బ్యాలెట్‌ ముద్రణ గడువులోపు పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

బ్యాలెట్‌ ముద్రణ గడువులోపు పూర్తిచేయాలి

Feb 6 2026 7:30 AM | Updated on Feb 6 2026 7:30 AM

బ్యాలెట్‌ ముద్రణ గడువులోపు పూర్తిచేయాలి

బ్యాలెట్‌ ముద్రణ గడువులోపు పూర్తిచేయాలి

● కలెక్టర్‌ అభిలాష అభినవ్‌

నిర్మల్‌చైన్‌గేట్‌: మున్సిపల్‌ ఎన్నికల బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని విజయ్‌ ఆఫ్‌ సెట్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌లో బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ ప్రక్రియను ఎస్పీ జానకీషర్మిలతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ముద్రణలో లోపాలు తలెత్తకూడదన్నారు. అనధికార వ్యక్తులను ముద్రణ కేంద్రంలోకి అనుమతించొద్దని సూచించారు. ముద్రణ పూర్తయ్యే వరకు పోలీసు బందోబస్తు కొనసాగించాలన్నారు. వారివెంట అదనపు కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌, జెడ్పీ సీఈవో శంకర్‌, ఉద్యానవన పంటల అధికారి రమణ, తహసీల్దార్‌ రాజు ఉన్నారు.

ఆధునిక సాగును ప్రోత్సహించాలి

నిర్మల్‌చైన్‌గేట్‌: ఆధునిక పద్ధతిలో పంటలు సాగుచేసేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించా రు. వ్యవసాయం లాభసాటిగా మార్చేలా రైతులకు అధికారులు చేయూతనివ్వాన్నారు. పంట మార్పిడి విధానం అలవాటు చేయాలన్నారు. సహజ ఎరువు ల వాడకం పెంచేలా ప్రోత్సహించాలని సూచించా రు. భూసార పరీక్షలు నిర్వహిస్తూ, మోతాదుకు మించిన ఎరువుల వాడకంతో కలిగే నష్టాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ మిషన్‌ కింద నిర్దేశించిన అన్ని లక్ష్యాలు పూర్తి చేయాలన్నారు. ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసి రైతులందరికీ ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందించాలన్నారు. క్షేత్రస్థాయిలో మండల వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండాలని తె లిపారు. జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణం మ రింత పెంచాలని, ఆయిల్‌పామ్‌ సాగుతో రైతులు తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చని వివరించారు. రైతులకు అధిక లాభసాటిగా ఉండే పండ్లు, కూరగాయలు, పూల సాగు పెంచేలా అధికారులు చొరవ చూపాలన్నారు. స మావేశంలో డీఏవో అంజిప్రసాద్‌, ఏడీఏలు విద్యాసాగర్‌, శ్రీనివాసరాజు, సుజాత, వీణ తదితరులు పాల్గొన్నారు.

జాతీయ రహదారులకు మరమ్మతు చేయాలి

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లా పరిధిలో జాతీయ రహదారులకు అవసరమైన మరమ్మతులు వెంటనే చేపట్టాలని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశం మందిరంలో జాతీయ రహదారి సంస్థ అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. జిల్లా పరిధిలో చేపట్టిన మరమ్మతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గుంతలు పూడ్చి రహదారుల వెంట లైటింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన ప్రదేశాల్లో సూచిక బోర్డులు, జీబ్రా క్రాసింగ్‌ లైన్స్‌, ఇతర క్రాసింగ్‌ మార్క్‌లు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఫైజాన్‌ అహ్మద్‌, జాతీయ రహదారి సంస్థ ఇంజినీరింగ్‌ అధికారి సుభాష్‌బాబు, ఆర్‌అండ్‌బీ డీఈఈ భీమ్‌సింగ్‌, మున్సిపల్‌, ఇంజినీరింగ్‌, రవాణా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement