నిందితుడిని శిక్షించాలి | - | Sakshi
Sakshi News home page

Feb 25 2023 9:00 AM | Updated on Feb 25 2023 7:41 PM

జనగామ రూరల్‌: నిరసన తెలుపుతున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు - Sakshi

జనగామ రూరల్‌: నిరసన తెలుపుతున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

జనగామ రూరల్‌: కేఎంసీ విద్యార్థి ప్రీతి ఆత్మహత్యాయత్నానికి కారకుడైన సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ ఉల్లెంగుల రాజు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాజు మట్లాడుతూ సీనియర్‌ విద్యార్థి వేధింపులు భరించలేక ప్రీతి అధిక మొత్తంలో అనస్థీషియా తీసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని అన్నారు. పొన్నాల రమేష్‌, కార్తీక్‌, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ర్యాంగింగ్‌ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

విద్యాలయాల్లో ర్యాగింగ్‌ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి విద్యార్థుల ప్రాణాలను రక్షించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు దడిగే సందీప్‌ కోరారు. కేఎంసీ జూనియర్‌ విద్యార్థినిపై ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనగామ నెహ్రు పార్క్‌ వద్ద జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నాయకులు యశ్వంత్‌రెడ్డి, పవన్‌, శ్రవణ్‌, మమత, మాధవి, రోహిత్‌ తదితరులు పాల్గొన్నారు.

సైఫ్‌ను ఉరి తీయాలి

పాలకుర్తి టౌన్‌: వైద్య విద్యార్థిని ధరావత్‌ ప్రీతిని మానసికంగా వేధించిన సైఫ్‌ను ఉరితీయాలని గిరిజన నాయకులు లావుడ్యా మల్లునాయక్‌, దేవేందర్‌నాయక్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో రాజీవ్‌ చౌరస్తాలో ప్రీతిని వేదించిన సైఫ్‌ను వెంటనే ఉరితీయాలని డిమాండ్‌ చేస్తూ గిరిజన నాయకలు నిరసన తెలిపారు. మహేందర్‌, బీమా నాయక్‌, బాలజీనాయక్‌, అనిల్‌, సుమన్‌, ప్రశాంత్‌, రాజు, ప్రవీన్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

దోషులను కఠినంగా శిక్షించాలి

కొడకండ్ల: గిరిజన విద్యార్థిని ప్రీతిని మానసికంగా హింసించిన దోషులను చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ధరావత్‌ సురేష్‌నాయక్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండలకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సరస్వతీ పుత్రికగా చదువులో రాణిస్తూ పేద ప్రజలకు వైద్య సేవ చేయాలనే లక్ష్యంతో జూనియర్‌గా సేవలందిస్తున్న ప్రీతిని సీనియర్‌ సైఫ్‌ మానసికంగా హింసిస్తున్న విషయాన్ని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా కూడా ఉన్నతాధికారులు పట్టించుకొకపోవడంతోనే ఈ దుస్థితి దాపురించిందన్నారు. సైఫ్‌ డిగ్రీని రద్దు చేయడంతో పాటు చట్టరీత్యా కఠినంగా శిక్షించాలన్నారు. ఎస్టీ, ఎస్సీ సెల్‌ అధ్యక్షులు రాహూల్‌, భిక్షపతి, జంగిలి జగన్నాథం, రాజులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement