breaking news
Nirmal District News
-
ప్రజాపాలనతోనే ప్రగతి
నిర్మల్రైళ్ల ఆలస్యానికి చెక్..! రైళ్ల ఆలస్యాన్ని నివారించేందుకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. గోదావరిలో పెరుగుతున్న వరద ఎగువన కురుస్తున్న వర్షాలకు బాసర వద్ద గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నదీతీరంలోని స్నానఘట్టాల వద్దకు భక్తులను అనుమతించడం లేదు. జాతీయస్థాయి అర్చరీ పోటీలకు ఎంపికకడెం: మండలంలోని గంగాపూర్ గ్రామానికి చెందిన టేకం సునీల్ జా తీయస్థాయి అర్చరీ పోటీలకు ఎంపికై నట్లు కోచ్ అంబేడ్కర్ తెలిపారు. నిర్మల్‌లోని ప్రభుత్వ కళా శాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతు న్న సునీల్ బుధవారం వరంగల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చడంతో అక్టోబర్ 29న పంజాబ్ రాష్ట్రంలోని భటిండా నగరంలో జరిగే జాతీయస్థాయి అర్చరీ పోటీలకు ఎంపికై నట్లు ఆయన పేర్కొన్నారు. నిర్మల్: తెలంగాణ ప్రాంత చరిత్రలో 1948 సెప్టెంబర్ 17కు విశిష్టత ఉందని, రాచరికానికి ఘోరీకట్టి.. ప్రజాపాలనకు హారతిపట్టిన రోజని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ ప్రాంగణంలో బుధవారం ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాజయ్య ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవి ష్కరించి జాతీయ గీతం, తెలంగాణ గేయాలను ఆ లపించారు. ఈ సందర్భంగా చైర్మన్ ప్రసంగపాఠాన్ని చదివి వినిపించారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో పథకాలతో ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతోందన్నారు. ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామన్నారు. జిల్లాలో ఈ పథకం ద్వారా లక్షా 28 వేలమందికి లబ్ధి చేకూరుతోందన్నారు. పేదలకు ఉచిత సన్నబియ్యం అందేలా జిల్లాలో 35,769 కొత్త రేషన్ కార్డులను అందించామన్నారు. సెప్టెంబర్‌లో 4,746 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం అందించామని చెప్పారు. పేదప్రజల ఆరోగ్యానికి భరోసాగా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యచికిత్సల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచగా జిల్లాలో రూ.57కోట్ల 80 లక్షల లబ్ధి చేకూరిందన్నారు. గృహజ్యోతితో పేదల ఇంట 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అంది స్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా జిల్లాకు 8,852 ఇళ్లను మంజూరు చేయగా ఇప్పటి వరకు 5,265 ఇళ్లు నిర్మాణదశలో ఉన్నాయన్నారు. రాష్ట్రంలోనే మొదటి స్థానం.. బ్యాంకు లింకేజీ ఎన్పీఏ రికవరీలో రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించామని సిరిసిల్ల రాజయ్య పేర్కొన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 2,058 మహిళాసంఘాలకు రూ.240 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. ఈ ఏడాది సీ్త్రనిధి రుణాల కింద ఇప్పటి వరకు రూ.36 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్‌లో గణపతి మహిళాసంఘం నిర్వహిస్తున్న సమీకృత వ్యవసాయ విధానానికి పెప్సికో సంస్థ రివల్యూషనరీ అవార్డు అందించడం ప్రశంసనీయమన్నారు. చేపల ఉత్పత్తిలో మత్స్య సలహాదారు అవార్డును దక్కించుకోవడం జిల్లాకు గర్వకారణమన్నారు. నీతిఆయోగ్ ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమంలో భాగంగా పెంబి ఆస్పిరేషన్ బ్లాక్ జాతీయస్థాయిలోనే ఉత్తమ పనితీరుతో నాలుగోస్థానంలో నిలువడం అభినందనీయమన్నారు. వినూత్నంగా పోలీసుశాఖ.. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా పోలీసుశాఖ వినూత్నంగా పనిచేస్తోందని అభినందించారు. నారీశక్తి కార్యక్రమం పేరిట మహిళా పోలీసులతో గస్తీతనిఖీలు చేపడుతున్నామన్నారు. విపత్కర సమయాల్లో అత్యవసరంగా సహాయాన్ని అందించేందుకు శివంగి టీమ్ ముందంజలో ఉంటుందన్నారు. పోలీసుఅక్క కార్యక్రమం పేరిట బాలికల వసతిగృహాల్లో మహిళాపోలీసులు రాత్రివేళల్లో బసచేయడం, వారి సమస్యలను తెలుసుకుంటూ మనోధైర్యం నింపుతున్నారన్నారు. గాంజాగస్తీ పేరిట గంజాయిని అరికడుతూ మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చేందుకు కృషిచేయడం అభినందనీయమన్నారు. జిల్లాను అన్నిరంగాల్లో ప్రగతిపథంలో తీసుకెళ్లేందుకు అహర్నిశలు అంకితభావంతో సమష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అనంతరం భారీ వర్షాల కారణంగా పశువులను కోల్పోయిన బాధితులకు ఆర్థిక సహాయ పత్రాలను అందజేశారు. స్వచ్ఛతాహి సేవ 2025లో భాగంగా నిర్వహిస్తున్న ‘స్వచ్ఛోత్సవ్–పక్షోత్సవ్’ కార్యక్రమానికి సంబంధించిన గోడ ప్రతులను కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షర్మిలతో కలిసి ఆవిష్కరించారు. స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్‌కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఏఎస్పీ రాజేశ్ మీనా, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సందేశంలో చోటివ్వరా..!తెలంగాణ ప్రాంతం విముక్తి పొందిన రోజున నిర్మల్ గడ్డపై పోరాడిన, ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులకు, స్వాతంత్య్ర సమరయోధులకు సరైన గుర్తింపుదక్కక పోవడంపై జిల్లావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా ముఖ్యఅతిథి సందేశంలో వెయ్యిఉరులమర్రి ఘటనతోపాటు జైళ్లల్లో మగ్గిన సమరయోధుల గురించి ప్రస్తావించకపోవడంపై మండిపడ్డారు.రైతులకు భరోసాగా.. ప్రజాప్రభుత్వం రైతులకు భరోసాగా వానాకాలం పంట పెట్టుబడిగా లక్షా 85వేల 500మందికి రూ.268 కోట్ల 70లక్షలను ఖాతాల్లో జమచేసినట్లు తెలిపారు. 72,500మంది రైతులకు రూ.658 కోట్ల రుణమాఫీ చేసినట్లు చెప్పారు. ఇటీవల భారీ వర్షాలకు జిల్లాలో 19,530 ఎకరాల్లో పంటదెబ్బతిందని, బాధిత రైతులకు ప్రభుత్వం సహాయం అందిస్తుందని భరోసా ఇచ్చారు. కడెం ప్రాజెక్టులో గల్లంతైన వ్యక్తి కుటుంబానికి రూ.5లక్షలు అందించామన్నారు. లక్ష్మణచాంద మండలం మునిపెల్లిలో గోదావరి వరదలో చిక్కుకున్న పశువుల కాపరిని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జిల్లా రెవెన్యూ, పోలీసు అధికారులు రక్షించడంపై కలెక్టర్, ఎస్పీలను అభినందించారు.రైతులు అధైర్యపడవద్దు సోన్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని కడా్త్ల్ సమీపంలో తెగిపోయిన పెద్దచెరువును ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి జరిగిన పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారులతో సర్వే చేయించి పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. యుద్ధ ప్రాతిపదికన చెరువుకు మరమ్మతులు చేపడుతున్నట్లు వివరించారు. ప్రజాపాలనకు హారతిపట్టిన రోజు -
యూరియా కన్నా.. ‘నానో’ మిన్న
లక్ష్మణచాంద: జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. దీంతో రసాయన ఎరువులైన యూరియా, డీఏపీకి కొరత ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ అధికారులు నానో యూరియా, నానో డీఏపీ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇవి ఆర్థికంగా సమర్థవంతమైనవి మాత్రమే కాకుండా పంటలకు, నేల సారానికి కూడా ఉపయోగకరమైనవని పేర్కొంటున్నారు. ఎరువుల ధరల భారం.. జిల్లా వ్యాప్తంగా యూరియా, డీఏపీ ఎరువులకు డిమాండ్ పెరగడంతో కొందరు వ్యాపారులు ప్రభుత్వ సరఫరా ఎరువులను నిల్వ చేసి, యూరియా సంచి ధరను రూ.266 నుంచి రూ.300–320కి, డీఏపీ సంచిని రూ.1350కి అమ్ముతున్నారు. ఈ ధరల పెంపు రైతులకు భారంగా మారాయి. నానో ఎరువులు.. వ్యవసాయ అధికారులు నానో యూరియా, నానో డీఏపీ వినియోగాన్ని సిఫారసు చేస్తున్నారు. అరలీటరు నానో యూరియా ద్రవం రూ.200–225కి, నానో డీఏపీ రూ.600కి లభిస్తుంది, ఇవి సంప్రదాయ ఎరువులతో పోలిస్తే ఆర్థికంగా లాభదాయకం. అంతేకాక, 20 నానో యూరియా సీసాలు కొనుగోలు చేసిన రైతుకు రూ.2 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తారు, అయితే రసీదు తీసుకోవడం తప్పనిసరి. లాభాలు నానో ఎరువులు సంప్రదాయ రసాయన ఎరువుల కంటే అనేక ప్రయోజనాలను అందిస్తాయి. -
ఉపాధ్యాయులు మార్గదర్శకులుగా నిలవాలి
నిర్మల్‌రూరల్: ఉపాధ్యాయులు భవిష్యత్ తరాలకు మార్గదర్శకులుగా నిలవాలని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సిటీ కన్వెన్షన్ హాల్లో బుధవారం డీఈవో భోజన్న అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువులపై ఉందన్నారు. ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీ, 5 డీఏల గురించి అసెంబ్లీలో మాట్లాడుతానన్నారు. జిల్లాను విద్యారంగంలో మరింత ముందుకు తీసుకెళ్లాలని ఉపాధ్యాయులకు సూచించారు. కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ గురువులు ఆరాధ్య దైవాలని, దేశ భవిష్యత్ తీర్చిదిద్దే మార్గదర్శకులని అన్నారు. గురువులు నేర్పిన విద్యతోనే తాను ఈ స్థాయికి ఎదిగానన్నారు. ఈ విద్యా సంవత్సరం పదోతరగతిలో 10 జీపీఏ సాధించిన విద్యార్థి, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తానని ప్రకటించారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమయసారిణి తప్పకుండా పాటించాలన్నారు. అనంతరం జిల్లాలో ఎంపికై న 110 మంది ఉత్తమ ఉపాధ్యాయులను పూలమాల, శాలువాలతో సత్కరించి మెమొంటో అందజేశారు. అంతకుముందు పలు పాఠశాలల విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వెల్మల్ బొప్పారం ఉన్నత పాఠశాల విద్యార్థులు రచించిన అంకురాలు రెండు కథల సంపుటిని కలెక్టర్, ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంఈవోలు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పోలీస్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో బుధవారం ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ జానకీ షర్మిల జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆమె ప్రజా పాలన ప్రాముఖ్యత పారదర్శక పరిపాలన ద్వారా ప్రజలకు అందే లాభాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రాజేశ్ మీనా, ఏవో యూనస్ ఆలీ, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.ఆర్జీయూకేటీలో..బాసర: బాసర ఆర్జీయూకేటీలో ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ డాక్టర్ రాజేశ్, డీన్లు చంద్రశేఖర్, విఠల్, మహేశ్, పీడీ శ్యాంబాబు, పాల్గొన్నారు. -
త్యాగధనుల పోరాటంతో తెలంగాణకు విమోచనం
భైంసా: త్యాగధనుల పోరాటంతోనే తెలంగాణకు విమోచనం కలిగిందని ఎమ్మెల్యే రామరావ్ పటేల్ అన్నారు. బుధవారం భైంసా పట్టణంలోని ఎస్ఎస్ జిన్నింగ్ మిల్లులో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిజాం పాలననుంచి విముక్తి కల్పించడానికి కుమురంభీం, రాంజీగోండు లాంటి ఎందరో పోరాట యోధులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ తాడేవార్ సాయినాథ్, మున్సిపల్ మాజీ చైర్మన్ బి. గంగాధర్, నాయకులు రావుల రాము, సుష్మారెడ్డి, గాలి రవి, వడ్నపు శ్రీనివాస్, గౌతం పింగ్లే, తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ హయాంలోనే సంక్షేమ పథకాలు భైంసా: కేంద్ర ప్రభుత్వ హయాంలో పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా భైంసాలోని ఎస్ఎస్ జిన్నింగ్ మిల్లులో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. భారత కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయుడు ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సేవా పక్వాడ్ జిల్లా కో కన్వీనర్ చిన్నారెడ్డి, నాయకులు రావుల పోశెట్టి, మల్లేశ్, సొలంకి భీమ్రావు, పండిత్ రావు, దిలీప్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు. -
‘యాత్రాదానం’ విజయవంతం చేయాలి
నిర్మల్‌టౌన్: ఆర్టీసీ చేపట్టిన యాత్రాదానం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కరీంనగర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలోమాన్ అన్నా రు. బుధవారం నిర్మల్ ఆర్టీసీ డిపోను సందర్శించి పలు రికార్డులను తనిఖీ చేశారు. బస్టాండ్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు, ఎన్ఆర్ఐలు, దాతలు, నాయకులు పెద్ద మనసుతో ఆలోచించి పేద విద్యార్థులను, దివ్యాంగులను యాత్రలకు తీసుకెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను బుక్ చేయించి ఉదారతను చాటుకోవాలని సూచించారు. అనంతరం డిపో ఆవరణలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ రీజియన్ డిప్యూటీ ఆర్ఎం శ్రీహర్ష, నిర్మల్ డిపో మేనేజర్ పండరి, సహాయ మేనేజర్లు దేవపాల, నవీన్ కుమార్, ఉద్యోగులు పాల్గొన్నారు. -
పోరాట వారసత్వం కమ్యూనిస్టులదే
నిర్మల్‌టౌన్: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసత్వం కమ్యూనిస్టులదేనని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఉడుత రవీందర్ అన్నారు. బుధవారం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం రాజులు, భూస్వాములు, రజాకార్ల అత్యాచారాలు, దాడులకు వ్యతిరేకంగా రైతులు, కూలీలు, సామాన్య ప్రజానీకం చేసిన పో రాటమే తెలంగాణ సాయుధ రైతాంగ పోరా టం అన్నారు. కమ్యూనిస్టులు చేసిన పోరాటం ఫలితంగానే దొరలు, దేశ్‌ముఖ్‌లు గడీలు వది లి హైదరాబాద్ పారిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గౌతమ్ కృష్ణ, కార్యదర్శి వర్గ సభ్యులు సురేష్, సుజాత, జిల్లా కమిటీ సభ్యులు శంభు, గంగామణి, ముత్యం, తిరుపతి, నారాయణ, సంతోష్ పాల్గొన్నారు. -
తల్లీబిడ్డా.. ఆరోగ్యంగా ఉండేలా..
నిర్మల్‌చైన్‌గేట్: మాతా–శిశు మరణాల నివారణ, పోషకాహార స్థాయి పెంపొందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ‘పోషణ మాసం’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సెప్టెంబర్ 17(బుధవారం) నుంచి అక్టోబర్ 16 వరకు నిర్వహించే ఈ కార్యక్రమం గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతోపాటు అవగాహన కల్పించడంపై దృష్టి సారిస్తుంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేసే ఆహారం, వైద్య పరీక్షలు, విద్యా కార్యక్రమాలతో ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. పౌష్టికాహార పంపిణీ.. అంగన్వాడీ కేంద్రాలు గర్భిణులు, బాలింతలు, మూడేళ్లలోపు చిన్నారులకు పాలు, గుడ్లు, బాలామృతం వంటి పోషకాహార పదార్థాలను అందిస్తున్నాయి. ఐదేళ్లలోపు పిల్లలకు ప్రాథమిక విద్యతోపాటు సమతుల మధ్యాహ్న భోజనం, నెలకు 30 గుడ్లు, రోజూ 200 మిల్లీలీటర్ల పాలు అందజేస్తున్నాయి. అంతేకాక, పిల్లల ఎత్తు, బరువు కొలిచి, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఆరోగ్య రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. పోషకాహార లోపం.. ప్రస్తుతం చాలా మంది తల్లులు, పిల్లలు రక్తహీనత, పోషకాహార లోపాలతో బాధపడుతున్నారు. తక్కు వ బరువుతో శిశువులు జన్మించడం, పెరుగుదల ఆ టంకాలు, ఆరోగ్య సమస్యలు సర్వసాధారణంగా మారాయి. ఈ సవాళ్లను అధిగమించేందుకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ‘పోషణ్ అభియాన్’ కార్యక్రమం చేపడుతోంది. ఆరేళ్లలోపు పిల్లలు, గర్భిణులకు స మతుల ఆహారం, ఆరోగ్యకరమైన వాతావరణం అ ందించడం ద్వారా రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తోంది. ఇంటింటా అవగాహన.. అంగన్వాడీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోషకాహారం, ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆహార ఎంపిక, బరువు నియంత్రణ, ఆరోగ్య సంరక్షణపై సలహాలు అందిస్తూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు నిర్వహించే ఈ మాసోత్సవంలో జిల్లా సీ్త్ర–శిశు సంక్షేమ శాఖ అధికారి ఫైజాన్ అహ్మద్ ఆధ్వర్యంలో సమావేశాలు, కార్యక్రమాలు జరుగనున్నాయి. పోషణ మాసం కార్యక్రమాలు.. జిల్లా వివరాలు.. మొత్తం మండలాలు 18ఐసీడీఎస్ క్లస్టర్లు 4సెక్టార్లు 37అంగన్వాడీ కేంద్రాలు 926 -
నిర్మల్
‘కడెం’ ఒక గేటు ఎత్తివేత కడెం: కడెం ప్రాజెక్టుకు మంగళవారం 8,767 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. అధికారులు ఒక గేటు ఎత్తి 6,364 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. వీరు ఎవరో తెలుసా..!? ఈ ఫొటో ఎప్పటిదో, ఇందులో ఉన్నవారెవరో తెలుసా..!? కనీసం వీరిని గుర్తుపట్టగలరా..!? వీరు చేసినదేంటో, ఎందుకు వీరిని గుర్తుపెట్టుకోవాలో చెప్పగలరా..!? చెప్పలేరు. ఎందుకంటే.. వీరి గురించి ఎక్కడా రాసింది లేదు, పాఠాలుగా చెప్పిందీ లేదు. వీరంతా నిర్మల్ ప్రాంతంలో స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధుల్లో కొందరు. నెలలతరబడి జైళ్లల్లో మగ్గిన పోరుబిడ్డలు. ఈ చెట్టు గురించి చెప్పగలరా..!? బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణతల్లి విగ్రహ రూపశిల్పి, నిర్మల్‌వాసి బైరోజు వెంకటరమణాచారి(బీవీఆర్.చారి) గీసిన చిత్రమిది. ఈ చిత్రంలో ఉన్న చెట్టు.. దానికి వేలాడుతున్న వెయ్యిమంది మృతదేహాల సంగతి ఎంతమందికి తెలుసు..!? ఇలాంటి దారుణ మారణ ఘటన ఏంటన్న విషయం ఈ తరానికి ఎవరైనా చెప్పారా..? ఏ పుస్తకంలోనైనా, ఏ పాఠంలోనైనా ఉందా..!? లేదు. తెలంగాణలోనే కాదు, దేశచరిత్రలోనే గుర్తుండిపోయేలా చెప్పాల్సిన విషయమిది. ముందుతరాలకు అందించాల్సిన పాఠమిది. రాంజీగోండు సహా వెయ్యిమంది అమరుల ప్రాణత్యాగాలకు ప్రతిరూపమిది. నిర్మల్గడ్డను స్వాతంత్య్రపోరులో నిలిపిన ఘట్టమిది. -
మహిళల భద్రత, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి
నిర్మల్ రూరల్: మహిళల భద్రత, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. ఆన్లైన్ బెట్టింగ్స్, బెట్టింగ్ యాప్స్, సైబర్ క్రైంపై కఠినంగా వ్యవహరించాలన్నారు. పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణ, అక్రమ రవాణా, పోలీస్‌స్టేషన్ స్థాయిలో నేరాల నిరోధక చర్యలు కఠినంగా అమలు చేయాలన్నారు. పరిశోధన స్థాయిలో కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో నేరాల సంఖ్య తగ్గించేందుకు.. నేరాలకు పాల్పడే అవకాశం ఉన్న రౌడీషీటర్లను ముందస్తుగా గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. సైబర్ మోసాలు, డ్రగ్ దుర్వినియోగం, ట్రాఫిక్ రూల్స్‌పై ప్రజలు, విద్యాసంస్థల్లో అవగాహన కల్పించి అప్రమత్తం చేయాలన్నారు. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి, అక్కడ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఫేక్ నంబర్ ప్లేట్లపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షలో భైంసా, నిర్మల్ ఏఎస్పీలు అవినాష్‌కుమార్, రాజేశ్‌మీనా, సీఐలు, ఎస్‌హెచ్‌వోలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
భైంసా మున్సిపాలిటీలో వసూళ్లపై విచారణ..!
భైంసాటౌన్: తమకు వేతనాలు పెంచుతామని చెప్పి సిబ్బంది డబ్బులు వసూలు చేశారని భైంసా మున్సిపాలిటీ ఔట్సోర్సింగ్ పారిశుద్ధ్య కా ర్మికులు ఇటీవల ఆరోపించారు. అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇతర మున్సిపాలిటీల్లో అధిక వేతనం ఇస్తున్నా.. తమకు మాత్రం తక్కువ వేతనం చెల్లిస్తున్నారని, నాలుగు నెలలుగా పీఎఫ్ డబ్బులు జమ చేయడం లేదని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్పందించిన కలెక్టర్ డబ్బుల వసూలు పై విచారణకు సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ అధ్యక్షతన ముగ్గురు జిల్లాస్థాయి అధికారులతో కమిటీ వేశారు. భైంసా మున్సిప ల్ కార్యాలయంలో మంగళవారం కమిటీ విచా రణ చేపట్టింది. పారిశుద్ధ్య కార్మికులు, శానిటరీ ఇన్స్పెక్టర్ అనీస్, మున్సిపల్ కమిషనర్ రాజేశ్‌కుమార్ విడివిడిగా మాట్లాడి వివరాలు సేకరించారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులు, ఔట్సోర్సింగ్ కార్మికులు, వారికి చెల్లిస్తున్న వేతనాలు, పీఎఫ్, ఔట్సోర్సింగ్ ఏజెన్సీల వివరాలు, 19 మంది హెల్త్ వర్కర్ల వివరాలు అడిగినట్లు తెలిసింది. ఉదయం 11 గంటలకు విచారణ ప్రారంభించిన అధికారులు దాదాపు మూడు గంటలపాటు వివరాలు సేకరించారు. కలెక్టర్‌కు నివేదిక ఇవ్వనున్నారు. -
● అమరులకు దక్కని గుర్తింపు ● పాఠాల్లో ‘వెయ్యిఉరులమర్రి’కి దక్కని చోటు.. ● హామీగానే రాంజీ మ్యూజియం, స్మారక స్తూపం ● పట్టని పాలకులు, పట్టించుకోని అధికారులు
నిర్మల్: నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక సమరంలో జిల్లా సమరయోధులు అసమాన ధైర్యంతో పోరాడారు. 1857లో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో రాంజీ సారథ్యంలో వెయ్యిమంది అమరులయ్యారు. ఇక నైజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా 1948 వరకు అలుపెరగని పోరాటం సాగించిన వీరులు, వారి త్యాగాలు చరిత్రలో సరైన గుర్తింపు పొందలేదు. ఇతర జిల్లాలు తమ చరిత్రను గౌరవిస్తుండగా, నిర్మల్ గడ్డపై జరిగిన ‘వెయ్యి ఉరుల మర్రి’ దారుణం, సమరయోధుల సాహసాలు విస్మరణకు గురవుతున్నాయి. ప్రతీ సెప్టెంబర్ 17న విమోచన, విలీనం, విద్రోహం, ప్రజాపాలన పేరుతో పార్టీలు, నేతలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏ పేరు పెట్టుకున్నా.. ఏమున్నది గర్వకారణం అన్న భావన జిల్లావాసుల్లో నెలకొంది. ఈ గడ్డకు తగిన గౌరవం, గుర్తింపు తీసుకురావడంలో అటు పాలకులు, ఇటు అధికారులు విఫలమవుతున్నారన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణత్యాగాలకు గుర్తింపేది..!? 1857–58లో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో నిర్మల్‌లో రాంజీ నేతృత్వంలో వెయ్యి మంది యోధులు ప్రాణత్యాగం చేశారు. వీరి స్మృతిగా జిల్లా కేంద్రంలో నెలకొల్పిన విగ్రహాలు కేవలం చిన్న పరిమాణంలో ఉండటం వారి గొప్పతనానికి న్యాయం చేయలేదు. ఎల్లపల్లి దారిలో ‘వెయ్యి ఉరుల మర్రి’ స్థలంలోని అమరుల స్మారక స్తూపం దుస్థితిలో ఉంది. రక్షణ ఫెన్సింగ్ లేకపోవడంతో ఈ ప్రాంతం తాగుబోతుల అడ్డాగా మారింది. స్మారక స్తూపం వద్ద నాటిన మొక్కలు కూడా సంరక్షణ లేక ఎండిపోయాయి. ఎన్నిసార్లు అక్కడ మర్రిమొక్కలను నాటినా.. కనీసం కాపాడేవాళ్లు లేరు. అమరధామం నిర్మాణం, మ్యూ జియం ఏర్పాటు వంటి హామీలు అమలుకు నోచుకోవడం లేదు. పాఠ్యపుస్తకాల్లో కూడా ఈ వీరుల త్యాగాలకు తగిన స్థానం కల్పించకపోవడం మరింత ఆవేదన కలిగిస్తోంది. సమరయోధులనూ మరిచారు.. 1947–48లో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన సమరయోధులను కూడా విస్మరిస్తున్నారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, తెలంగాణ 1948 సెప్టెంబర్ 17 వరకు నిజాం ఆధిపత్యంలోనే ఉంది. ఈ కాలంలో నిర్మల్ పంచాయతీ సమితి పరిధిలో గోపిడి గంగారెడ్డి, గణపతి, బాపూరావు, బోరేగాం గజన్న, లాలు పటేల్, ఏ.రాజన్న, పోశెట్టి, గంగాధర్, శివన్న, గంగారామ్, విఠల్‌రావు, జమునాలాల్, వెంకోబరావు, గాంధారి చిన్న నర్సింహులు, లింగారెడ్డి, సుందర్రాజ్, ముడుసు ఎల్లయ్య, అర్గుల గంగాధర్‌గుప్తా, హన్మంత్‌రావు ఠాకూర్ వంటి సమరయోధులు నిర్భయంగా పోరాడారు. వీరు నెలల తరబడి ఔరంగాబాద్ వంటి దూరపు జైళ్లలో ఖైదీలుగా ఉన్నారు. అయినప్పటికీ, ఈ యోధుల త్యాగాలకు జిల్లా అధికార యంత్రాంగం, పాలన వ్యవస్థ నుంచి తగిన గుర్తింపు లభించకపోవడం విచారకరం. నిర్మల్ చైన్‌గేట్ వద్ద ఏర్పాటు చేసిన రాంజీగోండ్, కుమురంభీం విగ్రహాలు స్మారక చిహ్నాలు ఏర్పాటు చేయాలి నిజాం, ఆంగ్లేయసేనలపై పోరాడిన రాంజీగోండు సేన గొప్పతనం అందరికీ తెలియాలి. వెయ్యి ఉరులమర్రి అమరధామం, రాంజీ మ్యూజియం ఏర్పాటుచేయాలి. –కై రి శశి, ఏబీవీపీ విభాగ్ కన్వీనర్ -
వసతులు లేని ఎంసీహెచ్
నిర్మల్ మాతా శిశు ఆస్పత్రిలో సరైన వసతులు లేకపోవడం వల్ల గర్భిణులు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరిపడా పడకలు లేకపోవంతో అధికారులు వరండాలో అదనపు మంచాలు వేయించి వైద్యం చేస్తున్నారు. మంగళవారం ఆస్పత్రిని సందర్శించిన కలెక్టర్ అభిలాష అభినవ్ లోపాలను గుర్తించి అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణులు, బాలింతలు కూర్చోవడానికి కూడా స్థలం లేక ఇబ్బంది పడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఆస్పత్రిలోని కొన్ని గదుల్లో సీలింగ్ ఊడిపోయింది. విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. రెండు గంటలపాటు ప్రతీ విభాగాన్ని పరిశీలించిన కలెక్టర్ వసతుల కొరత, నిర్వహణలో అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల వివరణ కోరారు. లోపాలను తక్షణం సరిచేయాలని ఆదేశించారు – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్ -
గర్భిణులు, బాలింతలకు మెరుగైన వైద్యం అందించాలి
నిర్మల్ రూరల్: గర్భిణులు, బాలింతలకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ వైద్యులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ మాతాశిశు ఆస్పత్రిని మంగళవారం తనిఖీ చేశా రు. ఆస్పత్రి ఆవరణలోని మహిళా శక్తి క్యాంటీన్ పరిశీలించి భోజనం నాణ్యత, పరిశుభ్రత వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ల్యాబొరేటరీ, స్కానింగ్ కేంద్రం, ఇన్ వార్డు, అవుట్ వార్డు, ఆపరేషన్ థియేటర్, ఓపీ, బాలింతల వార్డులను పరి శీలించి రోగుల పరిస్థితి, అందిస్తున్న వైద్య సేవలు అడిగి తెలుసుకున్నారు. ప్రసవాల సమయంలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా చూసుకోవాలని వైద్యులకు సూచించారు. అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆస్పత్రి ప్రాంగణంలో శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతీరోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నా రు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, జిల్లా ప్రధాన ఆస్పత్రి పర్యవేక్షకులు గోపాల్ సింగ్, ఆస్పత్రి పర్యవేక్షకులు సరోజ, వైద్యులు ఉన్నారు. -
వాతావరణం
ఆకాశం దాదాపు మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. అల్పపీడనం ప్రభావంతో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. పాఠాలుగా చెప్పాల్సిన ఘనత.. ‘నిర్మలా.. అదెక్కడుంది..’ అనేవారికి గుర్తుండిపోయే ఎన్నో సమాధానాలను చెప్పే చరిత్ర ఈ నేలకుంది. కానీ.. దశాబ్దాలుగా పాలకులు, అధికారుల పట్టింపులేకపోవడంతో ఆ ఘనతంతా మట్టిలో కలిసిపోతోంది. జలియన్‌వాలాబాగ్ ఘటనకంటే ముందే, అందులో చనిపోయినవారి సంఖ్య కంటే ఎక్కువే ‘వెయ్యిఉరులమర్రి’ ఘటనలో చనిపోయారు. కానీ ఇప్పటికీ వారి పోరుగాథను, త్యాగాల చరితను పాఠ్యపుస్తకాల్లో పాఠంగా పెట్టకపోవడం దారుణం. కనీసం స్వాతంత్య్రదినోత్సవ, ప్రజాపాలన దినోత్సవ అధికారిక ప్రసంగాల్లోనూ ప్రస్తావించకపోవడంపై జిల్లావాసులు మండిపడుతున్నారు. ప్రాణత్యాగాలూ గుర్తించరా..!? నిర్మల్ గడ్డపై ప్రాణత్యాగం చేసిన రాంజీగోండు సహా వెయ్యిమంది వీరులకు గుర్తింపునివ్వాలి. వారిపోరును పాఠ్యపుస్తకాల్లో పాఠాలుగా చేర్చాలి. – వెంకటేశ్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వాలదే బాధ్యత.. చరిత్రపుటల్లో నిర్మల్ ప్రాంతానికి గుర్తింపు నివ్వడంతోపాటు పాఠాలుగా ముందుతరాలకు అందించాలి. ఇందుకు కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు బాధ్యత వహించాలి. –దిగంబర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఇంకెప్పుడు గుర్తిస్తారు..!? తరాలు గడిచిపోతున్నా వెయ్యి ఉరులమర్రి ఘటనకు, జిల్లాకు చెందిన సమరయోధులకు సరైన గుర్తింపుదక్కడం లేదు. పాలకులు, అధికారులు వీరి త్యాగాలను ఇంకెప్పుడు గుర్తిస్తారు..!? –కై లాశ్, ఏఐఎస్ఎఫ్ జిల్లాకార్యదర్శి -
నారీ ఆరోగ్యంపై నజర్
నిర్మల్‌చైన్‌గేట్: మహిళల ఆరోగ్యం కుటుంబ, దేశ ప్రగతికి మూలస్తంభమనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘స్వాస్థ్ నారీ– సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళలకు వైద్య పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సిద్ధమైంది. కలెక్టర్ అభిలాష అభినవ్ ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ టాస్క్‌ఫోర్స్ సమావేశంలో తగిన సూచనలు అందించింది. నర్సాపూర్ సీహెచ్‌సీ నుంచి ప్రారంభం.. ఈ అభియాన్ మహిళలకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించడంపై దృష్టి సారిస్తుంది. జిల్లాలోని జీజీహెచ్, సీహెచ్‌సీ, పీహెచ్సీ, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తారు. సెప్టెంబర్ 17న(బుధవారం) నర్సాపూర్ సీహెచ్‌సీలో మెగా వైద్య శిబిరంతో కార్యక్రమం ప్రారంభమై, షెడ్యూల్ ప్రకారం 98 శిబిరాలు జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తారు. 38 మంది స్పెషలిస్టు వైద్యుల్లో 19 మంది శిబిరాల్లో పాల్గొనగా, మిగతా వారు ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందిస్తారు. పక్షం రోజులు స్పెషల్ డ్రైవ్ అక్టోబర్ 2 వరకు నిర్వహించే ఈ స్పెషల్ డ్రైవ్‌లో ఆరోగ్య మహిళా కేంద్రాలు, ఏసీడీ సెంటర్లు, క్యాన్సర్ డే కేర్ సెంటర్లతోపాటు ‘పోషణ్ మాసం’ కార్యక్రమాలను సమన్వయం చేస్తారు. ఈ శిబిరాల్లో రక్తహీనత నివారణ, క్షయవ్యాధి (టీబీ) పరీక్షలు, ఏజెన్సీ ప్రాంతాల్లో సికిల్ సెల్ అనీమియా పరీక్షలు నిర్వహిస్తారు. గైనకాలజీ, నేత్ర, ఈఎన్టీ, డెర్మటాలజీ, సైకియాట్రీ, డెంటల్ సర్జన్ వైద్యులు పరీక్షలు చేసి, రోగ నిర్ధారణ జరిగితే చికిత్స, మందులు అందిస్తారు. 324 శిబిరాలకు ప్రణాళిక జిల్లాలో 3 సీహెచ్‌సీలు, 16 పీహెచ్‌సీలు, 73 ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు, 3 బస్తీ దవాఖానాల పరిధిలో 324 వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తారు. ప్రతీరోజు ఒక్కో ప్రాంతంలో స్పెషలిస్టు వైద్యులు అందుబాటులో ఉంటారు. సీహెచ్‌సీ, పీహెచ్‌సీల తర్వాత ఆయుష్మాన్ కేంద్రాల్లో శిబిరాలు కొనసాగుతాయి. ఆశ కార్యకర్తలు, ఎంఎల్‌హెచ్‌పీలు మహిళలను శిబిరాలకు తీసుకొచ్చి వైద్య సేవలు అందేలా చూస్తారు. అన్ని రకాల పరీక్షలు.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వుల మేరకు ఈ నెల 17 నుంచి నారీ స్వస్త్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. జిల్లాలో ఆయా ఆస్పత్రుల పరిధిలో రోజూ ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహిస్తాం. మహిళలకు అన్ని రకాల పరీక్షలు చేయడానికి ప్రణాళికలు రూపొందించాం. – డాక్టర్ రాజేందర్, డీఎంహెచ్‌వో -
‘స్థానిక’ ఎన్నికలపై అనిశ్చితి
నిర్మల్‌చైన్‌గేట్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఈ నెల 30వ తేదీలోగా నిర్వహించాలని హైకోర్టు గడువు విధించింది. అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో రాజకీయ పార్టీల్లో గందరగోళం నెలకొంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతున్నప్పటికీ, ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై స్పష్టత ఇవ్వడం లేదు. సన్నాహాల్లో జిల్లా యంత్రాంగం ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లా యంత్రాంగం గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సన్నద్ధమైంది. గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేయగా, పోలింగ్ స్టేషన్ల తుది జాబితా కూడా ప్రకటించారు. బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ బాక్సులు, ఇతర సామగ్రి సిద్ధం చేశారు. జిల్లాలో 400 గ్రామ పంచాయతీలు, 18 జెడ్పీటీసీలు, 157 ఎంపీటీసీలు ఉన్నాయి. మొత్తం 4,49,302 మంది ఓటర్ల కోసం 896 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం కూడా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 10న తుది జాబితాను ఖరారు చేశారు. గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఆధారంగా తీసుకున్నారు. బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ సామగ్రి కూడా సిద్ధంగా ఉంది. రాజకీయ పార్టీల్లో గందరగోళం ప్రభుత్వం ఎన్నికలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో రాజకీయ పార్టీల శ్రేణులు గందరగోళం నెలకొంది. గ్రామాల్లో ఆశావహులు ఎన్నికల కోసం ముందస్తు కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ, షెడ్యూల్ విడుదల కాకపోవడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నెల 30వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించాలంటే షెడ్యూల్ ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందా లేక కోర్టు ద్వారా గడువు కోరుతుందా అనేది కూడా స్పష్టత లేకపోవడంతో అధికార పార్టీ నేతలు సైతం ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదని భావిస్తున్నారు. పంచాయతీ డివిజన్లు 02 జెడ్పీటీసీ స్థానాలు 18 ఎంపీటీసీ స్థానాలు 157 పోలింగ్ కేంద్రాలు 892 గ్రామ పంచాయతీలు 400 వార్డులు 3,368 మొత్తం ఓటర్లు 4,49,302 పురుషులు 2,13,805 మహిళలు 2,35,485 ఇతరులు 12 -
వేతనాల కోసం మున్సిపల్ కార్మికుల నిరసన
నిర్మల్‌టౌన్: వేతనాలు చెల్లించాలని నిర్మల్ మున్సిపల్ కార్మికులు సోమవారం ఉదయం కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈసందర్భంగా కార్మికులు మాట్లాడుతూ... రెండు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. పూట గడువడం కష్టంగా మారిందని, పిల్లల ఫీజులు, చెల్లించలేక నిత్యావసర సరుకులు కొనుగోలు కష్టమవుతుందన్నారు. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి రెండు నెలల వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే విధుల్లో చేరమని స్పష్టం చేశారు. కార్మికులతో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. -
గోడు చెప్పి.. గోస తీర్చమని..
నిర్మల్: ‘మేడమ్.. మండలస్థాయిలో తిరిగితిరిగి, ఇక మీరే దిక్కంటూ మీదగ్గరికి వచ్చాం. మీరే మా సమస్య తీర్చండి..’ అంటూ జిల్లావాసులు తమ గోడును వినిపించారు. తమ గోస తీర్చండంటూ అర్జీలను ఇచ్చారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి భారీగా అర్జీదారులు తరలివచ్చారు. కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా అధికారులు దరఖాస్తులు, వినతులను స్వీకరించారు. స్వస్త్ నారీ – స్వశక్తి పరివార్.. ప్రజావాణిలో జిల్లావాసులు సమర్పించిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మండలాలవారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వస్త్ నారీ – స్వశక్తి పరివార్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. మహిళలకు రక్తహీనత, బీపీ, థైరాయిడ్, టీబీ, గర్భిణులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించడమే ప్రధాన లక్ష్యమని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు జరగనున్న పోషణ్ మాసం కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్అహ్మద్, ఆర్డీవో రత్నకళ్యాణి, జెడ్పీ సీఈవో గోవింద్‌తోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
డీసీఎంఎస్ కేంద్రం గురించి..
తమ గ్రామపంచాయతీ పరిధికే డీసీఎంఎస్ కేంద్రాన్ని కేటాయించాలని కుంటాల మండలం అంబకంటితాండ వీడీసీ, గ్రామస్తులు కలెక్టర్‌కు విన్నవించారు. తమకు రావాల్సిన యూరియాతో సహా ఇతర ప్రయోజనాలను పొందాలంటే గ్రామానికే చెందిన వ్యక్తికి కేటాయించాలని వారు కోరారు. ఇల్లు ఇప్పించండి.. తీసుకున్న అప్పునకు సంబంధం లేకుండా బాండ్ పేపర్ చూయిస్తూ తన ఇంటికి తాళాలు వేశారని, తమ ఇంటిని తమకు ఇప్పించేలా చూడాలని కడెం మండలం కొండుకూర్ గ్రామానికి చెందిన పాలకుర్తి రాంబాబు, కుటుంబసభ్యులు కలెక్టర్‌కు విన్నవించారు.‘ఆరోగ్యశ్రీ’ వేతనాలు చెల్లించండి.. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా వివిధ నెట్వర్క్ హాస్పిటల్స్‌లో పనిచేస్తున్న తమకు వేతనాలు రావడం లేదంటూ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఉద్యోగులు కలెక్టర్‌కు విన్నవించారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఎక్స్టెన్షన్ పీరియడ్‌ను పెంచి, సకాలంలో వేతనాలు ఇప్పించాలని కోరారు. -
పీజీ కళాశాల ప్రారంభించాలి..
జిల్లాకేంద్రంలోని కాకతీయ పీజీ కళాశాలలో తరగతులను ప్రారంభించాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. వెంటనే చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కార్యదర్శి కై లాస్ కోరారు. ఈమేరకు కలెక్టర్ పూర్తివివరాలు తెలుసుకోవాలంటూ డీఐఈవోను ఆదేశించారు. ఇందులో ఏఐఎస్ఎఫ్ నాయకులు సన్నిహిత్, అస్లాం తదితరులు ఉన్నారు. రెగ్యులరైజ్ చేయాలి.. ప్రభుత్వం సెకండ్ ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసి, కలెక్టర్‌కు వినతపత్రం ఇచ్చారు. గతేడాది నిర్వహించిన పరీక్ష ఫలితాల విడుదల, సమాన పనికి సమాన వేతనం, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఉద్యోగ భద్రతలపై డిమాండ్ చేస్తున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేశ్ పేర్కొన్నారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సుజాత, ప్రధాన కార్యదర్శి సరస్వతి, కోశాధికారి సుజాత, శోభ, రాధ, గౌతమి, తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఐఆర్ నిర్వహణకు సన్నద్ధంగా ఉండాలి
నిర్మల్‌టౌన్: స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్(ఎస్ఐఆర్) నిర్వహణకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సూచించారు. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ 2002పై కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ జాబితాలో డూప్లికేట్ ఓట్లు, నకిలీ ఓట్ల తొలగింపుకు 20 నుంచి 25 సంవత్సరాలకు ఒకసారి స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (ఎస్ఐఆర్) చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో చివరగా 2002 లో ఎస్ఐఆర్ చేయడం జరిగిందన్నారు. ఎస్ఐఆర్ నిర్వహణపై మాస్టర్ ట్రైనర్లతో బూత్‌స్థాయి సిబ్బందికి సంపూర్ణ అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ.. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రిటర్నింగ్ అధి కారి, ఏఈఆర్ఓ, డిప్యూటీ తహసీల్దార్లు, బీఎల్వో, పర్యవేక్షకులు తగినంత మంది అందుబాటులో ఉన్నారని తెలిపారు. అధికారులు ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ.. ఎస్ఐఆర్ నిర్వహణపై మాస్టర్ ట్రైయినర్ల ద్వారా బూత్ స్థాయి సిబ్బందికి అవగాహన కలిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్ఐఆర్ నిర్వహణకు ముందుగానే ప్రతీ పోలింగ్ బూత్ స్థాయిలో 2002 ఎస్ఐఆర్ వివరాలను 2025 ఎస్ఎస్ఆర్ డేటాతో సరిపోల్చాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి పాల్గొన్నారు. -
మెనూ పాటించరా?
ఖానాపూర్: పట్టణంలోని శాంతినగర్ కాలనీ మహాత్మా జ్యోతిబాపూలే బాలుర పాఠశాలలో భోజన మెనూ పాటించకపోవడంతో సంబంధిత అధికారులు, సిబ్బందిపై ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఎంజేపీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. మెనూ ప్రకారం కిచిడి, టమాటా పెట్టాల్సి ఉండగా పప్పు, అన్నం పెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం స్థానిక అధికారుల నిర్లక్ష్యం లేకుండా దృష్టిసారించాలని ఆదేశించారు. ఈ విషయమై సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. పాఠశాలకు వచ్చిన సరుకులను పరిశీలించారు. అనంతరం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. అక్కడి నుంచి పట్టణంలోని శాంతినగర్తోపాటు దిలావర్పూర్ గ్రామానికి వెళ్లి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. అంతకుముందు క్యాంపు కార్యాలయంలో తిమ్మాపూర్ వీడీసీ నాయకులు ఎమ్మెల్యేను కలిసి ఆరోగ్య ఉపకేంద్రం నిర్మాణం కొనసాగేలా చూడాలని విన్నవించారు. కనీస అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా సబ్‌సెంటర్ నిర్మాణం చేపట్టడం సమంజసం కాదన్నాన్నారు. ఈ విషయమై సంబంధిత డీఈతో ఫోన్లో మాట్లాడి దీనికి పూర్తి బాధ్యత అధికారులే వహించాలని స్పష్టం చేశారు. ఓ వైపు ప్రభుత్వం హైడ్రా పేరుతో ఎఫ్టీఎల్ పరిధిలోని నిర్మాణాలు తొలగిస్తుంటే సంబంధిత అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడం సరికాదన్నారు. కార్యక్రమంలో నాయకులు దయానంద్, తోట సత్యం, చిన్నం సత్యం, నిమ్మల రమేశ్, సత్యనారాయణ, రాజేశ్వర్, గంగనర్సయ్య, తదితరులు ఉన్నారు. -
సామాన్యులకు అండగా పోలీసులు
నిర్మల్‌టౌన్: పోలీసులు సామాన్యులకు అండగా ఉండాలని పోలీసు అధికారులకు ఎస్పీ జానకీషర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలను తెలుసుకుని సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సామాన్యులకు అండగా ఉండాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నాణ్యమైన పోలీసు వ్యవస్థను జిల్లా ప్రజలకు అందించడమే లక్ష్యమన్నారు. పోలీసుల సహాయం కావాలనుకునేవారు నేరుగా ఠాణాలో ఫిర్యాదు చేయాలని తెలిపారు. -
రైతు ఇంట కొత్త పంట
నిర్మల్పర్యాటకులకు నిరాశే.. దసరా సెలవుల్లో కవ్వాల్‌ను సందర్శించాలనుకునే పర్యాటకులకు ఈసారి నిరాశే మిగిలింది. అక్టోబర్ నుంచే సఫారీకి అనుమతివ్వాలని అటవీశాఖ నిర్ణయించింది. ఖేలో ఇండియా పోటీలకు నిర్మల్ విద్యార్థులు నిర్మల్‌టౌన్: జాతీయస్థాయి ఖేలో ఇండియా పోటీలకు నిర్మల్ జిల్లా విద్యార్థులు ఎంపికయ్యారు. ఈనెల 14న వరంగల్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన బాక్సింగ్ బాలికల రాష్ట్రస్థాయి సెలక్షన్స్‌లో నిర్మల్ జిల్లా నుంచి 13 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. ఇందులో స మీక్ష ,అక్షిత (50 కేజీలు), నాగలక్ష్మి (40 కేజీ లు), చిన్మయి (35 కేజీలు), దివ్య (38 కేజీ లు), నక్షత్ర(70 కేజీలు) విభాగాల్లో జాతీయస్థాయికి ఎంపికయ్యారు. శిక్షకురాలు లక్ష్మి, జిల్లా కిక్ బాక్సింగ్ కార్యవర్గం జాతీయస్థాయికి ఎంపికై న క్రీడాకారులను అభినందించారు. లక్ష్మణచాంద: జిల్లా వ్యవసాయ రంగంలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. శ్రీరామ్‌సాగర్, గడ్డెన్న, కడెం, స్వర్ణ, సదర్మాట్ వంటి ప్రాజెక్టులతో సాగు నీటికి ఎలాంటి కొరత లేకుండా ఉంది. దీంతో జిల్లాలో 85 శాతం మందివ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.జిల్లా రైతులు ఎక్కువగా పత్తి, సోయాబీన్, వరి పంటలు సాగు చేస్తున్నారు. ఈ పంటలు రైతులకు దీర్ఘకాలంగా ప్రధాన ఆధారంగా ఉన్నప్పటికీ, సరైన దిగుబడి, ధరలు లేక నష్టాలను ఎదుర్కొంటున్నారు. వాణిజ్య పంటల సాగు.. ఒకే రకమైన పంటల సాగుతో రైతులు నష్టపోతున్న నేపథ్యంలో, ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తూ రైతులను ఆర్థికంగా ఉన్నత దిశగా నడిపించేందుకు కృషి చేస్తోంది. ఫలితంగా, జిల్లాలో అనేకమంది రైతులు ఆయిల్‌పామ్ సాగును ఆదరిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 8,200 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగవుతోంది. ఈ ఏడాది 4,500 ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పటివరకు 1,500 ఎకరాల్లో మొక్కలు నాటారు. మిగిలిన లక్ష్యాన్ని చేరుకునేందుకు రైతులను చైతన్యం చేస్తున్నామని హార్టికల్చర్ అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులు ఆయిల్‌పామ్ సాగుకు ముందుకు రావాలని కోరుతున్నారు. రైతులకు ప్రభుత్వ సహకారం.. ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం సబ్సిడీలతో అండగా నిలుస్తోంది. ఒక ఎకరంలో 50 ఆయిల్‌పామ్ మొక్కలు నాటేందుకు, బహిరంగ మార్కెట్లో రూ.200 ధర ఉన్న మొక్కను 90 శాతం సబ్సిడీతో రూ.20కే అందిస్తోంది. అదనంగా, నీటి వృథాను నివారించేందుకు డ్రిప్ సేద్యం కోసం ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం సబ్సిడీ అందిస్తోంది. మొక్కల నిర్వహణ ఖర్చుల కోసం ఎకరానికి ఏడాదికి రూ.4,200 చొప్పున నాలుగేళ్లు ఆర్థికసాయం కూడా అందజేస్తోంది. తొలి దిగుబడి ఫలితాలు.. నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన ఆయిల్‌పామ్ సాగు ఇప్పుడు తొలి దిగుబడిని అందించింది. 8,200 ఎకరాల సాగులో, 121 మంది రైతులకు చెందిన 542 ఎకరాల్లో 114.390 టన్నుల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం ఒక టన్ను గెల ధర రూ.19 వేలు పలుకుతోంది. ఒక ఎకరానికి 2 నుంచి 3 టన్నుల దిగుబడి వస్తుండగా, ఐదో సంవత్సరం నుంచి ఎకరానికి 8 నుంచి 10 టన్నుల వరకు దిగుబడి వస్తుందని అధికారులు తెలిపారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు.. జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, లక్ష్మణచాంద, లోకేశ్వరం, భైంసా, సోన్ మండల కేంద్రాల్లో ఆయిల్‌పామ్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల ద్వారా రైతుల నుంచి గెలలను సేకరిస్తున్నారు. కొనుగోలు చేసిన రైతుల బ్యాంకు ఖాతాల్లో వారం రోజుల్లో డబ్బులు జమ అవుతాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో ప్రి–యూనిక్ కంపెనీ గెలల కొనుగోలు చేస్తోంది -
120 ఏళ్ల ‘నస్పూర్ గడి’
నస్పూర్: మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణ పరిధిలోని విలేజ్ నస్పూర్‌లో 120 ఏళ్ల క్రితం నిర్మించిన చారిత్రక గడి నాటి పాలనకు సాక్ష్య ంగా నిలుస్తోంది. 1905లో నిజాం హయాంలో నస్పూర్‌కు చెందిన జీవీ వంశీయులు ఇను ము, కాంక్రీట్ వాడకుండా డంగుసున్నంతో రెండంతస్తుల భవనం నిర్మించారు. చుట్టూ నా లుగెకరాల ప్రహరీ కూడా డంగుసున్నంతోనే నిర్మించడం ప్రత్యేకత. ఈ గడి కేంద్రంగా ని జాం సంస్థానాధీశులు లక్సెట్టిపేట, ఇందారం, జన్నారం, తపాలాపూర్, మంథని, పెద్దపల్లి, భూపాలపల్లి, మహారాష్ట్రలోని సిరొంచ, చంద్రపూర్, మధ్యప్రదేశ్‌లోని బస్తర్ వరకు ఇక్కడి నుంచే పాలన కొనసాగించారు. స్వాతంత్య్రానంతరం ఈ కట్టడం నిరుపయోగమై శిథిలావస్థకు చేరింది. కొద్ది నెలల క్రితం హెరిటేజ్ కంపెనీ ఆధ్వర్యంలో ఆధునికీకరించారు. -
అందని ‘గౌరవం’
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లావ్యాప్తంగా చేపట్టిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే విధులు నిర్వర్తించిన ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు నేటికీ గౌరవవేతనం అందలేదు. సర్వే సందర్భంగా ప్రజల నుంచి ఎన్యూమరేటర్లు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. అష్టకష్టాలూ పడి ప్రక్రియ పూర్తిచేశారు. సర్వే ప్రారంభానికి ముందే ప్రభుత్వం ప్రత్యే క నిధులు కేటాయించింది. అయినా గతేడాది నవంబర్‌లో సర్వే విధులు నిర్వహించిన వీరు గౌరవ వేతనం కోసం 10 నెలలుగా ఎదురుచూస్తున్నారు. నిరుపేదలకు న్యాయం చేసేందుకే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెంచడంతో పాటు ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను నిరుపేదలకు అందించాలనే ఉద్దేశంతో రా ష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గతేడాది నవంబర్ 6నుంచి 21వరకు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణనకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. జిల్లాలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, మున్సిపల్ వార్డు అధి కారులు, సెర్చ్ సిబ్బంది, ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లుగా పనిచేశారు. సర్వే సందర్భంగా ఒక్కొక్క రూ 120నుంచి 150 కుటుంబాల చొప్పున ఎంచుకుని సమగ్రంగా వివరాలు సేకరించారు. ఈ ఇంటింటి సర్వే అనంతరం నవంబర్ 22నుంచి డిసెంబర్ 6వరకు కుటుంబ వివరాలను డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆన్లైన్లో నమోదు చేశారు. ఆ సమయంలో కొందరు సర్వేకు అందుబాటులో లేకపోవడంతో తిరిగి మరోసారి వారి వివరాలు సేకరించి ఆన్లైన్లో నమోదు చేయాల్సి వచ్చింది. 2,34,864 కుటుంబాల సర్వే జిల్లాలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో 1,698 మంది ఎన్యూమరేటర్లు, 168 మంది సూపర్వైజర్లు విధులు నిర్వర్తించారు. ఒక్కో ఎన్యూమరేటర్ 150 కుటుంబాల చొప్పున సర్వే విజయవంతంగా పూర్తి చేశారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో 86 వా ర్డులు, 400 గ్రామపంచాయతీల పరిధిలో మొత్తం 2,34,864 కుటుంబాలకు చెందిన సామాజిక, ఆర్థి క, విద్య, ఉపాధి, ఉద్యోగ, రాజకీయ పరిస్థితులతో పాటు కులం వివరాలు కూడా నమోదు చేసుకున్నా రు. ఒక్కో కుటుంబానికి ఎనిమిది పేజీలతో కూడిన సర్వే ఫామ్‌లో 75రకాల ప్రశ్నలుండగా, ఆయా కు టుంబ సభ్యుల నుంచి ఎన్యూమరేటర్లు ఓపికతో వివరాలు సేకరించారు. నేరుగా కుటుంబాల వద్దకు వెళ్లి చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు, కు లం, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, వయస్సు, పశు సంపద, దివ్యాంగులు, వైవాహిక స్థితి, చదువు, ఫోన్ నంబర్, వృత్తి, ఉద్యోగం, స్వయం ఉపాధి, వ్యాపా రం, కార్మికులు, వార్షికాదాయం, ఆదాయ పన్ను చెల్లింపు, పట్టా భూమి, కౌలు రైతుల వివరాలు, రిజర్వేషన్ల ద్వారా పొందిన విద్య, ఉద్యోగ ప్రయోజనాలు, గత ఐదేళ్ల నుంచి పొందుతున్న ప్రభుత్వ పథకాలు తదితర వివరాలు నమోదు చేశారు. జిల్లాలో ప్రక్రియ 20 రోజుల్లో పూర్తి చేశారు. జిల్లాలో పెండింగ్‌లో రూ.2.06 కోట్ల బకాయిలు సర్వేలో పాల్గొనే ఎన్యూమరేటర్లకు రూ.10వేల చొప్పున, సూపర్వైజర్లకు రూ.12వేల చొప్పున చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు కుటుంబాల వివరాలు ఆన్లైన్లో పొందుపర్చిన డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఒక్కో దరఖాస్తుకు రూ.7 చొప్పన ఇవ్వాల్సి ఉంది. జిల్లాలోని 2,34,864 కుటుంబాల డేటా ఎంట్రీ కోసం 2,164 మంది ఆపరేటర్లు పాల్గొన్నారు. వీరందరికీ కలిపి జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.2.06 కోట్ల గౌరవ వేతనం చెల్లించాల్సి ఉంది. సర్వే పూర్తి కాగానే చెల్లిస్తామని చెప్పి ఇంతవరకు విడుదల చేయకపోవడంతో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. సిబ్బందికి పారితోషికం రాలే.. ఆపరేటర్లకు తప్పని ఇక్కట్లు సమగ్ర కుటుంబ సర్వే వివరాలునోడల్ అధికారులు 21 ఎన్యూమరేటర్లు 1,698 సూపర్వైజర్లు 168 డాటా ఎంట్రీ ఆపరేటర్లు 2,164 మాస్టర్ ట్రైనర్లు 5 స్టిక్కరింగ్ చేసిన కుటుంబాల సంఖ్య 2,28,859 ఆన్లైన్ చేసిన కుటుంబాల సంఖ్య 2,34,864 -
నిజాం నాటి ఆసిఫాబాద్ జైలు
ఆసిఫాబాద్: 1916లో అప్పటి జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్‌లో గల జన్కాపూర్‌లో ఐదెకరాల్లో జైలు నిర్మించారు. నిజాం హయాంలో దీనిని పూర్తిగా డంగుసున్నంతో కట్టారు. ఇందులో మూడు బారక్‌లు ఉన్నాయి. సుమారు 200 మంది ఖైదీలు ఉండేలా భవన నిర్మాణం చేపట్టారు. అనంతరం కొన్నేళ్లపాటు మూసి ఉండగా మరమ్మతులు చేసి 1991 మార్చి 15న అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ ఎంజీ గోపాల్ తిరిగి ప్రారంభించారు. 17 ఏళ్లపాటు తిరిగి జిల్లా జైలుగా కొనసాగగా అనంతరం ఆసిఫాబాద్ జిల్లా జైలును 2008లో ఆదిలాబాద్‌కు తరలించి, ఇక్కడి జైలును స్పెషల్ సబ్ జైలుగా మార్చారు. -
స్వర్ణ ప్రాజెక్ట్ గేటు ఎత్తివేత
సారంగపూర్: రెండ్రోజులుగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు స్వర్ణ ప్రాజెక్ట్‌లో కి వరద పోటెత్తింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,183 అడుగులు కాగా, 1,300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు శనివారం రాత్రి 12గంటలకు ఒక గేటు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు వదిలారు. ఆదివారం సాయంత్రం వరకు కూ డా ఒక గేటు నుంచి నీటిని వదులుతున్నారు. రాత్రికి మళ్లీ వర్షం కురిస్తే ఏ సమయంలోనైనా మరిన్ని గేట్లు ఎత్తే అవకాశముందని అధికారులు తెలిపారు. స్వర్ణ నది పరీవాహక ప్రాంతాల ప్రజలు, మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. -
ఉత్తమ రైతుకు పురస్కారం
తానూరు: మండలంలోని బోంద్రట్ గ్రామానికి చెందిన ఉత్తమ రైతు సిందే సాయినాథ్ పు రస్కారం అందుకున్నారు. హైదరాబాద్‌లోని బేగంపేటలోగల హరిత ప్లాజా హోటల్లో యూత్ ఫర్ యాంటీకరప్షన్ ఆధ్వర్యంలో ఆది వారం నిర్వహించిన కార్యక్రమంలో సీబీఐ మా జీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా సా యినాథ్ పురస్కారం స్వీకరించారు. సాయినా థ్ సేంద్రియ సాగుతో వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తుండగా యూత్ ఫర్ యాంటీకరప్షన్ సభ్యులు గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. కార్యక్రమంలో యూత్‌ఫర్ యాంటికరప్షన్ చైర్మన్ అశోక్, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
● నాటి ఇంజినీర్ల ప్రతిభకు ఆనవాళ్లు ● నేడు ఇంజినీర్స్ డే
ఖానాపూర్: మండలంలోని మేడంపల్లి సమీపంలోగల గోదావరిపై 1891లో నిజాం పాలనలో ఫ్రెంచ్ ఇంజినీర్ జేజే ఒటలే సదర్మాట్ ఆనకట్ట నిర్మించారు. ఇది రెండు మండలాల్లోని సుమారు 15వేలకు పైగా ఎకరాలకు పైసా ఖర్చు లేకుండా 130 ఏళ్లుగా సాగునీరు అందిస్తోంది. ఎలాంటి సాకేంతిక పరిజ్ఞానం లేని ఆ రోజుల్లో పూర్తిగా రాళ్లతో గోదావరికి అడ్డంగా కట్టారు. దీనికి కుడి, ఎడమ కాలువలు నిర్మించారు. వీటి ద్వారా నీటిని విడుదల చేసేందుకూ ఎలాంటి టెక్నాలజీ, ఖర్చు అవసరం లేదు. చెరువు తూములాగే గేట్లు మనుషులే ఎత్తవచ్చు. అప్పట్లో వర్షాధారంగా నిండే నీటితోనే పంటలకు నీరందించేలా దీన్ని నిర్మించడం విశేషం. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయిన తర్వాత 1985–86వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సదర్మాట్కు నీళ్లు వచ్చాయి. ఆ తర్వాత నుంచి ప్రభుత్వాలు, అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఆయకట్టు రైతులే పోచంపాడ్ వరకు వెళ్లి శ్రీరాంసాగర్ నుంచి నీళ్లు పోరాడి తెచ్చుకోవాల్సి వస్తోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విషయం తెలుసుకుని స్వయంగా తానే సదర్మాట్ వరకు వచ్చారు. నిపుణులతో సర్వే చేయించి సదర్మాట్ కాలువ, బ్యారేజీ నిర్మాణానికి రూ.386కోట్లు మంజూరు చేశారు. కాగా, ఆయన మరణానంతరం బ్యారేజీ నిర్మాణంలోనూ మార్పులు జరిగాయి. ప్రస్తుత ప్రభుత్వం ఎగువనున్న మామడ మండలం పొన్కల్ వద్ద గోదావరిపై సదర్మాట్ నూతన బ్యారేజీ నిర్మిస్తోంది. కాగా, కేంద్రప్రభుత్వం మూడేళ్ల క్రితం సదర్మాట్ను వారసత్వ సాగునీటి కట్టడంగా గుర్తించడం విశేషం. -
మావల @ గ్రావిటీ స్పెషల్
కైలాస్‌నగర్: నిజాం హయాంలో ఆదిలాబాద్ పట్టణానికి గ్రావిటీ ద్వారా నీటిని సరఫరా చేసేలా చేపట్టిన పైపులైన్, ఫిల్టర్‌బెడ్ నిర్మాణాలు నాటి ఇంజినీరింగ్ ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గ్రావిటీ ద్వారా నీటి సరఫరా నిజాం హయాంలో ఆదిలాబాద్ వాసుల దాహార్తి తీర్చేందుకు పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో గల మావల అటవీ ప్రాంతంలో 60 ఎకరాల విస్తీర్ణంలో చెరువు నిర్మించారు. 1925లో నిర్మాణాన్ని ప్రారంభించగా 1948లో అందుబాటులోకి వచ్చింది. భారీ వరదలు, తుపానులు వచ్చినా తట్టుకుని నిలబడేలా కట్టను నిర్మించారు. ఇప్పటికీ చిన్నపాటి లీకేజీలు కూడా లేకపోవడం పనుల నాణ్యతకు అద్దం పడుతోంది. ముఖ్యంగా చెరువు నుంచి ఫిల్టర్‌బెడ్ వరకు భూగర్భంలో నిర్మించిన ఫైపులైన్ ఔరా అనిపిస్తోంది. గ్రావిటీ ద్వారా వచ్చే చెరువు నీరు ఆదిలాబాద్ పట్టణంలోని 25 శాతం జనాభాకు తాగునీటి ఇబ్బందులను దూరం చేస్తోంది. ఫిల్టర్‌బెడ్ మావల చెరువు నుంచి వచ్చే నీటిని శుద్ధిచేసేలా కలెక్టరేట్ పక్కన పదెకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఫిల్టర్‌బెడ్ కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. చెక్‌డ్యాంల ద్వారా మూడు దశల్లో శుద్ధి చేసిన జలాన్ని పంప్‌హౌస్ నుంచి పట్టణంలోని ట్యాంకులకు విడుదల చేస్తారు. వాటి ద్వారా ఇళ్లకు సరఫరా అవుతోంది. దీనిని లండన్‌కు చెందిన ది క్యాండీ ఫిల్టర్ కంపెనీ 1947లో నిర్మించడం గమనార్హం. -
నిర్మాణ కౌశలం.. నిమ్మల
నిర్మల్: ఎప్పుడో 450 ఏళ్ల కిందట నిర్మితమైన నిర్మల్ (నిమ్మల) జిల్లా కేంద్రం లోపల, చుట్టూ బురుజులు, గఢ్‌లు ఇప్పటికీ నాటి ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని చాటుతున్నాయి. నిమ్మనాయుడు నిర్మించిన అనంతరం కుంటి వెంకట్రాయుడు, శ్రీనివాసరావుల కాలంలో నిమ్మల చాలా నిర్మాణాలకు నోచుకుంది. శత్రువులతో పాటు, దొంగల దాడుల నుంచి రక్షణ కోసం పటిష్టమైన రక్షణ నిర్మాణాలు చేపట్టారు. మూడంచెల రక్షణ వ్యవస్థను నిర్మించారు. వీటిలో ఖిల్లాగుట్ట, కురన్నపేటబురుజు, బత్తీస్గఢ్, రాణి (వేంకటేశ్వర)గఢ్, గజ్‌గఢ్, ఇబ్రహీంగఢ్, శ్యామ్గఢ్, సోన్‌గఢ్, చిట్టిగఢ్, బీరవెల్లి గఢ్, వడూర్ (వైడూర్యపురం) గఢ్ వంటివి ఉన్నాయి. నిమ్మల నిర్మాణం అద్భుతం తెలంగాణలో ఓరుగల్లు, గోల్కొండ రాజ్యాలకు ఏమాత్రం తీసిపోని విధంగా నిమ్మల రాజ్యంలో నిర్మాణాలు చేపట్టారు. ఇక్కడ గోండు, ఫ్రెంచ్‌తో పాటు స్థానిక రాజ్యాల నిర్మాణశైలిలో కట్టడాలు ఉండటం ప్రత్యేకం. సారంగపూర్ మండలం జౌళి నుంచి నిర్మల్ సమీపంలోని వెంకటాపూర్ వరకు 16 గొలుసుకట్టు చెరువులు నిర్మించారు. ఇవన్నీ ఎత్తు, వాలు ఆధారంగా గొలుసుకట్టుతో నిర్మించడం విశేషం. – డా.కట్కం మురళి, అసిస్టెంట్ ప్రొఫెసర్ -
ఆత్మ రక్షణకు కరాటే
నిర్మల్‌ఖిల్లా: ఆత్మ రక్షణకు కరాటే అవసరమని జ పాన్ కరాటే అసోసియేషన్ ముఖ్య ప్రతినిధులు రా పోలు సుదర్శన్, జిల్లా ఉపాధ్యక్షుడు తేజేందర్‌సింగ్ భాటియా పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తిరుమల ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ప్ర త్యేక కార్యక్రమంలో షోటోకన్ స్టైల్ కరాటే జూని యర్ రెడ్ బెల్ట్, బ్లాక్ బెల్ట్ అంశాల్లో గ్రేడింగ్ నైపుణ్య పరీక్షలు నిర్వహించారు. ముధోల్, ఖానాపూర్, ని ర్మల్ తదితర డివిజన్ల నుంచి దాదాపు 800మంది పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఆర్థోపెడిక్ సర్జన్ డా క్టర్ రఘునందన్‌రెడ్డి హాజరయ్యారు. కరాటే అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొండాజీ శ్రీకాంత్, కార్యదర్శి అమ్ముల భూషణ్, చందుల స్వామి, మహిళా శి క్షకురాలు మృణాళిని, భైంసా డివిజన్ మాస్టర్ సా యికృష్ణ, జ్ఞానతేజ, రాజశ్రీ, ఆరిఫ్‌ఖాన్, చిరంజీవి, శ్రీకాంత్, సాయికిరణ్ తదితరుల సమక్షంలో గ్రేడింగ్ నైపుణ్య పరీక్షల నిర్వహించారు. ప్రతిభ కనబరి చిన విద్యార్థులను అభినందించారు. -
పీఎం శ్రీతో విద్యాభివృద్ధికి కృషి
కడెం: పీఎం శ్రీతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నాయని ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ పేర్కొన్నారు. ఆదివా రం మండలంలోని నచ్చన్ఎల్లాపూర్ గ్రామంలోగల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో రూ.13.50 లక్షలతో ఏర్పాటు చేసిన సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో తర్పీదు ఇవ్వాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా ల భాగస్వామ్యంతో విద్యార్థులకు ఇందుకు అవసరమైన వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తు తం ఏఐ వచ్చిందని, కాలానుగుణంగా టెక్నాలజీ నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న పీఎం శ్రీ సెల్ఫీ పాయింట్ వద్దకు వెళ్లి సెల్ఫీ దిగారు. అనంతరం సారంగపూర్ గ్రామంలో రూ.12లక్షల వ్యయంతో చేపట్టిన అంగన్వాడీ భవ న నిర్మాణ పనులు ప్రారంభించారు. ఎలగడపలో కటికనపెల్లి శంకర్ కుటుంబాన్ని పరామర్శించారు. ఏఎంసీ చైర్మన్ భూషణ్, తహసీల్దార్ ప్రభాకర్, ఎంఈవో షేక్ హుస్సేన్, కాంగ్రెస్, బీజేపీ మండలాధ్యక్షులు మల్లేశ్, కాశవేణి శ్రీనివాస్, ప్రిన్సిపాల్ శంకుంతల, నాయకులు బొడ్డు గంగన్న, లచ్చన్న, కోల శ్రీనివాస్, భూమేశ్, రాపర్తి శ్రీనివాస్, వెంకటేశ్, మోహన్, ప్రవీణ్ తదితరులున్నారు. ఖానాపూర్: మండలంలోని రాజురా గ్రామంలో ని ర్మించిన ఆరోగ్యఉపకేంద్రాన్ని ఎంపీ నగేశ్, ఎమ్మె ల్యే బొజ్జు ప్రారంభించారు. బాదనకుర్తి, దాసునా యక్ తండా గ్రామాల్లో చేపట్టిన అంగన్వాడీ భవన నిర్మాణాలకు భూమిపూజ చేశారు. సింగాపూర్ పెద్దమ్మతల్లి గుడిలో పూజలు చేశారు. నాయకులు భూ షణ్, మాజిద్, సత్యం, రమేశ్, సాజిద్, శంకర్, ర వీందర్, సంజీవ్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులున్నారు. -
జాతీయస్థాయి పోటీలకు భైంసా విద్యార్థులు
భైంసాటౌన్: పట్టణంలోని సుభద్రవాటిక శ్రీసరస్వ తి శిశుమందిర్ విద్యార్థులు జాతీయస్థాయి గణిత విజ్ఞానమేళా పోటీలకు ఎంపికై నట్లు ప్రధానాచార్యులు బందెల దేవేందర్ తెలిపారు. ఇటీవల కామారెడ్డిలో సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఎనిమిదో తరగతికి చెందిన రమ్యశ్రీ ప్రథమ స్థానంలో నిలిచి జాతీయస్థాయికి ఎంపికై నట్లు పేర్కొన్నారు. త్వరలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులకు నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తె లిపారు. హర్షిత్, రిద్వి, అశ్విని, దివ్య, స్పందన రెండోస్థానంలో నిలిచి కామారెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మదన్మోహన్రా వు చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు. ఈ మేరకు విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయు లు, ప్రబంధకారిణి సభ్యులు అభినందించారు. -
నమ్మండి..తహసీల్ ఆఫీసే..
ఈ ఫొటోలు చూసి ఇదేదో పాడుబడ్డ బంగ్లా అనుకునేరు. ఇది కడెం తహసీల్దార్ కార్యాలయం. ఆ మండలం మొత్తానికి పెద్దదిక్కు. కానీ.. ఎప్పుడు కూలుతుందో తెలియని దయనీయస్థితిలో ఉంది. ఇంకో విషయం ఏమంటే.. ఇదసలు తహసీల్ ఆఫీస్ కాదు. పాత తహసీల్దార్ భవనం శిథిలావస్థకు చేరడంతో 15 ఏళ్ల క్రితం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఉన్న ఈ పాత బిల్డింగ్‌లోకి కార్యాలయాన్ని మార్చారు. ఈ భవనం ఇబ్బందికరంగా ఉందనే పీహెచ్‌సీకి కొత్త భవనం కట్టించారు. అలాంటిది అదే భవనంలోకి రెవెన్యూ వ్యవస్థ చేరడం విడ్డూరం. వర్షాలకు స్లాబ్‌కు సపోర్టుగా ఉన్న కర్రలు విరిగిపడుతున్నాయి. పెచ్చులూ ఊడుతున్నాయి. -
కూలేదాకా.. చూస్తారా..!?
నిర్మల్: ‘అర్హులందరికీ ఇళ్లు కట్టిస్తాం.. ’ అని చెప్పే ప్రభుత్వం శిథిలావస్థకు చేరుతున్న కార్యాలయాలను కూలేదాకా చూస్తోంది. రెండురోజుల క్రితం ఆదిలాబాద్ కలెక్టరేట్లో ఓ విభాగం పైకప్పు ఉన్నపళంగా కుప్పకూలింది. ఎప్పుడూ జనసంచారం ఉండే కార్యాలయం రాత్రివేళ కూలడంతో అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు. మూడేళ్లక్రితం ఇలాగే.. నిర్మల్అర్బన్ పాత కార్యాలయం ముందుభాగం అందరూ చూస్తుండగానే ఓవైపు కూలిపోయింది. జిల్లాలో ఇప్పటికీ పలు కార్యాలయాల్లో అదే దుస్థితి ఉంది. ఎప్పుడు కూలుతాయో చెప్పలేని పరిస్థితులు ఉన్నా.. ఏళ్లుగా అలాగే, ఆ భవంతుల్లోనే కార్యాకలాపాలు కొనసాగిస్తున్నారు.మున్సిపల్ మరీ దారుణం..నిర్మల్ మున్సిపాలిటీ భవనం మరీ దారుణంగా తయారైంది. వర్షాకాలంలో పాత భనాల్లో ఉండొద్దని ప్రజలకు సూచించే అధికారులు, ఉద్యోగులే పాత, శిథిలావస్థకు చేరిన భవనంలో భయం భయంగా విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పుడో ఏళ్లక్రితం కట్టిన బిల్డింగ్ మొత్తం పెచ్చులూడిపోతోంది. ఇప్పటికే రెవెన్యూ, బిల్డింగ్, అకౌంట్స్, శానిటేషన్ తదితర సెక్షన్, కారిడార్లలో పెచ్చులూడి పడ్డాయి. ఇంకా చాలాచోట్ల ఎప్పుడైనా పడొచ్చు.. అన్నట్లుగా ఉన్నాయి. ప్రస్తుత మున్సిపాలిటీకి వెనుకవైపునే కొత్త భవనం నిర్మించినా.. వాస్తు బాగాలేదంటూ ప్రతీ పాలకవర్గం భవనం మార్పును వాయిదా వేస్తూ వస్తోంది. రూ.కోట్లు పెట్టి కట్టిన ఆ భవనంలో ప్రస్తుతం పనికిరాని సామాన్లు, సున్నం, బ్లీచింగ్‌పౌడర్ స్టోరేజీ కోసం వాడుతున్నారు. రెండుమూడు భారీవర్షాలు కురిస్తే.. ప్రస్తుతం కొనసాగుతున్న మున్సిపల్ భవనం మరింత ప్రమాదకరంగా మారడం ఖాయం.కూలితే.. ఎవరు బాధ్యులు..!?ఏదైనా ప్రమాదం జరిగితే బాధితులతోపాటు బాధ్యులూ ఉంటారు. ఇప్పుడు శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ కార్యాలయాలు కూలితే, ఎవరికై నా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులవుతారు..!? చాలావరకు రెవెన్యూ కార్యాలయాలు శిథిలావస్థకు చేరాయి. మండలంలోని భూములు, ప్రజలకు సంబంధించిన విలువైన సమాచారమంతా ఇవే కార్యాలయాల్లో ఉంటాయి. ఈ భవనాలు కుప్పకూలి, ఆయా సమాచారం దెబ్బతింటే ఎవరిది బాధ్యత..!? కార్యాలయ పనివేళల్లోనే అనుకోని ఘటనలు చోటుచేసుకుంటే.. పరిస్థితి ఎలా ఉంటుందని ఎవరైనా ఆలోచిస్తున్నారా..!? తాజాగా ఆదిలాబాద్ కలెక్టరేట్ భవనం ఘటన నేపథ్యంలోనైనా జిల్లాలోని శిథిలావస్థకు చేరిన భవనాలు, కార్యాలయాలపైన దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.తలపగలడం ఖాయం..చూస్తుంటూనే.. ఎక్కడ పడిపోతుందో.. అన్నట్లు ఉన్న ఈ పెచ్చులూడిన స్లాబ్ ఎక్కడో కాదు.. నిర్మల్ జిల్లా కేంద్రానికి గుండెకాయగా చెప్పుకునే మున్సిపాలిటీలోనిదే. రెవెన్యూ విభాగంలోకి అడుగుపెట్టగా నే ఇలా పెచ్చులూడిపోయి భయపెడుతోంది. ఇలా.. మున్సిపల్ ఈ ఒక్క విభాగంలోనే కాదు.. భవనం మొత్తం భయంకరంగానే తయారైంది. -
ఆకాశవాణిలో కడ్తాల్ విద్యార్థుల కథలు
సోన్: మండలంలోని కడ్తాల్ ప్రాథమిక పాఠశాలను ఆకాశవాణి ఆదిలాబాద్ రేడియో కేంద్రం సిబ్బంది శుక్రవారం సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేశారు. విద్యార్థులు పాటలు, కథలు, మాటలు, నాటికలు రికార్డు చేసుకున్నట్లు హెచ్ఎం రమేశ్‌బాబు తెలిపారు. ఈ కార్యక్రమం ఈనెల 14 ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు ఆదిలాబాద్ రేడియో కేంద్రంలో ప్రసారమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆకాశవాణి సిబ్బంది దినేష్, లెనిన్ పాఠశాల ఉపాధ్యాయులు మంగమ్మ, రాధ, మౌనిక రాణి విద్యార్థులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం వినతి కడెం: మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన చెంచులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని సీపీఐ(ఎంఎల్) డివిజన్ కార్యాదర్శి సునారి కారి రాజేశ్ కోరారు. స్థానిక నాయకులతో కలిసి ఉట్నూర్‌లోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్కు, ఐటీడీఏ కార్యాలయంలో పీవో ఖుష్బూగుప్తాకు శుక్రవారం వినతిపత్రం అందించారు. 70 ఏళ్లుగా చెట్ల కింద గుడారాల్లో, గుడిసెల్లో జీవిస్తున్నా వీరికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించి అదుకోవాలని కోరారు. వినతిపత్రం ఇచ్చినవారిలో ఐటీఎఫ్ టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు లింగన్న, అడ్వకేట్ నేదూరి జాకబ్, లలితకుమారి, చెంచులు శిరీష, చంద్రకళ, లక్ష్మి తదితరులు ఉన్నారు. -
జిల్లా కవులను గుర్తించాలి
నిర్మల్‌టౌన్: రాష్ట్ర ప్రభుత్వం నిర్మల్ జిల్లా కవులను గుర్తించాలని ప్రముఖ కవి, రచయిత డాక్టర్ దామెర రాములు అన్నారు. నిర్మల్ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం మాట్లాడారు. జిల్లాలో వచన కవిత్వం, పద్య కవిత్వం, వ్యాసాలు, కథలు, కథానికలు, తాత్విక వ్యాసాలు రాసిన చేయి తిరిగిన కవులు రచయితలు ఎంతో మంది ఉన్నారని తెలిపారు. వారి రచనలు జాతీ య, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రసిద్ధి చెందా యని పేర్కొన్నారు. అంతేకాకుండా ఎక్స్‌రే, రంజని కుందర్తి, సినారే అవార్డులు అందుకు న్న కవులు కూడా ఇక్కడ ఉన్నారని తెలిపారు. కానీ ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమన్నారు. ఆదిలాబాద్ జిల్లా పోరాట యోధుల గడ్డా అని, ఈ జిల్లాను ప్రభుత్వం పరిగణలోనికి తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా ఈ జిల్లాలో ఎంతోమంది కవులు, రచయితలు ఉన్నా గుర్తింపు లేదన్నారు. ఇప్పటికై నా అవార్డుల కమిటీ దృష్టి పెట్టాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మల్ జిల్లా కవులను పరిగణనలోకి తీసుకుని గద్దర్, దాశరథి అవార్డులు అందించాలని కోరారు. జిల్లా కవులు, రచయితలు డాక్టర్ కృష్ణంరాజు, నేరెళ్ల హనుమంతు, భీమేష్ పాల్గొన్నారు. మన్మద్ ఎత్తిపోతలకు నిధులు లోకేశ్వరం: మండలంలోని మన్మద్ ఎత్తిపోతల పథకానికి మరమ్మత్తుల కోసం నిధులు మంజూరయ్యాయని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ తెలిపారు. రూ.1.61 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని పేర్కొన్నారు. త్వరలో టెండర్ పూర్తిచేసి మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
యూరియా కష్టాలు
నిర్మల్ రూరల్/లోకేశ్వరం: జిల్లా రైతులకు యూరియా కష్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. పది రోజుల క్రితం వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియా పంపిణీ జరిగింది. ప్రస్తుతం కొరత ఏర్పడడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. నిర్మల్ రూరల్ మండలం చిట్యాల గ్రామానికి 15 రోజుల తర్వాత యూరియా వచ్చిందని తెలియడంతో పంపిణీ కేంద్రం వద్ద చిట్యాలతోపాటు సిర్గాపూర్, లోలం, కాలువ తాండ, చించోలి(బి) రైతులు ఉదయమే బారులు తీరారు. చాలాసేపు క్యూలో నిల్చోవడంతో విసిగిపోయిన కొందరు రైతులు చెప్పులు, గుర్తింపు కార్డులను వరుసలో ఉంచి, సమీపంలోని చెట్ల నీడలో విశ్రాంతి తీసుకున్నారు. కేవలం 450 బస్తాలు మాత్రమే రావడంతో అందరికీ అందలేదు. దీంతో రైతులు వాగ్వాదానికి దిగారు. రూరల్ ఎస్సై లింబాద్రి జోక్యం చేసుకుని రైతులను సముదాయించారు. ఒక్కో పాస్ పుస్తకానికి రెండు బస్తాల చొప్పున పంపిణీ చేయించారు. లోకేశ్వరం మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద కూడా రైతులు తెల్లవారుజాము నుంచి క్యూలైన్లలో నిల్చున్నారు. మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి టోకెన్ల కోసం ఇబ్బంది పడ్డారు. పీఏసీఎస్ సీఈవో విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ 450 బస్తాలు మాత్రమే వచ్చాయని, రైతుకు రెండు బస్తాల చొప్పున టోకెన్లు జారీ చేసినట్లు తెలిపారు. శనివారం మరో 450 బస్తాల కోసం వ్యవసాయ అధికారి గిరిరాజ్ టోకెన్ల పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. యూరియా కోసం రైతులు గంటల తరబడి వర్షంలో తడుస్తూ నిరీక్షించారు. లోకేశ్వరం రైతువేదిక వద్ద యూరియా కోసం బారులుతీరిన రైతులు.. -
ఉత్సాహంగా ‘కళా ఉత్సవ్’
నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని నారాయణ పాఠశాలలో శుక్రవారం జిల్లాస్థాయి కళా ఉత్సవ్ పో టీలు నిర్వహించారు. వరంగల్ ఆర్జేడీ సత్యనారా యణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులను చదువుతోపాటు కళల్లోనూ ప్రోత్సహిస్తే మరింత రాణిస్తారని పేర్కొన్నారు. కష్టపడి చదివి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించా రు. అనంతరం పలు విభాగాలలో విద్యార్థులకు పో టీలను నిర్వహించారు. విజేతలకు ప్రశంసాపత్రాలు, మెమొంటోలు ఆర్జేడీ, డీఈవో భోజన్న ప్రదా నం చేశారు. ఏఎంవో నరసయ్య, జిల్లా సైన్స్ అధికారి వినోద్‌కుమార్, సాంస్కృతిక కళాసారథి నాగరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విజేతల వీరే.. వోకల్ మ్యూజిక్ సోలో విజేత: పి.మహేంద్ర, వాసవి హైస్కూల్ భైంసా. గ్రూప్ విజేత అక్షిత గ్రూప్, కేజీబీవీ జామ్. ట్రెడిషనల్ స్టోరీ టెల్లింగ్ విజేత పి.అనుదీప్తి గ్రూప్, సోఫీ నగర్ గురుకుల పాఠశాల, విజువల్ ఆర్ట్స్ 2డీ విజేత పి.అభిజ్ఞ, కేజీబీవీ జామ్, విజువల్ ఆర్ట్స్ 3డీ విజేత హవిషశ్రీ, శ్రీ చైతన్య హైస్కూల్, నిర్మల్, విజువల్ ఆర్ట్స్ గ్రూప్ విజేత జి.వినోద్, సీహెచ్.విగ్నేష్, జెడ్పీహెచ్ఎస్ మంజులాపూర్, డాన్స్ సోలో క్లాసికల్ విజేత కీర్తిశ్రీ, అల్ఫోర్స్ హైస్కూల్ నిర్మల్, గ్రూప్ డాన్స్ విజేత నిహారిక గ్రూప్, జెడ్పీహెచ్ఎస్ మంజులాపూర్, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ గ్రూప్, డి.అంకిత గ్రూప్ శ్రీసరస్వతి శిశు మందిర్, భైంసా. ఇన్స్్ట్రుమెంటల్ మ్యూజిక్ సోలో విజేత అభిలాష్, నారాయణ హైస్కూల్ నిర్మల్, థియేటర్ ఆర్ట్ గ్రూప్ విజేత జి.సుప్రియ గ్రూప్, కేజీబీవీ జామ్, ఇన్స్్ట్రుమెంటల్ మ్యూజిక్(రిథమ్) విజేత పి.రాము జెడ్పీహెచ్ఎస్ గుండంపల్లి. -
కేంద్ర ప్రభుత్వం స్పందించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షి దినపత్రిక ఎడిటర్, బ్యూరో ఇన్చార్జి, విలేకరులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నాం. దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి దాడులను ఉపేక్షించొద్దు. దీని వెనుక రాజకీయ నాయకులు ఎవరున్నా విచారణ చేపట్టి శిక్షించాలి. ఏపీలోని కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టి నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటు. – దుర్గం దినకర్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉన్న మీడియా గొంతు నొక్కడం సరికాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి దినపత్రిక ఎడిటర్‌పై కేసు నమోదు చేయడం అప్రజాస్వామికం. జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరిచడం సరికాదు. ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర ఎంతో కీలకం. – భగత్ మహేందర్, అడ్వకేట్మీడియా గొంతు నొక్కడం సరికాదు -
స్వేచ్ఛను హరించడమే..
ఆదిలాబాద్‌టౌన్: రాజ్యాంగం కల్పించిన హక్కును చంద్రబాబు ప్రభుత్వం కాలరాయడం సరికాదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మీడియాపై కక్షసాధింపు చర్యలకు పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజకీయ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలను ప్రచురిస్తే ఎడిటర్‌పై కేసులు పెట్టడం సరికాదు. సాక్షి ఎడిటర్, జర్నలిస్టులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి. – వెంకటేశ్, జేఏసీ కోకన్వీనర్ ఆసిఫాబాద్‌అర్బన్: మీడియా స్వేచ్ఛకు ఆటంకం కలిగించొద్దు. గతంలో ఏ ప్రభుత్వం కూడా మీడియాపై అణచివేతకు పాల్పడిన ఘటనలు లేవు. తప్పుడు వార్తలు రాస్తే వివరణ అడగాలి. అంతేగాని దౌర్జన్యానికి దిగడం సరికాదు. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుంది. సాక్షి పత్రిక ఎడిటర్‌పై పెట్టిన కేసులు తక్షణమే ఉపసంహరించుకోవాలి. – రాపర్తి రవీందర్, ఆసిఫాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడుప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే.. -
మా శ్రమను గుర్తించండి..!
భైంసాటౌన్: ఇతర మున్సిపాలిటీల్లో మాదిరి తమ కూ పనికి తగిన వేతనం ఇవ్వాలని భైంసా పట్టణంలోని మున్సిపల్ ఔట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు శుక్రవారం ఆందోళన చేశారు. మున్సిపల్ కార్యాలయం ప్రధానగేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఇతర మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ.16 వేల వేతనం ఇస్తుండగా, తమకు రూ.12 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ బి.రాజేశ్‌కుమార్, తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్ అక్కడికి చేరుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పినా.. వినిపించుకోలేదు. తమకు వేతనాలు పెంచుతామని చెప్పి శానిటేషన్ ఇన్స్పెక్టర్ రూ.2,500 చొప్పున వసూలు చేశారని తెలిపారు. నాలుగు నెలలుగా పీఎఫ్ జమ చేసినట్లు ఫోన్లకు మెస్సేజ్‌లు కూడా రావడం లేదన్నారు. యూనిఫాంలు, రెయిన్ కోట్లు కూడా ఇవ్వకపోవడంతో వర్షంలో తడుస్తూ విధులు నిర్వహిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం చేతులకు గ్లౌస్లు, ఆఫ్రాన్లు ఇవ్వడం లేదని, చేతులతోనే చెత్తను సేకరిస్తున్నట్లు తెలిపారు. ఒక్కరోజు విధులకు హాజరు కాకపోతే వేతనంలో వేల రూపాయలు కోత పెడుతున్నారని ఆరోపించారు. నలుగురు సభ్యులతో విచారణ కమిటీ.. భైంసాలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగడం, డబ్బులు వసూలు చేశారంటూ ఆరో పణలు చేయడంతో, కలెక్టర్ అభిలాష అభినవ్ వెంటనే స్పందించారు. ఈ మేరకు భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్‌కుమార్ అధ్యక్షతన డీపీవో, జిల్లా ఉపాధి కల్పన అధికారి, జిల్లా ఉద్యానశాఖ అధికా రి, పీఎఫ్ సభ్యుడితో కలిసి కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. భైంసా మున్సిపాలిటీలో ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలపై పూర్తి విచారణ జరపాలని, రెండు రోజుల్లో పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. దీంతో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన విరమించారు. అక్కడలా.. ఇక్కడిలా..! జిల్లాలో నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. నిర్మల్, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య విభాగంలోని ఔట్సోర్సింగ్ కార్మికులకు నెలకు రూ.16 వేల వేతనం చెల్లిస్తున్నట్లు ఆయా మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు. అయితే, భైంసాలో మాత్రం రూ.12వేలు చెల్లిస్తుండడంతో, ఇక్కడి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారితో సమానంగానే తామూ విధులు నిర్వహిస్తున్నా.. తక్కువ వేతనం చెల్లించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. విచారణ కమిటీ ఏర్పాటు.. భైంసా మున్సిపాలిటీలో ఔట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ.12 వేలు చెల్లిస్తున్నాం. ఇందులో నుంచి పీఎఫ్ పోగా రూ.10,680 ఖాతాల్లో జమవుతాయి. వేతనాలు పెంచుతామని రూ.2500 చొప్పున వసూలు చేసిన విషయం నా దృష్టికి రాలేదు. దీనిపై కలెక్టర్ విచారణ కమిటీ నియమించారు. వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. – బి.రాజేశ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్, భైంసామున్సిపాలిటీల వారీగా పారిశుద్ధ్య కార్మికుల వివరాలు మున్సిపాలిటీ రెగ్యులర్ ఔట్సోర్సింగ్ నిర్మల్ 86 252 భైంసా 07 97 ఖానాపూర్ 01 36 -
పత్రికా స్వేచ్ఛపై దాడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోందని న్యాయవాదులు, ఉద్యమ సంఘాల నాయకులు తెలిపారు. సాక్షి కార్యాలయాలపై దాడులకు దిగడం, ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై అక్కడి పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని ఖండించారు. ప్రజల పక్షాన పని చేసే జర్నలిస్టుల గొంతును నొక్కేసేలా వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామికమని పేర్కొన్నారు.బెల్లంపల్లి: ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం పత్రిక రంగం. పత్రికల్లో నిరాధారణమైన, అసత్యమైన వార్తా కథనాలు వస్తే వివరణ కోరవచ్చు. సదరు పత్రిక బాధ్యతాయుతంగా వివరణ ఇవ్వకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగా కక్షసాధింపు చర్యలు, అణచివేత విధానాలకు పాల్పడడం, అక్రమ కేసులు పెట్టడం సరైంది కాదు. సాక్షి దినపత్రిక ఎడిటర్‌పై అక్రమ కేసులు పెట్టడం సరైన విధానం కాదు. ఏదైనా సరే చట్టానికి లోబడి వ్యవహరించాలి. కానీ వేధింపులకు గురి చేసే ధోరణి ఏమాత్రం మంచిది కాదు. పత్రికా స్వేచ్ఛను కాలరాయలనుకోవడం అవివేకం అవుతుంది. – అంకెం శివకుమార్, బెల్లంపల్లి బార్అసోసియేషన్ అధ్యక్షుడుపత్రికా స్వేచ్ఛను కాలరాయొద్దు -
డిగ్రీ విద్యార్థులకు టాస్క్‌పై అవగాహన
నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గంగాధర్ విద్యార్థులకు టాస్క్ ద్వారా అందిస్తున్న శిక్షణా కార్యక్రమాలు, స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ ప్రాధాన్యం గురించి వివరించారు. విద్యార్థులు ఆధునిక సాంకేతికతపై అవగాహన పెంపొందించుకుని భవిష్యత్‌లో ఉద్యోగ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. టాస్క్ కోఆర్డినేటర్ ఎం.రజిత మాట్లాడుతూ.. విద్యార్థులు ఉద్యోగ మేళాలు, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని రాబోయే అవకాశాలను సొంతం చేసుకోవాలని సూచించారు. అనంతరం పీఎంవీకే జిల్లా కోఆర్డినేటర్ జాదవ్ హరికుమార్ 2025 ఇండియా స్కిల్స్ పోటీ గురించి వివరించారు. 63 విభాగాల్లో విద్యార్థులు నమోదు చేసుకోవడానికి స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ ఉపయోగకరమని పేర్కొన్నారు. నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని విద్యార్థులను ప్రోత్సహించారు. -
న్యాస్కామ్తో ఆర్జీయూకేటీ ఒప్పందం
బాసర: ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో డిజిటల్ రంగంలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టే దిశగా ఆర్జీయూకేటీ విద్యార్థులు, అధ్యాపకుల్లో పునర్ వైభవాన్ని పెంపొందించే లక్ష్యంతో ముందుకెళ్తామని వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపా రు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఆర్జీయూకేటీ, న్యాస్కామ్తో ఒప్పందం కుదుర్చుకుందని పే ర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా డిజిటల్ రంగంలో వేగంగా మారుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజె న్స్, సైబర్ సెక్యూరిటీ తదితర నూతన సాంకేతిక రంగాల్లో విద్యార్థులకు శిక్షణ పొందే అవకాశం కలు గుతుందని తెలిపారు. అకాడమిక్ విభాగాల వారీ గా ప్రత్యేక సమన్వయకర్తలను నియమించి విద్యార్థులకు ప్రాక్టికల్, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యం విద్యార్థులను భవిష్యత్ ఉద్యోగావకాశాలకు సిద్ధం చేస్తుందని, అధ్యాపకుల్లో నైపుణ్యం పెరుగుతుందని తెలిపారు. విద్యార్థుల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీతత్వానికి అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందిస్తుందని చెప్పారు. అనంతరం ఓ ఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్ మాట్లాడుతూ.. బాస ర ఆర్జీయూకేటీ దేశంలో డిజిటల్ విద్యా ఆవిష్కరణలకు మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు. న్యాస్ కామ్ డైరెక్టర్ ఉదయ్‌శంకర్, డీన్స్ చంద్రశేఖర్, మహేశ్, విఠల్, విద్యార్థులు పాల్గొన్నారు. -
మళ్లీ వాన
భైంసా: రెండురోజులుగా జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. బుధవారం రాత్రి నుంచి మొదలై నిరంతరం పడుతోంది. ఇంతకుమందే వరదతో నీట మునిగిన పత్తి, సోయా పంటలు ఆరుతున్న క్రమంలో మళ్లీ వర్షం కురవడంతో పరిస్థితి మొదటికే వచ్చింది. వర్షాల ప్రభావంతో కాత, పూత లేక పత్తి చేన్లు ఎరుపురంగులోకి మారుతున్నాయి. దీంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. రెండురోజులుగా వర్షాలు కురుస్తుండడంతో అప్రమత్తమైన గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ అధికారులు బుధవారం రాత్రి మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. గురువారం ఒక గేటు ద్వారా దిగువకు నీరు వెళ్తోంది. సుద్దవాగు నీటి ప్రవాహం పెరగడంతో పరీవాహక ప్రాంత రైతులు పంటలు మునుగుతాయని ఆందోళనకు గురవుతున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చే వరదనీటితో సిరాల ప్రాజెక్ట్ నీటి మట్టం పెరుగుతోంది. అలుగు నుంచి వస్తున్న నీరంతా ఇలేగాం చెరువులోకి వెళ్తోంది. అలుగు నీరు కాలువల గుండా వాగులో పడి సమీప పంట పొలాల్లోకి చేరుతోంది. వర్షం ఇలాగే కొనసాగితే పంటలు మరోసారి నీట మునిగే ప్రమాదముంది. వాతావరణ శాఖ ఈనెల 14వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని ప్రకటించడంతో జిల్లాలోని రైతులు, ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అప్రమత్తం చేస్తున్న అధికారులువర్షాలు కురుస్తుండడంతో రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్‌కుమార్ గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ అధికారులతో మాట్లాడి అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. మరోవైపు గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ అధికారులు నది పరీవాహక ప్రాంతాల రైతులను అప్రమత్తం చేస్తున్నారు. ఏ సమయంలో గేట్లు ఎత్తే పరిస్థితి వస్తుందో తెలియదని.. పశువులు, మేకలు, గొర్రెల కాపరులు, రైతులు నది పరీవాహక ప్రాంతాలకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. జిల్లా నమోదైన వర్షపాతం ఇలా..జిల్లా అంతటా 35.8 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. కుభీర్ మండలంలో 74.0 మి.మీ, తానూరులో 20.6, బాసరలో 70.2, ముధోల్‌లో 79.6, భైంసాలో 54.2, కుంటాలలో 17.8, నర్సాపూర్(జీ)లో 21.2, లోకేశ్వరంలో 36.2, దిలావర్పూర్లో 19.6, సారంగపూర్‌లో 54.6, నిర్మల్‌లో 20.4, నిర్మల్రూరల్లో 12.6, సోన్‌లో 19.4, లక్ష్మ ణచాందలో 36.2, మామడలో 5.2, పెంబిలో 29.2, ఖానాపూర్‌లో 22.2, కడెంలో 50.8, దస్తూ రాబాద్‌లో 36.6 మిల్లి మీటర్ల వర్షం కురిసింది. భైంసా: ‘సిరాల’ అలుగు నుంచి పారుతున్న నీరు -
తప్పుడు కేసులతో అణచివేయొద్దు
ఆదిలాబాద్‌టౌన్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా సాక్షి తెలుగు దినపత్రికకు సంబంధించిన జర్నలిస్టులపై తప్పుడు కేసులతో అణచివేయాలని చూడడం సరికాదు. వివిధ అంశాలపై ప్రతిపక్ష పార్టీల నాయకులు ఏర్పాటు చేసే ప్రెస్కాన్ఫరెన్స్ల వార్తలు రాసిన సందర్భంలోనూ ఎడిటర్‌తోపాటు జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం చోద్యం. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు సరికాదు. – బేత రమేశ్, టీయూడబ్ల్యూజే (143హెచ్), ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు -
సకాలంలో వేతనాలు ఇవ్వాలి
నిర్మల్ టౌన్: ‘అమ్మ ఆదర్శ’ కింద నియమించబడిన సర్వీస్ పర్సనల్ స్వచ్ఛ కార్మికులకు నెలనెలా సకాలంలో వేతనాలు చెల్లించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మారుతి కోరా రు. గురువారం కలెక్టరేట్లో డీఈవో భోజన్న ను కలిసి వినతిపత్రం అందజేశారు. 2016 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న త మ సమస్యలు ఇప్పటివరకు పరిష్కారం కా వడం లేదని తెలిపారు. ప్రతీ సర్వీస్ పర్సన్‌కు కనీస వేతనం ఇవ్వాలని, 12 నెలల పని క ల్పించాలని, యూనిఫామ్, ఐడీ కార్డు ఇప్పించాలని, ప్రమాద బీమా వర్తింపజేయాలని వి జ్ఞప్తి చేశారు. కార్మికులు చిన్న సాయన్న, పోశె ట్టి, కవిత, మల్లేశ్, మారుతి, భోజన్న, లక్ష్మి, చంద్రకాంత్, పాండురంగ ఉన్నారు. -
శాసీ్త్రయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి
నిర్మల్ రూరల్: విద్యార్థులు శాసీ్త్రయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని డీఈవో భోజన్న సూచించారు. గురువారం డీఈవో కార్యాలయంలో విద్యార్థి విజ్ఞా న్ మంథన్కు సంబంధించిన కరపత్రాన్ని సెక్టోరి యల్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత ఆలోచనలను ఆవిష్కరించడం వైపు ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. విద్యార్థి విజ్ఞాన్ మంథన్ను అన్ని పాఠశాలల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని అత్యధిక సంఖ్యలో పరీక్షకు విద్యార్థులు హాజరయ్యేలా ప్రధానోపాధ్యాయులు చొరవ చూపాలని సూచించారు. విద్యార్ధి విజ్ఞాన్ మంథన్ జిల్లా కోఆర్డినేటర్ నాగుల రవి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సాంకేతిక, సమాచార సంస్థ ఆధ్వర్యంలో ఎన్సీఈఆర్టీ, విజ్ఞాన్ భారతి సంయుక్తంగా ఈ పరీక్ష నిర్వహిస్తుందని తెలిపారు. ఆరు నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులు పరీక్ష రాసేందుకు అర్హులని పేర్కొన్నా రు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి దేశంలోని ప్రముఖ శాస్త్రవేత్తలతో కలిసే అవకాశం, ప్రముఖ పరిశోధనా సంస్థలో ఇంటర్న్‌షిప్ చేసే సదుపాయం ఉంటుందని తెలిపారు. రిజిస్ట్రేషన్ల కోసం www. vvm.inలో నమోదు చేసుకోవాలని, పూర్తి వివరాలకు 9440589047 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఎస్వోలు రాజేశ్వర్, నర్సయ్య, ప్రవీణ్, లింబాద్రి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. క్రీడల్లో రాణించేలా చూడాలిక్రీడల్లో రాణించేలా విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని డీఈవో భోజన్న సూచించారు. జిల్లా కేంద్రంలోని కస్బ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వ్యాయామ ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాలల్లో తప్పకుండా అకాడమిక్ క్యాలెండర్‌ను అమలుపరచాలని తెలిపారు. విద్యార్థులకు వ్యాయామ విద్య కోసం ప్రత్యేక పీరియడ్ కేటాయించాలని, క్రీడా పరికరాలు కొనుగోలు చేసి అందుబాటులో ఉంచాలని సూచించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి వార్షిక పరీక్షలకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలని తెలిపారు. -
పత్రికా స్వేచ్ఛపై ‘కూటమి’ కుట్ర
పాతమంచిర్యాల: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్ భయానక పరిస్థితులు సృష్టిస్తూ పత్రికా స్వేచ్ఛను హరించే కుట్ర చేస్తోందని జర్నలిస్టు, ప్రజాసంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రశ్నించే గొంతుకలపై భౌతికదాడులతోపాటు పోలీసు కేసులతో తీవ్ర అణచివేతకు గురి చేస్తోందని విమర్శించారు. అధికారంలో ఉన్న పార్టీలు ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో చేస్తున్న జాప్యం, మోసాలపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు, కార్మికులు, మహిళలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల పక్షాన వార్తల రూపంలో ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై కొందరు ప్రభుత్వ ఉద్యోగులతో ఫిర్యాదులు ఇప్పిస్తూ కేసులు నమోదు చేస్తుండడాన్ని తప్పుబట్టారు. తాజాగా ప్రతిపక్ష పార్టీల నాయకులు ఏర్పాటు చేసే ప్రెస్ కాన్ఫరెన్స్ వార్తలు రాసిన సందర్భంలోనూ సాక్షి దినపత్రికతోపాటు ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై కేసులు నమోదు చేస్తూ రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛను పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. జర్నలిస్టుల ఇళ్లలో తనిఖీల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తూ పత్రికాస్వేచ్ఛను హరిస్తూ, ప్రజల పక్షాన పనిచేసే జర్నలిస్టుల గొంతులను నొక్కేస్తున్న అప్రజాస్వామిక చర్యలను జర్నలిస్టు, ప్రజాసంఘాల నాయకులు సర్వత్రా వ్యతిరేకిస్తున్నారు. అభిప్రాయాలు వారి మాటల్లోనే.. -
పాఠశాలలకు నిర్వహణ నిధులు
లక్ష్మణచాంద: పాఠశాలలు ప్రారంభమై మూడు నెలలు గడిచాక ప్రభుత్వం నిర్వహణ నిధులు విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలోని కేజీబీవీలు, జిల్లా పరిషత్ పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు, గిరిజన సంక్షేమ పాఠశాలలు, క్రీడా పాఠశాలలకు కంపోజి ట్ స్కూల్ గ్రాంట్ మంజూరు చేసింది. అయితే.. మూడు నెలలుగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులే చాక్‌పీస్‌లు, స్టేషనరీ, ప్రయోగ పరికరా లు సొంత ఖర్చులతో కొనుగోలు చేశారు. పాఠశాలల్లో చిన్నచిన్న మరమ్మతులు చేయించారు. విద్యుత్, ఇంటర్నెట్ చార్జీలు చెల్లించారు. ఇలా పాఠశాలల నిర్వహణ కోసం అన్ని అవసరాలు తీర్చారు. నిధుల మంజూరు ఇలా..ప్రభుత్వం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలలకు నిధులు మంజూరు చేసింది. 1–30 మంది విద్యార్థులున్న పాఠశాలకు రూ.10వేలు, 31–100 మంది ఉన్న పాఠశాలకు రూ.25 వేలు, 101–250 మంది ఉన్న పాఠశాలకు రూ.50వేలు, 251–1000 మంది విద్యార్థులున్న పాఠశాలలకు రూ.75వేల చొప్పున నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులను ప్రభుత్వం ఆయా పాఠశాలల్లోని ఎస్ఎంసీ, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఖాతాల్లో జమ చేయనుంది. ఉమ్మడి జిల్లాకు ఇలా..ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని నిర్మల్ జిల్లాలో 628 పాఠశాలలుండగా రూ.156.3 లక్షలు, ఆదిలాబాద్ జిల్లాలో 846 పాఠశాలలకు గాను రూ.203.85 లక్షలు, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 715 పాఠశాలలుండగా రూ.154.2 లక్షలు, మంచిర్యాల జిల్లాలో 619 పాఠశాలలకు గాను రూ.140.2 లక్షల నిధులు మంజూరయ్యాయి. -
మెలకువలు పాటించాలి
కుంటాల: సోయా సాగులో మెలకువలు పా టించాలని హైదరాబాద్‌లోని ఎస్ఆర్టీసీ శాస్త్రవేత్తలు బలిరామ్ నెనావత్, భారతి సూ చించారు. గురువారం మండలంలోని అందకూర్ శివారులోని సోయా పంటలను పరిశీ లించారు. సోయాలో కాండం తొలుచు పురు గు, వరిలో మొగి పురుగు నివారణ చర్యల గురించి వివరించారు. ఏవో విక్రమ్, ఏఈ వో గణేశ్, రైతులు లక్ష్మణ్, శ్రీనివాస్, పండరి, మల్లేశ్, కమలాకర్ తదితరులున్నారు.ఘనంగా అటవీ అమరవీరుల దినోత్సవంసారంగపూర్: మండలంలోని చించోలి(బీ) సమీప గండిరామన్న అర్బన్ పార్కులోగల అటవీ అమరవీరుల స్తూపం వద్ద జిల్లా అట వీశాఖ అధికారి షేక్ ఆదం నాగినిభానూ ఆ ధ్వర్యంలో అటవీ అమరవీరుల దినోత్సవా న్ని ఘనంగా నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం ఆమె మాట్లాడారు. దాడులకు భయపడకుండా ధైర్యంతో అటవీశాఖ సిబ్బంది ప్రాణాల కు తెగించి అడవులను రక్షిస్తున్నారని తెలిపా రు. అనంతరం అడవుల రక్షణలో అసువులు బాసిన పలువురు కుటుంబీకులను సత్కరించారు. ఎఫ్ఆర్వోలు రామకృష్ణారావు, అని త, రాథోడ్ రమేశ్, రాథోడ్ అవినాష్, డెప్యూ టీ ఎఫ్ఆర్వోలు నజీర్‌ఖాన్, సంతోష్‌కుమార్, రాజశేఖర్, ఇర్ఫానుద్దీన్, సిబ్బంది, అమరవీరుల కుటుంబీకులు పాల్గొన్నారు. -
రైతులకు ఏదీ ధీమా?
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో ప్రతి ఏటా అతివృష్టి కారణంగా వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగి రైతులు నష్టపోతున్నారు. కొన్ని పంటలు ప్రారంభ దశలోనే దెబ్బతింటుండగా, కొన్ని పంటలు కోత సమయంలో వర్షాలు కురవడంతో రైతుల ఆశలు ఆవిరి చేస్తున్నాయి. తాజాగా పక్షం రోజుల క్రితం కురిసిన వర్షాలతో సుమారు 910 ఎకరాల్లో నష్టం పంటలు దెబ్బతిన్నాయి. గత నెల 27 నుంచి మళ్లీ కురిసిన భారీ వర్షాలు 18,420 ఎకరాల్లో పంటలను ధ్వంసం చేశాయని జిల్లా వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ అంచనాల కంటే నష్టం మరింత ఎక్కువగా ఉంటుందని రైతులు చెబుతున్నారు.పరిహారం గాలిలో దీపం..పంట నష్టం సంభవించిన ప్రతిసారీ వ్యవసాయ శాఖ అధికారులు సర్వే నిర్వహించి, నివేదికలను ప్రభుత్వానికి పంపుతున్నారు. గతేడాది కూడా ఇలాంటి నివేదికలు సమర్పించినప్పటికీ, రైతులకు ఎటువంటి పరిహారం అందలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుండటం రైతులకు తీవ్ర నిరాశను కలిగిస్తోంది. పంట నష్టం జరిగిన సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాల్సి ఉన్నప్పటికీ, అది గాలిలో దీపంలా మిగిలిపోయింది.ఫసల్ బీమా పథకం అమలు కాక..కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, అతివృష్టి, అనావృష్టి వంటి సమయాల్లో రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రూపొందించబడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకం ద్వారా రైతులు లబ్ధి పొందేవారు. ఈ పథకం కింద పత్తికి వాతావరణ ఆధారిత బీమా, వరి, సోయా వంటి పంటలకు గ్రామ యూనిట్ ఆధారంగా, ఇతర పంటలకు మండల యూనిట్ ఆధారంగా పరిహారం అందించేవారు. బీమా ప్రీమియంలో రైతులు 50%, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 25% చొప్పున భరించేవి. అయితే, 2018–19 నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేయడంతో రైతుల పంటలకు రక్షణ లేకుండా పోయింది.హామీకే పరిమితమైన అమలు..కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఫసల్ బీమా పథకాన్ని తిరిగి అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. దీంతో, వర్షాలకు పంట నష్టపోయిన రైతులు ఆర్థిక సహాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పథకం అమలులో ఉంటే, ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు గణనీయమైన ఆర్థిక ఊరట లభించేదని రైతులు అభిప్రాయపడుతున్నారు.పంటల బీమా అమలు చేయాలి..రైతులు సాగు చేస్తున్న పంటల కు ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించాలి. రైతులు ఆరుగాలం కష్టపడి అప్పులు తెచ్చి పంటలు సాగు చేస్తే విపత్తుల కారణంగా నష్టం వాటిల్లుతోంది. రైతులు సాగు చేసిన పంటలకు ప్రభుత్వం ప్రీమియం చెల్లించి బీమా కల్పిస్తే సాగుపై భరోసా కలుగుతుంది.– గురజాల సాయన్న, రైతు, కుంటాలపంటల వారీగా నష్టం వివరాలు..పంట రకం; రైతులు; ఎకరాలువరి; 4,031; 5,982పత్తి; 2,486; 3,840సోయా; 3,569; 6,286మొక్కజొన్న; 1,552; 1,885పసుపు; 905; 1,062ఆయిల్‌పామ్; 149; 326కూరగాయలు; 88; 109కందులు; 24; 0ఈ ఖరీఫ్‌లో ఇప్పటి వరకు జిల్లాలో పంటం వివరాలునష్టపోయిన రైతులు; 12,804గ్రామాలు; 411మొత్తం పంట నష్టం; 19,530 ఎకరాలుఈ చిత్రంలో మునిగిన మొక్కజొన్న పంటను చూపుతున్న రైతు దేవన్న. లక్ష్మణచాంద మండలం పీచర గ్రామ దేవన్న 1.5 ఎకరాల చేను ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగడంతో పూర్తిగా కొట్టుకుపోయింది. పంటల బీమా లేదు. ప్రభుత్వం ఆదుకుంటామని ప్రకటించినా ఇప్పటి వరకు ఎంత సాయం ఇస్తామో స్పష్టత ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. -
ఆర్జీయూకేటీ అభివృద్ధికి చర్యలు..
బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్జీయూకేటీ) అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి తెలిపారు. రూ.1.7 కోట్లతో కల్పించే మౌలిక వసతులకు శంకుస్థాపన చేశారు. అనంతరం విద్యార్థులతో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో పాల్గొన్నారు. విద్యార్థులు తమకు కొత్త ల్యాప్‌ట్యాప్‌లు ఇవ్వడం లేదని, పాతవి ఇస్తున్నారని తెలిపారు. భోజ నం నాణ్యతతో ఉండడం లేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. క్రికెట్ మైదానంలో వర్షపు నీరు నిలుస్తోందని పేర్కొన్నారు. స్పందించిన మంత్రి క్రికెట్ మైదానంలో వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. కొత్త ల్యాప్‌ట్యాప్‌లు అందించేలా సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తెలి పారు. చిన్న విషయాలకు ఆత్మహత్యల వంటి ఆ లోచనలకు పోవద్దని విద్యార్థులకు సూచించారు. ట్రిపుల్ఐటీ సాంస్కృతిక అభివృద్ధికి రూ.కోటి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి, యూని ఫాంలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ట్రిపుల్ఐటీ ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, పాల్గొన్నారు. -
‘పరిషత్’ ఓటర్లు 4,49,302
నిర్మల్‌చైన్‌గేట్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఓటర్ల తుది జాబితా విడుదలైంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో 18 జెడ్పీటీసీ, 157 ఎంపీటీసీ స్థానాల వారీగా ఓటరు జాబితాను అధికారులు ప్రకటించారు. మొత్తం 4,49,302 ఓట్లు ఉన్నారు. ఇందులో పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 21,680 మంది ఎక్కువగా ఉన్నారు.పంచాయతీ డివిజన్లు 02మొత్తం జెడ్పీటీసీ స్థానాలు 18ఎంపీటీసీ స్థానాలు 157పోలింగ్ కేంద్రాలు 893మొత్తం ఓటర్లు 4,49,302పురుషులు 2,13,805మహిళలు 2,35,485ఇతరులు 12 -
ఉపాధ్యాయుల్లో ‘టెట్’షన్
నిర్మల్‌ఖిల్లా: ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకా లకు టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) అర్హత త ప్పనిసరి. ఈ తీర్పు ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉ పాధ్యాయులకు కూడా వర్తిస్తుందా అనే సందేహాలు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలకు కారణమవుతున్నాయి. గతంలో టెట్ అర్హత లేకుండా నియమితులైన ఉపాధ్యాయులు తాజాగా సు ప్రీంకోర్టు తీర్పుతో ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లాలో ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో 2,600 మందికిపైగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో చాలామందికి టెట్ అర్హత లేదు. దీంతో తమకు ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వం, విద్యాశాఖ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పదోన్నతులు పొందిన లేదా పొందబోయే ఉపాధ్యాయులు కూడా నిర్ణీత గడువులో టెట్ అర్హత సాధించాలని తీర్పు రావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సుప్రీం తీర్పును యువత స్వాగతిస్తోంది. టెట్ అర్హత తప్పనిసరి.. సుప్రీంకోర్టు ఈ నెల 1న ఇచ్చిన తీర్పులో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా కొనసాగడానికి, పదోన్నతులకు టెట్ అర్హత తప్పనిసరి అని స్పష్టం చేసింది. కనీసం ఐదేళ్ల సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణత సాధించాలని పేర్కొంది. లేనిపక్షంలో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపింది. అయితే, పదవీ విరమణకు ఐదేళ్లలోపు సమయం ఉన్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇచ్చినప్పటికీ, వారు పదోన్నతుల అర్హత కోసం టెట్ పాస్ కావాల్సి ఉంటుంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్సీటీఈ) ఆర్టీఈ–2010 నిబంధనల ప్రకారం టెట్ తప్పనిసరి చేయగా, ఉమ్మడి రాష్ట్రంలో 2012 డీఎస్సీ పరీక్షలో ఈ నిబంధన అమలైంది. ఉపాధ్యాయ సంఘాల డిమాండ్లు.. ప్రస్తుత ఉపాధ్యాయుల సేవలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విధానాలు రూపొందించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. టెట్ అర్హతపై సడలింపులు లేదా ప్రత్యామ్నాయ పరిష్కారాలు అవసరమని వారు ఒత్తిడి చేస్తున్నారు. మినహాయింపునివ్వాలి... 2012కు ముందు ఉద్యోగాలలో చేరిన ఉపాధ్యాయులకు పదోన్నతుల్లో సైతం మినహాయింపు నిచ్చేలా ఆలోచన చేయాలి. అవసరమైతే వృత్యంతర శిక్షణ ద్వారా గుణాత్మక విద్యా బోధన కోసం ఉపాధ్యాయుల్లో నాణ్యతను పెంపొందించేలా రాష్ట్రప్రభుత్వం, విద్యాశాఖ చర్యలు చేపట్టాలి.. – తొడిశెట్టి రవికాంత్, టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సుప్రీం తీర్పు శిరోధార్యమే... మారుతున్న కాలానికి అనుగుణంగా బోధనా వృత్తిలో చేరేవారు, ఇదివరకే ఉపాధ్యాయులుగా ఉన్నవారికి సైతం టెట్ అర్హత కచ్చితంగా అవసరమన్న సుప్రీం తీర్పు శిరోధార్యమే. అన్ని వృత్తులలో కన్నా ఉపాధ్యాయ వృత్తిలో కాలాలనుగుణ మార్పులను స్వాగతించాలి. – పి.వంశీకృష్ణ , చించోలి(బి), సారంగాపూర్తీర్పును పునఃసమీక్షించాలి... దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం, ఉపాధ్యాయ సంఘాలు రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలి. ఐదేళ్ల పైబడి సర్వీసు కలిగిన ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులందరూ రెండేళ్ల వ్యవధిలో టెట్ అర్హత సాధించాలన్న తీర్పును పునఃసమీక్షించాలి. – భూమన్నయాదవ్, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు -
అండగా ఉంటాం
భైంసా/బాసర: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. జిల్లాలోని బాసరలో దెబ్బతిన్న పంటలను బుధవారం పరిశీలించారు. కలెక్టర్ అభిలాష అభినవ్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్‌తో కలిసి సోయాబీన్ పంటలను సందర్శించారు. రైతులతో మాట్లాడారు. నష్టపోయిన రైతులకు ధైర్యం చెప్పారు. దెబ్బతిన్న పంటల సర్వే చేసి, పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. జ్ఞాన సరస్వతి ఆలయంలో పూజలు.. బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారిని మంత్రి జూ పల్లి కృష్ణారావు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. పూజల అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం మహాంకాళి అమ్మవారి ఆలయంలో కూడా పూజలు చేశారు. ఆలయ అభివృద్ధిపై సమీక్ష.. కలెక్టర్ అభిలాష అభినవ్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్, ఆలయ ఈవో అంజనాదేవితో కలిసి మంత్రి జూపల్లి ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. బాసర ఆలయ అభివృద్ధికి రూ.190 కోట్లతో మాస్టర్ ప్లాన్ అమలు చేయనున్నట్లు తెలిపారు. గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వైద్య సౌకర్యాల విస్తరణ.. బాసరలో రూ.5.75 కోట్ల వ్యయంతో నిర్మించే 30 పడకల ఆస్పత్రి నిర్మాణానికి మంత్రి జూపల్లి శంకుస్థాపన చేశారు. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, మాజీ ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, నారాయణరావు పటేల్, వేణుగోపాలాచారితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మంత్రి పర్యటనకు ఏర్పాట్లు
నిర్మల్‌చైన్‌గేట్:జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ సమీపంలోని చంద్రశేఖర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. స్టాల్స్, సీటింగ్, స్టేజ్, పార్కింగ్ వంటి అంశాలను పరిశీలించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, జెడ్పీ సీఈవో గోవింద్, డీఆర్డీవో విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, తహసీల్దార్లు రాజు, సంతోష్ పాల్గొన్నారు. -
గాజుల పండుగ
నిర్మల్: లక్ష్మణచాంద మండలంలోని కనకాపూర్, మునిపల్లి మహిళలు మంగళవారం గాజుల పండుగ జరుపుకున్నారు. కనకాపూర్ మహిళలు స్థానిక రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద, మునిపల్లి మహిళలు గ్రామ సమీపంలో వ్యవసాయ క్షేత్రంలో స్నేహితులు, వదినామరదళ్లు, అక్కాచెల్లెళ్లు ఒకరికొకరు గాజులు వేసుకున్నారు. గోరింటాకు పెట్టుకుంటూ ఒకరికి ఒకరం కష్టసుఖాల్లో అండగా ఉండాలని ఆ అమ్మవారి సాక్షిగా కోరుకున్నారు. అనంతరం అక్కడే వంటలు చేసుకుని భోజనాలు చేశారు. రోజంతా ఆనందంగా గడిపారు. -
ముదిరాజ్‌ల ఆందోళన
లక్ష్మణచాంద: తమకు న్యాయం చేయాలని కో రుతూ పీచర గ్రామ ముదిరాజ్‌లు నిర్మల్ ఏ ఎస్పీ కార్యాలయం ఎదుట మంగళవారం ఆందోళన చేపట్టారు. హైకోర్టు గంగపుత్రులతోపా టు ముదిరాజ్‌లు కూడా చేపలు పట్టుకోవాలని ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. కానీ గ్రామస్తులు హైకోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టి తమ ను చేపలు పట్టుకోనివ్వడం లేదని పేర్కొన్నా రు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం తాము చేపలు పట్టుకునేందుకు సహకరించాలన్నారు. ఆందోళనలో ముదిరాజ్ రాష్ట్ర నాయకులు బొజ్జ నారాయణ, శివన్న, యాటకారి సాయన్న, పీచర గ్రామ ముదిరాజ్‌లు పాల్గొన్నారు. కడెం రెండు గేట్లు ఎత్తివేత కడెం:ఎగువన కురిసిన వర్షాలతో కడెం ప్రాజెక్టుకు మంగళవారం ఉదయం 15,910 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. దీంతో ప్రాజెక్టు అధికా రులు రెండు వరద గేట్లను ఎత్తి 10,791 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 699.125 అడుగులు ఉంది. గేట్లో ఖానాపూర్వాసి ప్రతిభఖానాపూర్: టీజీ సీపీగేట్–2025 ఫలితాల్లో మండలంలోని బావాపూర్(కె) గ్రామానికి విద్యార్థి కోరెపు రాజలింగు ప్రతిభ కనబర్చాడు. ఎంపెడ్ విభాగంలో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాదించాడు. రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన రాజలింగును గ్రామస్తులు అభినందించారు. పీజీసెట్‌లో ముధోల్ వాసికి 17వ ర్యాంకుముధోల్: ఇటీవల విడుదలైన పీజీ సెట్ ఫలితాల్లో ముధోల్లోని కోలీగల్లీకి చెందిన బర్మొల్ల సాయిలు –కళ దంపతుల కుమారు డు వెంకటేశ్ ప్రతిభ కనబరిచారు. ఎమ్మెస్సీ ఫిజిక్స్‌లో రాష్ట్రస్థాయిలో 17వ ర్యాంకు సాధించాడు. వెంకటేశ్నుపలువురు అభినందించారు. సంతకం ఫోర్జరీపై ఫిర్యాదునిర్మల్:నర్సాపూర్(జి)మండలం చాక్పల్లి క్లస్టర్ ఏఈవో రమ్య సంతకం ఫోర్జరీపై మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైతు బీ మా క్లెయిమ్ పత్రాలపై తన సంతకాలు ఫోర్జరీ చేసి రైతు బీమా నిధులు దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. సంతకాలు ఫోర్జరీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. -
బడుగుల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి సూర్యం
నిర్మల్ టౌన్: బడుగుల హక్కుల కోసం ప్రజలను చైతన్యం చేసి ప్రజాఉద్యమాన్ని నడిపిన వ్యక్తి మాజీ మావోయిస్టు వరకంటి పండరి అలియాస్ సూర్యం అని అమరుల బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు పద్మకుమారి, ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. పండరి విప్లవ ప్రస్తానని ప్రజలతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ.. ఆయన సోదరుడు రిటైర్డ్ పీజీ హెచ్ఎం వరకంటి మురళీధర్ రచించిన ‘ఆరని వెలుగు సూర్యం’ అనే పుస్తకాన్ని జిల్లా కేంద్రంలోని పెన్షనర్ భవనంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..జిల్లాలో పుట్టిన సూర్యం అలియాస్ పండరి 21 ఏళ్లకే ఉద్యమబాట పట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పీడిత ప్రజల హక్కుల కోసం 15 ఏళ్లు పోరాడి అమరుడైన విషయన్ని ఎవరూ మరిచిపోలేరన్నారు. ఆయన చరిత్ర నేటి తరానికి పుస్తక రూపంలో అందించేందుకు కృషి చేసిన కుటుంబ సభ్యులకు, ఉద్యమ నేతలుకృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ, విప్లవ నేతలు ఎన్.వేణుగోపాల్, పినకపాణి, సత్వాజి, అజయ్, నాగరాజు, జ్యోతి పుస్తక రచయిత వరగంటి మురళీధర్, ప్రముఖ న్యాయవాది మల్లారెడ్డి, ఉద్యమకారులు పాల్గొన్నారు. -
గ్రామ పాలనలో కొత్త అధ్యాయం
నిర్మల్‌చైన్‌గేట్:తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ పాలనలో పారదర్శకత, శాఖల మధ్య సమన్వయాన్ని పెంచేందుకు గ్రామ పాలనాధికారుల (జీపీవో) వ్యవస్థను ప్రవేశపెట్టింది. జిల్లా నుంచి 103 మంది జీపీవోలు ఈ నెల 5వ తేదీన హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు. ఈ నెల 11న కలెక్టర్ సమక్షంలో పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించి, మెరిట్ ఆధారంగా క్లస్టర్ల వారీగా పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. పూర్వపు వీఆర్వోలు, వీఆర్ఎలకు అవకాశం కల్పించారు. రెండు దఫాల్లో నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులై 103 మంది జీపీవోలుగా ఎంపికయ్యారు. పటేల్–పట్వారీ నుంచి జీపీవో వరకు.. తెలంగాణలో గ్రామీణ పాలన వ్యవస్థ గతంలో అనేక మార్పులకు లోనైంది. జీపీవోల నియామకం ఈ పరిణామంలో కొత్త అధ్యాయం. నిజాం పాలనలో ఉన్న పటేల్–పట్వారీ వ్యవస్థ గ్రామీణ ప్రజలకు ఇబ్బందులను కలిగించింది. 1983లో ఎన్టీ.రామారావు ఈ వ్యవస్థను రద్దు చేశారు. 1983 నుంచి 2003 వరకు గ్రామ కార్యదర్శులు రెవెన్యూ, పంచాయతీ వ్యవస్థలను నిర్వహించారు. 2004లో వైఎస్. రాజశేఖరరెడ్డి వీఆర్వో వ్యవస్థను ప్రవేశపెట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థలో అవినీతి ఆరోపణలతో దానిని రద్దు చేసి, మండల స్థాయిలో రెవెన్యూ ఇన్స్పెక్టర్, తహసీల్దార్లపై ఆధారపడింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ స్థాయిలో సమర్థవంతమైన పాలన కోసం జీపీవో వ్యవస్థను తీసుకొచ్చింది. గ్రామీణ పాలనలో కీలక బాధ్యతలు జీపీవోలు జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో నియమితులై, 11 రకాల బాధ్యతలను నిర్వర్తిస్తారు. వీటిలో భూ నిర్వహణ, సంక్షేమ పథకాల అమలు, శాఖల సమన్వయం ప్రధానమైనవి. గ్రామ ఖాతా నిర్వహణ, పహణీల నమోదు, రెవెన్యూ రికార్డుల నవీకరణ, లావాదేవీలు, ఆసైన్, దేవాదాయ, వక్ఫ్ భూముల నిర్వహణ, భూ సర్వే సేవలు. వరదలు, ఇతర విపత్తుల సమయంలో నష్టం అంచనా, సహాయక చర్యలు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులను గుర్తించడం, విచారణ నిర్వహణ. జనన–మరణ రిజిస్ట్రేషన్, ఎన్నికల సమయంలో సహకారం, వివిధ శాఖల మధ్య సమన్వయం. ఈ వధులు నిర్వహిస్తారు. 159 క్లస్టర్ల ఏర్పాటు.. జిల్లాలో 400 రెవెన్యూ గ్రామాలను 159 క్లస్టర్లుగా విభజించారు, అయితే ఎంపికై న జీపీవోల సంఖ్య 103 మాత్రమే. ప్రతీ క్లస్టర్లో బహుళ గ్రామాలను చేర్చి, జీపీవోల ద్వారా సమర్థవంతమైన పాలనను నిర్ధారించే ప్రయత్నం జరుగుతోంది. జీపీవోలకు తోడుగా రెవెన్యూ శాఖలోని రికార్డు అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లను నియమించనున్నారు. ప్రతీ గ్రామ పంచాయతీకి ఒక జీపీవోను నియమించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మొదటి విడత జీపీవో దరఖాస్తు చేసుకున్న వారు 151 అర్హులు 105 పరీక్ష రాసినవారు 96 పాస్ అయిన వారు 61 రెండో విడత దరఖాస్తు చేసుకున్నవారు 75 అర్హులు 55 పరీక్ష రాసిన వారు 37మొత్తం క్లస్టర్లు 159 జీపీవో పరీక్ష పాస్ అయినవారు 103 జిల్లాలో మొత్తం వీఆర్వోలు 96 వివిధ శాఖలలో భర్తీ అయిన వీఆర్వోలు 93 ఇంకా రిపోర్టు చేయకుండా ఉన్న వీఆర్వోలు 3 మొత్తం వీఆర్ఏలు 748 మరణించిన వీఆర్ఏలు 12 డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయిన వీఆర్ఏలు 60 -
సాహితీ సమరానికి నిలువెత్తు నిదర్శనం కాళోజీ
నిర్మల్‌చైన్‌గేట్: పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు తెలంగాణ సాహిత్యానికి, సాహితీ సమరానికి నిలువెత్తు నిదర్శనమని అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్లో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు మంగళవారం నిర్వహించారు. అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్ కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ ప్రజల హృదయాలకు హత్తుకునేలా, తెలంగాణ యాసలో కవితలు రాసి ప్రజలను చైతన్యపరిచిన మహనీయుడు కాళోజీ అని కొనియాడారు. కాళోజీ పుట్టినరోజుని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు నరసింహారెడ్డి, రమణ, శ్రీకాంత్‌రెడ్డి, మోహన్‌సింగ్, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. సమాజాన్ని జాగృతం చేసిన కవి కాళోజీ నిర్మల్‌చైన్‌గేట్:సమాజాన్ని జాగృతం చేసిన కవి కాళోజీనారాయణరావు అని నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ శకుంతల అన్నారు. కాలోజీ 111వ జయంతిని స్థానిక నర్సింగ్ కళాశాలలో నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కాళోజి తెలుగు భాషకు, తెలంగాణ యాసకు వన్నెతెచ్చారన్నారు. తన రచనలతో సమాజాన్ని జాగృతం చేశారన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ మంజుల, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆత్మహత్యే పరిష్కారం కాదు..
సమస్యలు, కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ఎదుర్కోవాలి. బుధవారం ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా కథనం. నిర్మల్భైంసా:గత నెల చివరి వారంలో జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, ఎగువన మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు జిల్లాలో గోదావరి పోటెత్తడంతో జిల్లాను అతలాకుతలం చేశాయి. రైతుల పంట పొలాలు, గ్రామీణ రోడ్లు, జాతీయ రహదారులు, బాసర పుణ్యక్షేత్రాన్ని కూడా వరదలు తాకాయి. ఈ నేపథ్యంలో జిల్లా రైతులు, భక్తులు ప్రభుత్వం నుంచి ప్రత్యేక పరిహారం, సమస్యలకు శాశ్వత పరిష్కారాలను కోరుతున్నారు. వరద విధ్వంసం.. భారీ వర్షాలకుతోడు గోదావరి, మంజీర నదులు ఉప్పొంగడంతో జిల్లాలో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. జీవనాధారమైన పంటలను కోల్పోయిన రైతులు పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక వరదలకు గ్రామీణ మౌలిక వసతులు ధ్వంసమయ్యాయి. వరదలకు పంటలు నీటమునిగి దెబ్బతిన్నాయి. పొలాల్లో ఇసుక మేటలు వేసింది. కొన్ని చోట్ల పంటలు పూర్తిగా కొట్టుకుపోయాయి. వాగు సమీపంలోని భూములపై ఇసుక మేటలు ఏర్పడటంతో నష్టం మరింత తీవ్రమైంది. గ్రామీణ రోడ్లు, భైంసా–బాసర ప్రధాన రహదారి వద్ద బిద్రెల్లి సమీపంలో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి కోతకు గురైంది. ఇది రవాణా వ్యవస్థను స్తంభింపజేసింది. జిల్లా రైతులు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా పరిహారం అందించాలని కోరుతున్నారు. అయితే, పక్కా సర్వే ఇంకా జరగకపోవడంతో నష్టపరిహారం ఎటూ తేలడం లేదు. రైతులు నష్టపోయిన వివరాలను సేకరించి, త్వరితగతిన పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. బాసర పట్టణాన్ని ముంచిన వరద.. తెలంగాణలో ప్రసిద్ధమైన బాసర శ్రీజ్ఞాన సరస్వతీదేవి కొలువై ఉనన బాసర పట్టణంలోకి గోదావరి వరద పోటెత్తింది. నది ఉప్పొంగడంతో ఆలయ ప్రాంగణం, స్నానఘట్టాలు, సమీప ప్రాంతాలు నీటమునిగాయి. మహారాష్ట్ర, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల గోదావరి, మంజీర నదులు ఉప్పొంగి, బాసరలోని ప్రధాన రోడ్లు, రైల్వే స్టేషన్, బస్టాండ్, ప్రైవేటు దుకాణ సముదాయాలు నీటమునిగాయి. స్నానఘట్టాలు రెండు రోజులపాటు నీటిలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గోదావరి నదికి ఆనుకొని వంతెన నుంచి స్నానఘట్టాల వరకు రిటర్నింగ్ వాల్ (రక్షణ గోడ) నిర్మించాలని పట్టణవాసులు కోరుతున్నారు. భద్రచలం తరహాలో రక్షణ గోడ నిర్మిస్తే, భవిష్యత్తులో వరద నీరు ఆలయ ప్రాంగణంలోకి చొచ్చుకురాదని వారు భావిస్తున్నారు. రాబోయే రెండేళ్లలో జరగనున్న గోదావరి పుష్కరాల నాటికి రిటైనింగ్ వాల్ నిర్మించాలని కోరుతున్నారు. ఆర్జీయూకేటీలో కాళోజీ జయంతిబాసర:బాసరలోని ఆర్జీయూకేటీలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 111వ జయంతి నిర్వహించారు. ముఖ్య అతిథిగా వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, విశిష్ట అతిథిగా ఓఎస్టీ ప్రొఫెసర్ మురళీధర్శన్ హాజరై కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్ డాక్టర్ విఠల్, విభాగాధిపతి డాక్టర్ రమాదేవి, అధ్యాపకులు డాక్టర్ విజయ్‌కుమార్, డాక్టర్ గోపాలకృష్ణ, డాక్టర్ రాములు, డాక్టర్ బాలకృష్ణ, డాక్టర్ రాయమల్లు పాల్గొన్నారు. 12న కళా ఉత్సవ్ పోటీలునిర్మల్ రూరల్:జిల్లాస్థాయి కళా ఉత్సవ్ పోటీలు ఈనెల 12న జిల్లా కేంద్రంలోని నారాయణ పాఠశాలలో నిర్వహించనున్నట్లు డీఈవో భో జన్న తెలిపారు. 9 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించా లని సూచించారు. వివరాలకు డీఈవో కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు. మంత్రి దృష్టికి తీసుకెళ్లేలా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం జిల్లాకు వస్తున్నారు. రైతులకు పరిహారం, గోదావరి రిటైనింగ్‌వాల్, బాసరలో పెద్ద ఆస్పత్రి నిర్మాణా నికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రైతులు, వరద బాధితులు పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. నష్టపోయిన పంటలు, ఇసుక మేటలు వేసిన భూ ములకు ఎక్కువ పరిహారం అందించాలని కోరుతున్నారు. వరదలకు ధ్వంసమైన గ్రా మీణ రోడ్లు, జాతీయ రహదారులను త్వరగా పునర్నిర్మించాలని స్థానికులు ఆశిస్తున్నారు.వైద్య సౌకర్యాల కొరత.. బాసర ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, మండల కేంద్రం, ట్రిపుల్ఐటీ వంటి విద్యా సంస్థలకు నిలయం. అయినా అత్యవసర వైద్య సౌకర్యాల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. బాసరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ) కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా అప్‌గ్రేడ్ అయినా అత్యవసర సేవలు అందించే సామర్థ్యం లేదు. ప్రస్తుతం 30 పడకల ఆస్పత్రిగా సేవలు అందిస్తున్న ఈ కేంద్రం రద్దీని తట్టుకోలేకపోతోంది. బాసరవాసులు 100 పడకల పెద్ద ఆసుపత్రి నిర్మాణం కోసం డిమాండ్ చేస్తున్నారు. గోదావరి నదిలో ప్రమాదాలు జరిగినప్పుడు లేదా అనునిత్యం రద్దీగా ఉండే బాసరలో అత్యవసర వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం పెను సమస్యగా మారింది. -
‘ఆట’ంకాలు తొలగేదెన్నడో
లక్ష్మణచాంద: మైదానాల్లోనే క్రీడాకారులు తయారవుతారనే సూత్రం ఆధారంగా, గ్రామీణ ప్రాంత విద్యార్థులలో దాగిఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసి, వాటికి పదును పెట్టడం ద్వారా వారిని మండల, జిల్లా, జోనల్, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దవచ్చు. పాఠశాలస్థాయి నుంచే క్రీడల ద్వారా విద్యార్థులకు మానసిక ఉల్లాసం, చురుకుదనం, శారీరక దృఢత్వం పెరుగుతాయనే ఉద్దేశంతో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో ఏటా వివిధ క్రీడా పోటీలను నిర్వహిస్తారు. అయితే, ఈ ఏడాది ఎస్జీఎఫ్ క్రీడల షెడ్యూల్‌పై స్పష్టత లేకపోవడంతో గ్రామీణ విద్యార్థులు, క్రీడాకారులు అనిశ్చితిలో ఉన్నారు. జిల్లాలో క్రీడా అవకాశాలు జిల్లాలో 164 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 18 కేజీబీవీలు, 15 గురుకులాలు, 1 మోడల్ స్కూల్, 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈ సంస్థల్లో చదివే విద్యార్థులు అండర్–14, అండర్–17, అండర్–19 వయో విభాగాల్లో బాల, బాలికలకు విడివిడిగా నిర్వహించే క్రీడా పోటీల్లో పాల్గొనవచ్చు. క్రికెట్, ఖోఖో, కబడ్డీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, చదరంగం, టెన్నిస్, బాస్కెట్‌బాల్ వంటి వివిధ క్రీడల్లో మూడు అంచెల్లో (మండల, జిల్లా, జోనల్) పోటీలు జరుగుతాయి. మండలస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు జిల్లా, జోనల్, రాష్ట్ర, జాతీయ స్థాయిలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం పొందుతారు. అయితే, ఈ ఏడాది జిల్లాలో ఏ క్రీడలను ఎక్కడ నిర్వహించాలి, ఎవరికి బాధ్యతలు అప్పగించాలనే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు. నిధుల కొరత.. ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో ఏటా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థుల కోసం మండల, జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహిస్తారు. అయితే, ఈసారి క్రీడలకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోవడంతో నిర్వాహకులు ఆసక్తి కోల్పోతున్నారు. మండల స్థాయి పోటీల నిర్వహణకు పాఠశాలలు ముందుకు రాకపోవడం, ఖర్చుల భారం నిర్వహణ పాఠశాలలపైనే పడటం వంటి సమస్యలు ఉన్నాయని వ్యాయామ ఉపాధ్యాయులు తెలిపారు. ఈ కారణంగా ఈ సంవత్సరం ఎస్జీఎఫ్ క్రీడల నిర్వహణ ఆలస్యమవుతున్నట్లు సమాచారం. రాాష్ట్ర ప్రభుత్వం ఎస్జీఎఫ్ క్రీడలకు తగిన నిధులను కేటాయిస్తే, గ్రామీణ విద్యార్థులలో దాగిఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసి, వారిని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే స్థాయికి తీసుకెళ్లవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రీడల నిర్వహణకు ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయాలని, అలాగే దాతలు ముందుకు వచ్చి సహకరించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. -
దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేయాలి
నిర్మల్ టౌన్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలుచేసి దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేయాలని ఎమ్మార్పీఎస్, వీహెచ్పీఎస్ జిల్లా ఇన్చార్జి నాగభూషణం డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చాలని ఎమ్మార్పీఎస్, వీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను సోమవారం ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ దివ్యాంగులకు ఇస్తామన్న రూ.6 వేలు, వృద్ధులు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, నేత, గీత ,బీడీ కార్మికులకు, డయాలసిస్, హెచ్ఐవీ రోగులకు ఇస్తామన్న రూ.4 వేల పెన్షన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో దివ్యాంగులకు రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. ఉపాధి హామీ పథకంలో 150 నుంచి 200 పనిదినాలు కల్పించి, తేలిక పనులు ఇవ్వాలన్నారు. వివాహ ప్రోత్సాహక బహుమతులు రూ.5 లక్షలకు పెంచాలని కోరారు. ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 18 నెలలు గడిచినా హామీలు నెరవేర్చలేదని తెలిపారు. కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు రాజు, జనరల్ సెక్రెటరీ భోజారెడ్డి, గౌరవ అధ్యక్షుడు పి.రాజు, ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు నందకుమార్, సాయిచంద్, శనిగారపు రవి, లక్ష్మణ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి
నిర్మల్‌టౌన్: జిల్లాలో ఇటీవల కురిసిన అతి భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు, ఆస్తులు నష్టపోయినవారికి పరిహారం అందించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్‌రాథోడ్ అన్నారు. ఈమేరకు బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా రితేష్ రాథోడ్ మాట్లాడుతూ.. వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలన్నారు. కొట్టుకుపోయి న రోడ్లకు మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు. కడెం ప్రాజెక్టు వరద ప్రభావంలో కొట్టుకుపోయిన కడెం మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన తిప్పిరెడ్డి గంగాధర్ కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్‌కు వినతిపత్రం అందజేశారు. బీజేపీ సీనియర్ నాయకులు అయ్యన్న గారి భూమయ్య, రావుల రాంనాథ్ , పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు మెడిసెమ్మ రాజు, సామ రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఆకుల శ్రీనివాస్, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
24గంటలు.. ఆన్‌డ్యూటీ
నిర్మల్ తదితర శాఖలూ సేవల్లోనే.. పీజీ సెట్లో ప్రతిభ నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్‌కు చెందిన మేన రితీశ్ సోమవారం వెలువడిన పీజీ సెట్ ఫలితాల్లో ప్రతిభ కనబర్చాడు. ఎంఎస్సీ ఫిజిక్స్‌లో రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంకు సాధించారు. హైదరాబాద్‌లోని రైల్వే డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఎంపీసీ పూర్తి చేశాడు. ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి నిర్మల్ టౌన్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం సమావేశమయ్యారు. ఓటర్ జాబితాలో డబుల్ ఓటర్లు ఉండకుండా చర్యలు చేపడతామన్నారు. ఒకటి కంటే ఎక్కువ కేంద్రాల్లో ఓటరుగా ఉంటే తొలగిస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం 4,49,302 మంది ఓటర్లు ఉన్నారని, వారి సౌకర్యార్థం 892 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్క బూత్‌లో 700–800 మందికి మించి ఓటర్లు ఉంటే అదనపు పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని పార్టీ ప్రతినిధులను కోరారు. రాజకీయ పార్టీ ప్రతినిధులు లేవనెత్తిన అనేక అంశాలపై అధికారులు సమాధానమిచ్చారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, జెడ్పీ సీఈవో గోవింద్, డీపీవో శ్రీనివాస్, వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నిర్మల్: తమ కుటుంబాలకు దూరంగా జిల్లా పోలీసులు రోజులతరబడి రోడ్లపైనే డ్యూటీ చేశారు. తమ సంతోషాలనూ పక్కనపెట్టి శాంతిభద్రతలను కాపాడారు. చివరి రెండురోజులైతే కనురెప్ప వాల్చకుండా ‘ఖాకీలు’ పనిచేయడం వల్లే జిల్లాలో గణేశ్ నవరాత్రులు విజయవంతంగా ము గిశాయి. ఒక్క పోలీసుశాఖనే కాదు అగ్నిమాపక, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ, విద్యుత్, వైద్య తదితర శాఖలన్నీ సమష్టిగా పనిచేసి ఈ ఏడాదీ వినాయక ఉత్సవాలను విజయవంతం చేశాయి. పోలీసులకు పెద్దటాస్క్.. రాష్ట్రంలోనే సున్నిత ప్రాంతంగా పేరున్న నిర్మల్ జిల్లాలో వినాయక ఉత్సవాల నిర్వహణ అంటే కత్తి మీదసాము లాంటిది. గత ఘటనలను దృష్టిలో పెట్టుకుంటూ.. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా, అన్నివర్గాలనూ సంతృప్తిపరుస్తూ, ప్రశాంతంగా ఉత్సవాలు ముగించడం పోలీసుశాఖకు అతిపెద్ద టాస్క్. ఎస్పీ జానకీషర్మిల ఈసారి కూడా పకడ్బందీగా వ్యవహరించారు. నవరాత్రులతోపాటు నిమజ్జనోత్సవ శోభాయాత్రలనూ విజయవంతంగా పూర్తిచేశారు. ఉత్సవాల్లోనూ ప్రజలతో కలిసిపోతూ.. అన్నివర్గాల నుంచి భేష్.. అనిపించుకున్నారు. వినాయక ఉత్సవాల విజయంలో అన్నిశాఖల భాగస్వామ్యం ఉన్నప్పటికీ ప్రధానంగా రోజుల తరబడి రోడ్లపైనే బందోబస్తులో ఉండి, శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడ్డ పోలీసుల పాత్రపై ప్రశంసలు కురుస్తున్నాయి. అన్ని శాఖలు కలిసి.. గణేశ్ ఉత్సవాల ప్రారంభానికి నెల ముందు నుంచే జిల్లాలో అధికార యంత్రాగానికి పనిమొదలవుతుంది. ఈసారి కూడా రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, మున్సిపల్, పంచాయతీ, విద్యుత్, వైద్య తదితర శాఖలన్నీ వినాయక ఉత్సవాల ప్రారంభానికి ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నాయి. మండపాలకు పర్మిషన్లు, విద్యుత్ కనెక్షన్లు, వేలాడుతున్న తీగల తొలగింపు, మంచినీటి వ్యవస్థ, రూట్‌మ్యాప్, నిమజ్జనం వద్ద ఏర్పాట్లు.. ఇలా ఎవరి పనులను వారు విభజించుకుని, సమష్టిగా ఉత్సవాల విజయవంతానికి పాటుపడ్డారు. కలెక్టర్ అభిలాషఅభినవ్ ఉత్సవాల ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పోలీస్.. సక్సెస్.. వినాయక ఉత్సవాల సమయంలోనే చిన్నపాటి ఘర్షణ జిల్లాలో అల్లర్లు, కర్ఫ్యూల వరకు దారితీసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈక్రమంలో అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా పోలీసుశాఖ ఈసారీ జాగ్రత్త పడింది. శాఖాపరంగా ప్రతీ నంబర్ గణపతి వద్ద 24 గంటలపాటూ నిఘా ఉండేలా కానిస్టేబుళ్లు అక్కడే ఉంటూ విధులు నిర్వర్తించారు. ఉదయం, రాత్రివేళల్లో వారిపై పర్యవేక్షణతోపాటు ప్రతీ గణేశ్ మండపం వద్దకు పోలీసులు అధికారులు గస్తీ తిరిగారు. చాలాచోట్లకు ఎస్పీ స్వయంగా వెళ్లి పర్యవేక్షించారు. ఇక ఈనెల 2న ముధోల్ నుంచి ప్రారంభమైన నిమజ్జనోత్సవాలు వరుసగా కొనసాగాయి. భైంసాలో 4న, నిర్మల్‌లో 6న నిర్వహించారు. దాదాపు వారంరోజుల నుంచి కంటిమీద కునుకు లేకుండా, రోడ్లపైనే నిల్చుని పోలీసులు సమర్థవంతంగా విధులు చేపట్టారు. నిర్మల్‌లో చివరి రెండురోజులు.. 48 గంటలు ఆన్ డ్యూటీలోనే ఉండి భేష్ అనిపించుకున్నారు. సమష్టిగా పనిచేయడంతోనే.. జిల్లా అధికార యంత్రాంగం, సిబ్బంది సమష్టిగా పనిచేయడం, జిల్లా ప్రజలందరి సహకారంతోనే వినాయక నవరాత్రులు, నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా పూర్తిచేసుకున్నాం. భైంసా, నిర్మల్లోనూ శోభాయాత్రలు ప్రశాంతంగా పూర్తిచేయగలిగాం. రోజుల తరబడి ప్రతీ పోలీసు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా పనిచేశారు. –డా.జానకీషర్మిల, ఎస్పీ‘చూడమ్మా.. బాగా చూడు.. కనిపిస్తోందా..! బంగల్పేట్ గణపతి ఎంత పెద్దగా ఉందో చూడు. ఇంతకుముందు చూసిన బుధవార్‌పేట్ గణపతి కూడా చాలా పెద్దగా ఉంది కదా బేటా..! ఇంకా చాలా చూపిస్తా బేటా.. అప్పటి వరకు అమ్మ నీకు అన్నం తినిపిస్తుంది ఓకేనా..!!’ అంటూ వీడియోకాల్‌లో ఆ తండ్రి చెబుతుండగా.. ‘అది కాదు నాన్నా.. నువ్వు ఇంకెప్పుడు ఇంటికొస్తవ్. అమ్మను, అన్నయ్యను, నన్ను ఎప్పుడు బయటికి తీసుకెళ్లి గణేశ్‌లను చూపిస్తవ్. మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ల అమ్మనాన్నలతో టూత్రీ టైమ్స్ వెళ్లారు. ఇప్పుడు కూడా అందరూ గణేశ్‌లను చూడటానికే వెళ్లారట. నువ్వేమో ఇంకా రావట్లేదు. అమ్మను అడిగితే.. ఇలా.. వీడియోకాల్‌లో నిన్ను, గణేశ్‌లను చూపిస్తోంది..’ అంటూ ఆ చిన్నారి అలా మాట్లాడుతుంటే.. కరుకు ఖాకీ డ్రెస్‌లో ఉన్న ఆ నాన్న కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. వెంటనే తేరుకుంటూ..‘వస్తా బేటా.. వస్తా.. నువ్వు తిను..’ అంటూ అయిష్టంగానే ఆ వీడియోకాల్ కట్‌చేశాడు. తన విధిలో నిమగ్నమయ్యాడు. అటు వరదలు.. ఇటు ఉత్సవాలు.. ఈ నెలరోజుల వ్యవధిలోనే ఓ దిక్కు భారీవర్షాలు, పోటెత్తిన వరదలు బెంబేలెత్తించాయి. జిల్లా అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించాయి. వాతావరణ శాఖ నివేదికలతో వారం పదిరోజులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గోదావరిలో చిక్కుకుపోయినవారిని కాపాడేందుకూ గంటల తరబడి వేచిఉండాల్సి వచ్చింది. వరద మిగిల్చిన నష్టాన్ని అంచనా వేయడం ఒకెత్తు. అలా భారీవర్షంలోనే వినాయక చవితి వచ్చేసింది. ఇటు వరదలు, అటు నవరాత్రులు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ జిల్లా అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. -
పీఎంశ్రీ వచ్చింది.. వసతులు తెస్తోంది..
పీఎంశ్రీ పాఠశాలలు హరిత పాఠశాలలుగా రూపొందుతున్నాయి. పాఠశాల గేటు వద్ద సైకస్, రాయల్ ఫామ్, అరకేరియా, రామబాణం, జిరేనియం, కాజురైనా, తూజా వంటి అలంకరణ మొక్కలు, తరగతి గదుల చుట్టూ ఏర్పాటు చేసిన భారీ వృక్షాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ఈ హరిత వాతావరణం విద్యార్థులకు సానుకూల ఆలోచనలను, పర్యావరణ స్పృహను కలిగిస్తోంది. హరిత పాఠశాలల ఏర్పాటు ద్వారా విద్యార్థులలో పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన పెరుగుతోంది. గ్రీన్ గార్డెన్ ఫీల్డ్ ట్రిప్స్ ద్వారా విద్యార్థులు పర్యావరణ రక్షణ యొక్క ప్రాముఖ్యతను ఆచరణాత్మకంగా నేర్చుకుంటున్నారు.లక్ష్మణచాంద: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా’ (పీఎం శ్రీ) పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు ఆధునిక వసతులతో కార్పొరేట్ పాఠశాలల్లా మారుతున్నాయి. ఈ పథకం కింద జిల్లాలోని 20 పాఠశాలలు ఎంపికై , విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆధునిక మౌలిక సదుపాయాలను అందిస్తున్నాయి. వినూత్న విద్యా విప్లవం.. పీఎంశ్రీ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించి, విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో విద్యా అనుభవాన్ని అందించడానికి కృషి చేస్తోంది. ఈ పథకం కింద ఎంపికై న పాఠశాలలు అత్యాధునిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ విద్య విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఎంపికై న పాఠశాలలు.. జిల్లాలో లక్ష్మణచాంద ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాసర ప్రభుత్వ ఉన్నత పాఠశాల, దేగాం ఉన్నత పాఠశాల, దిలావార్పూర్ ఉన్నత పాఠశాల, కడెం ఉన్నత పాఠశాల, తానూర్ ఉన్నత పాఠశాల, కొరిటికల్ ఉన్నత పాఠశాల, జుమ్మరత్పేట్ ఉన్నత పాఠశాల, బూరుగుపల్లి ప్రాథమికోన్నత పాఠశాల, కేజీబీవీ దస్తురాబాద్, కేజీబీవీ కుబీర్, తెలంగాణ మోడల్ పాఠశాల కుంటాల, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలు (ఎల్లాపూర్, ముధోల్, లెఫ్ట్‌పోచంపాడ్, జామ్), ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు (కుబీర్, ఈద్గాం, ఓవైసీనగర్) ఈ పథకంలో ఎంపికయ్యాయి. కార్పొరేట్ స్థాయిలో.. పీఎంశ్రీ పథకం కింద ఎంపికై న పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మారుతున్నాయి. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత, తరగతి గదుల లేమి, మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. పీఎంశ్రీ పథకం ద్వారా ఈ సమస్యలు తొలగిపోతున్నాయి. పాఠశాలల్లో కొత్త తరగతి గదుల నిర్మాణం, సీసీ కెమెరాల ఏర్పాటు, సైన్స్ ల్యాబ్‌ల నిర్మాణం, బాలికల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు, కంప్యూటర్ ల్యాబ్‌లు వంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. డిజిటల్ విద్య.. పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే, ఆసక్తికరమైన అభ్యాస అనుభవం లభిస్తోంది. ఒక్కో పా ఠశాలకు 10 కంప్యూటర్లు అందించడం, డ్యూయల్ డెస్క్ బెంచీలు, ఫ్యాన్లు, మంచినీటి సౌకర్యాలు వి ద్యార్థుల సౌకర్యాన్ని పెంచుతున్నాయి. అదనంగా, పాఠశాల ఆవరణలో పచ్చదనం, అలంకరణ మొ క్కలు, ఆకర్షణీయమైన గేట్లు విద్యార్థులకు స్ఫూ ర్తిదాయకమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి చర్యలు.. పాఠశాలల్లో స్థాపించిన పోస్టర్లు విద్యార్థులను ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని, కఠిన శ్రమతో అవి సాధించే దిశగా ప్రోత్సహిస్తున్నాయి. ‘‘నిన్ను నీవు నమ్మి, లక్ష్యాన్ని చేరే వరకు విశ్రమించకు’’ వంటి సందేశాలు విద్యార్థులలో స్ఫూర్తిని నింపుతున్నాయి. అదనంగా, ఎకో, యూత్ క్లబ్‌ల ఏర్పాటు ద్వారా విద్యార్థులు సామాజిక బాధ్యతలను, జట్టుగా పనిచేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. విద్యార్థుల అభ్యాసన అనుభవాన్ని సుసంపన్నం చేసేందుకు హైదరాబాద్, నిజామాబాద్, నిర్మల్ వంటి ప్రాంతాలకు విహార యాత్రలు, గ్రీన్ గార్డెన్లకు ఫీల్డ్ ట్రిప్స్ నిర్వహిస్తున్నారు. ఇవి విద్యార్థులలో సృజనాత్మకత, పర్యావరణ అవగాహన, ఆలోచనా శక్తిని పెంపొందిస్తున్నాయి. హరిత పాఠశాలలుగా మార్పు.. మౌలిక సదుపాయాలు జిల్లాలో పీఎంశ్రీ పథకంలో 20 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఈ పాఠశాలల్లో అదనపు గదులు, సైన్స్ ల్యాబ్‌లు, డ్యూయ ల్ డెస్కు బెంచీలు, మూత్ర శాలలు, తాగు నీరు, విద్యుత్ సౌకర్యం వంటివి సమకూరుతున్నాయి. – భోజన్న, డీఈవో, నిర్మల్ -
‘లంబాడాలు ఎస్టీలు కాదు’
కడెం: లంబాడాలు ఎస్టీలు కాదని సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు ఇస్తుందని మాజీ ఎంపీ, రాజ్‌గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయంబాపూరావు అన్నారు. మండలంలోని నర్సాపూర్ గొండుగూడలో సోమవారం నిర్వహించిన రాజ్‌గోండ్ సేవా సమితి గోండ్వానా పంచాయతీ రాయి సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్రాలు ఎలాంటి నివేదికలు ఇచ్చిన లంబాడాలు ఎస్టీలు కాదని సుప్రీంకోర్టు తీర్పునిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆదివాసీలంతా తమ దేవతలైన జంగుబాయి, పెర్సాపేన్‌ను మొక్కాలన్నారు. ఇందులో గొండ్వనా గోండు మహాసభ జాతీయ ఉపాధ్యాక్షుడు సిడాం అర్జున్, ప్రధాన కార్యదర్శి విషంరావు, ఆనంద్‌రావు, కురం శ్యాంరావు, మోతీరాం, వెడ్మ కొద్దు, గుణవంత్‌రావు, నరసింహారావు, రాజేశ్వర్, పరుశురాం తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రజా’ ఫిర్యాదులపై స్పందించాలి
నిర్మల్ టౌన్: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులపై సంబంధిత శాఖల అధికారులు స్పందించాలని, సమస్యల పరిష్యారంలో జాప్యం చేయొద్దని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు కిశోర్‌కుమార్, ఫైజాన్ అమ్మద్ ఆర్డీవో రత్న కళ్యాణితో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణికి వచ్చిన ప్రతీ దరఖాస్తును పరిశీలించి తక్షణమే స్పందించాలని అధికారులకు ఆదేశించారు. మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు. ప్రజావాణి అనంతరం కలెక్టర్ వివిధ అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక సర్వే త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలనీ సూచించారు. ఈనెల 10న ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన ఉన్నందున అధికారులంతా తమ శాఖలకు సంబంధించిన నివేదికలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. శాంతియుతంగా గణేశ్ ఉత్సవాలు.. జిల్లాలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో శాంతియుతంగా ముగిశాయని కలెక్టర్ తెలిపారు. ఆదివారం రాత్రి వరకు సాగిన వినాయక నిమజ్జన కార్యక్రమం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విజయవంతంగా పూర్తయిందన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేశాయని పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది, గణేశ్ కమిటీలు, స్వచ్ఛంద సేవాసంస్థలు, మీడియా ప్రతినిధులకు ఆమె కతజ్ఞతలు తెలిపారు. జీతాలు విడుదల చేయాలి... ఐదు నెలల నుంచి మాకు జీతాలు రావడం లేదు. అంతేకాకుండా 17 ఏళ్లుగా 104లో ఉద్యోగం చేస్తున్నాం. జీతాలు రాక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. కరోనా సమయంలో కూడా ప్రాణాలకు తెగించి వైద్య సేవలను అందించాం. మా ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయాలి. – 104 సిబ్బంది కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం ఇసుకకు అనుమతి ఇవ్వాలి.. మామడ మండలం వాస్తాపూర్, రాంపూర్ గ్రామాలకు 95 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు బేస్మెంట్ వరకు ఈ ఇళ్లు నిర్మించాం. 15 రోజుల నుంచి ఇసుక కొరత కారణంగా పనులు నిలిచిపోయాయి. పెంబి మండలం నుంచి ఇసుక తేవడానికి అనుమతి మంజూరు చేయాలి. – వాస్తాపూర్, రాంపూర్ గ్రామస్తులు డబ్బులు ఇప్పించండి.. మాది దిలావర్పూర్. నా భార్య మంజుల క్యాటరింగ్ చేస్తుంది. 2022లో న్యూ పోచంపాడ్ గ్రామంలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమాని నా భార్య భోజనాలు పంపింది. ఈ క్యాటరింగ్‌కు సంబంధించిన రూ.80 వేలు ఇప్పటివరకు రాలేదు. ప్రస్తుతం మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు. మా డబ్బులు ఇప్పించండి. – సాయిరాంఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి.. జిల్లా కేంద్రంలోని సిద్ధాపూర్ సోఫీ నగర్ ప్రాంతంలో ఉన్న చెరువు సుమారు 38.08 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువును కొంతమంది ఆక్రమించి మట్టితో పూడ్చి ప్రహరీ నిర్మిస్తున్నారు. దీంతో చెరువు విస్తీర్ణం తగ్గిపోతుంది. ఇది పర్యావరణానికి స్థానిక ప్రజల నీటి అవసరాలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. – ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు -
ఉద్యోగుల మానసికోల్లాసానికి క్రీడలు
నిర్మల్‌టౌన్: శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం పెంపొందించేందుకు క్రీడలు దోహదపడతాయని జిల్లా క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. స్పోర్ట్ అథారిటీ ఆఫ్ తెలంగా ణ ఆధ్వర్యంలో ఉద్యోగులకు జిల్లాస్థాయి పో టీలు సోమవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించారు. ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొని తమ ప్రతి భను ప్రదర్శించారు. చెస్, క్యారం, టేబుల్ టెన్నిస్ వంటి ఇండోర్ గేమ్స్‌తోపాటు ఔట్డో ర్ గేమ్స్ కూడా నిర్వహించారు. ప్రతీ విభాగంలో పోటీదారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు. కార్యక్రమంలో పీడీలు ఎం.శ్రీనివాస్, రమణారావు, అన్నపూర్ణ, సత్తయ్య, అంబాజీ, భోజన్న, వెన్నెల, భూమన్న పాల్గొన్నారు. -
పార్పల్లి హద్దులు చూపిస్తాం
లక్ష్మణచాంద: పార్పల్లి గ్రామంలో సర్వే చేయించి గ్రామ సరిహద్దులు చూపిస్తామని తహసీల్దార్ సరిత తెలిపారు. రెండు రోజుల కిందట గ్రామ శివారులో అక్రమంగా మొరం తరలిస్తున్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఒక జేసీబీ, రెండు ట్రాక్టర్లను అడ్డుకొని వాటిని గ్రామంలోకి తరలించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ సరిత, మైనింగ్ అధికారులు సోమవారం మైనింగ్ ఆర్ఐ ఆనంద్‌రావు, రెవెన్యూ ఆర్ఐ నరేందర్‌రెడ్డి పార్పల్లి గ్రామానికి వెళ్లారు. గ్రామస్తులతో మాట్లాడారు. మొదట తమ గ్రామ సరిహద్దులు చూపించాలని ఈ సందర్భంగా కోరినట్లు అధికారులు తెలిపారు. దీనిపై తహసీల్దార్ సరితను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా ఆర్ఐ నరేందర్‌రెడ్డిని పార్పల్లి గ్రామానికి పంపామని గ్రామస్తులతో మాట్లాడారన్నారు. గ్రామస్తుల విన్నపం ఉన్నతాధికారులకు నివేదించి సర్వే చేపట్టి పొట్లపల్లి(బి), పార్పల్లి గ్రామాల సరిహద్దులు చూపిస్తామని వివరించారు. -
తెరుచుకున్న బాసర ఆలయం
బాసర: రాహుగ్రస్త చంద్రగ్రహణం అనంతరం బాసర సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని సోమవారం ఉదయం 4 గంటలకు తెరిచారు. అర్చకులు ఆలయాన్ని శుద్ధి చేసి గణపతి పూజ, పుణ్యహావచనం, పంచగవ్య ప్రాశన, మహాసంప్రోక్షణ వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సుప్రభాతం, విశేష అభిషేకం, మహా నివేదన, మంత్రపుష్పం నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుంచి భక్తులకు అన్ని అర్జిత సేవలు, సర్వ దర్శనాలు తిరిగి ప్రారంభమయ్యాయి. పోటీ పరీక్షల సాధనకు ప్రత్యేక శిక్షణ బాసర: యంత్రశాస్త్ర పోటీ పరీక్షల సాధన పరిషత్ (ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ) సహకారంతో యంత్రశాస్త్ర పట్టభద్రుల యోగ్యతా పరీక్ష (గేట్)) అంతర్జాల శిక్షణ తరగతులను ప్రారంభించినట్లు బాసర ఆర్జీయుకేటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. సోమవారం ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ అకాడమీ వ్యవస్థాపకులు చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ గోపాలకృష్ణమూర్తి అంకితభావంతో ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా గేట్ శిక్షణా కార్యక్రమాలను అందించడానికి ఏ.సీ.ఈ.అకాడమీ ఒక విశ్వవిద్యాలయంతో భాగస్వామ్యం కావడం ఇదే మొదటిసారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ మురళి దర్శన్ (ఓఎస్డీ), డాక్టర్ చంద్రశేఖర్ (అసోసియేట్ డీన్ కోఆర్డినేటర్) ప్రొఫెసర్ విఠల్ (అసోసియేట్ డీన్, సైన్సెస్) వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. -
తెలంగాణ భాష.. యాసే శ్వాస
నిర్మల్‌ఖిల్లా: తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే మాతృభాష ప్రాధాన్యతను చాటేలా తెలంగాణ సంస్కృతి, సాహిత్యం, జానపద గేయాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాచీన చరిత్ర కలిగి ఉంది. సామాన్యుడి భాష, యాస ద్వారా సమస్యలపై గళం విప్పిన కాళోజీ స్ఫూర్తితో జిల్లాకు చెందిన పలువురు తెలుగు భాషోపాధ్యాయులు, కవులు, సాహితీవేత్తలు, బాలరచయితలు ప్రత్యేకత కనబర్చుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, భైంసా, ఖానాపూర్ ప్రాంతాల్లో స్థానిక భాషల్లో వైవిధ్యం కనిపిస్తుంది. వివిధ రకాల యాసలతో పాటు భాషా మాండలికాలు వాడుకలో ఉన్నాయి. జిల్లాకు చెందిన కవులు కూడా తమ రచనల్లో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ తెలంగాణ భాష పరిరక్షణకు తమవంతు పాత్ర పోషిస్తున్నారు. సెప్టెంబర్ 9న సహజకవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని ఏటా తెలంగాణ భాషాదినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం.. కవిత్వం సంక్షిప్తం...అర్థం అనంతం నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, విశ్రాంత ఉపాధ్యాయులు పత్తి శివప్రసాద్ రచన ప్రత్యేకశైలి సంతరించుకుని ఉంటుంది. తెలంగాణ యాసలో సంక్షిప్త పదాలతో కూడిన వచన కవిత్వంలో వీరిది అందవేసిన చేయి. చిన్నచిన్న వాక్యాలు, పదాల్లో అనంతమైన అర్థం దాగి ఉండేలా వీరి రచనలు ఉంటాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పదవీ విరమణ పొందిన ఆయన కొన్నేళ్లుగా అవిశ్రాంత సాహితీసేవలో కొనసాగుతున్నారు. ఎనిమిది మాసాలుగా ప్రతీరోజు వీరి కలం వెంట విరిచితమవుతున్న రచనలు పలు సామాజిక మాధ్యమాల్లో సాహితీ అభిమానులు ఇష్టపడుతున్నారు. తెలంగాణ యాసలో జిల్లా కవుల రచనలు కొన్ని...‘అవును...నేను ఆదిలాబాదోన్నే’, మట్టిగోడలు, స్వేచ్ఛకు సంకెళ్లు, పత్తిపూలు, కచ్చురం, అడవి(నవల), కొలిమి అంటుకుంది, నిరుడు కురిసిన కళ, జంగూబాయి. వ్యవహారికమే భాషకు ఆయువుపట్టు...తెలంగాణ భాషకు స్థానిక ప్రజలు మాట్లాడే వ్యవహారిక భాషనే ఆయువుపట్టుగా ఉంటుంది. తెలంగాణ యాసలో ‘అవును..నేను ఆదిలాబాదోన్నే’ అనే కవిత సంకలనాన్ని జిల్లాకు చెందిన సాహితీవేత్త అప్పాల చక్రధారి రచించారు. వందలాది మందితో మమేకమయ్యే సందర్భంలోనే భాషకు ఉన్న విభిన్న కోణాలు తెలుసుకోగలుగుతామని ఆయనంటారు. కవులు, రచయితలు తెలంగాణ యాస, భాష ప్రతిబింబించే రచనలకు ప్రాధాన్యతనివ్వడం ద్వారా తెలంగాణ భాషను ముందు తరాలకు అందివ్వగలుగుతారు. ఉమ్మడి జిల్లా నుంచి అనేకమంది కవులు, రచయితలు వర్ధమాన సాహితీవేత్తలు ఇందుకు తమ స్థాయిలో పాటుపడుతున్నారు. నేరెళ్ల హనుమంతు, తుమ్మల దేవరావు, దామెర రాములు, మడిపెల్లి రాజ్‌కుమార్, అల్లం రాజయ్య, వసంత్‌రావు దేశ్‌పాండే, మురళీధర్, చంద్రమౌళి, సామల రాజవర్ధన్, పోలీస్ భీమేశ్, ఉదారి నారాయణ, తదితర అనేకమంది ఇదే కోవలోకే చెందినవారు కావడం విశేషం. చిట్టి రచనల్లో గట్టి అర్థం స్ఫూరించేలా...నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని వెల్మల్ బొప్పారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తెలంగాణ గ్రామీణ జీవన నేపథ్యం యాస, భాష, నుడికారాలతో కూడిన కథల సంపుటిని సమష్టిగా రచించి ఏడాది క్రితం పుస్తకంగా విడుదల చేశారు.. తాజాగా మరి కొంతమంది విద్యార్థులు ‘అంకురాలు–2’ పేరిట మరో పుస్తకాన్ని విడుదల చేసేందుకు శ్రమిస్తున్నారు.. అక్కడి తెలుగు ఉపాధ్యాయుడు కొండూరి పోతన్న మార్గనిర్దేశంలో చిన్నారులంతా కలిసి తెలంగాణ భాష, సంస్కృతిపై వారికున్న మక్కువతోనే కథల సంపుటిని రచించి త్వరలో పాఠకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు పూర్తి చేస్తున్నారు. గతంలో విడుదల చేసిన తొలి కథల సంపుటిలో చక్కని గ్రామీణ నేపథ్యంతో కూడిన ఇతివృత్తాలను కథాంశాలుగా స్వీకరించి తెలంగాణ యాస, సంభాషణలను గ్రామీణ రైతుల కష్టాలు, జీవనవిధానం స్ఫూరించేలా చేసిన వీరి రచనలు రాష్ట్రస్థాయిలో పలువురు రచయితలు, సాహితీవేత్తల ప్రశంసలు పొందాయి. -
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
తానూరు: మండల కేంద్రంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు జాదవ్ దినేష్ ఇంట్లో చోరీకి పాల్పడినట్లు ఎస్సై షేక్ జుబేర్ తెలిపారు. బాధితుడు ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి మహారాష్ట్రకు వెళ్లాడు. విషయం తెలుసుకున్న దొంగలు ఇంటి వెనుక నుంచి లోనికి చొరబడి బీరువాలో ఉన్న ఒకటిన్నర తులాల నకలేష్, 5 గ్రాముల చెవి కమ్మలు,7 తులాల వెండి, రూ.30 వేల నగదు అపహరించారు. సోమవారం దినేష్ ఇంటికి వచ్చి చూడగా బీరువా తెరిచి ఉంది. చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. ఎస్సై షేక్ జుబేర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
కాసిపేట: మండల కేంద్రంలోని తెలంగాణ మాడల్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న జక్కుల అశ్విన్ రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ అబ్ధుల్ ఖలీల్ తెలిపారు. ఈనె ల 7న గోలేటిలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 4వ సబ్ జూనియర్ బాలబాలికల అండర్–14 పోటీల్లో ప్రతిభ కనబరిచి జనగామ జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. సదరు విద్యార్థిని సోమవారం అభినందించారు. కరాటే పోటీల్లో ప్రతిభఆదిలాబాద్ జిల్లా కుంగ్‌ఫూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల మందమర్రి సీఐఎస్ఎఫ్ బరాక్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి 2వ ఓపెన్ కుంగ్‌ఫూ, కరాటే చాంఫియన్ షిప్ పోటీల్లో సదరు పాఠశాల విద్యార్థినులు అశ్విత, పి.నేహ, ఆర్.మనస్విని స్వర్ణ పతకాలు, బి.సింధు, ఎస్, కీర్తన, బి.అక్షర, హన్షిత, లౌక్యశ్రీలు రజత పతకాలు సాధించినట్లు ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. సదరు విద్యార్థులను, కరాటే మాస్టర్ రవిని ప్రిన్సిపాల్ ఖలీల్, ఉపాధ్యాయులు అభినందించారు. -
గ్రామ పొలిమేరలోనే వాహనాలు
ఇంద్రవెల్లి: మండలంలోని గౌరపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గౌరపూర్, చిత్తబట్ట గ్రామాలకు మధ్యలో ఉన్న వాగుపై వంతెన నిర్మించకపోవడంతో వర్షాకాలంలో గ్రామస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగు నెల ల పాటు తమ ద్విచక్ర వాహనలు, ఆటోలను వాగుకు అవతల ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. అత్యవసర సమయంలో ఆస్పత్రికి వెళ్లలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటువైపు వ్యవసాయ భూ ములున్న రైతులు, గ్రామస్తులు గ్రామపంచా యతీ కార్యాలయానికి వెళ్లాలంటే ప్రాణాలకు తెగించి వాగు దాటుతున్నారు. వాగుపై వంతెన నిర్మించాలని పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా చిత్తబట్ట వాగుపై వంతెన నిర్మించాలని కోరుతున్నారు. -
అర్జీదారుల దరఖాస్తులు పరిష్కరించాలి
ఉట్నూర్‌రూరల్: ప్రజావాణిలో అర్జీదారుల నుంచి వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. సోమవారం పీవో చాంబర్లో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఆసిఫాబాద్‌కు చెందిన నిఖిల్ ల్యాప్‌టాప్ ఇప్పించాలని, సోనాల మండలం దేవునాయక్ తండాకు చెందిన లక్ష్మణ్ ఆర్వోఎఫ్ఆర్ పట్టా మంజూరు చేయాలని, తాండూర్‌కు చెందిన విజయలక్ష్మి ట్రైకార్ రుణం ఇప్పించాలని, నార్నూర్ మండలం కొలాంగూడకు చెందిన జంగు టెంట్ హౌజ్ కోసం, గాదిగూడకు చెందిన శిరీష ఇల్లు మంజూరు కోసం అర్జీలు సమర్పించారు. ల్యాప్‌టాప్‌లు పంపిణీ ఉన్నత విద్యాకోర్సుల్లో ప్రతిభ కనబర్చిన ఉట్నూర్ మండలంలోని ఎనిమిది మంది గిరిజన విద్యార్థులకు సోమవారం ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేసినట్లు పీవో తెలిపారు. -
సినీ ఫక్కీలో దాడికి యత్నం
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా కేంద్రంలో కొందరు యువకులు సినీ ఫక్కీ తరహాలో దాడి చేసేందుకు యత్నించారు. బాధితులు పారిపోవడంతో ప్రాణాలతో బతికి బయటపడ్డారు. టూటౌన్ సీఐ నాగరాజు తెలిపిన వివరాల మేరకు ఈనెల 6న ఆదిలాబాద్ పట్టణంలోని కోలిపూరకు చెందిన గణేశ్ మండలి సభ్యులు గ్రూప్‌గా విడిపోయి పరస్పరం దాడికి పాల్పడ్డారు. సోమవారం కోలిపూరకు చెందిన ఆకుల నితీష్ అలియాస్ టిక్కు, కారింగుల సాయికిరణ్, పరివార్ మణికంఠ అదే కాలనీకి చెందిన కళ్యాణ్, మురార్కర్ నవీన్, కార్తీక్‌తో పాటు పలువురిపై దాడి చేసేందుకు సింహాద్రి సినిమా మాదిరి సైకిల్ గేర్విల్తో తయారు చేసిన ఆయుధంతో వెళ్లారు. గమనించిన బాధితులు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో మురార్కర్ నవీన్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. కారింగుల సాయికిరణ్, పరివార్ మణికంఠలను అరెస్టు చేయగా ఆకుల నితీన్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరిపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కాగా ఈ ఆయుధాన్ని తయారు చేసిన వ్యక్తిపై సైతం కేసు నమోదు చేసినట్లు వివరించారు. -
బాసర గోదావరిలో గుర్తుతెలియని మృతదేహం
బాసర: బాసర మండలం సాలపూర్ సమీపంలోని గోదావరి నదిలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. పూర్తిగా కుళ్లిపోయి గుర్తించలేని స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆచూకీ తెలిసిన వారు బాసర పోలీసులను సంప్రదించాలని కోరారు. నవజాత శిశువు మృతి భీంపూర్: మండలంలోని భగవాన్‌పూర్‌లో నవజాత శిశువు మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ప్రియాంకకు సోమవారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. రోడ్డుమార్గం సరిగా లేకపోవడంతో అంబులెన్స్ రావడంలో ఆలస్యమైంది. దీంతో మహిళ ఇంటివద్దే ప్రసవించగా శిశువు మృతి చెందినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి రోడ్డుమార్గాన్ని బాగు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. పాముకాటుతో మహిళ.. వాంకిడి: పొలం పనులకు వెళ్లిన ఓ మహిళను పాము కాటువేయడంతో మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని నార్లాపూర్ గ్రామానికి చెందిన వడ్గురే జానాబాయి(34), శంకర్ దంపతులు ఆదివారం పంటచేనుకు వెళ్లారు. సాయంత్రం పనులు చేస్తుండగా జానాబాయిని పాముకాటు వేసింది. ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఆటో బోల్తాపడి డ్రైవర్.. కుభీర్: ఆటో బోల్తాపడి డ్రైవర్ మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై కృష్ణారెడ్డి తెలిపిన వివరాల మేరకు మండలంలోని లింగి గ్రామానికి చెందిన కె.గంగాధర్ (33) సోమవారం సాయంత్రం ఆటోలో సిమెంటు బస్తాలు వేసుకుని భైంసా నుంచి వస్తుండగా సాంవ్లి గ్రామం వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
కొలిక్కి వచ్చినట్లేనా..
చెన్నూర్: చెన్నూర్ ఎస్బీఐ–2 బ్రాంచిలో కుంభకోణం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 20 కిలోల బంగారు ఆభరణాలు, రూ.1.10 కోట్ల నగదు కోంభకోణ కేసును పక్షం రోజుల్లో రామగుండం సీపీ నేతృత్వంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చెన్నూర్ సీఐ దేవేందర్‌రావు 90 శాతం పురోగతి సాధించినట్లు తెలిసింది. పోలీసులు సుమారు 19 కిలోల బంగారు ఆభరణాలు రికవరీ చేసినట్లు తెలిసింది. ఈనెల 3 నుంచి 6 తేదీ వరకు గణేశ్ నిమజ్జనంలో పోలీసు అధికారులు బిజీబిజీగా ఉన్నారు. సోమవారం పనిదినాలు కావడంతో రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో బంగారు అభరణాలు రికవరీ చేసే అవకాశం ఉందని సమాచారం. రికవరీ బంగారం కోర్టు ద్వారానే.. పోలీసులు పూర్తిస్థాయిలో రికవరీ చేసిన బంగారు ఆభరణాలను కోర్టులో అప్పగిస్తారని తెలిసింది. బ్యాంక్ లీగల్ అడ్వయిజర్ బ్యాంక్‌లో మాయమైన ఆభరణాల వివరాలను కోర్టుకు అప్పగించి స్వాధీనం చేసుకుంటారని సమాచారం. ఇదంతా పక్షం రోజులు పడుతుందని తెలిసింది. కోర్టు ద్వారా బ్యాంక్ స్వాధీనం చేసుకున్న తర్వాత బాధితుల వారీగా నగలు పరిశీలించాల్సి ఉంటుంది. 20 కిలోల బంగారు ఆభరణాలు కావడంతో 402 మంది బాఽధితులకు సంబంధించినవి వేరు చేయాలంటే రెండు నెలలు పట్టే అవకాశం ఉందని బ్యాంక్ అధికారులు అంటున్నారు. నేడు బ్యాంక్ ఎదుట ఆందోళన? ఎస్బీఐలో గోల్డ్ రికవరీ అయిన తర్వాత ఆభరణా లు ఎప్పుడిస్తారనే అనుమానం బాధితులను వెంటాడుతుంది. పూర్తిస్థాయిలో అధికారులు తమకు ఎప్పుడిస్తారనే సమాచారం లేక సోమవారం బ్యాంక్ ఎదుట ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తామని పలువురు బాధితులు చర్చించుకుంటున్నట్లు తెలిసింది. -
పాపికొండలను తలపిస్తున్న ‘కడెం’
కడెం: కడెం ప్రాజెక్ట్ అందాలు బాగున్నాయని, పాపికొండలను తలపిస్తుందని హైకోర్టు జడ్జి సృజన అన్నారు. శనివారం రాత్రి కుటుంబ సభ్యులతో కడెం వచ్చారు. బృందావన్ రిసార్ట్స్‌లో విడిది అనంతరం ఆదివారం ఉదయం కడెం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఆయకట్టు, వరద గేట్లు, నీటిమట్టం తదితర వివరాలను తెలుసుకున్నారు. అనంతరం మిషన్ భగీరథ ఇంటెక్వెల్ను పరిశీలించారు. ప్రాజెక్ట్‌లో కుటుంబ సభ్యులతో కలిసి బోటింగ్ చేశారు. ఆమె వెంట జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి, ఆర్ఐ శారద, రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్ సిబ్బంది ఉన్నారు. -
డ్రగ్స్ ముఠా వెనుక కాంగ్రెస్ హస్తం
కాగజ్‌నగర్‌రూరల్: డ్రగ్స్ ముఠా వెనుక కాంగ్రెస్ నాయకుల హస్తం ఉండటంతోనే చూసీచూడనట్లు వదిలేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని చర్లపల్లిలో రూ.12వేల కోట్ల విలువైన డ్రగ్స్ ఓ కంపెనీలో పట్టుబడటం దారుణమని, దీనికి బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగజ్‌నగర్ మండలం కోసినిలోని ఆయన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహారాష్ట్ర పోలీసులు నెల రోజులపాటు కాపుకాసి అన్ని ఆధారాలతో దాడులు చేసి డ్రగ్స్ పట్టుకున్నారని, తెలంగాణ పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందన్నారు. డ్రగ్స్ మొక్క ఎక్కడ ఉన్నా గద్దలా పీకేస్తామని, దీని కోసం ఈగల్ అనే ఈ కొత్త డిపార్ట్మెంట్ ప్రారంభిస్తామని చెప్పిన సీఎం చర్లపల్లిలో డ్రగ్స్ ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. ఎస్పీఎం కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించాలి సిర్పూర్ పేపరుమిల్లులో కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించాలని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఇటీవల మిల్లు ప్రమాదంలో ఎన్నం భాస్కర్ అనే కాంట్రాక్టు కార్మికుడు గాయపడిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. మిల్లు నుంచి వచ్చే విషవాయువులతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. సమావేశంలో నాయకులు శ్యాంరావు, కొంగ సత్యనారాయణ, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పాముకాటుకు యువరైతు మృతి
నేరడిగొండ: అడవి పందు ల బారి నుంచి పంట కాపాడుకునేందుకు కాపలా వెళ్లిన యువ రైతు పా ముకాటుకు గురై మృతి చెందాడు. మండలంలోని గాజిలి గ్రామంలో ఈ ఘ టన చోటుచేసుకుంది. గ్రా మానికి చెందిన అనసూయ–వెంకట్ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నా రు. గ్రామంలో పదెకరాల వ్యవసాయం చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. రెండో కుమారుడు యువ రైతు చిక్రం లింగు (20) బుధవారం రాత్రి వారి పంట కాపలా కోసం అక్కడికి వెళ్లాడు. గురువారం ఉదయం ఇంటికి రాకపోయేసరికి కుటుంబీకులు వెళ్లి చూడగా లింగు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. స్థానిక వైద్యుడికి చూపించగా, మెరుగైన వైద్యం కోసం 108లో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. శనివారం రాత్రి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. -
ఎస్జీఎఫ్ క్రీడలు విజయవంతం చేయండి
ఇచ్చోడ: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా త్వరలో నిర్వహించే ఎస్జీఎఫ్ క్రీడలను విజయవంతం చేయాలని ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి ఆడే రామేశ్వర్ కోరారు. మండల కేంద్రంలోని జెడ్పీ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో క్రీడాజట్ల ఎంపిక పోటీల నిర్వహణపై చర్చించారు. 43 క్రీడాంశాల్లో 14, 17 ఏళ్ల విభాగం బాలుర, బాలికల జోనల్ వేదికలు ఖరారు చేసినట్లు తెలిపారు. జట్ల ఎంపికను పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయ, క్రీడా సంఘాలు, పీడీ, పీఈటీలు, సహకారంతో పోటీలు విజయవంతం చేయాలని తీర్మానించినట్లు తెలిపారు. సమావేశంలో మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల ఎస్జీఎఫ్ కార్యదర్శులు ఎండీ యాకుబ్, రవీందర్‌గౌడ్, వెంకటేశ్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా వ్యాయమ విద్యా ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె,పార్ధసారఽథి, బుక్యా రమేశ్, కె.భోజన్న, సాయికుమార్, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. -
సెపక్తక్రా ఉమ్మడి జిల్లా క్రీడాకారుల ఎంపిక
రెబ్బెన: మండలంలోని గోలేటి టౌన్షిప్లో సింగరేణి ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో ఆదివారం సెపక్తక్రా ఉమ్మడి జిల్లా సీనియర్ క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబర్చి ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపికై నవారు ఈనెల 20 నుంచి 22 వరకు మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తిలో పాలిటెక్నిక్ కళాశాలలో జరగబోయే అంతర్ జిల్లాల పోటీల్లో పాల్గొంటారని అసోషియేషన్ ఉమ్మడి జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కుమ్మరి మల్లేశ్ తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్‌రెడ్డి, క్రీడాకారులు నరేశ్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. ఎంపికై న క్రీడాకారులు.. సెపక్తక్రా ఉమ్మడి జిల్లా సీనియర్ పురుషుల జట్టుకు ఆడే రాజేందర్, ఆర్.వెంకటేశ్, చందు, రాజశేఖర్, రాందాస్, మహిళల జట్టుకు టి.అనూష, కె.స్ఫూర్తి కారుణ్య, జె.నేహశ్రీ, అభినవ రమ్య, కె. శ్రీవల్లి ఎంపికయ్యారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులను అసోషియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.నారాయణరెడ్డి, సెపక్తక్రా అసోషియేషన్ సంయుక్త కార్యదర్శి శిరీష, ఎగ్జిక్యూటివ్ మెంబర్ కె.భాస్కర్, ఆర్.రామకృష్ణ, జి.శ్రీధర్, పి.సాంబయ్య అభినందించారు. -
గ్రహణం ఎఫెక్ట్.. ఆలయాలు మూసివేత
మూసివేసిన కాల్వ శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రధాన ద్వారం‘గూడెం’ వద్ద..మూసివేసిన శ్రీ లక్ష్మీనారాయణస్వామి ఆలయం దిలావర్పూర్లో.. దిలావర్పూర్: మండలంలోని ప్రధాన ఆలయాలను ఆదివారం మధ్యాహ్నం మూసివేశారు. స్థానిక ఏకనాథుని, రేణుక ఎల్లమ్మ, నవాంజనేయ, శ్రీమాతా న్నపూర్ణ పాపహరేశ్వర, కాల్వ పరిసర అటవీ ప్రాంతంలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాలను అర్చకులు మూసివేశారు. సోమవారం సంప్రోక్షణ అ నంతరం భక్తులకు దర్శనం కలుగజేస్తామని ఆలయ వర్గాలు వెల్లడించాయి. జైనథ్‌లో జైనథ్: మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీనారాయణస్వామి ఆలయానికి ఆదివారం ఉదయం 10:30 గంటలకు మూసివేశారు. తిరిగి సోమవారం ఉదయం 4:00 గంటలకు తెరవనున్నారు. గ్రహ సంప్రోక్షణ, అనంతరం స్వామివారికి హారతి కార్యక్రమం తర్వాత 6 గంటలకు భక్తులకు స్వామివారి దర్శనం ఉంటుందని ఈవో చంద్రశేఖర్ తెలిపారు. దండేపల్లి: సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు దండేపల్లి మండలంలోని గూడెం సత్యనారాయణస్వామి ప్రధాన ఆలయంతోపాటు, అనుబంధ ఆలయాలను మూసివేశారు. తిరిగి సోమవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం భక్తుల దర్శనాలు ప్రారంభమవుతాయని ఆలయ ఈవో శ్రీనివాస్ పేర్కొన్నారు. -
కనీస వేతనాలు అమలు చేయాలి
జైపూర్: సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. ఇందారం ఐకే–ఓసీపీలో ఆదివారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ ప్రధాన కార్యదర్శి అఫ్రోజ్‌ఖాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్బర్ అలీతో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. తాము గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడే కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత, వైద్య సౌకర్యం, మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. ఆ తర్వాత వచ్చిన గుర్తింపు సంఘాలు కనీసం వారిని పట్టించుకోలేదన్నారు. తాము తిరిగి మళ్లీ గుర్తింపు సంఘంగా గెలిచిన వెంటనే పర్మినెంట్ కార్మికులకు మాదిరిగా వారికి లాభాల్లో వాటాగా రూ.5 వేలు ఇప్పించినట్లు తెలిపారు. హైపవర్ కమిటీ వేతనాలు, చట్టబద్ధమైన లీవు, సిక్, జాతీయ పండుగల సెలవులు ఇవ్వాలని సంస్థను కోరినట్లుగా తెలిపారు. అనంతరం ఓపెన్‌కాస్టులో పని చేస్తున్న కార్మికులు ఏఐటీయూసీలో చేరగా వారిని యూనియన్‌లోకి ఆహ్వానించారు. -
నిండుకుండలా ‘ఎల్లంపల్లి’
ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్ట్‌లతోపాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరదతో ఎల్లంపల్లి జలాశయం నిండుకుండలా మారింది. ఆదివారం ప్రాజెక్ట్ నీటిమట్టం 148 మీటర్ల క్రస్ట్ లెవెల్‌కు గాను 147.58 మీటర్లకు 148, 20.175 టీఎంసీలకు గాను 20.175 టీఎంసీలతో ఉంది. ఇన్‌ఫ్లో కింద 1,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా అవుట్ ఫ్లో కింద హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పథకానికి 315 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. 2 గేట్లు తెరిచి 1,185 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలిపెడుతున్నారు. – మంచిర్యాలరూరల్(హాజీపూర్) -
నిజాయితీ చాటుకున్న ఆటోడ్రైవర్
లక్ష్మణచాంద: పోగొట్టుకున్న ఆభరణాలు, నగదును బాధితురాలికి అప్పగించి ఆటోడ్రైవర్ నిజాయితీ చాటుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి..కడెం మండల కేంద్రానికి చెందిన కొంక సుజాత ఖానాపూర్‌లో ఆరోగ్యమిత్రగా విధులు నిర్వహిస్తోంది. ఆమె కుమార్తె వివాహానికి 16 తులాల బంగారు ఆభరణాలు నిర్మల్‌లో చేయించింది. శనివారం కుమారుడితో కలిసి బంగారు ఆభరణాలు తీసుకుని బైక్ పక్కన బ్యాగులో ఉంచి మధ్యాహ్నం కడెంకు బయల్దేరారు. ఈక్రమంలో బ్యాగు ఎక్కడో పడిపోయింది. ఈ విషయమై సోషల్ మీడియాలో పోస్టు చేశారు. లక్ష్మణచాంద మండలం రాచాపూర్‌కు చెందిన ఆటోడ్రైవర్ తక్కల సాయికుమార్ నిర్మల్ నుంచి లక్ష్మణచాంద వెళ్తున్నాడు. నిర్మల్‌రూరల్ మండలం కొండాపూర్ ఫ్లైఓవర్ సమీపంలో 61వ జాతీయ రహదారిపై బ్యాగు పడి ఉండడాన్ని గమనించి ఇంటికి తీసుకెళ్లాడు. సోషల్ మీడియాలో చూసిన సాయికుమార్ ఆదివారం బాధితురాలి వివరాలు తెలుసుకున్నాడు. రాచాపూర్‌లో 16 తులాల బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును ఆమెకు అందించారు. బ్యాగు అందించి నిజాయితీ చాటిన సాయికుమార్‌ను సుజాత కుటుంబ సభ్యులు, పలువురు అభినందించారు. -
అంబులెన్స్‌లో ప్రసవం
ఇచ్చోడ: బజార్హత్నూర్ మండలం సోనేరావుగూడ గ్రామానికి చెందిన జయమాల అనే గర్భి ణి అంబులెన్స్‌లో ప్రసవించింది. ఆదివారం ఆమెకు పురిటినొప్పులు రావడంతో భర్త చరణ్‌దాస్ అంబులెన్స్ సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకుని ఆమెను ఇచ్చోడ పీహెచ్‌సీకి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు అధికమయ్యాయి. అంబులెన్స్‌ను రోడ్డు పక్కన నిలిపి ఈఎంటీ శశికాంత్ ఆమెకు ప్రసవం చేయగా ఆడ్డపిల్లకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డను ఇచ్చోడ పీహెచ్‌సీకి తరలించారు. ఈఎంటీ శశికాంత్, పైలెట్ జైసింగ్లకు మహిళ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావుపై ఫిర్యాదు
మంచిర్యాలటౌన్: మంచిర్యాలలో శనివారం వినాయక నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావుపై అసత్య ఆరోపణలు చేసిన మాజీ ఎ మ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావుపై చర్యలు తీసుకోవాలని హిందుత్వవాదులు, ఛత్రపతి శివా జీ అభిమానులు, కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం మాట్లాడారు. గణేశ్ నిమజ్జనాన్ని హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించగా, వేదికపైకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు అసత్యపు మాటలతో రాజకీయ వేదికగా మార్చి, విద్వేషాలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు. మాజీ ఎమ్మెల్యేతోపాటు అనుచరులపై మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మూడు ఆలయాల్లో చోరీఖానాపూర్: పట్టణంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంతోపాటు తర్లపాడ్లోని ఓంకారేశ్వర, అగ్గిమల్లన్న ఆలయాల్లో శనివారం రాత్రి చోరీ జరిగింది. వీరబ్రహ్మేద్ర స్వామి ఆలయంలో 6 సీసీ కెమెరాలు, డీవీఆర్, 4 గ్రాముల పు స్తెలు, ఓంకారేశ్వర ఆలయంలో సీసీ కెమెరాతో పాటు హుండీలో నగదు, కానుకలు, అగ్గిమల్లన్న ఆలయంలో హుండీని పగులగొట్టి నగదు, కానుకలను దొంగలు ఎత్తుకెళ్లారు. పట్టణంలో ని శివాజీనగర్ కాలనీకి చెందిన సూదం శ్రీని వాస్ బైక్‌ను దొంగిలించారు. ఆలయకమిటీ సభ్యుల ఫిర్యాదులపై కేసులు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు. -
బాల్‌బ్యాడ్మింటన్ ఉమ్మడి జిల్లా జట్టు ఎంపిక
రెబ్బెన: రాష్ట్రస్థాయి బాల్‌బ్యాడ్మింటన్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి జిల్లాకు మరింత పేరు తీసుకురావాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుల్బం చక్రపాణి అన్నారు. గోలేటి టౌన్‌షిప్‌లోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అండర్–14 బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించారు. పోటీలకు సుమారు 30 మంది బాలికలు, 20 మంది బాలుర హాజరయ్యారు. అనంతరం క్రీడాకారులకు పోటీలు నిర్వహించి జిల్లా జట్లను ఎంపిక చేశారు. ఈనెల 13 నుంచి 14 వరకు జనగామ జిల్లా కూనురులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వారు పాల్గొంటారని బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్.తిరుపతి తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్‌రెడ్డి, సీనియర్ క్రీడాకారులు నరేశ్ పాల్గొన్నారు. ఎంపికై న క్రీడాకారులు ఉమ్మడి జిల్లా బాల్‌బ్యాడ్మింటన్ బాలిక జట్టుకు ఎం.సహాస్ర, టి.ప్రజ్వల శ్రీ, పి.శ్రావ్య,ఎస్.సాయిశ్రీ వర్షిణి, డి.వేరోనికా, జి.హన్నా, పి.సిరి, బి.రాజేశ్వరి, పి.పవిత్ర, ఎండీ అల్వీన, ఎస్.రిషిత, డి.నందిని, ఎస్.విజయస్పూర్తి, ఎండీ జేబా, బాలుర జట్టుకు వరుణ్, నిఖిల్, ఎం.కృష్ణ లోకనందు, సీహెచ్ అఖిల్, బి.రాఘవ, బి.ఆంజనేయులు, కె.స్ట్టీఫెన్, జె.అశ్విన్, ఎం.తిరుపతి, సీహె చ్ అరవింద్, డి.విష్ణువర్ధన్, ఎం.త్రిచూర్ కృష్ణ ఎంపికయ్యారు. -
‘పరిషత్’ ఓటరు జాబితా విడుదల
నిర్మల్‌చైన్‌గేట్:మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి ఓటరు ముసాయిదా, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలను అధికారులు శనివారం ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు జిల్లాలో నోటిఫై చేయబడిన 157 ఎంపీటీసీ, 18 జెడ్పీటీసీల జాబితాలను జిల్లా పరిషత్, మండల పరిషత్ కార్యాలయాల్లో నోటీస్ బోర్డులపై ప్రదర్శించారు. 8న జిల్లా, మండలస్థాయి రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహించి, 9న అభ్యంతరాల స్వీకరణ, 10న తుది జాబితా ప్రచురించనున్నారు. ఓటర్లు, పోలింగ్ కేంద్రాలు ఇలా.. ముసాయిదా ప్రకారం మండల పరిషత్‌ల పరిధిలో పోలింగ్ కేంద్రాలు 892, ఓటర్లు 4,49,302 ఉన్నారు. ఇందులో పురుషులు 2,13,805, మహిళలు 2,35,485, ఇతరులు 12 మంది ఉన్నారు. బీసీ రిజర్వేషన్లపైనే చర్చ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై జోరుగా చర్చ నడుస్తోంది. ఈ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండటం, ఇటు హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు పూర్తి చేయడం వంటి అంశాలు అధికార పార్టీకి సవాల్ మారాయి. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందన్నదానిపై చర్చ జరుగుతోంది. పంచాయతీ డివిజన్లు 02 జెడ్పీటీసీ స్థానాలు 18ఎంపీటీసీ స్థానాలు 157పోలింగ్ కేంద్రాలు 892మొత్తం ఓటర్లు 4,49,302 పురుషులు 213805మహిళలు 235485ఇతరులు 12 -
పోయిరా గణపయ్య..
గణనాథుని సన్నిధిలో ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, ఎస్పీ జానకీషర్మిల, ఏఎస్పీ రాజేశ్‌మీనా, ఆర్డీవో రత్నకళ్యాణి తదితరులుతానూరు : పదకొండు రోజులు విశేష పూజలందుకున్న తానూరు మండలం భోసిలోని కర్ర వినాయకుడి నిమజ్జనం శనివారం ఘనంగా ని ర్వహించారు. ముందుగా ఆలయ కమిటీ ప్రతి నిధులు ప్రత్యేక పూజలు నిర్వహించి శోభా యాత్ర ప్రారంభించారు. నవరాత్రి ఉత్సవాల చివరి రోజు కర్ర వినాయకుని దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ముడుపులు చెల్లించుకున్నారు. శోభాయాత్రకు ముందు ఆలయంలో ఉట్టికొట్టి పూజలు నిర్వహించారు. కర్ర వినా యకుని లడ్డూను వేలంలో సంగారెడ్డి జిల్లా కొరిటికల్ మండలానికి చెందిన భక్తుడు శ్రీకాంత్‌రెడ్డి రూ,1,11,000 లకు సొంతం చేసుకున్నా రు. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. శోభాయాత్రలో పాల్గొనేందుకు భక్తులు పోటీపడ్డారు. బావి సమీపంలోకి తీసుకెళ్లి నీళ్లుచల్లి ప్రత్యేకంగా తయారు చేసి న బీరువాలో కర్ర వినాయకున్ని భద్రపరిచారు. తెలంగాణ డప్పులపై.. తీన్మార్ స్టెప్పులు.. ఇక శోభాయాత్రలో తెలంగాణ డప్పు చప్పుళ్లు ప్రతిధ్వనించాయి. బ్యాండు మేళాల ముందు యువకులు తీన్మార్ స్టెప్పులేశారు. శోభాయాత్ర పొడవునా గణనాథునికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అక్షింతలు చల్లి దీవించమని వేడుకున్నారు. అందరిని చల్లంగా కాపాడుతూ ఆరోగ్యంగా ఉంచాలని, పంటలు సమృద్ధిగా పండాలని వేడుకున్నారు. ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు ఉత్తం బాలేరావ్, వీడీసీ అధ్యక్షుడు బాలాజీ తదితరులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టర్ల ‘మీన’మేషాలు!
నిర్మల్‌చైన్‌గేట్: రాష్ట్రవ్యాప్తంగా చేపల విత్తన(ఫిష్ సీడ్) పంపిణీకి సంబంధించిన టెండర్ల ప్రక్రియ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. సాధారణంగా, వర్షాకాలంలో రిజర్వాయర్లు, చెరువులలో 50 శాతం నీరు నిండిన తర్వాత ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య చేప పిల్లలను వదలడం ఆనవాయితీ. అయితే, ఈ ఏడాది కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనడానికి ముందుకు రాకపోవడంతో మత్స్యకారుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. సెప్టెంబర్ 1 నుంచి చేపల విత్తన పంపిణీ టెండర్లు ప్రకటించినప్పటికీ, స్పందన లేకపోవడంతో ప్రభుత్వం గడువును సెప్టెంబర్ 8 వరకు పొడిగించింది. బకాయిలే కారణం.. గతంలో చేప పిల్లలు సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం రూ.120 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. అందులో కేవలం రూ.30 కోట్లు మాత్రమే చెల్లించగా, మిగిలిన రూ.90 కోట్లు ఇంకా బకాయిగా ఉన్నాయి. నిర్మల్ జిల్లాకు సంబంధించి రూ.4.57 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. బకాయిలు చెల్లించే వరకు చేప పిల్లల సరఫరాకు ముందుకు రావొద్దని కాంట్రాక్టర్లు నిర్ణయించినట్లు సమాచారం. ఈ పరిస్థితి టెండర్ల ప్రక్రియను మరింత ఆలస్యం చేస్తోంది. ఆలస్యమైతే ఎదుగుదలపై ప్రభావం.. చేప పిల్లల పంపిణీ ఆలస్యంపై మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 222 మత్స్యకార సంఘాలు, 13,129 మంది మత్స్యకారులు ఉన్నా రు. వీరు చేపల వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆగస్టు నెలలో చేపల విత్తనాలను చెరువుల్లో పోస్తే, 8 నుంచి 10 నెలల్లో కిలో లేదా అంతకంటే ఎక్కువ బరువు ఎదుగుతాయి. సమయం దాటితే చేపల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడుతుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెండర్ల కోసం బడ్జెట్ కేటాయింపు 2025–26 వార్షిక సంవత్సరానికి నిర్మల్ జిల్లాలో 80 నుంచి 100 మిల్లీ మీటర్లు, 35 నుంచి 40 మిల్లీ మీటర్ల సైజులో 4.28 కోట్ల చేపల విత్తనాల పంపిణీకి టెండర్లను ఆహ్వానించారు. జిల్లాలో 5 జలాశయాలు, 552 చెరువులు/కుంటలు ఉన్నాయి. అయినప్పటికీ, గత బకాయిల సమస్య కారణంగా కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనేందుకు ఆసక్తి చూపడం లేదు. గడువు ముగిసేలోపు ప్రభుత్వం, కాంట్రాక్టర్ల మధ్య రాజీ కుదిరితేనే ఈ సంవత్సరం చేప పిల్లల పంపిణీ జరుగతుంది. మత్స్యకారుల జీవనోపాధికి ముప్పు.. చేపల వేటపై గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు. చేప పిల్ల ల పంపిణీ ఆలస్యమైతే, ఈ ఏడాది మాత్రమే కాకుండా రాబోయే రెండు మూడు సంవత్సరాలు చేపల ఉత్పత్తి కూడా దెబ్బతింటుంది. ఇది మత్స్యకారుల ఆర్థిక స్థితిని దీర్ఘకాలం దెబ్బతీస్తుంది. ప్రభుత్వం కాంట్రాక్టర్లకు వెంటనే బకాయిలు చెల్లించి చేప పిల్లలు త్వరగా చెరువులు, కుంటలు, జలాశయాల్లో వదిలేలా చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. వివరాలు: 2023–24 పెండింగ్ బిల్లు రూ.3,23,60,5772024–25 పెండింగ్ బిల్లు రూ.1,34,30,497మత్స్య సంఘాలు 222సభ్యులు 13,12935 నుంచి 40 ఎంఎం సీడ్ సరఫరా టార్గెట్ 2,22,60,00080 నుంచి 100 ఎంఎం సీడ్ సరఫరా టార్గెట్ 2,06,08,700 -
నిర్మల్
7నిమజ్జనంలో వరద సందేశం సోన్: మండల కేంద్రంలో వినాయకుడి నిమజ్జ నం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వే డుకలో సువర్ణపురి యూత్ గణేశ్ మండలి వా రు ఏర్పాటు చేసిన సందేశం ఆకట్టుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రామంలోని రైతు ల పొలాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ‘వ ర్షం కావాలి.. వరదలు వద్దు.. భూమి తడవా లి.. మునిగిపోవద్దు.. మా పాపాలను క్షమించు.. నీ చల్లని దీవెనలతో కాపాడు’ అంటూ శోభాయాత్ర రథంపై ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. నిర్మల్‌టౌన్: నిర్మల్ జిల్లా కేంద్రం శనివారం ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో మార్మోగింది. పది రోజులపాటు మండపాల్లో భక్తుల పూజలు అందుకున్న వినాయకుడు, 11వ రోజు గంగమ్మ ఒడికి ఘనంగా తరలివెళ్లాడు. గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బుధవార్పేట్లోని ‘వన్ నంబర్’ గణేశ్ మండపం వద్ద బీజేఎల్సీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎస్పీ జానకీషర్మిల, ఆర్డీవో రత్నకల్యాణి ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. ఆ తర్వాత 2, 3, 4 నంబర్ మండపాల వద్ద కూడా పూజలు జరిగాయి. బ్యాండ్ మేళాలు, డీజే సంగీతం మధ్య ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి సమితి సభ్యులతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేశారు. శోభాయాత్రలో చిన్నారులు, యువత, మండప నిర్వాహకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డీజే పాటలు, బ్యాండ్ చప్పుళ్ల నడుమ గల్లీల వారీగా గణపతిని శోభాయాత్రలో ముందుకు తీసుకెళ్లారు. ఈ శోభాయాత్రలతో నిర్మల్ పట్టణంలో పండుగ వాతావరణం కనిపించింది. భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్తేజాన్ని కలిగించింది. శాంతియుత నిర్వహణకు పిలుపు శోభాయాత్ర ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, నిర్మల్ ప్రజలందరూ కలిసి నిమజ్జనోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరా రు. ‘‘పది రోజుల గణేశ్ నవరాత్రులను భక్తిశ్రద్ధలతో పూర్తి చేశాం. అదే ఉత్సాహంతో శోభాయాత్రను విజయవంతం చేద్దాం. ఎవరికీ ఇబ్బంది కలగకుండా మేము అండగా ఉంటాం,’’ అని హామీ ఇచ్చారు. ఎస్పీ జానకీ షర్మిల శాంతియుత వాతావరణంలో శోభాయాత్ర నిర్వహించాలని, పోలీసులకు సహకరించాలని కోరారు. ‘‘ప్రజల భద్రతకు మా శాఖ ప్రాధాన్యత ఇస్తుంది,’’ అని ఆమె స్పష్టం చేశారు. భారీ భద్రతా ఏర్పాట్లు నిమజ్జనోత్సవం శాంతియుతంగా జరిగేలా పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఏడు సెక్టార్లలో 323 మంది కానిస్టేబుళ్లు, 31 మంది మహిళా కానిస్టేబుళ్లు, 106 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 34 మంది ఎస్ఐలు, 11 మంది సీఐలు, ఏఎస్పీలు భద్రతా ఏర్పాట్లలో పాల్గొన్నారు. ఎస్పీ జానకీ షర్మిల స్వయంగా ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా కొనసాగుతోంది. సేవా కార్యక్రమాలు.. శోభాయాత్ర సందర్భంగా పలు సంస్థలు, స్వచ్ఛంద సంఘాలు సేవా కార్యక్రమాలను చేపట్టాయి. భాగ్యలక్ష్మి బ్యాంబు రెస్టారెంట్, మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో నగరేశ్వరవాడ చౌరస్తాలో మహా అన్నదానం నిర్వహించారు. అలాగే, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు భక్తులకు నీటి బాటిళ్లు, ప్రసాదం ప్యాకెట్లు అందించాయి.నాలుగో‘సారీ’.. సారంగపూర్: జిల్లాలో ప్రసిద్ధ శ్రీఅడెల్లి మహాపోచమ్మ ఆలయ పరిసరాల్లో నిర్వహించే వివిధ వ్యాపారాలకు శనివారం నిర్వహించిన బహిరంగ వేలం నాలుగోసారీ వాయిదా పడింది. కొబ్బరికాయలు విక్రయించే హక్కు, ప్యా లాలు పుట్నాలు విక్రయించే దుకాణం, బొమ్మలు, సీడీలు, కంకణాలు, మెమొరీకార్డులు విక్రయించే దుకాణం, టోల్ వసూలు హక్కులకు దేవాదాయ శాఖ అధికారులు బహిరంగ వేలం నిర్వహించారు. వ్యాపారులు గతేడాదికన్నా ఎక్కువ పాడేందుకు ముందుకు రాలేదు. దీంతో వేలం వాయిదా వేశామని ఈవో రమేశ్, ఆలయ కమిటీ చైర్మన్ భోజాగౌడ్ తెలిపారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాల మేరకు ఈనెల 15వ తేదీన మళ్లీ వేలం నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
యూరియా కోసం ఆందోళన
కడెం: యూరియా కోసం మండల కేంద్రంలో రైతులు శనివారం రోడ్డెక్కారు. నిర్మల్–మంచిర్యాల ప్రధాన రహదారిపై బైఠాయించి కలెక్టర్ రావాలని నినాదాలు చేశారు. యూ రియా కోసం ప్రతీరోజు మండల కేంద్రానికి వచ్చినా దొరకడం లేదని, ఎక్కువ రేట్లకు విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతునేత హపవత్ రాజేందర్ మాట్లాడుతూ... కలెక్టర్ జిల్లాలో యూరియా కొరత లేదని చేబుతున్నారని, ఇక్కడ రైతులు పనులు వదులుకునే యూరియా కోసం రోజు ల తరబడి తిప్పలుపడుతున్నారని తెలిపారు. ఇకనైనా స్పందించి యూరియా కొరత తీర్చాల ని డిమాండ్ చేశారు. తహసీల్దార్ ప్రభాకర్, ఎస్సై సాయికిరణ్, ఏవో దినేశ్ అక్కడికి చేరుకుని సాయంత్రం లోడు వస్తుందని తెలుపడంతో ఆందోళన విరమించారు. ఇందులో మాజీ వైప్ ఎంపీపీ శ్యాంసుందర్ పాల్గొన్నారు. -
ఎస్పీ కార్యాలయంలో వినాయక నిమజ్జనం
నిర్మల్‌టౌన్: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో నెలకొల్పిన వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ జానకీషర్మిల వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు. అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. గణేశ్ శోభాయాత్రను సంప్రదాయ పద్ధతిలో బ్యాండ్ మేళాలతో క్యాంప్ కార్యాలయం నుంచి ఎస్పీ ప్రారంభించి, పోలీస్ సిబ్బందితో స్థానిక బంగల్పేట్ చెరువు లో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఉపేంద్రారెడ్డి, అవినాష్, రాజేశ్‌మీనా, పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్, రూరల్ సీఐ కృష్ణ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
● ఆగస్టు 23 నుంచి అమలు.. ● పెరుగుతున్న విద్యార్థుల హాజరు శాతం
లక్ష్మణచాంద: విద్యాశాఖలో సంస్కరణలు చేస్తున్న ప్రభుత్వం పాఠశాలలతోపాటు జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు హాజరుపై ప్రత్యేక దృష్టిసారించింది. ఇప్పటికే పాఠశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఫేషియల్ రికగ్నిషన్(ఎఫ్ఆర్ఎస్) అమలు చేస్తోంది. ఆగస్టు 1 నుంచి జూనియర్ కళాశాలల అధ్యాపకులకు ఎఫ్ఆర్ఎస్ అమలు ప్రారంభించింది. తాజాగా ఆగస్టు 23 నుంచి విద్యార్థులకు కూడా ఎఫ్ఆర్ఎస్ ప్రారంభించింది. మరోవైపు కళాశాలలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు మంజూరు చేశారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు ముఖ గుర్తింపు ఆధారిత హాజరు నమోదు విధానాన్ని ప్రవేశపెట్టారు. 13 కాలేజీల్లో.. జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆగస్టు 23 నుంచి ఎఫ్ఆర్ఎస్ ఆధారిత విద్యార్థి హాజరు నమోదు ప్రారంభమైంది. అధ్యాపకులు మొబైల్ ఫోన్ల ద్వారా ఉదయం 9:30 గంటలకు మొదటి తరగతి సమయంలో, మధ్యాహ్నం మొదటి తరగతి సమయంలో రెండో సారి హాజరును నమోదు చేస్తున్నారు. ఈ విధానం విద్యార్థుల హాజరును క్రమబద్ధీకరించడంతోపాటు, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి దోహదపడుతుందని ఇంటర్ విద్యాశాఖ అధికారులు తెలిపారు. హాజరు శాతం పెంపే లక్ష్యం.. గతంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉండేది. కొందరు విద్యార్థులు మధ్యాహ్న భోజన సమయంలో ఇంటికి వెళ్లి తిరిగి రాకపోవడం, మరికొందరు కళాశాలకు రాకుండా ఉండటం వల్ల ఉత్తీర్ణత శాతం తగ్గిందని ఉన్నత విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఎఫ్ఆర్ఎస్ హాజరు విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానం ద్వారా విద్యార్థి హాజరు కాకపోతే, వారి తల్లిదండ్రులకు సమాచారం ఎస్ఎంఎస్ ద్వారా అందుతుంది. ఈ చర్యతో తల్లిదండ్రులు తమ పిల్లలను కళాశాలకు వెళ్లేలా చూస్తారు. ఈ విధానం అమలు తర్వాత హాజరు శాతం గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగిందని, రాబోయే రోజుల్లో మరింత మెరుగవుతుందని అధ్యాపకులు తెలిపారు. జిల్లాలో 4,844 మంది విద్యార్థులు.. జిల్లాలో 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో మొదటి సంవత్సరంలో 2,592 మంది, రెండవ సంవత్సరంలో 2,252 మంది, మొత్తం 4,844 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ 202 మంది బోధన సిబ్బంది, 48 మంది బోధనేతర సిబ్బంది, మొత్తం 250 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. పకడ్బందీగా అమలు ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు ప్రవేశపెట్టిన ఎఫ్ఆర్ఎస్ హాజరు పకడ్బందీగా అమలు చేస్తున్నాం. ఆగస్టు 23 నుంచి 13 కళాశాలల్లో ఈ విధానంతోనే విద్యార్థులకు హాజరు నమోదు అమలు చేస్తున్నాం. దీంతో విద్యార్థుల హాజరు శాతం పెరుగుతోంది. – పరశురామ్ నాయక్, ఇంటర్ విద్యాధికారి -
జీఎస్టీ సంస్కరణలతో ధరలు తగ్గుతాయి
భైంసాటౌన్: కేంద్రం తెస్తున్న జీఎస్టీ సంస్కరణలతో అనేక వస్తువుల ధరలు తగ్గుతాయని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ తెలిపారు. వ్యవసా య యంత్ర పరికరాలు, విత్తనాలు, ఇతర వస్తువులపై కేంద్రం జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించిందని పేర్కొన్నారు. పట్టణంలోని ఎస్ఎస్ కాటన్లో ప్రధాని మోదీ చిత్రపటానికి శుక్రవారం పాలా భిషేకం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగానే పలు వస్తువులపై జీఎస్టీని తగ్గించిందన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు సాయినాథ్, గంగాధర్, సుష్మ, భీంరావ్, చిన్నారెడ్డి, రాకేశ్, భూమేష్, పండిత్ తదితరులు పాల్గొన్నారు. తైబజార్ టెండర్ రద్దు నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్ పట్టణంలో తైబజార్తో చిరు వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కలెక్టర్, అదనపు కలెక్టర్లతో మాట్లాడి టెండర్ రద్దు చేయాలని ఆదేశించారు. ఇకపై పట్టణంలోని చిన్న వ్యాపారులు వ్యాపార నిర్వహణకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. స్వేచ్ఛగా తమ వ్యాపారాలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. -
భోసికి పోటెత్తిన భక్తులు
తానూరు: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భోసిలో నెలకొల్పిన కర్ర వినాయకుని ఆలయానికి శుక్రవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నా రు. సెలవు దినం కావడంతో మన రాష్ట్రంతోపాటు, మహారాష్ట్ర నుంచి భక్తులు ప్రత్యేక వాహనాల్లో చేరుకుని గణనాథునికి పూజలు చేశారు. చివరి రోజు ఆలయంలో నిర్వహించిన హోమంలో దంపతులు పాల్గొన్నారు. 11 రోజులుగా పూజలందుకున్న కర్ర వినాయకుని నిమజ్జనోత్సవం శనివారం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు ఉత్తం బాలేరావ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు బాలాజీ తెలిపారు. మధ్యాహ్నం ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి కార్యక్రమం, అన్నదానం అనంతరం గ్రామంలో శోభాయాత్ర ఉంటుందని వివరించారు. నేడు కొరడి గణపతి నిమజ్జనం భైంసారూరల్: మాటేగాంలో స్వయంభు కొరడి గణపతి నిమజ్జనం శనివారం జరుగనుంది. పది రోజులుగా వేలమంది భక్తులు కాలినడకన వచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. నిమజ్జనోత్సవంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొంటా రని నిర్వాహకులు తెలిపారు. ఆలయం నుంచి ప్రధాన వీధులగుండా శోభాయాత్ర జరుగుతుంది. -
మరమ్మతులు ఎప్పుడో..
తానూరు: ఇటీవల కురిసిన భారీ వర్షానికి మండలంలోని బెల్తరోడ సట్వాజీవాగు సమీపంలో డబుల్‌రోడ్డు కోతకుగురైంది. బ్రిడ్జికి ఇరువైపులా మట్టి కొట్టుకుపోవడంతో ప్రమాదకరంగా మారింది. ఈ రహదారిమీ దుగా నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. కోతకుగురైన ప్రాంతంలో కనీసం సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో రాత్రివేళ ప్రమాదం జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు తగ్గిన వెంటనే మరమ్మతులు చేస్తామని అధికారులు ప్రకటించారు. కానీ, ఇప్పటికీ అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. -
శోభాయాత్రకు సర్వం సిద్ధం
నిర్మల్జోరుగా పేకాట..! భైంసా పట్టణంలోనే కాకుండా జిల్లాలోని మండలకేంద్రాలు, గ్రామాల్లో పేకాట కోరలు చాస్తోంది. చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఆర్జీయుకేటీలో మ్యాట్‌ల్యాబ్ బాసర ఆర్జీయుకేటీలో ట్రిపుల్ఈ విభాగం ఆధ్వర్యంలో నెక్సస్ క్లబ్ మ్యాట్‌ల్యాబ్ బూట్ శిక్షణ శిబిరం నిర్వహించారు. వినాయకుడిని దర్శించుకున్న కలెక్టర్ నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని బుధవార్‌పేట్ కాలనీలో కొలువుదీరిన నంబర్ 1 వినాయకుడిని కలెక్టర్ అభిలాష అభినవ్ తన భర్తతో కలిసి శుక్రవారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. వినాయక మండలి నిర్వాహకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వారిని సత్కరించి జ్ఞాపిక బహూకరించారు. ఇందులో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, గణేశ్ మండప నిర్వాహకులు పూదరి రంజిత్, సాయికృష్ణ, బద్రి శ్రీనివాస్, పతికే రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ టౌన్: తొమ్మిది రోజులు భక్తుల పూజలందుకున్న గణనాథులు గంగమ్మ తరలేందుకు సిద్ధమవుతున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో గణపతికి వీడ్కోలు పలికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. శనివారం ఉదయం నిమజ్జన శోభాయాత్ర ప్రారంభం అవుతుంది. పట్టణంలో ప్రతిష్టించిన భారీ విగ్రహాలకు అధికారులు, పోలీసులు నంబర్లు కేటాయించారు. ఈ వరుస క్రమంలోనే శోభాయాత్ర మొదలు కానుంది. బుధవార్పేట్లోని మొదటి నంబర్ గణపతి వద్ద స్థానిక ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎస్పీ జానకీషర్మిలతోపాటు అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పాత బస్టాండ్, వివేక్ చౌక్, జయశంకర్ చౌరస్తా, నాగ్రేశ్వర్ వాడ, నిషాన్, ధ్యాగావాడ, పెద్ద మార్కెట్, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్, సోమవార్‌పేట, గాంధీచౌక్, నాయుడు వాడ, బేస్తవార్‌పేట మీదుగా బంగల్పేటలోని వినాయక సాగర్ వరకు శోభాయాత్ర సాగుతుంది. డీజేలు నిషేధం.. అధిక శబ్దం కలిగించే డీజేలు, ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన డీజేలను నిషేధించారు. బాణాసంచ, లేజర్ లైట్లు, డీజే వాహనాలపై కాగితాలు విసిరే మోటా ర్లు వినియోగించరాదని నిర్వాహకులకు సూచించా రు. రెండు సౌండ్ బాక్స్‌లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఎస్పీ జానకీషర్మిల శోభాయాత్ర మార్గాన్ని, వినాయక సాగర్ వద్ద ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. శాంతియుతంగా జరుపుకోవాలి.. గణేశ్ నిమజ్జనోత్సవం శాంతియుతంగా జరిపేందుకు పోలీసులకు సహకరించాలి. నిమజ్జనానికి పోలీస్ బందోబస్తుతోపాటు, సీసీ కెమెరాలు, డ్రోన్లు ఉపయోగిస్తున్నాం. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టొద్దు. పుకార్లు నమ్మవద్దు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. నిమజ్జన శోభాయాత్రలో ప్రజల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నాం. – జానకీషర్మిల, ఎస్పీ గతంలో జరిగిన ఘటనల నేపథ్యంలో పోలీసు శాఖ భారీ బందోబస్తు చేపట్టింది. ఎస్పీ జానకీషర్మిల పర్యవేక్షణలో ఏడు సెక్టార్లలో 323 మంది కానిస్టేబుళ్లు, 31 మంది మహిళా కానిస్టేబుళ్లు, 106 మంది ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, 34 మంది ఎస్సైలు, 11 మంది సీఐలు, ఇద్దరు ఏఎస్పీలు, ఒక అడిషనల్ ఎస్పీ బందోబస్తులో పాల్గొంటారు. శోభాయాత్ర మార్గంలో 180 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌తో అనుసంధానం చేశారు. ఏదైనా అలజడి జరిగితే తక్షణం స్పందించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. శోభాయాత్రను చిత్రీకరించేందుకు వీడియో గ్రాఫర్లను కూడా నియమించారు. వినాయకసాగర్ వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక టాయిలెట్స్, సిద్ధంగా ఉన్న క్రేన్ వినాయక సాగర్ వద్ద ఏర్పాట్లు.. వ్యవసాయం.. రసాయన రహితం ఇంటర్ విద్యార్థులకూ ఎఫ్ఆర్ఎస్ పోలీసుల సూచనలు.. నిమజ్జనం కోసం బంగల్పేటలోని వినాయక సాగర్(బంగల్ చెరువు) వద్ద మున్సిపల్, పంచాయతీరాజ్, రెవెన్యూ, విద్యుత్, ఫైర్, పోలీస్ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తయ్యాయి. వినాయకసాగర్తోపాటు కంచేరోడి చెరువు, సిద్దాపూర్ వాగు వద్ద కూడా నిమజ్జనం కోసం సౌకర్యాలు కల్పించారు. వినాయకసాగర్ వద్ద రెండు క్రేన్లు, 12 మంది గజ ఈతగాళ్లు, జనరేటర్లు, 500 అదనపు వీధి దీపాలు, తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేశారు. చెరువ సమీపంలో బారికేడ్లు సిద్ధం చేశారు. -
ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయంలో శుక్రవారం ఉపాధ్యాయ దినో త్సవం ఘనంగా నిర్వహించారు. డీఈవో భోజన్న, అధికారులు సర్వేపల్లి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు సర్వేపల్లిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేసి, అంచెలంచెలుగా ఎదిగిన మహానీయుడని కొనియాడారు. ఉపాధ్యాయులు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉన్నతమైన భావాలు, ఆశయాలు అందిపుచ్చుకుని వృత్తికి న్యాయం చేయాలని కోరారు. ఇందులో సెక్టోరియల్ అధికారులు రాజేశ్వర్, ప్రవీణ్‌కుమార్, లింబాద్రి, జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డ్ సహాయ కార్యదర్శి భానుమూర్తి పాల్గొన్నారు. -
‘మధ్యాహ్న’ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ఖానాపూర్: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సులోచన అన్నారు. మండలంలోని మస్కాపూర్‌లో గురువారం నిర్వహించిన ద్వితీయ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తోందన్నారు. నెలకు రూ.10వేల వేతనంతో పాటు యూనిఫాం, ఐడీ కార్డులు, 60 ఏళ్లు పైబడిన కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.2లక్షలు అందజేయాలన్నారు. అనంతరం 19 మంది సభ్యులతో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షురాలిగా గంగామణి, అధ్యక్షురాలిగా గోదావరి, ఉపాధ్యక్షులుగా లక్ష్మి, సత్తవ్వ, గంగాధర్, ప్రధాన కార్యదర్శిగా రాధ, సహాయ కార్యదర్శులుగా రేణుక, రాజవ్వ, లక్ష్మి, రాజేశ్వర్, కోశాధికారిగా వందన ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్, తదితరులు పాల్గొన్నారు. -
మున్నూరుకాపుల సంక్షేమానికి కృషి
ఖానాపూర్: ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఉన్న మున్నూరుకాపుల సంక్షేమానికి గ్లోబల్ మున్నూరుకాపు అసోసియేషన్ కృషి చేస్తోంద ని ఖానాపూర్‌కు చెందిన ఎన్ఆర్ఐలు పన్నెల జనార్దన్, చింతపండు వేణుగోపాల్ అన్నా రు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగిన జీఎంఏ సభకు హాజరై మాట్లాడారు. వివిధ ప్రాంతాల్లోని మున్నూరుకాపు యువతకు విదేశాల్లో విద్య, ఉద్యోగ, ఉపాధి, ఇమ్మిగ్రేష న్, తదితర వాటికి సంబంధించిన సహకారం అందేలా జీఎంఏ కృషి చేస్తోందని జీఎంఏ ఫౌండర్ రంజిత్ సంఘాని అన్నారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్, తె లంగాణ మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు కొండ దేవయ్య, తదితరులు పాల్గొన్నారు. -
సామాజిక స్పృహ పెంచేలా..
ఖానాపూర్: మండలంలోని మస్కాపూర్ జెడ్పీహెచ్ఎస్లో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్న బోనగిరి నరేందర్ విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నా డు. పాఠశాలలో మాతృపితృ వందనం కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పెద్దలపై గౌర వం పెంచేందుకు కృషి చేస్తున్నాడు. గుప్పెడు బియ్యం వంటి కార్యక్రమాలతో ఆపదలో ఉన్నవారికి చేయుత అందించేలా సామాజిక స్పృహ కలిగిస్తున్నాడు. ఉపాధ్యాయులు పా రదర్శకంగా విధులు నిర్వర్తించేలా పాఠశాలలో కంప్లైట్ బాక్స్ ఏర్పాటు చేశాడు. అతని సేవలను గుర్తించిన ప్రభుత్వం రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేసింది. కడెం మండలంలోని లింగాపూర్ జెడ్పీహెచ్ఎస్ నుంచి బదిలీపై వచ్చిన ఆయన 2024లో హెచ్ఎంగా బాధ్యతలు స్వీకరించారు. 2024 –25 విద్యాసంవత్సరంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో 265 మంది బడిబయటి విద్యార్థులకు పాఠశాలలో ప్రవేశం కల్పించాడు. దీంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య జిల్లాలోనే అత్యధికంగా 830కి చేరుకుంది. 2025 విద్యాసంవత్సరంలో పాఠశాలలో పదోతరగతి పూర్తిచేసిన 12 మంది విద్యార్థులు ట్రిపుల్ఐటీకి, నలుగురు ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్‌కు ఎంపికయ్యారు. సాయి అనే విద్యార్థి ఢిల్లీలో నిర్వహించిన జాతీయస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. 9 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి పతకాలు సాధించారు. అన్ని ఫోరమ్‌లలో (గణితం, ఇంగ్లీషు, ఫిజిక్స్, జీవశాస్త్రం, సోషల్) విద్యార్థులు జిల్లాస్థాయిలో మొదటి మూడు స్థానాల్లో రాణించి రాష్ట్రస్థాయిలో పాల్గొన్నారు. ఏడుగురు విద్యార్థులు డీఆర్డీఏ ద్వారా ఉచితంగా కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశాలు పొందారు. గతేడాది పదోతరగతి ఫలితాల్లో 56 మంది విద్యార్థులు 500కుపైగా మార్కులు సాధించారు. 2025లో ఉత్తమ పాఠశాలగా మస్కాపూర్ జెడ్పీహెచ్ఎస్ ఎంపికై ంది. -
వీడ్కోలిక..
వినాయకా..భైంసా/భైంసారూరల్: తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధలతో గణనాథుడికి పూజలు చేసిన భైంసావాసులు గురువారం నిమజ్జనానికి తరలించారు. ఉదయం 11 గంటలకు గణేశ్‌నగర్‌లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్‌కుమార్, ముధోల్ ఎమ్మెల్యే రామారావుపటేల్, ౖభైంసా ఏఎస్పీ అవినాశ్‌కుమార్, మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు తూము దత్తు ఉత్సవ కమిటీ అధ్యక్షులు పెండెపు కాశీనాథ్, కార్యదర్శి తాలోడ్ శ్రీనివాస్ పూజలు చేసి శోభాయాత్ర ప్రారంభించారు. ప్రత్యేక సౌండ్ సిస్టంతో గణేశ్ మండళ్ల సభ్యులు నృత్యం చేస్తూ వినాయకులను సాగనంపారు. ఎప్పటిలాగే హతిగణేశ్ మండలి సభ్యులు మరాఠీ భజనలు చేస్తూ శోభయాత్రలో పాల్గొన్నారు. శోభాయాత్ర మార్గంలో ఇళ్ల వద్దకు వచ్చిన వినాయకులకు మహిళలు కొబ్బరికాయలు కొట్టి, హారతులిచ్చారు. ఒక్కొక్కటిగా తరలిన గణనాథులను మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో భారీ క్రేన్ ఏర్పాటు చేసి భైంసాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టులో నిమజ్జనం చేశారు. ఆకట్టుకున్న మహిళల నృత్యాలు..పట్టణంలోని భారత్ జిన్నింగ్ ఫ్యాక్టరీ, వినాయక్‌నగర్, సాయికాటన్, సంజయ్‌గాంధీ మార్కెట్, పురాణబజార్, మార్వాడిగల్లి ఏపీనగర్ ప్రాంతాల్లో మహిళల కోలాటాలు ఆకట్టుకున్నాయి. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్రలో మహిళలు వేసిన కోలాటం ఆకట్టుకుంది. విద్యార్థులు, మహిళలు వేసిన కోలాటం చూసేందుకు చుట్టుపక్కల జనం భారీగా తరలివచ్చారు. పంజేషావద్ద బందోబస్తుపంజేషా చౌక్‌లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ జానకీ షర్మిల, ఏఎస్పీ అవినాశ్‌కుమార్ నేతృత్వంలో ప్రత్యేక పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, 12 మంది సీఐలు, 20 మంది ఎస్సైలు, 600 మంది కానిస్టేబుళ్లు బందోబస్తును పర్యవేక్షించారు. పట్టణంలోని కూడళ్లు, ప్రధాన మార్గాల్లో 120 ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 30 రూట్టాప్లతో బందోబస్తును పర్యవేక్షించారు. హైదరాబాద్‌లోని కంట్రోల్‌రూంతో అనుసంధానించి ఎప్పటికప్పుడు శోభాయాత్ర దృశ్యాలను తిలకించారు. భక్తులకు సేవలు అందించి...గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో ఉత్సవ సమితి, హిందూవాహిని, ఐక్యత సేవా సమితి, కిసాన్‌సేవా సమితి, తూము ముత్తన్న సేవా సమితితో పాటు పలువురు సేవలు అందించారు. పుష్పక్ సేవా సమితి ఆధ్వర్యంలో పులిహోర, ఆర్యవైశ్య సేవా సమితి ఆధ్వర్యంలో అల్పహారం పంపిణీ చేశారు. మున్నూరుకాపు సంఘం భట్టిగల్లీ, కోర్భాగల్లీ, కిసాన్‌గల్లీ, వీరశైవలింగాయత్, ఓంకార్యూత్, సాయిబాల్ గణేశ్ మండలీ, నేతాజీ గనేశ్మండలీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. -
బోధనోత్తములు
నిబద్ధత, వినూత్న పనివిధానం ఉంటే.. ఏ వృత్తిలో అయినా రాణించవచ్చు. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం బోధనలో వినూత్న విధానం అవలంబించే ఉపాధ్యాయులకు ఏటా పురస్కారాలు అందిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను ప్రకటించింది. ఇందులో జిల్లాకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు వినూత్న బోధనతో రాష్ట్రస్థాయి ఉత్తమ పురస్కారానికి ఎంపికయ్యారు. యూట్యూబ్ చానల్ ద్వారా ఆన్లైన్ పాఠాలు..మామడ: మండలంలోని పొన్కల్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల పీజీహెచ్ఎం మైస అరవింద్‌కుమార్ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. పాఠశాల విద్యార్థుల ప్రతిభ ప్రపంచానికి తెలిసే విధంగా అరవింద్ మైసవ్లోగ్స్ అనే యూట్యూబ్ చానల్ ఏర్పాటు చేశారు. వారికి అవసరమైన విద్యాసమాచారాన్ని అందులో నిక్షిప్తం చేయడంతో పాటు విలువైన సమాచారం అందిస్తున్నారు. ఇదే పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఐదుగురు ఉపాధ్యాయులు గతేడాది జిల్లాస్థాయి ఉత్తమ అవార్డు అందుకున్నారు. నాలుగేళ్లుగా పాఠశాలకు చెందిన పదోతరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. పలువురు విద్యార్థులు సాహిత్యం, సైన్స్‌ఫేర్‌లో జిల్లా, రాష్ట్రస్థాయిలో రాణిస్తున్నారు. ఈ ఏడాది పాఠశాలలో పదోతరగతి పూర్తి చేసిన ఇద్దరు విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు. పాఠశాలలో ఎన్సీసీ నిర్వహణతో విద్యార్థుల్లో దేశభక్తి, నాయకత్వ లక్షణాలు, సేవాభావం పెంపొందించేలా క్రమశిక్షణతో కూడిన వాతావరణం కల్పిస్తున్నారు. డ్రాపౌట్స్‌ను తగ్గించేందుకు పోషకులతో సమావేశం ఏర్పాటుచేసి విద్యార్థుల ప్రగతిని వివరిస్తూ సమస్యను అధిగమించారు. విద్యార్థుల పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటించి వాటిని సంరక్షించేలా పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేసింది. -
దిగుమతి సుంకాలు ఉపసంహరించుకోవాలి
ఖానాపూర్: కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతులపైన 11శాతం దిగుమతి సుంకాలను ఉపసంహరించుకోవాలని ఏఐయూకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంది రామయ్య డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మో ర్చా జాతీయ కమిటీ పిలుపు మేరకు బుధవారం ప ట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీ ల్దార్ సుజాతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పత్తి రైతులకు న ష్టం చేకూర్చేలా వివిధ దేశాల్లో వచ్చే పత్తికి దిగుమతి సుంకాలను తగ్గిస్తూ మన దేశ రైతులకు నష్టమయ్యే పరిస్థితిని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకువస్తోందని ఆరోపించారు. ఓ వైపు పెట్టుబ డులు రాక, గిట్టుబాటు లేక పత్తి రైతులు ఆందోళన చెందుతుంటే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అ మలు చేస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి దుర్గం నూతన్, జిల్లా అధ్యక్షుడు తిరుపతి, నాయకులు భూక్య రమేశ్, నాగెల్లి నర్సయ్య, గోరెబాయ్, బీ నర్సయ్య, నారాయణ, భీమేశ్, రాజేశ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
పారిశుధ్య సమస్య పరిష్కరించాలి
సారంగపూర్: పారిశుధ్య సమస్య పరిష్కరించాలని డీపీవో శ్రీనివాస్ సూచించారు. మండలంలోని స్వర్ణ గ్రామంలో బుధవారం ఆయన పారిశుధ్య పనులు, తాగునీరు, మురుగు కా లువలు, సెగ్రిగేషన్ షెడ్డు పరిశీలించారు. ఆశ్ర మ పాఠశాలను పరిశీలించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వాటర్ ట్యాంక్‌ను ఎ ప్పటికప్పుడు శుభ్రం చేయించాలని సిబ్బందికి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వే గవంతం చేసేందుకు లబ్ధిదారులు, మేసీ్త్రలతో సమావేశం నిర్వహించి వారికి సూచనలు చే యాలని ఎంపీవో అజీజ్‌ఖాన్, ఎంపీడీవో లక్ష్మీకాంత్రావుకు సూచించారు. సెగ్రిగేషన్ షెడ్డు లో తయారైన ఎరువును పరిశీలించారు. తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించేలా ప్రజలకు అ వగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం స్వర్ణ ప్రాజెక్ట్‌ను పరిశీలించి ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో వివరాలు తెలుసుకున్నారు. -
నిర్మల్
‘కడెం’కు కొనసాగుతున్న వరద ఎగువ నుంచి వస్తున్న వరదతో జిల్లాలోని క డెం, గడ్డెన్నవాగు, స్వర్ణ ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. వంట ఏజెన్సీలIIలోu రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక భైంసాటౌన్: పట్టణంలోని సుభద్రవాటిక శ్రీసరస్వతి శిశుమందిర్ పాఠశాల విద్యార్థులు సై న్స్ఫేర్ పోటీల్లో ప్రతిభ చాటారు. ఇటీవల ఆ దిలాబాద్‌లో నిర్వహించిన విభాగ్‌స్థాయి విజ్ఞా న మేళా పోటీల్లో సైన్స్, మ్యాథ్స్ మోడల్స్, నూతన ఆవిష్కరణ, సైన్స్, వేద గణితం, క్వి జ్, పద ప్రయోగాలు అంశాల్లో ప్రతిభ కనబరి చినట్లు ప్రధానాచార్యులు దేవేందర్ తెలిపారు. వీరు ఈనెల 12,13,14 తేదీల్లో కామారెడ్డిలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం విద్యార్థులను పాఠశాల ప్రబంధకారిణి సభ్యులు, ఉపాధ్యాయులు అభినందించారు. లక్ష్మణచాంద: సకాలంలో బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికో న్నత, ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం త యారు చేస్తున్న ఏజెన్సీల కష్టాలు తీరనున్నాయి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నెల నెలా 10వ తేదీలోపు గ్రీన్ చానెల్ ద్వారా బిల్లులు చెల్లించాలని నిర్ణయించింది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండురోజుల కిందట విద్యాశాఖపై ఉ న్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు మధ్యాహ్న భోజన పథకం అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తున్నాయి. 1–5 తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.6.78 చొప్పు న, 6–8 తరగతుల వారికి రూ.10.17 చొప్పున, 9,10 తరగతుల వారికి రూ.10.67 చొప్పున చెల్లి స్తారు. ఒక్కో కోడి గుడ్డుకు రూ.6 చెల్లిస్తున్నారు. మ ధ్యాహ్న భోజనం తయారు చేసే వంట కార్మికులకు కేంద్రం రూ.2వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి ఇలా నెలకు రూ.3వేల గౌరవ వేతనం ఇస్తున్నాయి. ఇప్పటివరకు చెల్లింపులు ఇలా.. నెలనెలా మధ్యాహ్నం భోజన బిల్లులను ముందుగా ప్రధానోపాధ్యాయుడు ఎంఈవో కార్యాలయానికి పంపుతారు. ఆ బిల్లులను మండల విద్యాధి కారి జాగ్రత్తగా పరిశీలించి జిల్లా విద్యాధికారి కార్యాలయానికి పంపుతారు. అక్కడి అధికారులు పరిశీ లించి డీఈవో ఆమోదంతో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులకు పంపితే అక్కడ నుంచి బిల్లుల ని ధులు విడుదలవుతాయి. ఈ విధానంతో బిల్లుల చె ల్లింపులు ఆలస్యం కావడంతో వంట ఏజెన్సీలు అ ప్పులపాలవుతున్నారు. దీంతో వారి ఇబ్బందులను తీర్చేందుకు ప్రభుత్వం గ్రీన్ చానెల్ ద్వారా నెల నెలా బిల్లులు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. జిల్లా కేంద్రంలోని కస్బా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వంట చేస్తున్న కార్మికులు (ఫైల్) ఇక బిల్లుల చెల్లింపులు ఇలా.. మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు బిల్లులు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంతో వంట కార్మికులకు నెలనెలా బిల్లులు అందుతాయని అధికారులు చెబుతున్నారు. ప్రధానోపాధ్యాయుడు బిల్లులు పరిశీలించి ఆమోదించి వెంటనే ఎంఈవోకు ఆన్లైన్లో పంపిస్తారు. ఎంఈవో పరిశీలించి బిల్లులు సక్రమంగా ఉంటే వెంటనే ట్రెజరీ ద్వారా బిల్లు మొత్తం ప్రతినెలా 10లోపు వంట కార్మికుల ఖాతాల్లో జమయ్యేలా చూస్తారు.జిల్లా సమాచారం మొత్తం పాఠశాలలు 830 విద్యార్థుల సంఖ్య 67,790 వంట ఏజెన్సీలు 830 వంట కార్మికులు 1,145 -
ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి
నిర్మల్‌చైన్‌గేట్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వే గం పెంచి త్వరగా పూర్తి చేయించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, వనమహోత్సవం, గ్రామాల్లో పారిశుధ్య పనులు త దితర అంశాలపై సంబంధిత అధికారులతో సమావేశమై మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షించాలని, ఇసుక కొరత రాకుండా చూడాలని సూచించారు. డబ్బులు లేని లబ్ధిదారులకు మహిళా స్వయం సంఘాల ద్వా రా రుణాలు ఇప్పించాలని తెలిపారు. జిల్లాలో వనమహోత్సవం కార్యక్రమాన్ని వెంటనే పూర్తిచేయాలని, మొక్కలు నాటిన వెంటనే సంబంధిత సైట్లో నమోదు చేయాలని సూచించారు. జిల్లాలో మొక్కలు నాటే ప్రక్రియ దాదాపు పూర్తయిందని, మిగతా లక్ష్యాన్ని వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఇటీవల భారీ వర్షాలు కురిసినందున గ్రామాల్లో మెరుగైన పారిశుధ్య పనులు చేపట్టాలని సూచించా రు. గ్రామాలు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫాగింగ్ చే యించాలని, నీరు అధికంగా నిల్వ ఉండే చోట దో మలు వ్యాప్తి చెందకుండా ఆయిల్‌బాల్స్ వేయాలని తెలిపారు. ఇటీవల వర్షాలు కురిసి వరదలు సంభవించిన నేపథ్యంలో క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేపట్టిన అధి కారులందరినీ అభినందించారు. స్థానిక సంస్థల అ దనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీపీవో శ్రీనివాస్, జె డ్పీ సీఈవో గోవింద్, డీఆర్డీవో విజయలక్ష్మి, హౌసింగ్ పీడీ రాజేశ్వర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యేల క్షేత్రస్థాయి పర్యటన
బాసర: భారీ వర్షాలకు మండలంలో దెబ్బతిన్న పంటలను ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటే ల్ బుధవారం పరిశీలించారు. మండల కేంద్రంలోని రేణుకాపూర్ శివారు, బిద్రెల్లి, ఓని, మైలా పూర్ తదితర గ్రామాల్లో దెబ్బతిన్న సోయా, ప త్తి పంటలు, ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాలు పరిశీలించారు. వ్యవసాయాధికారి అజ య్, తహసీల్దార్ పవన్‌చంద్ర, ఎంపీడీవో దేవేందర్‌రెడ్డితో మాట్లాడి పంటనష్టం వివరాలు తె లుసుకున్నారు. తక్షణమే ప్రభుత్వానికి నివేదిక అందించాలని సూచించారు. అధైర్య పడొద్దని, అండగా ఉంటామని బాధిత రైతులకు భరోసా కల్పించారు. పంట నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని, ఎకరాకు రూ.30వేల నుంచి రూ.40వేల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన వెంట నాయకులు సతీశ్‌రావు, సాయినాథ్, రమేశ్, ప్రతా ప్రావు, నర్సింగరావు, శీనుయాదవ్, నారాయణరెడ్డి, సాయిబాబా, ఓని శివాజీ, దావా రాజు, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. నర్సాపూర్ (జీ) మండలంలో ‘ఏలేటి’ నర్సాపూర్ (జీ): మండల కేంద్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పరిశీలించారు. వర్షంలో తడుస్తూనే.. దేవుని చెరువు కట్ట కు ఏర్పడిన గండిని పరిశీలించి మరమ్మతు చేపట్టాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. దిగువన దెబ్బతిన్న పంటలను పరిశీ లించి బాధిత రైతులకు పరిహారం అందేలా చ ర్యలు తీసుకోవాలని సూచించారు. చెరువు కట్ట తెగి చేపలు, వలలు కొట్టుకుపోయి తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని మత్స్యకారులు తెలుపగా.. పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని మ త్స్యశాఖ అధికారులను ఆదేశించారు. మండలంలోని ఆయా గ్రామాల్లో వర్షానికి దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతు చేపట్టాలని పీఆర్, ఆర్అండ్ బీ అధికారులు, విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని ఏఈకి సూచించారు. తహసీల్దార్ శ్రీకాంత్, ఇరిగేషన్ ఏఈ గంగాధర్, పీఆర్ ఏఈ క్రాంతి కుమార్, విద్యుత్ ఏఈ శంకర్, ఎంపీవో తిరుపతిరెడ్డి, ఏఈవో భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, నాయకులు నరేందర్, చిన్న య్య, ముత్యంరెడ్డి, దత్తురాం, సుధాకర్, గంగా రాం, శ్రీకాంత్‌రెడ్డి, ప్రవీణ్ పటేల్, మహిపాల్, సాయన్న, భోజన్న తదితరులు పాల్గొన్నారు. పెంబి మండలంలో బొజ్జు పెంబి: మండలంలోని తాటిగూడ గ్రామ శివారులో కడెం వాగు ప్రవాహ ప్రాంతంలో కొట్టుకుపోయిన పత్తి పంటను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకుంటుందని తెలిపారు. నష్టపోయిన ప్రతీ రైతుకు న్యా యం జరుగుతుందని పేర్కొన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ లక్ష్మణ్, ఏవో నవీన్, నాయకులు శంకర్, రమేశ్, రాజన్న, మహేందర్, రమేశ్, భీంరావు, భూమేశ్ తదితరులున్నారు. -
అంగన్వాడీ కేంద్రం పరిశీలన
లోకేశ్వరం: మండలంలోని బామ్నికే గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సుపోషిత్ జీపీ అ భియాన్ కేంద్ర బృందం సభ్యుడు అలోక్శర్మ బుధవారం పరిశీలించారు. కేంద్రంలోని చిన్నారుల పోషణ స్థితి, అంగన్వాడీ కేంద్రాలకు అందించే ఆహార పదార్థాల నాణ్యత, పిల్లల బరు వు పరిశీలించి మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలు అధికసంఖ్యలో వచ్చేలా చూ డాలని సూచించారు. సీడీపీవో స్టేట్ కన్సల్టెంట్ విజయ తాపక్, స్టేట్ కన్సల్టెంట్ అశోక్, జిల్లా పోషణ అభియాన్ కోఆర్డినేటర్ నిరంజన్‌రెడ్డి, ముథోల్, ఖానాపూర్, నిర్మల్ సీడీపీవోలు సరో జిని, నాగలక్ష్మి, సరిత, సెక్టార్ సూపర్వైజర్ మీ నా, అంగన్వాడీ టీచర్ పాల్గొన్నారు. -
రాయితీ యంత్రం.. రైతుకు ఊతం
నిర్మల్‌చైన్‌గేట్: రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరి కరాలు అందజేసే యాంత్రీకరణ పథకానికి నిధులు మంజూరయ్యాయి. జిల్లాకు రూ.3.35 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. స బ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ (ఎస్ఎంఏఎం) పథకం కింద ఈ నిధులు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వానిది 60 శాతం వాటా కాగా, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం భరిస్తుంది. గత యాసంగిలోనే ప్రక్రియ ప్రారంభించినా మార్చి బడ్జెట్ ముగింపు సందర్భంగా ఏర్పడిన సాంకేతిక కారణాలతో నిధులు విడుదల కాలేదు. ప్రస్తుతం ముందస్తుగానే ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఎంపిక బాధ్యత కమిటీలదే వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు అందజేసేందుకు జిల్లా, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చే యనున్నారు. రాయితీ రూ.లక్ష దాటితే జిల్లా కమి టీ ఆమోదం తప్పనిసరి. ఐదెకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్న వారు ఈ రాయితీ పథకానికి అర్హులు. జిల్లా కమిటీలో కలెక్టర్ చైర్మన్‌గా, డీఏవో, ఆగ్రోస్, ఎల్డీఎం, శాస్త్రవేత్త సభ్యులుగా ఉండనున్నారు. మండల స్థాయి కమిటీలో మండల వ్యవసాయాధికారి, తహసీల్దార్, ఎంపీడీవోలు ఉంటారు. ఈ పరికరాల కోసం అర్హులను ఈ కమిటీలు ఎంపిక చేయనున్నాయి. 2017–18 సంవత్సరం వరకు యాంత్రీకరణ పథకం అమలులో ఉంది. మళ్లీ ఏడేళ్ల తర్వాత పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. గతంలో ట్రాక్టర్లు అందించగా, ఈ ఏడాది యాంత్రీకరణ పనిముట్ల వరకే పరిమితం చేశారు. సబ్సిడీ.. పనిముట్ల వివరాలు ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ పనిముట్లలో మహిళా రైతులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు 50 శా తం సబ్సిడీపై పరికరాలు అందించనున్నారు. మిగతా రైతులకు 40శాతం సబ్సిడీ వర్తిస్తుంది. ఐదెకరా ల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు సబ్సిడీపై స్ప్రేయర్లు, ట్రాక్టర్‌తో వినియోగించే రొటోవేటర్లు, నాగళ్లు, కలుపుతీసే యంత్రాలు, పవర్ టిల్లర్లు, మొక్కజొన్న తీసే యంత్రాలు తదితర పరికరాలు అందజేసేందుకు చర్యలు చేపడతారు.జిల్లాకు కేటాయించిన సబ్సిడీ పరికరాలు యంత్రాల పేర్లు యూనిట్లు నిధులు (రూ.లక్షల్లో) బ్యాటరీ, చేతి, మ్యానువల్స్ స్పేయ్రర్లు 3,238 32.38 పవర్ నాప్ సాక్ స్పేయ్రర్లు 525 52.50 రొటోవేటర్లు 239 119.50 విత్తన ఫర్టిలైజర్ వేసే యంత్రాలు (గొర్రు) 50 15.00 ట్రాక్టర్ పరికరాలు 290 58.00 బండ్ ఫార్మర్లు 6 0.90 పవర్ వీడర్స్ 50 17.50 బ్రష్ కట్టర్లు 41 14.35 పవర్ టిల్లర్స్ 25 25.00 -
పంటలను పరిశీలించిన సబ్ కలెక్టర్
బాసర: భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ మంగళవారం శ్రీజ్ఞాన సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన భవనంలో సాధారణ భక్తుడిగా భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. అనంతరం, తహసీల్దార్ పవన్ చంద్రతో కలిసి గోదావరి ఉధృతికి మునిగిన ప్రాంతాలను, దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. గోదావరి బ్రిడ్జి పైనుంచి ప్రవాహాన్ని పరిశీలించారు. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల నుంచి గణపతి నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఫోకస్ లైట్లు, విద్యుత్ అలంకరణ, గజ ఈతగాళ్లు, బోటింగ్ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు పంట నష్టపోయిన రైతులు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని తహసీల్దార్ పవన్‌చంద్రకు వినతిపత్రం ఇచ్చారు. దెబ్బతిన్న స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు చేయించాలని కోరారు. -
బురదలో దిగి.. పంటలను పరిశీలించి..
లక్ష్మణచాంద: ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు మండలంలో దెబ్బతిన్న పంటలను బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మంగళ వారం పరిశీలించారు. తిర్పెల్లి గ్రామంలోని వాగు బ్రిడ్జిని పరిశీలించారు. బ్రిడ్జి పైభాగం కొట్టుకుపోవడంతో మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం చామన్‌పల్లి, చింతల్‌చాంద, మునిపల్లి, పీచర, ధర్మారం, పార్పల్లి గ్రామాల్లో పర్యటించారు. వర్షాలతోపాటు ఉప్పొంగి న గోదావరి ప్రవాహానికి దెబ్బతిన్న పంటలను బురదలో దిగి పరిశీలించారు. నష్టం వివరాలు నమోదు చేయాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. ఆయన వెంట రావుల రాంనాథ్, భూపాల్‌రెడ్డి, చిన్నయ్య, ముత్యంరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, సురేశ్, లక్ష్మణ్, వెంకట్‌రెడ్డి, రాజేశ్వర్, రాజారెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి ఉన్నారు. -
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఘనత కాంగ్రెస్‌దే
సారంగపూర్: ఇచ్చిన మాటకు కట్టుబడి రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందని నిర్మల్, ముధోల్ నియోజకవర్గాల ఇన్చార్జి రాంభూపాల్వర్మ అన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో మంగళవారం పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. కామారెడ్డి డిక్లరేషన్ మేరకు బీసీల కు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టసవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపిందన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు బొల్లోజి నర్సయ్య, నాయకులు రాంశంకర్‌రెడ్డి, ఎంబడి రాకేశ్ పాల్గొన్నారు. -
విద్య, వసతులకు ప్రాధాన్యం
నిర్మల్ రూరల్: జిల్లా విద్యాశాఖ అధికారి(ఎఫ్ ఏసీ)గా భోజన్న మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. నిర్మల్‌కు చెందిన ఆయన సొంతజిల్లాకు డీఈవోగా రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంరద్భంగా ‘సాక్షి’తో మాట్లాడు తూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతోపాటు, మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. సాక్షి : సొంత జిల్లాలో పనిచేయడం ఎలా ఉంది? డీఈవో : చాలా ఆనందంగా ఉంది. పుట్టి పెరిగి, చదువుకున్న జిల్లాలోనే డీఈవోగా పనిచేయడం బాధ్యతను మరింత పెంచింది. సమష్టి కృషితో జిల్లాను విద్యారంగంలో మొదటి స్థానంలో నిలపడానికి కృషి చేస్తాను. సాక్షి : పదో తరగతి ఫలితాల మెరుగునకు ఏం చర్యలు తీసుకుంటారు? డీఈవో : పదో తరగతి ఫలితాల్లో గతంలో రెండుసార్లు జిల్లా రాష్ట్రంలో నంబర్ వన్‌గా నిలిచింది. గతేడాది 15వ స్థానానికి పడిపోయింది. ఈసారి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోల సహకారంతో జిల్లాను మరోసారి ఉన్నత స్థితిలో నిలిపేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తాం. దాని ప్రకారం ముందుకెళ్తాం. సాక్షి : ఎఫ్ఆర్ఎస్ 100 శాతం అమలు కావడం లేదు? డీఈవో : పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం(ఎఫ్ఆర్ఎస్)తప్పనిసరి. నిర్ణీత సమయానికి ఉపాధ్యాయులు హాజరై ఆన్లైన్లో హాజరు నమోదు చేయాలి. జిల్లాలో 55 శాతమే అమలవుతోంది. త్వరలోనే వంద శాతం అమలయ్యేలా చర్యలు తీసుకుంటా. సాక్షి : విద్యాశాఖలో ఏ విధమైన మార్పులు తీసుకొస్తారు? డీఈవో : ప్రభుత్వ బడుల్లో డిజిటల్ క్లాసులు, వ్యాయామ విద్య, కోకరికులం యాక్టివిటీలు సజావుగా జరిగేలా చూస్తాను. కలెక్టర్ ప్రవేశపెట్టిన ’బాలశక్తి’ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. సాక్షి : ఉపాధ్యాయుల సర్దుబాటుపై ఆరోపణలు వచ్చాయి. మీరెలా అధిగమిస్తారు? డీఈవో : పూర్తి నివేదిక తీసుకుని పొరపాటుకు కారణమైన బాధ్యులపై చర్య తీసుకుంటాం. ఈనెల 4లోపు ప్రమోషన్ల ద్వారా ఖాళీ అయిన స్థానాల్లో ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తాం. నిబంధనల ప్రకారం ప్రక్రియ పూర్తి చేస్తాం. ఉపాధ్యాయ సంఘాలు కూడా సహకరించాలి. సాక్షి : గుర్తింపు లేని ప్రైవేట్ పాఠశాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? డీఈవో : జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు తప్పనిసరి. గుర్తింపు లేని పాఠశాలలను త్వరలోనే గుర్తించి వాటిపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి అనుమతులు జారీ చేస్తాం. -
ఫోన్ పోతే ఆందోళన వద్దు
నిర్మల్ టౌన్: మొబైల్ ఫోన్ పొతే ఆందోళన వద్దని, ఫోన్ పోతే సంబంధిత పోలీస్ స్టేషన్లో లేదా మీ సేవ ద్వారా ఫిర్యాదు చేయాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోగొట్టుకున్న 65 ఫోన్ల ను సీఈఐఆర్ వెబ్సైట్ ద్వారా గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ జానకీ షర్మిల జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో మంగళవారం అందజేసి మాట్లాడారు. సెకండ్ హాండ్ ఫోన్లు కొనేముందు సీఈఐఆర్ వెబ్సైట్లో ఫోన్ ఐఎంఈఐ నంబర్ నమోదు చేసి చెక్ చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు పోయిన 1,631 ఫోన్లను రికవరీ చేశామన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఉపేంద్రారెడ్డి, ఐటీ కోర్, వివిధ పోలీస్స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు. -
పల్లెల్లో ‘స్థానిక’ సందడి
నిర్మల్‌చైన్‌గేట్: గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. ఇటీవలి వరకు గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలపై స్పష్టత లేకపోవడంతో ఆశావహుల్లో సందిగ్ధం నెలకొంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాయడంతో గ్రామీణ రాజకీయ వాతావరణం వేడెక్కింది. మంగళవారం గ్రామ పంచాయతీల వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితా విడుదలైంది. సెప్టెంబర్ 10న పరిషత్(ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాలు ప్రకటించనున్నారు. అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమవుతుండగా, ఆశావహులు కూడా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్.. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌ల పాలకవర్గాల గడువు ముగిసి ఏడాది దాటింది. సాంకేతిక సమస్యల కారణంగా ఎన్నికల నిర్వహణ ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కుల గణన ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ప్రకటించింది. గవర్నర్ ఆమోదం లేనప్పటికీ, అసెంబ్లీలో పంచాయతీరాజ్, పురపాలక చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందింది. ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాయడంతో గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఆమోదం లభించింది. ఓటర్ల జాబితా విడుదల.. మంగళవారం గ్రామ పంచాయతీల వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితా విడుదలైంది. జిల్లా వ్యాప్తంగా 4,49,302 ఓటర్లు నమోదయ్యారు, వీరిలో 2,13,805 మంది పురుషులు, 2,35,485 మంది మహిళలు, 12 మంది ఇతరులు ఉన్నారు. సెప్టెంబర్ 6న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన ఓటర్లు, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల చేసి, అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం, సెప్టెంబర్ 10న తుది జాబితా ప్రకటించనున్నారు. దీంతో ఎన్నికల ప్రక్రియలో తొలి దశ పూర్తవుతుంది. రాజకీయ పార్టీల్లో కదలిక.. ఎన్నికల ఆలస్యం కారణంగా రాజకీయ నాయకులు ఇప్పటివరకు పెద్దగా దృష్టి సారించలేదు. అయితే, అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసింది. బీజేపీ సైతం అడపాదడపా సమావేశాలు నిర్వహించగా, బీఆర్ఎస్ ఎన్నికలపై పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎన్నికల ప్రకటన తెరపైకి రావడంతో పార్టీల్లో కదలిక మొదలైంది. కాంగ్రెస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయం కోసం వ్యూహాలు రచిస్తోంది. బీజేపీ కూడా ఇప్పుడిప్పుడే ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నమైంది. నోటిఫికేషనే తరువాయి.. సర్పంచ్ల పదవీకాలం ముగిసి 19 నెలలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం ముగిసి 13 నెలలు గడిచాయి. పరిపాలనా ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా పరిషత్‌కు కలెక్టర్, మండల పరిషత్‌లకు ప్రత్యేక అధికారులు కొనసాగుతున్నారు. హైకోర్టు సెప్టెంబర్ 30 వరకు ఎన్నికలు నిర్వహించాలని గడువు విధించిన నేపథ్యంలో త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన, 50 శాతం రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేయడంతో ఈ ఎన్నికల్లో బీసీ ప్రాతినిధ్యం గణనీయంగా పెరగనుంది. జిల్లాలో 18 మండలాల్లో 7 జెడ్పీటీసీ, 7 ఎంపీపీ, 190 ఎంపీటీసీ స్థానాల్లో 66 బీసీలకు దక్కే అవకాశం ఉంది, జెడ్పీ చైర్మన్‌తోసహా బీసీలకు ఎక్కువ ప్రాతినిధ్యం లభించనుంది. గ్రామ పంచాయతీలు, వార్డులు, ఓటర్ల వివరాలు.. మండలం జీపీలు వార్డులు ఓటర్లు దస్తురాబాద్ 13 102 12,894 కడెం 29 242 29,159 ఖానాపూర్ 25 192 23,657 పెంబి 24 152 10,886 మామడ 27 222 26,072 లక్ష్మణచాంద 18 162 24,577 నిర్మల్ రూరల్ 20 170 22,751 సారంగాపూర్ 32 282 39,516 సోన్ 14 132 21,801 దిలావర్పూర్ 12 108 18,744 నర్సాపూర్(జి) 13 120 20,238 లోకేశ్వరం 25 224 29359 కుంటాల 15 134 19,055 భైంసా 30 258 33,970 ముధోల్ 19 166 28,754 తానూర్ 32 268 31,516 బాసర్ 10 90 15,728 కుభీర్ 42 344 40,625పంచాయతీ డివిజన్లు 02 మొత్తం మండలాలు 18 గ్రామపంచాయతీలు 400 వార్డులు 33,68 మొత్తం ఓటర్లు 4,49,302 పురుషులు 2,13,805 మహిళలు 2,35,485 ఇతరులు 12 -
ప్రజల గుండెల్లో వైఎస్సార్
ఖానాపూర్/భైంసాటౌన్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రజల్లో చెరగని ముద్ర వేశారని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, కాంగ్రెస్ పార్టీ ముధోల్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బి.నారాయణ్‌రావు పటేల్ అన్నారు. ఖానాపూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, భైంసాలోని కాంగ్రెస్ కార్యాలయంలో వైఎస్సార్ వర్ధంతి మంగళవారం నిర్వహించారు. రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంక్షేమ పథకాల ఆద్యుడు వైఎస్సార్ అని తెలిపారు. జలయజ్ఞం, రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్మెంట్, తదితర పథకాలతో ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని వివరించారు. బాసరలో ట్రిపుల్ ఐటీ వైఎస్సార్ హయాంలోనే ఏర్పాటైందని తెలిపారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టును సైతం నిర్మించినట్లు గుర్తు చేశారు. బాసరలో గోదావరిపై 12 లిఫ్ట్‌లు నిర్మించారని తెలిపారు. కార్యక్రమాల్లో దయానంద్, భూషణ్, మాజిద్, నిమ్మల రమేశ్, చిన్నం సత్యం, అంకం రాజేందర్, మడిగెల గంగాధర్, గంగనర్సయ్య, మదిరె సత్యనారాయణ, రమేశ్, శేషాద్రి, సంతోష్, రాజునాయక్, శంకర్, గంగాధర్, శ్రీహరి, జహీర్, శంకర్ చంద్రే, ఆత్మ చైర్మన్ వివేకానంద, భోజరాం పాటిల్, బషీర్, బంక బాబు, సందీప్, నరేందర్‌రెడ్డి, ఆత్మరామ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వినాయకుని ఆశీస్సులు అందరిపై ఉండాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్ నిర్మల్‌చైన్‌గేట్: జిల్లా ప్రజలందరిపై వినాయకుని ఆశీస్సులు ఉండాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకాంక్షించారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయకునికి మంగళవారం నిమజ్జన పూజా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం విగ్రహదాత, వేలంలో లడ్డూ గెలుచుకున్న వారిని కలెక్టర్ సత్కరించారు. పూజా కార్యక్రమం అనంతరం ఉద్యోగులు, సిబ్బంది వినాయకుని శోభాయాత్రను నిర్వహించారు. భక్తిగీతాలకు నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా తీసుకెళ్లి, వినాయకసాగర్ (బంగల్ పేట్) చెరువులో గణనాథుని నిమజ్జనం చేశారు. -
కాళేశ్వరంపై దుష్ప్రచారం మానుకోవాలి
నిర్మల్‌టౌన్: కాళేశ్వరంపై కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం మానుకోవాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి రామ్‌కిషన్‌రెడ్డి అన్నారు. అధిష్టానం పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా రామ్‌కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంపై కుట్రలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి నదీ జలాలను ఆంధ్రాకు తరలించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. సీబీఐకి కాళేశ్వరం విచారణను అప్పగించడం ప్రాజెక్టును మూసేయడమని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక రేవంత్ సర్కార్ ఇలా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నాలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, భూషణ్‌రెడ్డి, డాక్టర్ సుభాష్‌రావు, గండ్రత్ రమేశ్, అక్రమ్ అలీ, నజీరుద్దీన్, మొహమ్మద్ నయీమ్, మహబూబ్, మాసూద్ అలీఖాన్, జుబేర్‌ఖాన్, మొహమ్మద్బిన్ అలీ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఏఈవో సంతకం ఫోర్జరీ
నిర్మల్: రైతుబీమా పత్రాలపై ఏఈవో సంతకం ఫోర్జరీ అయిన సంఘటన నర్సాపూర్(జి)లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చాక్పల్లి క్లస్టర్లో ఏఈవోగా కాల్వ రమ్య విధులు నిర్వహిస్తున్నారు. 2020, జూలై 14 నుంచి 45 రోజులు ప్రసూతి సెలవులు తీసుకుంది. ఆ సమయంలో ఓ రైతుకు చెందిన రైతుబీమా పత్రాలపై ఏఈవో రమ్య సంతకం ఫోర్జరీ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఫోర్జనీ సంతకం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై ఏఈవో రమ్యను సంప్రదించగా... తాను ఆ సమయంలో ప్రసూతి సెలవులో ఉన్నానని.. ఆ సంతకం తనది కాదని తెలిపారు. ఉన్నతాధికారులు విచారణ చేపడితే ఎవరు చేశారనేది తెలుతుందన్నారు. -
పఠనాసక్తి పెంచేలా..
లక్ష్మణచాంద: రాష్ట్ర సమగ్ర శిక్ష, రూమ్ టు రీడ్ ఇండియా ట్రస్టు సహకారంతో విద్యార్థుల్లో పుస్తక పఠనా ఆసక్తిని పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, భావ వ్యక్తీకరణ, చదవడంపై ఆసక్తిని పెంచాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. పాఠశాల స్థాయిలో ఈ చొరవ విద్యార్థుల మేధో సామర్థ్యాన్ని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుందని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. రోజుకో అరగంట.. సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్ నికోలస్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ప్రతీ పాఠశాలలో రోజుకు అరగంట పఠనానికి సమయం కేటాయించాలి. విద్యార్థులు వార్తాపత్రికలు, సాహిత్య పత్రికలు, కథల పుస్తకాలు వంటివి చదవడం ద్వారా వారి జ్ఞాన పరిధిని విస్తరించుకోవాలి. ఈ లక్ష్యంతో ఇటీవల ప్రతీ పాఠశాలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయగా, అవసరమైన పుస్తకాల సేకరణతోపాటు ఉపాధ్యాయులకు వాటి నిర్వహణపై శిక్షణ కూడా అందించారు. ఆసక్తి పెంచేలా.. రూమ్ టు రీడ్ ఇండియా సహకారంతో ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో నిర్దిష్ట కార్యకలాపాలు చేపట్టనున్నారు. 1. పాఠశాల ప్రార్థన సమయంలో విద్యార్థులు చిన్న కథలు చెప్పడం ద్వారా వారిలో ఆసక్తిని రేకెత్తించాలి. 2. పాఠశాల, గ్రామ స్థాయిలో కథల రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి విద్యార్థులను పఠనంపై ఉత్సాహపరచాలి. 3. ‘ప్రతీ విద్యార్థి ఒక గ్రంథకర్త’ అనే భావనతో సమావేశాలు నిర్వహించాలి. 4. విద్యార్థుల పఠన కార్యకలాపాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలి. 5. ‘నా పుస్తకం–నా కథ’ ఇతివృత్తంతో విద్యార్థులతో పోస్టర్లు రూపొందించాలి. 6. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి చదివే కార్యక్రమాలు నిర్వహించాలి. జిల్లా సమాచారం... జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 577 విద్యార్థుల సంఖ్య 23,398 ప్రాథమికోన్నత పాఠశాలలు 89 విద్యార్థులు 6,373 ఉన్నత పాఠశాలలు 164 విద్యార్థులు 37,019 మొత్తం విద్యార్థుల సంఖ్య 67,790మంచి కార్యక్రమం విద్యార్థుల్లో పఠానాసక్తిని పెంపొందించడం కోసం సమగ్ర శిక్ష ప్రాజెక్టు ద్వారా ఈ కార్యక్రమం ప్రవేశపెట్టడం మంచి నిర్ణయం. దీంతో విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుంది. – శ్వేత, ఉపాధ్యాయురాలు, పీచర పాఠశాల ఆసక్తి పెరుగుతుంది పాఠశాల్లో సోమవారం నుంచి కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నెల 15 వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పుస్తక పఠనం, పఠనాసక్తి, సృజనాత్మకత పెరుగుతాయి. – వాణి, ఉపాధ్యాయురాలు, కనకాపూర్ పాఠశాల -
దరఖాస్తులు ఇచ్చి.. పరిష్కారం కోరి..
నిర్మల్‌చైన్‌గేట్: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. ప్రతీ దరఖాస్తును పరిశీలించి తక్షణమే పరిష్కరించాలన్నారు. మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక వైద్య శిబిరాల ఏర్పాటుతో వరద నష్ట నివేదికలు సిద్ధం చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం, ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు లబ్ధిదారుల ఎంపిక సర్వే, వనమహోత్సవంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ బడులను ఎప్పటికప్పుడు పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి నేను ఖానాపూర్ పట్టణం రాజీవ్‌నగర్‌కు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన వాడిని. నాకు వారసత్వంగా వచ్చిన ఇల్లు కూలిపోయింది. ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూరు చేసి నన్ను ఆదుకోవాలి. – చుక్కల శ్రీనివాస్, ఖానాపూర్ ఒర్రె పొలాన్ని ముంచుతోంది.. నాకు రాణాపూర్లో కెనాల్ వద్ద ఒర్రెను అనుకొని 1.25 ఎకరాల పొలం ఉంది. నాలుగేళ్లుగా కెనాల్ పనుల కారణంగా ఒర్రె నుంచి నీరు వచ్చి పొలంలోకి చేరుతుంది. దీంతో పంట మునిగి ఏటా లక్ష రూపాయలు నష్టం వాటిల్లుతుంది. ఒర్రె నీరు పొలంలోకి రాకుండా చూడాలి. – కరిపే భోజన్న, రాణాపూర్ ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయాలి ఖానాపూర్ పట్టణంలో గతంలో పోస్ట్ ఆఫీస్‌లో ఆధార్ సెంటర్ ఉండేది. ప్రస్తుతం దానిని తొలగించారు. ఇప్పుడు పట్టణంలో ఒకే ఒక ఆధార్ సెంటర్ ఉంది. దానిని కూడా నిత్యం తెరవడం లేదు. మరో ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయాలి. – అఖిల్, ఎంఐఎం అధ్యక్షుడు అక్రమ కట్టడాలు ఆపాలి గుల్జార్ మార్కెట్ నివాసి అయిన రఫీ అహ్మద్ ఖురేషి తన పాత ఇంటిని కూల్చివేసి మునిసిపల్ లో జి ప్లస్ వన్ నూతన భవన నిర్మాణానికి అనుమతి తీసుకున్నారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఆయన వాణిజ్య సముదాయం నిర్మిస్తున్నారు. ఈ విషయం పలుమార్లు మున్సిపల్ అధికారులకు, పట్ట ణ ప్రణాళిక అధికారులకు తెలిపినా చర్యలు తీసుకోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా భవన నిర్మాణం పూర్తికావస్తుంది. – సోఫియాన్ సలీం, నిర్మల్ -
ఆదుకున్న ఆగస్టు..!
భైంసాటౌన్: ఈసారి వర్షాలు ఆలస్యమైనా అన్నదాతను ఆదుకున్నాయి. భారీ వర్షాలతో కొంతమేర పంటలకు నష్టం వాటిల్లినా.. యాసంగి పంటలకు భరోసా ఏర్పడింది. ఆగస్టులో వారం రోజులు కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని అన్ని చెరువులు, కుంటలు, వాగులు పొంగి ప్రవహించాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా బాసరలో గోదావరి ఉగ్రరూపం చూపింది. ప్రాజెక్టులు నిండుకుండలా మారి జలకళ సంతరించుకున్నాయి. తద్వారా ఆయా చెరువులు, ప్రాజెక్టుల కింద సాగయ్యే యాసంగి పంటలకు భరోసా ఇచ్చినట్లయింది. లోటు నుంచి సాధారణానికి.. జిల్లాలో ఏటా జూలైలోనే భారీ వర్షాలు కురిసేవి. రైతులు సైతం ఈనెలలోనే పంటలు సాగు చేసేవారు. కానీ ఈసారి ఆగస్టు వరకు వర్షాభావ పరిస్థితి నెలకొంది. జూన్‌లో వర్షాకాలం మొదలు ఆగస్టు రెండోవారం వరకు లోటు వర్షపాతం నెలకొంది. అడపాదడపా కురిసిన వర్షాలతో ఖరీఫ్ పంటలకు ప్రయోజనం చేకూరినా.. భారీ వర్షాలు లేకపోవడంతో యాసంగి పంటలపై రైతుల్లో ఆందోళన కనిపించింది. జూన్ మొదటివారంలో 99 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, రెండోవారంలో 102 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. మళ్లీ ఆపై రెండువారాలూ లోటు వర్షపాతం నమోదైంది. జూలై నెలంతా సాధారణ, లోటు వర్షపాతం నమోదు కాగా, ఆగస్టు మొదటివారంలో వానలే పడలేదు. రెండోవారంలో 43 శాతం సాధారణ వర్షం కురవగా, మూడోవారంలో 145 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. ఎట్టకేలకు భారీ వర్షాలు కురవడంతో జిల్లాలో లోటు నుంచి సాధారణ వర్షపాతం నమోదైంది. ప్రాజెక్టులు నిండుగా.. జూన్, జూలైలో సరైన వర్షాలు లేక జిల్లాలోని అన్ని ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో నీరు చేరలేదు. భైంసాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు, సారంగపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు, కడెంలోని కడెం ప్రాజెక్టు కింద వేలాది ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తుంటారు. యాసంగి పంటలకు ఈ ప్రాజెక్టులపైనే రైతులు ఎక్కువగా ఆధారపడతారు. అలాగే చెరువుల కింద సైతం అధికసంఖ్యలో రైతులు పంటలు సాగు చేస్తుంటారు. ఆగస్టులో భారీ వర్షాలతో జిల్లాలోని అన్ని ప్రాజెక్టులకు భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. చెరువులు, కుంటలు సైతం జలకళ సంతరించుకున్నాయి. ఫలితంగా యాసంగిలో పంటల సాగుకు భరోసా దక్కింది. -
రాష్ట్రస్థాయి విజ్ఞానమేళాకు ఎంపిక
నిర్మల్‌చైన్‌గేట్/నిర్మల్ రూరల్ : పట్టణంలోని బుధవార్‌పేట్ శ్రీసరస్వతీ శిశుమందిర్ పాఠశాల శిశువర్గ, కిషోరవర్గ విద్యార్థులు రాష్ట్రస్థాయి విజ్ఞాన మేళాకు ఎంపికయ్యారు. శిశువర్గలో క్విజ్‌లో ప్రథమ స్థానంలో విశ్వక్, నరసింహ, వరుణ్ తేజ మట్టితో విగ్రహల తయారీలో మధు ప్రియ ప్రథమ స్థానం, జానపద కథనంలో మగ్గిడి రితీశ్ ద్వితీయ స్థానం సాధించారని ప్రధానాచార్యులు కొండూరు నరేష్ తెలిపారు. ప్రథమ స్థానం పొందిన వారు ఈనెల 3, 4, 5 తేదీల్లో కామారెడ్డిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని పేర్కొన్నారు. వీరిని పాఠశాల ప్రబంధకారిణి సభ్యులు, ఆచార్యులు అభినందించారు. -
ఆస్తి, ప్రాణ నష్టంపై నివేదికలు పంపండి
నిర్మల్‌చైన్‌గేట్: ఇటీవలి భారీ వర్షాలు, వరదలతో జరిగిన ఆస్తి, ప్రాణ నష్టాలపై క్షేత్రస్థాయిలో సర్వే చేసి సమగ్ర అంచనాలతో నివేదికలు పంపాలని సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. హైదరా బాద్ సచివాలయం నుంచి సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద నష్టంపై సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ సహాయ చర్యలు చేపట్టా లని సూచించారు. పంట నష్టం, ఇళ్లు దెబ్బతినడం, రహదారులు, చెరువులు, వంతెనలకు జరిగిన నష్టాలను విభాగాలవారీగా కచ్చితంగా లెక్కించి సమర్పించాలన్నారు. ఇందులో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు. నివేదికలు సిద్ధం చేయండి.. అనంతరం కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలతో జరిగిన ఆస్తి, ప్రాణ నష్టాలను నివేదికలను సిద్ధం చేయాల ని ఆదేశించారు. రెవెన్యూ, విద్య, వైద్య, వ్యవసా య, పశుసంవర్ధక, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, మత్స్య, విద్యుత్ తదితర శాఖల అధికారులందరూ నిబంధన మేరకు నివేదికలు మంగళవారం సమర్పించాలని సూచించారు. ఇందులో ఎస్పీ జానకీషర్మిల, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, భైంసా సబ్‌కలెక్టర్ సంకేత్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
బీసీ బిల్లు ఆమోదం చరిత్రాత్మకం
డ్రైవింగ్‌లో నో సెల్ ప్రమాదాలను నివారించి ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ డ్రైవర్లకు నో ఫోన్ నిబంధన అమలు చేయాలని నిర్ణయించింది. నిర్మల్సామాన్యులకు అండగా పోలీసులు నిర్మల్‌టౌన్: సామాన్యులకు పోలీసులు అండగా ఉండాలని ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలు తెలుసుకుని సంబంధిత పోలీస్ అధికా రులతో ఫోన్లో మాట్లాడారు. సమస్యలు పరి ష్కరించాలని ఆదేశించారు. సామాన్యులకు అండగా ఉండాలని, శాంతి భద్రతలకు విఘా తం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవా లని సూచించారు. పోలీసులసాయం కావాలనుకునేవారు ఠాణాలో నిర్భయంగా ఫిర్యాదు చేయాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనబడినా, సంఘ వ్యతిరేక పనులు చేస్తున్నట్లు తెలిసినా సమాచారం ఇవ్వాలని కోరారు. నిర్మల్‌చైన్‌గేట్: సాదాబైనామా ఒప్పందాల ద్వారా భూములు కొనుగోలు చేసిన వేలాది రైతులకు హైకోర్టు శుభవార్త అందించింది. 2020, అక్టోబరు 12న ప్రభుత్వం జారీ చేసిన జీవో 112పై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఆగస్టు 26న తీర్పు వెలువడింది. ఈ తీర్పు సన్న, చిన్నకారు రైతులకు భూమి హక్కుల క్రమబద్ధీకరణకు మార్గం సుగమం చేసింది. 2014, జూన్ 2కు ముందు లిఖిత ఒప్పందాలతో భూములు కొనుగోలు చేసిన రైతులు, 2020, అక్టోబర్ నుంచి నవంబర్ 10 వరకు దరఖాస్తు చేసినవారి భూములు క్రమబద్ధీకరణకు కోర్టు అనుమతి ఇచ్చింది. జిల్లాలో ఈ ప్రక్రియ పూర్తికావడానికి సుమారు ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. సాదాబైనామా భూముల సమస్య.. గ్రామీణ ప్రాంతాల్లో సాదాకాగితంపై భూములు కొనుగోలు చేసిన అనేకమంది రైతులు రిజిస్ట్రేషన్ లేకుండా హక్కులు కోల్పోయారు. ధరణి పోర్టల్ ప్రవేశానికి ముందు ఆర్వోఆర్ చట్టం కింద సాదాబైనామా ఒప్పందాలతో పట్టాలు జారీ అయ్యేవి. అయితే, ధరణి అమలులోకి వచ్చాక ఈ ప్రక్రియ ఆగిపోయింది. గత ప్రభుత్వం 2014 జూన్ 2కు ముందు సాదాబైనామా ఒప్పందాల ద్వారా భూములు కొన్నవారికి చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించింది. 2020, అక్టోబర్ నుంచి నవంబర్ 10 వరకు దరఖాస్తులు స్వీకరించింది. జిల్లాలో 9,621 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే సాదాబైనామా పత్రాలు చట్టపరంగా ధ్రువీకరించబడకపోవడంతో రైతులు భూమి హక్కులను రుజువు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పూర్వ యజమానులు లేదా వారి వారసులు భూమిపై హక్కు కోసం కేసులు వేయడంతో మరింత ఇబ్బందులు ఎదురయ్యాయి. భూమి క్రయవిక్రయాల్లో సమస్యలు, పట్టాలు లేకపోవడంతో బ్యాంకు రుణాలు, రాయితీలు అందక రైతులు ఇబ్బంది పడ్డారు. ధరణిలో సాదాబైనామా రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన కాలమ్ లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైకోర్టు తీర్పుతో లైన్‌క్లియర్ హైకోర్టు తీర్పుతో సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించబడింది. ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత, రెవెన్యూ ఆధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో సమీప రైతుల నుంచి అభిప్రాయాలు సేకరణ చేస్తారు. భూమి క్రయవిక్రయం యథార్థమని నిర్ధారణ అయితే, రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంపు డ్యూటీ చెల్లింపుతో క్రమబద్ధీకరిస్తారు. హైకోర్టు స్టే ఎత్తివేతతో జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 9,621 దరఖాస్తులకు పరిష్కారం లభించే అవకాశం ఏర్పడింది. నిర్మల్‌చైన్‌గేట్: అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదం చరిత్రాత్మక విజయమని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ విశ్రాంతిభవనంలో సోమవారం మాట్లాడారు. పంచాయతీరాజ్ చట్టసవరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులను శాసనసభ ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేశారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చామని, నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. బీసీలకు న్యాయం చేసే దిశగా కాంగ్రెస్ ముందుకు వెళ్తుంటే బీఆర్ఎస్, బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. అనంతరం స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట టపాసులు పేల్చి మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు 20% టికెట్లు కేటాయించాలని జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావుకు వినతిపత్రం అందించారు. మండలాల వారీగా సాదాబైనామా దరఖాస్తులు బాసర 66 భైంసా 214 దస్తురాబాద్ 849 దిలావర్పూర్ 667 కడెం(పెద్దూర్) 1,012 ఖానాపూర్ 386 కుభీర్ 648 కుంటాల 341 లక్ష్మణచాంద 664 లోకేశ్వరం 824 మామడ 1,113 ముధోల్ 755 నర్సాపూర్(జి) 332 నిర్మల్అర్బన్ 48 నిర్మల్‌రూరల్ 576 పెంబి 73 సారంగాపూర్ 647 సోన్ 338 తానూర్ 67రైతులకు ప్రయోజనాలు..క్రమబద్ధీకరణతో రైతులు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలకు అర్హత సాధిస్తారు. భూమి హక్కుల వివాదాలు తగ్గి, చట్టపరమైన గుర్తింపు లభించనుంది. ఈ తీర్పు రైతుల్లో కొత్త ఆశలు రేకెత్తించింది, ముఖ్యంగా గతంలో నిరాశపడిన వారికి ఊరటనిచ్చే అవకాశం కల్పించింది. -
‘అల్లోలపై ఆరోపణలు సరికాదు’
నిర్మల్ టౌన్: మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ పలువు రు యువకులు సోషల్ మీడియాలో ఆరోపణ లు చేయడం సరికాదని డీసీసీబీ వైస్ చైర్మన్ ర ఘునందన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ని ర్మల్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత ఎమ్మెల్యే ప్రజలకు దూరంగా హైదరాబాద్‌లో ఉంటున్నారని, ప్రజలు సమస్యలు చెప్పుకొనే పరిస్థితి లేకుండా పోయిందని ఆరోపించారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు, కూలిన ఇండ్లను అల్లోల పరిశీలించి బాధితులకు మనోధైర్యం కల్పించారని పేర్కొన్నారు. అల్లోలపై ఆరోపణలు చేస్తున్నవారు వాటిని నిరూపించాలని సవాల్ విసిరారు. ఆ యన వెంట నాయకులు రమణారెడ్డి, రాంచందర్, సత్యనారాయణ, శ్రీనివాస్, రాందాస్, శ్రీకాంత్ యాదవ్, అన్వర్ తదితరులున్నారు. -
విద్యా కార్యక్రమాలు సజావుగా నిర్వహించాలి
నిర్మల్ రూరల్: పాఠశాల విద్యాశాఖ అమలు చేసే విద్యా కార్యక్రమాలను సజావుగా నిర్వహించాలని డీఈవో రామారావు సూచించారు. కలెక్టరేట్ సమావేశంలో ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, కేజీబీ వీల ఎస్ఓలు, ఉపాధ్యాయులతో శనివారం సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ నివేదికలను కచ్చితంగా రూపొందించాలన్నారు. ఎఫ్ఆర్ఎస్, ఎఫ్ఎల్ఎన్, ఎల్ఐపీ, యూడైస్, ఇన్ఫ్రా వసతులు తదితర కార్యక్రమాలు నిరంతరంగా నిర్వహించాలన్నారు. వాటి రిపోర్టులు ఆన్లైన్లో నమోదు చేసి, జిల్లాను ముందంజలో ఉంచాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించి జిల్లా తరఫున రాష్ట్రానికి ప్రాతిని ధ్యం చేయాలని పేర్కొన్నారు. ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు ఈవిషయంలో శ్రద్ధ వహించాల ని సూచించారు. సమీక్షలో జిల్లా విద్యాశాఖ ఎఫ్ఏ వో జ్ఞానేశ్వర్, ఎస్వోలు రాజేశ్వర్, నరసయ్య, ప్రవీణ్‌కుమార్, లింబాద్రి, ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు
జైనూర్: సద్గురు పూలాజీబాబా తన హితబోధనలతో లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఎంపీ గోడం నగేష్ అన్నారు. శనివారం మండలంలోని పట్నాపూర్‌లోని సిద్ధేశ్వర సంస్థాన్‌లో పూలాజీబాబా 101వ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించారు. బాబా సమాధి మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాలను ఏకతాటిపై తీసుకువచ్చి ఆధ్మాత్మిక మార్గం వైపు నడిపించిన ఘనత బాబాకే దక్కుతుందన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఎన్నో కుటుంబాలు బాబా చూపిన మార్గంలో నడుస్తున్నాయన్నారు. అనంతరం మాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పెట్కులే రచించిన బాబా చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కిన్వట్ ఎమ్మెల్యే భీంరావ్ కేరామ్, మహారాష్ట్ర మాజీమంత్రి శివాజీరావు, మాజీ ఎమ్మెల్యే ఉత్తంరావు ఇంగ్లే, మహారాష్ట్ర స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాందాస్, ఆసిఫాబాద్ నియోజక వర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మేత విశ్వనాథ్, ఆదిలాబాద్ గ్రంథాలయ చైర్మన్ నర్సయ్య, ఆదిలాబాద్ డీఎస్పీ రఘునాథ్, రెవెన్యూ జిల్లా అధికారి లోకేశ్వరరావు, విద్యుత్ శాఖ ఎస్సీ ఆడే శేషేరావు పాల్గొన్నారు. -
పంట నష్టం 13 వేల ఎకరాలు
ప్రభుత్వం ఆదుకోవాలి గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో మా గ్రామంలో పంటలు మూడు రోజులుగా నీటమునిగే ఉన్నాయి. సుమారు 600 ఎకరాల్లో నష్టపోయాం. అధికారులు సర్వే చేసి నష్టం అంచనా వేయాలి. ప్రభుత్వం బాధిత రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలి. – అశోక్, రైతు చింతల్‌చాంద నివేదిక పంపించాం.. జిల్లాలో కురిసిన భారీ వర్షాలతోపాటు గోదావరి నది పరీవాహక ప్రాంతాల్లో వరద ఉధృతికి రైతులు పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వ ఆదేశాలు, కలెక్టర్ సూచనల మేరకు పంట నష్టంపై ప్రాథమిక సర్వే నిర్వహించాం. ఇప్పటి వరకు 13 వేలకుపైగా వివిధ పంటలు నష్టపోయినట్లుగా గుర్తించాం. ఈమేరకు నివేదికను ప్రభుత్వానికి పంపించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. ఆదివారం వరకు నష్టం ఎంత జరిగిందనే స్పష్టత వస్తుంది. – అంజిప్రసాద్, డీఏవో నిర్మల్లక్ష్మణచాంద: జిల్లాలో నాలుగు రోజులు కురిసిన భారీ వర్షాలు అన్నదాతను నిండా ముంచాయి. ఎ గువ మహారాష్ట్రలోనూ భారీ వర్షాలు కురుస్తున్నా యి. దీంతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి మూడు రో జులుగా 5 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చింది. దీంతో 39 గేట్ల ద్వారా ఐదు లక్షల క్యూసెక్కులకుపైగా నీటిని గోదావరిలోకి విడుదల చేశా రు. దీంతో జిల్లాలోని గోదావరి పరీవాహక గ్రామాల్లో రెండో రోజూ కొనసాగింది. ఇక లక్ష్మణచాంద మండలం పీచర, ధర్మారం, మల్లాపూర్, మాచాపూర్, మునిపెల్లి, చింతల్‌చాంద, చామన్‌పెల్లి గ్రామాల్లో గోదావరి తీరప్రాంత పంటలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. మూడు రోజులుగా పంటలు నీటిలో మునిగి ఉండటంతో నిండా మునిగామని రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. 13 వేల ఎకరాలకుపైగా నష్టం.. భారీ వర్షాలతోపాటు, ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు ద్వారా గోదావరిలోకి భారీగా నీటిని విడుదల చేశారు. దీంతో భైంసా, ముధోల్, నిర్మల్, ఖానాపూర్ డివిజన్లలో సాగు చేసిన పంటలు కూడా దెబ్బతిన్నాయి. వ్యవసాయ అధికారుల ప్రకారం, వరి 24,191 ఎకరాలు, మొక్కజొన్న 1,100 ఎకరాలు, సోయాబీన్ 2,152 ఎకరాలు, పత్తి 2,788 ఎకరాల్లో నష్టం జరిగింది. భైంసా డివిజన్లో.. భైంసా డివిజన్లో 348 రైతులకు చెందిన 558 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇందులో వరి 98 ఎకరాలు(49 రైతులు), పత్తి 210 ఎకరాలు(175 రైతులు), సోయాబీన్ 230 ఎకరాలు(114 రైతులు), మొక్కజొన్న 20 ఎకరాలు(10 రైతులు) ఉన్నాయి. ముధోల్ డివిజన్లో.. ముధోల్ డివిజన్లో 890 రైతులకు చెందిన 1,785 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో వరి 116 ఎకరాలు(87 రైతులు), పత్తి 275 ఎకరాలు(190 రైతులు), సోయాబీన్ 1,287 ఎకరాలు(613 రైతులు) ఉన్నాయి. ఖానాపూర్ డివిజన్లో.. ఖానాపూర్ డివిజన్లో 849 రైతులకు చెందిన 1,510 ఎకరాల్లో పంట నష్టం నమోదైంది. ఇందులో వరి 517 ఎకరాలు(350 రైతులు), పత్తి 875 ఎకరాలు(487 రైతులు), మొక్కజొన్న 35 ఎకరాలు(12 రైతులు) ఉన్నాయి. నిర్మల్ డివిజన్లో.. నిర్మల్ డివిజన్లో 2,675 రైతులకు చెందిన 5,296 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇందులో వరి 1,760 ఎకరాలు(1,127 రైతులు), పత్తి 1,463 ఎకరాలు(668 రైతులు), సోయాబీన్ 635 ఎకరాలు(412 రైతులు), మొక్కజొన్న 1,045 ఎకరాలు(470 రైతులు) ఉన్నాయి. -
నిమజ్జనానికి పటిష్ట భద్రత
నిర్మల్ టౌన్: గణేశ్ నిమజ్జన శోభాయాత్రలు జిల్లాలో ప్రశాంతంగా జరిగేలా ప్రతీ పోలీసు పనిచేయాలని ఎస్పీ జానకీషర్మిల ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీసు కార్యాలయం నుంచి జిల్లా పోలీసులతో శనివారం ఆన్లైన్లో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిమజ్జన ఏర్పాట్లపై సూచనలు చేశారు. శోభాయాత్ర మార్గాల్లో ముందస్తు తనిఖీలు నిర్వహించి అడ్డంకులు లేకుండా చూడాలని ఆదేశించారు. పట్టణాల్లో ప్రధాన రహదారులు, కూడళ్లు, నిమజ్జన ఘాట్ల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ప్రత్యేక డైవర్షన్ ప్రణాళికను అమలు చేయాలని ఎస్పీ సూచించారు. శోభాయాత్ర మార్గాల్లో డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ జరపాలని ఎస్పీ తెలిపారు. వరద బాధితులకు సాయం చేయాలి.. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో గ్రామాలు, పట్టణాలు జలమయమై, లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లు నీటమునిగాయి. వాగులు, వంకలు పొంగడంతో రహదారులు దెబ్బతిన్నాయి. మరో రెండు రోజులు వర్ష సూచనలు ఉన్నందున, ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. వరదల్లో చిక్కుకున్నవారికి తక్షణ సహాయం అందించేందుకు రెస్క్యూ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, లైఫ్ జాకెట్లు, రబ్బర్ బోట్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. వరద ఎక్కువగా ఉన్న చెరువులు, వాగులు, రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రెడ్ ఫ్లాగ్స్ ఏర్పాటు చేసి, వాటిని డేంజర్ జోన్‌గా గుర్తించి ప్రజలకు తెలియజేయాలని సూచించారు.ఈ కాన్ఫరెన్స్‌లో అదనపు ఎస్పీలు ఉపేంద్రారెడ్డి, అవినాష్‌కుమార్, రాజేశ్‌మీనా, ఇన్స్పెక్టర్లు, అన్ని పోలీసు స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలు పాల్గొన్నారు. నిమజ్జన ఘాట్‌ను పరిశీలించిన ఎస్పీ నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ చెరువు వద్ద వినాయక నిమజ్జన ఘాట్‌ను ఎస్పీ జానకీషర్మిల శనివారం పరిశీలించారు. శోభాయాత్ర దారిలో చేపడుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. నిమజ్జన ఘాట్ వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ వెంట ఏఎస్పీ రాజేశ్‌మీనా, పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. -
మార్కెటింగ్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
కైలాస్‌నగర్: మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ శనివా రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమాయక ప్రజ లను అధిక లాభాల ఆశ చూపి మోసం చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఉట్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బో యవాడకు చెందిన ఠాగూర్ విజయ్ సింగ్ myv3ads అనే అప్లికేషన్లో నమోదై దాని ద్వారా డబ్బులు సంపాదించవచ్చని ఆశ చూ పి, అందులో నమోదయ్యేందుకు రూ.1,21, 000 చెల్లించాలని ఇద్దరికి ఆశచూపి మోసం చే శాడన్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమో దు చేసి విచారణ చేపట్టి శుక్రవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. ఇంకా ఈ అప్లికేషన్ ద్వారా మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే నిర్భయంగా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించవచ్చన్నారు. -
డీఈవోగా భోజన్న
నిర్మల్ రూరల్: జిల్లా నూతన విద్యాశాఖ అధికారిగా(ఎఫ్ఏసీ) డి.భోజన్న నియమితులయ్యారు. ఇప్పటి వరకు పని చేసిన రామారావు స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. రెండు నెలల క్రితమే వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం అనుమతించలేదు. తాజాగా జనగామ డీఈవో కార్యాలయంలో ఫైనాన్స్, అకౌంట్ ఆఫీసరుగా పనిచేస్తున్న భోజన్నను డీఈవోగా నియమిస్తూ శనివారం రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మల్ మంజులాపూర్ ప్రాంతానికి చెందిన భోజన్న గతంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేశారు. తాజాగా జిల్లాకు డీఈవోగా పదోన్నతిపై వస్తున్నారు. సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. -
పాత పెన్షన్ పునరుద్ధరించాలి
నిర్మల్‌చైన్‌గేట్: పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ జిల్లా కన్వీనర్ వి.ప్రభాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సంఘ భవనంలో పాత పెన్షన్ సాధన పోరాట సభ పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు. రాష్ట్ర ప్రభు త్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే ఉద్దేశంతో సెప్టెంబర్ 1న ఐడీవోసీ కా ర్యాలయంలో ని ర్వహించే సభను విజయవంతం చేయాలని కో రారు. 2004 సెప్టెంబర్1 తర్వాత నియమితులైన ప్రభుత్వ ఉద్యోగుల పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1న మధ్యాహ్న భోజన విరామంలో ప్రభుత్వ ఉ ద్యోగులు కలెక్టరేట్లో నల్ల బ్యాడ్జీ లు ధరించి నిరసన తెలిపాలన్నారు. కార్యక్రమంలో జేఏసీ గౌరవ అధ్యక్షుడు ఎంసీ.లింగన్న, గెజిటెడ్ ఉ ద్యోగుల సంఘం కార్యదర్శి రమేశ్, ఉ పాధ్యాయ ఉద్యోగ సంఘం నాయకులు మురళీమనోహర్‌రెడ్డి, జుట్టు గజేందర్, రవికాంత్, భూమన్న యాదవ్, లక్ష్మణ్, అశోక్, నాలుగో తరగతి ఉద్యోగ సంఘ అధ్యక్ష కార్యదర్శులు రవి, గణేశ్ పాల్గొన్నారు. -
జ్వరంతో బాలుడు మృతి
తిర్యాణి: జ్వరంతో బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు గిన్నెదరి గ్రామానికి చెందిన ఆడ రాము కుమారుడు సీతారాం(15) పదిహేను రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు మండల కేంద్రంలోని సీహెచ్‌సీలో చికిత్స అందించినా తగ్గకపోవడంతో మూడు రోజుల క్రితం మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందాడు. మూడు రోజుల వ్యవధిలోనే మండలంలోని ఇద్దరు పిల్లలు జ్వరంతో చనిపోవడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. -
నిబంధనల ప్రకారం భూసేకరణ చేపట్టాలి
జైపూర్: సింగరేణి పరిధిలో భూసేకరణ ప్రక్రి య నిబంధనల ప్రకారం చేపట్టాలని సింగరేణి సంస్థ సిబ్బంది, పరిపాలన, సంక్షేమ విభాగ డైరెక్టర్ గౌతమ్ పొట్రు అన్నారు. జైపూర్ మండల కేంద్రంలోని ఎస్టీపీపీ ప్రాణహిత అతిథి గృహంలో శనివారం మంచిర్యాల కలెక్టర్ కుమార్‌దీపక్, పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్లు, ఎస్టేట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ భూయాజమానులు, సింగరేణి సంస్థ సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా భూసేకరణ ప్రకియ నిర్వహించాలన్నారు. నీటమునిగిన శ్మశానవాటికఖానాపూర్: పట్టణంలోని గోదావరితీరంలో మున్సిపల్ నూతన కార్యవర్గం ఏర్పటయ్యాక రూ.50 లక్షలతో నిర్మించిన శ్మశనవాటిక ఏటా వర్షాకాలంలో నీట మునుగుతోంది. పాలకుల అనాలోచిత నిర్ణయాలతో ఏటా వరదలు తగ్గాక మరమ్మతు చేయడం పరిపాటిగా మారింది. శనివారం పట్టణంలోని 5వ వార్డులో ద్యావతి గంగాధర్(55) అనారో గ్యంతో మృతి చెందాడు. గోదావరి తీరంలో గల శ్మశానవాటికకు తీసుకెళ్లాల్సి ఉండగా ఉండగా కుటుంబ సభ్యులు అత్యంత దూరభారమైనప్పటికీ గాంధీనగర్ శివారులోని తర్లపాడ్ వెళ్లే రహదారి వరకు తీసుకెళ్లి ఖననం చేశారు. ఇప్పటికై నా శ్మశానవాటిక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. మరమ్మతుల నేపథ్యంలో పలు రైళ్లు రద్దు ఆదిలాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రైలు పట్టాలను సరిచేస్తున్న నేపథ్యంలో పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ డివిజన్ పరిధిలోని భిక్కనూరు–తల్మాడ సెక్షన్, అక్కన్నపేట–మెదక్ సెక్షన్లో రైలు పట్టాలపై భారీగా వరద నీరు ప్రవహించడంతో అక్కడ మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని తిరుపతి–ఆదిలాబాద్ మధ్య నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను శనివారం చర్లపల్లి–ఆదిలాబాద్ మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపారు. పర్లి–ఆదిలాబాద్ మధ్య నడిచే 77615 రైలు సర్వీస్, ఆదిలాబాద్–పూర్ణ మధ్య నడిచే 77616 రైల్ సర్వీసులు సెప్టెంబర్ 1న రద్దు చేసినట్లు వివరించారు. ఈ విషయాన్ని రైలు ప్రయాణికులు గమనించాలని సూచించారు. -
ఆలోచన.. ఆవిష్కరణ
కాగజ్‌నగర్‌టౌన్: విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెంపొందించేందుకు జ్ఞాన విజ్ఞాన మేళాలు ఎంతగానో ఉపయోగపడతాయని శ్రీ సరస్వతి శిశుమందిర్ మంచిర్యాల జిల్లా విభాగ్ కార్యదర్శి దహెగాం గోవింద్రావు అన్నారు. శనివారం కాగజ్‌నగర్‌లోని ఆదర్శనగర్ శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో విభాగ్ స్థాయి గణిత జ్ఞాన విజ్ఞాన మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు కొత్త ప్ర యోగాలు, ఆవిష్కరణలకు ఊతమిస్తారని ఆశాభా వం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగివున్న శాస్త్ర సాంకేతిక ప్రతిభను వెలికితీయడంలో గణిత జ్ఞాన విజ్ఞాన మేళాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అనంతరం, విద్యార్థులు ప్రదర్శించిన ఆవిష్కరణలను తిలకించి పలువురిని ఆలోచింపజేసేలా ఉన్నాయని ప్రశంసించారు. మేళాలో మంచిర్యాల, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, గోదావరిఖని, శ్రీరాంపూర్, పెద్దపల్లి నుంచి శిశువర్గ, బాలవర్గ, కిశోరవర్గల నుంచి విద్యార్థులు 236 మంది హాజరై ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారు రాష్ట్రస్థాయిలో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి మేళాకు ఎంపిక ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని సరస్వ తీ శిశు మందిర్ పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి విజ్ఞాన మేళాకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు కోటేశ్వర్రావు తెలిపా రు. శనివారం కాగజ్‌నగర్‌లో నిర్వహించిన జి ల్లా స్థాయి విజ్ఞాన మేళాలో శార్వాణి, వెంకట రత్న, చరణ్, సాకేత్, హరిచరణ్, దివ్య, జ శ్వంత్, నిహారిక, విక్రమ్, శ్రీనిధి ఉత్తమ ప్రతి భ కనబరిచి బహుమతులు అందుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యా ర్థులు సెప్టెంబర్ 3నుంచి 5వ తేదీ వరకు కామారెడ్డిలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి విజ్ఞాన మేళాలో పాల్గొంటారని వివరించారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
మందమర్రిరూరల్: పట్టణంలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలబాలికల హ్యాండ్‌బాల్ క్రీడాపోటీలు నిర్వహించారు. బాలికల జట్టులో గంగుబాయి, మౌనిక, వైష్ణవి, పార్వతి, జయశ్రీ, సహస్ర మోక్షిత, బాలుర జట్టులో సాత్విక్, రుత్విక్వర్మ, జాషువా, ప్రణయ్, వంశీ, పార్థు ఎంపికై నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేశ్ తెలిపారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో క్రీడాకారులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కోచ్ సునార్కర్ అరవింద్, పీడీ సంతోష్, పీఈటీ రాధారాణి, సీనియర్ క్రీడాకారులు ప్రణయ్, సంజయ్, రఘు, వర్మ, అమూల్య, తదితరులు పాల్గొన్నారు. -
డీఈవో రామారావుకు వీడ్కోలు సన్మానం
నిర్మల్ రూరల్: డీఈవో రామారావు స్వచ్ఛంద విరమణ తీసుకున్నారు. దీంతో కలెక్టరేట్ సమావేశమందిరంలో శనివారం సాయంత్రం వీడ్కోలు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కలెక్టర్ అభిలాష అభినవ్, అధికారులు సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, సీపీవో జీవరత్నం, డీపీవో శ్రీనివాస్, డీటీడీవోఅంబాజీ, జిల్లా ఉన్నతాధికారులు, ఎంఈవోలు, జిల్లా విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.