జనగామ: జిల్లాలోని చిల్పూరు మండలం దేశాయి తండా సమీఫంలోని స్టేషన్‌ఘన్‌పూర్ రిజర్వాయర్‌లోకి ఓ షిప్ట్‌కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ధారావత్ చరణ్(18) అనే యువకుడు తీవ్ర గాయాలతో బయటపడగా, డ్రైవింగ్ చేస్తున్న భూక్య పవన్ అనే వ్యక్తి ఆచూకీ లభించలేదు. అయితే గాలింపు చర్యల్లో అతని మృతదేహం లభించింది.
స్టేషన్‌ఘన్‌పూర్ నుండి దేశాయి తండా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారు ప్రమాదవశాత్తూ పల్టీలు కొట్టి రిజర్వాయర్‌లో పడింది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ధారవత్ చరణ్ అనే యువకుడ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


