నిర్మల్
న్యూస్‌రీల్
వెయిట్ లిఫ్టింగ్‌లో ప్రతిభ...
దస్తురాబాద్: రాష్ట్ర స్థాయి సీఎం కప్ 110 కిలోల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మండలంలోని మున్యాల గ్రామానికి చెందిన కొట్టె అభిషేక్ ప్రతిభ కనబర్చి సీల్వర్ మెడల్ సాధించినట్లు వ్యాయామ ఉపాధ్యాయు డు నవీన్ తెలిపారు.
న్యూబొప్పారంలో వర్షానికి నేలవాలిన మొక్కజొన్న పంటను పరిశీలిస్తున్న డీఏవో అంజిప్రసాద్
ఇంటర్ పరీక్షలకు
పటిష్ట బందోబస్తు
నిర్మల్‌టౌన్: ఈనెల 25 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు జిల్లాలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకీషర్మిల తెలిపారు. అంతేకాకుండా పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేలా చూస్తామన్నారు. 23 పరీక్ష కేంద్రాల వద్ద 163(సెక్షన్ 143) అమలులో ఉంటుందని పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేకంగా నిఘా, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, ప్రశ్నపత్రాల రవాణా, పరీక్ష అనంతరం సమాధానం పత్రాల భద్రత కోసం ప్రత్యేక ఎస్కార్ట్ ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష ప్రారంభం నుంచి ముగింపు వరకు నిరంతర పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.
అకాల నష్టం
భైంసా/భైంసారూరల్/కుంటాల/ముధోల్/ లోకేశ్వరం: జిల్లాలో సోమవారం కురిసిన అకాల వర్షానికి మక్క రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈదురుగాలులతో వర్షం కురవడంతో కోత దశలో ఉన్న మొక్కజొన్న పంట నేలవాలింది. శెనగ పంటకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోత దశలో ఉన్న శనగ చేలల్లో నీరు నిలవడంతో కాయలు నల్ల బడతాయని పేర్కొంటున్నారు. ప్రభుత్వం పంట నష్టం అంచనా వేసి రైతులకు పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. కుంటాల మండలం వెంకూర్, లింబా(కె), లింబా(బి), అందకూర్, అంబకంటి గ్రామాల్లో జొన్న, మొక్కజొన్న పంటలు నేలవాలాయి. భైంసారూరల్ మండలంలో వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో మంగళవారం పరిశీలించారు. కామోల్‌లో 85 ఎకరాల్లో మొక్కజొన్న, కుంసరలో 90 ఎకరాలు, వాలేగాంలో 84, దేగాంలో 82, సిరాల 112, ఇలేగాంలో 56, బడ్‌గాంలో 30, హజ్గుల్‌లో 55, కథ్‌గాంలో 89, హంపోలిలో 30, మాంజ్రిలో 70, పాంగ్రిలో 65, చుచుంద్‌లో 69, తిమ్మాపూర్‌లో 45, సుంక్లిలో 45, భైంసాలో 85, సిద్దూర్‌లో 30, మిర్జాపూర్‌లో 25, టాక్లిలో 15, లింగాలో 10 ఎకరాల్లో మొక్కజొన్న, కుంసరలో రెండు, వాలేగాంలో ఐదు ఎకరాల్లో శెనగ పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారి గణేశ్ తెలిపారు. ముధోల్ మండల కేంద్రంతోపాటు, బోరిగాంలో మొక్కజొన్న పంట పూర్తిగా దెబ్బతిన్నది. తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. లోకేశ్వరం మండలంలోని రాజూరా, లోకేశ్వరం, పుస్పూర్, హవర్గ, పిప్రి, అబ్ధుల్లాపూర్, రాయపూర్‌కాండ్లీ, పంచగుడి, ఎడ్ధూర్, గడ్‌చాంద గ్రామాల్లో అకాల వర్షానికి మొక్కజొన్న, నువ్వు, పుచ్చకాయ(టర్భుజ), శెనగ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ స్తంభాలు విరగడంతో రాజూర గ్రామంలో అంధకారం నెలకొంది. వ్యవసాయాధికారుల మండలంలో 1,076 ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బతిన్నట్లు ఏవో గిరిరాజ్ తెలిపారు.
బోల్సాశివారులో పంటను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే
లక్ష్మణచాంద/మామడ: నిర్మల్ డివిజన్ పరిధిలోని లక్ష్మణచాంద, మామడ మండలాల్లో అకాల వర్షం అన్నదాతలను అతలాకు తులం చేసింది. లక్ష్మణచాంద మండలం పీచర, చింతల్‌చాంద, లక్ష్మణచాంద, చామన్‌పల్లి, మునిపల్లి, మల్లాపూర్, ధర్మారం గ్రామాల్లో ఉడికించిన పసుపు తడిసింది. లక్ష్మణచాంద మండలంలోని మూడు క్లస్టర్ల పరిధిలో 773 రైతులకు చెందిన 1,171 ఎకరాలలో మొక్కజొన్న పంటకు నష్టం కలిగినట్టు మండల వ్యవసాయ అధికారి వసంత్‌రావు తెలిపారు. సోన్ మండలంలో 437 రైతులకు చెందిన 645 ఎకరాలలో మొక్కజొన్న పంట నష్టం జరిగిందని మండల వ్యవసాయ అధికారి వినోద్ ప్రాథమికంగా అంచనా వేశారు. మామడ మండలం పొన్కల్, అనంతపేట్, పోతారం గ్రామాల్లో మొక్కజొన్న, జొన్న, పసుపు పంటలకు నష్టం వాటిల్లింది. ఉడికించిన పసుపు పంట తడవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దెబ్బతిన్న పంటలను ఏఈవో సంతోష్‌కుమార్ రైతులతోకలిసి పరిశీలించారు.
నిర్మల్ డివిజన్‌లో..
2,500 ఎకరాలలో నష్టం
లక్ష్మణచాంద: జిల్లాలో సోమవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి చేతికి వచ్చిన మొక్కజొన్న పంట నేలమట్టమైంది. పది రోజుల్లో చేతికి వచ్చే పంట చేతికి రాకుండా పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లా వ్యాప్తంగా 2,500 ఎకరాలలో మొక్కజొన్న పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్ తెలిపారు. సోన్ మండలంలోని న్యూవెల్మల్, బొప్పారం గ్రామాల్లో డీఏవో అంజిప్రసాద్ పంటలను పరిశీలించారు.
నిర్మల్
నిర్మల్
నిర్మల్
నిర్మల్


