'మన శంకర వరప్రసాద్‌గారు' రెండో వారంలోనూ జోరు చూపిస్తున్నారు. శనివారం నాడు ఏకంగా లక్ష టికెట్లు బుక్‌మైషోలో అమ్ముడుపోయాయి. ఆపై గణతంత్ర దినోత్సవం స్పెషల్ ఉంది కాబట్టి ఈ రెండురోజులు థియేటర్స్ ఫుల్ కానున్నాయి. అయితే, నేడు (జనవరి 25)న సాయింత్రం 5గంటలకు మూవీ యూనిట్ గ్రాండ్‌గా సక్సెస్ సెలబ్రేషన్స్ చేయనుంది. ఈ వేడుకలో నయనతార కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. మూవీ ప్రమోషన్స్‌కు దూరంగా ఉండే నయన్ చాలా ఏళ్ల తర్వాత వేదికపై మాట్లాడనుంది. అయితే, ఈ కార్యక్రమం హైదరాబాద్‌లో ఎక్కడ జరుగుతుంది అనేది అధికారికంగా ప్రకటించలేదు. కానీ, పార్క్ హయత్‌లో జరగవచ్చు అనే వార్తలు వస్తున్నాయి.
మన శంకర వరప్రసాద్‌గారు మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆల్ టైమ్ హైయెస్ట్ షేర్ సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. దీంతో చిత్ర నిర్మాతలు సంతోషంగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్స్‌తో పాటు మూవీ టీమ్ అంతా పాల్గొంటుంది. కానీ, అందరి చూపు నయనతారపైనే ఉంది. సినిమా విడుదలకు ముందు కొన్ని ప్రమోషనల్ వీడియోలతో చాలా మందిని ఆశ్చర్యపరిచిన నయన్.. ఇప్పుడు ఏకంగా సక్సెస్‌మీట్‌కు వస్తున్నట్లు టాక్ రావడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మన శంకర వరప్రసాద్‌గారు’ మూవీ అనేక రికార్డులు సృష్టిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి, నయనతార నటింఆచరు. ఈ మూవీ ఇప్పటికే రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరింది. మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ రూ. 450 కోట్ల వరకు రాబట్టవచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


