సాగునీటి రంగానికి ప్రాధాన్యం
తానూరు: నియోజకవర్గంలో సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే రామరావ్‌పటేల్ తెలిపారు. రూ.89 లక్షలతో హిప్నెల్లి గ్రామ చెరువు కట్ట మరమ్మతు పనులను మంగళవారం ప్రారంభించారు. పనులు త్వరగా పూర్తి చేసేలా చూస్తామన్నారు. కాళేశ్వరం 28 ప్యాకేజీ కాలువ పనులు పాలకుల నిర్లక్ష్యంతో పూర్తికాలేదన్నారు. నిధులు ఇవ్వాలని అసెంబ్లీ వేదికగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పదే పదే కోరానన్నారు. నిధులువస్తే తానూరు మండలం సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. పిప్రి లిఫ్ట్ ఇరేగేషన్‌కు రూ.77 కోట్ల నిధులు మంజూరు చేస్తూ క్యాబినెట్ ఆమోదం తెలుపడం సంతోషకరమన్నారు. ఎల్విత్, వాడవన, కోలూరు గ్రామాల్లో రూ.20 లక్షల చొప్పన మంజూరైన మహిళ సమాఖ్య భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్‌రావ్ పటేల్, నాయకులు లక్ష్మణ్‌రెడ్డి, చిన్నారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఉన్నారు.


