నా తల్లి నుంచి కోడలి వరకు..: చిరంజీవి పోస్ట్‌ | Megastar Chiranjeevi Shares Special Post Over Women On International Womens Day, Post Viral On Social Media | Sakshi
Sakshi News home page

Chiranjeevi: నా కూతుళ్లు, కోడళ్లు అందరికీ నా వందనాలు

Mar 8 2026 11:19 AM | Updated on Mar 8 2026 1:34 PM

Chiranjeevi Tweet about International Womens Day

స్త్రీ లేనిదే సృష్టి లేదు, సమాజం లేదు. అసలు మహిళ లేనిదే మనుగడే లేదు. నేడు (మార్చి 8న) అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. నా జీవితంలో తల్లి నుంచి నా జీవిత భాగస్వామి వరకు, నా కుమార్తెలు నుంచి నా కోడళ్ల వరకు, ప్రతి రూపంలో నాకు స్ఫూర్తినిచ్చిన మహిళలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రపంచాన్ని ప్రేమతో, ధైర్యంతో ముందుకు నడిపిస్తున్న ప్రతి మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని ట్వీట్‌ చేశారు.

మూవీస్‌
సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవి చివరగా మన శంకరవరప్రసాద్‌గారు సినిమాతో అలరించారు. అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో వెంకటేశ్‌ కీలక పాత్రలో నటించిన ఈ మూవీ సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం మెగాస్టార్‌ విశ్వంభర మూవీతో బిజీగా ఉన్నారు. అలాగే దర్శకుడు బాబీతో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో చిరంజీవి భార్యగా ప్రియమణి, కూతురిగా అనస్వర రాజన్‌ కనిపిస్తారని తెలుస్తోంది. అలాగే మోహన్‌లాల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారట!

 

చదవండి: సెకండ్‌ హ్యాండ్‌ దుస్తులు కొంటాను: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌

Advertisement
 
Advertisement
Advertisement