గ్రామీణ క్రీడాకారులను వెలుగులోకి తేవాలి
కడెం: గ్రామీణ క్రీడాకారులను వెలుగులోకి తెచ్చి ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడలు నిర్వహిస్తుందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం నియోజకవర్గస్థాయి పోటీలను ప్రారంభించా రు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రా ణించాలని సూచించారు. సీఎం కప్ పో టీల్లో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చే విద్యార్థులకు రూ.25 వేల నగదు ప్రోత్సాహం అందిస్తానని తెలిపారు. ఏఎంసీ చైర్మన్ భూషణ్, సర్పంచ్ ధీకొండ విజయ్, సర్పంచుల ఫోరం అధ్యక్షు డు చంద్రశేఖర్, జిల్లా నాయకుడు సతీశ్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి మల్లేశ్‌యాదవ్, వాజీద్, కన్వీనర్ రమాకాంత్, కోకన్వీన ర్ వెంకటరమణ, ఎంఈవో షేక్ హుస్సేన్, హెచ్‌ఎం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవోలు సునీత, అరుణ, ఎంపీవో రత్నాకర్‌రావు పాల్గొన్నారు.


