నుమాయిష్‌లో 264 మంది పోకిరీల పట్టివేత | 264 Eve Teasers Caught At Numaish Exhibition In Hyderabad, 22 Minors Among Them | Sakshi
Sakshi News home page

నుమాయిష్‌లో 264 మంది పోకిరీల పట్టివేత

Feb 26 2026 11:03 AM | Updated on Feb 26 2026 11:10 AM

264 eve teasers caught at nampally exhibition

వీరిలో 22 మంది మైనర్లు 

సాక్షి, హైదరాబాద్‌: నాంపల్లిలో జరిగిన అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌)లో పెద్దసంఖ్యలో పోకిరీలు పట్టుబడ్డారు. స్టాల్స్‌ను సందర్శించడానికి వచ్చే మహిళలు, యువతుల్ని వేధిస్తుండగా నగర షీ–టీమ్స్‌కు చిక్కారు. ఈ మేరకు బుధవారం డీసీపీ ఎన్‌జేపీ లావణ్య వివరాలు వెల్లడించారు. నుమాయిష్‌ సాగిన 45 రోజుల్లో 264 మందిని షీ టీమ్స్‌ పట్టుకున్నాయి. వీరిలో 22 మంది మైనర్లు ఉన్నారు. 

ఈ ఏడాది జనవరి 1 నుంచి ఈ నెల 15 వరకు జరిగిన ఎగ్జిబిషన్‌లో పోకిరీలపై షీ టీమ్స్‌ నిరంతరం నిఘా ఉంచడంతోపాటు డెకాయ్‌ ఆపరేషన్లు కూడా నిర్వహించాయి. పట్టుబడిన పోకిరీల్లో 188 మందికి వారి కుటుంబసభ్యుల సమక్షంలో షీ–టీమ్స్‌ కౌన్సెలింగ్‌ ఇచ్చి తీవ్రంగా హెచ్చరించి పంపాయి. శృతి మించిన వ్యవహారాలు, తీవ్రమైన దు్రష్పవర్తనకు పాల్పడిన 56 మందిపై పోలీసులు పెట్టీ కేసులు నమోదు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా 52 మందికి రూ.1,050 చొప్పన జరిమానా పడింది. మరో నలుగురికి రెండు రోజుల జైలు, రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement