పెండింగ్ డీఏలు ప్రకటించాలి
మంచిర్యాలఅర్బన్: ఉపాధ్యాయుల పెండింగ్ ఐదు డీఏలు ప్రకటించి పీఆర్సీని అమలు చేయాలని తపస్ రాష్ట్ర అధ్యక్షుడు ఓడ్నాల రాజశేఖర్ అన్నారు. మంచిర్యాలలో ఆదివారం నిర్వహించిన తపస్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని, జీవో 317తో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు రెమ్యూనరేషన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సహఅధ్యక్షుడు బండి రమేశ్, వెబ్‌సైట్ వింగ్ కన్వీనర్ విద్యాసాగర్, మహిళా కోకన్వీనర్ రమాదేవి పాల్గొన్నారు.
జిల్లా కార్యవర్గం..
తపస్ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బగ్గని రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా భారతీ ఆశోక్, ఉపాధ్యక్షులుగా సమ్మయ్య, నీలేష్‌కుమార్, శ్రీనివాస్, శ్రీధర్, రాజ్యలక్ష్మి, సత్తిరెడ్డి, నాగరాజ్, కార్యదర్శులుగా పి.శ్రీనివాస్, నాగేందర్, తిరుపతి రెడ్డి, రజిత, శ్రీకాంత్, శ్రీరాములు, ఎగ్జిక్యూటివ్ మె ంబర్లు, సోషల్ మీడియా, స్పోర్ట్స్, కల్చరల్, సేవా వింగ్‌తోపాటు పలువురిని ఎన్నుకున్నారు.


