిక్షంగా మారిందన్నారు. జనగామలో గోదావరి నదీ జలాలతో చెరువులు నింపిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. జిల్లాలో 267 గ్రామాలకుగాను 250 గ్రామాలకు మిషన్ భగీరథ నీరు అందనున్నట్లు చెప్పారు. అదేవిధంగా జనగామ జిల్లాలో కొత్తగా ఏర్పడ్డ 3 మండలాలకు కేజీవీబీ పాఠశాలలు మంజూరు అయినట్లు తెలిపారు. మిషన్ కాకతీయ 3, 4వ విడతలో మిగిలిన అన్ని చెరువులను పునరుద్ధరించనున్నట్లు వెల్లడించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కిందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు, కలెక్టర్ శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు. -
అధ్యక్ష పదవి మాకొద్దు..!
కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవిపై నేతల విముఖత హోదాలో ఉండగా ఎన్నికల్లో పోటీ చేసే చాయిస్ లేకపోవడమే కారణం కొత్త జిల్లాలో పోటీ తక్కువే! కొత్త జిల్లాలో.. అదీ టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇలాకాలో.. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ‘నాకొద్దంటే నాకొద్దని..’ నేతలు విముఖత వ్యక్తం చేస్తుండడం ఆశ్చర్యం వేస్తోంది. పదవంటే పరుగులు తీసే ఈ రోజుల్లో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు ఇలాంటి చేదు అనుభవం ఎదురవుతుండటానికి కారణం లేకపోలేదు. డీసీసీ అధ్యక్ష పదవిలో ఉండగా.. ఇతర ఎన్నికల్లో పోటీ చేయరాదనే నిబంధనే ప్రతికూలంగా మారిందని ఆ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. జనగామ : కొత్త జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి నియామకం ఆలస్యమవుతోంది. డీసీసీ అధ్యక్షుడిగా నియమితులైనవారు పదవిలో ఉన్నప్పుడు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయరాదని ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ నిబంధన పెట్టడమే దీనికి కారణంగా ఆ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఈ పరిణామంతో అధ్యక్ష పదవిని చేపట్టడం కోసం ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తికి జిల్లా సారథ్య బాధ్యతలు అప్పగిస్తే తమ నియోజకవర్గానికే పరిమితమయ్యే అవకాశం ఉందని.. దాంతో జిల్లా వ్యాప్తంగా పార్టీ బలోపేతం కావడం కష్టంగా మారుతోందని యువనేత నిర్ణయం సరైనదే అనే చర్చ జరుగుతోంది. కానీ ఇది ఈ రకంగా ప్రతికూలంగా మారుతుందని ఊహిం చలేదని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. జిల్లాల ఆవిర్భావం తర్వాత కొత్త డీసీసీ అధ్యక్షుల నియామకంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం పూర్తి సమయం పార్టీ కోసం పని చేసే వారికే పగ్గాలు ఇవ్వాలని భావిస్తోంది. అధ్యక్షులను ఎన్నికల సమయంలో పోటీకి దూరంగా ఉంచడం ద్వారా వారు పార్టీ టికెట్లు పొందిన అభ్యర్థుల ప్రచారాన్ని భుజాన వేసుకుంటారని ఆలోచిస్తోంది. అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నప్పుడు అనూహ్యంగా పోటీ చేసే అవకాశం వస్తే పరిస్థితి ఏమిటనే ప్రశ్న నాయకుల నుంచి ఉత్పన్నమవుతోంది. ఈ నిబంధన వల్ల పరపతి ఉన్న నాయకులు ఎవరూ అధ్యక్ష పదవికి పోటీ పడకపోవచ్చని.. సాధారణ నాయకులకు ఆ పదవి దక్కితే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. 2019లో జరగనున్న సాధారణ ఎన్నికల కోసం ఇప్పటి నుంచి కసరత్తు ప్రారంభిస్తేనే అనుకూల ఫలితాలు ఉంటాయని.. దానికి అనుగుణంగానే కొత్త అధ్యక్షులను నియమించాలనే ఆలోచన ఆ పార్టీ చేస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్న ఈ నిబంధనపై నేతలు భిన్నస్వరాలు వినిపిస్తున్నారు. పోటీ స్వల్పమే..! ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన ఉన్న నేతలు అధ్యక్ష పదవికి దూరంగా ఉంటుండటంతో డీసీసీ అధ్యక్ష పదవికి పోటీ స్వల్పంగానే ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త జిల్లాలో తొలి అధ్యక్షుడినయ్యే అవకాశం రావడం.. పోటీ తక్కువగా ఉండటం కూడా కలిసి వస్తుందని భావనతో మరికొందరు నేతలు ఉన్నారు. కొందరు అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆరాటపడుతుండగా.. మరికొందరు మనకెందుకొచ్చిన గొడవలే అని విముఖత చూపుతున్నారు. అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారిలో.. పరిస్థితి ఎలా ఉన్నా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడినై తీరాలని సంకల్పించే నేతలు లేకపోలేదు. ఎన్నికల్లో పోటీ చేయడం కంటే కూడా తమకు పార్టీ పదవే ముఖ్యమని భావిస్తున్న నేతలు పలువు రు ఉన్నారు. డీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారిలో డీసీసీబీ చైర్మ¯ŒS జంగా రాఘవరెడ్డి, చెం చారపు శ్రీనివాసరెడ్డి, జక్కుల వేణుమాధవ్, ధర్మపురి శ్రీనివాస్, ఎర్రమల్ల సుధాకర్, రంగు రవి, బేతి జయపాల్‌రెడ్డి ఉన్నారు. మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సొంత జిల్లా కావడంతో అధ్యక్షుడి నియామకంలో ఆయన ముద్ర ఉంటుంది. పోటీ ఎక్కువగానే ఉన్నా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని తెలుస్తుండడంతో నేతలు వెనక్కి తగ్గుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ పార్టీ శ్రేణులతోపాటు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. -
ఆటోలు ఢీ: ఒకరి మృతి
జనగామ : జనగామ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 14 మందికి గాయాలయ్యాయి. చంపక్‌హిల్స్ సమీపంలోని క్రషర్ మిషన్ వద్ద శుక్రవారం రెండు ఆటోలు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన కార్మికులు ఆటోలో సీతాఫలం పండ్లను తీసుకొస్తున్న క్రమంలో జనగామ వైపు వెళ్తున్న మరో ప్రయాణికుల ఆటోను ఢీకొంది. ఈ సంఘటనలో కొన్నెకు చెందిన తేలు రాజు(25) అనే కార్మికుడు మృతిచెందాడు. శంకరయ్య, రాకేష్ అనే వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా మరో 12మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ప్రజాభీష్టానికే ముఖ్యమంత్రి ఓటు
-
ప్రజాభీష్టానికే ముఖ్యమంత్రి ఓటు.. మరో మూడు జిల్లాలు!
గద్వాల, జనగామ, సిరిసిల్ల జిల్లాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ సంకేతాలు ► కొత్త జిల్లాలపై రెండుమూడు చోట్లనే ఆందోళనలు ► వాటిని కూడా జిల్లాలుగా మారిస్తే తప్పేంటి? ► అక్కడి ప్రజలు నిజంగా కోరుకుంటే ఆ దిశగా కసరత్తు చేద్దాం ► మనం లేకున్నా జిల్లాలు, మండలాలు ఉంటాయి ► బాగా చేశారని ప్రజలంతా చెప్పుకోవాలి ► ఐదు జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ నేతలతో భేటీ ► జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ ► నేడు వరంగల్, కరీంనగర్ జిల్లాల నేతలతో సమావేశం సాక్షి, హైదరాబాద్: ‘‘కొత్త జిల్లాలపై రాష్ట్రంలో రెండు మూడుచోట్లనే ఆందోళనలు జరుగుతున్నాయి. వాటిని సైతం జిల్లాలుగా మారిస్తే తప్పేంటీ..? జిల్లాలు చిన్నచిన్నగా అవుతాయి. అక్కడి ప్రజలు నిజంగా కోరుకుంటే ఆ దిశగా కసరత్తు చేద్దాం..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. దీంతో కొత్తగా గద్వాల, జనగామ, సిరిసిల్ల జిల్లాల ఏర్పాటుకు సైతం సానుకూలమే అన్న సంకేతాలిచ్చారు. గద్వాలను జిల్లాగా చేయాలంటూ అక్కడి ప్రజలు, నేతలు కొంతకాలంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే జనగామ, సిరిసిల్ల డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. సీఎం తాజా వ్యాఖ్యలతో వీటిపై మళ్లీ ఆశలు చిగురించాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో ఆదివారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ నాయకుడు కె.కేశవరావుతో పాటు ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్పర్సన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్పర్సన్లు, జిల్లాల పార్టీ అధ్యక్షులు ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రజాభీష్టం మేరకు కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలపై మార్పుచేర్పులకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. అవసరమనుకుంటే వాటి సంఖ్యను పెంచడానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. దసరా నుంచే కొత్త జిల్లాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటు అన్నివిధాలా లాభదాయకంగా ఉండాలే తప్ప నష్టం కలిగించవద్దన్నారు. రాజకీయ కారణాలు, వ్యక్తిగత అభిప్రాయాలతో ఒత్తిడి తీసుకురావొద్దని పార్టీ నేతలకు స్పష్టంచేశారు. ప్రజా ప్రతినిధులు ప్రజల సౌకర్యం, వారి ఇష్టాయిష్టాలకే ప్రాధాన్యం ఇవ్వాలని హితవు పలికారు. ‘‘కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలపై ముసాయిదా విడుదల చేశాం. ప్రజల నుంచి సలహాలు, సూచనలు అభ్యంతరాలు వచ్చాయి. వివిధ మార్గాల ద్వారా సమాచారం వచ్చింది. ప్రజలేం కోరుకుంటున్నారు. ప్రజలకేం అవసరముంది.. ముసాయిదాలో మార్పులు చేర్పులు అవసరమా? అనే విషయాలపై అధ్యయనం జరిగింది. ఎన్నో విషయాలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. అందుకే ముసాయిదాలో ప్రకటించిన జిల్లాలు, డివిజ న్లు, మండలాలే కాకుండా ప్రజలు కోరుకునే విధంగా మార్పులు చేర్పులు జరుగుతాయి. అవసరమనుకుంటే వాటి సంఖ్యలో కూడా మార్పు ఉంటుంది’’ అని సీఎం తెలిపారు. ప్రజా ప్రయోజనాలే ముఖ్యం జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆలోచన వెనుక ప్రజాప్రయోజనాలే ప్రధానమని సీఎం చెప్పారు. ‘‘గతంలో మండలాల ఏర్పాటుతో పాటు అనేక సందర్భాల్లో ప్రజలే కేంద్రంగా నిర్ణయం తీసుకోకపోవటంతో సమస్యలు తలెత్తాయి. ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయి. మనం అలా చేయకూడదు. మన ఆలోచన, ఆచరణ ప్రజలే కేంద్రంగా ఉండాలి. మనం లేకున్నా ప్రజలుంటారు. మండలాలుంటాయి.. జిల్లాలుంటాయి.. అవి గొప్పగా పని చేయాలి. ఇంత గొప్ప పని చేసి ప్రజల నుంచి చెడ్డపేరు తెచ్చుకోవద్దు. ప్రజలంతా బాగా చేశారు అని చెప్పుకోవాలి. నాయకులు తమ వ్యక్తిగత అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలను పక్కనపెట్టాలి. రాజకీయ నాయకుల పెత్తనం కోసం కాకుండా ప్రజలేం కోరుతున్నారో వాటిని ప్రతిపాదించాలి. మార్పులు చేర్పులు ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా జరగాలి. నాయకులు సరిగా ప్రతిపాదనలు చేయకున్నా ప్రభుత్వానికి ఇతరత్రా సమాచారం ఉంటుంది. ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటాం. వివిధ మార్గాల ద్వారా సమాచారం సేకరించి అంతిమంగా ప్రజలే కేంద్రంగా నిర్ణయం తీసుకుంటాం’’ అని పార్టీ నేతలకు ప్రభుత్వ వైఖరిని ముఖ్యమంత్రి తేటతెల్లం చేశారు. నాలుగున్నరేళ్ల నాటి కల ఉద్యమ సమయంలోనే నాలుగున్నరేళ్ల క్రితమే ప్రొఫెసర్ జయశంకర్, ఆర్.విద్యాసాగర్‌రావు తదితరుల సమక్షంలో తెలంగాణలో జిల్లాల పునర్విభజన జరగాలనే చర్చ జరిగినట్లు సీఎం వివరించారు. ‘‘తెలంగాణ వచ్చిన వెంటనే చెరువుల పునరుద్ధరణ చేపట్టడంతోపాటు జిల్లాల పునర్వ్యవస్థీకరణ అత్యంత శాస్త్రీయంగా జరపాలని అనుకున్నాం. తెలంగాణలో పరిపాలనా విభాగాలు అశాస్త్రీయంగా ఉన్నాయి. ప్రజల సౌకర్యం, పాలనా సౌలభ్యానికి వీలుగా పునర్వ్యవస్థీకరణ జరగాలని వివిధ రాష్ట్రాల్లో ఉన్న జనాభాను, జిల్లాలను పరిశీలించాం. తెలంగాణలోని జనాభా, విస్తీర్ణం ప్రకారం కచ్చితంగా జిల్లాల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని నిర్ణయించుకున్నాం. దాని ప్రకారమే టీఆర్ఎస్ మేనిఫెస్టోలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని చేర్చాం’’ అని పేర్కొన్నారు. మండలాల ప్రయోగం విజయవంతం ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మండలాల ఏర్పాటుపై కసరత్తు జరిగిందని, అప్పటి కమిటీలో తాను కూడా సభ్యుడిగా ఉన్నానని ముఖ్యమంత్రి తెలిపారు. ‘‘మండలాల ఏర్పాటును అప్పుడు చాలా మంది వ్యతిరేకించారు. పటేల్, పట్వారీల నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు ఎవరూ సుముఖంగా లేరు. కానీ ప్రజల సౌలభ్యానికి వీలుగా మండలాలు ఏర్పడ్డాయి. ఆ ప్రయోగం బ్రహ్మాండంగా విజయవంతమైంది. రిజర్వేషన్లు రావడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మహిళలకు అవకాశాలు వచ్చాయి. రాజకీయంగా వారంతా పైకి వచ్చారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ కూడా అదే తరహాలో మంచి ఫలితాలు ఇస్తుంది. ప్రజలకు ఉపయోగపడుతుంది’’ అని సీఎం అన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యం జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరగాలని కోరుకోవడం వెనుక రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించాలనే లక్ష్యం ఉన్నట్లు సీఎం చెప్పారు. ‘‘నీటి పారుదల ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పనులకు వచ్చే మూడు నాలుగేళ్లలో భారీ పెట్టుబడులు అవసరం. ఇక రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే పెద్ద పని. చిన్న జిల్లాలుంటే ప్రతీ కుటుంబాన్ని పట్టించుకోవచ్చు. ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ సులభం అవుతుంది. పథకాలన్నీ ప్రజలకు ఉపయోగపడేలా అమలు చేయొచ్చు. కలెక్టర్ల స్వయం పర్యవేక్షణ పెరుగుతుంది. పరిపాలనా కేంద్రాలు ప్రజలకు మరింత చేరువై ప్రభుత్వం ద్వారా అందాల్సిన సాయాన్ని అందుకోగలుగుతారు’’ అని సీఎం పేర్కొన్నారు? మీ జిల్లాలో నాలుగో జిల్లాకు అవకాశముంది! ‘‘మీ జిల్లాలో నాలుగో జిల్లా ఏర్పాటుకు అవకాశముంది. ఆ దిశగా ప్రయత్నిద్దాం.. ఏ జిల్లాలో కలపాలనే విషయంలో వివాదాస్పదంగా మారిన మండలాలు, మరికొన్ని మండలాలు కలిపితే కొత్త జిల్లాకు ఛాన్స్ ఉంది. అలా కసరత్తు చేయాలని అధికారులతో మాట్లాడుతా’’ అని మహబూబ్‌నగర్ జిల్లా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో సీఎం అన్నట్టు సమాచారం. గద్వాలను జిల్లా కేంద్రంగా మార్చాలని అక్కడి ప్రజలు, నేతలు కొంతకాలంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆ జిల్లా ఏర్పాటుపై మళ్లీ ఆశలు చిగురించాయి. మరోవైపు నల్లగొండ జిల్లా ప్రతినిధులతో సమావేశమైన సందర్భంగా జనగామ కొత్త జిల్లా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. జనగామ జిల్లాగా మారితే ప్రతిపాదిత యాదాద్రి జిల్లాలో ఏ ప్రాంతాన్ని డివిజన్ కేంద్రంగా మార్చాలో ఆలోచించి చెప్పండి.. అని నల్లగొండ నేతలతో సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీంతో ‘జనగామ జిల్లా అవుతుందా.. సార్.?’ అని నల్లగొండ నేతలు ఆరా తీశారు. అందుకు ‘‘దాని విషయం మీకెందుకు..? వరంగల్ జిల్లా నేతలు వచ్చినప్పుడు మాట్లాడుతారు..’’ అంటూ సీఎం నేరుగా చెప్పకుండా దాటవేసినట్లు సమాచారం. కాగా, సిరిసిల్ల, జనగామ జిల్లాల ఏర్పాటు అంశం సోమవారం కరీనంగర్, వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ నేతలతో భేటీ సందర్భంగా చర్చకు రానుంది. దసరా నుంచే కొత్త జిల్లాలు కొత్త జిల్లాలు దసరా నుంచే ప్రారంభం కావాలని కోరుకుంటున్నట్లు సీఎం పేర్కొన్నారు. తాత్కాలిక కార్యాలయాల్లో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ‘‘శాశ్వత కార్యాలయాలకు స్థలాలు అన్వేషించాలి. ప్రతీ జిల్లా కేంద్రంలో అన్ని శాఖల కార్యాలయాలతో కూడిన కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయం, కోర్టుల ప్రాంగణం ఉండాలి. వీటికోసం స్థలం అన్వేషించాలి. ఆ మూడింటికి ఒకేచోట స్థలం లేకపోతే.. వేర్వేరు చోట్ల జాగాలు చూడాలి. ప్రజలకు సౌకర్యంగా ఉండే వ్యూహాత్మక ప్రాంతాలను కార్యాలయాలకు ఎంపిక చేయాలి. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో స్థలాల ఎంపిక జరగాలి’’ అని ఆదేశించారు. -
'ఇచ్చిన మాట నిలబెట్టుకో కేసీఆర్'
హైదరాబాద్: జిల్లా కేంద్రంగా చేస్తానంటూ జనగామ ప్రజలకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకోవాలని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. జనగామను జిల్లాగా చేస్తానని గత ఎన్నికల సందర్భంగా హామీని ఇచ్చిన కేసీఆర్ ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నాడని ప్రశ్నించారు. జిల్లా కోసం ప్రజలు, అన్ని పార్టీల నేతలు రాజకీయాలకు అతీతంగా పోరాడుతున్నా సీఎం కేసీఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదో తనకు అర్థం కావడం లేదన్నారు. జనగామకు సాంకేతికంగా, శాస్త్రీయంగా, పరిపాలనాపరంగా, భౌగోళికంగా, వనరులు, విస్తీర్ణం వంటి వాటిలో జిల్లా అయ్యే అన్ని అర్హతలున్నాయని పొన్నాల అభిప్రాయపడ్డారు. -
కొత్త జిల్లాల ఏర్పాటులో కీలక పరిణామాలు!
హైదరాబాద్: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వివాదస్పద అంశాలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. గద్వాల, సిరిసిల్ల, జనగామ జిల్లాలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ పై ప్రభుత్వం నుంచి సూత్రప్రాయంగా సానుకూలత వచ్చినట్టు సమాచారం. ఆయా జిల్లాల నేతలతో కేసీఆర్ మంతనాలు జరిపారు. ప్రజలు కోరుకునేవిధంగా జిల్లాలు ఏర్పాటు చేద్దామని, వ్యక్తిగత ప్రతిష్టలకు పోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నట్టు తెలుస్తోంది. జనాభా ప్రతిపాదికన మహబూబ్ నగర్ జిల్లాలో నాలుగో జిల్లా ఏర్పాటుకు అవకాశం ఉందా అనే విషయంపై సీఎం ఆరా తీసినట్టు సమాచారం. జనగామ, సిరిసిల్ల జిల్లాల డిమాండ్ ను కూడా సానుకూలంగా పరిష్కరించేలా ఆయ జిల్లాల నాయకులతో ఆయన చర్చలు జరిపినట్టు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుపై జిల్లాల వారీగా కేసీఆర్ ఆదివారం సమీక్షలు నిర్వహించారు. నల్లగొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ప్రతిపాదిత శంషాబాద్ జిల్లాకు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాకు అనంతగిరిగా నామకరణం చేయాలని రంగారెడ్డి నేతలు సూచించారు. శంకరపల్లి, మొయినాబాద్, చేవెళ్లను శంషాబాద్ జిల్లాలో కలపాలని కోరారు. హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల నాయకులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. -
కొత్త జిల్లాల ఏర్పాటులో కీలక పరిణామాలు!
-
జనగామలో 144 సెక్షన్ ఎత్తేయండి: పొన్నాల లక్ష్మయ్య
డీజీపీకి పొన్నాల వినతి సాక్షి, హైదరాబాద్: జనగామలో విధించిన 144 సెక్షన్‌ను ఎత్తివేయాలని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. జనగామకు చెందిన నేతలు, ప్రతినిధులతో కలసి రాష్ట్ర డీజీపీకి హైదరాబాద్‌లో గురువారం వినతిపత్రం అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జనగామను జిల్లా కేంద్రంగా చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. సీఎం ఇచ్చిన హామీని నిలుపుకోవాలని, జనగామను జిల్లా చేయాలని ప్రజలు శాంతియుతంగా, రాజ్యాం గబద్ధంగా పోరాడుతున్నారని పొన్నాల చెప్పా రు. శాంతిభద్రతల సమస్య పేరుతో జనగామ లో 2 నెలలుగా 144 సెక్షన్ విధించడంతో ప్ర జలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పా రు. ప్రజల ఇబ్బందులను నేరుగా ముఖ్యమంత్రికి చెప్పుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. కనీసం అధికారులైనా ప్రజల ఇబ్బందులను గుర్తించి పరిష్కరించాలని కోరారు.