సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీ సంఖ్యలో ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగింది. తాజాగా 45 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలు జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం జరిగింది. కీలక శాఖల ఐఏఎస్ అధికారులను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. ఇరిగేషన్ శాఖ నుంచి రాహుల్ బొజ్జాను ప్రభుత్వం తప్పిచింది. ఫైనాన్సు శాఖ నుంచి సందీప్ కుమార్ సుల్తానియాను బదిలీ చేసిన ప్రభుత్వం. టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ నుంచి ముషారఫ్ అలీ ఫరూకీ బదిలీ చేసింది.
మరోవైపు.. డిజాస్టర్స్ మేనేజ్మెంట్ శాఖ నుంచి అరవింద్ కుమార్ ఐఏఎస్ బదిలీ అయ్యారు. అరవింద్ కుమార్‌కు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఫార్ములా కేసులో అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చిన డివోపీటీ. ఈ కేసు కారణంగా ఎలాంటి శాఖను కేటాయించని ప్రభుత్వం. ప్రస్తుతం అరవింద్ కుమార్ సెలవులో ఉన్నారు.
G.O. 290 IAS Transfers Postings : ఐఏఎస్ అధికారుల బదిలీలు
తాజాగా బదిలీల ప్రకారం..
- Sanjay Kumar – పరిశ్రమలు, ఐటీ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ పదవి నుంచి పీఆర్ & ఆర్డీ, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ
- Sabyasachi Ghosh – ఫ్లాగ్‌షిప్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ స్కీమ్స్ యూనిట్‌తో పాటు CSR బాధ్యతలు
- M. Dana Kishore – లేబర్, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ & ఫ్యాక్టరీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కొనసాగుతూ విపత్తు నిర్వహణ శాఖకు అదనపు బాధ్యత
- N. Sridhar – ఐటీ & పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియామకం
- Rahul Bojja – జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో రాజకీయ వ్యవహారాల ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ; బీసీ వెల్ఫేర్ శాఖకు అదనపు బాధ్యత
- E. Sridhar – ఇరిగేషన్ & CAD శాఖ కార్యదర్శిగా నియామకం.
- Gaurav Uppal – ఫైనాన్స్ & ప్లానింగ్ శాఖ కార్యదర్శిగా నియామకం; టీజీఆర్‌ఏసీ ఈఓ డీజీగా అదనపు బాధ్యత.
- B. Vijiendra – మహబూబ్‌నగర్ కలెక్టర్ నుంచి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శిగా నియామకం
- D. Divya – సర్ప్ సీఈఓగా కొనసాగుతూ ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా అదనపు బాధ్యత
- Adwait Kumar Singh – మహబూబాబాద్ కలెక్టర్ నుంచి తెలంగాణ భవన్ (ఢిల్లీ)లో సమన్వయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియామకం
- M. Hanumantha Rao – యాదాద్రి భువనగిరి కలెక్టర్ నుంచి ఎండోమెంట్స్ డైరెక్టర్‌గా బదిలీ
- Sikta Patnaik – నారాయణపేట్ కలెక్టర్ నుంచి ఫైనాన్స్ శాఖ స్పెషల్ సెక్రటరీగా నియామకం
- Sandeep Kumar Jha – జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ నుంచి జనగాం కలెక్టర్‌గా నియామకం
- M.D. Musharraf Ali Faruqui – టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ నుంచి మూడో డిస్కమ్ సీఎండీగా బదిలీ
- Pamela Satpathy – కరీంనగర్ కలెక్టర్ నుంచి కార్మిక శాఖ స్పెషల్ కమిషనర్‌గా బదిలీ
- Anuraag Jayanti – జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ నుంచి యాదాద్రి భువనగిరి కలెక్టర్‌గా నియామకం
- Rahul Raj P.S. – మెదక్ కలెక్టర్ నుంచి సహకార శాఖ స్పెషల్ కమిషనర్ & రిజిస్ట్రార్‌గా నియామకం
- Bhavesh Mishra – ఐటీ శాఖలో స్పెషల్ సెక్రటరీగా రీడిజిగ్నేషన్.
కొత్త జిల్లా కలెక్టర్లు..
- Jitesh V. Patil – టీజీఎస్పీడీసీఎల్ సీఎండీగా నియామకం
- Rizwanbasha Shaik – జనగాం కలెక్టర్ నుంచి జోగులాంబ గద్వాల్ కలెక్టర్‌గా బదిలీ
- Santhosh B.M. – జోగులాంబ గద్వాల్ కలెక్టర్ నుంచి గిరిజన సంక్షేమ డైరెక్టర్‌గా బదిలీ
- Prateek Jain – వికారంాబాద్ కలెక్టర్ నుంచి నారాయణపేట్ కలెక్టర్‌గా నియామకం
- Sneha Shabarish – హనుమకొండ కలెక్టర్ నుంచి మహబూబాబాద్ కలెక్టర్‌గా బదిలీ
- P. Katyayani Devi – స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియామకం
- G. Phaneendra Reddy – టీజీఎంఎస్ఐడీసీ ఎండీ నుంచి నారాయణపేట్ అదనపు కలెక్టర్‌గా బదిలీ
- Chitra Mishra – ఎటూరునాగారం ఐటిడిఎ ప్రాజెక్ట్ ఆఫీసర్ నుంచి కరీంనగర్ కలెక్టర్‌గా నియామకం
- Garima Agrawal – రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా నియామకం
- Deepak Tewari – వికారంాబాద్ కలెక్టర్‌గా నియామకం
- Pratima Singh – మెదక్ కలెక్టర్‌గా నియామకం
- Ankit – భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా నియామకం
- Chahat Bajpai – హనుమకొండ కలెక్టర్‌గా నియామకం, జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా అదనపు బాధ్యత
- Khushboo Gupta – మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా నియామకం
- Manda Makarandu – జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్
- Faizan Ahmed – మెడ్చల్ మల్కాజిగిరి అదనపు కలెక్టర్
- Shivendra Pratap – హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్
- Parmar Pinkeshkumar Lalitkumar – జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్
- Uma Shankar Prasad – వికారంాబాద్ అదనపు కలెక్టర్
- రాష్ట్ర సర్వీస్ (SCS) అధికారుల పోస్టింగ్‌లు
- G. V. Shyam Prasad Lal – నాగర్‌కర్నూల్ అదనపు కలెక్టర్
- P. Chandraiah – మంచిర్యాల అదనపు కలెక్టర్
- Y. V. Ganesh – వరంగల్ అదనపు కలెక్టర్
- Abdul Hameed – సిద్ధిపేట అదనపు కలెక్టర్
- B. Venkateshwarlu – నిర్మల్ అదనపు కలెక్టర్
- N. Kheemya Naik – వనపర్తి అదనపు కలెక్టర్
- K. Vidyasagar – ఇండస్ట్రీ & ఇన్వెస్ట్‌మెంట్ సెల్ అదనపు సీఈఓగా నియామకం
- M. Surender – ప్రజావాణి అదనపు నోడల్ అధికారిగా నియామకం
- మొత్తం 45 మంది అధికారులకు బదిలీలు/కొత్త బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ


