చలో సెక్రటేరియేట్‌కు తరలిన ఆర్టీసీ ఉద్యోగులు | - | Sakshi
Sakshi News home page

చలో సెక్రటేరియేట్‌కు తరలిన ఆర్టీసీ ఉద్యోగులు

Feb 25 2026 10:29 AM | Updated on Feb 25 2026 10:29 AM

చలో సెక్రటేరియేట్‌కు  తరలిన ఆర్టీసీ ఉద్యోగులు

చలో సెక్రటేరియేట్‌కు తరలిన ఆర్టీసీ ఉద్యోగులు

భైంసాటౌన్‌: తమ సమస్యలు పరిష్కరించాలని భైంసా డిపో ఆర్టీసీ ఉద్యోగులు మంగళవారం హైదరాబాద్‌ తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న సమస్యలు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, 2021 వేతన సవరణ, ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌, కార్మికులందరికీ ఉద్యోగ భద్రత, యూనియన్ల పునరుద్ధరణ డిమాండ్లపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా చలో సెక్రటేరియేట్‌ చేపట్టినట్లు తెలిపారు. సమస్యలు పరిష్కరించకపోగా పనిభారం పెంచి, బస్సుల సంఖ్య తగ్గించి ప్రైవేట్‌ బస్సులను ప్రవేశపెట్టడం దుర్మార్గమన్నారు. కార్మికులకు రావాల్సిన బకాయిలు చెల్లించకుండా జాప్యం చేయడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికై న ప్రభుత్వం స్పందించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement