జిల్లాస్థాయి ప్రేరణ ఉత్సవాలు
నిర్మల్ రూరల్: జిల్లాస్థాయి ప్రేరణ ఉత్సవా లు జిల్లా కేంద్రంలోని అర్బన్ కేజీబీవీలో గు రువారం జరిగాయి. వికసిత్ భారత్– 2047 అనే అంశంపై విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. మొదటి బహుమతి శ్రీనిధి(సోఫీనగర్ గురుకుల పాఠశాల), రెండో బహుమతి (నందిని, కేజీబీవీ కుభీర్), మూడో బహుమతి(జ్యోతి, కేజీబీవీ మస్కాపూర్), శివ కార్తీక్ (జెడ్పీహెచ్‌ఎస్, మంజులాపూర్) గెలుచుకున్నారు. సెక్టోరియల్ అధికారులు నరసయ్య, రమాదేవి, డీఎస్‌వో వినోద్‌కుమార్, ఎంఈవో విజయ్‌కుమార్, ఎస్‌వో సుజాత, పాల్గొన్నారు.


