బాసర త్రిబుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య | Basara IIIT Student Incident | Sakshi
Sakshi News home page

బాసర త్రిబుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

Feb 25 2026 1:39 PM | Updated on Feb 25 2026 2:13 PM

Basara IIIT Student Incident

నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లాలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (బాసర త్రిబుల్ ఐటీ)లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్న వసంత అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బాలికల వసతి గృహంలో ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు అధికారులు తెలిపారు. మృతురాలి స్వస్థలం వనపర్తి జిల్లాగా గుర్తించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న ట్రిపుల్‌ ఐటీ సిబ్బంది, విద్యార్థిని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 

అనంతరం మృతదేహాన్ని హుటాహుటిన బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ ప్రక్రియను అధికారులు గోప్యంగా నిర్వహించడం గమనార్హం. వసంత ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆమె వ్యక్తిగత కారణాలతో ఈ తీవ్ర నిర్ణయం తీసుకుందా ? లేక ఇతర ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా ? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టే అవకాశం ఉంది. బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలు తరచూ జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement