breaking news
Nirmal District Latest News
-
ఇంటర్‌కూ ప్రత్యేకం
నిర్మల్రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కుంటాల: నిర్మల్ జేఎన్ఆర్ కళాశాలలో మంగళవారం నిర్వహించిన సౌత్ ఇండియా సైన్స్ డ్రామా ఫెస్టివల్ పోటీల్లో కుంటాల ఆదర్శ పాఠశాల విద్యార్థులు గనుశ్రీ, స్వప్న, దివ్య, నాగజ్యోతి, విద్య, విశాల్, జెస్వంత్, కార్తికేయ ప్రతిభ కనబరిచారు. వీరు ‘స్మార్ట్ అగ్రికల్చర్’ నాటికను ఉపాధ్యాయులు గంగాప్రసాద్, ఉమేశ్‌రావు, నవీన్‌కుమార్, దత్తు ప్రోత్సాహంతో ప్రదర్శించారు. జిల్లాస్థాయిలో మొదటి బహుమతి సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరిని బుధవారం జిల్లా విద్యాధాకారి భోజన్న, ప్రిన్సిపాల్ ఎత్రాజ్ రాజు అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. కబడ్డీ పోటీలకు.. లక్ష్మణచాంద: రాష్ట్రస్థాయి అండర్–14 కబడ్డీ పోటీలకు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి కే సంజీవ్ ఎంపికై నట్లు పీడీ శ్రీనివాస్ తెలిపా రు. ఇటీవల నిర్వహించిన మండల, జిల్లా, జోనల్ స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు పేర్కొన్నారు. సంజీవ్ ఈ నెల 16నుంచి 18వ తేదీ వరకు హైదరాబాద్‌లోని పటాన్చెరులో నిర్వహించనున్న పోటీల్లో పాల్గొంటాడని తెలిపారు. సంజీవ్‌కు ప్రధానోపాధ్యాయుడు రాజునాయక్, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. లక్ష్మణచాంద: ప్రభుత్వ జూనియర్ కళాశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్ బోర్డు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇటీవలే నిధులు కేటాయించి జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తోంది. అధ్యాపకులు, వి ద్యార్థుల హాజరులో మరింత పారదర్శకతకు ఫేషి యల్ రికగ్నిషన్ విధానాన్ని అమలు చేస్తోంది. ప్ర స్తుతం వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలి తాలు సాధించేందుకు ప్రత్యేక తరగతుల నిర్వహణకు శ్రీకారం చుట్టి ప్రారంభించింది. ఇప్పటికే తరగతులు షురూ.. జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులను గ్రూపులుగా విభజించి ప్రత్యేక తరగతులు ప్రారంభించినట్లు జిల్లా నోడల్ అధికారి పరశురాంనాయక్ తెలిపారు. సాయంత్రం 3.30 నుంచి 5వరకు రోజుకు గంటన్నరపాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. విద్యార్థుల సందేహాలను అక్కడికక్కడే నివృత్తి చేస్తున్నారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తాం ప్రత్యేక తరగతుల సమయంలో మా సందేహాల ను అధ్యాపకులు వెంటనే నివృత్తి చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. ప్రత్యేక తరగతులకు వెళ్లి ఉత్తమ ఫలితాలు సాధిస్తాం. – హరిత, ఇంటర్ మొదటి సంవత్సరం బోర్డు సూచనల మేరకే.. ఇంటర్ బోర్డు అధికారుల సూచనల మేరకే జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఇప్పటినుంచే వారిని సన్నద్ధం చేస్తున్నాం. – పరశురాంనాయక్, జిల్లా నోడల్ అధికారి ప్రయోజనం ఉంది ఇంటర్ బోర్డు అమలు చేస్తున్న ప్రత్యేక తరగతులు ఉపయోగకరంగా ఉన్నా యి. నేను ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నాను. ఇంటి వద్ద చదువుకునే పాఠ్యాంశాలను కాలేజీలోనే చదువుకుంటున్నాం. సందేహాలు నివృత్తి చేసుకుంటున్నాం. – మౌనిక, ఇంటర్ ద్వితీయ సంవత్సరం జిల్లా సమాచారం ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 13 ఫస్టియర్ విద్యార్థుల సంఖ్య 2,592 సెకండియర్ విద్యార్థుల సంఖ్య 2,252 మొత్తం విద్యార్థుల సంఖ్య 4,844ఫిబ్రవరి చివరలో పరీక్షలు ఈసారి మార్చి రెండో వారంలో కాకుండా ఫిబ్రవరి చివరలోనే వార్షిక పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి సీఎం రేవంత్‌రెడ్డికి నివేదించినట్లు తెలిసింది. ఒక వేళ సీఎం బోర్డు ప్రతిపాదనలు ఆమోదిస్తే ఫిబ్రవరి చివరలోనే వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఇప్పటి నుంచే క్రమం తప్పకుండా ప్రత్యేక తరగతులకు హాజరు కావాలని అధ్యాపకులు కోరుతున్నారు.గత ఫలితాలు ఇలా.. 2024–25 విద్యాసంవత్సరంలో జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 4,332 విద్యార్థులకు 3,149 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్‌లో 73.13 శాతం, సెకండియర్‌లో 71.71 శాతం ఫలితాలు సాధించి రాష్ట్ర స్థాయిలో జిల్లాను 11వ స్థానంలో నిలిపారు. ఈసారి మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఇప్పటినుంచే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
హంటర్డాగ్పై అవగాహన
మామడ: అటవీ ప్రాంతంలో జంతువులను వే టాడడం, అక్రమంగా కలప తరలించడం లాంటి నేరాలకు పాల్పడిన నిందితులను తక్కువ సమయంలో గుర్తించే హంటర్డాగ్పై బుధవా రం దిమ్మదుర్తి గ్రామంలో అవగాహన కల్పించారు. హంటర్ డాగ్‌తో రిహార్సల్స్ నిర్వహించి వివరించారు. ఎవరైనా వన్యప్రాణులను వేటా డితే ఆ ప్రాంతానికి హంటర్డాగ్ను తీసుకువెళ్తె నేరస్తుల అడుగుజాడల ఆధారంగా వారిని గుర్తిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్ఆ ర్వో శ్రీనివాస్‌రావు, ఎఫ్ఎస్వో శ్రీనివాస్, అన్నపూర్ణ, జాఫర్, సిబ్బంది పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, సంబంధిత అధికారులతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రాల్లో సరిపడా గన్నీ సంచులు, తూకపు, తేమ యంత్రాలు, టా ర్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని, అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ధాన్యం త రలింపునకు సరిపడా లారీలు సమకూర్చుకోవా లని, సకాలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించి ముగించాలని పేర్కొన్నారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మా ట్లాడుతూ.. కలెక్టర్లు స్వయంగా కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేస్తూ, ప్రక్రియ సరిగా జరిగేలా పర్యవేక్షించాలని సూచించారు. మొక్కజొన్న కొ నుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాల ని తెలిపారు. అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ.. త్వరలోనే కేంద్రాలు ఏర్పా టు చేసి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామని చెప్పారు. కొనుగోళ్లు సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకుంటామని వివరించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, పౌర సరఫరాల అధికారి రాజేందర్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ సుధాకర్, డీఆర్డీవో విజయలక్ష్మి, వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
హక్కుల కోసం రాజీలేని పోరు
భైంసారూరల్: ఉద్యోగుల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నట్లు ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాదవ్ వెంకట్రావు తెలిపా రు. బుధవారం మండలంలోని తిమ్మాపూర్ గ్రా మంలో నిర్వహించిన డివిజన్ స్థాయి సంఘ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఉద్యమించక తప్పదని, రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఉద్యోగ, ఉపాధ్యాయుల పీఆర్సీ, డీఏ బకాయిలు చెల్లించడం లేదని ఆరోపించారు. 2012 కంటే ముందు నియమితులైన టీచర్లకు టెట్ మినహాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రద్దు చేయాలని, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతకు సబ్ కమిటీ వేసి పెండింగ్ సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. పర్యవేక్షణ అథారిటీ కమిటీలో ఉపాధ్యాయుల స్థానంలో విద్యావలంటీర్లను నియమించాలని కోరారు. ఉద్యోగ విరమణ పొందిన వా రికి వెంటనే పింఛన్ మంజూరు చేసి పత్రాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర నాయకుడు ధర్మాజీ చందనే, జిల్లా అధ్యక్షుడు భూక్య రాజేశ్‌నాయక్, ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్, గంగన్న, రామునాయక్, మారుతి, సునీల్ తదితరులున్నారు. -
బీమాతో కుటుంబానికి ధీమా
భైంసారూరల్: బ్యాంక్ రుణాలు తీసుకున్నవారంతా కేంద్రం అమలు చేస్తున్న బీమా పథకాల్లో చేరాలని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆర్ఎం నవీన్‌కుమార్ సూచించారు. బుధవారం మండలంలోని ఇలేగాంలో బాధిత కుటుంబానికి ప్రమాదబీమా చెక్కు అందించే కార్యక్రమానికి హాజరైన ఆయన బీమా పథకాలపై అవగాహన కల్పించారు. పీఎంజేవై, ఏంఎస్వై పథకాల్లో ఏడాదికి రూ.20నుంచి రూ.450 ప్రీమియంతో చేరినవారికి ప్రమాద మరణాలు సంభవించినప్పుడు బాధిత కుటుంబానికి రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌లో రూ.500 నుంచి రూ.2వేల వరకు ప్రీమియం చెల్లించిన వారికి రూ.10లక్షల నుంచి రూ.40లక్షల వరకు బాధిత కుటుంబానికి బీమా సొమ్ము అందుతుందని తెలిపారు. ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన నీలం సాయినాథ్ కుటుంబానికి రూ.10లక్షల చెక్కు అందించారు. ఎస్ఎంవో అభినయ్, ఎస్ఎంబీ విలాస్, దేగాం బ్యాంక్ మేనేజర్ కే సోని, ఫీల్డ్ ఆఫీసర్ ఉదయ్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
డిపాజిట్ పెంచినా అదే పోటీ
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో మద్యం షాపుల దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుండగా ఈసారి వ్యాపారులు అధికసంఖ్యలో పోటీ పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2025–2027 సంవత్సరానికి మద్యం షాపుల నిర్వహణకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రూ.3లక్షల చలాన్‌తో సెప్టెంబర్ 26 నుంచి ఎకై ్సజ్ అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 47 మద్యం షాపులున్నాయి. అయితే, గతంలో పలు వైన్‌షాపులకు వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ప్రస్తుతం కూడా వాటికే అధిక డిమాండ్ ఉంటుందని ఎకై ్సజ్ వర్గాలు భావిస్తున్నాయి. రెండేళ్ల కాలపరిమితిలో రూ.కోట్లలో వ్యాపారం జరగడంతో వ్యాపారులు అధిక ఆదాయం వచ్చే మద్యం షాపులపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అధిక ఆదాయ మున్న షాపులు దక్కించుకునేందు కు గ్రూపులుగా ఏర్పడి దరఖాస్తు చే సుకునేందుకు సిద్ధమవుతున్నారు. అత్యధిక దరఖాస్తులు ఇక్కడే.. జిల్లాలో దాదాపు 20 వైన్‌షాపులకు 2023–2024లో ఎక్కువగా దరఖాస్తులు వచ్చినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ తెలిపారు. శాంతినగర్‌లో గల మద్యం షాపునకు 76 దరఖాస్తులు రాగా, సెప్టెంబర్ వరకు లిక్కర్ విక్రయం ద్వారా రూ.19.31 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో ఈసారి మరో వైన్‌షాప్‌నకు అదే ఏ రియాలో అవకాశం కల్పించారు. కా గా, గతంలో మాదిరిగా ఈ వైన్‌షా ప్నకు దరఖాస్తులు వస్తాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 18వరకు గడువు మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 18న సాయంత్రం 5గంటల వరకు అవకాశముంది. గతంలో చివరి దశలో అత్యధిక దరఖాస్తులు వచ్చాయి. ఈసారీ అదే మాదిరిగా దరఖాస్తులు అత్యధిక సంఖ్యలో వస్తాయని భావించిన ఎకై ్సజ్ అధికారులు వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న ప్రధాన ఎక్సైజ్‌శాఖ కార్యాలయంలో స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. బుధవారం సాయంత్రం వరకు 47 దుకాణాలకు 65 దరఖాస్తులు వచ్చినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ వెల్లడించారు. బుధవారం ఒక్కరోజే 42 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. వైన్‌షాప్‌లకు దరఖాస్తుల వెల్లువ గతంలో అధిక దరఖాస్తులు, ఆదాయం వచ్చిన షాపులు గెజిట్ దరఖాస్తులు మొదటి ఏడాది ఈ ఏడాది సెప్టెంబర్ నెంబర్ ఆదాయం 25వరకు ఆదాయం (రూ.కోట్లలో) (రూ.కోట్లలో) 2 38 12.85 11.49 3 24 15.75 13.33 5 37 10.37 6.88 6 33 10.30 7.42 7 21 11.08 8.49 8 20 10.22 6.98 10 74 18.22 14.70 19 45 12.37 13.49 20 33 15.63 13.41 22 16 10.46 11.45 23 28 10.53 9.62 27 21 7.10 11.75 28 20 10.84 9.79 37 15 10.18 8.91 45 12 13.00 9.92 47 31 10.61 10.08 ఒక్కరోజే 42 దరఖాస్తులు నిర్మల్ టౌన్: జిల్లాలోని 47 మద్యం దుకాణాలకు బుధవారం ఒక్కరోజే 42 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎకై ్సజ్ అధికారి అబ్దుల్ రజాక్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎకై ్సజ్‌శాఖ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించారు. ఈనెల 18న సాయంత్రం వరకు దరఖాస్తులు స్వీకరించి 23న లాటరీ పద్ధతిలో షాపులు కేటాయిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నిర్మల్, భైంసా ఎకై ్సజ్ సీఐలు రంగస్వామి, నజీర్ హుస్సేన్, సిబ్బంది పాల్గొన్నారు. -
17 నుంచి ప్రతిష్టాపనోత్సవాలు
బాసర: బాసరలోని శ్రీలలితా చంద్రమౌళీశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఈనెల 17 నుంచి 19 వరకు నిర్వహించనున్నారు. ఉత్సవాల ఆహ్వాన పత్రికను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మంగళవారం బాసరలో ఆవిష్కరించారు. కుంభాభిషేక మహోత్సవాలకు జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి ముఖ్య అతిథిగా హాజరవుతారని వెల్లడించారు. ఈ పండుగ సందర్భంగా ప్రత్యేక వేద పాఠశాలను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయడానికి యత్నిస్తున్నట్లు తెలిపారు. అంకురార్పణ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని వెల్లడించారు. ఆలయ అభివృద్ధికి కార్యక్రమాలు భవిష్యత్ ఆలయ అభివృద్ధిలో భాగంగా 108 లింగాలు, 12 జ్యోతిర్ లింగాలు, 8 ఫీట్ల ఎత్తైన నంది విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తారని తెలిపా రు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం మండల మాజీ అధ్యక్షుడు పెద్దకొండ్రు సుధాకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ సతీశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు ముత్యం సంతోష్, హరిప్రసాద్, చింత రాజు, కొమ్ము సుధాక్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. -
క్రీడల్లోనూ రాణించాలి
● డీఈవో భోజన్న నిర్మల్ రూరల్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని డీఈవో భోజన్న అన్నారు. జిల్లా కేంద్రంలో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ అండర్–14, 17 బాల బాలికలకు ఎంపిక పోటీలు మంగళవారం నిర్వహించారు. డీఈవో పోటీలను ప్రా రంభించారు. 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు టీష ర్టులు అందజేశారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జోనల్‌స్థాయి పోటీలకు ఎంపిక చేశా రు. కార్యక్రమంలో ఆర్గనైజర్ శ్రీనివాస్, పీఈటీలు అంబాజీ, రాముగౌడ్ పాల్గొన్నారు. జోనల్‌స్థాయికి ఎంపికై న క్రీడాకారులు.. అండర్ 14 బాలికలు.. ఆరాధ్య, అద్విత, అన్వితశ్రీ(వాసవి పాఠశా ల), హర్షిత(శ్రీచైతన్య), లాస్య(నారాయణ భైంసా) అండర్ 14 బాలురు.. అర్జున్, శివదీప్, అద్విత్(విజయ హైస్కూల్), జషిత్(శ్రీచైతన్య), లవ్‌కుమార్(నారాయణ భైంసా) అండర్ 17 బాలికలు.. ప్రతిభ (విజయ హైస్కూల్), అక్షర, అవని పటేల్, సహస్ర(వాసవి), భక్తి(అల్ఫోర్స్) అండర్ 17 బాలురు.. సోహాన్, ఇమాద్, సాయి సంస్కార్, సంపత్‌రెడ్డి (విన్నర్స్ హైస్కూల్), విగ్నేష్ (నారాయణ హైస్కూల్) -
పత్తి కొనుగోళ్లు ఆలస్యం
భైంసా/భైంసారూరల్: దసరా పండుగ దాటినా జిల్లాలో పత్తి కొనుగోళ్లపై స్పష్టత కరువైంది. కేంద్రాల ఏర్పాటు ప్రణాళికే ఖరారు కానట్లు తెలుస్తోంది. దీంతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. సాధారణంగా పత్తి పంట దసరా సమయానికి రైతుల చేతికి వస్తుంది. రైతులు కొనుగోలు కేంద్రాలకు తరలిస్తారు. ఏటా కొనుగోళ్లు జాప్యం కారణంగా రైతులు నష్టపోతున్నారు. ఈసారైనా సమయానికి కేంద్రాలు తెరవాలని రైతులు కోరుతున్నారు. నిర్మల్, సారంగాపూర్, ఖానాపూర్, కుభీర్, భైంసా ప్రాంతాల్లో పత్తి కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క కేంద్రం కూడా ప్రారంభం కాలేదు. సీసీఐలోనే మద్దతు పత్తి పంటకు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర దక్కుతుంది. ప్రైవేటుగా అమ్మితే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికే అధిక వర్షాలతో దిగుబడి తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు వ్యాపారులు రంగంలోకి దగక ముందే సీసీఐ కేంద్రాలు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. ప్రైవేటుగా విక్రయిస్తే పెట్టుబడి కూడా రాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ తప్పనిసరి రైతులు పత్తి విక్రయానికి ముందుగా ఆన్లైన్ ఆధార్ ధ్రువీకరణతో సంబంధిత కేంద్రాల్లో రిజిస్టర్ కావాల్సిందేనని అధికారులు సూచిస్తున్నారు. పత్తి విక్రయించి వచ్చే మొత్తాన్ని రైతుల ఆధార్ లింక్ బ్యాంక్ ఖాతాల్లోనే డిపాజిట్ చేస్తారు. యాప్‌లో స్లాట్ బుకింగ్ సీసీఐ తాజా సంవిధానంగా ’కపాస్ కిసాన్’ మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఏఈవోలు సేకరించిన వ్యవసాయ వివరాలు వ్యవసాయ పోర్టల్‌కు అనుసంధానించబడ్డాయి. రైతులు తమ సెల్ ఫోన్ నంబర్‌తో యాప్‌లో నమోదు చేసుకుంటే, జిన్నింగ్ మిల్, పత్తి అమ్మే తేదీ కేటాయించబడుతుంది. అవగాహన లేని వారు తమ క్లస్టరు ఏఈవో ద్వారా కూడా నమోదు చేయవచ్చు. త్వరలోనే కొనుగోళ్లు భైంసా మార్కెట్లో త్వరలోనే పత్తి కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. జిల్లాలో భైంసాలోనే అత్యధిక కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించాం. రైతులు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించకుండా నేరుగా సీసీఐ కేంద్రాలకే పంట తీసుకురావాలి. ఈయేడు క్వింటాల్ పత్తికి ప్రభుత్వం రూ.8110గా మద్దతు ధర నిర్ణయించింది. – ఆనంద్‌రావుపటేల్, ఏఎంసీ చైర్మన్మద్దతు ధర ఇలా.. కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో కొనుగోలుకు మద్దతు ధర ప్రకటించింది. పత్తి తేమ శాతం ఆధారంగా ధరలు ఉంటాయి. 12% తేమ శాతానికి మించి ఉన్న, నాణ్యత లేదా వర్షానికి తడిసిన పత్తిని సీసీఐ కొనుగోలు చేయదు. -
ప్రజాక్షేత్రంలో ఉన్నవారికే పదవులు
భైంసాటౌన్: నిత్యం ప్రజల్లో ఉంటూ, పార్టీ కోసం పనిచేసేవారికి తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందని ఏఐసీసీ జిల్లా పరిశీలకులు, కర్ణాటక ఎమ్మెల్యే అజ య్‌సింగ్ అన్నారు. పట్టణంలో మంగళవారం నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో మాట్లాడారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నూతన అధ్యక్షుడి ఎన్నికపై పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్‌తోనే సాధ్యమయ్యాయన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎన్నిక ప్రస్తావిస్తూ.. ప్రజలకు సేవ చేసే నాయకులకు గుర్తింపు ఉంటుందని, పార్టీ పదవులు కట్టబెడుతుందన్నారు. మచ్చ లేనివారినే ఎన్నుకోండి... ఎలాంటి అవినీతి మచ్చ లేనివారినే డీసీసీ నూతన అధ్యక్ష పదవికి ఎంపిక చేయాలని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బి.నారాయణ్‌రావు పటేల్ అజయ్‌సింగ్‌ను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొందరు రాజకీయాన్ని దందాగా మార్చుకుంటున్నారని వేదికపై ఉన్న మాజీ ప్రజాప్రతినిధిని ఉద్దేశించి మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళితబంధు పథకంలో అవినీతికి పాల్పడ్డారని, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎవరైనా అవినీతికి పాల్పడి తే జైలు పాలవుతారంటూ హెచ్చరించారు. పార్టీకి చెడ్డ పేరు రాకుండా డీసీసీ అధ్యక్షుడిని ఎన్నుకో వాలని సూచించారు. డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, కోఆర్డినేటర్ జితేందర్, టీపీసీసీ పరిశీలకులు రాంభూపాల్, ధనపతి, వేణుగోపాలచారి, ఇంద్రకరణ్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
‘బెస్ట్’ విద్యార్థులు నష్టపోవద్దు
నిర్మల్‌చైన్‌గేట్: బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో విద్యార్థుల విద్యా బోధనలో ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా, అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి మల్లుభట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పరిస్థితులపై హైదరాబాదులో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భట్టి మాట్లాడుతూ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌లో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించాలన్నారు. విద్యార్థుల విద్యా బోధనలో ఏ విధమైన ఆటంకాలు లేకుండా చూడాలని తెలిపారు. తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలతో సమన్వయం కలిగి విద్యార్థుల ప్రయోజనాలు కాపాడాలన్నారు. ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, బడుగు బలహీనవర్గాల పిల్లలకు మౌలిక వసతులతో విద్య అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మెరుగైన విద్యా బోధనకు చర్యలు.. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమిస్తామన్నారు. సంబంధిత శాఖల అధికారులు ఈ పథకం అమలుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఈవో భోజన్న, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల అధికారులు దయానంద్, అంబాజీ, మోహన్‌సింగ్ పాల్గొన్నారు. -
ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
ఖానాపూర్: ఆశ వర్కర్ల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు టి.జయలక్ష్మి అన్నారు. మండలంలోని మస్కాపూర్‌లో యూనియన్ మూడో జిల్లా మహాసభ మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విజయలక్ష్మి హాజరై మాట్లాడారు. కేంద్రం ఆశ వర్కర్ల సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. కనీస వేతనం రూ.26 వేలతోపాటు అర్హతను బట్టి పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతకుముందు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం నుంచి సభా వేదిక వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జెండాను ఆవిష్కరించి కార్యక్రమం ప్రారంభించారు. -
రైతుల పాదయాత్ర షురూ..
భైంసా: జిల్లాలో సోయా కొనుగోలు కేంద్రాల ప్రారంభించాలని కోరుతూ భారత్ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు మంగళవారం పాదయాత్ర ప్రారంభించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి రైతులతో కలిసి బాసర సరస్వతీ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం పాదయాత్రగా కదులుతూ రోడ్డు పక్కనే కుప్పలుగా వేసిన సోయా కల్లాలపై వెళ్లి రైతులతో మాట్లాడారు. పంట కోసి నెలరోజులైనా కేంద్రాలు తెరవలేదని కురుస్తున్న వర్షాలతో ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోయా రైతులను ఓదారుస్తూ పాదయాత్ర లో ముందుకు వెళ్లారు. బిద్రెల్లి టాక్లి ముధోల్ పంట శివారులో భారీ వర్షాలతో నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా వ్యవసాయ అధికారులు పంట క్షేత్రాలు పరిశీలించిన ఇప్పటివరకు పరిహారం ఇప్పించలేకపోయారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలు కరువు.. కొనుగోలు కేంద్రాల ప్రారంభం కోరుతూ, భారీ వర్షంతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర ప్రారంభించినట్లు భారతీయ కిసాన్ సంఘ సభ్యులు తెలిపారు. ప్రభుత్వం ప్రైవేట్ మాఫియాను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. పంటలు కోయడానికి కూలీల కొరత తీవ్రంగా ఉందని ఇప్పటికే రేటు లేక రైతులు ఇబ్బంది పడుతుండగా, కొనుగోలు కేంద్రాలు లేకపోవడం మరింత భారమైందని పాదయాత్రలో రైతులు చెబుతున్నారు. నేడు సబ్ కలెక్టర్‌కు వినతి బాసర నుంచి ప్రారంభమైన యాత్ర ముధోల్‌కు చేరుకుంది. రెండోరోజు బుధవారం భైంసా వరకు కొనసాగనుంది. సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం ఇవ్వనున్నారు. సోయా పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలని, భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని నాయకులు కోరనున్నారు. -
దేశ అభివృద్ధిలో సైన్స్ పాత్ర కీలకం
నిర్మల్ రూరల్: దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎన్నో దేశాలకు మార్గదర్శకంగా ఉందని, దేశం వేగంగా అభివృద్ధి చెందడంలో సైన్స్ పాత్ర చాలా కీలకమని డీఈవో భోజన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని జేవీఎన్ఆర్ ఉన్నత పాఠశాలలో మంగళవా రం నిర్వహించిన ‘సౌత్ ఇండియా సైన్స్ డ్రామా ఫెస్టివల్’లో మాట్లాడారు. విద్యార్థులు ఆవిష్కరణ లు చేసే దిశగా చిన్నప్పటినుంచే ప్రయత్నించాలన్నారు. వ్యవసాయ రంగంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర పెరగడంతో పంటల దిగుబడి పెరుగుతోందన్నారు. ‘మానవ అభివృద్ధి కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర ’అనే ప్రధాన అంశంతో నిర్వహించిన ఈ డ్రామా ఫెస్టివల్లో జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి 20 డ్రామాలతో 180 మంది విద్యార్థులు హాజరయ్యారు. స్మార్ట్ వ్యవసాయం, డిజిటల్ ఇండియా, ఆరోగ్యం– పరిశుభ్రత, గ్రీన్ టెక్నాలజీ అనే అంశాలతో విద్యార్థులు చేసిన డ్రామాలు మెప్పించాయి. జ్యూరీ మెంబర్లుగా సంపత్‌కుమార్, నాగరాజు, రఫీ వ్యవహరించా రు. ఇందులో తెలంగాణ మోడల్ స్కూల్ కుంటాల కు చెందిన కార్తికేయ, దివ్య, నాగజ్యోతి, గనుశ్రీ, స్వప్న, విశాల్ జస్వంత్ విద్యార్థులు విజయం సాధించారు. రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. జిల్లా సైన్స్ అధికారి వినోద్‌కుమార్, సైన్స్టీం సభ్యులు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన సోయా రైతులు
భెంసాటౌన్: భైంసాలో సోయా రైతులు రోడ్డెక్కారు. చేతికొచ్చిన సోయా పంటను రైతులు మార్కెట్‌కు తెస్తున్నారు. సోమవారం రైతులు వివిధ ప్రాంతాల నుంచి 495 లాట్లు వచ్చాయి. అయితే కొనుగోళ్ల ప్రారంభించకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధర కోట్ చేశారు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. గాంధీగంజ్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. స్పందించిన ఏఎంసీ అధికారులు రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయి తే మాటామాటా పెరగడంతో రైతులు, అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడకు చేరుకున్న సీఐ గోపీనాథ్ రైతులతో మాట్లాడారు. మార్కెట్ యార్డుకు ఉదయమే సోయా తెచ్చామని, వ్యాపారులు సాయంత్రం 4:30 వరకు ధర నిర్ణయించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనామ్ సర్వర్ సమస్య ఉందని జాప్యం చేశారని ఆరోపించారు. తీరా వ్యాపారులు ఆలస్యంగా తక్కువ ధర నిర్ణయించారని పేర్కొన్నారు. చాలామంది రైతులకు క్వింటాల్‌కు కేవలం రూ.3,900 ధర మాత్రమే వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండురోజుల క్రితం రూ.4వేలకుపైగా ధర ఉండగా, రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు తగ్గించారని వాపోయారు. ఏఎంసీ ఉన్నత శ్రేణి కార్యదర్శి పూర్యానాయక్, సీఐ గోపీనాథ్ రైతులను సముదాయించారు. మంగళవారం కొత్త లాట్లు కొనుగోలు చేయకుండా తాత్కాలికంగా బీట్ నిలిపివేస్తామని, ధర తక్కువ కోట్ అయిన రైతులు మంగళవారం మరోమారు బీట్‌లో విక్రయించుకోవాలని సూచించారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. -
వ్యాపారుల సిండికేట్
‘జిల్లాకు చెందిన ఓ మద్యం వ్యాపారి గత సీజన్ మద్యం షాపుల కోసం ఆయనతోపాటు కుటుంబ సభ్యుల పేర్లతో రూ.16 లక్షలతో ఎనిమిది డీడీలు తీశాడు. జిల్లాలోని కొన్ని దుకాణాలకు దరఖాస్తులు చేశాడు. దురదష్టవశాత్తు ఒక్క షాపు కూడా లాటరీలో తగలలేదు. ఇప్పుడు అదే వ్యాపారి మరో నలుగురు మిత్రులతో సిండికేటుగా ఏర్పడి పలు షాపులకు దరఖాస్తు చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇందులో ఒకటి, రెండు వచ్చినా.. లాభం మాట ఏమో కానీ నష్టం మాత్రం రాదనే నమ్మకంతో ఉన్నాడు’ ఇలా జిల్లాలో మద్యం వ్యాపారులు ఎలాగైనా షాపులు దక్కించుకోవడమో.. లేదా షాపుల్లో భాగస్వామ్యంగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ‘పోతే రూ. 3 లక్షలు, వస్తే రూ.కోటి’ అన్నట్లు ఒంటరిగా దరఖాస్తులు చేస్తున్నారు.నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో మద్యం షాపుల కేటాయింపులు మళ్లీ ప్రారంభం కానుండటంతో వ్యాపారులు ఉత్సాహంగా సన్నాహాలు చేస్తున్నారు. గత సీజన్లో అపజయం పొందిన వారు ఈసారి కొత్త వ్యూహంతో ముందుకు వస్తున్నారు. ఎకై ్సజ్ శాఖ మార్గదర్శకాల ప్రకారం లాటరీ ద్వారా షాపులు కేటాయించబడతాయి. ప్రతీ దరఖాస్తుతో రూ.3 లక్షల డీడీ సమర్పించాలి. లాటరీలో షాపు రాకపోయినా డీడీ తిరిగి రాదు. దీంతో వ్యాపారులు సిండికేట్ అవుతున్నారు. ఆర్థిక నష్టం ముప్పును పంచుకుంటున్నారు. ఒక్కొక్కరు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు వాటాగా చెల్లిస్తున్నారు. ఎవరికి షాపు దక్కినా బాండ్ పేపర్ ఒప్పందం ప్రకారం ప్రతి ఒక్కరికీ వాటా లభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 13 తర్వాత దరఖాస్తుల జోరు.. ఎకై ్సజ్ అధికారులు ఈ నెల 13 తర్వాత దరఖాస్తుల సమర్పణ వేగం మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ప్రతీ టెండర్ కాలంలో దరఖాస్తు ఫీజును పెంచుతూ వస్తోంది. 2019–21లో రూ.లక్షగా ఉన్న ఫీజు 2021–23లో రూ.2 లక్షలకు పెరిగింది. తాజాగా 2025–27 టెండర్లకు రూ.3 లక్షలుగా నిర్ణయించింది. అయినా వ్యాపారులలో ఉత్సాహం తగ్గలేదు. లాటరీ గెలవకపోయినా నాన్ రీఫండ్ అయినా ఫర్వాలేదు అనే ధైర్యంతో ముందుకు వస్తున్నారు. ఖజానాకు కోట్ల రూపాయలు.. రియల్ ఎస్టేట్, టెక్స్టైల్స్, రాజకీయ రంగాలకు చెందిన పెట్టుబడిదారులు కూడా ఈ పోటీలో దిగుతున్నారు. గతంలో 47 షాపుల కోసం 1,067 దరఖాస్తులు వచ్చి ప్రభుత్వానికి రూ.21.34 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి దరఖాస్తుల సంఖ్య రెట్టింపు అవుతుందని, ప్రభుత్వానికి రూ.40 కోట్ల ఆదాయం వస్తుందని ఎకై ్సజ్ శాఖ చెబుతోంది. జిల్లాలో మద్యం షాపులు, బార్ల వివరాలు.. అర్బన్ ఏరియాలో వైన్సులు బార్లు నిర్మల్ 11 4 ఖానాపూర్ 3 1 భైంసా 5 3 18 మండలాల పరిధిలో వైన్సులు 28 -
క్రీడలతో మానసికోల్లాసం
లక్ష్మణచాంద: క్రీడలతో విద్యార్థులకు మానసికోల్లాసంతోపాటు శారీరక దారుఢ్యం మెరుగుపడుతుందని డీఈవో భోజన్న అన్నారు. మండలంలోని వడ్యాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 14 జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ విద్యార్థులు ఆటలపై ఆసక్తి, అభిరుచి కలిగి ఉండాలన్నారు. మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి క్రీడలు ఉపయోగపడతాయని తెలిపారు. పాఠశాలల్లో విద్యతోపాటు క్రీడలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కాసేపు కబడ్డీ ఆడారు. తనకు కబడ్డీ చాలా ఇష్టమని, తాను పాఠశాలస్థాయిలో ఆడిన ఆటలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ఎంఈవో ఆర్.అశోక్‌వర్మ, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రెటరీ రవీందర్‌గౌడ్, పీఈటీ వై.రమణారావు, మాజీ సర్పంచ్ లింగాగౌడ్, ఉప సర్పంచ్ మోహన్, వీడీసీ సభ్యులు పోలాస గోవర్ధన్, రాజేంద్రప్రసాద్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా జట్లు ఇవే.. అండర్ 14 బాలికల జట్టు అమ్రిన్ బేగం, హర్షవర్ధని, సమంత, అక్షర, అదితి, సాక్షి, రసజ్ఞ, నవనీత, చందన, హర్షిణి, గంగోత్రి, శరణ్య. స్టాండ్ బైగా మనస్విని, అమీలియా, దీక్ష,శ్రీ, నిత్యను ఎంపిక చేశారు. అండర్ 14 బాలుర జట్టు అజయ్, ఎ.అజయ్, సిద్దు, సాయి, రోమన్పాషా, వరుణ్ సందేశ్, పైజాన్, సంజీవ్, నాగ చరణ్, అర్జున్, కవి కుమార్, శేషారావు. స్టాండ్ బైలుగా సుశాంత్, అఖిల్, నాగరాజు, శివసాయి, జశ్వంత్ ఎంపికయ్యారు. -
నేడు రైతుల పాదయాత్ర
భైంసా: రైతులు పండించిన పంటల కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ భారతీయ కిసాన్ సంఘ్ తెలంగాణ ఆధ్వర్యంలో మంగళవారం పాదయాత్ర చేపట్టనున్నారు. లక్ష్మణచాందలో భారతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో రైతులంతా సమావేశం ఏర్పాటు చేశారు. పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడం లేదన్నారు. అధిక వర్షాలతో సోయా, పత్తి, వరి పంటలు నీట మునిగాయని, బాధితులకు ప్రభుత్వం ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదన్నారు. చేతికి వచ్చిన సోయా, పత్తి, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేసింది. ఈమేరకు బాసరలో సరస్వతీ అమ్మవారి ఆలయంలో ఉదయం పూజలు చేసి పాదయాత్ర ప్రారంభించనున్నారు. బాసర నుంచి భైంసా వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. పార్టీలకతీతంగా ఈ సమావేశాలకు హాజరు కావాలని అంతా కోరుతున్నారు. -
ప్రజల్లో నమ్మకం పెంచాలి
నిర్మల్‌టౌన్: పోలీస్ లక్ష్యం చట్టాన్ని అమలు చేయడం మాత్రమే కాదని, ప్రజల్లో నమ్మకం కలిగించడం, వారిని రక్షించడం, గౌరవించబడం అని ఎస్పీ జానకీ షర్మిల అన్నారు. జిల్లాలోని పోలీస్ అధికారుల, సిబ్బందితో సోమవారం సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. డీజీపీ సూచనలు తెలియజేశారు. ఆధునిక పోలీసింగ్ విజయవంతం కావడానికి ప్రజలతో భాగ్యస్వామ్యం కీలకమని సూచించారు. అందరితో మరింత సమన్వయం కలిగి ఉండాలని తెలిపారు. పేదలు, బలహీనవర్గాల వారు తమ సమస్యలతో సహాయం కోసం వస్తారని, వారి బాధలను సహనంతో విని న్యాయంగా పరిష్కరించే బాధ్యత పోలీసులదే అని తెలిపారు. ప్రతిష్ట దెబ్బతీయొద్దు.. అవినీతికి పాల్పడడం వలన పోలీస్ శాఖ ప్రతిష్ట దెబ్బతింటుందని, ప్రజలు విశ్వాసం కోల్పోతారని ఎస్పీ తెలిపారు. అవినీతికి పాల్పడేవారిపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. నిజాయతీ, పారదర్శకత, వృత్తిపరమైన విలువలు పాటించాలని స్పష్టం చేశారు. మీరు నమోదు చేసే ప్రతీ ఎఫ్ఐఆర్, స్పందించే అత్యవసర కాల్, దర్యాప్తు చేసే ప్రతీ కేసు, ఇవన్నీ ప్రజల్లో నిబద్ధత పెంచుతాయని తెలిపారు. కాన్ఫరెన్స్‌లో అదనపు ఎస్పీలు ఉపేంద్రారెడ్డి, అవినాష్‌కుమార్, రాజేశ్‌మీనా, అన్ని పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
నిర్మల్
పీఎంశ్రీలో కరాటే, కుంగ్ఫూయాసంగిలోనైనా నీరందేనా.. గడ్డెన్నవాగు నీరు యాసంగి పంటలకు అందుతుందనేది అనుమానంగానే ఉంది. భారీ వర్షాలతో ఉపకాలువలు కోతకు గురయ్యాయి. ప్రధాన కాలువలు దెబ్బతిన్నాయి.రాష్ట్రస్థాయిలో ప్రతిభ లక్ష్మణచాంద: మహబూబ్‌గర్ జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర జూనియర్ నెట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో మండలంలోని వడ్యాల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అరుణ్ కుమార్, రాజు ప్రతిభ కనబర్చారు. సోమవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులకు ఎంఈవో అశోక్‌వర్మ సర్టిఫికెట్లు అందజేశారు. జాతీయస్థాయిలోనూ రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ సెక్రెటరీ రవీందర్‌గౌడ్, పీఈటీ రమణారావు, పీడీ నచ్చేందర్, సీఆర్పీ సుధాకర్ పాల్గొన్నారు. లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ విద్యాసంస్థలకు సరితూగేలా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ‘‘పీఎంశ్రీ (ప్రధాన్ మంత్రి స్కూల్స్ ఫర్ రైసింగ్ ఇండియా)’’ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి, విద్యార్థులకు నాణ్యమైన విద్య, ప్రగతిశీలమైన వాతావరణం అందిస్తోంది. ఇప్పటికే ల్యాబ్, లైబ్రరీ, సంగీతం కోసం నిధులు కేటాయించింది. తాజాగా బాలికల భద్రతకు ప్రాధాన్యం ఇస్తోంది. బాలికల ఆత్మరక్షణ కోసం.. పీఎంశ్రీ పథకంలో భాగంగా బాలికల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతీ పాఠశాలకు రూ.30 వేల చొప్పున నిధులు మంజూరు చేసింది. జిల్లాలోని 17 పీఎంశ్రీ పాఠశాలలకు ఈ నిధులు ఇప్పటికే విడుదల అయ్యాయని జిల్లా అధికారులు తెలిపారు. కరాటే, కుంగ్‌ఫూ, జూడో శిక్షణ... ప్రతీరోజు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో బాలికలు తమను తాము రక్షించుకునే ధైర్యం పొందడం అవసరమని కేంద్రం అభిప్రాయపడింది. అందుకే పీఎంశ్రీ పాఠశాలల్లో కరాటే, కుంగ్‌ఫూ, జూడో వంటి ఆత్మరక్షణ శిక్షణ అందించేందుకు ఈ నిధులు వినియోగించాలని సూచించింది. నేరుగా ఇన్‌స్ట్రక్టర్ల ఖాతాల్లోకి.. ఇంతకుముందు పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఖాతాల్లో నిధులు జమ చేసి, వాటిని శిక్షకులకు చెల్లించే విధానం ఉండేది. ఈ విద్యా సంవత్సరం నుంచి కేంద్రం విధానాన్ని మార్చింది. ఇప్పుడు నేరుగా ఇన్‌స్ట్రక్టర్ల ఖాతాల్లోనే నిధులు జమ చేస్తోంది. నెలకు రూ.10 వేల చొప్పున, మూడు నెలల శిక్షణకు రూ.30 వేలు చెల్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు. లక్ష్మణచాందలో శిక్షణ పొందుతున్న విద్యార్థినులు శిక్షణ తరగతులు ఇలా.. ప్రతీ పాఠశాలలో కనీసం 72 శిక్షణ తరగతులు నిర్వహించేలా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. వారంలో కనీసం రెండు లేదా మూడు రోజులు పీడీ, పీఈటీ పర్యవేక్షణలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని సూచించింది. కరాటే, కుంగ్‌ఫూ, జూడో శిక్షణలతో బాలికలలో ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. -
కాంగ్రెస్ పథకాలను కాపీ కొడుతున్న బీజేపీ
నిర్మల్‌చైన్‌గేట్: కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను బీజేపీ కాపీ కొడుతోందని ఏఐసీసీ పరిశీలకులు అజయ్‌సింగ్ అన్నారు. జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావుతో కలిసి సోమవారం మాట్లాడారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ‘సంఘటన్ సుజన్ అభియాన్’’ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు నూతన అధ్యక్షులను ఎంపిక చేసేందుకు ఏఐసీసీ పరిశీలకులను నియమించిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తారన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మూడేళ్ల గడువు ఉందని, కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గ్రామ స్థాయిలో ఇంటింటికి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలచారి, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్, సారంగాపూర్, నిర్మల్, భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు అబ్దుల్ హాది, సోమా భీమ్‌రెడ్డి, ఆనంద్‌రావు పటేల్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్, గ్రంథాలయ చైర్మన్ అర్జుమంద్ అలీ, ఆత్మ కమిటీ చైర్మన్ రాంరెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దుర్గాభవాని, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అల్లూరు కృష్ణవేణి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సమరసింహారెడ్డి, నాయకులు పాల్గొన్నారు. కార్యకర్తల అభిప్రాయం మేరకే పార్టీ పదవులు ఖానాపూర్: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల నియామకంలో కార్యకర్తల అభిప్రాయానికి మొదటి ప్రాధాన్యం ఇస్తామని ఏఐసీసీ పరిశీలకులు, కర్ణాటక రాష్ట్ర ఎమ్మెల్యే అజయ్‌సింగ్ అన్నారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ అధ్యక్షతన ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాల ముఖ్యనాయకులు, కార్యకర్తలతో సోమవారం నిర్వహించిన సంఘటన్ సీజన్ అభియాన్ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. పార్టీ పదవుల కోసం ముఖ్య నాయకులు సైతం ఢిల్లీకి వచ్చేవారని అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ నుంచే పార్టీ దూతలు ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓట్చోరీ ద్వారా మరోసారి అధికారంలోకి వచ్చేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. సమావేశంలో రాష్ట్ర పరిశీలకులు ధన్వంత్ తరి, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, కేంద్ర మాజీమంత్రి వేణుగోపాలచారి, మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్, సేవాదళ్ అధ్యక్షుడు జితేందర్, నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, పత్తిరెడ్డి రాజేశ్వర్, వెంపటి రాజేశ్వర్, కృష్ణవేణి, మల్లారెడ్డి, దయానంద్, పడిగెల భూషణ్, ఎంఏ.మాజిద్, చిన్నం సత్యం, తోట సత్యం, నిమ్మల రమేశ్ పాల్గొన్నారు. -
పరిశీలించి.. పరిష్కరించండి
నిర్మల్‌చైన్‌గేట్: తమ అర్జీని పరిశీలించి.. సమస్య పరిష్కరించాలని పలువురు బాధితులు ప్రజావాణిలో కలెక్టర్‌ను వేడుకున్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ అభిలాష అభినవ్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలాలవారీగా పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. అనంతరం అధికారులతో సమీక్ష చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వేగంగా పూర్తి చేయించాలన్నారు. అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫేషియల్ రికగ్నేషన్ హాజరు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీరోజు విద్యాసంస్థల్లో వంద శాతం ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు ఉండేలా చూడాలని పేర్కొన్నారు. ప్రత్యేక అధికారులు ప్రభుత్వ విద్యాసంస్థలను నిరంతరం తనిఖీ చేస్తూ ఉండాలన్నారు. ఈ నెల 15 నుంచి నవంబర్ 14 వరకు పశువులకు టీకాలు వేయనున్నట్లు వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న వరద నష్ట నివారణ బకా యిలు చెల్లించేలా తహసీల్దార్లు చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖలఅధికారులు పాల్గొన్నారు.పట్టా పాస్‌బుక్ ఇప్పించండి.. 2018లో అనారోగ్యం కారణంగా మా అమ్మ అల్లెపు యాదమ్మా(50)మరణించింది. మా కుటుంబ సభ్యుల ఒప్పందంతో తర్లపాడు శివారులోని సర్వే నం137/3 లో ఉన్న ఎకరం భూమిని పట్టా చేసుకున్నాను. కానీ ఇప్పటి వరకు నాకు పాసుబుక్ రాలేదు. పలుమార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లే ఆర్డీవో వద్ద డీఎస్ పెండింగ్ అని తెలుపుతున్నారు. నాకు పాసుబుక్ ఇప్పించండి. – అల్లెపు నర్సయ్య, పాత తర్లపాడు -
క్రీడలతో మానసిక ప్రశాంతత
నిర్మల్‌టౌన్: క్రీడలు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయని బాసర సర్కిల్ అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ శర్వానన్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో ప్రారంభమైన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. పోటీల్లో నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన సుమారు 350 మంది పాల్గొన్నారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, రన్నింగ్, వాకింగ్, చెస్, లాంగ్‌జంప్, షార్ట్‌పుట్, క్యార మ్, జావెలిన్‌త్రో, తదితర క్రీడలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం అడవుల్లో పనిచేసే ఉద్యోగుల్లో ఒత్తిడిని తగ్గించడానికి క్రీడలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ డీఎఫ్‌వో వికాస్ మీనా, ఆదిలాబాద్ డీఎఫ్‌వో రేవంత్ చంద్ర, నిర్మల్ డీఎఫ్‌వో నాగినిభాను, అధికారులు కుమారి చిన్న, సుధాకర్, శివకుమార్, నాలుగు జిల్లాల అటవీ క్షేత్ర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘స్థానికం’పై ఉత్కంఠ
నిర్మల్‌చైన్‌గేట్: ఏడాదిగా ‘‘ఎప్పుడో ఎన్నికలు వస్తాయి’’ అని ఎదురు చూసిన ఆశావహులకు, ఇటీవల ఎన్నికల సంఘం షెడ్యూల్, రిజర్వేషన్ల ప్రకటనతో ఎనలేని ఉత్సాహం వచ్చింది. ఈ నెల 8న హైకోర్టు 42% రిజర్వేషన్లపై స్టే ఇవ్వకుండా నిరాకరించడంతో, ఎన్నికలకు లైన్ క్లియర్ అయినట్లు భావించారు. గురువారం నోటిఫికేషన్ వెలువడడంతో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమై మండల కేంద్రాలు చురుకుగా మారాయి. దసరా వేడుకలను ఎన్నికల ప్రచారంగా మలచుకుని నేతలు గెలుపు లక్ష్యాలతో ముందుకు సాగారు. అయితే అదేరోజు మధ్యాహ్నం హైకోర్టు 42% రిజర్వేషన్లపై మధ్యంతర స్టే ఇవ్వడం ఆశావహులకు ఒక్కసారిగా షాక్ తగిలింది. ఎన్నికల ప్రక్రియకు బ్రేక్.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను గౌరవిస్తూ ఎ న్నికల సంఘం నామినేషన్ ప్రక్రియను నిలిపివేసింది. ఇప్పటివరకు సాగిన ఎన్నికల సమర కథ మళ్లీ మొదటికి చేరింది. ఎన్నికలపై స్పష్టత లేకపోవడంతో కాలయాపన జరుగుతోందని ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఆశావహులు ఎదురు చూస్తున్నారు. మొదటి రోజు నామినేషన్లు.. ఇదిలా ఉంటే జిల్లాలో నోటిపికేషన్ వచ్చిన తొలి రోజే 5 చోట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. కొ న్ని ప్రధాన పార్టీల నాయకులు టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. టికెట్ అవకాశం లేకపోవడంతో పార్టీ మార్చుకున్న వారూ ఉన్నారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్న నేతలకు ఎన్నికల ప్రక్రియ నిలిపివేయడం తీవ్ర నిరాశను కలిగించింది. గ్రామాల్లో అనిశ్చితి.. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9 అమలును హైకోర్టు నిలిపివేయడంతో గ్రామాల్లో చర్చలు ముదిరాయి. పాత రిజ ర్వేషన్ల ప్రకారం ఎన్నికలు కొనసాగుతాయా? లేక పూర్తిగా నిలిపివేయబడుతాయా? ప్రభుత్వం తుది నిర్ణయం ఏమిటి? అని చర్చించుకుంటున్నారు. -
సోయా.. మద్దతు ఏదయా?
నిర్మల్చదువులు చెప్పలేం.. ప్రైవేట్ పాఠశాలల్లోని పేద విద్యార్థుల చదువులకు ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో పాఠశాలలకు రావద్దని యాజమాన్యాలు చెబుతున్నాయి. పునరావాసంలో ఇక్కట్లు గడ్డెన్నవాగు ప్రాజెక్టు పునరావాస గ్రామాల్లో ప్రభుత్వం రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.గజ్జలమ్మ దేవికి పూజలు కుంటాల: కుంటాల ఇలవేల్పు శ్రీ గజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మీ అమ్మవారి ఆలయాల్లో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. శ్రీకాంత్ రామానుజ దాస్ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం, అలంకరణ, అర్చన, హారతి, తదిత ర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గజ్జల మ్మ పల్లకిసేవలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదం పంపిణీ చేశారు. భైంసా/భైంసారూరల్: జిల్లా వ్యాప్తంగా 15 రోజులుగా సోయా కోతలు జోరుగా సాగుతున్నాయి. అయితే అకాల వర్షాల ప్రభావంతో పంట దిగుబడి గణనీయంగా తగ్గింది. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఉన్న రైతులంతా ఎకరానికి కేవలం 4 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది 72,300 మంది రైతులు 1.05 లక్షల ఎకరాల్లో సోయా సాగు చేశారు. ప్రస్తుతం కోసిన పంట తడిసిపోతుందనే భయంతో వెంటనే విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.5,328 ఉన్నా.. కొనుగోలు కేంద్రాలు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. కొనుగోళ్లు ప్రారంభించని మార్క్‌ఫెడ్.. జిల్లాలో నిర్మల్, సారంగాపూర్, ఖానాపూర్, భైంసా, కుభీర్‌లో వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వాటి పరిధిలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. మార్కెట్ అధికారులు అలసత్వం వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అదనుగా ప్రైవేట్ వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి తేమ, నాణ్యత పేరిట రైతులను మోసం చేస్తున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రతీ సీజన్లో వ్యవసాయ మార్కెట్ల జాప్యం కారణంగా రైతులు మద్దతు ధర పొందలేకపోతున్నారు. ప్రైవేటులో ధర లేదు క్వింటాలు సోయాకు ప్రైవేటుగా రూ.4 వేలు చెల్లిస్తున్నారు. మద్దతు ధర రూ.5,328 ఉంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేక ప్రైవేటు వ్యాపారులకే విక్రయించాల్సి వస్తుంది. పంట అమ్ముకున్నాక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఏం లాభం. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి. – సబ్బని మహేందర్, రైతు ప్రభుత్వానికి నివేదించాం జిల్లాలో సోయా కొనుగోలు కేంద్రాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. జిల్లా వ్యాప్తంగా సాగైన పంట, వచ్చే దిగుబడి అన్ని వివరాలు సేకరించాం. ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదు. ప్రభుత్వం అనుమతులు ఇస్తే జిల్లా ఉన్నతస్థాయి అధికారుల ఆదేశాలతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. – ప్రవీణ్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ డీఎం, నిర్మల్ తాత్కాలిక ఉద్యోగానికి దరఖాస్తుల ఆహ్వానం కుభీర్: మండల కేంద్రమైన కుభీర్‌లోని కస్తూరి బా గాంధీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులకు ఆంగ్లం బోధించడానికి తాత్కాలిక పద్ధతిలో ఉపాధ్యాయురాలిని నియమించనున్నట్లు ప్రిన్సిపాల్ వాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఏ, బీఎడ్ చదివిన మహిళలు ఈ నెల 14లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లా వివరాలు.. సోయా సాగు విస్తీర్ణం : 1.05 లక్షల ఎకరాలు సాగుచేసిన రైతులు : 72,300ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర : రూ.5,328ప్రైవేటులో ప్రస్తుతం చెల్లిస్తున్న ధర : రూ.4 వేల నుంచి రూ.4,358 వ్యవసాయ మార్కెట్ కమిటీలు : ఖానాపూర్, నిర్మల్, సారంగపూర్, భైంసా, కుభీర్సోయా పెట్టుబడి ఎకరాకు ఇలా.. విత్తనాలు : రూ.3,000 దున్నడం : రూ.2,000 విత్తనాలు వేసేందుకు : రూ.1,000 రసాయన మందులకు : రూ.1,000 కోత, నూర్పిడి ఖర్చు : రూ.6,000 14న జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక నిర్మల్‌రూరల్: పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈనెల 14న అండర్–14, 17 బ్యాడ్మింటన్ బాలబాలికల జిల్లాస్థాయి జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈవో దర్శనం భోజన్న ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రం శివారులోని కొండాపూర్ బైపాస్ వద్ద గల ‘నిర్మల్ స్పోర్ట్స్ అకాడమీ’లో నిర్వహించనున్న పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు తమ వెంట బోనాఫైడ్, బర్త్ సర్టిఫికెట్, గత సంవత్సరం ప్రోగ్రెస్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్‌లతో ఉదయం 8:30 లోపు రిపోర్టు చేయాలన్నారు. ప్రతీ పాఠశాల నుంచి ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు మాత్రమే పాల్గొనాలని, మిగతా వివరాలకు 9490002133 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ప్రైవేట్ వ్యాపారులే దిక్కు..కొనుగోలు కేంద్రాలు తెరుచుకోకపోవడంతో భైంసా, ఖానాపూర్ వంటి ప్రాంతాల్లో రైతులు పంటను ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. గాంధీగంజ్ మార్కెట్లో క్వింటాలుకు రూ.3,800 నుంచి రూ.4,350 వరకు మాత్రమే ధర లభిస్తోంది. నాణ్యత పేరుతో వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారు. మద్దతు ధరతో పోలిస్తే రూ.వెయ్యి తక్కువ ఇస్తున్నారు. ఇప్పటికే వర్షాలతో నష్టపోయామని, వ్యాపారులు మరింత ముంచుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వస్తే పంట పాడైపోతుందనే భయంతో తక్కువ ధరకే అమ్ముకుంటున్నామని వాపోతున్నారు. ఈ ఫొటోలోని రైతుపేరు మేక పండరి. భైంసా రూరల్ మండలానికి చెందిన ఇతను ఈ ఏడాది తనకున్న నాలుగెకరాల్లో సోయా సాగు చేశాడు. ఎకరాకు రూ.12 వేల వరకు పెట్టుబడి పెట్టాడు. అధిక వర్షాల కారణంగా నాలుగు క్వింటాళ్లు మాత్రమే ది గుబడి వచ్చింది. పంట చేతికి వచ్చి 15 రోజులైంది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో నిరీక్షిస్తున్నాడు. ప్రైవేటుగా క్వింటాల్‌కు కేవలం రూ.4 వేలు చెల్లిస్తున్నారని, ప్రభుత్వం కొనుగోలు చేస్తే మద్దతు ధర రూ.5,238 వస్తుందని చెప్తున్నాడు. జిల్లాలో సోయా పంట చేతికి వచ్చిన రైతులందరి పరిస్థితి ఇదే. బాసర, భైంసా, ఖానాపూర్ మండలాల్లో రైతులు తహసీల్దార్ కార్యాలయాల వద్ద కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం వినతిపత్రాలు ఇచ్చారు. భారత్ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో పలు మండలాల్లో నిరసనలు తెలిపారు. ఇటీవల జిల్లాకు వచ్చిన ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు రైతు నాయకులు సమస్య వివరించి వినతిపత్రాలు ఇచ్చారు. అయినా ఇప్పటి వరకు కొనుగోళ్లు ప్రారంభించలేదు. -
పాతాళగంగ ౖపైపెకి..
లక్ష్మణచాంద: ఈ ఏడాది జూలై చివరి నుంచి సెప్టెంబర్ వరకు జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురిశాయి. వాగులు, చెరువులు, రిజర్వాయర్లు పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. భూగర్భ జలశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 45,142 వ్యవసాయ బోరుబావులు వినియోగంలో ఉన్నాయి. 1.35 మీటర్లు పెరిగిన నీటిమట్టం.. జిల్లాలో గతేడాది సెప్టెంబర్‌లో సగటు నీటిమట్టం 3.80 మీటర్ల లోతులో ఉండగా ఈసారి 2.45 మీటర్లుగా నమోదైంది. అంటే గత సంవత్సరం కంటే 1.35 మీటర్ల భూగర్భ జలాలు పెరిగినట్లు డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్‌బాబు వెల్లడించారు. ప్రతీనెల భూగర్భ జలశాఖ ఆధ్వర్యంలో 42 ఎంపికై న బోరుబావుల్లో నీటి మట్టాలను కొలుస్తారు. సెప్టెంబర్‌లో గణాంకాలు ఇలా.. సాధారణం కన్నా 27.11% అధికం జిల్లాలో సాధారణ వర్షపాతం 910.1 మిల్లీమీటర్లు కాగా ఈ ఏడాది ఇప్పటి వరకు 1,156.9 మిల్లీమీటర్లుగా నమోదైంది. సాధారణం కంటే 27.11% అధికంగా వర్షపాతం వచ్చిందని అధికారులు తెలిపారు. తానూర్, ముధోల్, భైంసా, కుంటాల, నర్సాపూర్(జి), లోకేశ్వరం, దిలావర్పూర్, సారంగాపూర్, నిర్మల్ రూరల్, లక్ష్మణచాంద, పెంబి, మామడ, నిర్మల్ అర్బన్ మండలాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. భూగర్భ జలాలు పెరిగాయి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో భూగర్భ జలాలు బాగా పెరిగాయి. గతేడాది సెప్టెంబర్ మాసంలో 3.80 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండగా ఈసారి 2.45 మీటర్ల లోతులోనే ఉన్నాయి. అయినా నీటిని పొదుపుగానే వాడుకోవాలి. భావితరాలకు ఇబ్బంది కలుగకుండా చూడాలి. – శ్రీనివాస్‌బాబు, డిప్యూటీ డైరెక్టర్, భూగర్భ జలాల శాఖ -
ఉపాధ్యాయుల లెర్నింగ్ టూర్!
తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో అంతర్జాతీయ ప్రమాణాలు ప్రవేశపెట్టేందుకు మరో అడుగు వేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన నాణ్యతను పెంపొందించేలా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన ఉ పాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులను విదేశాలకు పంపించాలని నిర్ణయించింది. ‘గ్లోబల్ లెర్నింగ్ టూర్’ పేరిట సుమారు 160 మందిని సింగపూర్, ఫిన్లాండ్, వియత్నాం, జ పాన్ వంటి దేశాలకు పంపనుంది. వీరు ఆయా దేశాల్లో విద్యా విధానాలను ప్రత్యక్షంగా అధ్యయనం చేయనున్నారు. దీంతో విద్యావ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతుందని విద్యావేత్తలు భావిస్తున్నారు. నిర్మల్‌ఖిల్లా: రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు డాక్టర్ ఈ.నవీన్ నికోలస్ ఉపాధ్యాయుల విదేశీ టూర్‌కు సంబంధించిన మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు రెండురోజుల క్రితం జారీ చేశారు. నవంబర్‌లో ఒక్కో బృందానికి 40 మంది చొప్పున నాలుగు బృందాల్లో 160 మంది ఐదు రోజులపాటు సింగపూర్, వియత్నాం, జపాన్, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. అక్కడి పాఠశాలల బోధన విధానం, విద్యార్థి–ఉపాధ్యాయ సంబంధాలు, సాంకేతిక వినియోగం వంటి అంశాలను అధ్యయనం చేసి తిరిగి వచ్చాక రాష్ట్రంలో అమలు చేసేలా మార్గదర్శకాలు రూపొందించనున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి 12 మంది... ఉమ్మడి జిల్లాలో నిర్మల్, ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల నుంచి ముగ్గురు చొప్పున మొత్తం 12 మంది విదేశీ పర్యటనలో భాగం కానున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 2,855 ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలలు ఉండగా దాదాపు 12 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఎంపికై న ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయి బృందంలో ఆయా దేశాల్లో పర్యటించి అక్కడి బోధన విధానాలను అధ్యయనం చేయనున్నారు. ఎంపిక ప్రక్రియ ఇలా.. బోధన రంగంలో కనీసం పదేళ్ల అనుభవం, 55 ఏళ్ల లోపు వయస్సు, పాస్‌పోర్టు కలిగి ఉన్నవారు ఈ పర్యటనకు అర్హులు. కలెక్టర్ చైర్మన్‌గా అదనపు కలెక్టర్, డీఈవో, జిల్లాస్థాయి సీనియర్ అధికారులు సభ్యులుగా ఉన్న కమిటీ జిల్లాకు ముగ్గురు చొప్పున ఉత్తమ టీచర్ల పేర్లను ఎంపిక చేయనుంది. ఇందుకుగానూ మూడేళ్లలో వారి పనితీరు పరిశీలిస్తారు. ‘పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలను పెంచడంలో తీసుకున్న చొరవ, విద్యార్థుల సంఖ్య పెంచడం, వృత్తిపరంగా అభివృద్ధి, పాఠశాల అభివృద్ధికి తీసుకున్న చర్యలు, వినూత్న బోధనా పద్ధతులు, సాధించిన పురస్కారాలు, ఆంగ్లంలో సంభాషించే సామర్థ్యం’ అనే ఏడు కొలమానాల ఆధారంగా జిల్లా కమిటీ టూర్‌కు వెళ్లే ఉపాధ్యాయులను ఎంపిక చేస్తుంది. ఈ ఎంపిక ప్రక్రియ ఈనెల 23 లోపు పూర్తి చేస్తారు. ఒరిగేదేం ఉండదు జిల్లాకు ముగ్గుర్ని ఎంపిక చేసి విదేశాలకు పంపడం వల్ల ఇక్కడి విద్యావిధానంలో పెద్దగా ప్రయోజనాలేం ఉండకపోవచ్చు. మన దేశంలోనే వివిధ రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతున్న విద్యాబోధన ప్రక్రియలు అధ్యయనం చేయడం మేలు. ఆయా దేశాల్లో సామాజిక ఆర్థిక కోణాలు మన దేశానికి భిన్నంగా ఉంటాయి. కాబట్టి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడి పొరుగు రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేయడం సమంజసంగా ఉంటుంది. – దాసరి శంకర్, టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్షుడు, నిర్మల్ మార్పులకు అవకాశం.. ఎంపికై న ఉపాధ్యాయులు విదేశాల్లోని విద్యావిధానాలను, బోధన పద్ధతులను ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా నూతన విషయాలు తెలుసుకుంటారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా గ్రహించిన అంశాలను అమలుపరచడం ద్వారా ప్రభుత్వ బడుల్లో చదివే పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విప్లవాత్మక మార్పులకు అవకాశం ఉంటుంది. – తోట నరేంద్రబాబు, పీఆర్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు, నిర్మల్ -
మద్యం షాపుల్లో చోరీ కేసు ఛేదింపు
భైంసాటౌన్:ముధోల్, తానూరులోని మద్యం షాపుల్లో మందు బాటిళ్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో శనివారం అదనపు ఎస్పీ అవినాష్‌కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం తాడ్‌బిలోలికి చెందిన యాపరి వినోద్ గ్రామంలో బెల్టుషాపు నిర్వహిస్తున్నాడు. తన బెల్టుదుకాణంలో మ ద్యం విక్రయం కోసం వైన్స్ షాపుల్లో దొంగతనాలను ఎంచుకున్నాడు. ఇందుకు తన సొంత జిల్లాలో చోరీ చేస్తే దొరికిపోతానని, నిర్మల్ జిల్లాపై ఫోకస్ చేశాడు. తన బెల్టుదుకాణం వద్ద మద్యం తాగేందుకు రెగ్యులర్‌గా వచ్చే బేగరి రోహిత్, నీరడి శ్రావణ్‌కుమార్, ఖదులూరి సాయి, ఆదిత్యగౌడ్, సట్ల నవీన్, దిలీప్‌తో జట్టు కట్టాడు. గత మే నెలలో ముధోల్లోని రాజరాజేశ్వర వైన్స్ షాపు వెనుక రేకులు తొలగించి మందు బాటిళ్లు చోరీకి పాల్పడ్డాడు. తానూరులోని శ్రీ లక్ష్మి వైన్స్షాపులోనూ అదే తరహాలో చోరీ చేశాడు. ఇలా చోరీ చేసిన మందు బాటిళ్లను తన బెల్టుదుకాణంలో విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. ఇటీవల మరోమారు అదే తరహాలో చోరీ కోసం ముధోల్‌కు రాగా, అనుమానించిన పోలీసులు వారిని అదుపులో తీసుకున్నారు. ముధోల్‌లో రూ.2.50 లక్షలు, తానూరులోని వైన్స్ షాప్‌ల్లో రూ.80 వేల మద్యం బాటిళ్లను చోరీ చేసినట్లు విచారణలో గుర్తించామన్నారు. నిందితుడి బ్యాంక్ అకౌంట్‌ను ఫ్రీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. సమావేశంలో ముధోల్ సీఐ మల్లేశ్, ఎస్సైలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్య
ఉమ్మడి జిల్లాలో వేర్వేరు కారణాలతో ముగ్గురు బలవన్మరణం చెందారు. బావిలో దూకి ఒకరు ఆత్మహత్య చేసుకోగా, మద్యానికి బానిసైన యువకుడు, వెన్నునొప్పితో బాధ పడుతున్న వ్యక్తి జీవితంపై విరక్తితో ఉరేసుకున్నారు. బావిలో దూకి ఒకరు.. లక్సెట్టిపేట: బావిలో దూకి ఒకరు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. దండేపల్లి మండలం కొర్విచెల్మ గ్రామానికి చెందిన సౌటేపల్లి మౌళి (32), సంజన దంపతులు. వీరికి పది నెలల కుమారుడు ఉన్నాడు. మౌళి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం ఉదయం వాకింగ్‌కు వెళ్తున్నానని భార్యతో చెప్పి వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు వెతకుతుండగా లక్సెట్టిపేట మండలం దౌడపల్లి శివారులోని వ్యవసాయ బావి ఒడ్డున చెప్పులు, సెల్‌ఫోన్ కనిపించాయి. బావిలో గాలించగా మృతదేహం లభించింది. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని రెండో ఎస్సై రామయ్య పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడవచ్చని తండ్రి లచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. ఆయన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఉరేసుకుని యువకుడు.. ఆదిలాబాద్‌టౌన్: మద్యానికి బానిసైన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. టూటౌన్ సీఐ కె.నాగరాజు కథనం ప్రకారం..పట్టణంలోని తాటిగూడకు చెందిన కుమ్ర రుషికేష్ (24) మద్యానికి బానిసయ్యాడు. కుటుంబీకులు మందలించడంతో మనస్తాపం చెంది శుక్రవారం రాత్రి ఇంటి ఎదుట ఉన్న చెట్టుకు ఉరేసుకున్నాడు. తండ్రి ప్రభు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. జీవితంపై విరక్తితో వ్యక్తి..నర్సాపూర్(జి): వెన్నునొప్పితో బాధపడుతున్న వ్యక్తి జీవితంపై విరక్తితో ఉరేసుకుని ఆత్మహ త్య చేసుకున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. ఆయన కథనం ప్ర కారం.. మండల కేంద్రానికి చెందిన బొల్లి నర్సయ్య (45), లక్ష్మి దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. నర్సయ్య రెండేళ్లుగా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఆస్పత్రుల్లో చికిత్స పొందిన నయంకాలేదు. ఈక్రమంలో జీవి తంపై విరక్తితో శనివారం ఇంట్లో ఉరేసుకున్నాడు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బహుదూరపు బాటసారులు
లోకేశ్వరం: మండలంలోని రాజూర, వట్టోలి, ధర్మోర, కన్కపూర్ గ్రామాల గొర్రెల కాపరులు బహుదూరపు బాటసారులు. ఏడాదిలో మూడు నెలలు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో గొర్రెల మందతోపాటు మేత కోసం తిరుగుతూనే ఉంటారు. నిర్మల్ జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాన్ని అనుకుని ఉండటంతో ఇక్కడి గొర్రెలు, మేకల పెంపకందారుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఎస్సారెస్పీ నిండనంత వరకు వెనుకభాగం పశుగ్రాసం లభిస్తుండటంతో రోజూ ఉదయం, సాయంత్రం వరకు జీవా లను మేపుతుంటారు. ఏటా జూలై, ఆగస్టులో ఎస్సారెస్పీ నిండుకుండలా మారుతుంది. వెనుకభాగం నీటితో నిండి ఉంటుంది. దీంతో జీవా లకు గ్రాసం దొరకక వలస వెళ్లాల్సిన పరిస్థితి. వీరంతా మళ్లీ వరి నూర్పిడి పూర్తయ్యే వరకు దాదాపు మూడునెలలు ఉమ్మడి ఆదిలాబాద్ జి ల్లాలోని గుట్టలపై, నిజామాబాద్ జిల్లాలోని బా డ్సీ ప్రాంతాలకు వెళ్తారు. మండలాలకు చెందిన గొర్రెల కాపరులు బృందాలుగా ఏర్పడి మందలతో బయల్దేరుతారు. అడవిలో ఉంటూ వాటిని మేపుతూ అక్కడే వంట, భోజనాలు చేస్తారు. రాత్రి మందల వద్దే నిద్రిస్తారు. వంట సామగ్రి కోసం అక్కడి నుంచి కొందరు రావడమో, లేదంటే ఇక్కడి నుంచి వెళ్లేవారు వెంట తీసుకెళ్తారు. తరచూ ప్రమాదాలు సుదూర ప్రయాణం రోడ్డు మార్గంలో సాగడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వాహనాలు ఢీకొని జీవాలు చనిపోతున్నాయి. ఇన్సూరెన్సు లేకపోవడంతో కాపరులు నష్టపోతున్నారు. ఇప్పటికై న పశుసంవర్థక శాఖ అధికారులు పట్టించుకుని జీవాలకు ఇన్సురెన్సు చేసేలా చర్యలు తీసుకోవాలి.పొలాల్లో గ్రాసం పెంచుకోవాలి జీవాలు, పశువుల యజమానులు వారి పంట పొలాల్లో గ్రాసం పెంచుకోవాలి. జీవాలు, పశువులకు ఇన్సురెన్సును చేయించుకోవాలి. గ్రామాల్లో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు వేయిస్తున్నాం. పశువైద్యుల సూచనలు పాటించాలి. – రాజేశ్వర్, నిర్మల్ పశుసంవర్థక శాఖ డెప్యూటీౖ డెరెక్టర్ఇదే వృత్తిని నమ్ముకున్నాం ఇదే వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నాం. ఏడాదిలో మూడు నెలలు బయటి ప్రపంచానికి దూరంగా ఉంటున్నాం. ఒక్కో మందకు నలుగురు కాపలాగా ఉంటారు. గుట్ట ప్రాంతంలో జీవాలను మేపుతూ తిరుగుతాం. గొర్రెల కాపరులను ప్రభుత్వం పట్టించుకోవాలి. – బరిడే పోతన్న, రాజూర మేత దొరకక దూరప్రాంతాలకు ఎస్సారెస్పీ నిండితే జీవాలకు మేత దొరకడం కష్టమవుతుంది. మేత కోసం దూరప్రాంతాలకు జీవాలతో వెళ్తుంటాం. వంట సామగ్రి తీసుకెళ్తాం. అటవీప్రాంతాల్లో జీవాలను మేపుతున్నాం. – గీజాగంగాధర్, ధర్మోరపొలాల్లోనే నిద్రమండలంలోని రాజూర గ్రామానికి చెందిన 20 మంది కాపరులు, వట్టోలిలోని 10 కురుమ యాదవ, కుటుంబాల వారు మూడు నెలలు ఇంటికి దూరంగా ఉంటున్నారు. వందలాది కిలోమీటర్లు తిరుగుతూ ఎక్కడ చీకటిపడితే అక్కడే పొలాల్లో నిద్రిస్తున్నారు. సరైన భోజనం, నీటి వసతి లేక ఇబ్బంది పడుతున్నారు. ఒక్కోసారి జీవాలకు సైతం తాగునీరు లభించని పరిస్థితి. వాగులు, వంకలు అందుబాటులో ఉంటేనే నీరు తాగిస్తున్నారు. తమ గ్రామాల్లో మేత దొరకగానే తిరుగుపయనమతారు.జీవాలు సంఖ్య గొర్రెలు 3.50 లక్షలు మేకలు 1.25 లక్షలు నిర్మల్ జిల్లాలో.. వారంతా తమ కులవృత్తి అయిన గొర్రెల పెంపకాన్ని నమ్ముకొని జీవనం సాగించే యాదవులు. ఉన్న ఊరిలో జీవాలకు గ్రాసం దొరకకపోవడంతో పెంపకందారులు బృందంగా ఏర్పడి ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఏడాదిలో మూడు నెలలు అడవిలో ఉంటూ వండుకొని తింటారు. తమ జీవనోపాధితోపాటు జీవాల మేత కోసం వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్న బాటసారులపై ప్రత్యేక కథనం. -
జిల్లాకు చేరిన భారత్ అన్యుశుద్ధి యాత్ర
కై లాస్‌నగర్: దేశంలోని ప్రతి వ్యక్తికి శుద్ధమైన ఆహారం అందాలనే ఉద్దేశంతో గౌరవ్ త్యాగి అనే యువకుడు చేపట్టిన భారత్ అన్యుశుద్ధి యాత్ర శనివారం జిల్లా కేంద్రానికి చేరింది. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని హపూర్ జిల్లా హైదర్పూర్కు చెందిన త్యాగి జూన్ 26న శ్రీనగర్‌లోని లాలౌచౌక్ నుంచి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేపట్టారు. బాల్య స్నేహితులు రాజత్ భారతి, రియాజ్‌తో కలిసి ప్రతీరోజుకు 25 నుంచి 30 కి.మీ పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటివరకు 12 రాష్ట్రాల్లో పాదయాత్ర పూర్తి చేసిన ఆయన మహారాష్ట్ర మీదుగా జిల్లాకు చేరుకున్నారు. పాఠశాల విద్యార్థులు, గృహిణిలు, రైతులను కలుస్తూ ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు శనివారం అవగాహన కల్పించారు. ఇప్పటివరకు 50 వేల మంది చిన్నారులను కలిసి జంక్‌ఫుడ్ తినొద్దని ప్రతిజ్ఞచేయించినట్లు తెలిపారు. పోకిరీలకు కౌన్సెలింగ్మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని బస్టాండ్, రైల్వేస్టేషన్, రద్దీ ప్రాంతాలు, విద్యాసంస్థల వద్ద షీటీమ్ పోలీసులు మఫ్టీలో ఉండి డెకాయ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద, మినీ బస్టాండ్ వద్ద శనివారం నలుగురు పోకిరీ యువకులను అ దుపులో తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు. షీ టీమ్ ఎస్సై ఉషారాణి, పోలీసులు శ్రావణ్‌కుమార్, శ్రీలత, సిబ్బంది పాల్గొన్నారు. -
క్రీడలతో ఒత్తిడి దూరం
నిర్మల్‌టౌన్: అటవీ ఉద్యోగుల్లో ఒత్తిడిని దూరం చేసేందుకు క్రీడలు నిర్వహిస్తున్నామని రాష్ట్రఅటవీశాఖ చీఫ్ కమిషనర్ జి.చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో అటవీశాఖ ఆధ్వర్యంలో శనివారం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నిర్వహించారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, రన్నింగ్, వాకింగ్, చెస్, లాంగ్ జంప్, షాట్‌ఫుట్, క్యారమ్, జాలిన్ త్రో, తదితర క్రీడాపోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీశాఖ ఉద్యోగులకు మానసికోల్లాసం, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం కోసం పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలకు సంబంధించిన సుమారు 350 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఆదివారం వరకు పోటీలు కొనసాగనున్నాయి. కార్యక్రమంలో బాసర సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ శర్వానన్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ డీఎఫ్ఓలు వికాస్ మీనా, రేవంత్ చంద్ర, నాగిని భాను, అధికారులు కుమారి చిన్న, సుధాకర్, శివకుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఈ ఆట భిన్నమైనది
సెపక్తక్రా ఆట భిన్నమైనది. కేవలం కాళ్ల సహాయంతోనే ఆడాల్సి ఉంటుంది. నాలుగేళ్ల నుంచి ఆడుతున్నా. ఒకసారి నేషనల్స్‌కు సెలెక్ట్ అయ్యాను. ఇప్పటి వరకు మూడుసార్లు స్టేట్‌మీట్‌లో ఆడితే ఒకసారి గోల్డ్‌మెడల్ సాధించాను. – నిఖిల్, వరంగల్ బంగారు పతకం సాధిస్తా మూడేళ్లుగా సెపక్తక్రా ఆడుతున్నా. ఒకసారి నేషనల్స్‌లో, రెండు సార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. రాష్ట్ర స్థాయి పోటీల్లో రెండు సిల్వర్ మెడల్స్ సాధించాను. ఈసారి బంగారు పతకం సాధిస్తాను. – ఆర్.విష్ణువర్థన్, మహబూబ్‌నగర్ గతేడాది నుంచే ఆడుతున్నా గతేడాది నుంచే సెపక్తక్రా మొదలుపెట్టాను. కోచ్, క్రీడాకారుల ప్రో త్సాహం ఇస్తున్నారు. గ తంలో నేషనల్ పోటీల్లో పాల్గొన్నా ప్లేస్ రా లేదు. రాష్ట్ర స్థాయి పోటీల్లో మూడోస్థానం సాధించాను. ఈసారి ఫస్ట్ ప్లేస్ కోసం ప్రయత్నిస్తున్నా. – సింగసాని అశ్విత, కరీంనగర్ -
గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురి అరెస్ట్
మందమర్రిరూరల్: గంజాయి రవాణా చేస్తున్న ము గ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం మందమర్రి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్సై రాజశేఖర్ వివరాలు వెల్లడించారు. కాగజ్‌నగర్ నుంచి గంజాయి తీసుకువస్తున్నారనే సమాచారంతో జాతీయ రహదారి టోల్‌గోట్ వద్ద తనిఖీ చేపట్టారు. స్కూటీపై వచ్చిన ముగ్గురిని తనిఖీ చేయగా 100 గ్రాముల గంజాయి లభించింది. గంజాయిని స్వాధీనం చేసుకుని స్కూటీతోపాటు వేల్పుల వర్శిత్ (పొన్నారం), వేల్పుల రాహుల్ (ఆదిల్పేట్), మణిదీప్ (నస్పూర్)ను అదుపులో తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
4 కి.మీ కాలినడకన వెళ్లి.. వైద్యం అందించి
ఆదిలాబాద్‌రూరల్: మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన మంగ్లీ వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేదు. మండల వైద్యాధికారి సర్ఫరాజ్, సిబ్బంది 4 కి.మీ కాలినడకన వెళ్లి శనివారం గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్యపరీక్షలు చేసి మాత్రలు అందజేశారు. పిల్లలకు ఇమ్యూనైజేషన్ టీకాలు వేశారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి సర్ఫరాజ్ మాట్లాడుతూ గ్రామంలో 11 ఇళ్లు ఉండగా, 64 మంది జనాభా ఉన్నారని పేర్కొన్నారు. అనారోగ్యం బారినపడితే వెంటనే పీహెచ్‌సీకి, రిమ్స్‌కు వెళ్లి చికిత్స చేసుకోవాలన్నారు. అంకోలి పీహెచ్సీ హెల్త్ సూపర్ వైజర్ బొమ్మేత సుభాష్, హెల్త్ అసిస్టెంట్స్ వేణుతాయి, పవర్ ప్రేమ్‌సింగ్, రాథోడ్ నారాయణ, ఆశకార్యకర్తలు సుమిత్ర, రుక్మిణి, దుర్పత బాయి, గ్రామస్తులు ఉన్నారు. -
క్రీడా సంబురం
రెబ్బెన: క్రీడా సంబురం మొదలైంది. రెండు రోజు ల పాటు జరిగే 11వ రాష్ట్రస్థాయి జూనియర్స్, సబ్ జూనియర్స్ సెపక్తక్రా పోటీలకు మండలంలోని గోలేటి టౌన్‌షిప్‌లోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానం వేదికై ంది. రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లా ల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు, కోచ్‌లు, క్రీడాఽభిమానులతో మైదానం కోలాహలంగా మారింది. శనివారం ముఖ్య అతిథిగా హాజరైన బెల్లంపల్లి ఏరియా జీఎం విజయభాస్కర్‌రెడ్డి క్రీడా పతకాలను ఆవిష్కరించి క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆపై క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. సుమారు 200 మంది క్రీడాకారులు, 50 మంది కోచ్‌లు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలకు గోలేటి ప్రాంతం పుట్టినిల్లులాంటిదని అన్నారు. ఈ ప్రాంతానికి చెందిన ఎంతో మంది అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో పోటీల్లో రాణిస్తూ మంచి గుర్తింపు పొందారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలను గోలేటిలో నిర్వహించడం అభినందనీయమన్నారు. సెపక్తక్రా అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు పాల్గొన్నారు. సెపక్తక్రా అంటే ఇష్టం నాకు సెపక్తక్రా అంటే ఎంతో ఇష్టం. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నా. 8వ తరగతి నుంచి ఆడటం నేర్చుకున్నా. ఆటపై ఉన్న ఇష్టంతో పోటీల్లో రాణిస్తున్నా. రాష్ట్రస్థాయి పోటీల్లో నాలుగు బంగారు, ఒకసారి వెండి పతకం సాధించాను. – పి.అభినవ్ రాణా, రంగారెడ్డి ఫస్ట్‌ప్లేస్ సాధిస్తాం సొంత జిల్లాలో జరుగుతున్న ఈ పోటీల్లో ఫస్ట్‌ప్లేస్ సాధిస్తామనే నమ్మకం ఉంది. దానికి తగినట్లుగా ఆటతీరును ప్రదర్శిస్తాం. ఇప్పటి వరకు మూడు సార్లు స్టేట్ మీట్‌ను ఆడాను. త్వరలో గోవాలో జరగబోయే నేషనల్స్ పోటీల్లో పాల్గొనబోతున్నా. – అభినయ రమ్యశ్రీ, ఆదిలాబాద్ ఆత్మవిశ్వాసంతో ఆడుతాం జిల్లా జట్టు క్రీడాకారులు ఆత్మ విశ్వాసంతో పోటీల్లో దిగుతున్నాం. ఇప్పటి వరకు ఒకసారి నేషనల్స్, మూడుసార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. ఒకసారి మూడోస్థానంలో సాధించాను. ఈసారి బంగారు పతకం సాధిస్తాను. – కె.రాంచరణ్, ఆదిలాబాద్ -
ఇంట్లో చోరీ
జైనథ్: మండలంలోని దీపాయిగూ డ గ్రా మంలో దు ర్ల రాజలింగు ఇంట్లో గుర్తుతెలి యని వ్యక్తులు చోరీకి పాల్ప డ్డారు. సమీప బంధువులు చనిపోవడతో రాజ లింగు కుటుంబంతో కలిసి మూడురో జుల క్రితం ఊరికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన గుర్తుతెలియని వ ్యక్తులు ఇంటికి ఉన్న కిటికీలోంచి లోపలికి చొరబడ్డారు. బీరువా తలుపులు పగులగొట్టి మూ డు తులాల బంగారం, 25 వేల నగదును ఎత్తుకెళ్లారు. శనివారం స్థానికులు గమనించారు. వెంటనే అందించిన సమాచారంతో ఎస్సై గౌతమ్ పవర్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్ బృందంతో తనిఖీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
శబరిమలకు పాదయాత్ర
కుంటాల: జిల్లాలోని ఆయా మండలాల నుంచి అయ్యప్ప దీక్షాపరులు ఆదివారం బాసర జ్ఞాన సరస్వతిదేవి ఆలయంలో పూజలు నిర్వహించి శబరిమల అయ్యప్ప సన్నిధానానికి పాదయాత్రగా వెళ్లనున్నారు. జిల్లాలోని 40 మంది స్వాములు 45 రోజలు పాదయాత్ర చేసి స్వా మివారి సన్నిధానం చేరుకుంటారని తెలిపారు. కుంటాల మండలం లింబా(కె) గ్రామానికి చెందిన తిరుపతిరెడ్డి అయ్యప్పస్వామి శనివారం గ్రామంలోని తూర్పు ముఖ హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించగా గ్రామస్తులు సాగనంపారు. రాత్రి బాసరలో బస చేసి ఆదివారం పాదయాత్రగా వెళ్లనున్నట్లు అయ్యప్ప స్వాములు తెలిపారు. -
● గ్రామీణ జీవితంలో కొత్త ఉత్సాహం ● బంధాల బలోపేతానికి ప్రత్యేక వేడుకలు ● పల్లెల్లో సరికొత్త సంస్కృతి
ముధోల్ : పచ్చని పైర్లు.. పారేటి సెలయేళ్లు.. కోడి కూతలు.. కోడె ల్యాగెలు.. ఎగిలి వారంగనే అలుకు నీళ్లతో తలకుపోసుకునే నేల తల్లి.. తెల్లా తెల్లని పాల ధారల్లో తెల్లారె పల్లె.. ఇదే పల్లెటూరు. పొద్దు పొడవక ముందే నిద్దుర లేచే పల్లె జనం పొద్దెక్కే యాలకు ఎవరి పనులకు వారు వెళ్లిపోతారు. సీ్త్ర పురుష భేదం లేకుండా రైతులు, రైతు కూలీలు పొలం బాట పడతారు. పొద్దంతా చేను చెల్కల్లోనే గడుపుతారు. ఇది గ్రామీణ జీవనంలో నిత్యకృత్యం. పంటలనే కంటిపాపలుగా చూసుకునే గ్రామీణులు.. ఉత్సవాలు వేడుకల్లో పాల్గొనడం చాలా తక్కువ. అందరూ కలిసి చేసుకునే పండుగలు అరుదు. అయితే పల్లెలు అంటేనే అనుబంధాలు, ఆత్మీయతలు గుర్తొస్తాయి. కానీ టీవీలు, సెల్ఫోన్లు వీటిని దూరం చేస్తున్నాయి. పొద్దంతా పొలం పనులు.. సాయంత్రం టీవీలు, సెల్ఫోన్లతో కాలక్షేపం కామన్ అయింది. ఈ నేపథ్యంలో పాత పల్లె సంస్కృతిని గుర్తు చేసేలా కొత్త తరం సరికొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టింది. ఆత్మీయతలు పెంచేలా.. బంధాలు బలోపేతం అయ్యేలా విభేదాలు తొలగిపోయేలా వేడుకలు నిర్వహిస్తున్నారు. మహిళలు ‘గాజుల పండుగ’, పురుషులు ‘కండువా పండుగ’ జరుపుకుంటూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఇటీవల జిల్లాలో ఈ సంస్కృతి బాగా పెరిగింది. రైతు కుటుంబాలు చేసుకుంటున్న ఈ పండుగలు కొత్త సంస్కృతికి దారితీస్తున్నాయి. యువ రైతులు కుటుంబాలతో కలిసి ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ముధోల్‌లో గాజుల పండుగలో పాల్గొన్న మహిళలు -
వలస కార్మికులకు అండగా..
నకిలీ ఏజెంట్ల మాయమాటలు నమ్మొద్దు. సక్రమమార్గం ద్వారానే విదేశీ ఉద్యోగాలకు వెళ్లాలి. గల్ఫ్ తదితర దేశాల్లో ఉద్యో గ అవకాశాలు కల్పిస్తూ, నకిలీ ఏజెంట్ల మోసాలకు అడ్డుకట్ట వేయడానికి టామ్‌కామ్ సంస్థ పనిచేస్తుంది. లైసెన్స్ పొందిన రిక్రూట్మెంట్ ఏజెంట్ల ద్వారానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వం నేరుగా పర్యవేక్షించే ఈ వ్యవస్థలో కార్మికులకు జీతం, వసతి, భద్రత, వైద్య సదుపాయాలు స్పష్టంగా నిర్ధారించబడతాయి. ఉపాధికోసం గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు నకిలీ ఏజెంట్లతో అప్రమత్తంగా ఉండాలి. – నంగి దేవేందర్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నారై సలహాకమిటీ సభ్యులు, గల్ఫ్ వ్యవహారాల సమన్వయకర్త -
గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
ఖానాపూర్: మండలంలోని మస్కాపూర్ కేజీబీవీలో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని కేజీబీవీ ప్రత్యేక అధికారి సునీతరాణి కోరారు. తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న తెలుగు, ఫిజిక్స్, జువాలజీ, పీజీ సీఆర్టీ పోస్టులకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు కేజీబీవీలో సంప్రదించాలని సూచించారు. ఎంజేపీ డిగ్రీ కళాశాలలో.. నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే పురుషుల డిగ్రీ కళాశాలలో స్టాటిస్టిక్స్ విభాగంలో అతిథి అధ్యాపకుని కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ విజయ్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 13న కాలేజీలో జరిగే డెమోకి నేరుగా హాజరు కావాలని సూచించారు. పీజీ పూర్తిచేసి, సెట్ లేదా నెట్ పీహెచ్డీ, ఉత్తీర్ణులైన వారికి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. వివరాల కోసం 9505520097 నంబర్లో సంప్రదించాలని సూచించారు. డీసీసీ పదవికి దరఖాస్తుకడెం: జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) అధ్యక్ష పదవికి మండలంలోని కొండుకూర్ గ్రామానికి చెందిన పొద్దుటూరి సతీశ్‌రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో దరఖాస్తును సమర్పించారు. పదేళ్లుగా పార్టీలో క్రియాశీలక నాయకుడిగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ఖానాపూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన తనకు డీసీసీ అధ్యక్షుడిగా ఆవకాశం ఇవ్వాలని కోరారు. ఆయన వెంట ఏఎంసీ డైరెక్టర్ యాదగిరి ఉన్నారు. డీసీసీ బరిలో ఉన్నా.. నర్సాపూర్(జి): మండలంలోని గొల్లమాడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు సమత సుదర్శన్ తాను కూడా డీసీసీ అధ్యక్ష బరిలో ఉన్నానని పేర్కొన్నారు. పార్టీ పెద్దలు తను కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించి అధ్యక్షుడిగా నియమించాలని కోరారు. -
బంద్ విజయవంతం చేయాలి
నిర్మల్‌టౌన్: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఈనెల 14న తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్ విజయవంతం చేయాలని బీసీ సంఘాల నాయకులు కోరారు. నిర్మల్ ప్రెస్‌క్లబ్‌లో శనివారం మాట్లాడారు. అగ్ర కులాలు వారు ఓర్వలేక హైకోర్టులో కేసు వేసి రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను నమ్మిస్తూ.. రాజకీయ డ్రామా చేస్తోందని మండిపడ్డారు. రాజకీయంగా బీసీలు ఎదగకుండా అడ్డుపడుతున్నారన్నారు. 42 శాతం రిజర్వేషన్ అమలు కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇందులో బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు పొన్నం నారాయణగౌడ్, బీసీ సంఘం జాతీయ నాయకులు అప్క గజేందర్యాదవ్, నాయకులు అనుముల భాస్కర్, డాక్టర్ కత్తి కిరణ్, కిషన్, అశోక్‌నాయక్, ప్రశాంత్, శివాజీగౌడ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ, అటవీ అధికారుల సర్వే
దస్తురాబాద్: మండలంలోని దేవునిగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లపై శనివారం అటవీ, రెవిన్యూ అధికారులు కలిసి ఉమ్మడి సర్వే చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ విశ్వంబర్ మాట్లాడుతూ దేవునిగూడెం గ్రా మంలో పైలట్ ప్రాజెక్టు కింద 102 ఇందిరమ్మ ఇళ్లు మంజురు కాగా, 46 నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. 34 ఇళ్లకు అటవీ శాఖ అధికారులు అభ్యంతరం తె లిపారని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఉమ్మడి సర్వే నిర్వహించి జిల్లాస్థాయి అధికారులకు నివేదిక పంపిస్తామన్నారు. సర్వేలో ఎఫ్ఎస్వో కింగ్ ఫిషర్, సర్వేయర్లు శ్రీనివాస్‌రావు, సంధ్య, జీపీవో నర్సయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు. -
వలవేస్తూ.. బలిచేస్తూ..
నిర్మల్‌ఖిల్లా: విదేశాల్లో అధిక వేతనం, సౌకర్యవంతమైన జీవితం అందిస్తామని వాగ్దానం చేస్తూ నకిలీ ఏజెంట్లు గ్రామీణ యువతకు వలవేస్తున్నారు.గల్ఫ్‌లో పెద్ద కంపెనీల్లో ఉద్యోగం, వీసా, ఇంటి వద్ద నుంచే ప్రాసెస్ పూర్తి చేస్తామని ఆశ పెడుతున్నారు. అమాయక యువత రూ.80 వేల నుంచి రూ.5 లక్షల వరకు చెల్లిస్తున్నారు. తీరా ఫ్లైట్ ఎక్కి అక్కడకు వెళ్లాక ఆశలన్నీ అడియాసలవుతున్నాయి. తక్కువ జీతం, కఠిన పరిస్థితులు, పాస్‌పోర్టు స్వాధీనం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. జిల్లాలో వరుస ఘటనలు.. తాజాగా జోర్డాన్‌లో ఇబ్బందులు పడుతున్న 12 మంది కార్మికుల వీడియో తాజాగా వైరల్ అయ్యింది. సోన్ మండలం బొప్పారం గ్రామానికి చెందిన యువకుడిని ఇరాక్ పంపిస్తానని డబ్బు తీసుకున్న ఏజెంట్ దుబాయ్‌కి పంపించాడు. అబుదాబిలో క్లీనర్‌గా చేరి సారంగాపూర్ మండలం దేవి తండాకు చెందిన యువకుడు.. అక్కడ చేయని నేరంలో చిక్కుకున్నాడు. 2024లో జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన ఏజెంట్ మోసంతో నిర్మల్, ఆది లాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన 60 మందికి పైగా బాధితులు ఉన్నారు. ఇలా గల్ఫ్ దేశాలకు అమాయకులను పంపుతున్న ఏజెంట్ల మోసాలు వరుసగా జిల్లాలో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు ప్రతి నెల ఇలా రెండు మూడు ఉదంతాలు కుటుంబీకుల ఫిర్యాదుల ద్వా రా బహిర్గతమవుతున్నాయి. బాధిత కుటుంబీకులు తమ వారిని ఎలాగైనా స్వగ్రామాలకు రప్పించేందుకు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. బాధితుల వేదన ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్తున్నవారు.. అక్కడి పరిస్థితులను తట్టుకోలేక తమను స్వగ్రామానికి రప్పించమని గల్ఫ్ సంఘాలు, ఎన్నారై కమిటీలు, రాష్ట్ర కేంద్రాల హెల్ప్లైన్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుని అప్పులు తీర్చే మార్గం లేక అవస్థలు పడుతున్నాయి. నకిలీ ఏజెంట్ల బారిన పడకుండా జాగ్రత్తలు 1. గుర్తింపు ఉన్న, లైసెన్స్ కలిగిన రిక్రూట్మెంట్ ఏజెంట్లను మాత్రమే సంప్రదించాలి. 2. ఆన్లైన్ ద్వారా ఉద్యోగ సంస్థ వివరాలు, నిజమైనదో కాదో సరిచూసుకోవాలి. 3. వీసా, వేతనం, పని స్వరూపం, వసతి, భోజనం మొదలైనవి రాతపూర్వక ఒప్పందంలో స్పష్టంగా ఉండాలి. 4. ఒప్పందం లేకుండా నగదు చెల్లించకూడదు. అన్ని చెల్లింపులు బ్యాంకు ట్రాన్స్ఫర్ ద్వారా చేయాలి. 5. రసీదులు, లావాదేవీల రికార్డులు భద్రంగా ఉంచుకోవాలి. 6. కంపెనీ, వీసా వివరాలు ఆ దేశ ఎంబసీ అధికారిక వెబ్సైట్లో నిర్ధారించుకోవాలి. 7. నకిలీ వీసా అని తెలిసిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. 8. విదేశాలకు వెళ్లే ముందు భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్, ఎంప్లాయిస్ సపోర్ట్ సెంటర్ సమాచారం వద్ద ఉంచుకోవాలి. 9. ఫ్రీ డిపార్చర్ ట్రైనింగ్ – టామ్‌కామ్ వంటి సంస్థల శిక్షణలో పాల్గొనాలి. 10. తక్షణ వీసా – అధిక వేతనం వంటి మాయమాటలను నమ్మకూడదు. అవి మోసానికి సంకేతాలు. -
ఆర్డర్ లేక..‘చిక్కి’ పోయింది!
కడెం: గిరిజనుల ఆర్థికాభివృద్ధి, ఆరోగ్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. స్వయం ఉపాధి కోసం ప్రత్యేక రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి. గిరిజన ఉత్పత్తుల కొనుగోలు బాధ్యతను కూడా తీసుకుంటున్నాయి. అయితే కడెం మండలం పెద్దూర్ కొలాంగూడలో గిరిజనుల ఆర్థికాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన పల్లీపట్టి తయారీ యూనిట్ ఏర్పాటు చేసినా.. రెండు నెలల్లోనే మూతపడింది. గిరిజన మహిళలకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ఆదిలోనే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఆర్డర్లు లేకపోవడం, రుణ భారం పెరగడంతో గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. ఐటీడీఏ ప్రోత్సాహంతో.. గిరిజన అభివృద్ధికి ఐటీడీఏ అప్పటి ప్రాజెక్ట్ ఆఫీసర్ వరుణ్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఆయన సూచనల మేరకు జై హనుమాన్ కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్ పేరుతో కొలాంగూడకు చెందిన ఆరుగురు కొలం మహిళలు సంఘం ఏర్పాటు చేశారు. ఆర్డర్లేక రెండు నెలలకే.. జూలై నెలలో ఐదు క్వింటాళ్ల పల్లీపట్టి తయారు చేసి జీసీసీ జన్నారం శాఖకు సరఫరా చేశారు. అయితే ఆ తర్వాత కొత్త ఆర్డర్లు రాకపోవడంతో ఉత్పత్తి నిలిచిపోయింది. పంపిన స్టాక్‌కు చెల్లింపులు కూడా అందలేదు. దీంతో ఆగస్టు నుంచి యూనిట్ పూర్తిగా మూతపడింది. రుణభారం, సరుకు నష్టం.. రెండు నెలలుగా ఆర్డర్లు రాకపోవడంతో సభ్యులు బ్యాంక్‌కు వాయిదాలు చెల్లించలేకపోతున్నారు. ఈ క్రమంలో తయారీకి తెచ్చిన 5 క్వింటాళ్ల పల్లీలు, 3 క్వింటాళ్ల బెల్లం, 30 లీటర్ల గ్లూకోజ్ లిక్విడ్ పాడైపోయాయి. దీంతో ఆర్థికంగా మరింత దెబ్బతిన్నామని యూనిట్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐటీడీఏ జోక్యం కావాలి.. ప్రాజెక్టు ప్రారంభదశలోనే ఇలాంటి ఆటంకాలు రావడం అభివృద్ధి కార్యక్రమాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. గిరిజన మహిళలు తిరిగి ఉపాధి పొందేలా, దీర్ఘకాలిక ఆర్డర్లు ఇవ్వాలని ఐటీడీఏ తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
పంట మార్పిడితో అధిక దిగుబడి
భైంసారూరల్: పంట మార్పిడితో అధిక దిగుబడి సాధించవచ్చని డీఏవో అంజిప్రసాద్ అన్నారు. మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పొలాస విద్యార్థుల ఆధ్వర్యంలో కిసాన్ సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంలో యాంత్రీకరణతో పనులు వేగవంతం అవుతాయన్నారు. రైతులు సేంద్రియ ఎరువులు వాడితే ఎంతోమేలు జరుగుతుందన్నారు. యూరియా మోతాదుకు మించి వాడితే దిగుబడి తగ్గడమే కాకుండా భూసారం దెబ్బతింటుందని పేర్కొన్నారు. మానవుల ఆరోగ్యనికి అనర్థాలు తెచ్చిపెడుతుందన్నారు. రైతులు రసాయన ఎరువులు వాడేముందు, పంటలు సాగు చేసే క్రమంలో తప్పకుండా వ్యవసాయధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని తెలిపారు. నేల సారాన్ని పెంచుకోవడం, భూ పరిరక్షణ, నీటి సంరక్షణ పద్ధతులను రైతులకు వివరించారు. అనంతరం విద్యార్థులు అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలు, పంటలకు వాడే రసాయన ఎరువులను ప్రదర్శించి రైతులకు వివరించారు. కార్యక్రమంలో ఏడీఏ వీణ, ఏవో గణేశ్, ముధోల్ ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ కార్తీక్, డాక్టర్ దినేశ్, వేణు, సౌజన్య, అధ్యాపకులు పాల్గొన్నారు -
‘స్వర్ణ’లో ఇసుక తోడేళ్లు
నిర్మల్ రూరల్ మండలంలోని తంశ, చిట్యాల గ్రామాల్లో స్వర్ణ నదిలో ఇసుకను కొందరు అక్రమంగా ప్రమాదకరంగా తోడేస్తున్నారు. వర్షాలతో వాగులో నీటి ప్రవాహం ఉన్నప్పటికీ ఇసుకాసురులు కూలీలతో నీటిలో పది అడుగుల లోతు నుంచి ఎలాంటి భయం లేకుండా ఇసుకను వెలికి తీయిస్తున్నారు. ఇలా తీసిన ఇసుకను ట్రాక్టర్లలో నింపి మంజులాపూర్ నుంచి ఈద్గాం చౌరస్తా వరకు రోడ్డు పక్కన అన్లోడ్ చేసి విక్రయిస్తున్నారు. పట్టపగలే ఇసుకను ప్రమాదకరంగా వెలికి తీస్తూ.. అక్రమంగా తరలిస్తున్నా.. పట్టించుకునేవారు లేరు. – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్ -
స్వదేశానికి రప్పించరూ..
నిర్మల్రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు నిర్మల్‌టౌన్: ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 10 నుంచి 12 వరకు వరంగల్‌లో నిర్వహించే అండర్–17 బాల, బాలికల రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు జిల్లా విద్యార్థులు ఎంపికయ్యారు. జిల్లా నుంచి నిఖిత(భైంసా), కీర్తన(నిర్మల్), అభినయ(నర్సాపూర్(జి)), శ్రావణి(ఖానాపూ ర్), పల్లవి(బాసర), కవిత (జామ్ ), సంజన(నిర్మల్) రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లారు. బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్, సెక్రెటరీ చందులస్వామి, ఎస్జీఎఫ్ సెక్రటరీ రవీందర్‌గౌడ్ వీడ్కోలు పలికి రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు. నిర్మల్‌ఖిల్లా: ఉన్న ఊరిలో సరైన ఉపాధి లేక బతుకుదెరువు కోసం పరాయి దేశం వెళ్లిన జిల్లావాసులు అక్కడ అష్టకష్టాలు పడుతున్నారు. రాష్ట్రం నుంచి జోర్డాన్ దేశానికి గతేడాది వెళ్లిన 12 మంది అక్కడ కనీస అవసరాలు కరువై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలాగైనా తమను స్వగ్రామాలకు చేర్చాలని వేడుకుంటున్నారు. ఈమేరకు వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఈ 12 మందిలో జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు ఉన్నారు. సోన్ మండలం కూచన్‌పల్లి గ్రామానికి చెందిన మెట్టు ముత్యం, కుంటాల మండల కేంద్రానికి చెందిన ముఖీం గతేడాది సెప్టెంబర్‌లో ఉపాధి నిమిత్తం ఓ ఏజెంటు ద్వారా కంపెనీ వీసాపై జోర్డాన్ వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత జనావాస ప్రాంతాలకు దూరంగా ఉండటమే కాకుండా, కనీస ఆహారం, నిద్ర కూడా కరువై నరకం అనుభవిస్తున్నామని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు కుటుంబ సభ్యులు కూడా తెలిపారు. దీంతో బాధిత కుటుంబీకులు తమ వారిని ఎలాగైనా స్వగ్రామానికి రప్పించాలని వేడుకుంటున్నారు. నకిలీ ఏజెంట్ల నిర్వాకం.. విదేశాలకు వెళ్లేందుకు ఉచిత వీసాలను సైతం వేల రూపాయల నగదుకు అమాయకులకు అమ్మి నకిలీ ఏజెంట్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తరహాలోనే కుంటాల మండలం అందకూరు గ్రామానికి చెందిన ఓ ఏజెంట్ జిల్లాకు చెందిన మెట్టు ముత్యం, ముఖీం వద్ద వేల రూపాయలు తీసుకుని నైపుణ్యరహితమైన ఉపాధి పనులపై జోర్డాన్ దేశానికి పంపించారు. అక్కడ జనావాసాలకు దూరంగా వ్యవసాయక్షేత్రాల్లో పనుల్లో చేరిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరిగి ఇండియాకు రావాలన్నా భారీ మొత్తంలో జరిమానా చెల్లించి వెళ్లాలని అక్కడి యజమాని షరతును విధిస్తున్నట్లు బాధితులు విడుదల చేసిన వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు.. మహారాణులు! మహిళలు పురుషులకు దీటుగా రాణిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోటీ ప్రపంచంలో పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఎన్ఆర్ఐ కమిటీ భరోసా.. జోర్డాన్‌లో చిక్కిన వారి గురించి రాష్ట్ర ఎన్ఆర్ఐ అడ్వైజర్ కమిటీ సభ్యుడు స్వదేశ్ పర్కిపండ్లను సంప్రదించగా, బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలను సేకరించినట్లు పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా ఎకమిటీ ద్వారా కలెక్టరేట్లోని గల్ఫ్ హెల్ప్ లైన్, హైదరాబాదులోని ప్రవాసి ప్రజావాణిలో వివరాలను అందజేస్తామని తెలిపారు. సాధారణ పరిపాలన విభాగం శాఖ అధికారులతో మాట్లాడి పూర్తి నివేదిక అందజేయనున్నట్లు వివరించారు. బాధిత కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, సాధ్యమైనంత త్వరగా వారిని స్వస్థలాలకు రప్పించే ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇచ్చారు. నకిలీ ఏజెంట్ల మాయాజాలంలో చిక్కుకొని గల్ఫ్ దేశాల్లో నైపుణ్యరహిత పనుల్లో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. విదేశాలకు వెళ్లేవారు ప్రభుత్వ ఆమోదిత ఏజెంట్లను ఆశ్రయించాలని, సరైన కంపెనీ వీసాల మీదనే విదేశాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. -
పాఠశాలలకు రేటింగ్
మామడ: పాఠశాలల పచ్చదనం, పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణ, తాగునీటి వసతి వంటి మౌలిక సదుపాయాలపై ఆధారపడి పాఠశాలలకు రేటింగ్ కేటాయించి, మెరుగైన పాఠశాలల్ని ప్రోత్సహించాలని కేంద్రం స్వచ్ఛ హరిత విద్యాలయ రేటింగ్ పథకం చేపట్టింది. ఈ పథకంలో ఉత్తమ రేటింగ్ ఇవ్వడం ద్వారా స్వచ్ఛ పాఠశాలను నగదు సాయంతో ప్రోత్సహిస్తుంది. నమోదు ప్రక్రియ ఈనెల 15 వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఆన్లైన్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. జిల్లాలో 1,053 పాఠశాలలలో ఇప్పటివరకు 1008 పాఠశాలలు వివరాలు సమర్పించాయి. వీటిలో 95 శాతం మాత్రమే పాఠశాల చిత్రాలు, సమాచారాన్ని అప్లోడ్ చేశాయి. ప్రోత్సాహకాలు ఇలా.. జాతీయ స్థాయిలో 200 ఉత్తమ పాఠశాలలకు ఒక్కో పాఠశాలకు రూ.లక్ష నదగు అందిస్తారు. గైడ్ ఉపాధ్యాయులకు మూడు రోజుల విహార యాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా పాఠశాల పరిసరాలు మెరుగుపడతాయి. విద్యార్థుల కోసం ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన, పర్యావరణ అనుకూలమైన వాతావరణం కల్పిస్తారు. ఇది విద్యా నాణ్యతను మెరుగుపరచడంతో కీలకంగా మారుతుంది. రేటింగ్ విధానం పాఠశాలల పనితీరు 6 అంశాల మేరకు 60 ప్రశ్నలకు 125 మార్కులుగా మదింపు చేస్తారు. 1. నీటి సంరక్షణ, తాగునీటి వసతి 2. మరుగుదొడ్లు, మూత్రశాల నిర్వహణ, విద్యార్థుల చేతుల పరిశుభ్రత పాటించడం 3. పాఠశాల ఆవరణలో తోటలు, మొక్కల పెంపకం ద్వారా పచ్చదనం పెంపొందించడం 4. పాఠశాల ఆవరణలో వ్యర్థాల నిర్వహణ 5. విద్యుత్తు పొదుపు, సోలార్ వినియోగం 6. పర్యావరణ పరిరక్షణ అవగాహన రేటింగ్ శ్రేణులు పాఠశాలలకు వచ్చే పాయింట్ల ఆధారంగా రేటింగ్ కేటాయిస్తారు. నమోదు చేసుకోవాలి ఎస్హెచ్వీఆర్నకు సంబంధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అవగాహన కల్పించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్లో సూచించిన అంశాలను నమోదు చేయాలి. పాఠశాలల రేటింగ్‌ను మెరుగుపర్చుకుని రాష్ట్ర, జాతీయస్థాయికి ఎంపిక కావాలి. – దర్శనం భోజన్న, డీఈవో -
ఈకేవైసీ అయితేనే ఉపాధి
లక్ష్మణచాంద: గ్రామీణ పేదలకు ఏడాదికి కనీసం వంద రోజుల పని కల్పించాలన్న ఉద్దేశంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలవుతోంది. ఈ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయి. దీంతో కేంద్రం ఎప్పటికప్పుడు సంస్కరణలు చేస్తోంది. తాజాగా హాజరులో పారదర్శకత కోసం కేంద్రం జాబ్‌కార్డు ఉన్న ప్రతీ కూలీ వివరాలను కేవైసీ విధానంలో నమోదు చేయాలని సూచించింది. గతంలో హాజరు సమస్యలు, పనులను బదులు ఇతరుల పేర్లతో హాజరు రాయడం వంటి అవకతవకలను నివారించేందుకు ఇది ముఖ్యమైంది. ఈ కేవైసీ ద్వారా ప్రతీ కూలీ పనికి నిజంగా హాజరు అయితేనే హాజరు నమోదు అవుతుంది. మరోవైపు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనివేళలను నిర్దేశిస్తూ, రోజుకు కనీసం రూ. 307 వేతనం అందించబడుతుంది. రెండు పూటలుగా పని నిర్వహించడానికి మార్పులు జారీ అయ్యాయి. ఫొటోలు ద్వారా హాజరు.. ప్రతీరోజు పనికి వెళ్లే కూలీల హాజరు రెండుసార్లు ఫొటోల ద్వారా నమోదు చేయబడుతుంది. మొదటి ఫొటోతో నాలుగు గంటల తర్వాత రెండో ఫొటో సరిపోతేనే హాజరు ధృవీకరించబడుతుంది. దీనివల్ల హాజరు సరిగా నమోదు అవడం, అవకతవకలు నివారణకు అవకాశముంటుంది. ప్రస్తుత నమోదు ఇలా.. జిల్లాలో 41.41 శాతం కూలీల వివరాలు కేవైసీ ద్వారా నమోదు పూర్తి అయ్యాయి. మొత్తం 2,87,244 కూలీలలో 1,18,961 మంది కూలీలు ఈ ప్రక్రియ పూర్తి చేసినవారు, ఇంకా 1,68,283 మంది ఈ నమోదు పూర్తి చేయలేని వారు ఉన్నారు. కేంద్రం చేపడుతున్న ఈ చర్యలు గ్రామీణ ఉపాధి పథకాన్ని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేయడమే కాకుండా, పేదలకు తప్పనిసరి ఉపాధి హామీ ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. జిల్లా సమాచారం.... మండలం టార్గెట్ ఈకేవైసీపూర్తి శాతం సారంగాపూర్ 23,999 6,975 29.06 ముధోల్ 15,668 5,075 32.39 కుబీర్ 2,6401 9,047 34.27 లక్ష్మణచాంద 15,481 5,605 36.22 బాసర 7,835 2,729 35.70 తానూర్ 22,868 9553 41.77 మామడ 16,921 6858 40.53 నర్సాపూర్(జి) 12,288 4961 40.37 నిర్మల్ రూరల్ 13,676 5701 41.69 ఖానాపూర్ 16,465 6907 41.95 లోకేశ్వరం 20,009 8427 42.12 సోన్ 12348 5412 43.83 దిలావార్పూర్ 12,259 5610 45.76 పెంబి 8,101 3,963 48.92 భైంసా 22,235 10,708 48.16 కడెం 19,081 9395 49.24 దస్తురాబాద్ 7,529 3,876 51.48 కుంటాల 14,083 8,091 57.45 -
ప్రతినెలా వేతనాలు చెల్లించాలి
భైంసాటౌన్/నర్సాపూర్(జి)/ఖానాపూర్: తమకు ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని భైంసా ఏరియా ఆస్పత్రి నర్సింగ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆస్పత్రి ఆవరణలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. వేతనాలు సకాలంలో జమ చేయకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు. తెలంగాణ వైద్యవిధాన పరిషత్ ద్వారా ఒకటో తేదీన వేతనాలు జమ చేయాలని కోరారు. నర్సాపూర్(జి) సామాజిక ఆరోగ్య కేంద్రం ఎదుట వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు మౌన ప్రదర్శన నిర్వహించారు. ట్రెజరీ ద్వారా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖానాపూర్ సీహెచ్‌సీ ఎదుట కూడా ఉద్యగులు, సిబ్బంది నిరసన తెలిపారు. సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సూపరిండెంట్ వంశీ మాదవ్, ఉద్యోగులు, నాయకులు శ్రీనివాసచారి, సాయికృష్ణ, సుధీర్, శైలజ, మమత పాల్గొన్నారు. -
మానసిక ఒత్తిడితో అనారోగ్య సమస్యలు
నిర్మల్‌చైన్‌గేట్: మానసిక ఒత్తిడి అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని జిల్లా జనరల్ ఆసుపత్రి సైకియాట్రిస్ట్ ఎండీ డాక్టర్ అరుణ్‌కుమార్ అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక నర్సింగ్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజూ వ్యాయామం, యోగా, మెడిటేషన్ చేయాలని సూచించారు. మానవతా, అత్యవసర పరిస్థితుల్లో మానసిక ఆరోగ్యం అనే థీమ్‌తో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యంగా యువత సెల్‌ఫోన్‌తో సమయాన్ని వృథా చేస్తుందని, అలా కాకుండా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ జి.శకుంతల, టీచింగ్ స్టాఫ్ నాగజ్యోతి, సువర్ణ, మంజుల, సంధ్య, నవోదయ, నర్సింగ్ కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు. -
స్థానిక సమరానికి బ్రేక్
నిర్మల్‌చైన్‌గేట్: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫకేషన్ గురువారం ఉదయం కలెక్టర్ విడుదల చేశారు. దీంతో ఆశావహుల్లో ఉత్సాహం కనిపించింది. మొదటి రోజు ఐదుగురు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే సాయంత్రానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. రిజర్వేషన్ల జీవోపై స్టే ఇవ్వడంతో ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. నామినేషన్ల ప్రక్రియలో గందరగోళం.. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే జిల్లాలో నామినేషన్లు స్వీకరణ మొదలైంది. పెంబి ఎంపీటీసీకి 2, శెట్టిపల్లి ఎంపీటీసీ, మందపల్లి ఎంపీటీసీ, మామడ ఎంపీటీసీ స్థానాలకు ఒక్కో నామినేషన్ దాఖలయ్యా యి. అయితే సాయంత్రం హైకోర్టు స్టేతో నామినేష న్ ప్రక్రియ నిలిచిపోయింది. ఎన్నికల సంఘం తదుపరి నిర్ణయం ఏంటి అన్న ఉత్కంఠ నెలకొంది. ఆశావహుల్లో నిరాశ..ఎన్నికల బరిలోకి దిగేందుకు నెలల తరబడి సన్నద్ధమైన ఆశావహులు, హైకోర్టు ఉత్తర్వులతో తీవ్ర నిరాశకు గురయ్యారు. గ్రామాల్లో ప్రజలతో మమేకమవుతూ, సేవా కార్యక్రమాలు చేపట్టి, ఎన్నికల ప్రణాళికలు సిద్ధం చేసిన వారు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. రెండు నెలల్లో ఎన్నికల ప్రక్రియ సాగే సూచనలు లేకపోవడంతో రాజకీయ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఖర్చులు, ఏర్పాట్లు అనిశ్చితిలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ బరిలోకి దిగేందుకు చాలా మంది అభ్యర్థులు ఇప్పటికే వందలాది ఫ్లెక్సీలు సిద్ధం చేసుకున్నారు. ఇందుకు భారీగా ఖర్చులు చేశారు. కొందరు ఆర్థికంగా కూడా సిద్ధమయ్యారు. కుల నాయకులతో చర్చలు జరిపి, గ్రామ నేతల మద్దతు కూడగట్టుకున్నారు. కానీ ఎన్నికలు వాయిదా పడడంతో స్థానిక సమరం నిలిచిపోయింది. -
‘పది’ విద్యార్థులకుప్రత్యేక తరగతులు
మామడ: జిల్లాలో పదో తరగతి ఫలితాలను మెరుగుపరిచే దిశగా విద్యాశాఖ అధికారులు సమగ్ర ప్రణాళిక రూపొందించారు. విద్యార్థులు పరీక్ష సమయంలో కాకుండా ఇప్పటి నుంచే అభ్యాసంపై దృష్టి పెట్టేలా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ 31 వరకు ఈ ప్రత్యేక సెషన్లు కొనసాగనున్నాయి. సమయ పట్టిక ప్రతీరోజు రెండుసార్లు తరగతులు నిర్వహిస్తారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4.15 నుంచి 5.15 గంటల వరకు ప్రత్యేక తరగతులు ఉంటాయి. ఈ తరగతుల్లో వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించడం, ఆత్మవిశ్వాసం పెంచడం, సందేహాలు నివృత్తి చేయడం తదితర కార్యక్రమాలు ఉంటాయి. గత ఫలితాల ఆధారంగా..జిల్లా 2022–23, 2023–24 విద్యాసంవత్సరాల్లో పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవగా, 2024–25లో 15వ స్థానానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయి విద్యాధికారులు ఈసారి తప్పక మంచి ఫలితాలు సాధించే విధంగా పాఠశాలలలో ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభించారు. వారానికోసారి సమీక్ష ప్రతీ పాఠశాలలో వారానికి ఒకసారి ప్రత్యేక తరగతులపై సమీక్ష జరుగుతుంది. మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ కార్యక్రమాల అమలును పరిశీలిస్తారు. విద్యార్థుల అభ్యసన స్థాయి, మార్కుల పెరుగుదల వంటి అంశాలను రికార్డులుగా నమోదు చేయాలి. హాజరు కాని విద్యార్థుల ఇళ్లను ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు స్వయంగా సందర్శించి హాజరయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. సద్వినియోగం చేసుకోవాలి పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ఉపాధ్యాయుల కొరత లేకుండా ఇతర పాఠశాలల నుంచి సర్దుబాటు చేస్తున్నాము. ప్రత్యేక తరగతుల్లో విద్యార్థులు వదశాతం హాజరయ్యే విధంగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి. పదిలో మెరుగైన ఫలితాలు సాధించే విధంగా ప్రణాళికను రూపొందించాం. – దర్శనం భోజన్న, జిల్లా విద్యాధికారిమార్గదర్శకాల ఇలా..జిల్లా వివరాలుప్రభుత్వ పాఠశాలలు 117పదో తరగతి విద్యార్థుల సంఖ్య 4,155ఆదర్శ పాఠశాల 01విద్యార్థుల సంఖ్య 100కేజీబీవీలు 18విద్యార్థులు సంఖ్య 867 -
రూ.50 వేలు దాటితే సీజ్
నిర్మల్‌టౌన్: జిల్లావ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నిక ల కోడ్ అమలులో ఉన్నందున ఎస్పీ జానకీ షర్మిల జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏడు అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. విస్తృతంగా వాహనాలు తనిఖీ చేస్తున్నారు. సరైన ఆధారం లేకుండా రూ.50 వేల కన్నా ఎక్కువ నగదు తీసుకెళ్తే సీజ్ చేస్తామని ఎస్పీ తెలిపారు. గత ఎన్నికల్లో కేసుల్లో ఉన్నవారు, సమస్యలు సృష్టించే ట్రబుల్ మంగర్స్ను, రౌడీలను, కేడీలను, సస్పెక్ట్‌ల ను ముందస్తుగా బైండోవర్ చేస్తామని వెల్లడించా రు. నవంబర్ 11 వరకు కోడ్ అమలులో ఉండడంతో ఎస్పీ రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు, జిల్లా ప్రజలకు ఎన్నికల నియమావళిని తెలిపారు. జిల్లాలో ప్రత్యేక ఎలక్షన్ సెల్ ఏర్పాటు చేసి,అనుభవజ్ఞు లైన అధికారులను, సిబ్బందిని నియమించామన్నా రు. సోషల్ మీడియాపై జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక నిఘా ఉంచారు. తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే విధంగా, అవమానపరిచే విధంగా రూమర్స్ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తే సంబంధిత వ్యక్తులు, వాట్సప్ అడ్మిన్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అ భ్యర్థులు అనుమతి పొందిన వాహనాలు మాత్రమే ఉపయోగించాలి. లౌడ్ స్పీకర్ల వినియోగానికి అనుమతి తీసుకోవాన్నారు. ప్రజలు ఎలాంటి అనుమాదాస్పద కార్యకలాపాలు గమనించినా డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712659555 నంబర్‌కు, వాట్సాప్ నంబర్ 8712659599 కు సమాచారం అందించాలని తెలిపారు. -
ప్రహ్లాద్ చరిత్రలో నిలిచిపోతారు
నిర్మల్ టౌన్: మున్సిపల్ ఉద్యమ చరిత్రలో ప్రహ్లాద్ పేరు చిరస్మరణీయంగా నిలిచిపోతుందని నిర్మల్ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ప్రహ్లాద్ చిత్రపటానికి గురువారం పూలమాలవేసి నివాళులర్పించారు. మున్సిపల్ ఉద్యోగుల హక్కుల సాధన కోసం ప్రహ్లాద్ జీవితాంతం శ్రమించి, మున్సిపల్ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపునకు దారిచూపిన మహోన్నత నాయకుడు అని కొనియాడారు. ట్రెజరీ ద్వారా జీతాల సాధనలో ఆయన చూపిన నిబద్ధత , పోరాటస్ఫూర్తి, సహ ఉద్యోగులపై చూపిన అనురాగం ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ లక్ష్మీరాజ్, మేనేజర్ అనూప్, శానిటరీ ఇన్స్పెక్టర్లు దేవీదాస్, ప్రవీణ్‌కుమార్, మున్సిపల్ సిబ్బంది, వార్డు అధికారులు పాల్గొన్నారు. -
మొదలై.. ఆగింది
సారంగపూర్/కడెం/ఖానాపూర్/లక్ష్మణచాంద/దస్తురాబాద్: జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగే 9 జెడ్పీటీసీ, 75 ఎంపీటీసీ స్థానాలకు కలెక్టర్ అభిలాష అభినవ్ నోటిఫికేషన్ గురువారం జారీ చేశారు. ఈమేరకు తొలి విడత ఎన్నికలు జరిగే మండలాల్లో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు ప్రారంభించారు. కలెక్టర్ సారంగాపూర్, కడెం మండలాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. హెల్ప్‌డెస్క్, అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలు, పరిశీలించిన అనంతరం రిజిష్టర్లు పరిశీలించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై గురించి ఆరా తీశారు. ఖానాపూర్ ఎంపీడీవో కార్యాలయంలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సందర్శించారు. అయితే సాయంత్రం జీవో 9పై హైకోర్టు స్టే విధించడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఈసీ ఆదేశాల మేరకు తదుపరి ప్రక్రియ చేపడతామని తెలిపారు. లక్ష్మణచాంద, సారంగాపూర్, ఖనాపూర్, కడెంలో గురువారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దస్తురాబాద్ మండల కేంద్రంలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జెడ్పీ సీఈవో గోవింద్ , సీఐ అజయ్ పరిశీలించారు. వారివెంట ఎంపీడీవో సూజాత, తహసీల్దార్ విశ్వంబర్, ఎంపీవో రమేశ్‌రెడ్డి పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. -
బీసీలకు రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం
భైంసాటౌన్: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేష న్ సాధించే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేస్తుందని కేంద్ర మాజీ మంత్రి ఎస్.వేణుగోపాలచారి అన్నారు. పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బి.నారాయణ్‌రావు పటేల్ నివాసంలో గురువారం మాట్లాడారు. ఎన్నిక ల నోటిఫికేషన్, జీవో 9పై హైకోర్టు స్టే విధించడం బీసీ ఆశావహులను నిరాశపర్చిందన్నారు. బీసీలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో అన్ని పక్షాల మద్దతుతో బిల్లు ప్రవేశపెట్టిందన్నారు. గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపినా, వారు ఆమోదించలేదన్నారు. అయినా.. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు సాగిందన్నారు. ఈ క్రమంలో జీవో 9పై హైకోర్టు స్టే విధించడం కలవరపరిచిందని తెలిపా రు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బి.నారాయణ్రా వు పటేల్, ముధోల్ ఆత్మ చైర్మన్ గన్ను నర్సారెడ్డి ఉన్నారు. పలువురికి పరామర్శ..భైంసా ఏరియాస్పత్రి సూపరింటెండెంట్ కాశీనాథ్ తల్లి ఇటీవల మృతి చెందగా కాశీనాథ్‌ను, బీజేపీ నాయకుడు గోపాల్ సర్డా, కుమార్ యాదవ్ కుటుంబాలను వేణుగోపాలచారి పరామర్శించారు. -
‘ట్రాన్స్మిషన్ అసెస్మెంట్ సర్వేపై శిక్షణ
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో లింఫోటిక్ ఫైలేరి యా నియంత్రణకు ట్రాన్స్మిషన్ అసెస్మెంట్ సర్వేపై జిల్లాలోని వైద్యాధికారులకు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లకు, ఆరోగ్య పర్యవేక్షకులకు మహిళా ఆరోగ్య సహాయకులకు, ఆశ వర్కర్లకు జిల్లా సమీకృత కార్యాలయంలో గురువారం శిక్షణ ఇచ్చారు. సీనియర్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ మాట్లాడుతూ జిల్లాలో లింఫోటిక్ ఫైలేరియా వ్యాప్తి తెలుసుకునేందుకు ట్రాన్స్మిషన్ అసెస్మెంట్ సర్వేపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఎంపిక చేయబడిన గ్రామాల్లో 20 ఏళ్లు పైపడిన వారికి ఫైలేరియా పరీక్ష స్టిరప్స్ ద్వారా రక్తాన్ని పరీక్షించడం జరుగుతుందన్నారు. సేకరించే విధానంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కన్సల్టెంట్ డాక్టర్ శిరీష, జాతీయ కీటక జనిత వ్యాధుల రాష్ట్ర కన్సల్టెంట్ తిరుపతి, ఫైలేరియా కన్సల్టెంట్ ఎం.లక్ష్మణ్ కార్యక్రమా నిర్వాహణాధికారి డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ ఆశిష్‌రెడ్డి, డాక్టర్ రాజారమేశ్, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. -
కంటి పరీక్షలు చేయించుకోవాలి
నిర్మల్‌చైన్‌గేట్: కంటి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి క్రమంత ప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలి డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్ అన్నారు. వరల్డ్ ఐ సైట్ డే పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. విటమిన్ ఏ కంటికి మేలు చేస్తుందన్నారు. ఏటా అక్టోబర్ 9న వరల్డ్ ఐ సైట్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు కంటి ఆరోగ్యం, జాగ్రత్తలను తెలియజేయడానికి, అంధత్వ నివారణకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. మొబైల్ ఫోన్స్, కంప్యూటర్లను వాడినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ సురేష్, కార్యక్రమ నిర్వహణ అధికారి డాక్టర్ ఆశీష్రెడ్డి, డిప్యూటీ జిల్లా విస్తరణ, మీడియా అధికారి బారె రవీందర్, ఆప్తాల్మిక్ ఆఫీసర్ లక్ష్మీకాంత్ పాల్గొన్నారు. -
పరిహారం ఇస్తేనే యాసంగి!
ఈ ఫొటోలోని రైతుపేరు పండరి. ముద్గల్‌కు చెందిన ఈయన ఈ వానాకాలం తనకున్న మూడు ఎకరాల్లో సోయా, మరో ఎకరంలో వరి, ఇంకో ఎకరంలో పత్తి పంట వేశాడు. భారీ వర్షాలకు పత్తి, సోయా, వరి పంటలన్నీ దెబ్బతిన్నాయి. భారీ వర్షాలు కురిసిన ప్రతీసారి తీవ్ర నష్టం జరుగుతోంది. అధికారులు ప్రాథమిక సర్వే చేసి నష్టం అంచనా వేశారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థికసాయం అందలేదు. పెట్టుబడి, రెక్కల కష్టం వృథా అయ్యాయని ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని వేడుకుంటున్నాడు. భైంసా/భైంసారూరల్: జిల్లా రైతులు ఈ సీజన్లో పండించిన పంటలు భారీ వర్షాలు, వరదలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. యాభై రోజులుగా కురుస్తున్న వర్షాలు, గోదావరి నదీ ప్రవాహం కలిసి పంట భూములను పూర్తిగా ముంచేశాయి. సెప్టెంబర్ చివరి వారంలో.. వారం రోజులపాటు కురిసిన భారీ వర్షాల ప్రభావం ఇంకా తగ్గలేదు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గ్రామాలవారీగా నష్టం వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. అదే సమయంలో ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిస్థితిని సమీక్షించి, పంట నష్టంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బాధిత రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో పంట నష్టపోయిన రైతుల్లో ఆశలు చిగురించాయి. కానీ, పరిహారంపై ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. నష్టపోయిన ప్రధాన పంటలు జిల్లాలో ప్రధానంగా సాగు అయ్యే సోయా, మిను ము, వరి, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నా యి. లక్షల రూపాయలు నష్టపోయిన రైతులు పరిహారం అందించి యాసంగి పంటలు సాగు చేసేలా చూడాలని కోరుతున్నారు. కౌలు రైతుల పరిస్థితి దారుణం..ఎకరానికి రూ.16 వేల నుంచి రూ.24 వేల వరకు కౌలు చెల్లించి భూములు సాగు చేసుకున్న రైతులు రెండింతల కష్టాల్లో చిక్కుకున్నారు. ఒకవైపు భూమి యజమానులకు కౌలు ఇవ్వాల్సిన ఒత్తిడి, మరోవైపు పంట కోసం తీసుకున్న అప్పులు తిరగిరాలేని స్థితి. బీమా లేకపోవడం, ప్రభుత్వ సహాయం ఆలస్యమవడం వారి ఆర్థిక భారాన్ని మరింత పెంచుతోంది. వరదల ప్రభావం మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో వర్షాలతో గోదా వరి, మంజీర నదులు ఉధృతంగా ప్రవహించాయి. దీంతో నిర్మల్ జిల్లా రైతు భూములు వరద నీటిలో చిక్కుకున్నాయి. మొత్తం 30 వేల ఎకరాలకుపైగా పంటలు నీటమునిగాయి. ముధోల్, బాసర, లోకేశ్వరం, దిలావర్పూర్, లక్ష్మణచాంద మండలాల్లో వరదకు పంటలు దెబ్బతిన్నాయి. కడెం, స్వర్ణ, గడ్డెన్నవాగు ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల కారణంగా పరీవాహక గ్రామాల్లో పంటలు మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో ఇసుక మేటలు వేశాయి. సాయం అందితేనే..యాసంగి పంటలసాగు ఈసారి పూర్తిగా ప్రభుత్వం ఆధారపడి ఉంటుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులకు విత్తనా లు, ఎరువులు ఉచితంగా అందిచాలని భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేసింది. జిల్లా వ్యాప్తంగా సంఘం సేకరించిన వివరాల ప్ర కారం, అత్యవసర ఆర్థికసాయం ఇవ్వకుంటే యాసంగి సాగు కష్టమవుతుంది.స్పష్టత కరువు..పంట నష్టానికి జిల్లా వ్యాప్తంగా అధికారులు ఫీల్డ్ సర్వేలు పూర్తి చేశారు. కానీ రైతులు ఎదురుచూస్తున్న పరిహార చెల్లింపుపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ముధోల్ మండలంలోని రైతులు ఇప్పటికే తహసీల్దార్‌కు వినతి పత్రాలు అందజేశారు. అయినా వాస్తవ సహాయం దిశగా కార్యచరణ కనిపించడం లేదు. పెట్టుబడి లేదు.. వానాకాలం పంటలన్నీ నీటమునిగాయి. పంట కోసుకున్న పెట్టుబడి కూడా చేతికిరాదు. ఇలాంటి పరిస్థితిలో యాసంగిలో పంటల సాగు ఎలా చేయాలో తెలియడం లేదు. ప్రభుత్వమే నష్టపోయిన పంటలకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. భారీగా నష్టపోయిన జిల్లా రైతులకు యాసంగిలో శెనగ, మొక్కజొన్న విత్తనాలు ఉచితంగా ఇవ్వాలి. – మారుతి, రైతు, కథ్గాం -
జోనల్‌స్థాయి బాక్సింగ్ ఎంపిక పోటీలు
నిర్మల్‌రూరల్: జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్)ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో బుధవారం అండర్–17 బాలబాలికల జోనల్ స్థాయి బాక్సింగ్ ఎంపిక పోటీలను డీఈవో భోజన్న ప్రారంభించారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల ఉమ్మడి జిల్లా జట్టును ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు త్వరలో హన్మకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని ఎస్జీఎఫ్ సెక్రెటరీ రవీందర్‌గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో డీవైఎస్వో శ్రీకాంత్‌రెడ్డి, కోచ్‌లు శేఖర్, రా జేశ్, స్వామి, క్రీడల కన్వీనర్ సత్తయ్య, పీడీలు భూమన్న, కిశోర్, తదితరులు పాల్గొన్నారు. -
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత
సారంగపూర్: వన్యప్రాణుల సంరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని డెప్యూటీ రేంజ్ అధికారి నజీర్‌ఖాన్ అన్నారు. వన్యప్రాణుల సంరక్షణ వారోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం మండలంలోని స్వర్ణ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవులు అంతరించిపోవడం వల్ల వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం అనూష, ఎఫ్‌బీవోలు వెన్నెల, సుజాత, సంతోష్, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీకి పండుగ
మంచిర్యాలఅర్బన్: బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి అదనపు ఆదాయం సమకూరి పండుగ చేసుకుంది. దసరా ముందు, తర్వాత ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసేందుకు ప్రత్యేక బస్సులు నడిపించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఉమ్మడి జిల్లా నుంచి రాజధానికి ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసింది. ఉద్యోగం, చదువు రీత్యా హైదరాబాద్‌కు వెళ్లిన వారు సొంతూళ్లకు వచ్చి వెళ్లడానికి బస్సుల రాకపోకలకు చర్యలు చేపట్టింది. ఈ ఏడాది దసరా సందర్భంగా రోజువారీ బస్సులతోపాటు అదనపు బస్సులు తిప్పడం ద్వారా ప్రయాణికులకు ఇబ్బందులు తొలగడంతోపాటు సంస్థకు ఖజానా సమకూరింది. ఉమ్మడి జిల్లా నుంచి ఆయా డిపోల ద్వారా హైదరాబాద్‌కు దసరా ముందు, తర్వాత సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 6వరకు 998 అదనపు బస్సులు ఏర్పాటు చేసింది. 5,10,072 కిలోమీటర్లు నడపడం ద్వారా 1,39,388 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. దీంతో రూ.3,01,08,462 ఆదాయం సమకూరింది. దసరా ముందు.. తర్వాత దసరా పండుగకు ముందు ఉమ్మడి జిల్లా(రీజియన్) నుంచి ఆదిలాబాద్, భైంసా, నిర్మల్, ఉట్నూర్, ఆసిఫాబాద్, మంచిర్యాల డిపోల నుంచి 399 ప్రత్యేక బస్సులు నడిపించారు. ఏడు సూపర్ లగ్జరీ(మంచిర్యాల డిపో)లు, 43 సూపర్‌లగ్జరీలు, 23 డీలక్స్, 241 ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక బస్సులు నడిపారు. 2,05,348 కిలోమీటర్ల మేర బస్సులు నడపడం ద్వారా 56,467 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. రూ.1,16,02,891 ఆదాయం చేకూరింది. పండుగ తర్వాత ఈ నెల 3నుంచి 6వరకు రీజియన్ వారీగా 599 బస్సులు నడిపారు. ఇందులో 15రాజధాని, 192 సూపర్‌లగ్జరీ, 38 డీలక్స్, 354 ఎక్స్‌ప్రెస్ బస్సులు తిప్పారు. అదనపు బస్సులతో 3,04,724 కిలోమీటర్లు నడిపి 82,921 మంది గమ్యస్థానాలకు చేర్చారు. రూ.1,85,05,571 ఆదాయం వచ్చింది. అధికంగా మంచిర్యాల డిపో నుంచే.. పండుగ నేపథ్యంలో ఆయా డిపోల నుంచి మొత్తంగా 998 బస్సులు నడిపించగా.. ఇందులో అధికంగా మంచిర్యాల డిపో నుంచే 198 బస్సులు ఉన్నాయి. 11,701 మంది మహాలక్ష్మి పథకం ప్రయాణికులు కాగా, 11954మంది టికెట్లు కొనుగోలు చేశారు. 98,867 కిలోమీటర్లు మేర బస్సులు తిప్పి 23,655 మంది ప్రయాణికులను చేరవేయడం ద్వారా రూ.62,70,066 ఆదాయం వచ్చింది. దసరా ముందు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ ఒకటి వరకు 120 బస్సులు 59536 కిలోమీటర్లు నడపడం ద్వారా 14,575 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. ఇందులో మహాలక్ష్మి పథకం 8192 మంది, 6,950 మంది టికెట్ల కొనుగోలు చేసి ప్రయాణం చేశారు. రూ.35,92,471 సమకూరింది. దసరా తర్వాత ఈ నెల 3 నుంచి 6వరకు 8,513 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసి రూ.26,77,595 ఆర్జించింది. దసరా ముందు, తర్వాత వచ్చిన ఆదాయంలో ఆదిలాబాద్ రీజియన్ వారీగా పరిశీలిస్తే మంచిర్యాల డిపో ముందుంది. -
స్థానిక సందడి షురూ
నిర్మల్అ‘విశ్రాంత’ స్విమ్మర్లు! నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ చెరువులో అన్ని కాలాల్లో సమృద్ధిగా నీరు ఉంటుంది. 70 ఏళ్లకు చేరువగా ఉన్న వారు హుషారుగా ఇక్కడ ఈత కొడుతున్నారు.ఎన్నికల ఏర్పాట్లు పరిశీలన మామడ: స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్ బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. రికార్డులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో తహసీల్దార్ శ్రీనివాస్‌రా వు, ఎంపీడీవో సుశీల్‌రెడ్డి, ప్రత్యేక అధికారి పరమేశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్‌చైన్‌గేట్: స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. హైకోర్టు సైతం నోటిఫికేషన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో నేడు (అక్టోబర్ 9న) మొదటి విడత నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. తొలి విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫస్ట్ ఫేస్‌లో 75 ఎంపీటీసీ స్థానాలకు, 9 జెడ్పీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు అక్టోబర్ 9వ తేదీ నుంచి నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అక్టోబర్ 11వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. మొదటి విడత జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు అక్టోబర్ 23వ తేదీన పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 11న జరగనుంది. బీసీ రిజర్వేషన్లపై నేడు విచారణ.. మరోవైపు బీసీ కేటగిరీ రిజర్వేషన్లపై హైకోర్టులో వచ్చే తదుపరి విచారణ నేటికి వాయిదా పడింది. కోర్టు ఇప్పటికే నోటిఫికేషన్ నిలిపివేయకూడదని స్పష్టం చేసినందువల్ల ఇది ఎన్నికల షెడ్యూల్‌పై ప్రభావం చూపించదని భావిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడతల వారీగా.. మొదటి విడత జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీల మండలాలు మండలం ఎంపీటీసీలు ఓటర్లు ఖానాపూర్ 8 23,658 పెంబి 5 10,886 కడెం 10 29,159 దస్తూరాబాద్ 5 12,894 మామడ 9 26,072 లక్ష్మణచాంద 9 24,577 నిర్మల్ 7 22,751 సోన్ 8 21,801 సారంగాపూర్ 14 39,516 తొలివిడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ముఖ్యమైన తేదీలు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అక్టోబర్ 9 చివరి తేదీ : అక్టోబర్ 11 నామినేషన్ల పరిశీలన : అక్టోబర్ 12 నామినేషన్ల ఉపసంహరణ అక్టోబర్ 15 ఎన్నికల తేదీ : అక్టోబర్ 23 ఓట్ల లెక్కింపు : నవంబర్ 11 -
ఎన్నికల నిర్వహణకు నిధుల కొరత
నిర్మల్‌చైన్‌గేట్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నిధుల సమస్య వచ్చి పడింది. ఎన్నికల ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నా ప్రభుత్వం నుంచి ప్రత్యేక గ్రాంట్ ఇంకా విడుదల కాలేదు. బుధవారం హైకోర్టు ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణపై అధికారుల్లో సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే ఓటరు జాబితాల రూపకల్పన నుంచి పోలింగ్ సామగ్రి, రవాణా ఖర్చులు చాలా అయ్యాయని, ఈ క్రమంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలు వడగా గ్రాంట్ రాకుంటే ఎలా అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు తెచ్చి మరీ ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విడుదల కాని ప్రత్యేక గ్రాంట్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈ నెల 9, 13 తేదీల నుంచే జిల్లాలో 18 జెడ్పీటీసీలు, 157 ఎంపీటీసీ స్థానాలకు రెండు విడతలుగా ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో మూడు విడతలుగా 400 గ్రామ పంచాయతీలు, 3,368 వార్డులకు నేడు (గురువారం) నోటిఫికేషన్ రానుంది. ఎన్నికల సామగ్రిని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమకూర్చినా స్టేషనరీ, ఎన్నికల సామగ్రి రవాణా, సమావేశ బ్యానర్లు, బ్యాలెట్ బాక్సుల మరమ్మతులు, జిరాక్స్‌లు, హమాలీ ఖర్చులు, సిబ్బందికి శిక్షణ, స్నాక్స్, భోజనాలు, తదితర ఖర్చుల భారమంతా మండల, జిల్లా అధికారులపైనే పడుతోంది. ఈ అవసరాల కోసం నిధులు లేకపోవడంతో స్థానికంగా ఉన్న స్టేషనరీ దుకాణాల్లో అప్పు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ఏ ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి ఇబ్బందులు పడిన దాఖలాలు లేవని అధికారులు పేర్కొంటున్నారు. ఎన్నికల ఖర్చుల నిమిత్తం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక బడ్జెట్ కేటాయించినా జిల్లాకు ఇంకా ఒక్కపైసా కూడా మంజూరు చేయలేదని తెలుస్తోంది. ఇప్పటికే పలు మండలాల్లో ఎన్నికల వ్యయం రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు చేరుకుంది. ప్రత్యేక పాలనలో పల్లెలు.. గతేడాది ఫిబ్రవరి 2 నుంచి పంచాయతీల్లో ప్రత్యేక పాలన కొనసాగుతోంది. ఇదే తరహాలో గతేడాది ఆగస్టు నుంచి జిల్లా, మండల పరిషతుల్లో స్పెషలాఫీసర్ల పాలన నడుస్తోంది. అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు సైతం సక్రమంగా విడుదల కావడం లేదు. దీంతో పంచాయతీలు, మండల పరిషత్ ప్రత్యేక అధికారులకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. విధిలేని పరిస్థితుల్లో స్పెషలాఫీసర్లు, కార్యదర్శులు సొంత నిధులతో పల్లెల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఈ తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో ఆ సమస్య మరింత తీవ్రమైంది. ప్రభుత్వం స్పందించి నోటిఫికేషన్ వచ్చే నాటికై నా ప్రత్యేక ఎన్నికల గ్రాంట్ విడుదల చేయాలని అధికారులు కోరుతున్నారు. జిల్లా వివరాలు పంచాయతీ డివిజన్లు 02 జెడ్పీటీసీ స్థానాలు 18 ఎంపీటీసీ స్థానాలు 157 పోలింగ్ కేంద్రాలు 892 గ్రామ పంచాయతీలు 400 వార్డులు 3,368 పురుష ఓటర్లు 2,13,805 మహిళా ఓటర్లు 2,35,485 ఇతరులు 12 మొత్తం ఓటర్లు 4,49,302 -
నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి
నిర్మల్‌చైన్‌గేట్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు.బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కౌమిదిని అన్నారు. బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ, ఎన్నికల నోటిఫికేషన్ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గురువారం నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎటువంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలన్నారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని, పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని ఏర్పాట్లు పూర్తి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. మొదటి విడతలో తొమ్మిది జెడ్పీటీసీ, 75 ఎంపీటీసీ స్థానాలకు గురువారం నుంచి 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు చెప్పారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, వీఎస్టీ బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని, ఆర్వో, ఏర్వోలకు ఇప్పటికే పలుమార్లు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ నామినేషన్ స్వీకరణ ప్రక్రియను ఖచ్చితంగా వీడియో రికార్డింగ్ చేయాలన్నారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించాలన్నారు. 12 న నామినేషన్ల పరిశీలన, 15 న ఉపసంహరణ, 23న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్, నవంబర్ 11న ఫలితాలు ఉంటాయన్నారు. నామినేషన్ కేంద్రాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి, అన్ని ఫారాలు అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఏఎస్పీ ఉపేంద్రారెడ్డి, ఆర్డీవో రత్నకళ్యాణి, జెడ్పీ సీఈవో గోవింద్, డీపీవో శ్రీనివాస్, డీపీఆర్వో విష్ణువర్ధన్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న బీజేపీ’
లక్ష్మణచాంద: బీజేపీ తన అధికారాన్ని దుర్వి నియోగం చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను అణ చివేయాలని చూస్తోందని టీపీసీసీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి రామ్ భూపాల్, డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు ఆరోపించారు. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం కనకాపూర్‌లో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ రాహుల్ గాంధీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పాల్పడిన ఓట్ల చోరీపై అలుపెరుగని పో రాటం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్, నిర్మల్, సారంగాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు సోమా భీమ్‌రెడ్డి, అబ్దుల్ హాది, పార్టీ మండల అధ్యక్షుడు తక్కల విద్యాసాగర్‌రెడ్డి, బొల్లోజీ నర్సయ్య, ఒడ్నాల రాజేశ్వర్, బుజంగా శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. -
విట్టోలి చెరువుకు గండి
ముధోల్: మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మండలంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు మత్తడి దూకుతున్నాయి. ఈ క్రమంలో మండలంలోని విట్టోలి రాళ్ల చెరువులోకి సోమవారం రాత్రి భారీగా వరద రావడంతో కట్ట తెగిపోయింది. దీంతో కింద ఉన్న పత్తి, వరి పంటలు నీటమునిగాయి. చేతికి వచ్చిన సోయా పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అధికారులు రాళ్ల చెరువుకు యుద్ధ ప్రతిపాదికగా మరమ్మతులు చేపట్టాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు. చెరువుకు గండి పడే అవకాశం ఉందని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఆదివాసీల ఆత్మగౌరవ ప్రతీక కుమురంభీం
నిర్మల్‌టౌన్: ఆదివాసీల ఆత్మగౌర ప్రతీక కుమురంభీం అని తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకగారి భూమయ్య అన్నారు. మంగళవారం కుమురంభీం 85వ వర్ధంతి సందర్భంగా తుడుం దెబ్బ జిల్లా కమిటీ నాయకులు జిల్లా కేంద్రంలోని కుమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భూమయ్య మాట్లాడుతూ.. జల్.. జంగల్.. జమీన్ నినాదంతో నిజాం పాలకులకు వ్యతిరేకంగా కుమురంభీం పోరాడారని తెలిపారు. ఆదివాసీల హక్కులు, అణగారిన వర్గాల స్వయంపాలన, స్వాభిమానం కోసం పోరాడని యోధుడు అని కొనియాడారు. నిర్మల్‌లో ఆదివాసీ మ్యూజియం ఏర్పాటు చేయాలని కోరారు. తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు సాకి లక్ష్మణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంచు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తొడసం గోవర్ధన్, ఆదివాసీ నాయకులు మల్లేశ్, సాయన్న, రాజేశ్వర్, నారాయణ, సాయినాథ్, అత్రం రాజు, తొడసం శంభు పాల్గొన్నారు. -
ప్రణాళిక ప్రకారం చదవాలి
లక్ష్మణచాంద: విద్యార్థులు ప్రణాళిక ప్రకారం చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని డీఈవో భోజన్న సూచించారు. మండలంలోని వడ్యాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మంగళవారం సందర్శించారు. పదో తరగతి విద్యార్థులకు సలహాలు, సూచనలు చేశారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించా లన్నారు. ప్రతీ వారం స్లిప్ టెస్టులు నిర్వహించాలని ఉపాధ్యాయులను కోరారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి అకడమిక్ క్యాలెండర్ ప్రకారం తరగతులు నిర్వహించాలని, విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకం పకడ్బందీగా అమలు చేయాలన్నారు. రాగి జావా వారంలో రెండు రోజులు విద్యార్థులకు అందించాలని కోరారు. పాఠశాలలోని పలు రిజిస్టర్లు, రికార్డులు పరిశీలించారు. ఫార్మేటివ్ 1, 2 మార్కులు స్కూల్ ఎడ్యుకేషన్ యాప్‌లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవో ఆర్.అశోక్‌వర్మ, తహసీల్దార్ శ్రీలత, మండల అభివృద్ధి అధికారి రాధ, సీఆర్పీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
నాలుగు రోజులుగా నిత్యం వర్షాలు
జిల్లాను వరణుడు వీడడం లేదు. నాలుగు రోజులుగా నిత్యం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పంటలు దెబ్బతింటున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సోమవారం రాత్రి నిర్మల్, నర్సాపూర్, కుంటాల మండలాల్లో భారీ వర్షం కురిసింది. నర్సాపూర్(జి) మండలంలో ఈదురుగాలులతో వర్షం కురవడంతో ఆరబోసిన మొక్కజొన్నలు తడిసిపోయాయి. సోయా, వరి పంటలు దెబ్బతిన్నాయి. నందన్ ఎక్స్‌రోడ్డు వద్ద బీటీరోడ్డు కోతకు గురైంది. కాళేశ్వరం ప్రాజె క్టు – 27వ ప్యాకేజీలో నిర్మించిన అక్విడెక్ట్ పిల్లర్ కుంగి బీటలు వారింది. నర్సాపూర్ (జి)శివారులో విద్యుత్ స్తంభం విరిగింది. మండలంలో 72.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఏఎస్వో శ్రీరామ్ తెలిపారు. నిర్మల్ రూరల్ మండలం అక్కాపూర్, ముఠాపూర్, వెంకటాపూర్, చిట్యాల, ముజ్గి గ్రామాల్లో కురిసిన వర్షానికి రోడ్లపై ఆరబెట్టిన మక్కలు, మొక్కజొన్న కంకులు తడిసిపోయా యి. సోయా పంట కూడా తడిసింది. వర్షాలకు ముధోల్ మండలంలోని అన్ని గ్రామాల్లో రైతులు పండిస్తున్న పత్తి పంట దెబ్బతింటోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కాయలు ఎర్రబడి రాలిపోతున్నాయి. రైతులు ఆందోళన చెందుతున్నారు.– నర్సాపూర్(జి)/ముధోల్/ సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ -
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత
● డీఎఫ్‌వో నాగిని భాను నిర్మల్‌టౌన్: వన్యప్రాణులను సంరక్షించడం అందరి బాధ్యత అని, దీంతో పర్యావరణం సమతుల్యంగా ఉంటుందని జిల్లా అటవీశాఖ అధికారి నాగిని భాను అన్నారు. జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో వన్యప్రాణి సప్తహ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అటవీ శాఖ కార్యాలయం నుంచి పట్టణ ప్రధాన రహదారుల గుండా ర్యాలీ నిర్వహించారు. అటవీ జంతువుల సంరక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. వన్యప్రాణులను వేటాడడం చట్టరీత్యా నేరమని తెలిపారు. కార్యక్రమంలో నిర్మల్ ఎఫ్ఆర్వో రామకృష్ణ, అధికారులు అరుణ్‌కుమార్, నజీర్‌ఖాన్, సంతోష్, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
ఘనంగా వాల్మీకి జయంతి
నిర్మల్‌చైన్‌గేట్: వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించారు. కలెక్టర్ అభిలాష అభినవ్ వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతరం కలెక్టర్ మాట్లాడుతూ రామాయణం రచించిన మహానుభావుడు వాల్మీకి మహర్షి అని అన్నారు. వాల్మీకి రచనల్లోని విలువలను అందరూ పాటించాలని పేర్కొన్నారు. వేడుకల్లో ఆర్డీవో రత్నకళ్యాణి, వెనుకబడిన తరగతుల సంక్షేమ అధి కారి శ్రీనివాస్, డీఆర్డీవో విజయలక్ష్మి, మత్స్యశాఖ ఏడీ రాజానర్సయ్య, పరిశ్రమల శాఖ మేనేజర్ నరసింహారెడ్డి, మైనారిటీ సంక్షేమ అధికారి మోహన్‌సింగ్, ఎల్డీఎం.రామ్‌గోపాల్, అధికారులు పాల్గొన్నారు. నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించారు. ఎస్పీ జానకీ షర్మిల వాల్మీకి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఉపేంద్రారెడ్డి, ఏవో యూనస్ అలీ, ఆర్ఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. వేడుకల్లో కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా అధికారులు -
పారదర్శకంగా పత్తి కొనుగోళ్లు
లక్ష్మణచాంద: తెల్లబంగారంగా పిలిచే పత్తి రైతు ఆరుగాలం శ్రమించిన మార్కెట్లో మాత్రం దళారుల చేతిలో చిత్తవుతున్నాడు. ఏటా పంట అమ్మే సమయంలో దళారుల చేతిలో మోసం తప్పడం లేదు. ఈ నేపథ్యంలో పత్తి రైతులను ఆదుకునేందుకు కేంద్రం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. గతంలో సరైన మద్దతు ధరలు లేకపోవడంతోపాటు దళారుల వ్యవస్థ కారణంగా నష్టపోయేవారు. దీనిని అరికట్టడానికి కేంద్రం ప్రత్యేక చర్యలు చేపడుతుంది. కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. కపాస్ కిసాన్ యాప్.. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో రూపొందించారు ఈ మొబైల్ యాప్, రైతులకు పత్తి దిగుమతి, అమ్మకాల ప్రక్రియలను సులభతరం చేయడంలో సహాయపడుతుంది. ఇది పారదర్శకతను పెంచి, కనీస మద్దతు ధర పొందాలనేది ఉద్దేశ్యం. ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్‌లో ‘కపాస్ కిసాన్ యాప్‘ అని సర్చ్ చేసి, డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత, పేరు, ఆధార్ నంబర్, భూమి వివరాలు, పత్తి సంబంధిత రికార్డులు అప్లోడ్ చేయాలి. నమోదు చేసుకున్న రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి విక్రయించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారాన్ని ముందుగానే బుకింగ్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. రైతులకు అవగాహన.. జిల్లాలో ఈ సారి 1.50 లక్షల ఎకరాలలో పత్తి పంట సాగు చేశారు. ఈ క్రమంలో కొత్త యాప్‌తో రైతులు ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందుతారని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు. ఈ యాప్‌పై ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా వ్యవసాధికారులకు సోమవారం అవగాహన కల్పించారు. ముందుగా విద్యావంతులైన రైతులకు అవగాహన కల్పించి వారి ద్వారా మిగిలిన రైతులకు అవగాహన కల్పించాలని అధికారులు భావిస్తున్నారు. మంగళవారం లక్ష్మణచాంద రైతు వేదికలో వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు ఈ యాప్‌పై అవగాహన కల్పించారు. ఈ యాప్ ద్వారా, రైతులకు మార్కెట్ లో తమ లావాదేవీలు పారదర్శకంగా, సులభంగా జరగనున్నాయి. రైతుల ఆదాయం పెరిగే దిశగా కేంద్రం తీసుకునే ఈ చర్యలు, గత నష్టాలపై పోరాటం చేస్తాయని భావిస్తున్నారు. ప్రయోజనాలు ఇవే... -
పులకించిన పోరుగడ్డ
కెరమెరి(ఆసిఫాబాద్): జల్.. జంగల్.. జమీన్ కోసం పోరుసలిపి అసువులు బాసిన ఆదివాసీ పోరాట యోధుడు కుమురంభీం స్మరణతో పోరుగడ్డ పులకించింది. రణభూమి జోడేఘాట్‌లో వీరుడి 85వ వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హాజరై భీం విగ్రహానికి పూలమాలలు వేసి, ఆయన సమాధిపై పూలు చల్లి నివాళులర్పించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు వేదికపైకి ఎవరూ వెళ్లలేదు. దర్బార్ కార్యక్రమాన్ని రద్దు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరికి వారుగా వచ్చి నివాళులర్పించి వెళ్లిపోయారు. భీం ఆశయాలు నెరవేర్చుతాం: మంత్రులు కుమురం భీం ఆశయాలు నెరవేర్చుతామని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివాసీలను సంఘటితం చేసి వారి హక్కు ల సాధనకు పోరాడిన వీరుడు కుమురంభీం అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన స్ఫూర్తి ఎంతో ఉందని పేర్కొన్నారు. 1935 నుంచి నిజాంకు వ్యతిరేకంగా పోరాడి వారి బలగాలను ఎదురించారని తెలిపారు. ఆదివాసీల అభివృద్ధికి రూ.740 కోట్లతో రోడ్లు, గిరిజన భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిందని చెప్పారు. విద్య, ఆశ్రమ పాఠశాలలను మరింత తీర్చి దిద్దుతామని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా వేదికపై మాట్లాడలేకపోతున్నామని చెప్పారు. భీం స్ఫూర్తితో ముందుకు సాగుదాం: కలెక్టర్ ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన మహనీయుడు కుమురం భీం స్ఫూర్తితో ముందుకు సాగుదామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పిలుపునిచ్చారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పాటుపడతామని పేర్కొన్నారు. భీం వర్ధంతికి ఉచిత బస్సు సౌకర్యం, భోజనం తదితర వసతులు కల్పించామని చెప్పారు. అనంతరం భీం మనుమడు కుమురం సోనేరావు కుటుంబానికి కలెక్టర్ నూతన వస్త్రాలు అందించారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు పాటగూడ, జోడేఘాట్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గుస్సాడీ నృత్యాలు కనువిందు చేశాయి. ఐసీడీఎస్, రెవెన్యూ, ఐటీడీఏ, సఖీ, వైద్యారోగ్యశాఖ, కొలాం అభివృద్ధి, ఇప్పుపూలు, విస్తరాకుల తయారీ తదితర స్టాళ్లు ఎంతోగానో ఆకట్టుకున్నాయి. భీంకు సంప్రదాయపూజలు కుమురంభీంకు ఆయన వారసులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సంప్రదాయ పూజలు నిర్వహించారు. భీం సమాధిపై పూలు చల్లి పూజలు చేశారు. ముందుగా ఆచార, వ్యవహారాలతో పాత జెండాలు తీసేసి కొత్త జెండాలు ఆవిష్కరించారు. అంతా వరుసక్రమంలో నిల్చుని జెండాలకు మొక్కారు. ధూప, దీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేశారు. కోడి, మేకలతో జాతకం చూశారు. నివాళులర్పించినవారిలో.. ‘స్థానిక’ ఎన్నికల కోడ్ నేపథ్యంలో దర్బార్ రద్దు చేయగా భీం ఆరాధికులు అనుకున్న స్థాయిలో హాజరు కాలేదు. మంత్రులు, కలెక్టర్‌తోపాటు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఎస్పీ కాంతిలాల్‌పాటిల్, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, ఏఎస్పీ చిత్తరంజన్, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్, ఆర్డీవో లోకేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్, డీడీ రమాదేవి, ఎంపీ నగేశ్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు, భీం మనుమడు కుమురం సోనేరావు, మాజీ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు సుగుణ, నాయకులు విశ్వప్రసాద్, శ్యాంనాయక్ తదితరులు భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించినవారిలో ఉన్నారు. -
డీఅడిక్షన్ సెంటర్ ప్రారంభం
నిర్మల్‌టౌన్: జిల్లాఏరియా ఆసుపత్రిలో డీఅడిక్షన్ సెంటర్‌ను డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ సెక్రెటరీ రాధిక మంగళవారం ప్రారంభించారు. సెంట ర్ సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మద్యం, మత్తుపదార్థాలకు బానిసైనవారు సద్వినియోగం చేసుకోవాలని సూచించా రు. డాక్టర్ కిరణ్, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి పాల్గొన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు రానివ్వొద్దు భైంసాటౌన్: పట్టణంలోని స్వామి వివేకానంద అనాథ పిల్లల ఆవాసాన్ని రాధిక మంగళవారం సందర్శించారు. పరిసరాలు, విద్యార్థుల గదులు, వంటగది, వసతులు పరిశీలించారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. ఆవాసం అధ్యక్షుడు శైలేశ్, ప్రముఖ్ లింగారెడ్డి ఉన్నారు. -
ఆశ వర్కర్లకు కంటి పరీక్షలు
నిర్మల్‌చైన్‌గేట్: వరల్డ్ ఐ సైట్ డే పురస్కరించుకుని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కంటి పరీక్ష శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక డిప్యూటీ డీఎంహెచ్‌వో ఆఫీస్‌లో మంగళవారం ఆశ కార్యకర్తలకు కంటి పరీక్షల శిబిరం ఏర్పా టు చేశారు. డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్ పరిశీలించారు. ప్రజలకు మెరుగైన నాణ్యమైన సేవలందించడానికి కృషి చేస్తున్న ఆశా కార్యకర్తల కంటి ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ఈ కంటి స్కీన్రింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వైద్య విధాన పరిషత్ జిల్లా సూపరిండెంట్ డాక్టర్ సురేశ్, ఆప్తాల్మిక్ ఆఫీసర్ లక్ష్మీకాంత్, ఎల్వీ ప్రసాద్ కోఆర్డినేటర్ సాయన్న , ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
కోతలకు వానలతో ఆటంకం
భైంసా/భైంసారూరల్: జిల్లాలో సోయా పంట చేతికి వచ్చింది. కోతలు మొదలయ్యాయి. ఈ సమయంలో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలకు చేలల్లో నీరు నిలిచి చిత్తడిగా మారుతున్నాయి. దీంతో యంత్రాలతో కోయలేని పరిస్థితి. జిల్లావ్యాప్తంగా 1.05 లక్షల ఎకరాల్లో సాగు చేసిన సోయా పెద్ద ఎత్తున దెబ్బతింది. మొత్తం 72,300 మంది రైతులు ఈ సీజన్లో ఆశతో పంట వేసినా, గత నెల రోజులుగా కుండపోత వానలకు దిగుబడి ఆశలు తగ్గిపోయాయి. వానలే అడ్డంకి ఆదివారం సాయంత్రం నుంచి ప్రారంభమైన వర్షం సోమవారం వేకువజామున మరింత వేగం అందుకుంది. భైంసా డివిజన్‌తోపాటు పలు మండలాల్లో వర్షం.. సోయా కోతలకు అడ్డంకిగా మారింది. ఎండిపోయిన చేలు వర్షాలకు బురదమయమై పంట కోయడం చిక్కుగా మారింది. ఆకులు రాలిన మొ క్కలు తడిసి ఉబ్బిపోతుండటంతో గింజలు నల్ల బడుతున్నాయి. చైన్ మిషన్లే ఆధారం రైతులు మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి చైన్ మిషన్లను అద్దెకు తెచ్చుకొని కో త కొనసాగిస్తున్నారు. గంటకు రూ.2,400 నుంచి రూ.2,800 చెల్లించి బురద నేలల్లోనూ పంట కోయిస్తున్నారు. సాధారణ హార్వెస్టర్లు బరువుతో బురదలో ఇరుక్కుపోతుండగా, తేలికై న చైన్ మిషన్లు పనిచేయడం సులభమవుతోంది. ఒక్కో ఎకరానికి గంట నుంచి రెండు గంటల సమయం పడుతోంది. ఇంకా 70% కోత మిగిలే ఉంది జిల్లాలో 70 శాతం భూముల్లో కోత ఇంకా పూర్తికాలేదు. కోసిన గింజల్లో తేమశాతం పెరిగిపోవడంతో రంగు మారిపోతుంది. వర్షాల కారణంగా కొద్దిసేపట్లోనే నల్లబడిన గింజలు మార్కెట్ విలువ కోల్పోతున్నాయి. వర్షం తగ్గితేనే రైతులు మిగిలిన పంట కోసి, ఆరబెట్టి, అమ్మకాలకు సిద్ధం చేసే అవకాశం ఉంటుంది. కుంటాలలో భారీ వర్షం.. కుంటాల: మండలంలో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో పంటలకు నష్టం వాటిల్లింది. కోత దశకు వచ్చిన సోయా దెబ్బతింది. కల్లాల్లో ఉంచిన సోయా తడిసి ముద్దయింది. ఆరబెట్టేందుకు రైతులు ఇబ్బంది పడ్డారు. ఏరాల్సిన పత్తి పంటలో వర్షపు నీరు నిలవడంతో దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 24 గంటల్లో 21.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఏఎస్వో సాయికృష్ణ తెలిపారు. పంట ఆరబెట్టే సమస్య కోత అనంతరం కల్లాలపై లేదా గ్రామ సమీప రహదారుల పక్కన సామూహికంగా సోయాను ఆరబెడుతున్న రైతులు వానలతో మళ్లీ ఇబ్బంది పడుతున్నారు. టర్పాలిన్లు ఉంచినా లోపలికి నీరు చేరి గింజలు నాని మొలకెత్తుతున్నాయి. దీంతో రైతులు రోజంతా జాగరణ చేసి వర్షం ఆగగానే టర్పాలిన్లు తొలగించి గింజలు ఆరబెడుతున్నారు. నీరు నిలవకుండా కల్లాల చుట్టూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రోజంతా కల్లాల వద్దే.. పంట కోతలకు వర్షం ఆటంకంగా మారింది. మరోవైపు కోసిన పంట ఆరబెట్టినా.. వర్షానికి తే మ పెరుగుతోంది. గింజ లు రంగు మారుతున్నా యి. దీంతో కుటుంబమంతా కల్లాల వద్దే ఉండి ఆరబెట్టాల్సి వస్తోంది. కొత్త టార్పాలిన్లు కొని కింద వేసి పంటను ఆరబెడుతున్నాం. ప్రతీరోజు సోయా కుప్పలను ఒకచోటు నుంచి మరోచోటుకు మారుస్తున్నాం. – దత్త, రైతు మాంజ్రివర్షాలు తగ్గే వరకు ఆగాలి.. జిల్లా వ్యాప్తంగా ప్రతీరోజు ఏదో ఒకచోట వర్షం కురుస్తూనే ఉంది. తుపాను ప్రభావంతో భారీ వర్షం కురిసింది. వర్షంతో చేలన్నీ తేమగా ఉన్నాయి. ఎండలు కాస్తే తేమశాతం తగ్గుతుంది. వర్షాలు తగ్గే వరకూ పంట కోయకపోవడమే మంచిది. ఇప్పుడు పంట కోసినా.. కోసిన పంట ఎండాలన్న ఇబ్బందులు తప్పవు. – అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి -
భీం త్యాగానికి గౌరవం
కెరమెరి(ఆసిఫాబాద్): నిజాం సర్కారుకు వ్యతిరేకంగా, ఆదివాసీల హక్కుల కోసం ప్రాణాలర్పించిన భీం త్యాగాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. జల్.. జంగల్.. జమీన్.. నినాదంతో పోరాడి అమరుడైన కుమురంభీం వర్ధంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కెరమెరి మండలం జోడేఘాట్‌లో మంగళవారం భీం వర్ధంతి అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివాసీల సంప్రదాయం ప్రకారం నివాళులర్పించనున్నారు. ఉదయం 8 గంటలకు జెండాలు ఆవిష్కరించనున్నారు. 9 గంటలకు సమాధి వద్ద పూజలు చేసి, 10 గంటలకు శ్రద్ధాంజలి ఘటించనున్నారు. ఇప్పటికే కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా, ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఏర్పాట్లు పరిశీలించి, అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. పదివేల మందికి పైగా హాజరు.. ప్రభుత్వం భీం వర్ధంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంతో అందుకు తగిన విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలే భీం విగ్రహానికి మెరుగులు దిద్దారు. ట్రాక్టర్లతో పరిసరాలు, పార్కింగ్ స్థలాలు చదును చేయించి.. ప్రజలు కూర్చునేందుకు వీలుగా టెంట్లు వేస్తున్నారు. వివిధ గ్రామాల నుంచి తరలివచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా తాత్కాలిక మూత్రశాలలు ఏర్పాటు చేస్తున్నారు. భోజన సదుపాయం కూడా కల్పించనున్నారు. 10వేల మందికి పైగా హాజరవుతారని అంచనా వేస్తుండగా, 12 వేల మందికి భోజనాలు సిద్ధం చేస్తున్నారు. హెలిప్యాడ్ సైతం సిద్ధం చేశారు. మారుమూల ప్రాంతం కావడంతో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. ఏఎస్పీ, డీఎస్పీతోపాటు సీఐ, ఆర్ఐలు 8 మంది, ఎస్సైలు 25, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు 51 మంది, ఇతర సిబ్బంది 136, డబ్ల్యూపీసీలు 56, హోంగార్డులు 79 మంది, ఇతర సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. బాంబు, డాగ్‌స్క్వాడ్‌తో జోడేఘాట్‌కు చేరుకునే రహదారుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. అలాగే గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఏటీడబ్ల్యూవోలు ముగ్గురు, సీఆర్టీలు, రెగ్యులర్ ఉపాధ్యాయులు 100 మంది, వంట మనుషులు 70 మంది, ఆశ్రమ పాఠశాలల వార్డెన్లు ఐదుగురు, ఇతర సిబ్బందిని డిప్యూటేషన్‌పై నియమించారు. ఐకేపీ సిబ్బంది 35 మంది, ఇంజినీరింగ్ శాఖకు చెందిన సిబ్బంది పది మందిని కేటాయించారు. ఆయా శాఖల సిబ్బంది సోమవారం రాత్రే జోడేఘాట్‌కు చేరుకున్నారు. ఆసిఫాబాద్ డిపో నుంచి ప్రత్యేక బస్సులను జోడేఘాట్‌కు నడపనున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే వాహనాల కోసం పార్కింగ్ స్థలాలు సిద్ధం చేశారు. హాజరు కానున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం భీం వర్ధంతిని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూ రి లక్ష్మణ్, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరు కానున్నారు. అలాగే ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు నివాళులర్పించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ప్రజాప్రతినిధులు కేవలం భీం విగ్రహం వద్ద శ్రద్ధాంజలి ఘటించి, పూజలకే పరిమితం కానున్నారు. ఆదివాసీలు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్యలు తీసుకెళ్లేందుకు ఏటా నిర్వహించే దర్బారు కోడ్ కారణంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. -
స్థానిక ఎన్నికల్లో గెలవాలి
● మంత్రి జూపల్లి కృష్ణారావు ● ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశం నిర్మల్‌టౌన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఎంపిక చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో సోమవారం సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ అన్ని స్థానాలు కాంగ్రెస్ కై వసం చేసుకునేలా పనిచేయాలని ఆదేశించారు. ఎన్నికల ప్రచారంలో పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని తెలిపారు. అనంతరం మంత్రిని నేతలు శాలువాతో సత్కరించారు. సమావేశంలో మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, సీనియర్ నాయకులు వేణుగోపాలచారి, పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు తదితరులు పాల్గొన్నారు. -
అపార్ నమోదు ఆలస్యం
లక్ష్మణచాంద: విద్యార్థులకు ప్రత్యేక శాశ్వత గుర్తింపు నంబర్ ఇవ్వాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అపార్ (ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) నమోదు ప్రక్రియ జిల్లాలో కొనసాగుతోంది. ‘ఒకే దేశం–ఒకే విద్యార్థి గుర్తింపు నంబర్‘ అనే నినాదంపై రూపొందిన ఈ పథకం ద్వారా ప్రతి విద్యార్థికి జీవితాంతం ఒకే అకాడమిక్ నంబర్ ఇవ్వబడుతుంది. జిల్లాలో నమోదులో స్థితి జిల్లా విద్యాశాఖ అధికారుల ప్రకారం, మొత్తం 1,42,872 మంది విద్యార్థులు ఉండగా, ఇప్పటివరకు 96,157 మంది వివరాలు నమోదు చేశారు. మొత్తం నమోదు శాతం 67.34గా ఉంది. ఇంకా 45,962 మంది విద్యార్థుల వివరాలను నమోదు చేయాల్సి ఉంది. అధికారులు ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు. మండలాల ప్రగతి జిల్లాలో లక్ష్మణచాంద మండలం 79.45 శాతంతో ముందంజలో ఉంది. భైంసా మండలం 79.09 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. పెంబి మండలం 43.15 శాతం నమోదుతో చివరిస్థానంలో కొనసాగుతోంది. మిగతా మండలాల్లో నమోదు శాతం 60కు పైగా చేరిందని అధికారులు పేర్కొన్నారు. ఆలస్యానికి ప్రధాన కారణాలు జిల్లాలో అపార్ నమోదులో జాప్యానికి విద్యార్థుల వ్యక్తిగత వివరాలు సక్రమంగా ఇవ్వనికారణంగానే జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ కారణాల వల్ల నమోదు ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్నట్లు అధికారులు వివరించారు. అవగాహనతో వేగవంతం జిల్లాలో 1,42,872 మంది విద్యార్థుల్లో 96,157 మంది నమోదు పూర్తిచేశాం. మిగిలిన విద్యార్థులు కూడా త్వరగా నమోదు చేసుకునేలా ప్రధానో పాధ్యాయులు సమావేశాలు ఏర్పాటు చేసి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించాం. తద్వారా జిల్లాలో శాతం 100 చేరుకునేలా చర్యలు తీసుకుంటాం. – భోజన్న, జిల్లా విద్యాధికారి -
జిల్లాస్థాయి బాక్సింగ్ పోటీలు
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సోమవారం జిల్లాస్థాయి అండర్–14 బా లురు, అండర్–17 బాల, బాలికలకు బాక్సింగ్ పో టీలను నిర్వహించారు. అండర్–17 బాలుర విభా గంలో ప్రవీణ్(46–48 కిలోలు), సౌర్యన్రెడ్డి(48– 50 కిలోలు ), శ్రీకాంత్(52–57 కిలోలు), అండర్–14 బాలురు విభాగంలో అవయుక్త(28–30 కిలోలు), ధ్రువ(42–44 కిలోల), అద్విత్(44–46 కిలోలు) రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. అండర్–17 బాలికల విభాగంలో హారిక(42 కిలోలు), సుహాసిని(42–44 కిలోలు), నిఖిత(44–46 కిలోలు), ఆర్.అక్షయ(46–48 కిలోలు), కీర్తన(48–50 కిలోలు), అభినయ(52–54 కిలోలు), శ్రావణి(63–66 కిలోలు), కవిత(66–70 కిలోలు) ఎంపికయ్యారు. వీరిని ఎస్జీఎఫ్ సెక్రెటరీ రవీందర్‌గౌడ్ అభినందించారు. -
కరాటే బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు
నిర్మల్‌టౌన్: జపాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జుమ్మేరాత్‌పేట్ హైస్కూల్లో సోమవారం కరాటే బెల్టు గ్రేడింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ గ్రేడింగ్ టెస్ట్‌లో జిల్లా నుంచి 11 మంది విద్యార్థులు నేషనల్ బ్లాక్‌బెల్ట్ (3వ సాదన్)కు అర్హులయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర చీఫ్ ఎగ్జామినర్ రాపోలు సుదర్శన్ అర్హులైన విద్యార్థులకు బెల్ట్‌లు, సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో జపాన్ కరాటే అసోసియేషన్ జిల్లా చీఫ్ ఎగ్జామినర్ తేజందర్ సింగ్‌భాటియా, జిల్లా అధ్యక్షుడు కొండాజీ శ్రీకాంత్, టెక్నికల్ డైరెక్టర్ చందుల స్వామి, జిల్లా సెక్రెటరీ అమ్ముల భూషణ్, శిక్షకులు శ్రీకాంత్, కిరణ్, శేఖర్, చిరంజీవి, మనీషా, శివ, మేఘన, అమూల్య తదితరులు పాల్గొన్నారు. -
మసల్గ తండాను సందర్శించిన ఉప వైద్యాధికారి
తానూరు: మండలంలోని మసల్గ తండాను జిల్లా ఉపవైద్యాధికారి ఆకాశ్ సోమవారం సందర్శించారు. గ్రామంలో ఇద్దరు మహిళలు, ఇద్ద రు పురుషులు కిడ్నీ వ్యాధితో బాదపడుతున్నా రు. విషయం తెలుసుకున్న జిల్లా ఉప వైద్యాధి కారి ఆకాశ్, ఆస్పత్రి సిబ్బందితో గ్రామానికి చే రుకుని వారి వివరాలను సేకరించారు. ఆస్పత్రి లో వైద్య పరీక్షలు చేయించుకున్న రిపోర్టులు ప రిశీలించారు. గ్రామంలో మరో నలుగురి రక్త న మూనాలను సేకరించారు. త్వరలో పరీక్షల వి వరాలు వెల్లడిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ వ్య క్తిగత శుభ్రతతోపాటు పరిసరాల శుభ్రత పా టించాలని సూచించారు. ఆయన వెంట సూపర్వైజర్ అబ్దుల్ ఖాసిం, సిబ్బంది ఉన్నారు. -
రిజర్వేషన్.. టెన్షన్..!
నిర్మల్: స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయా.. ఉండవా..! అనే విషయం బుధవారం హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఆధారపడి ఉంది. ఈ తీర్పు ఎలావస్తుందో.. ఇవే రిజర్వేషన్లు ఉంటాయా.. లేక మారుతాయా..! అనే టెన్షన్ ఆశావహుల్లో నెలకొంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై తీర్పు ఎలావచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న వాదన అధికార పార్టీ వర్గాల్లో ఉంది. ఒకవేళ పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు చేపడితే.. ఇటీవల ప్రకటించిన రిజర్వేషన్లలో మార్పులు, చేర్పులు ఎలా ఉంటాయోనని ఆశావహుల్లో ఆందోళన కనిపిస్తోంది. 8న హైకోర్టు తీర్పు? ఈనెల 9న రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఎన్నికల సిబ్బందికి శిక్షణ సైతం పూర్తిచేసేస్తోంది. కానీ.. అంతకు ఒక్కరోజు ముందు అంటే బుధవా రం హైకోర్టులో ఎన్నికల భవితవ్యం తేలిపోనుంది. రాజ్యాంగానికి విరుద్ధంగా బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికలకు వెళ్లడంపై వేసిన కేసు కు సంబంధించిన తీర్పు ఈనెల 8న రానుంది. చట్ట బద్ధత లేని రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు అనుమ తి ఉండకపోవచ్చన్న వాదన బలంగా ఉంది. మరో వైపు మరో అవకాశం ఏదైనా ఇవ్వొచ్చు.. అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లేనిపక్షంలో పాతరిజర్వేషన్ల కోటా ప్రకారమైనా ఎన్నికలను కొనసాగించవచ్చని అధికార పార్టీవర్గాలే వెల్లడిస్తున్నాయి. ఆశావహుల్లో ఆందోళన.. ఇటీవల ప్రకటించిన షెడ్యూల్, అధికారులు వెల్ల డించిన రిజర్వేషన్ల ప్రకారం చాలామంది ఆశావహులు ఇప్పటికే మానసికంగా ఎన్నికలకు సిద్ధమయ్యారు. కానీ.. బుధవారం కోర్టు తీర్పు ఎలా ఉంటుంది, దానిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, ఎన్నికలతోపాటు ప్రకటించిన రిజర్వేషన్లలోనూ మార్పులు ఉంటాయా.. అన్న టెన్షన్ చాలామందిలో కనిపిస్తోంది. ప్రస్తుతం పోటీకి అవకాశం ఉన్న ఆశావహులతోపాటు రిజర్వేషన్ కారణంగా పోటీకి దూరమవుతున్న నేతలూ ‘8న ఏమొస్తుందో చూద్దాం..’అంటూ ఆసక్తిగా వేచిచూస్తున్నారు. బడుగులకు పీఠం..! నిర్మల్ 2016లో జిల్లాగా ఏర్పడింది. ఆతర్వాత 2019లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు. తొలిసారి జిల్లాలో జరిగిన ఎన్నికల్లో జెడ్పీచైర్మన్ పీఠం జనరల్ మహిళకు కేటాయించారు. ఈమేరకు అప్పుడు బీఆర్ఎస్ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొరిపెల్లి విజయలక్ష్మి నిర్మల్‌రూరల్ జెడ్పీటీసీ సభ్యురాలిగా గెలిచి చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకున్నారు. ఈసారి ప్రకటించిన రిజర్వేషన్లలో జెడ్పీచైర్మన్ స్థానం బీసీ జనరల్‌కు వచ్చింది. బడుగుల జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాలో తొలిసారి వెనుకబడిన కులాలకు చైర్మన్ స్థానం దక్కనుంది. ఈమేరకు బీసీ సామాజిక వర్గాలకు చెందిన పలువురు సీనియర్, జూనియర్ నేతలు తాము చైర్మన్ బరిలో ఉండాలని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలూ చేస్తున్నారు. -
వ్యక్తిత్వ నిర్మాణంతో సమగ్రత
నిర్మల్‌ఖిల్లా: వ్యక్తిత్వ నిర్మాణంతోనే దేశ నిర్మాణం జరిగి సమగ్రత సిద్ధిస్తుందని ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ్ సహ కార్యవాహ వరంగంటి శ్రీనివాస్ అన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా దివ్య నగర్ బస్తీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఏఎన్.రెడ్డి కాలనీ క్లబ్ హౌస్‌లో ఆదివారం విజయదశమి నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధాన వక్తగా శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ 1925లో ప్రారంభమై నేడు దేశవ్యాప్తంగా విస్తృత శాఖలతో, విభిన్న రంగాలలో దేశభక్తి పూరిత, హిందుత్వ ఆధార సంస్థలతో ప్రపంచంలోని అనేక దేశాలలో పనిచేస్తుందని చెప్పారు. హిందువులలో ఐక్యతను పెంపొందించడమే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తోందని వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ పొద్దుటూరి గంగారెడ్డి, నిర్మల్ నగర సంఘ్ చాలక్ డాక్టర్ తుమ్మల ప్రమోద్ చంద్రారెడ్డి, స్వయం సేవకులు, దివ్యనగర్ బస్తీ వాసుల పాల్గొన్నారు. హిందువుల ఐక్యతకే పంచపరివర్తన్ హిందువుల ఐక్యతకు పంచ పరివర్తన్ ద్వారా ఆర్ఎస్ఎస్ కృషి చేస్తోందని జిల్లా ధర్మజాగారణ టోలి సభ్యులు బ్రహ్మబట్ రాజేశ్‌సింగ్ అన్నారు. ఆర్ఎస్ఎస్ వివేక్ నగర్ బస్తీ ఆధ్వర్యంలో స్థానిక మున్నూరు కాపు సంఘ భవనంలో విజయదశమి నిర్వహించారు. హిందుత్వం జీవన విధానం, విశ్వశాంతికి ఆధారం, ప్రపంచంలోని వివిధ మతాలను సమన్వయపరిచే సనాత న జీవన విలువలు హిందుత్వంలో ఉన్నాయని వివరించారు. కార్యక్రమంలో చింతపండు రవి, నగర కార్యవాహ కిన్నెర్ల రవి, మల్లికార్జున్ రెడ్డి, కూనప్రవీణ్, రఘునందన్‌రెడ్డి, ధీరజ్, సైండ్ల శ్రీధర్, గోవర్ధన్, నరేశ్, శంకర్, టీఎన్.స్వామి పాల్గొన్నారు. -
నిలకడగా కడెం నీటిమట్టం
కడెం: కడెం ప్రాజెక్టు నీటిమట్టం నిలకడగా కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 695.500 అడుగులు ఉంది. ఆదివారం ప్రాజెక్టును చూసేందుకు సూదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చారు. ప్రాజెక్టులో బోటింగ్ చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించారు. ఉల్లాసంగా గడిపారు.కరాటే గ్రేడింగ్ పరీక్షలో ప్రతిభ నిర్మల్‌ఖిల్లా: కరాటే బెల్ట్ గ్రేడ్ పరీక్షలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మొట్టమొదటి మహిళా శిక్షకురాలు, నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన కిన్నెర్ల మృణాళిని ఉత్తమ ప్రతిభ కనబరిచింది. జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జపాన్ కరాటే అసోసియేషన్ ఆ ఫ్ ఇండియా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇన్స్పెక్టర్ రాపోలు సుదర్శన్ నేషనల్ బ్లాక్ బెల్ట్(4వ డాన్) తీసుకున్నారు. కార్యక్రమంలో జ పాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా తె లంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తేజేందర్ సింగ్భా టియా, జిల్లా అధ్యక్షుడు కొండాజి శ్రీకాంత్, అ మ్ముల భూషణ్, చందుల స్వామి, శ్రీరాముల సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. బోటింగ్ చేస్తున్న పర్యాటకులు -
ఆలస్యంతో అర్హత!
నిర్మల్‌చైన్‌గేట్: ‘ఆలస్యం అమృతం విషం‘ అంటారు పెద్దలు.. చేయవలసిన పనిని సరైన సమయంలో చేయకపోతే, అది అనర్థాలకు దారితీస్తుంది. మంచి ప్రయోజనాలు సైతం చెడుగా మారతాయి. కానీ, స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం చేసిన ఆలస్యం.. గత ఎన్నికల్లో ఎన్నికల ఖర్చు వివరాలు వెల్లడించక అనర్హతకు గురైనవారికి అమృతంగా మారింది. ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోవడంతో అనర్హత వేటు పడిన అభ్యర్థులు పోటీ చేసేందుకు మార్గం సుగమమైంది. ఎన్నికల ఖర్చు వివరాలు ఇవ్వక.. 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసిన కొందరు నిర్దేశిత గడువులోగా ఖర్చుల వివరాలు సమర్పించలేదు. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం వారిపై మూడేళ్లు నిషేధం విధించింది. ఎన్నికల నిర్వహణలో జాప్యం కారణంగా ఆ కాలపరిమితి ముగిసింది. దీంతో వారు మళ్లీ పోటీకి సిద్ధమవుతున్నారు. మరోమారు ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సన్నద్ధమవుతున్నారు. మూడు దశల్లో ఎన్నికలు.. 2019 జనవరిలో జిల్లాలో 396 గ్రామ పంచా యతీలకు 3,368 వార్డులకు మూడు దశలుగా ఎన్నికలు నిర్వహించారు. పాలకవర్గాల పదవీ కాలం 2024 ఫిబ్రవరి 1న ముగిసింది. వెంట నే లోక్‌సభ ఎన్నికలు రావడంతో ప్రభుత్వం పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యే క అధికారులను నియమించింది. ఎంపీటీసీ, జె డ్పీటీసీ సభ్యుల పదవీకాలం కూడా 2024 ఆగ స్టు మొదటి వారంలో ముగిసింది. పరిషత్‌లో నూ స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతోంది. సకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే జిల్లాలో అనర్హతకు గురైనవారు పోటీకి దూరమయ్యేవారు. 1,058 మందిపై వేటు జిల్లాలో మొత్తం 1,058 మందిపై ఈసీ మూడేళ్ల అనర్హత వేటు వేసింది. వీరు 2024 ఏప్రిల్ వరకు ఏ ఎన్నికల్లోనూ పాల్గొనకుండా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఆలస్యం కావడంతో నిషేధ కాలం ముగిసింది. తాజాగా ఎన్నికల సంఘం ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని షెడ్యూల్ ప్రకటించింది. దీంతో నిషేధం ముగిసినవారు పోటీకి సిద్ధమవుతున్నారు. లెక్కలు చూపాల్సిందే.. నూతన పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం 2019 జనవరిలో 396 గ్రామ పంచాయతీలకు, మేలో 157 ఎంపీటీసీలు, 18 జెడ్పీటీసీ పదవులకు ఎన్నికలు జరిగాయి. పోటీ చేసిన అభ్యర్థులు ఫలితాలు వెలువడిన 45 రోజుల్లోగా ప్రచార ఖర్చుల లెక్కలు నిర్దేశిత ఫార్మాట్లో ఎంపీడీవో కార్యాలయాల్లో సమర్పించాలి. 5 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో వార్డు సభ్యులు రూ.30 వేల వరకు, సర్పంచ్ అభ్యర్థులు రూ.1.5 లక్షల వరకు ఖర్చు చేసుకునే అవకాశం ఉంది. 5 వేలకు మించిన జనాభా ఉన్న గ్రామాల్లో వార్డు సభ్యులు రూ.50 వేలు, సర్పంచ్ అభ్యర్థులు రూ.2.5 లక్షల వరకు ప్రచారానికి వెచ్చించే వెసులుబాటు కల్పించారు. గెలిచినా, ఓడినా పోటీ చేసినవారంతా ఖర్చుల వివరాలు వెల్లడించాలి. కొందరు వార్డు సభ్యులు విజ యం సాధించినా నిర్లక్ష్యంతో సమర్పించలే దు. ఓడిపోయిన మరికొందరు నిబంధనల ను ఉల్లంఘించారు. ఈసీ పలుసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. దీంతో ఎంపీడీవోల నివేదికల ఆధారంగా 2021 నవంబర్‌లో అనర్హత ఉత్తర్వులు జారీ చేసింది. సర్పంచులు 125 వార్డు సభ్యులు 870 ఎంపీటీసీలు 59 జెడ్పీటీసీలు 4 -
నిర్మల్
భీం ఆశయం నెరవేరేదెన్నడో! ఆదివాసీలకు హక్కులకోసం నిజాం ప్రభుత్వంతో పోరాడి అసువులు బాసిన గిరిజనుల ముద్దుబిడ్డ కుమురంభీం. ఆయన ఆశయం మాత్రం ఇప్పటికీ నెరవేరలేదు. నిండా మునిగినభైంసా: భారీ వర్షాలు జిల్లాలో సోయా రైతును నిండా ముంచాయి. భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టాలు చవిచూశారు. దిగుబడి గణనీయంగా తగ్గింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మొదట్లో వర్షాలు అనుకూలంగా ఉంటాయని భావించారు. కానీ పంట చేతికొచ్చే సమయంలో కురుస్తున్న వానలు పంటను దెబ్బతీశాయి. ముధోల్ నియోజకవర్గంలో 80 శాతం మంది రైతులు సోయా సాగు చేశారు. తమకు పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 1.05 లక్షల ఎకరాల్లో.. జిల్లాలో మొత్తం 1.05 లక్షల ఎకరాల్లో సోయా సాగు చేశారు. విత్తనాలు వేసినప్పటి నుంచి వర్షాలు సమృద్ధిగా కురిశాయి. గతంలో నీటి తడి ఇవ్వాల్సి వచ్చేది. ఈసారి అలాంటి అవసరం లేదు. ఫలితంగా పంట బాగా పెరిగింది. రైతులు సంతోషించారు. పూత దశలో మరోసారి వర్షం కురవడంతో దిగుబడి పెరుగుతుందని ఆశపడ్డారు. అయితే, అధిక వానలు పంటను దెబ్బతీశాయి. తేమకు ఆకులు, పూత రాలిపోయేలా చేశాయి. ఇప్పుడు కోత సమయంలో దిగుబడి బాగా తగ్గింది. ఎకరాకు రూ.23 వేల పెట్టుబడి.. ఒక్కో ఎకరానికి విత్తనాల నుంచి కోత వరకు రూ.23 వేలు ఖర్చయింది. ప్రస్తుత మార్కెట్లో క్వింటాల్‌కు రూ. 4 వేల నుంచి రూ.4,600 వరకు ధర ఉంది. భైంసాలోని గాంధీగంజ్‌లో సోయా విక్రయాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ఈ ఏడు క్వింటాల్‌కు రూ.5,328 మద్దతు ధరను ప్రకటించింది. అయినప్పటికీ, తక్కువ దిగుబడి కారణంగా పెట్టుబడి కూడా తిరిగి రావడం లేదు.ముధోల్ మండలం ముద్గల్‌లో సోయాపంటకష్టం వృథా.. మా కుటుంబమంతా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తాం. ఏటా సోయా పంటవేస్తాం. ఈయేడు కూడా సోయాపంట సాగుచేశాం. ఎకరానికి రూ.23 వేలు ఖర్చుఅయింది. ప్రస్తుతం పంట కోశాను. ఎకరాకు మూడు నుంచి నాలుగు క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. దీంతో రూ.15 వేలు కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు. – మహమూద్, రైతు కోతలు ప్రారంభం జిల్లాలో సోయాపంట కోతలు ప్రారంభమయ్యాయి. భారీ వర్షాలతో పంటకు తెగుళ్లు సోకాయి. ఈయేడు సోయాపంట కొంత దెబ్బతింది. పూర్తిస్థాయిలో పంటకోస్తే దిగుబడి తెలుస్తుంది. భారీ వర్షాలు కురిసిన వెంటనే కొంత మంది రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టారు. ఏఈఓలు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు సలహాలు ఇచ్చారు. – అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయశాఖ అధికారిసోయా సాగు విస్తీర్ణం : 1.05 లక్షల ఎకరాలు రైతులు 72,300మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5,328కోతలు షురూ.. నాలుగు రోజులుగా జిల్లాలో సోయా కోతలు మొదలయ్యాయి. హార్వెస్టర్ల సాయంతో పంటను కోస్తున్నారు. ఎకరానికి కేవలం రూ.2 నుంచి 3 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తోంది. కాయల దశలో గింజలు పూర్తిగా నిండలేదు. విత్తన కంపెనీలతో చర్చించి, పరిస్థితిని వివరించి నష్టాన్ని భర్తీ చేయాలని రైతులు కోరుతున్నారు. సాధారణంగా సోయా పంటకు రెండు సార్లు మందులు పిచికారీ చేసేవారు. విత్తనాలు వేసిన తర్వాత గడ్డి మందు ఒకసారి, పూత, కాయల దశలో తెగుళ్ల నివారణకు మరోసారి. అయితే ఈ ఏడు 3 నుంచి 4 సార్లు పిచికారీ చేయాల్సి వచ్చింది. -
దసరా సెలవుల్లో రెచ్చిపోయిన దొంగలు
నిర్మల్‌టౌన్: బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు కళాశాలలకు సెలవులు ఇచ్చారు. తెలంగాణలో పెద్ద పండుగ కావడంతో అందరూ ఇళ్లకు తాళం వేసి సొంత ఊళ్లకు, బంధువుల ఇళ్లకు, తీర్థయాత్రలకు వెళ్లారు. ఇదే అదనుగా జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న ఇళ్లు, దుకాణాలు, ఇళ్ల ముందు పార్క్ చేసిన వాహనాలే లక్ష్యంగా దొంగతనాలు చేశారు. తమ చోరకళను ప్రదర్శిస్తూ పోలీసులకు చెమటలు పట్టించారు. రోజుకో చోరీ వెలుగులోకి.. జిల్లాలో దసరా సెలవులు మొదలైన నాటి నుంచి రోజుకో పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీలు జరిగాయి నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాల్లో ఒకటికి మించి దొంగతనాలు జరిగాయి. నగదు, బంగారం, విలువైన వస్తువులు, బైక్‌లు, స్కూటర్లు వరకు ఎత్తుకెళ్లారు. పోలీసులకు చిక్కకుండా.. నిఘా వ్యవస్థ అభివృద్ధి చెందినా, దొంగలు చోరీ చేసిన ఇళ్లలో ఎలాంటి ఆనవాళ్లు వదలలేదు. రాత్రింబవళ్లు గస్తీ ఉన్నా, పోలీసుల కంట పడకుండా దొంగలు తమ పని కానిచ్చేశారు. కొన్ని నెలలుగా జిల్లాలో జరుగుతున్న వరుస దొంగతనాలతో పోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పక్క రాష్ట్ర గ్యాంగులేనా? నిర్మల్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దును ఆనుకుని ఉండడం, 44, 61 జాతీయ రహదారుల ద్వారా తరచుగా రాకపోకలు సాగడంతో పక్క రాష్ట్రాల గ్యాంగులు వచ్చి దొంగతనాలు చేసి పారిపోతున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఈ దిశగా పోలీసులు విచారణను ముమ్మరం చేస్తున్నారు. అయితే దొంగలు మాత్రం పోలీసులకు చిక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా.. ఇప్పటివరకు ఎక్కువగా రాత్రులే దొంగతనాలు జరిగినప్పటికీ, ఈసారి పగలు రాత్రి తేడా లేకుండా దొంగలు రెచ్చిపోయారు. పగలే ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేశారు. ఇంటి బయట నిలిపిన వాహనాలూ ఎత్తుకెళ్లారు. -
కొలువుదీరిన శారదమాత
భైంసాటౌన్: పట్టణంలో శారదమాత ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఏటా దేవీ నవరాత్రి ఉత్సవాల అనంతరం శారదమాత విగ్రహాలు ప్రతిష్టించి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మేరకు శనివారం పట్టణంలోని ఆర్యవైశ్య సంఘంతోపాటు బ్రాహ్మణగల్లిలోని రాధాకృష్ణ మందిర్‌లో శారదమాత విగ్రహాలు ప్రతిష్టించారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఐదురోజులపాటు అమ్మవారికి పూజలు చేసి, అనంతరం విగ్రహాలను గడ్డెన్నవాగు ప్రాజెక్ట్ నీటిలో నిమజ్జనం చేస్తారు. వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు..ఖానాపూర్: మండలంలోని సుర్జాపూర్ గ్రామంలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా యజ్ఞచార్యులు చక్రపాణి నర్సింహమూర్తి, ఆలయ ప్రధాన అర్చకులు కోటపల్లి అనీశ్, అర్చకులు కోటపల్లి నితీశ్ ఆధ్వర్యంలో యాగశాల ప్రవేశం, అగ్నిప్రతిష్టాపన, విష్ణుయాగం, ధ్వజారోహణం, అన్నసంతర్పణతోపాటు స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నందీశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాత్రి జరిగిన కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్య జాన్సన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు రాథోడ్ రామునాయక్, బక్కి కృష్ణ, కోశాధికారి గాజుల శ్రీనివాస్, పండితులు, స్వాగతం పలికారు. . కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు రాథోడ్ రామునాయక్, బక్కి కృష్ణ, కోశాధికారి గాజుల శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ ఆకుల రాజమణి, మాజీ ఎంపీటీసీ జంగిలి సరిత తదితరులు పాల్గొన్నారు. సుర్జాపూర్‌లో పూజలు చేస్తున్న పండితులు బ్రాహ్మణగల్లీలో పూజలో పాల్గొన్న మహిళలునేడు తుల్జాభవానీ జాతరనిర్మల్ రూరల్: మండలంలోని రాణాపూర్ గ్రామంలో తుల్జాభవానీ జాతర ఆదివారం జరగనుంది. జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ వ్యవస్థాపకులు రాథోడ్ మహేందర్ మహారాజ్ తెలిపారు. ఉదయం 8 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని ఆయన కోరారు. -
పంచాయతీ కథ.. కంచికే!
కడెం: పులుల మనుగడ కోసం కవ్వాల్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలోని రాంపూర్, మైసంపేట్ గ్రామాలను ప్రభుత్వం ఖాళీ చేయించింది. పునరావాస గ్రామానికి తరలించారు. ఇక ఏడాది గడిచినా, రెవెన్యూ పట్టాలు పూర్తిగా అందజేయకపోవడంతో గిరిజనులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పునరావాస ప్యాకేజీలో భాగంగా సౌకర్యాలు కల్పించకపోవడంతో వారు ఇటీవల పాత గ్రామాలకు తిరిగి వెళ్లి గుడిసెలు వేసుకుని నిరసన తెలిపారు. ఏడాదిగా అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పాటు కోసం కలెక్టర్, డీపీవోలకు వినతిపత్రాలు సమర్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ఆ ఆశలు ఆవిరయ్యాయి. 500లకుపైగా జనాభా.. ఈ రెండు గ్రామాల్లో జనాభా 500కు పైగా ఉండగా, ఓటర్ల సంఖ్య 300 దాటింది. రాంపూర్, మైసంపేట్ గ్రామాలు మండలంలోని ఉడుంపూర్ పంచాయతీ పరిధిలోనే ఉన్నాయి. ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేయకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఎక్కడ జరుగుతాయనేది అనిశ్చితంగా మారింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో పునరావాస కాలనీలోని కమ్యూనిటీ హాల్లో పోలింగ్ బూత్ ఏర్పాటు చేసి నిర్వహించారు. ఇప్పుడు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఎక్కడ ఏర్పాట్లు చేస్తారో తెలియకుండా ఉంది. పునరావాస ప్రాంతంలో బూత్ లేకపోతే, 35 కిలోమీటర్ల దూరంలోని ఉడుంపూర్కు వెళ్లి ఓటు వేయాల్సి వస్తుందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పరిష్కరించని హామీలు..2024 ఏప్రిల్‌లో అటవీ శాఖ ఈ గ్రామాలను ఖాళీ చేయించి, పాతమద్దిపడగ సమీపంలోని పునరావాస కాలనీకి తరలించారు. 142 కుటుంబాల్లో 94 కుటుంబాలకు ప్యాకేజీ–1 కింద రూ.11.80 కోట్లు, 5 హెక్టార్లలో విద్య, విద్యుత్ వంటి సౌకర్యాలతో డబుల్ బెడ్రూం ఇళ్లు అందజేశారు. నచ్చన్ఎల్లాపూర్ పంచాయతీ పరిధిలోని పెత్తర్పు సమీపంలో వ్యవసాయ భూములు కేటాయించారు. మిగిలిన 48 కుటుంబాలకు ప్యాకేజీ–2 కింద రూ.15 లక్షల పరిహారం, వ్యవసాయ భూములకు త్రీఫేజ్ విద్యుత్, సాగునీటి సదుపాయాలు, 94 కుటుంబాలకు ఉపాధి కోసం రూ.3 లక్షల రుణం, ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణం వంటి హామీలు ఇంకా అమలు కాలేదు. ఈ అసంపూర్ణతలతో గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. -
వరి బోనస్‌కు బ్రేక్?
లక్ష్మణచాందకు చెందిన రైతు చిన్న రాజేశ్వర్ యాసంగిలో పది ఎకరాల్లో సన్న రకం వరి పండించాడు. 200 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాడు. కేంద్ర నిర్వాహకులు సన్న వడ్లుగా నమోదు చేశారు. అ యితే, ధాన్యం మద్దతు ధరకు సంబంధించిన డబ్బులు ఆయన ఖాతాలో జమయ్యాయి. ధాన్యం అమ్మి నాలుగు నెలలు కావస్తున్నా, బోనస్ డబ్బులు మాత్రం రాలేదు. నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో గత యాసంగిలో పండించిన సన్నవడ్లను రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించారు. బోనస్ వస్తుందన్న ఆశతో అన్నదాతలు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో కాపలా ఉన్నారు. అయితే ధాన్యం విక్రయించి నా లుగు నెలలు కావస్తున్నా బోనస్ జాడ లేదు. తాజా గా స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో నవంబరు 11 తేదీ వరకు కోడ్ అమల్లో ఉండనుంది. నవంబరులో ఖరీఫ్ సీజన్ పంట అన్నదాత చేతికి అందనుంది. దీంతో యాసంగి బోనస్ ప్రభుత్వం ఇవ్వనట్లేనని రైతులు అంటున్నారు. రూ.12.81 కోట్లు బకాయి..జిల్లాలో గత యాసంగి సీజన్లో రైతులు వరి సాగు చేశారు. 60 వేలకుపైగా ఎకరాల్లో సన్న రకాలు వేశారు. మార్చి నెలాఖరు నుంచి కొనుగోళ్లు ప్రారంభించారు. మొత్తం 1,81,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి మిల్లులకు తరలించారు. ఇందులో 25,623 మెట్రిక్ టన్నులు సన్న రకం ధాన్యం ఉంది. సేకరించిన ధాన్యానికి సంబంధించి సర్కా రు రైతుల ఖాతాలలో మద్దతు ధరను మాత్రమే జమ చేసింది. బోనస్‌ను ఇప్పటి వరకు విడుదల చేయలేదు. దీంతో, కొనుగోలు కేంద్రాలలో సన్న వడ్లను విక్రయించిన 4,483 మంది రైతులు బోనస్ డబ్బుల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. వారికి ప్రభుత్వం నుంచి రూ.12.81 కోట్లు రావాల్సి ఉంది. ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తయి నాలుగు నెలలు గడిచినా, బోనస్‌పై ఎలాంటి ప్రకటనా లేదు. స్థానికంలో కీలకం కానుందా..స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సాగు భూమి ఉన్న రైతులందరికీ గత నెలలో పెట్టుబడి సాయం ఖాతాల్లో జమ చేసింది. తాజాగా ఎన్నికల నగారా మోగింది. అంతకుముందే బోనస్ సొమ్ము ఖాతా ల్లో జమచేసి ఉంటే రైతులకు మేలు జరిగి ప్రభుత్వంపై సదాభిప్రాయం ఉండేదని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం బోనస్ రాని అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు పెద్దఎత్తున స్థానిక ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశం ఉంటుందని అధికార, విపక్ష నేతలు మధనపడుతున్నారు.దొడ్డు రకం ధాన్యం1,55,377 మెట్రిక్ టన్నులు సన్న రకం ధాన్యం 25,623 మెట్రిక్ టన్నులు జిల్లా సమాచారం...సేకరించిన మొత్తం ధాన్యం 1,81,000 మెట్రిక్ టన్నులు రావాల్సిన బోనస్ డబ్బులు రూ.12.81 కోట్లు ఒక్క సీజన్‌కే పరిమితమా?సన్న రకాల సాగును ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న బోనస్.. ఒక్క సీజన్‌కే పరిమితమైంది. రబీలో సన్నవడ్లు పండించి విక్రయించిన రైతులకు ఇప్పటికీ ప్రోత్సాహకం అందలేదు. అన్నదాతలు నిరాశ చెందుతున్నా రు. జిల్లా రైతులు గతంలో రైతులు దొడ్డు రకా లనే ఎక్కువగా సాగు చేసేవారు. ప్రభుత్వం సన్నాల కు బోనస్ ఇస్తామనడంతో ఈ మధ్య సన్నాల వైపు మళ్లారు. సహజంగా సన్నాల కంటే దొడ్డు రకాలకే దిగుబడి ఎక్కువగా వస్తుంది. యాసంగి లో సన్నాల దిగుబడి తక్కువగా ఉంటుంది. అయితే, ప్రభుత్వం బోనస్ ఇస్తామనడంతో రైతులు ఆశతో సన్నాల సాగుపై దృష్టి పెట్టారు. గత ఖరీఫ్ సీజన్లో ప్ర భుత్వం ఎకరాకు రూ.500 చొప్పున బోనస్ అందించింది. రబీకి సంబంధించి ఇప్పటివరకు వి డుదల చేయలేదు. ఈ నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. రబీలోనే బోనస్ ఇవ్వని సర్కా రు.. ఖరీఫ్‌లో ఇస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టత ఇవ్వకపోతే, రైతులు మళ్లీ దొడ్డు రకాల సాగుకు మళ్లే అవకాశాలున్నాయి. -
నిర్మల్
7బోధన.. ఆకట్టుకునేలా ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపునకు ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు బోధనోపకరణాలతో సులభపద్ధతిలో బోధిస్తూ తమ ప్రత్యేకత చాటుకుంటున్నారు. 8లోuబండ్లబాట.. అధ్వానం తానూరు మండలంలోని పలు గ్రామాల్లో బండ్లబాటలు(మట్టి రోడ్లు) అధ్వానంగా మారాయి. దీంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. 9లోuఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. తుపాను ప్రభావంతో చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉంది. -
హిందువుల ఐక్యతకు పంచ పరివర్తన్
నిర్మల్‌చైన్‌గేట్: హిందువుల ఐక్యతకు పంచ పరివర్తన్ ద్వారా ఆర్ఎస్ఎస్ కృషి చేస్తుందని వనవాసి కల్యాణ పరిషత్ తెలంగాణ ప్రాంత కార్యదర్శి వెంకటేశ్వర్రావు దేశ్‌పాండే అన్నా రు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా బంగల్పేట్ బస్తీ ఆధ్వర్యంలో స్థానిక కమ్యూనిటీ హాల్లో విజయదశమి ఉత్సవం శని వారం నిర్వహించారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ 1925లో ప్రారంభమై నేడు దేశవ్యాప్తంగా విస్తృత శాఖ లతో, విభిన్న రంగాలలో దేశభక్తి పూరిత, హిందుత్వ ఆధార సంస్థలతో ప్రపంచంలోని అనేక దేశాల్లో పనిచేస్తుందన్నారు. హిందువులలో ఐక్యతను శాఖ ఆధారంగా సంఘం పెంపొందిస్తుందన్నారు. ప్రపంచంలోని వివిధ మతాలను సమన్వయపరిచే సనాతన జీవన విలువలు హిందుత్వంలో ఉన్నాయన్నారు. దేశ అభివృద్ధి కోసం హిందువులు పంచ పరివర్తన కోసం పాటుపడాలన్నారు. కార్యక్రమంలో కొర్తికంటి లింగన్న, నగర కార్యవాహ కిన్నెర్ల రవి, మైసర్ల రమణ, సాధం అరవింద్, పి.కృష్ణ, విలాస్, మంద పవన్, సుదర్శన్‌చారి, శ్రీను, సాయి, మురళి పాల్గొన్నారు. -
చిత్తూ చిత్తూల బొమ్మ..
జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మార్గంలో బతుకమ్మలతో బయలుదేరుతున్న మహిళలుజిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మకు పూజలు చేశారు. ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మలను ఉంచి ఆడిపాడారు. సంప్రదాయపాటలతోపాటు డీజే చప్పుళ్ల నడుమ కోలాటం వేస్తూ సందడిగా గడిపారు. పొద్దుపోయాక బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి సమీపంలోని చెరువులు, కుంటలు, వాగుల్లో నిమజ్జనం చేశారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ -
‘స్థానిక ఎన్నికల్లో సమష్టిగా పనిచేయాలి’
ఖానాపూర్: త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులు సమష్టిగా పనిచేసి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషిచేయాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నా రు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో మండలాలు, గ్రామాల వారీగా శనివారం సమీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటా వివరించాలన్నారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో ఎంఏ.మజీద్, దయానంద్, చిన్నం సత్యం, అంకం రాజేందర్, నిమ్మల రమేశ్, గుగ్లావత్ రాజేందర్‌నాయక్, జంగిలి శంకర్, స్వప్నిల్రెడ్డి, పుప్పాల శంకర్, గుడిసె రమేశ్, తులాల శంకర్, బాశెట్టి నర్సయ్య, ఆత్రం రాజేశ్వర్, జాదవ్ సంతోష్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
అంబరాన్ని తాకిన దసరా సంబురాలు
నిర్మల్/ఖానాపూర్/భైంసాటౌన్: జిల్లాలో దసరా సంబురాలు అంబరాన్నితాకాయి. ఊరూరా వేడుకలు నిర్వహించారు. శమీ పూజ, ఆయుధ పూజలు చేశారు. రాంలీల కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని బంగల్పేట్ మహాలక్ష్మీ ఆలయం వద్ద విశ్వహిందూపరిషత్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం దసరా ఉత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మహేశ్వర్‌రెడ్డి హాజరై మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఎస్పీ జానకీషర్మిల, ఏఎస్పీ రాజేశ్‌మీనా, వీహెచ్‌పీ నాయకులతో కలిసి శమీపూజ, ఆయుధపూజ, దుర్గాపూజలను చేసి దసరా ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం దసరా ఉత్సవ సభలో మాట్లాడుతూ అధర్మంపై ధర్మం గెలిచిన సందర్భంగా దసరా పండుగను చేసుకుంటామన్నారు. ప్రతీతల్లి జిజియాబాయిలా ఆలోచించాలని, తమ బిడ్డలను శివాజీ, భగత్‌సింగ్‌లా తయారు చేయాలన్నారు. దేశం, ధర్మం, సంస్కృతిపై ఆరాధన భావం పెరిగేలా ఇప్పటి తరాన్ని తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక సమరతా తెలంగాణ ప్రాంత కన్వీనర్ అప్పాల ప్రసాద్, బీజేపీ సీనియర్‌నేత అయ్యన్నగారి భూమయ్య, విశ్వహిందూ పరిషత్ ముఖ్యులు పతికె రాజేందర్, ముప్పిడి రవి, పార్థసారధి, మూర్తి ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ భీంరెడ్డి, ఆంజనేయ యువజన సంఘం అధ్యక్షుడు పెండెం శ్రీనివాస్, మహాలక్ష్మీ ఆలయ కమిటీ అధ్యక్షుడు కొడుకుల శ్రీకాంత్, మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. ఖానాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ విజయదశమి అందరికీ విజయాన్ని తెచ్చిపెట్టాలని అకాంక్షించారు. ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ్ ప్రచారక్ నర్రా శివకుమార్ మాట్లాడుతూ.. కుల, మతాలను గౌరవించి భిన్నత్వంలో ఏకత్వంగా ప్రపంచంలోనే లౌకికదేశంగా భారతదేశం నిలిచిందన్నారు. హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు మంత్రరాజ్యం సురేశ్ ధ్వజారోహణ చేశారు. పది తలల రావణాసురుని ప్రతిమను దహనం చేశారు. జమ్మి ఇచ్చిపుచ్చుకుని దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. భైంసాలో కిసాన్ సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత వేదికపై ఎమ్మెల్యే రామారావు పటేల్, ఏఎస్పీ అవినాష్ కుమార్ మాట్లాడారు. రాంలీలా నిర్వహించారు. కార్యక్రమాల్లో ఉత్సవ సమితి అధ్యక్ష, కార్యదర్శులు సురేశ్, శ్యామ్, నాయకులు వెంకటేశ్వర్లు, బీసీరాజన్న, శ్రీనివాస్, రాజు, కృష్ణస్వామి, సంతోష్, లక్ష్మణ్, రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు. -
మాజీ మంత్రి తులాభారం
సారంగపూర్: మండలంలోని అడెల్లి మహాపోచమ్మను మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సిబ్బంది అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ ఎదుట ఉన్న తులాభారం వద్ద అభిమానులు ఆయన బరువుకు సరిపడా బెల్లంతో తులాభారం వేయించి భక్తులకు, ప్రజలకు పంచిపెట్టారు. కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ అయిర నారాయణరెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లోల మురళీధర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ అట్ల మహిపాల్‌రెడ్డి, అడెల్లి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మాధవరావు, నాయకులు రాజేశ్వర్‌రావు, సుచరిత, అడెల్లి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు
లోకేశ్వరం: గ్రామ గ్రామన రాష్ట్రీయ స్వయం సేవ క్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని గ్రామ వికాస్ తెలంగాణ ప్రాంత సహ సంయోజక్ వేంపల్లి ప్రతాప్ అన్నారు. మండల కేంద్రంలోని స్వాధ్యా కేంద్రం అవరణలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా విజయదశమి కార్యక్రమం గురువారం నిర్వహించారు. ప్రతాప్ మాట్లాడుతూ వచ్చే విజయదశమి దసరా నాటికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కు 100 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హిందుత్వ పరిరక్షణ ఆఖండ భారత నిర్మాణంవైపు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వయం సేవకులను తయారు చేస్తూ దేశ భక్తులుగా నిర్మాణం చేస్తుదన్నారు. నిర్మల్ జిల్లా టోలి సభ్యుడు సంటన్న, సభ్యులు నాగేశ్వర్, శ్రీనివాస్, భూమేష్ ఉన్నారు. -
పాఠశాల పునర్నిర్మాణంలో పూర్వవిద్యార్థులు
నిర్మల్: తమకు విద్యాబుద్ధులు, సంస్కృతీ సంప్రదాయాలను నేర్పిన సరస్వతీ శిశుమందిరానికి మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తామని జిల్లాకేంద్రంలోని బాగులవాడ శిశుమందిర్‌లో చదివిన పూర్వవిద్యార్థులు పేర్కొన్నారు. స్థానిక పాఠశాల ప్రాంగణంలో గురువారం ఉదయం బడి భవన పునర్నిర్మాణానికి సామూహికంగా భూమిపూజ నిర్వహించారు. సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ ప్రాంత సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాస్, విద్యాభారతి దక్షిణమధ్య ప్రశిక్షణా ప్రముఖ్ రావుల సూర్యనారాయణ, విద్యాపీఠం జిల్లా అధ్యక్షుడు నార్లాపురం రవీందర్, పూర్వవిద్యార్థి పరిషత్ బాధ్యులు సాత్పుతే శ్రీనివాస్, అయ్యన్నగారి శ్రీకాంత్, శశిరాజ్, అంగ జగదీశ్, కిశోర్, పూర్వవిద్యార్థులు పాల్గొన్నారు. -
పోయిరా దుర్గమ్మ
నిర్మల్భైంసాటౌన్: శరన్నవరాత్రి వేడుల్లో భాగంగా కొలువుదీరిన దుర్గమ్మకు 11 రోజులపాటు భక్తులు పూజలు చేశారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అమ్మవారి నిమజ్జన వేడుకలు నిర్వహించారు. డివిజన్ కేంద్రమైన భైంసా పట్టణంలో దుర్గామాత విగ్రహాల నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముగిసింది. స్థానిక భవానీచౌక్లో ప్రతిష్టించిన దుర్గామండలిలో ఎమ్మెల్యే పి.రామారావు పటేల్, అదనపు ఎస్పీ అవినాష్‌కుమార్, హిందూ ఉత్సవ సమితి సభ్యులు అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా దుర్గా మండళ్ల నిర్వాహకుల ఆధ్వర్యంలో అమ్మవారి శోభాయాత్రలు శోభాయమానంగా నిర్వహించారు. మహిళలు, యువతుల కోలాటాలు ఆడుతూ.. అమ్మవారి భక్తి గీతాలకు నృత్యాలు చేశారు. శోభాయాత్ర సందర్భంగా పోతరాజుల విన్యాసాలు అలరించాయి. భవానీచౌక్ అమ్మవారి విగ్రహం పంజేషచౌక్ వద్దకు చేరుకోగా, యువకులు భారీ సంఖ్యలో పాల్గొని నృత్యాలు చేశారు. శోభాయాత్ర పొడవునా పలుచోట్ల స్వచ్ఛందంగా పులిహోర, అన్నదానం చేశారు. శోభాయాత్ర సందర్భంగా భైంసా పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. అదనపు ఎస్పీ అవినాష్‌కుమార్, నిర్మల్ ఏఎస్పీ రాజేశ్‌మీనా స్థానికంగానే ఉండి బందోబస్తు పర్యవేక్షించారు. ఎస్పీ జానకీషర్మిల సైతం బందోబస్తును పర్యవేక్షిస్తూ, సూచనలు చేశారు. శోభాయాత్ర తీరును డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారు. పంజేష చౌక్ వద్ద భారీగా బలగాలను మోహరించగా, పంజేషచౌక్ నుంచి కిసాన్‌గల్లి మార్గాన్ని మూసివేశారు. స్థానిక గడ్డెన్నవాగు ప్రాజెక్టులో విగ్రహాలను నిమజ్జనం చేశారు. స్వచ్ఛందంగా అన్నదాన కార్యక్రమాలు -
స్థానికం.. సందిగ్ధం
నిర్మల్‌చైన్‌గేట్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశం హైకోర్టు పరిధిలో ఉండటంతో ఆశావహుల్లో అనిశ్చితి నెలకొంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసినప్పటికీ, స్థానిక పదవుల కోసం ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్నవారిలో ఉత్సాహం కనిపించడం లేదు. రాజ్యాంగపరమైన సమస్యలతో ముడిపడిన ఈ పరిస్థితిలో ఎన్నికలు జరుగుతాయా? లేదా?.. జరిగితే ప్రస్తుత రిజర్వేషన్ల ప్రకారమా లేక పాత విధానంతోనా అన్న చర్చ జరుగుతోంది. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చినప్పటికీ ఆశావహులు ధైర్యంగా అడుగులు వేయడం లేదు. కోర్టు తీర్పు వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై స్పష్టత కోసం మరో నాలుగు రోజులు ఆగాల్సిందే. అనుకూల ఫలితాలు వచ్చినవారు కూడా తదుపరి అడుగులు ఎలా వేయాలో తెలియక గందరగోళంలో పడ్డారు. తీర్పు ప్రతికూలమైతే.. జిల్లాలో 18 జెడ్పీటీసీ స్థానాలు, 157 ఎంపీటీసీ స్థానాలు, 400 గ్రామ పంచాయతీలు, 3,368 వార్డులు ఉన్నాయి. పార్టీ గుర్తులపై జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్, బీఎస్పీల నుంచి అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉంది. వీరితోపాటు స్వతంత్రులు కూడా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఒక్కో స్థానానికి కనీసం పది మంది అభ్యర్థులు పోటీలో ఉండనున్నారు. జిల్లా వ్యాప్తంగా జెడ్పీటీసీలకు 200 మంది, ఎంపీటీసీలకు 2 వేల మంది బరిలో దిగుతారని అంచనా. పార్టీ గుర్తులకు అతీతంగా జరిగే సర్పంచ్ స్థానాలకు ముగ్గురు నుంచి నలుగురు చొప్పున సుమారు 2 వేల మంది, వార్డులకు ఇద్దరు ముగ్గురు చొప్పున పది వేల మంది పోటీ చేసే అకాశం ఉంది. 8న కోర్టు తీర్పు.. స్థానిక సంస్థల ఎన్నికలు ఏడాది కాలంగా వాయిదా పడుతూ ఎట్టకేలకు షెడ్యూల్ వచ్చేసింది. అన్నీ సవ్యంగా జరిగితే మొదటి దశ నామినేషన్లు మరో ఐదు రోజుల్లో ప్రారంభమవుతాయి. రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉండటంతో ఆశావహులు అక్టోబర్ 8 వరకు వేచి ఉండాలి.ఈ పరిస్థితిలో ముందుకు అడుగేయడమే సరైనదని కొందరు భావిస్తున్నారు. ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటున్నారు. ఇప్పటి నుంచి పెట్టుబడి పెడితే, పరిస్థితి ప్రతికూలమైతే నష్టపోతామని కొందరు భావిస్తున్నారు. -
మహాత్ముడికి ఘన నివాళి
నిర్మల్‌చైన్‌గేట్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ పాల్గొని గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, మహా త్మాగాంధీ స్వాతంత్య్రం కోసం జీవితాంతం పోరాడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. దేశాన్ని స్వాతంత్య్ర సంగ్రామంలో సంఘటితం చేసి ముందుండి శాంతి, అహింస మార్గాలలో నడిపించారన్నారు. అనంతరం పట్టణంలోని గాంధీ పార్కులోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్డీవో రత్నకళ్యాణి, కలెక్టరేట్ ఏవో సూర్యారావు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. -
17న రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఎన్నికలు
నిర్మల్‌చైన్‌గేట్:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా ఎన్నికలు ఈనెల 17న నిర్వహించనున్నట్లు పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు ఎంసీ.లింగన్న తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్థానిక పెన్షనర్ల సంఘ భవ న సమావేశం మందిరంలో ఉదయం 10 గంటలకు ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. నూతనంగా ఎన్నుకున్న నిర్మల్, ఖానాపూర్, ౖభైంసా, ముధోల్ యూనిట్ల కార్యవర్గ సభ్యులు జిల్లా అవుట్ గోయింగ్ బాడీ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుని జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారని తెలిపారు. బీసీలు లేకున్నా రిజర్వేషన్ కుభీర్: మండలంలోని ఫకీర్ నాయక్ తండా, దావుజీ నాయక్ తండాలలో బీసీల ఓటర్లు ఒక్కరు కూడా లేరు. అయినా ప్రభుత్వ ఇటీవల ప్రకటించిన సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లలో ఈ రెండు గ్రామపంచాయతీలు బీసీలకు రిజర్వేషన్ చేశారు. ఈ రెండు గ్రామపంచాయతీల రిజర్వేషన్ మార్చాలని అయా తండాల వాసులు కోరుతున్నారు. ఈ విషయమై వారు అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జనాభా పరంగా బీసీలు ఉన్నారని, ఓటర్ల పరంగా లేరని ఎంపీడీవో సాగర్‌రెడ్డి తెలిపారు. ఈ రెండు గ్రామపంచాయతీలలో బీసీ ఓటర్లు లేరని జిల్లా అధికారులకు రిపోర్టు ఇచ్చినట్లు తెలిపారు. 6న జిల్లా స్థాయి బాక్సింగ్ జట్ల ఎంపిక నిర్మల్ రూరల్: పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం(ఈనెల 6న) జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో అండర్ 14 ,17 బాక్సింగ్ బాల బాలికల జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈవో భోజన్న, ఎ స్జీఎఫ్ సెక్రెటరీ రవీందర్‌గౌడ్ తెలిపారు. వివరాలకు సత్తయ్య 9849 668725, చందుల స్వామి 9966677105ని సంప్రదించాలని సూచించారు. ఎల్లమ్మ ఆలయంలో పూజలుభైంసారూరల్: మండలంలోని వానల్పహాడ్ ఎల్లమ్మ ఆలయంలో మహిళలు పూజలు నిర్వహించారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏటా దసరా పండగ రోజు జాతర నిర్వహిస్తారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలేకాకుండా పక్క మండలాల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ, గ్రామస్తులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
దుబాయ్‌లో భైంసా వాసి మృతి
భైంసాటౌన్: ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లిన భైంసా వాసి అక్కడ గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సంతోష్మాత నగర్‌కు చెందిన తుమ్మల శ్రీనివాస్(35) నెల క్రితం దుబాయ్‌కు వెళ్లాడు. అక్కడకు వెళ్లిన కొద్దిరోజులకే మతిస్థిమితం కోల్పోయి రోడ్లపై తిరిగాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో తీవ్రంగా గాయాలపాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించాలని ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీని కుటుంబ సభ్యులు సంప్రదించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
పర్యాటకుల తాకిడి
అటవీశాఖ సఫారీ ప్రయాణానికి అనుమతి ఇవ్వడంతో పర్యాటకుల తాకిడి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే హరిత రిసార్ట్‌కు పర్యాటకులు పెరుగుతున్నా సఫారీ లేకపోవడంతో కొంత నిరుత్సాహంగా ఉన్నారు. ప్రస్తుతం సఫారీ మొదలైంది. దీంతో పర్యాటకులు మరింతగా పెరుగుతారు. – వీరేందర్, హరిత మేనేజర్ ఉన్నతాధికారుల ఆదేశాలతో.. జన్నారం డివిజన్లో గత మూడు నెలలుగా వన్యప్రాణుల సంరక్షణ దృష్టిలో పెట్టుకుని సఫారీకి అనుమతి ఇవ్వలేదు. వర్షాలు తగ్గుముఖం పట్టి, సఫారీ తిరిగే అవకాశం ఉన్నందున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తిరిగి ప్రారంభించాం. పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. – రామ్మోహన్, ఎఫ్‌డీవో, జన్నారం -
కవ్వాల్ అందాలు చూసొద్దాం!
జన్నారం: పచ్చని చెట్లు, దట్టమైన అడవులు, చెంగుచెంగున ఎగురుతూ పరిగెత్తే వన్యప్రాణులు, స్వచ్ఛమైన ప్రాణవాయువు.. వీటికి చిరునామా కవ్వాల్ అడవులు. కవ్వాల్ టైగర్‌జోన్‌లోని జన్నారం అటవీ డివిజన్లో సఫారీ ప్రయాణంతో పర్యాటకులు నేరుగా అటవీ అందాలను, వన్యప్రాణులను చూసి ఆహ్లాదం పొందుతున్నారు. అటవీశాఖ ప్రతీ సంవత్సరం జూలై నుంచి సెప్టెంబర్ 30 వరకు సఫారీ ప్రయాణానికి అనుమతి నిలిపివేస్తుంది. తిరిగి అక్టోబర్ 1 నుంచి సఫారీ ప్రారంభమవుతుంది. ఈ ఏడాది గత వారం రోజుల వరకు వర్షాలు ఎక్కువగా కురువడంతో సఫారీకి మరికొంత సమయం పడుతుందని అంతా భావించారు. కానీ మూడు రోజులుగా వర్షాలు పడకపోవడంతో బుధవారం నుంచి సఫారీ ప్రయాణానికి అటవీశాఖ అధికారులు అనుమతినిచ్చారు. అడవిలో రెండు గంటలు.. జన్నారం అటవీ రేంజ్‌లోని పలు ప్రాంతాలలో సఫారీ ప్రయాణానికి అనుమతి ఉంది. ఈ సఫారీ ప్రయాణం రెండు గంటలు ఉంటుంది. ఉదయం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు, ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 5.30 గంటల వరకు మూడుసార్లు సఫారీ ప్రయాణం ఉంటుంది. ఈ రెండు గంటలు గేట్ నంబర్ 1 నుంచి గొండుగూడ బేస్ క్యాంపు, బైసన్‌కుంట, మైసమ్మ కుంట ప్రాంతాల వరకు తీసుకెళ్తారు. బైసన్‌కుంటలో సేద తీరడానికి, టిఫిన్ చేయడానికి సౌకర్యం కల్పించారు. ఈ ప్రాంతంలో వన్యప్రాణులు ఎక్కువగా కనిపిస్తాయి. పెరిగిన సఫారీ ధరలు పర్యాటకులను అడవుల్లోకి తీసుకెళ్లడానికి అటవీశాఖ అధికారులు ఐదు సఫారీలను, పర్యాటక శాఖ అధికారులు రెండు సఫారీలను ఏర్పాటు చేశారు. ఈసారి సఫారీ ధరలు గతం కంటే పెరిగాయి. సోమవారం నుంచి గురువారం వరకు ఆరుగురికి రూ. 3500, అదనపు వ్యక్తులకు ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. వీకెండ్ రోజుల్లో (శుక్ర, శని, ఆదివారాల్లో) సఫారీ ఆరుగురికి రూ.4000, అదనపు సభ్యుడికి రూ. 500 చొప్పున చెల్లించాలి. కాగా ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. తగ్గిన హరిత గదుల ధరలు దూరప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు బస చేయడానికి జన్నారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన హరిత రిసార్ట్ గదుల ధరలు తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో ధరలు తగ్గాయి. గతంలో సోమవారం నుంచి గురువారం వరకు ఏసీ గదులు రూ.2016, నాన్ ఏసీ గదులు రూ.1232, డార్మెంటరీ గది రూ.2500లుగా ఉండేవి. వీకెండ్ (శుక్ర, శని, ఆదివారాల్లో) ఏసీ గది రూ.2240, నాన్ ఏసీ రూ.1344, డార్మెంటరీ రూ. 3000 ఉండేవి. జీఎస్టీ తగ్గడంతో ఈ సంవత్సరం ప్రస్తుతం సోమవారం నుంచి గురువారం వరకు నాన్ ఏసీ రూ.1155, ఏసీ రూ.1890, డార్మెంటరీ రూ.2500, వీకెండ్లో నాన్ ఏసీ రూ.1260, ఏసీ గదులు రూ. 2100, డార్మెంటరీ రూ.3000గా ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు ముందుగా టీఎస్‌టీడీసీ అనే వెబ్సైట్ ద్వారా గదులను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. -
ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
బాసర: బాసరలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు పదో రోజు మహా సరస్వతి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లో బారులుతీరారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. మహిళలు కుంకుమార్చనలో పాల్గొన్నారు. బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ఆలయ వైదిక బృందం నవ చండీ హోమం, పూర్ణహుతి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ సరస్వతి, మహాలక్ష్మి, మహంకాళి అమ్మవార్లకు వేద మంత్రోఛ్ఛరణలతో మధ్య వైదిక బృందం మహాభిషేకము, విశేష అలంకరణ పూజలు చేశారు. సాయంత్రం అర్చకులు చతుషష్టి పూజలు నిర్వహించారు. నేటి పూజలు.. విజయదశమి గురువారం వేకువ జామున 4 గంటలకు అమ్మవార్లకు మహాభిషేకము, ప్రాతఃకాల చతుషష్టి, శమీపూజ, పురవీధుల్లో అమ్మవారి ఉత్సవ విగ్రహాలతో పల్లకి సేవ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాటక్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
కడెం: మండలంలోని ధర్మాజీపేట్ సమీపంలో మూలమలుపు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ధర్మాజీపేట్ గ్రామానికి చెందిన రొడ్డ చందు(35) కడెం వైపు నుంచి ధర్మాజీపేట్కు బైక్‌పై వెళ్తున్నాడు. ధర్మాజీపేట్ సమీపంలోని మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న టాటాఏస్ వాహనం ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటన స్థలాన్ని ఎస్సై సాయికిరణ్ పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
కడెం ప్రధాన కాలువలో ఒకరి గల్లంతు
దస్తురాబాద్: కడెం ఎడమ కాలువలో ప్రమాదవశాత్తు ఒకరు గల్లంతైన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని రేవోజీపేట గ్రామానికి చెందిన మైదం సురేందర్ అనే వ్యక్తి ఉదయం 10 గంటలకు కడెం ఎడమ కాలువలో స్నానం చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా వరద ఉధృతికి మునిగిపోవడంతో అతని ఆచూకీ లభించలేదు. సంఘటన స్థలాన్ని తహసీల్దార్ విశ్వంబర్ పరిశీలించారు. భార్య కళావతి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. -
జెడ్పీటీసీ గరిష్ట ఖర్చు రూ.4 లక్షలు
కై లాస్‌నగర్: స్థానిక రిజర్వేషన్లు ఖరారు కావడంతో పల్లె రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆశావహులు సై అంటున్నారు. ఆ దిశగా తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గెలుపే లక్ష్యంగా లక్షలను గుమ్మరించేందుకు రెడీ అవుతున్నారు. అయితే సదరు అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిమితిని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం– 2018లోని సెక్షన్ 237 ప్రకారం ఏ ఎన్నికలో ఎంత ఖర్చు చేయాలనే వివరాలు వెల్లడించింది. జిల్లా ప్రజాపరిషత్ సభ్యుడు (జెడ్పీటీసీ)గా పోటీచేసే వారు గరిష్టంగా రూ.4లక్షలు, మండల ప్రజా పరిషత్ (ఎంపీటీసీ) అభ్యర్థులు రూ.1.50 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాగే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థి చేసే గరిష్ట ఎన్నికల ఖర్చుల వివరాలను సైతం నిర్దేశించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 5వేలు లేదా అంతకంటే ఎక్కువ జనాభా కలిగి ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు రూ. 2.50 లక్షలు, 5వేల కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో రూ.1.50 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక వార్డు మెంబర్లు 5వేలు లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలలో రూ.50వేలు, అంత కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో రూ.30వేలను ఈసీ నిబంధనలకు అనుగుణంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. -
బీఎస్ఎన్ఎల్ సిబ్బంది ర్యాలీ
నిర్మల్ టౌన్: బీఎస్ఎన్ఎల్ సిల్వర్ జూబ్లీని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరి యా డీఈ శర్మన్ మాట్లాడుతూ.. బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా టెలికాం సేవల విస్తరణలో కీలకపాత్ర పోషిస్తోందని తెలిపారు. ప్రభుత్వ మద్దతుతో 04జీ సాచ్యురేషన్ ప్రాజెక్ట్ కింద ఇప్పటివరకు నెట్వర్క్ చేయలేని ప్రాంతాలు, గ్రామాల్లోనూ అధునాతన 4జీ సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. బీఎస్ఎన్ఎల్ ఒక శక్తివంతమైన సంస్థగా ఎదిగిందని, ప్రైవేట్ కంపెనీలకు దీటుగా నిలుస్తోందని తెలిపారు. బీఎస్ఎన్ఎల్ సిబ్బంది ప్రవీణ్‌కుమార్, అవినాష్‌రెడ్డి, రాకేశ్‌గౌడ్, సతీశ్‌కుమార్, శర్మ తదితరులున్నారు. -
ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
నిర్మల్‌చైన్‌గేట్: స్థానిక సంస్థల ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలని జెడ్పీ సీఈవో గోవింద్ సూచించారు. జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికల నిర్వహణపై అధికారులకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, నిష్పక్షపాత ధోరణి అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఆర్వోలు, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాల విధులు, బాధ్యతల గురించి అవగాహన కల్పించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, నిబంధనలు, ఎన్నికల సామగ్రి వినియోగం తదితర అంశాల గురించి వివరించారు. డీపీవో శ్రీనివాస్, డీఈవో భోజన్న తదితరులు పాల్గొన్నారు. -
భైంసాలో రావణ దహనం ప్రత్యేకం
భైంసాటౌన్: దసరా రోజు సాయంత్రం భైంసాలో పట్టణంలో రావణ దహనం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తారు. పట్టణంలోని కిసాన్గల్లిలోగల బాగుబాయి గుట్టపై సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు బాబన్న, ప్రవీణ్, శంకర్, విశాల్, ప్రకాశ్ ఆధ్వర్యంలో ఏటా దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాదాపు రూ.లక్షకుపైగా వెచ్చించి గుట్టపై రావణ ప్రతిమను ఏర్పాటు చేసి పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులను ఆహ్వానించి కార్యక్రమం ప్రారంభిస్తారు. భారీ టపాసుల పేలుళ్లతో జరిగే రావణ ద హనం కార్యక్రమాన్ని వీక్షించేందుకు పట్టణ ప్రజలు భారీసంఖ్యలో తరలివస్తారు. ఈ దృశ్యాలను సెల్ఫోన్లలో చిత్రీకరించి సంతోషంగా గడుపుతారు. -
అమలులో ‘స్థానిక’ ఎన్నికల కోడ్
నిర్మల్‌చైన్‌గేట్: స్థానిక సంస్థల ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించగా సోమవారం నుంచి జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మంగళవారం ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణపై మీడియాతో మాట్లాడారు. జిల్లాలో 4,49,302 మంది ఓటర్లు జిల్లాలో 4,49,302 మంది ఓటర్లుండగా, ఇందులో 2,13,805 మంది పురుషులు, 2,35,485 మంది మహిళలున్నారు. జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలకు 3,368 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 482 పోలింగ్ లొకేషన్లున్నాయి. ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ బాక్స్‌లు, పోలింగ్ సిబ్బంది, స్టే జ్–1, స్టేజ్–2 అధికారులకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఆర్వో, పీవో శిక్షణ కార్యక్రమాలు మండలాలవారీగా చేపట్టారు. బ్యాలెట్లు ప్రచురించే విషయంలో ప్రింటింగ్ ప్రెస్‌లు పూర్తి వివరాలు ప్రదర్శించారని అధికారులు తెలిపారు. కొత్త పనులకు బ్రేక్ స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటనతో జిల్లాలో కొత్త పనులు అమలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వపరంగా ఎలాంటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించడానికి వీలులేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే అమలులో ఉన్న పాత పథకాలు, పనులు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని వివరించారు. రూ.50 వేలకు మించి తీసుకెళ్తే తప్పనిసరిగా సంబంధిత పత్రాలు చూపాలని సూచించారు. జిల్లాలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాజకీయ పార్టీలు నిర్వహించే ఏ సమావేశం, ర్యాలీకై నా ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, మీడియాలో వచ్చే పెయిడ్ ఆర్టికల్స్‌పై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. -
దావత్ ఉందా..?
నిర్మల్: ‘ఏమే.. నర్సన్న ఎట్లన్న రిజర్వేషన్ నీదిక్కే అచ్చే. ఇంకేమున్నదే గెల్సుడు కూడా నువ్వే గెలుస్తవ్. సప్పుడుదాకా దసరా పండుక్కు మనోళ్లందరికీ దావతిచ్చెయ్యే..’ అని దగ్గరోళ్లు అడుగుతుంటే ఆశావహులు మాత్రం ఎటూ చెప్పలేకపోతున్నారు. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారైనా, ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా.. ఇంకా డైలామాలోనే ఉన్నారు. ఈనెల 8న హైకోర్టు ఇచ్చే తీర్పు ఎట్లుంటదో, ఈ ఎన్నికలు కొనసాగుతాయా.. లేక వాయిదా వేస్తారా..? అన్న కోణంలో ఆశావహులు ఆలోచిస్తున్నారు. రిజర్వేషన్ కలిసొచ్చినా.. పార్టీ తననే నిలబెడుతుందా.. లేక ఇంకొకరికి సీటిస్తుందా..? అన్న సందేహంతో ఉన్నవాళ్లూ పండుగ దావత్‌లకు ఇంకా పచ్చజెండా ఊపడం లేదు. ‘సర్పంచో, ఎంపీటీసో.. ఏదైతేమున్నది..! ముందైతే అందరినీ తనవైపు తిప్పుకుందాం..’ అనుకునే ఆశావహులు మా త్రమే దసరా దావత్ల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 8న ఏం తేలుతుందో! రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల రి జర్వేషన్లు ఖరారు చేసింది. షెడ్యూల్ కూడా ప్రకటించింది. ఎన్నికల నోటిఫికేషన్‌ను మాత్రం ఈనెల 9న ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఇందుకు బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశం హైకోర్టులో పెండింగ్‌లో ఉండటం, దీనిపై ఈనెల 8న తీర్పు వెలువడనుండమే కారణం. తీర్పు ఎలా ఉంటుందో.. ఏం వస్తుందో.. తెలియదు. బీసీ రిజర్వేషన్లకు తామంతా మద్దతిస్తున్నామని చెబుతున్న ప్రతిపక్షాలు రాజ్యాంగ విరుద్ధంగా రిజర్వేషన్ల ప్రక్రియ తేలకుండా ఎలా ఎన్నికలకు వెళ్తారు? లాంటి ప్రశ్నలూ వే స్తున్నాయి. ఇవి కూడా ఆశావహులను గందరగోళంలో పెడుతున్నాయి. అడగడమా.. ఆగడమా..!? హైకోర్టు తీర్పు వచ్చే దాకా ఆగడమా.. లేక ఇప్పటి నుంచే తమ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలంటూ పార్టీలను అడగడమా.. అనే అంశాన్నీ ఆశావహులు తేల్చుకోలేకపోతున్నారు. రిజర్వేషన్ అనుకూలంగా వచ్చినచోట ఇప్పటికే ఈసారి తమకే చాన్స్ అంటూ చాలామంది ప్రచారం చేసుకుంటున్నారు. తమ బలగం పెంచుకునేందుకు, అన్నివర్గాల మద్దతు ద క్కించుకునేందుకు ప్రయత్నాలూ మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే దసరాకు చాలాచోట్ల దావత్‌లకూ ప్లాన్ చేసి పెట్టుకున్నారు. కానీ.. ఎక్కడో ఒకచోట కోర్టు తీర్పు ఎలా వస్తుందో.. ఇదే రిజర్వేషన్ ఉంటుందో, ఉండదో.. లేక ఎన్నికలే వాయిదా పడతాయేమో.. అన్న అనుమానాలు ఆశావహులను ఇబ్బంది పెడుతున్నాయి. దావతైతే ఇచ్చేద్దాం జెడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ స్థానాల కోసం పోటీ పడాలనుకునే ఆశావహులకు రిజర్వేషన్ల ఖరారు నుంచే తమ మద్దతుదారుల ఒత్తిడి పెరుగుతోంది. ‘అన్నా.. ఈసారి పండుగకు ఊళ్లె మనమే చూసుకోవాల్నె..’ అంటూ వెంటపడుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ‘పోయిపోయి.. ఈ ప్రకటన దసరా పండుగప్పుడే అచ్చే.. ఇగ ఊళ్లె ఆగుతరా..! పెద్దరికానికన్నా దావతియ్యవడతది..’ అంటూ చాలామంది నేతలు, నాయకులు, ఆశావహులు దసరాకు సిద్ధమవుతున్నారు. -
వన్యప్రాణుల సంరక్షణ.. అందరి బాధ్యత
సారంగపూర్: వన్యప్రాణుల సంరక్షణ.. అందరి బాధ్యత అని అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ శరవణన్ సూచించారు. మండలంలోని చించోలి(బీ) గ్రామ సమీపంలోగల గండిరామన్న హరితవనంలో బుధవారం వన్యప్రాణి సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల విద్యార్థులకు వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించారు. అనంతరం హరితవనంలో విద్యార్థులు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడవి జంతులవులతోనే అటవీ రక్షణ సాధ్యపడుతుందని తెలిపారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం అడవి జంతువులను వేటాడి తినడంతో జీవవైవిధ్యంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ కారణంగా వన్యప్రాణులు ఆహా రం కోసం గ్రామాల్లోకి చొరబడే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి సంరక్షిస్తే ప్రకృతి విపత్తులనుంచి బయటపడే అవకాశముందని, మానవ మనుగడకు నష్టం జరగదని పేర్కొన్నారు. ఎఫ్‌డీవో నాగిణీభాను, ఎఫ్ఆర్వోలు రామకృష్ణ, వేణుగోపాల్, శ్రీనివాసరావు, రమేశ్ రాథోడ్, డీఆర్వోలు నజీర్‌ఖాన్, సంతోష్, రాజేశ్వర్, ఇర్ఫాన్, అటవీశాఖ సిబ్బంది ఉన్నారు. -
విజయానికి ప్రతీక
నిర్మల్ఘనంగా ఆయుధపూజ నిర్మల్‌టౌన్: దసరాను పురస్కరించుకుని జిల్లా సాయుధ కార్యాలయంలో బుధవారం ఎస్పీ జానకీ షర్మిల జమ్మి చెట్టు, పోలీస్ వాహనాల కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా ప్రజ లందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపా రు. దుర్గామాత విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు శాంతియుతంగా జరుపుకో వాలని సూచించారు. అనంతరం సిబ్బందికి వి జయదశమి బోనస్‌ను స్వయంగా అందజేశా రు. కార్యక్రమంలో ఏఎస్పీలు అవినాష్ కుమార్, రాజేశ్ మీనా, సీఐలు ప్రవీణ్‌కుమార్, కృష్ణ, ఆర్ఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్‌టౌన్: తెలుగు ప్రజలు జరుపుకొనే పండుగల్లో అతిపెద్దది దసరా. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఈ పండుగను మహా సంబురంగా జరుపుకొంటారు. హిందూ సంస్కృతిలో దీనికి ఎంతో ప్రా ముఖ్యత ఉంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా, మహిషాసురుడిపై దుర్గామాత విజయం, రావణుడిపై శ్రీరాముడు సాధించిన విజయానికి గుర్తుగా దసరా నిర్వహించుకుంటారు. ఈ రోజు ఆయుధ పూజ, పొలిమేర దాటడం, జమ్మి చెట్టు పూజ, పాలపిట్ట దర్శనం చేసుకునే ఆనవాయితీ అనాధిగా వస్తోంది. నేడు విజయదశమి దసరా సందర్భంగా ప్రత్యేక కథనం.. ఆయుధ పూజ: దసరా పండుగ రోజు నిర్వహించే ఆయుధ పూజ చాలా విశిష్టమైంది. ఉద్యోగలు, వ్యాపారాల్లో స్థిరపడ్డవారంతా ఈ పూజ చేస్తారు. తమ వృత్తికి సంబంధించిన సామగ్రి, ముఖ్యమై న పరికరాలను అమ్మవారి ఎదుట ఉంచి ఆయు ధ పూజ నిర్వహిస్తారు. పాలపిట్ట దర్శనం: దసరా వేడుకలు నిర్వహించిన అనంతరం పాలపిట్టను చూస్తారు. పాలపిట్టను చూడడానికి గల ప్రత్యేకత ఏమిటంటే పాండవులు అరణ్య, అజ్ఞాత వాసాలను ముగించుకుని రాజ్యానికి తిరిగి వస్తుండగా ఈ పాలపిట్ట కనబడిందని, అప్పటినుంచి వారికి విజయాలు కలి గాయని అందరూ నమ్ముతారు. అందుకే విజ యదశమి రోజు తప్పనిసరిగా పాలపిట్ట చూడడం ఆనవాయితీగా వస్తోంది. జమ్మి చెట్టు పూజ: పాండవులు అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాత వాసానికి వెళ్తూ.. జమ్మి చెట్టు కొమ్మల మధ్య తమ ఆయుధాలు దాచి వెళ్లారని పురాణాలు చెబుతున్నాయి. వనవాసం నుంచి తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడు జమ్మి చెట్టుపై దాచిన ఆయుధాలను తీసి పూజించి, ఉత్తర గోగ్రహణ యుద్ధం చేశాడని.. ఆ యుద్ధంలో శత్రువులను జయించి విజయం పొందాడని చెబుతారు. అందుకే ఆయుధాలకు రక్షణ కల్పించిన జమ్మి చెట్టును అప్పటినుంచి పవిత్రంగా భావించడం ఆనవాయితీగా వస్తోంది. మహాలక్ష్మి ఆలయం వద్ద ఏర్పాట్లు జిల్లా కేంద్రంలోని బంగాల్పేట్ మహాలక్ష్మి, నందిగుండం దుర్గామాత అమ్మవారి ఆలయాల ప్రాంగణాల్లో దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని సుమారు రెండెకరాల ఖాళీ స్థలంలో రావణ వధ దహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. స్థలం చదును చేయించారు. ఉత్సవాల నిర్వహణకు మున్సిపల్ ఆధ్వర్యంలో వేదిక, లైటింగ్, టెంట్లు, బారికేడ్లు, తాగునీటి సదుపాయం కల్పించారు. విశ్వహిందూ పరిషత్, బంగల్పేట్ ఆంజనేయ యూత్ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణమంతా మామిడి తోరణాలతో అలంకరించారు. రావణుని బొమ్మ దహన కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలను తిలకించేందుకు ప్రజలు అధికసంఖ్యలో హాజరవుతారు. మహాలక్ష్మి ఆల యం సమీపంలోని దసరా ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ ఆలయంతో పాటు నందిగుండం దుర్గామాత ఆలయం వద్ద దసరాను పురస్కరించుకుని ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తారు. ప్రత్యేక కార్యక్రమాలు దసరా వేడుకలు గురువారం సాయంత్రం 5గంటలకు మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రారంభిస్తారు. కలెక్టర్ అభిలాష అభినవ్ శమీపూజ చేస్తారు. ఆయుధ పూజను ఎస్పీ జానకీ షర్మిల నిర్వహిస్తారు. అనంతరం ఎ మ్మెల్యే రావణుని బొమ్మను దహనం చేస్తారు. స భాధ్యక్షుడిగా ముప్పిడి రవి వ్యవహరిస్తారు. భరతమాత పూజను విశ్వహిందూ పరిషత్ ఇందూరు వి భాగ్ ధర్మచర్య సంపర్క్ ప్రముఖ్ పతికే రాజేందర్ నిర్వహిస్తారు. దీనికి ముందు వీరంతా మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం దసరా పండగను పురస్కరించుకుని బంగాల్పేట్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయనికి వచ్చే భక్తులకు మున్సిపల్ ఆధ్వర్యంలో అన్ని రకాల వసతులు కల్పించాం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆలయం పక్కన గల గ్రౌండ్ చదును చేశాం. వాటర్, కరెంట్ సౌకర్యం కల్పించాం. టెంట్లు, బారికేడ్లు, వేదిక సిద్ధం చేశాం. – జగదీశ్వర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ విజయవంతం చేయాలి బంగాల్పేట్ మహాలక్ష్మి ఆలయం నిర్మల్‌లోనే ప్రసిద్ధి గాంచింది. ఏటా ఇక్కడ దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తాం. ఆలయాన్ని శోభాయామనంగా ముస్తాబు చేశాం. భక్తులకు వసతులు కల్పించాం. భక్తులు అధికసంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేయాలి. – ముప్పిడి రవి, వీహెచ్‌పీ జిల్లా ఉపాధ్యక్షుడు -
రిజర్వేషన్ల పంచాయితీ
నిర్మల్161బీబీ రహదారి పొడిగింపునకు చర్యలు భైంసాటౌన్: నియోజకవర్గంలో చేపడుతున్న 161బీబీ హైవేను మహారాష్ట్రలోని మాహోర్ వ రకు పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ తెలిపారు. పట్టణంలోని తన నివాసంలో మంగళవారం మాట్లాడారు. 161బీబీ హైవే ను 161ఏ హైవేకు అనుసంధానించాలని గతంలో కేంద్ర రోడ్డు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విన్నవించినట్లు పేర్కొన్నారు. స్పందించిన ఆయన సంబంధిత అధి కారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే రహదారి పొడిగింపునకు మార్గం సుగ మం అవుతుందని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశా రు. పొలంబాట కింద నియోజకవర్గంలో వ్యవసాయ క్షేత్రాలకు మొరం రోడ్ల నిర్మాణానికి రూ.7.97 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. మార్గ సూచి.. ప్రయోజనకారి పాఠశాలల్లో అకడమిక్ క్యాలెండర్ పంపిణీ కి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. బోధన, పరీక్షలు, సెలవులు, వార్షిక కార్యక్రమాల షెడ్యూల్ పొందుపర్చింది. ఎందుకీ పరిస్థితి? 2011 నాటి జనాభా లెక్కలతో ఎస్సీ, ఎస్టీ వర్గాలు, రాష్ట్రంలో నిర్వహించిన సామాజిక ఆర్థిక కుల గణన సర్వేను పరిగణనలోకి తీసుకుని బీసీలకు రిజర్వేషన్ల ర్యాంకింగ్ ఇచ్చారు. బీసీ వర్గాల రిజర్వేషన్లకు డెడికేషన్ కమిషన్ సిఫారసులు పరిగణనలోకి తీసుకున్నారు. రాష్ట్రంలో 2019 తర్వాత ఇప్పుడు జరుగుతున్న రెండో స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్, ఎంపీటీసీ మండలం యూనిట్‌గా, జెడ్పీటీసీ జిల్లా యూనిట్‌గా ర్యాంకింగ్‌లు ఇచ్చే క్రమంలో ఆయా వర్గాల్లో జనాభా లేనప్పటికీ రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడింది. ఇక మహిళలకు 50శాతం, వంద శాతం ఎస్టీలు ఉన్న చోట్ల వారికే నోటిఫై చేయడం వంటి నిబంధనలు పాటించాల్సి ఉంది. ఎస్టీ, ఎస్సీ, బీసీల ర్యాకింగ్ ఇచ్చే క్రమంలో ఒక్క ఓటరు లేని వర్గాలకు కూడా ఆయా చోట్ల రిజర్వేషన్లు ప్రకటించాల్సి వచ్చింది. ఇక గత ఎన్నికల్లో ఏదైనా కారణంతో ఎన్నిక జరగకపోతే ఆయా వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్లు అనుభవించని కారణంగా మరోసారి వారికే అవకాశం కల్పించేలా జీవో జారీ చేశారు. ఇక షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజనులే పోటీకి అర్హులు. దీంతో ఏ గ్రామంలోనైనా గిరిజనులు ఉన్నా లేకున్నా వారికే అవకాశాలు వస్తున్నాయి. గతంలో జనాభా లెక్కల సమయంలోనూ కొన్ని చోట్ల ఆయా వర్గాల వివరాల నమోదులో తప్పిదాలు జరగడంతోనూ ఇబ్బందులు వస్తున్నాయి. మళ్లీ జనాభా లెక్కలు జరిగి, ఆయా వర్గాల వివరాలు స్పష్టత వచ్చే వరకు ఈ పరిస్థితి మారే అవకాశం లేదు. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పంచాయితీ మొదలైంది. పలు గ్రామాల్లో పోటీలో నిలబడేందుకు అభ్యర్థులే లేని పరిస్థితి నెలకొంది. దీంతో తమ గ్రామాల్లో రిజర్వేషన్ల ఖరారుపై పునః పరిశీలన చేయాలని విన్నవిస్తున్నారు. కొన్ని చోట్ల స్థానికులు నిరసన వ్యక్తం చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులను కలుస్తూ రిజర్వేషన్లు మార్చాలని కోరుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత మార్చే అవకాశం లేకపోవడంతో ఆ గ్రామాల్లో ఎన్నికలు జరుగుతాయా..? లేదా..? అనే సందిగ్ధత నెలకొంది. జనాభా లేకున్నా అవకాశాలు ఉప సర్పంచ్‌లకే పగ్గాలు సర్పంచ్ పదవులు ఆయా వర్గాలకు రిజర్వు కావడంతో వార్డు స్థానాలకు ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. దీంతో వార్డు సభ్యులు తమలో ఒకరిని ఉప సర్పంచ్‌గా ఎన్నుకుంటున్నారు. దీంతో సర్పంచ్ ఎన్నిక జరగని చోట్ల రిజర్వేషన్ వర్తించని ఉప సర్పంచ్‌లే సర్పంచ్ హోదాలో పాలన కొనసాగించే అవకాశం ఉంది. -
భీమన్న ఆలయం ఆక్రమణపై ఎస్పీకి ఫిర్యాదు
నిర్మల్‌టౌన్: మామడ మండలం పోతారం గ్రామంలో ఆదివాసీ నాయక్‌పోడ్‌ల ఆరాధ్య దైవం భీమన్న ఆలయాన్ని గిరిజనేతరులు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకగారి భూమయ్య తెలిపారు. ఈ విషయంపై ఎస్పీ జానకీ షర్మిలకు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసుల కులదైవం భీమన్న ఆలయాన్ని ఆక్రమించడం తమ సంస్కృతి ,సంప్రదాయాలను ధ్వంసం చేయడమే అవుతుందని మండిపడ్డారు. ఈ దౌర్జన్యంపై అధికా రులు తక్షణమే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం ఇచ్చినవారిలో తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు సాకి లక్ష్మణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంచు శ్రీనివాస్, ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోజ్ తదితరులు పాల్గొన్నారు. -
హిందువుల ఐక్యతకే పంచ పరివర్తన్
నిర్మల్‌ఖిల్లా: హిందువుల ఐక్యతకు పంచ పరివర్తన్ ద్వారా ఆర్ఎస్ఎస్ కృషి చేస్తోందని ఇందూర్ విభాగ్ కార్యవాహ రాజులవార్ దిగంబర్ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది వందేళ్ల స్థాపన ఉత్సవాల్లో భాగంగా ఆర్ఎస్ఎస్ మంజులాపూర్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం విజయదశమి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1925లో ప్రారంభమై దేశవ్యాప్తంగా విస్తృత శాఖలతో, విభిన్న రంగాల్లో దేశభక్తి పూరిత, హిందుత్వ ఆధార సంస్థలతో ప్రపంచంలోని అనేక దేశాలలో పనిచేస్తుందని వివరించా రు. దేశ అభివృద్ధి కోసం హిందువులు పంచ పరి వర్తన కోసం పాటుపడాలని సూచించారు. ముఖ్యఅతిథిగా హాజనైన సద్గురు మహాదేవస్వామి మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ దేశ అఖండతకు, వ్యక్తి నిర్మాణానికి, హిందుత్వ పరిరక్షణకు చేపడుతున్న చర్యలు స్వాగతించాలని కోరారు. జిల్లా సహ కార్యవాహ మంచిరాల నాగభూషణం, కిన్నెర్ల రవి, నార్లపురం రవీందర్, వల్లెపు శివ, నారి విక్రమ్, అయిండ్ల సాత్విక్, తాండ్ర సుశాంత్, చిన్నయ్య, సుదర్శన్‌చారి పాల్గొన్నారు. -
కోడ్ పకడ్బందీగా అమలు చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, ఎన్నికల నిర్వహణ అంశాలపై అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ప్రతీ అధికారి కోడ్ తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. గ్రామాల్లో రాజకీయ ఫ్లెక్సీలు, వాల్ పెయింటింగ్స్ ఉండకూడదన్నారు. రాజకీయ పా ర్టీల కార్యక్రమాలకు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎన్నికల వ్యయం వివరాలను పర్యవేక్షించాలన్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద ఇప్పటికే చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, అధికారులు ఎప్పటికప్పుడు చెక్ పోస్టులను తనిఖీ చేస్తూ ఉండాలన్నారు. ఎన్నికల ప్రక్రి య సజావుగా జరిగేందుకు ఎఫ్ఎస్టీ, వీఎస్టీ, ఎస్ ఎస్టీ బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. రూట్ అధికారులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి, ఆయా మార్గాల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయేమో చూడాలని సూచించారు. ఎన్నికల సిబ్బందికి విస్తృత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్ట ర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీవో రత్నకళ్యాణి, జెడ్పీ సీఈవో గోవింద్, డీపీవో శ్రీనివాస్, సీపీవో జీవరత్నం, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉపాధి కూలీలకు బీమా
లక్ష్మణచాంద: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ నిరుపేదలకు స్థిరమైన ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోది. ఈ పథకం ద్వారా జాబ్ కార్డు కలిగిన కూలీలకు ఏడాదిలో 100 రోజుల పని దినాలను అందించడంతోపాటు, వారికి ఆర్థిక స్థిరత్వం కల్పిస్తోంది. ఇప్పుడు, ఈ కూలీలకు మరింత రక్షణ అందించేందుకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బీవై)ను ఈ పథకంతో అనుసంధానం చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం రూ.20తో బీమా సౌకర్యం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద, జాబ్‌కార్డు హోల్డర్లు కేవలం రూ.20 చెల్లించి బీమా పరిరక్షణ పొందవచ్చు. 18 నుంచి 70 ఏళ్లలోపువారు బ్యాంకు లేదా పోస్టాఫీసు ఖాతా ఉన్నవారు, సంబంధిత కార్యాలయంలో దరఖాస్తు సమర్పించి, నామమాత్రపు రుసుముతో ఈ పథకంలో నమోదు చేసుకోవచ్చు. బీమా ప్రయోజనాలు.. ఈ బీమా యోజనలో చేరిన ఉపాధి కూలీలు పని సమయంలో ఊహించని దుర్ఘటనల నుంచి రక్షణ పొందుతారు. పనిలో ఉండగా మరణం సంభవించినా లేదా శాశ్వత వైకల్యం ఏర్పడినా, రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుంది. అదే విధంగా, పాక్షిక వైకల్యం జరిగిన సందర్భంలో రూ.లక్ష బీమా మొత్తం అందించబడుతుంది. ఈ ఆర్థిక సహాయం కూలీల కుటుంబాలకు క్లిష్ట సమయంలో ఆసరాగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. జిల్లాలో ఇలా... జిల్లాలో 18 మండలాల్లో 400 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఇక్కడ ఉపాధి హామీ కింద 1,76,575 కుటుంబాల నుంచి 3,34,726 మంది కూలీలు నమోదితులయ్యారు. వీరిలో 85,180 యాక్టివ్ జాబ్ కార్డులతో 1,35,209 మంది కూలీలుగా గుర్తించబడ్డారు. ఈ భారీ సంఖ్యలో కూలీలకు బీమా పథకం గురించి తగిన అవగాహన కల్పించేందుకు అధికారులు గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రతీ జాబ్ కార్డు హోల్డర్ ఈ బీమా సౌకర్యాన్ని పొందేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మండలాల వారీగా కుటుంబాలు, కూలీల వివరాలు.. మండలం కుటుంబాలు కూలీలు బాసర 1,832 2,818 భైంసా 5,558 8,791 దస్తురాబాద్ 2,906 4,056 దిలావార్పూర్ 2814 3868 కడెం 8,555 13,471 ఖానాపూర్ 7,695 11,663 కుభీర్ 7,779 14,742 కుంటాల 3,804 6357 లక్ష్మణచాంద 3,350 4791 లోకేశ్వరం 3,983 6,147 ముధోల్ 3,364 5,447 నర్సాపూర్(జి) 3,734 6,105 నిర్మల్ రూరల్ 3,917 5,368 పెంబి 3,681 5,905 సారంగాపూర్ 7,654 11,187 సోన్ 2,507 3185 తానూర్ 6,753 13,080 మొత్తం జాబు కార్డులు 85180 మొత్తం కూలీల సంఖ్య 1,35,209 -
ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
స్థానిక సంస్థల నిర్మల్‌చైన్‌గేట్: స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. సోమవారం ఎస్పీ జానకీ షర్మిలతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే పలు దశల్లో అధికారులందరికీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామన్నా రు. ఎస్పీ మాట్లాడుతూ రెవెన్యూ, ఇతర అధి కారుల సమన్వయంతో జిల్లాలో ఎన్నికలు ప్రశా ంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నా రు. కోడ్ అమలులో ఉన్నందువల్ల సరైన పత్రాలు లేకుండా రూ.50 వేల నగదును వెంట తీసుకు వెళ్లరాదన్నారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్, ఆర్డీవో రత్నకళ్యాణి, జెడ్పీ సీఈవో గోవింద్, డీపీవో శ్రీనివాస్, డీపీఆర్ఓ విష్ణువర్ధన్ పాల్గొన్నారు. ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి నిర్మల్‌చైన్‌గేట్: ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తును పరిశీలించి తక్షణమే స్పందించాలన్నారు. అనంతరం ఇటీవల నిర్మల్ జిల్లాకు జల్ సంచాయ్–జన భాగిధారి కార్యక్రమంలో అవార్డు లభించడంతో అధికారులను అభినందించారు. భవిష్యత్‌లో రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తూ మరిన్ని అవార్డులు సాధించి జిల్లా పేరును దేశవ్యాప్తంగా నిలపాలన్నారు. ప్రజావాణి తాత్కాలిక వాయిదా.. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి కోడ్ ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలన్నారు. అధికారులంతా ఎన్నికల కోడ్‌ను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎలక్షన్ కోడ్ జిల్లాలో పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దుర్గాదేవి నిమజ్జన ఏర్పాట్లు పరిశీలననిర్మల్చైన్గేట్: దుర్గాదేవి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. దుర్గాదేవి విగ్రహాలను నిమజ్జనం చేసే వినాయక సాగర్ చెరువు (బంగల్పేట్ చెరువు)ను ఆమె పరిశీలించారు. ప్రజలు చెరువులోకి దిగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అంతకుముందు బంగల్పేట్ మహాలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కలెక్టర్‌కు అమ్మవారి ఫొటోను బహూకరించారు. పూజారులు ఆలయ చరిత్రను, విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్ పాల్గొన్నారు. -
సద్దుల సందడి
అమ్మ సన్నిధిలో భక్తజనం చదువుల తల్లి సరస్వతీ అమ్మవారిని అత్యంత ప్రీతిపాత్రమైన మూలనక్షత్ర శుభఘడియల్లో దర్శించుకునేందుకు రాష్టం నలుమూలల నుంచి భక్తులు సోమవారం అధికసంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారి సన్నిధిలో తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు చేయించారు. ఈ సందర్భంగా సరస్వతీ అమ్మవారు మహాగౌరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సోమవారం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిల్లా అధికారులు, పట్టణ ప్రాంత మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చారు. కలెక్టర్ అభిలాష అభినవ్ ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మల వద్ద పూజలు చేశారు. అధికారులు, పట్టణ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు. అనంతరం స్థానిక ధర్మసాగర్ చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. – నిర్మల్‌చైన్‌గేట్ -
రైతుల కష్టం వరదపాలు
ఈచిత్రంలో కనిపిస్తున్న రైతు లోకేశ్వరం మండలంలోని పంచగుడి గ్రామానికి చెందిన భోజన్న. ఈ ఏడాది తనకున్న రెండెకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. ఇటీవలే పంట కోత దశకు వచ్చింది. కంకులను కోసి రోడ్డుపై ఆరబెట్టాడు. ఇటీవల ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు మొక్కజొన్న కంకులకు మొలకలు వచ్చాయి. దీంతో పంట దిగుబడి రావడం గగనంగా మారిందని రైతు ఆవేదన చెందుతున్నాడు. ఈ ఒక్క రైతుదే కాదు జిల్లాలోని చాలామంది అన్నదాతలదీ ఇదే పరిస్థితి. లోకేశ్వరం: అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు ఇంటికి వచ్చేంత వరకు నమ్మకం లేకుండా పోతోంది. విత్తనం విత్తింది మొదలు ప్రకృతి పగబట్టినట్లు వెంటాడుతూనే ఉంది. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జిల్లాలో సాగు చేసిన పంటలపై తీవ్ర ప్రభావం చూపాయి. జిల్లాలో ఈ ఏడాది వానాకాలం 4.30 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేశారు. మొదట్లో ఆశించిన మేర వర్షాలు కురియకపోవడంతో పంటల్లో ఎదుగుదల లోపించింది. తీరా పంట దిగుబడి చేతికి వచ్చే సమయంలో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంట చేలలోనే సోయా, పత్తి కాయలకు మొలకలు వస్తున్నాయి. కోతకు వచ్చిన మొక్కజొన్న కంకులు తడిసిపోవడంతో మొలకలు వస్తున్నాయి. ఆయా గ్రామాల్లోని ప్రధానరోడ్లపై ఆరబోసిన కంకులు సైతం ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు తడారక మొలకలు వస్తుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అంతర పంటగా మొక్కజొన్న .. పసుపులో అంతర పంటగా మొక్కజొన్న సాగు చేస్తారు. వర్షాలకు పంటచేలలో నీరు నిలవడంతో తేమ ఆరిపోయేంత వరకు మొక్కజొన్నను కోయలేని పరిస్థితి. ఇదే జరిగితే మొక్కజొన్న పసుపు పై పడిపోయి పంట దెబ్బతినే ప్రమాదం ఉంది. కోసిన కంకులను కుప్పగా పోస్తే వర్షానికి నాని మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇటీవల కురుస్తున్న వర్షాలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మార్కెట్లో డిమాండ్ ఉన్నా.. మొక్కజొన్న పంటకు మార్కెట్లో మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2400లు ఉండగా ఓపెన్ మార్కెట్లో రూ.2,800 నుంచి రూ.3000ల వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాదిలో తొలిదశ కత్తెర పురుగు, గింజదశలో కోతులు, రామచిలుకలు, అడవి పందులు దెబ్బతీశాయి. ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా కేవలం 15 నుంచి 20 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలో సాగు వివరాలు పంట ఎకరాల్లో మొక్కజొన్న 15,371 వరి 1.40 లక్షలు పత్తి 1.57 లక్షలు సోయా 40,000 -
మస్తు ఆశలుండే
ఈసారి మొదటి నుంచి వర్షాలు విస్తారంగా కురియడంతో మొక్కజొన్న సాగుచేయాలని నిర్ణయించుకున్నా. కానీ ఆశించిన మేర పంట దిగుబడి వచ్చేలా కనిపించడంలేదు. మొక్కజొన్న కంకులకు ఎక్కడ చూసినా మొలకలే కనిపిస్తున్నాయి. – రాథోడ్ బలీరాం, నగర్‌తండా దిగుబడి కష్టమే అధిక వర్షాలు కురవడం వల్ల ఈ సారి సాగు చేసిన పంటలు చేతికి రావడం కష్టమే. పెట్టుబడులు సైతం మునగాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతీ కర్రకు మొలకలే కనిపిస్తున్నయ్. సోయా, పత్తి పంటలకు కూడా మొలకలు వస్తున్నయ్. – ప్రవీణ్, రాయాపూర్‌కాండ్లీ ఉన్నతాధికారులకు నివేదిస్తాం మొక్కజొన్న పంట ఇప్పుడిప్పుడే చేతికి అందివస్తోంది. రైతులు చేలల్లో పంట ఆరబెట్టుకునేందుకు ప్లాట్‌ఫారాలు ఏర్పాటు చేసుకోవాలి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలను అధికారులచేత సర్వే చేయించాం. ఉన్నతాధికారులకు నివేదిస్తాం – అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి -
మద్యం దుకాణాలకు 7 దరఖాస్తులు
నిర్మల్‌టౌన్: జిల్లాలోని మద్యం దుకాణాలకు సోమవారం ఏడు దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి అబ్దుల్ రజాక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 47 మద్యం దుకాణాలకు ఈనెల 26 నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 23న లాటరీ పద్ధతిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక చేస్తామన్నారు. ప్రతీ దరఖాస్తుకు రూ.3 లక్షలు రుసుముగా నిర్ణయించామని, ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా అందజేయవచ్చన్నారు. గౌడ కులస్తులకు 3, ఎస్సీలకు 5, ఎస్టీలకు 1 రిజర్వేషన్ కల్పించామన్నారు. డీడీలు, చలాన్లు జిల్లా ప్రొహిబిషన్ ఎకై ్సజ్ అధికారి నిర్మల్ పేరున తీయాలని, దరఖాస్తు ఫారం జిల్లా కార్యాలయంలో లేదా హైదరాబాద్ ఎకై ్సజ్ కార్యాలయంలో అందజేయాలన్నారు. -
పూలే స్ఫూర్తితో కులనిర్మూలనకు కృషి
నిర్మల్‌చైన్‌గేట్: జ్యోతిరావు పూలే స్ఫూర్తితో కుల నిర్మూలనకు కృషి చేద్దామని సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ (ప్రజాపంథా) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నందిరామయ్య పిలుపునిచ్చా రు. సోమవారం జిల్లా కేంద్రంలో గల ప్రభు త్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవన్లో కుల నిర్మూలన జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే 1873 సెప్టెంబర్ 24న సత్యశోధకు సమాజ్ అనే సంస్థను ఏర్పాటు చేసి దేశంలో అంటరానితనం, కుల నిర్మూలన జరగాలని పోరాడారన్నారు. జిల్లా కార్యదర్శి కే.రాజన్న మాట్లాడుతూ కులాలు, మతాలను ప్రోత్సహించి అధికారాన్ని కాపాడుకుంటున్నారని, ప్రజా సమస్యలను పరిష్కరించలేకపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా మాజీ అధ్యక్షుడు బొడ్డు లక్ష్మణ్, సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ (ప్రజాపంథా) నాయకులు ఎం.బక్కన్న, ఆర్.రామలక్ష్మణ్, ఎస్.గంగన్న, గపూర్, గంగామణి, ఎస్.లక్ష్మి, దేవక్క, భీమవ్వ, ఫెరోజ్ పాల్గొన్నారు.మాట్లాడుతున్న జిల్లా కార్యదర్శి కే.రాజన్న -
● రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ.. ● మూడు విడుతల్లో సర్పంచ్ ఎన్నికలు ● షెడ్యూలు విడుదల చేసిన ఎన్నికల సంఘం
నిర్మల్‌చైన్‌గేట్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లాలోని 18 మండలాల్లో 400 గ్రామ పంచాయతీల పరిధిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి సోమవారం షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ క్షణం నుంచే ఎన్నికల నిబంధనలు అమలులోకి వస్తాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 157 ఎంపీటీసీ, 18 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 400 గ్రామ పంచాయతీలు, 3,368 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం.. జిల్లాల్లోని 18 మండలాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పూర్తిస్థాయి షెడ్యూల్‌ను ప్రకటించింది. రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించింది. అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో మూడు విడతలుగా గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. పోలింగ్ రోజునే పంచాయతీ ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నా రు. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ వి డుదల చేసింది. తక్షణమే ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని ఎన్నికల కమిషనర్ తెలిపారు. మొదటి విడత జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీల మండలాలు మండలం ఎంపీటీసీల సంఖ్య ఓటర్లు ఖానాపూర్ 8 23,658 పెంబి 5 10,886 కడెం 10 29,159 దస్తూరాబాద్ 5 12,894 మామడ 9 26,072 లక్ష్మణచాంద 9 24,577 నిర్మల్ 7 22,751 సోన్ 8 21,801 సారంగాపూర్ 14 39,516 రెండవ విడత జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీల మండలాలు మండలం ఎంపీటీసీల సంఖ్య ఓటర్లు దిలావర్పూర్ 6 18,744 నర్సాపూర్(జి) 7 20,238 లోకేశ్వరం 10 29,359 కుంటాల 7 19,055 భైంసా 11 33,970 కుభీర్ 14 40,625 తానూర్ 11 31,516 ముధోల్ 10 28,754 బాసర 6 15,728 -
అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి
● ఎస్పీ జానకీ షర్మిల నిర్మల్‌టౌన్: అర్జీదారుల సమస్యలను సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదు లు స్వీకరించారు. ఎస్పీ వారి సమస్యలను తె లుసుకొని సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సామాన్యులకు అండగా ఉండాలని, శాంతిభద్రతలకు విఘాతం కలి గించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూ చించారు. నాణ్యమైన పోలీసు వ్యవస్థను జిల్లా ప్రజలకు అందించడమే లక్ష్యమన్నారు. పోలీ సుల సహాయం కావాలనుకునేవారు ఠాణాలో నిర్భయంగా ఫిర్యాదు చేయాలన్నారు. -
జిల్లా కవులకు పురస్కారాలు
నిర్మల్‌ఖిల్లా: నిర్మల్‌కు చెందిన పలువురు కవులు సాహితీరంగంలో పురస్కారాలు స్వీకరించారు. పత్తి శివప్రసాద్, తుమ్మల దేవరావ్, అంబటి నారాయణ, వెంకట్, జాదవ్ పుండలీక్‌రావు సాహితీ కిరీటి ప్రతిభా జాతీయ పురస్కారాలు, పోలీస్ భీమేశ్ యువ సాహితీ కిరీటి పురస్కారం స్వీకరించారు. హైదరాబాద్‌లోని బిర్లా ప్లాంటోరియం, ఆడిటోరియంలో ఆదివా రం నిర్వహించిన శ్రీశ్రీకళావేదిక 155వ సాహి తీ పట్టాభిషేక మహోత్సవంలో సంస్థ డైరెక్టర్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్, జాతీయ అధ్యక్షురాలు జీ ఈశ్వరీభూషణం, జాతీయ యువజన అధ్యక్షుడు గరిమెళ్ల రాజేంద్రప్రసాద్ తదితరుల చేతులమీదుగా పురస్కారాలు అందుకున్నారు. వీరికి జ్ఞాపిక, శాలువా, ప్రశంసాపత్రం అందజేసి సత్కరించారు. వీరిని జిల్లాకు చెందిన పలువురు అభినందించారు. -
మళ్లీ ముంచిన గోదావరి
లక్ష్మణచాంద: మండలంలోని గోదావరి పరీ వాహక గ్రామాల్లో రెండు నెలల వ్యవధిలో రెండుసార్లు పంటలను గోదావరి వరద ముంచెత్తింది. గత ఆగస్టు చివరి వారంలో ఎగువన భారీ వర్షాలు కురవడంతో ఎస్సారెస్పీ గేట్లు ఎత్తి 4లక్షల క్యూసెక్కుల నీటిని వదలగా పీచ ర, ధర్మారం, పార్పెల్లి, మునిపెల్లి, మాచాపూర్, చింతల్‌చాంద గ్రామాల్లో వందల ఎకరాల్లో పంటలు నీటిమునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వ్యవసాయాధికారులు పంట నష్టంపై సర్వే చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపినా ఇంతవరకు పరిహారం అందలేదు. ఆదివారం గోదావరిలో వరద ఉధృతి పెరుగుతుండగా పీచర, ధర్మారం, పార్పెల్లి, చింతల్‌చాంద, మునిపెల్లి గ్రామాల్లో పంటలు మళ్లీ నీట మునుగుతుండగా మొక్కజొన్న, సోయా రైతులు ఆందోళన చెందుతున్నారు. -
వచ్చింది 12.. పోయింది 11
భైంసాటౌన్: ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు భైంసాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్ట్‌కు భారీగా వరదనీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్ అధికారులు ఎప్పటికప్పుడు ఇన్‌ఫ్లో అంచనా వేస్తూ నీటిని దిగువకు వదులుతున్నారు. ఈసారి జూన్ నుంచి ఇప్పటివరకు ప్రాజెక్ట్‌కు ఏకంగా 12టీఎంసీ లకు పైగా వరదనీరు వచ్చి చేరింది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1.83 టీఎంసీలు (358.70 మీట ర్లు) కాగా, దాదాపు పదింతల నీరు చేరింది. ఇప్పటివరకు 11.461 టీఎంసీలను దిగువకు వదిలారు. ఈసారి భారీగా ఇన్‌ఫ్లో గడ్డెన్నవాగు ప్రాజెక్ట్‌కు ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిస్తేనే వరదనీరు వచ్చి చేరుతోంది. ఈసారి జూన్ నుంచి ఆగస్టు 15వరకు సరైన వర్షాలు లేక ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకో లేదు. అనంతరం భారీ వర్షాలతో ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంది. భారీ ఇన్‌ఫ్లో రావడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వది లారు. ఈసారి ప్రాజెక్ట్‌కు అధికంగా 43వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, అత్యధికంగా ఐదు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. అలాగే, శనివారం ఒక్కరోజులోనే సగానికిపైగా టీఎంసీల నీరు ప్రాజెక్ట్‌కు వచ్చి చేరడంతో, అధికారులు వచ్చిన మొత్తం నీటి ని దిగువకు వదిలారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమ ట్టం 1.83 టీఎంసీలు కాగా, ఇప్పటివరకు 12.499 టీఎంసీల వరదనీరు వచ్చి చేరింది. ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తూ ఇప్పటివరకు 11.461 టీఎంసీల నీటిని ప్రాజెక్ట్ నుంచి వదిలిపెట్టారు. ఇప్పటివరకు ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో వివరాలుపూర్తిస్థాయి నీటిమట్టం 1.83 టీఎంసీలు ప్రస్తుత నీటిమట్టం 1.602 టీఎంసీలు మొత్తం ఇన్‌ఫ్లో 12.499 టీఎంసీలు వదిలిన నీరు 11.461 టీఎంసీలు -
ఎకై ్సజ్ ఎస్సై నుంచి డీటీగా..
కుంటాల: మండల కేంద్రానికి చెందిన కార్గాం లక్ష్మి–భూమన్న దంపతుల కుమారుడు గోవర్ధన్ గ్రూప్–2లో ప్రతిభ కనబరిచి డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యారు. గోవర్ధన్ 2011లో ఎస్బీఐ మేనేజర్‌గా ఉద్యోగం సాధించి విధుల్లో చేరారు. 2020లో నిర్వహించిన గ్రూప్–2లో ప్రతిభ కనబరిచి ఎకై ్సజ్ ఎస్సైగా ఎంపికయ్యారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా భీంగల్ ఎకై ్సజ్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. గ్రూప్–2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్ (డీటీ)గా ఎంపికయ్యారు. గోవర్ధన్‌ను కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు. -
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
ఖానాపూర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటే ల్ పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాలకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో లేని అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. ఊరూరా రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలతో గ్రామాల్లో పనుల జాతర జరుగుతోందని తెలిపారు. ప్రభుత్వ పథకాలే పార్టీ అభ్యర్థుల గెలుపునకు నాంది అవుతాయని, పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేసి అభ్యర్థుల గెలుపులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను రెండో విడతలో ఖానాపూర్‌లో ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్, ఆయా మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
‘మన్ కీ బాత్’ వీక్షణ
నిర్మల్‌చైన్‌గేట్/కడెం: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఏలేటి మ హేశ్వర్‌రెడ్డి వీక్షించారు. నాయకులు రాంనాథ్, స త్యనారాయణగౌడ్, ముత్యంరెడ్డి, కార్తిక్, సాయి, అ రవింద్, నవీన్, నరేందర్, జమాల్, చంద్రకాంత్, కిషన్, రాజు, సాత్విక్ తదితరులున్నారు. కడెం మండలం పెద్దూర్లో ‘మన్ కీ బాత్’ను బీజేపీ జిల్లా అ ధ్యక్షుడు రితేశ్‌రాథోడ్ వీక్షించారు. అనంతరం మండలంలోని లింగాపూర్, సారంగపూర్, మాసాయిపే ట్ గ్రామాల్లోని దుర్గామాత మండపాల్లో అమ్మవారి కి పూజలు చేశారు. పార్టీ మండలాధ్యక్షుడు కాశవేని శ్రీనివాస్, నాయకులు శ్రీనివాస్, మోహన్‌నాయక్, కృష్ణ, రంజిత్, లక్ష్మణ్, రాజేందర్ పాల్గొన్నారు. పెద్దూర్లో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న రితేశ్‌రాథోడ్ నిర్మల్ చైన్‌గేట్: కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఎమ్మెల్యే -
సహకార సంఘం పాలకవర్గం ఎన్నిక
నిర్మల్‌ఖిల్లా: లోకమాన్య పరస్పర సహాయ పరప తి, సహకార సంఘం లిమిటెడ్ నిర్మల్ జిల్లా పాలకవర్గ సభ్యులను ఆదివారం ఎన్నుకున్నారు. జిల్లాకేంద్రంలోని స్థానిక విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో రెండో వార్షిక మహాసభ సర్వసభ్య సమావే శం, అనంతరం ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. నూతన పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికై న ట్లు ఎన్నికల పరిశీలకులు ప్రకటించారు. చైర్మన్‌గా భూసారపు గంగాధర్, వైస్ చైర్మన్‌గా శివరాం వెంకటేశ్, జనరల్ సెక్రటరీగా సతీశ్, క్యాషియర్‌గా అన్నం వసుదేవరెడ్డి, జాయింట్ సెక్రటరీగా నరేందర్‌రెడ్డి, జాయింట్ ట్రెజరర్‌గా శ్రీనివాస్, డైరెక్టర్లుగా అనురాధ పంపట్వార్, ఓటారికారి విద్యాసాగర్, కుంచంవార్ మోరేశ్వర్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికా రిగా ఉప్పులూటి రవికుమార్ తెలిపారు. సలహా క మిటీ సభ్యులుగా నూకల విజయ్‌కుమార్, నార్లపు రం రవీందర్, మంచిరాల నాగభూషణంను ఎన్నుకున్నారు. ముఖ్య అతిథిగా తుమ్మల ప్రమోద్ చంద్రారెడ్డి, వక్తగా సహకార భారతి తెలంగాణ రాష్ట్ర క్రెడిట్ సెల్ ప్రముఖ్ బాబుచంద్ హాజరయ్యారు. -
శ్రమించారు.. సాధించారు
నిర్మల్‌ఖిల్లా: లక్ష్యం దిశగా శ్రమిస్తే స్వప్నం సాకారమవుతుంది. జిల్లా కేంద్రానికి చెందిన జసింత్ జో యల్ ఇందుకు నిదర్శనం. కరుణ–డేనియల్ దంపతుల పెద్ద కుమారుడు జసింత్ జోయల్ గ్రూప్–1 ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బీసీ ‘సీ’ కేటగిరీలో రాష్ట్రస్థాయి తొలి ర్యాంక్ కై వసం చేసుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఆసిఫాబాద్ డిప్యూటీ కలెక్టర్‌గా నియామక ఉత్తర్వులు అందుకున్నారు. జోయల్ ఎనిమిదో తరగతి వరకు స్థానిక సెయింట్ థామస్ పాఠశాలలో, 9–10 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడలోగల కేకేఆర్ గౌతం స్కూల్లో, ఇంటర్ హైదరాబాద్‌లోని నారాయణ కళాశాలలో, బీటెక్ తమిళనాడులోని వెల్లూరులో పూర్తి చేశారు. అనంతరం బీహెచ్ఈఎల్లో రెండేళ్ల పాటు ఉద్యోగం చేసి తర్వాత నాలుగేళ్లుగా సివిల్స్ కోసం సన్నద్ధమవుతున్నారు. నిత్యం 18గంటలకు పైగా పుస్తకాలతో కుస్తీపట్టి శ్రమించారు. ప్రిలిమ్స్, మెయిన్స్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచారు. దీంతో డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. ఇతని తల్లి కరుణ సారంగపూర్ మండలం ధని గ్రామ ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎంగా, తండ్రి డేనియల్ జిల్లాకేంద్రంలోని గురుకుల కళాశాల ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఐఏఎస్ సాధించడమే లక్ష్యంగా పురోగమిస్తున్నట్లు జోయల్ తెలిపారు. జోయల్‌ను స్థానికులు అభినందిస్తున్నారు. మూడేళ్ల కష్టం.. ఎంపీవో ఉద్యోగం -
ఆర్జీయూకేటీలో ఆయుధపూజ
బాసర: విజయదశమి వేడుకల్లో భాగంగా బాసర ఆర్జీయూకేటీలో వివిధ విభాగాల పరిశోధనలో శనివారం ఆయుధపూజ నిర్వహించారు. శాస్త్రోక్తంగా అర్చకులు కిశోర్ సరస్వతి, లక్ష్మి, మహాకాళి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి చిత్రపటాల ముందు ల్యాబ్ పరికరాలు, యంత్రాలపై పురోహితుడు పూజించి ఇచ్చిన అక్షతలను, జలాన్ని వాటిపై చల్లారు. ఇన్చార్జి వీసీ గోవర్ధన్ మాట్లాడుతూ ఆయుధపూజ అనేది వ్యవసాయ ఉపకారణాలు, యంత్రాలు, వాహనాలు, కంప్యూటర్లు వంటి జీవితంలో అంతర్భాగమైన పరికరాలు, సాధనాలను పూజించడానికి అంకితం చేయబడినదన్నారు. యూనివర్సిటీలో ఉన్న భారీ యంత్రాలు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయని, అందుకే శుభ్రం చేసి పూజ చేసినట్లు వెల్లడించారు. ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్ మాట్లాడుతూ సాధారణంగా ఆయుధపూజను నవమి నాడు జరుపుతారని, యూనివర్సిటీకి దసరా సెలవులు ప్రకటించినందున ముందస్తుగా నిర్వహించామని తెలిపారు. -
‘స్థానిక’ రిజర్వేషన్లు ఖరారు
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ఖరారుకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం లక్కీ డ్రా నిర్వహించారు. కలెక్టర్ అభిలాష అభినవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, జనరల్ రిజర్వేషన్లు ఖరారు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం పూర్తిస్థాయి పారదర్శకతతో రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టామన్నారు. జిల్లాలోని 18 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్లను 2011 జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ వాటాలను నిర్ణయించగా, బీసీ రిజర్వేషన్లను రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనల ప్రకారం కేటాయించామన్నారు. మొత్తం ప్రక్రియ వీడియో రికార్డింగ్ మధ్యన, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో చేపట్టామని తెలిపారు. ఈ లక్కీడ్రా కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్అహ్మద్, భైంసా సబ్‌కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, జెడ్పీ సీఈవో గోవింద్, డిప్యూటీ సీఈవో శంకర్ తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ పీఠం బీసీలదేజిల్లాపరిషత్ పీఠాల రిజర్వేషన్లను పంచాయతీరాజ్ రూరల్ ఎంపవర్మెంట్ శాఖ శనివారం విడుదల చేసింది. నిర్మల్ జెడ్పీ పీఠం ఈసారి బీసీలకే దక్కనుంది. బీసీ(పురుష/మహిళ)కు రిజర్వు చేస్తూ పంచాయతీరాజ్ రూరల్ ఎంపవర్మెంట్ డైరెక్టర్ అండ్ స్టేట్ ఎలక్షన్ అథారిటీ జి.శ్రీజన ఉత్తర్వులు జారీ చేశారు. 2019 నుంచి 2024 వరకు నిర్మల్ జెడ్పీ పీఠం జనరల్ మహిళకు కేటాయించారు. ఈసారీ బీసీలకు అవకాశం దక్కనుంది. -
బాసరలో కొనసాగుతున్న శరన్నవరాత్రి వేడుకలు
బాసర: బాసర శ్రీజ్ఞానసరస్వతీ ఆలయంలో శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం 6వ రోజు అమ్మవారు ‘కాత్యాయనీ దేవి’ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చా రు. నాలుగు భుజాలతో సింహ వాహిణియై ఎడమ చేతుల్లో ఖడ్గం/తాళపత్ర నిధి మరో చేతిలో పద్మం, కుడి చేతుల్లో అభయముద్ర వరదముద్ర కలిగి భక్తులను అనుగ్రహిస్తోంది. ఆలయ వైదికబృందం అ మ్మవారికి చతుషష్టి ఉపచార, మల్లెపుష్పార్చన పూ జలు నిర్వహించి రవ్వ కేసరిని నైవేద్యంగా నివేదించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. పిల్లలకు అక్షర శ్రీకారం చేయించారు. సాంస్కృతిక కార్యక్రమాలు... ఉత్సవాల్లో భాగంగా కోటి గాజుల మండపంలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. హైదరాబాద్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలతోపాటు మహారాష్ట్రలోని నాందేడ్, పర్బని జిల్లాల కళాకారులు పాల్గొంటున్నారు. అమైర అనే చిన్నారి దాదాపు గంటపాటు ప్రదర్శించిన అద్భుతమైన కూచిపూడి, భరతనాట్యం నృత్యాలు ఆకట్టుకున్నాయి. -
● ఎస్సీ జానకీ షర్మిల
జాతరకు పటిష్ట బందోబస్తు దిలావర్పూర్: అడెల్లి మహా పోచమ్మ (గంగనీళ్ల) జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల తెలిపారు. సాంగ్వి గ్రామంలోని పోచమ్మ ఆలయాన్ని శనివారం సందర్శించి పూజలు చేశారు. గోదావరి తీరాన్ని పరిశీలించారు. పోలీసులతో ప్రత్యేకంగా సమావేశమై సూచనలు చేశారు. ఆదివారం అమ్మవారి ఆభరణాలు అడెల్లి ఆలయానికి వెళ్లేమార్గంలో ఎలాంటి సమస్య రాకుండా చూడాలన్నారు. అమ్మవారి ఆభరణాలు ఎత్తుకునేందుకు పోలీసులు ప్రయత్నించవద్దని సూచించారు. ఏఎస్పీ రాజేశ్ మీనా, సోన్ సీఐ గోర్ధన్రెడ్డి, నిర్మల్ రూరల్ సీఐ కృష్ణ, దిలావర్పూర్ ఎస్సై రవీందర్, ఎస్సైలు, పోలీసులు పాల్గొన్నారు. -
లైటింగ్‌తో కొత్తశోభ
సారంగపూర్: స్వర్ణ ప్రాజెక్టు వద్ద లైటింగ్ పునరుద్ధరణతో కొత్తశోభ సంతరించుకుందని నిర్మల్ ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. స్వర్ణ ప్రాజెక్టుపై రూ.32.70 లక్షల వ్యయంతో చేపట్టిన లైటింగ్ పునరుద్ధరణ పనులను శనివారం ప్రారంభించారు. గతంలో ప్రాజెక్టు పూర్తిగా నిండి గేట్లు ఎత్తిన క్రమంలో జౌళి గ్రామ ప్రజలు తమ గ్రామానికి రాత్రివేళ వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారన్నారు. కేవలం ప్రాజెక్టు వద్ద మాత్రమే లైట్లు ఉండేవని ఆనకట్ట పొడవునా, ఆనకట్టు కిందగల జౌళి రహదారి పక్కన మొత్తం చీకటి అలుముకునేదన్నారు. అందుకే లైట్ల పునరుద్ధరణ పనులను చేపట్టినట్లు తెలిపారు. అనంతరం ప్రస్తుతం ప్రాజెక్టు పరిస్థితి, నీటి విడుదల విషయంలో గేట్ల పరిస్థితిని గురించి ఈఈ అనిల్, ఎస్ఈ శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు ద్వారా తాగు, సాగునీటి వివరాలను సైతం అడిగి తెలుసుకున్నారు. ఇంకా వర్షాల ప్రభావం ఉండడంతో ఎప్పటికప్పుడు పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ గేట్ల ద్వారా నీటిని విడుదల చేయాలని వారికి సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సంధ్యారాణి, బీజేపీ నాయకులు రావులరాంనాథ్, సత్యనారాయణగౌడ్, నాయకులు మంతెన గంగారెడ్డి, నరేశ్, చంద్రప్రకాశ్‌గౌడ్, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు చేరువయ్యేలా కమ్యూనిటీ బతుకమ్మ
● ఏఎస్పీ రాజేశ్ మీనా ఖానాపూర్: ప్రజలకు మరింత చేరువయ్యేందుకే ఎస్పీ జానకీషర్మిల ఆధ్వర్యంలో కమ్యూనిటీ బతుకమ్మ కార్యక్రమం చేపట్టామని ఏఎస్పీ రాజేశ్ మీనా అన్నారు. పట్టణంలోని శ్రీరాంనగర్ దుర్గామాత మండపం వద్ద శనివారం కమ్యూనిటీ బతుకమ్మ కార్యక్రమంలో మాట్లాడారు. కమ్యూనిటీ బతుకమ్మ కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోవడంతోపాటు మహిళల రక్షణపై పోలీసుశాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. పోక్సో చట్టంతోపాటు ర్యాష్ డ్రైవింగ్, మైనర్డ్రైవింగ్, లైగింక దాడుల నుంచి రక్షణ, సైబర్ నేరాల నియంత్రణ తదితర అంశాలను విషయాలు తెలియజేశారు. అంతకముందు దుర్గామాత మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళల బతుకమ్మ ఆటను వీక్షించారు. కార్యక్రమంలో సీఐ అజయ్, ఎస్సైలు రాహుల్ గైక్వాడ్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
పండుగ చేసుకునేదెలా?
లక్ష్మణచాంద: బతుకమ్మ, దసరా తెలంగాణ ప్రజల కు పెద్ద పండుగ. ఈ పండుగను అందరూ ఘనంగా జరుపుకుంటారు. అయితే పల్లె ప్రజలకు ఏడాది పొడుగునా ఉపాధి కల్పించి, వారు చేపట్టే పనుల ను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేస్తూ, సకా లంలో వేతనాలు అందేలా చేయడంలో వివిధ స్థా యిల సిబ్బంది నిరంతరం విధులు నిర్వహిస్తున్నా రు. అయితే, సిబ్బందికి మాత్రం రెండు నెలలుగా వేతనాలు అందకపోవడంతో పండుగ వేళ ఇబ్బంది పడుతున్నారు. వివిధ స్థాయిలలో పని చేస్తున్న క్షేత్ర సహాయకుల(ఎఫ్‌ఏలు)కు జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన వేతనాలు ఇంకా అందలేదు. టీఏలు, టీసీలు, ఏపీవోలకు ఆగస్టు నెలకు సంబంధించిన వేతనం రావాల్సి ఉంది. మూడవ నెల చివరికి వచ్చినా నెలనెలా రావాల్సిన వేతనాలు అందకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుగకు పస్తులేనా? హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో దసరా ఒకటి. దసరా పండుగ వచ్చేసరికి ధనిక, పేద, మధ్యతరగతి అనే తేడా లేకుండా, ఎవరి ఆర్థిక స్థోమతకు తగినట్లుగా కుటుంబ సభ్యులకు కొత్త బట్టలు కొనుగోలు చేసుకుంటారు. కానీ, ఉపాధి హామీ పథకంలోని సిబ్బందికి వేతనాలు రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో 373 మంది సిబ్బంది జిల్లాలోని 18 మండలాల పరిధిలో జాతీయ గ్రామీ ణ ఉపాధి హామీ పథకంలో 12 మంది ఏపీవోలు, 5 మంది ఈసీలు, 38 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, 72 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, 207 మంది క్షేత్ర సహాయకులు, 18 మంది ఆఫీస్ సబార్డినేట్లు, 21 మంది డీఆర్డీఏ కార్యాలయ సిబ్బంది ఇలా మొత్తం 373 మంది విధులు నిర్వహిస్తున్నారు. పంచాయతీ కార్మికులదీ ఇదే పరిస్థితి.. గ్రామాలను స్వచ్ఛంగా ఉంచడంలో పంచాయతీ కార్మికుల పాత్ర వెలకట్టలేనిది. జిల్లాలో పని చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా రెండు నెలలుగా వేతనాలు రావడం లేదు. జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన వేతనాలు ఇప్పటి వరకు రాలేదని, దీంతో దసరా పండుగను ఎలా జరుపుకోవాలని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో 400 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 1,520 మంది కార్మికులు పని చేస్తున్నారు. వేతనాలు రాకపోతే పండుగకు పస్తులు ఉండాల్సి వస్తుందని కార్మికులు అంటున్నారు. ప్రభుత్వం స్పందించి వేతనాలు విడుదల చేయాలని పంచాయతీ కార్మికులు కోరుతున్నారు. ప్రభుత్వానికి నివేదించాం జిల్లాలోని 400 గ్రామ పంచాయతీల కార్మికులకు జూలై, ఆగస్టు నెలల వేతనాల కోసం ఇది వరకే ప్రభుత్వంకు నివేధించాం. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే ఖాతాల్లో జమ చేస్తాం. – శ్రీనివాస్, డీపీవో, నిర్మల్ ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది ఉపాధి హామీ సిబ్బంది వేతనాలు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. ప్రభుత్వం విడుదల చేయగానే వారివారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. – నాగవర్ధన్, ఏపీడీ ఉపాధిహామీ పథకం -
వేతనాల కోసం లేఖలు
నిర్మల్‌ఖిల్లా: డిగ్రీ కళాశాలల్లో అతిథి అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్న తమకు ప్రతినెలా వేతనాలు ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీరియడ్ల వారీగా ప్రతీనెల రావాల్సిన కనీస వేతనం రూ.28 వేలు సైతం సమయానికి చెల్లించలేకపోవడంతో పండగలు జరుపుకునే పరిస్థితి లేకుండా పోయిందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అతిథి అధ్యాపకులు వేతనాలు ఇప్పించాలని సీఎం రేవంత్‌రెడ్డికి లేఖలు రాశారు. మూడు నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. 12 నెలల కాలానికి వేతనాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన తపాలా కార్యాలయంలో లేఖలు రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించారు. అతిథి అధ్యాపకుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డాక్టర్ సుధాకర్, జిల్లా అధ్యక్షుడు సురేందర్, జిల్లా కార్యవర్గపభ్యులు పాల్గొన్నారు. -
లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం
నిర్మల్‌చైన్‌గేట్/ఖానాపూర్: కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు జిల్లాలో శనివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లో పలువురు అధికారులు కొండా లక్ష్మణ్‌బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్రోద్యమం, నిజాం వ్యతిరేక ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. నిర్మల్ పట్టణంలోని కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహానికి ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన గొప్ప మహనీయుడని కొనియాడారు. ఖానాపూర్ పట్టణంలోని తిమ్మాపూర్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కొండా లక్ష్మణ్‌బాపూజీ జయంతి వేడుకల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పాల్గొని నివాళులర్పించారు.