నిర్మల్‌చైన్‌గేట్: ప్రజలకు అవసరమైన మేరకు గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గ్యాస్ సరఫరా విషయంలో ఎ లాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సి న అవసరం లేదని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల సరఫరా పరిస్థితి, రైతులకు సాగునీరు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గ్యాస్ సిలిండర్ల సరఫరా సజావుగా కొనసాగుతోందని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సరిపడా నిల్వలు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని తెలిపారు. గ్యాస్ సిలిండర్ల లభ్యతపై వ్యాప్తి చెందుతున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు.
జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదు
వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ అభిలాష అభినవ్ కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి పాల్గొన్నారు. సమావేశం అనంతరం అధికారులతో మాట్లాడిన ఆమె జిల్లాలో ఎక్కడా గ్యాస్ సిలిండర్ల కొరత లేదని స్పష్టం చేశారు. జిల్లా ప్రజల అవసరాలకు సరిపడా గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని తెలి పారు. సరఫరా వ్యవస్థను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల గృహావసరాల కోసం అవసరమైన మేరకు గ్యాస్ సిలిండర్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలి పారు. గ్యాస్ సిలిండర్ల కొరతపై వస్తున్న అసత్య వా ర్తలను నమ్మవద్దని, ప్రజలు అనవసరంగా ఆందోళ న చెందకూడదని పేర్కొన్నారు. జిల్లాలో రైతుల పంటలకు అవసరమైన సాగునీరు కూడా సమృద్ధిగా అందుబాటులో ఉందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగునీరు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్పీ జానకీ షర్మిల, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిశోర్‌కుమార్, సీపీవో జీవరత్నం, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ సుఽ దాకర్, వ్యవసాయాధికారి అంజిప్రసాద్, డీఈవో భోజన్న, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


