కేటీఆర్‌కు ఘన స్వాగతం | - | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌కు ఘన స్వాగతం

Feb 25 2026 10:29 AM | Updated on Feb 25 2026 10:29 AM

కేటీఆర్‌కు ఘన స్వాగతం

కేటీఆర్‌కు ఘన స్వాగతం

లక్ష్మణచాంద: ఆదిలాబాద్‌ జిల్లా పర్యటనకు మంగళవారం వచ్చిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావుకు నిర్మల్‌ జిల్లా నాయకులు సోన్‌ మండలంలోని గంజాల్‌ టోల్‌ ప్లాజా వద్ద ఘన స్వాగతం పలికారు. బీఆర్‌ఎస్‌ నిర్మల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి రాంకిషన్‌రెడ్డి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ కార్యకర్తలు నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. మున్సిపల్‌ ఎన్నికల్లో వీరోచితంగా పోరాడిన కార్యకర్తలు, నాయకులను అభినందించారు. త్వరలో జిల్లాలో పర్యటిస్తానని తెలిపారు. ఎవరికీ భయపడాల్సిన పనిలేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఖానాపూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి జాన్సన్‌నాయక్‌, సుభాష్‌రావు, మారుగొండ రాము, అయ్యన్నగారి రాజేందర్‌, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కేటీర్‌తో కరచాలనం చేస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement