యూట్యూబర్ కోమలి వన్‌సైడ్‌ లవ్‌.. అఖిల్‌ స్టేట్‌మెంట్‌ | Hyderabad Youtuber Komali Incident, Police Investigation Ongoing Over Relationship Dispute | Sakshi
Sakshi News home page

యూట్యూబర్ కోమలి వన్‌సైడ్‌ లవ్‌.. అఖిల్‌ స్టేట్‌మెంట్‌

Feb 26 2026 9:39 AM | Updated on Feb 26 2026 11:28 AM

hyderabad youtuber komali incident

హైదరాబాద్‌: యూట్యూబర్‌ కోమలి బోను(21) ఆత్మహత్య కేసు దర్యాప్తును రాయదుర్గం పోలీసులు ముమ్మరం చేశారు. చిత్రపురి కాలనీలో నివాసముంటున్న గాజువాకకు చెందిన కోమలి ప్రేమ విఫలం కావడంతో సోమవారం ఉరేసుకున్న విషయం తెలిసిందే. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోమలి డైరీ, సెల్‌ఫోన్‌ స్వా«దీనం చేసుకున్నారు. తన ప్రేమను ఎప్పటికైనా అర్థం చేసుకుంటాడని డైరీలో రాసిందని, ప్రియుడు అఖిల్‌రెడ్డి మోసం చేసినట్లుగా పేర్కొనలేదని పోలీసులు చెబుతున్నారు. 

చిత్రపురి కాలనీలో మరో బ్లాక్‌లో సోదరి ఇంట్లో ఉంటున్న అఖిల్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అఖిల్‌రెడ్డి ఫోన్‌ను స్వా«దీనం చేసుకుని, ఇద్దరి చాటింగ్‌లను పరిశీలిస్తున్నారు. మరో యువతితో రిలేషన్‌లో ఉన్నానని, తన వెంట పడొద్దని చెప్పినా ఆమె వినిపించుకోలేదని అతడు చెప్పినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు తల్లిదండ్రులకు, స్నేహితులకు ‘మీరు బాగుండాలి’అని కోమలి వాయిస్‌ మేసేజ్‌లు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.  

మూడేళ్లుగా ప్రేమించుకుని... 
మూడేళ్లుగా ప్రేమించుకున్న కోమలి, అఖిల్‌ సంవత్సరకిత్రం బ్రేకప్‌ చెప్పారు. ఈ క్రమంలో మరో యువతితో అతడు చనువుగా ఉండటాన్ని జీరి్ణంచుకోలేక పోయిన కోమలి ఆరు నెలల క్రితం ఆత్మహత్యకు యతి్నంచినట్లు తెలుస్తోంది. మూడురోజుల క్రితం అఖిల్, కోమలి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఆ తర్వాత తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, కోమలిని అఖిల్‌ ట్రాప్‌ చేసి మోసం చేశాడని ఆమె తల్లి వరలక్ష్మి పోలీసులకు ఇచి్చన ఫిర్యాదులో పేర్కొన్నారు.   

 

 

Advertisement
 
Advertisement
Advertisement