● బల్దియాల్లో గేరు మార్చిన బీఆర్‌ఎస్‌ ● కీలకంగా మారేందుకు కసరత్తు ● నిర్మల్‌పై ఎమ్మెల్యే అనిల్‌జాదవ్‌ ఫోకస్‌ ● 9న జిల్లాలో కేటీఆర్‌ ప్రచారం | - | Sakshi
Sakshi News home page

● బల్దియాల్లో గేరు మార్చిన బీఆర్‌ఎస్‌ ● కీలకంగా మారేందుకు కసరత్తు ● నిర్మల్‌పై ఎమ్మెల్యే అనిల్‌జాదవ్‌ ఫోకస్‌ ● 9న జిల్లాలో కేటీఆర్‌ ప్రచారం

Feb 6 2026 7:30 AM | Updated on Feb 6 2026 7:30 AM

● బల్

● బల్దియాల్లో గేరు మార్చిన బీఆర్‌ఎస్‌ ● కీలకంగా మారేందు

● బల్దియాల్లో గేరు మార్చిన బీఆర్‌ఎస్‌ ● కీలకంగా మారేందుకు కసరత్తు ● నిర్మల్‌పై ఎమ్మెల్యే అనిల్‌జాదవ్‌ ఫోకస్‌ ● 9న జిల్లాలో కేటీఆర్‌ ప్రచారం

నిర్మల్‌: జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్‌ కార్‌.. కింగ్‌మేకర్‌ కానుందా..!? అంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అవుననే చెబుతున్నాయి. వరుస ఎన్నికల్లో దెబ్బతిన్న కారుపార్టీ పురపోరులో గేరు మార్చింది. తన బలమున్న వార్డుల్లో కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రధాన పోటీదారుగా మారింది. పట్టణా లను గెలువకున్నా పట్టు సాధించే దిశగా ప్రయత్నిస్తోంది. బీజేపీ నుంచి సీనియర్‌ నేతలు రావడంతో నిర్మల్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ బాగా పుంజుకుంది. కాంగ్రెస్‌, బీజేపీల మధ్య ఓట్లు, సీట్లు చీలి హంగ్‌ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ సీట్లే కీలకం కానున్నాయి.

పూర్వ వైభవం కోసం..

జిల్లాలో పూర్వవైభవం సాధించేదిశగా బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోంది. పట్టణాల్లో పట్టు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మున్సిపాలిటీల్లో ప్రభావం చూపేందుకు గులాబీశ్రేణులు సీరియస్‌గా పనిచేస్తున్నాయి. నిర్మల్‌ మున్సిపాలిటీలో 42 వార్డులకు గానూ 36 చోట్ల బీఆర్‌ఎస్‌ బరిలో దిగింది. దాదాపు 10 వార్డుల్లో గెలుస్తామన్న ధీమాతో ఉంది. మరో ఐదు వార్డుల్లో గెలుపోటములపై ప్రభావం చూపనుంది. బీజేపీ సీనియర్‌నేత, వరుసగా గెలుస్తున్న మాజీకౌన్సిలర్‌ అయ్యన్నగారి రాజేందర్‌ బీఆర్‌ఎస్‌లో చేరడం గులాబీ పార్టీకి కలిసివచ్చింది. భైంసాలో 26వార్డులకు 15 చోట్ల బీఆర్‌ఎస్‌ పోటీపడుతోంది. ఇక్కడ బీజేపీ కన్నా మూడు ఎక్కువస్థానాల్లో గులాబీపార్టీ పోటీచేస్తోంది. బీజేపీ–ఎంఐఎం మధ్యన తామే గెలుస్తామన్న ధీమాతో ఉంది. ఇక ఖానాపూర్‌లో మొత్తం 12 స్థానాల్లో పోటీపడుతోంది. ఇక్కడ చైర్మన్‌ పీఠంపై కన్నేసింది. చైర్మన్‌ స్థానాలను సాధించే పరిస్థితి లేనప్పుడు కింగ్‌మేకర్‌ కావాలని భావిస్తోంది.

9న కేటీఆర్‌ రాక..

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 9న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జిల్లాకు రానున్నట్లు పార్టీవర్గాలు తెలిపా యి. జిల్లాకేంద్రంలో రోడ్‌షో, ప్రధాన చౌరస్తాల్లో మీటింగ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్ల డించాయి.

ఇన్‌చార్జీల నియామకం..

బీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ ఎన్నికలపై ప్రత్యేకదృష్టి పె ట్టింది. ఒక్కో మున్సిపాలిటీకి పరిస్థితులను బట్టి ఎమ్మెల్యే, సీనియర్‌ నేతలను ఇన్‌చార్జీలుగా ని యమించింది. నిర్మల్‌ మున్సిపల్‌ బాధ్యతలు బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్‌కు అప్పగించింది. ఆయన గులాబీశ్రేణులను పరుగులు పెట్టిస్తున్నా రు. సీనియర్‌ నేతలు, నియోజకవర్గ ఇన్‌చార్జి రాంకిషన్‌రెడ్డి, సుభాష్‌రావు, పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, జీవన్‌రెడ్డి తదితరుల సమన్వయంతో ప్రచారం చేస్తున్నారు. ఖానాపూర్‌లో నియోజకవర్గ ఇన్‌చార్జి జాన్సన్‌నాయక్‌, మైనార్టీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ముజీబ్‌ పార్టీ శ్రేణుల ను నడిపిస్తున్నారు. భైంసా బల్దియా ఇన్‌చార్జి జక్క వెంకటరెడ్డితోపాటు సీనియర్‌ నేతలు విలా స్‌గాదేవార్‌, లోలం శ్యాంసుందర్‌, రమాదేవి, కిరణ్‌ కొమ్రేవార్‌ ప్రచారంలో పాల్గొంటున్నారు.

● బల్దియాల్లో గేరు మార్చిన బీఆర్‌ఎస్‌ ● కీలకంగా మారేందు1
1/1

● బల్దియాల్లో గేరు మార్చిన బీఆర్‌ఎస్‌ ● కీలకంగా మారేందు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement