భగ్గుమన్న భూకక్షలు.. ఒకరు మృతి | one family attacks with axes another family in jangaon | Sakshi
Sakshi News home page

భగ్గుమన్న భూకక్షలు.. ఒకరు మృతి

Nov 29 2017 6:26 PM | Updated on Nov 29 2017 6:26 PM

సాక్షి, పాలకుర్తి: రెండు కుటుంబాల మధ్య  భూతగాదాలు భగ్గుమనడంతో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో జరిగింది. వివరాలివి.. వెంకటయ్య, రాజు అనే సోదరులపై బుధవారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన కొమురయ్యతో పాటు అతని సోదరులు ఐదుగురు గొడ్డళ్లతో దాడికి దిగారు. తీవ్రంగా గాయపడిన రాజు అక్కడిక్కడే మృతి చెందగా వెంకటయ్య తీవ్రంగా గాయపడ్డాడు.

ప్రధాన నిందితుడు కొమురయ్య, మరో ఐదుగురు పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. క్షతగాత్రుడిని జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement